విమానంలో ఉచిత Wi-Fi ఎక్కడ నుండి వస్తుంది? మొబైల్‌ డేటా ఎందుకు పని చేయదు?

www.mannamweb.com


విమాన ప్రయాణ సమయంలో విమానంలో ఇంటర్నెట్ సదుపాయం రెండు ప్రధాన సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ఎయిర్-టు-గ్రౌండ్ సిస్టమ్, మరొకటి శాటిలైట్‌ బేసిడ్‌ వై-ఫై సిస్టమ్. విమానంలో మొబైల్‌ డేటా పని చేయదు. ఎందుకంటే అంత ఎత్తులో మొబైల్‌కు సిగ్నల్స్‌ అందవు. అంతేకాదు ఇంటర్నెట్‌ పని చేసినా విమానానికి అడ్డంకిగా మారుతాయి..?

కొన్ని విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఉచిత Wi-Fiని అందిస్తాయి. ఎయిర్ ఇండియా కూడా కొన్ని విమానాల్లో ఉచిత వై-ఫై సేవలను ప్రారంభించింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, గాలిలో అంత ఎత్తులో ఉన్న విమానంలో Wi-Fi ఎలా పని చేస్తుంది?

విమాన ప్రయాణ సమయంలో విమానంలో ఇంటర్నెట్ సదుపాయం రెండు ప్రధాన సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ఎయిర్-టు-గ్రౌండ్ సిస్టమ్, మరొకటి ఉపగ్రహ ఆధారిత వై-ఫై సిస్టమ్.

ఎయిర్-టు-గ్రౌండ్ సిస్టమ్ కింద విమానంలో అమర్చిన యాంటెన్నా భూమిపై సమీపంలోని టవర్ నుండి సిగ్నల్‌ను అందుకుంటుంది. ఈ కనెక్షన్ నిర్దిష్ట ఎత్తు వరకు సజావుగా పని చేస్తూనే ఉంటుంది. గ్రౌండ్ టవర్లు లేని ప్రాంతం గుండా విమానం వెళితే, కనెక్షన్ అంతరాయం కలుగవచ్చు.

గ్రౌండ్ టవర్లు సిగ్నల్ పైకి ప్రొజెక్ట్ చేస్తాయి. ఈ వ్యవస్థలో ఉపయోగించే యాంటెనాలు విమానం దిగువ భాగంలో అమర్చబడి ఉంటాయి. మరొకటి ఉపగ్రహ ఆధారిత Wi-Fi వ్యవస్థ. ఈ టెక్నిక్ ఈ రోజుల్లో మరింత ప్రాచుర్యం పొందింది.

ఇందులో గ్రౌండ్ స్టేషన్ నుంచి వచ్చే సిగ్నల్ ఉపగ్రహం ద్వారా విమానానికి చేరుతుంది. ఈ వ్యవస్థలో యాంటెన్నా విమానం పైన అమర్చబడి ఉంటుంది. పైగా సముద్రాల వంటి గ్రౌండ్ టవర్లు లేని ప్రాంతాల్లో కనెక్టివిటీని అందించడానికి ఈ సాంకేతికత మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి ప్రదేశంలో ఇది సిగ్నల్ను అందిస్తుంది.

విమానం లోపల ఉన్న రౌటర్ల ద్వారా ప్రయాణీకుల డివైజ్‌లకు సిగ్నల్ అందుతుంది. విమానం 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు ఆన్-బోర్డ్ యాంటెన్నా ఉపగ్రహ సర్వీస్‌కు కనెక్ట్ అవుతుంది. విమానంలో ఉన్నప్పుడు మొబైల్ డేటా పరిమితం ఉంటుంది. ఎందుకంటే వారి సిగ్నల్స్‌ పైలట్ నావిగేషన్, రాడార్ పరికరాలు, గ్రౌండ్ కంట్రోల్‌తో సాంకేతికతలతో ఆటంకం ఏర్పడుతుంది.