విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)- రష్మిక (Rashmika) వివాహం ఈ నెల 26న జరగనుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వారి వెడ్డింగ్ కార్డు లీక్ అయి, అది నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై నటుడి టీమ్ స్పందించింది. వివాహం, రిసెప్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కరెక్ట్ కాదంటూ అసహనం వ్యక్తం చేసింది.
‘‘విజయ్, రష్మిక వివాహానికి సంబంధించి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పెళ్లి, రిసెప్షన్.. వివరాలన్నింటినీ వెల్లడిస్తున్నారు. దీనివల్ల వివాహ వేడుకకు హాజరయ్యే అతిథులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. వీరి పెళ్లి వేడుకలకు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన వారితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. అందుకే వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించడం సరికాదు. పెళ్లికి హాజరయ్యే అతిథులు కాంటాక్ట్ కావాల్సిన ఫోన్ నెంబర్‌నూ వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ చేస్తే.. దానినీ పోస్ట్ చేశారు. ఈ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. అలాంటి పర్సనల్ ఈవెంట్‌కు సంబంధించి పోస్టులు పెట్టే ముందు వాటి ద్వారా ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది గమనించుకోవాలి’’ అని విజయ్ టీమ్ పేర్కొంది.



































