విటమిన్ ఈ ఆయిల్‌తో మెరిసే అందం మీ సొంతం..! ఇలా వాడితే మ్యాజిక్‌ చూస్తారు

www.mannamweb.com


విటమిన్ ఈ క్యాప్సూల్ చర్మానికి తేమను అందిస్తుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్ ముఖ్యంగా డీహైడ్రేట్ చేయబడిన లేదా పొడి చర్మంపై అప్లై చేయవచ్చు. ఇది చర్మానికి శోథ నిరోధక లక్షణాలను కూడా అందిస్తుంది, చర్మానికి ఓదార్పు ప్రభావాలను ఇస్తుంది.

విటమిన్ ఈ క్యాపిల్స్ డైరెక్ట్ గా రాస్తే.. చాలా ప్రయోజనాలు ఉన్నాయట.

విటమిన్‌ ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ ని డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేయడం వల్ల.. ఫ్రీ రాడికల్స్‌ నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. చర్మాన్ని చాలా మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతుంది. చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ ఉండేలా మారుస్తుంది.

ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ ని డైరెక్ట్ గా ముఖానికి రాసేయటం కంటే..ఈ క్యాప్సూల్‌ను ఫేస్ ఆయిల్ లేదా టోనర్‌లో మిక్స్‌ చేసుకుని వాడుకోవాలా. మీ చర్మానికి సరిపోయే మంచి ఫేస్ ఆయిల్ లేదా రోజ్ వాటర్ వంటి సహజమైన ఫేషియల్ టోనర్‌తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.

కళ్ల కింద నల్లటిమచ్చలు ఉన్నవారు రాత్రిపూట విటమిన్ ఈ ఆయిల్‌ రాసుకుంటే క్రమంగా అవి తొలగిపోతాయి. కానీ, ఇది అప్లై చేసిన తర్వాత తేలికగా మసాజ్ చేయాలి. దీన్ని రోజూ అప్లై చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య కూడా తొలగిపోతుంది.

ఫేస్ మాస్క్‌లో కూడా విటమిన్-ఇ క్యాప్సూల్స్‌ను వాడొచ్చు. ఇది మీ చర్మానికి మరింత పోషణను అందిస్తుంది. అలోవెరా జెల్, ముల్తానీ మిట్టి లేదా పెరుగు వంటి ఏదైనా సహజమైన ఫేస్ మాస్క్‌లో విటమిన్‌ ఈ క్యాప్సూల్స్‌ను కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.