Walking: 5 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడవాలో తెలుసా..?

ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్‌కి వెళ్లక్కర్లేదు, ఖరీదైన పరికరాలు అవసరం లేదు.. కేవలం నడక చాలు.. కానీ అందరూ ఒకేలా నడిస్తే ఫలితం ఉంటుందా? అంటే కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 5 ఏళ్ల పిల్లాడి నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
5 – 12 ఏళ్ల వయస్సున్నవారు: పిల్లల ఎదుగుదలకు, శారీరక దృఢత్వానికి నడక చాలా అవసరం. ఈ వయసు పిల్లలు రోజుకు కనీసం 60 నిమిషాలు నడవాలి. కేవలం నడకే కాకుండా ఆటపాటల ద్వారా కూడా ఈ సమయాన్ని పూర్తి చేయవచ్చు.


13 – 19 ఏళ్లు: చదువుల ఒత్తిడి, మానసిక ఆందోళనలను తగ్గించుకోవడానికి టీనేజర్లకు నడక మేలు చేస్తుంది. వీరు రోజుకు 45 నుండి 60 నిమిషాల పాటు చురుగ్గా నడవడం వల్ల బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా, ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

20 – 40 ఏళ్లు: ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉండే ఈ వయసు వారు ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాలు మితమైన వేగంతో నడవాలి. దీనివల్ల రక్తపోటు తగ్గడం, కండరాల బలం పెరుగడంతో పాటు రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

60 ఏళ్ల లోపు వారు: వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, మతిమరుపు వంటి సమస్యలను నడకతో చెక్ పెట్టవచ్చు. రోజుకు 30 నుండి 40 నిమిషాలు నడవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

60 – 75 ఏళ్లు: ఈ వయసులో శరీరాన్ని అతిగా శ్రమ పెట్టకూడదు. సమతుల్యత కోల్పోకుండా ఉండటానికి రోజుకు 20 నుండి 30 నిమిషాలు మితమైన వేగంతో నడిస్తే సరిపోతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

75 ఏళ్లు పైబడిన వారు: వృద్ధాప్యంలో కదలికలు మందగించడం సహజం. అయితే పడిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి, మానసిక ఉల్లాసం కోసం రోజుకు 15 నుండి 20 నిమిషాలు నడవడం మంచిది. కాగా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఏదైనా కొత్త వ్యాయామం ప్రారంభించే ముందు ఒకసారి వైద్యుని సంప్రదించడం ఉత్తమం.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.