మీకు బ్యాడ్ టైం రాబోతున్నప్పుడు కనబడే సంకేతాలివే

వందల ఏళ్ల క్రితం ఆచార్య చాణక్యుడు రచించిన ‘చాణక్య నీతి శతాబ్దాలు గడుస్తున్నా నేటి మానవ జీవనానికి దిక్సూచిలా పనిచేస్తోంది. విజయం, సంపద, సంతోషం గురించి మాత్రమే కాకుండా..


జీవితంలో రాబోయే కష్టాలు, సంక్షోభాలను ముందుగానే పసిగట్టడం ఎలాగో కూడా ఆయన వివరించారు.

చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో చెడు రోజులు లేదా ఆర్థిక సంక్షోభం ప్రారంభమయ్యే ముందు ప్రకృతి, మన చుట్టూ ఉన్న వాతావరణం కొన్ని సూక్ష్మమైన సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను గమనించి అప్రమత్తమైతే రాబోయే ప్రమాదాల నుండి బయటపడవచ్చని ఆయన సూచించారు. ఆ ప్రమాద హెచ్చరికలు ఏవో ఇక్కడ చూడండి.

తులసి మొక్క ఎండిపోవడం

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. చాణక్యుడి ప్రకారం ఇంట్లో ఉన్న తులసి మొక్క పచ్చగా, కళకళలాడుతూ ఉంటే ఆ ఇంట సిరిసంపదలకు లోటు ఉండదు.

సరైన నీరు, వెలుతురు అందిస్తున్నప్పటికీ ఎటువంటి కారణం లేకుండా తులసి మొక్క అకస్మాత్తుగా వాడిపోవడం లేదా ఎండిపోవడం ప్రారంభిస్తే అది అశుభానికి సూచిక. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించిందని, భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయని సూచిస్తుంది.

గృహ కలహాలు

ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది అనేది చాణక్యుడి మాట. కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా గొడవలు పెరగడం, చిన్న చిన్న విషయాలకే పెద్ద యుద్ధాలు జరగడం రాబోయే గడ్డు కాలానికి సంకేతం.

ఇంట్లో అశాంతి నెలకొంటే అది కుటుంబ పెద్ద మానసిక స్థితిని దెబ్బతీయడమే కాకుండా ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. తద్వారా పేదరికం ఆ ఇంటి తలుపు తడుతుందని చాణక్యుడు హెచ్చరించారు.

అద్దం లేదా గాజు పగలడం

ఇంట్లో అద్దం లేదా గాజు సామాగ్రి అకస్మాత్తుగా పగిలిపోవడం రాబోయే దురదృష్టానికి సంకేతమని చాణక్య నీతి చెబుతోంది. ఇది వ్యక్తిగత జీవితంలో లేదా వృత్తిపరమైన జీవితంలో రాబోయే పెద్ద ఇబ్బందిని సూచిస్తుంది.

ముఖ్యంగా పగిలిన అద్దం లేదా గాజు ముక్కలను ఇంట్లో ఉంచడం దరిద్రాన్ని ఆహ్వానించడమేనని పెద్దల మాట. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే వాటిని ఇంటి నుండి తొలగించి దైవ ప్రార్థన చేసుకోవడం మంచిది.

ఇతర ముఖ్యమైన సంకేతాలు

మరికొన్ని సూక్ష్మ సంకేతాలను కూడా గమనించాలని చాణక్యుడు సూచించారు

-పూజలు చేయడంపై ఆసక్తి తగ్గడం లేదా దైవారాధనకు దూరమవడం మనసులోని అశాంతిని, రాబోయే కష్టాలను సూచిస్తుంది.

-విలువైన బంగారం లేదా ఆభరణాలు పోగొట్టుకోవడం ఆర్థిక నష్టానికి, అదృష్టం తారుమారవ్వడానికి ప్రతీక.

-మనం భోజనం చేస్తున్నప్పుడు కుక్కలు పదే పదే మొరగడం లేదా రాత్రివేళల్లో పిల్లులు ఏడవడం వంటివి అశుభ సంకేతాలుగా పరిగణించబడతాయి.

-ఇంట్లోని గడియారాలు తరచుగా ఆగిపోవడం లేదా పాడవ్వడం మీ మంచి సమయం ఆగిపోబోతోందనే హెచ్చరిక కావచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.