వేణు స్వామి వ్యవహారంపై బ్రాహ్మణ సంఘాలు స్పందించాయి. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ వేణు స్వామి బండారం మొత్తం బయటపెట్టారు.
నిత్యం వివాదాలు రేగేలా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తీవ్ర విమర్శల పాలైన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy)పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన ప్రతిష్ఠ మరింత దిగజారేలా బ్రాహ్మణ సంఘం ఓ వీడియోను విడుదల చేసింది. వేణు స్వామి (Astrologer Venu Swamy) నకిలీ జ్యోతిష్యుడు అంటూ ఆ వీడియోలో స్పష్టం చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ వేణు స్వామి (Venu Swamy) బండారం మొత్తం బయటపెట్టారు.
బ్రాహ్మణ జాతిని కించపరిచే విధంగా వేణు స్వామి (Venu Swamy News) వ్యవహరిస్తున్నారని.. వేణు స్వామి (Venu Swamy Latest News) అసలు బ్రాహ్మణుడే కాదని అన్నారు. బ్రాహ్మణుల 72 శాఖలలో ఏ శాఖకి ఆయన చెందిన వాడు కాదని అన్నారు. నిజంగా వేణు స్వామి (Venu Swamy) బ్రాహ్మణుడే అయితే బయటికి వచ్చి నిరూపించుకోవాలని సవాలు చేశారు. బ్రాహ్మణుడి పేరుతో సినిమా వాళ్లను రాజకీయ నాయకులను రాజకీయ పార్టీలను మోసం చేస్తున్నాడని.. అసలు వేణు స్వామికి బ్రాహ్మణ జాతికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
వేణుస్వామి మరొకసారి తాను బ్రాహ్మణుడు అని చెప్పుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వేణు స్వామి (Venu Swamy) జాతకాలతో ఎవరూ మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
బ్రాహ్మణుడే కాదు
‘‘వేణు స్వామి (Venu Swamy) భార్య వీణ శ్రీవాణి తమకు బ్రాహ్మణ సంఘాల మద్దతు కావాలని ఓ వీడియో ద్వారా కోరారు. టీవీ5 మూర్తి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని, మాకు బ్రాహ్మణ సంఘాలు, జర్నలిస్టుల మద్దతు కావాలని అన్నారు. మీరు చెప్పే ఫేక్ జ్యోతిషాలకు మాకు ఏ సంబంధం లేదు. ముందు మీ ఆయన బ్రాహ్మణుడో కాదో తెలుసుకో. మా విచారణలో వేణుస్వామి అసలు బ్రాహ్మణుడే కాదని తేలింది. వైఖానస బ్రాహ్మణుడూ కాదు, శ్రీవైష్ణవ బ్రాహ్మణుడూ కాదు.
వేణు స్వామి (Venu Swamy) ఆ కులానికి చెందిన వారు
చాత్తాత శ్రీవైష్ణవులని బీసీల్లో ఓ కులం. ఆ కులంలో చాలా మంది మద్య మాంసాలు అన్నీ సేవిస్తారు. పరాశరం అనేది వేణు ఇంటిపేరు. ఈ పేరు పద్మశాలిల్లో కూడా ఉంది. వేణుస్వామి తమ వర్గానికి చెందిన వారు కానేకాదని.. వైఖానస బ్రాహ్మణులు, శ్రీవైష్ణవులు మాకు తెలియజేశారు.
వేణుస్వామి బ్రాహ్మణుడు కానే కాదు. అతను నకిలీ బ్రాహ్మణుడు. నిజంగా బ్రాహ్మణుడే అయి ఉంటే.. నేను ఫలానా శాఖకు చెందిన వాడినని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి.. ఆయన జ్యోతిషం పేరుతో సినిమా ఇండస్ట్రీని, రాజకీయ నాయకులను, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వేణు స్వామి భార్య బ్రాహ్మణ కులానికి చెందిన వారు అయినప్పటికీ, వేణు స్వామి (Venu Swamy) బ్రాహ్మణుడు కాడు. వేణు స్వామి చేసే మద్యమాంసాల పూజలకు, వామాచారానికి బ్రాహ్మణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రజలు ఎవరూ వేణు స్వామిని నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని బ్రాహ్మణ చైతన్య ద్వారా మేం కోరుతున్నాం’’ అని సిరిపురపు శ్రీధర్ శర్మ స్పష్టం చేశారు.