ఎముకలకు పుష్ఠి,ఎన్నో అనారోగ్యాలకు సంజీవని ‘గోంద్ లడ్డు’..ఎలా చేసుకోవాలంటే

నదేశంలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన, పోషకమైన వంటకాల్లో గోంద్ లడ్డు ఒకటి.సాధారణంగా దీన్ని చలికాలంలో ఎక్కువగా తయారుచేస్తుంటారు.


మిగతాకాలాల్లో కూడా దీన్ని తయారుచేస్తుంటారు. ఇది కేవలం రుచికరమైన తీపి వంటకం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే ఒక బలవర్ధకమైన ఆహారం. సంప్రదాయబద్ధంగా ప్రసవం తర్వాత స్త్రీలకు, అలాగే చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచడానికి,ఎముకలకు పుష్ఠినిచ్చే ఈ లడ్డూలను తయారుచేస్తారు. గోంద్ లడ్డు తయారీకి సాధారణంగా ఇంట్లో లభించే, సులభంగా దొరికే పదార్థాలు అవసరం అవుతాయి. ఈ పదార్థాలన్నీ పోషకాలతో నిండి ఉంటాయి. గోంద్ లడ్డూని మీ ఇంట్లోనే సలుభంగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

గోంద్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు

-గోంద్

-బాదంపప్పు

-జీడిపప్పు

-ఖర్బూజ గింజలు

-నెయ్యి

-గసగసాలు

-ఎండుకొబ్బరి తురుము

-గోధుమ పిండి

-బెల్లం

గోంద్ లడ్డు తయారీ విధానం

-ముందుగా పావు కప్పు బాదంపప్పు,పావుకప్పు జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మొత్తం కలిపి అరకప్పు ఉండాలి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 1 కప్పు ఎండుకొబ్బరి తురుము వేసి మీడియం మంట మీద 2-3 నిమిషాలు వేయించి ఓ ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బాండీలోనే 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి చిట్లనివ్వాలి. ఆ తర్వాత వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బాండీలోనే పావు కిలో నెయ్యిలో కొంత వేసి అందులో కట్ చేసుకున్న డ్రైఫ్రూట్స్, 2 టేబుల్ స్పూన్ల ఖర్బూజ గింజలు కూడా వేసి 1 నిమిషం తక్కువమంట మీద వేయించి తీసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో 100 గ్రాముల గోంద్(అకాసియా గమ్)వేసి వేయించాలి. గోంద్ వేగి సగ్గుబియ్యంలా పొంగుతుంది. అప్పుడు దాన్ని తీసి ఓ ప్లేట్ లో పెట్టుకోండి.

-వేయించిన గోంద్ చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలో వేసి 2-3 సార్లు పల్స్ ఇస్తూ చేసుకుంటే చాలు.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీలొ ఇంకొంచెం నెయ్యి వేసి వేడి చేసి అందులో 100 గ్రాముల గోధుమ పిండి వేసి మంచి రంగు,సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.

-గోధుమపిండి మంచి సువాసన వస్తున్న సమయంలో దాన్ని వేయించి అన్నీ పెట్టుకున్న ప్లేట్ లో వేసేయండి. మక్సీలో పల్స్ చేసుకున్న గోంద్ కూడా ఇందులో వేసి మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోండి.

-తర్వాత స్టవ్ మీద బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసి అందులో 250 గ్రాముల బెల్లం తరుము వేసి ఓ తీగ పాకం వచ్చేదాకా మరిగించాలి. పాకం చిక్కగా ఉన్నప్పుడు అందులో అర టేబుల్ స్పూన్ యాలకల పొడి,అర టేబుల్ స్పూన్ సొంటి పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసేయండి.

-ఇప్పుడు బెల్లం పాకంలో వేయించిన పదార్థాల మిశ్రమం మొత్తం వేసేసి బాగా కలిపి 5 నిమిషాలు పక్కన ఉంచండి.

-మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని అడ్డూల్లా చుట్టుకోండి. అంతే గోంద్ లడ్డు రెడీ.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.