ఇవి అద్భుతమైన వ్యాపార ఆలోచనలు. మీరు నెలకు లక్ష రూపాయలు సులభంగా సంపాదించవచ్చు.

ఇంట్లో కూర్చొని లాప్ టాప్ లేదా ఫోన్ తో మంచి ఆదాయం పొందవచ్చు. నెల రోజుల్లో ఒక్క లక్ష రూపాయలు ఆదాయం సంపాదించాలని అనుకుంటున్నావారికి ప్రస్తుతం చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.


కొంచెం క్రియేటివిటీ ఉంటే నెలకు లక్ష రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. ఈ క్రమంలోనే చాట్ జిపిటి ఇచ్చిన కొన్ని అద్భుతమైన ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే వ్యాపారాలు ఇవే. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఆన్లైన్ ఆధారంగా ఉండే వ్యాపారం అని చెప్పొచ్చు. దీనికోసం మీరు మీ అఫీలియేట్ ఖాతాను అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లో ఓపెన్ చేయాలి. వాటికి సంబంధించిన లింకులను మీరు మీ సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తే మీరు షేర్ చేసిన లింకు ద్వారా ఎవరైనా వస్తువు కొన్నప్పుడు దానికి సంబంధించిన కమిషన్ మీకు వస్తుంది. దీనికోసం మీరు ఉత్పత్తులు కొని స్టాక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.

కేవలం ఆ ఉత్పత్తులను మీరు మీ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇంటి దగ్గర నుంచి యూట్యూబ్ షాట్స్, ఇంస్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ వంటివి కూడా చేసి మంచి ఆదాయం పొందవచ్చు. వీటిని బాగా ప్రమోట్ చేస్తే మీరు లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు. మరొక బిజినెస్ ఐడియా క్యాటరింగ్ లేదా హోమ్ టిఫిన్ సెంటర్. ఇది చాలా ప్రాధాన్యత పొందిన బిజినెస్. మీరు ఇంట్లో వంట చేసి చిన్న టిఫిన్ సెంటర్ వంటిది పెట్టుకుని క్లౌడ్ కిచెన్ గా కూడా మార్చుకోవచ్చు. జొమాటో, స్విగ్గి వంటి ఫుడ్ డెలివరీ ఆప్ లతో కలిసి మీరు పని చేయవచ్చు. కాస్త జాగ్రత్తగా మెనూ ప్లాన్ చేసి మంచి టేస్ట్ అందిస్తే మీరు మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ వ్యాపారంలో బాగా ఆదాయం పొందవచ్చు. కనీసం రోజుకు మూడు వేల చొప్పున మీరు ఒక నెల రోజులపాటు చేసినట్లయితే లక్ష రూపాయల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు.

అలాగే సోషల్ మీడియాలో ప్రమోషన్ బిజినెస్ కూడా ప్రస్తుతం బాగా ప్రాధాన్యత పొందింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ ఫామ్ లలో క్రియేటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో మీరు వీడియోలను ఎడిట్ చేయడానికి కన్వా, కాప్ కట్, వీఎన్ వంటి యాప్స్ ఉపయోగించి కూడా వీడియోలను ఆకర్షణీయంగా డిజైన్ చేసి కస్టమర్లను ఆకట్టుకోవచ్చు. ఒక్కొక్క వీడియోకు మీరు రూ.500 రూపాయల నుంచి రూ.1500 రూపాయల వరకు కూడా వసూలు చేయవచ్చు. ప్రతిరోజు మీరు కనీసం రెండు నుంచి మూడు వీడియోలు ఎడిట్ చేసినా కూడా నెలకు ఒక లక్ష రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.