హెూండా లివో రూ.78,650 (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ రెండు వేరియంట్లు, మూడు రంగులలో లభిస్తుంది. 8.67 బీహెచ్పీ, 9.30 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే 109.51 సీసీ బీఎస్ 6 ఇంజిన్‌తో వస్తుంది.
ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్‌లతో వచ్చే ఈ బైక్ బరువు 113 కిలోలు. ముందువైపు సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో స్ప్రింగ్-లోడెడ్ హైడ్రాలిక్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్లతో యువతను ఈ బైక్ అమితంగా ఆకట్టుకుంటుంది.
హీరో స్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ రూ. 79,911 (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ రెండు వేరియంట్లు, ఐదు రంగులలో లభిస్తుంది. 7.9 బీహెచ్పీ, 8.05 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 97.2 సీసీ బీఎస్ 6 ఇంజిన్ ద్వారా రన్ అవుతుంది. ఈ బైక్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆకట్టుకుంటుంది. పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వచ్చే ఈ బైక్ స్క్రీన్‌పై బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని కాల్, ఎస్ఎంఎస్ అలెర్ట్లను చూడవచ్చు.
టీవీఎస్ రెడాన్ బైక్ రూ. 62,630 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. 110 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వచ్చే ఈ బైక్ 8.08 బీహెచ్పీ శక్తిని 8.7 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ ద్వారా పని చేసే ఈ బైక్ 69.3 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. టీవీఎస్‌కు సంబంధించిన సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో వచ్చే ఈ బైక్‌లో బీపర్తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ డీఆర్ఎల్తో వస్తుంది.
హీరో ఎక్స్ట్రీమ్ 125 ఆర్ రూ. 95,000 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంటుంది. 124.7 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ 66 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో వచ్చే ఈ బైక్ బరువు 136 కిలోలు. ఈ బైక్ మూడు రంగులలో అందుబాటులో ఉంది. ఫైర్ స్టార్మ్ రెడ్, కోబాల్ట్ బ్లూ, స్టాలియన్ బ్లాక్ కొనుగోలుదారులను అమితంగా ఆకర్షిస్తుంది.
హీరో సెండర్ ప్లస్ బైక్ రూ. 75,441 (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ నాలుగు వేరియంట్లు, ఏడు రంగులలో లభిస్తుంది. ఈ బైక్ 8,000 ఆర్పీఎం వద్ద 7.91 బీహెచ్పీ, 6,000 ఆర్పీఎం వద్ద 8.05 ఎన్ఎం శక్తిని అందిస్తుంది. హీరోకు సంబంధించిన ఎక్స్ సెన్స్ టెక్నాలజీతో 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఆకర్షిస్తుంది. ఐ3 ఎస్ ద్వారా పని చేసే ఈ బైక్ బ్లాక్, యాక్సెంట్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.