వర్క్ ఫ్రం హోం జాబ్ కావాలా?.. టైపింగ్ చేస్తూ గంటకు 1600 సంపాదించే ఛాన్స్..

www.mannamweb.com


చాలా మంది టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది. ఇక ప్రైవేట్ రంగంలో జాబ్ పొందాలంటే క్వాలిఫికేషన్ తో పాటుగా కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లీష్ పై పట్టు, స్పెషల్ కోర్సులను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సరైన స్కిల్స్ లేని కారణంగా చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి వారు వర్క్ ఫ్రం హోం జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు. ఇంటి వద్దనే ఉండి వీలున్నప్పుడల్లా వర్క్ చేస్తూ డబ్బు సంపాదించే మార్గం ఉంటే బాగుండని భావిస్తుంటారు. మీలాంటి వారి కోసం బెస్ట్ వర్క్ ఫ్రం హోం జాబ్ ఉంది. టైపింగ్ చేస్తూ గంటకు 1600 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఎలా అంటే?

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం.. ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో వర్క్ ఫ్రం హోం జాబ్ లకు ప్రియారిటీ పెరిగింది. డేటా ఎంట్రీ, ట్రాన్స్ క్రిప్షనిస్ట్, మెడికల్ కోడర్, ట్రాన్స్ లేటర్ ఇలా కొన్ని వర్క్ ఫ్రం హోం జాబ్స్ ఉంటాయి. అయితే వీటిల్లో నిజమైనవి ఏవో నిర్థారించుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తే నష్టం కానీ, ఇబ్బందులు కానీ తలెత్తకుండా ఉంటుంది. మరి మీరు కూడా వర్క్ ఫ్రం హోం జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఆన్ లైన్ లో టైపింగ్ జాబ్ అందుబాటులో ఉంది. ఆడియో విని టైప్ చేస్తూ గంటకు 5-20 డాలర్లు సంపాదించుకోవచ్చు. అంటే గంటకు 1,600 ఆదాయం పొందొచ్చు.
ఇలా లాగిన్ అవ్వండి:

మీ ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి scribie అని సెర్చ్ చేయాలి. అప్పుడు క్రోమ్ పేజీలో scribie వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. మెయిల్ ఐడీతో సైన్ అప్ అయి ట్రాన్స్‌క్రైబర్ గా రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు పే పాల్ అకౌంట్ ను వెరిఫై చేసుకోవాలి. తర్వాత టెస్ట్ ఫైల్ ను సబ్మిట్ చేయాలి. ఇక ఇప్పుడు ఇచ్చిన ఆడియోను వింటూ ఉన్నది ఉన్నట్టుగా టెక్ట్స్ రూపంలోకి మారిస్తే సరిపోతుంది. ఇలా వర్క్ చేస్తూ గంటకు 1600 ఆర్జించొచ్చు.

గమనిక: అంతర్జాలంలో లభించిన సమాచారం మేరకే ఈ వివరాలను అందించాము. మీరు అన్ని వివరాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకుంటే మంచిది.