ఇంతకూ షర్మిల పోటీ ఎక్కడ?

సార్వత్రిక ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎక్కడి నుంచి పోటీచేస్తారు.. అసెంబ్లీ బరిలో ఉంటారా.. లేక లోక్‌సభకు నిలబడతారా?
కాంగ్రెస్‌ నేతల్లో ప్రస్తు తం ఈచర్చ నడుస్తోంది. ఆమె గడచిన కొన్ని రోజులుగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్ధుల వడబోత చేపట్టారు. విజయవాడలో బుధవారం కూడా ఈ ప్రక్రియను కొనసాగించారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులతో గురువారం మంగళగిరిలో షర్మిల ప్ర తిజ్ఞ చేయిస్తారని పీసీసీ వెల్లడించింది.


2014, 19 ఎన్నికలతో పోల్చితే.. 2024 ఎన్నిక ల్లో పోటీకి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారని అంటున్నారు. కాగా.. పీసీసీ చీఫ్‌గా ఆమె బాధ్యతలు చేపట్టిన వెంటనే పులివెందుల నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తారన్న చర్చ సాగింది.