Tirumala laddu Row: తిరుమల లడ్డూ వివాదం.. వైసీపీకి కొత్త టెన్షన్, సుప్రీంకోర్టుకి సుబ్రహ్మణ్యస్వామి

Tirumala laddu Row: తిరుమల లడ్డూ వ్యవహారం వైసీపీని చెమటలు పడుతున్నాయా? సిట్ నివేదికతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సర్కార్ రెడీ అయ్యిందా? ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తమ పని అయిపోయినట్టేనని వైసీపీ భావిస్తోందా? ఈ క్రమంలో సుబ్రహ్మణ్యస్వామిని వైసీపీకి రంగంలోకి దించిందా? ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారా? ఆ పిటిషన్ సోమవారం విచారణకు రానుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిటీ విచారణ

తిరుమల లడ్డూ వివాదం మరొక మలుపు తిరిగింది. సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ కోసం ఏకసభ్య కమిటీ నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తమ పని అయిపోతుందని వైసీపీ హైకమాండ్ భావించింది. దీంతో వైసీపీ కొత్త అస్త్రాన్ని బయటకు తీసింది.

ఏపీ ప్రభుత్వం ఏక సభ్య కమిటీ వేయడాన్ని సుబ్రమణ్యస్వామి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈనెల 23న అనగా సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం ముందుకు రానుంది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ నివేదికపై చంద్రబాబు ప్రభుత్వం మరో కమిటీ నియమించడాన్ని అభ్యంతరం వ్యక్తంచేశారు సుబ్రమణ్య స్వామి.

వైసీపీకి కొత్త టెన్షన్, సుప్రీంకోర్టుకి సుబ్రహ్మణ్యస్వామి

ఇంకా చాలా అంశాలను ప్రస్తావించినట్టు సమాచారం. పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎం చంద్రబాబు, సీబీఐ సిట్, టీటీడీలను చేర్చారు. ఏపీలో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన అంశంగా మారటంతో అందరు ఇప్పుడు సుప్రీంకోర్టు వైపు ఆసక్తిగా చూస్తున్నారు. స్వామి పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందనేది ఉత్కంఠగా మారుతోంది.

సిట్ నివేదిక ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వం ఏక సభ్య కమిటీని విచారణ కోసం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. కమిటీ తమకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తుందని భావించిన వైసీపీ, స్వామి ద్వారా పావులు కదిపింది. సుప్రీంకోర్టు నుంచి తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ వ్యవహారం నుంచి వైసీపీ నేతలు, అధికారులకు బిగ్ రిలీఫ్ దక్కడం ఖాయమని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.