చలికాలంలో జబ్బులు రాకుండా ఉండాలంటే.. మీ డైట్‌లో వెంటనే ఈ మార్పులు చేయండి

 చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. ఈ సమయంలోనే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. రకరకాల రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది.


అందుకే ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ఈ చిన్నపాటి మార్పులు మిమ్మల్ని అనారోగ్యం నుండి రక్షించడమే కాకుండా మీ శరీరాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలలో ఉండే ఔషధ గుణాలు మనల్ని రోగాల నుండి కాపాడతాయి. మరి చలికాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి.. అవి మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో రోజంతా ఆరోగ్యంగా ఉండాలంటే, ఉదయం లేవగానే ఈ పద్ధతులు పాటించడం ఉత్తమం.

ఉసిరి రసం : ప్రతిరోజు ఉదయం ఉసిరి రసం (ఆమ్లా జ్యూస్) తాగడం అలవాటు చేసుకోవాలి. ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జబ్బులు దరిచేరవు.

నెయ్యి + గోరువెచ్చని నీళ్లు : రోగ నిరోధక శక్తిని పెంచడానికి మరొక చక్కని చిట్కా ఏంటంటే, ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కొద్దిగా నెయ్యి కలిపి తాగడం. ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి కూడా బాగా సహాయపడుతుంది.

నట్స్, డ్రై ఫ్రూట్స్

ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం చలికాలంలో నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది.

నానబెట్టిన బాదం : ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 5 బాదంపప్పులను నీటిలో నానబెట్టండి. ఉదయం అల్పాహారం కంటే ముందు ఈ నానబెట్టిన బాదం పప్పులను తినండి. ఇది ఆరోగ్యంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ అలవాటును చలికాలంలోనే కాకుండా, రోజూ పాటించవచ్చు.

నానబెట్టిన ఎండుద్రాక్ష : చలికాలంలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం చాలా మంచిది. రోజంతా సమయం దొరికినప్పుడల్లా వీటిని తినే అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్ష అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.