ఉద్యోగం పోయిందా.? డోంట్ వర్రీ.. ఈ వ్యాపారంతో నెలకు రూ. 2 లక్షల వరకు గ్యారంటీ

ద్యోగం పోయిందా.? లేదా చేస్తున్న ఉద్యోగంతో విసుగొచ్చిందా.? ఈ మధ్యకాలంలో యువత 9 టూ 5 ఉద్యోగం మీద కంటే.. సొంతంగా స్టార్టప్ పెట్టుకోవడంపైనే ఆసక్తి చూపిస్తున్నారు.


అందుకే మీ కోసం ఓ బిజినెస్ ఐడియా తీసుకొచ్చాం.

కాలం ఏదైనా కూడా ఈ బిజినెస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ వ్యాపారం ప్రతీ ఏడాది 20 శాతంపైగానే వృద్ది చెందుతుంది. ఇంతకీ అదేంటని అనుకుంటున్నారా.? మినరల్ వాటర్ ప్లాంట్ అండీ.! మీరు చూస్తుంటే బిల్డింగ్ సొసైటీలు, అపార్ట్‌మెంట్లు.. లేదా రద్దీగా ఉండే పట్టణాలు, గ్రామాల్లో వీధికొక వాటర్ ప్లాంట్ పుట్టుకొస్తోంది. మీరు కూడా ఈ 25 లీటర్ల వాటర్ టిన్లు, లీటర్ వాటర్ బాటిళ్ల బిజినెస్ పెట్టి.. ప్రతీ నెలా లక్షలు సంపాదించవచ్చు.

ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే కచ్చితంగా కావాల్సింది స్థానిక అధికారుల నుంచి ఓ లైసెన్స్. అంతేకాదు పాన్ కార్డు నెంబర్, జీఎస్టీ నెంబర్ లాంటి డీటయిల్స్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభించడానికి మీరు ఆర్ఓ ఫిల్టర్‌లతో పాటు పలు మిషన్లు కొనాల్సి ఉంటుంది. వీటి కంటే ముందు మీ దగ్గర ఓ 1500 చదరపు గజాలా స్థలం ఉండాలి. మీ ఇంటిలోని ఖాళీ స్థలం ఉన్నా.. దీనిలోని వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చు.

ఇక పైన పేర్కొన్న ఫిల్టర్స్, లైసెన్స్.. మిగిలినవి చేయడానికి రూ. 3 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. వాటితో పాటు 25 లీటర్ల సామర్ధ్యం ఉన్న 100 వాటర్ క్యాన్లు కూడా మీరు కొనుగోలు చేస్తే మంచిది. దీని కోసం ఓ రూ. 5 లక్షలు బిజినెస్ లోన్ కింద బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు.

ఇక బిజినెస్ లెక్కల విషయానికొస్తే.. ఓ మినరల్ వాటర్ బాటిల్ ధర రూ. 20, 25 లీటర్ క్యాన్ అయితే రూ. 10 నుంచి రూ. 15 తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు టిన్ కూడా ఇవ్వాల్సి వస్తే క్యాన్ రూ. 300 నుంచి రూ. 350 వరకు అమ్ముతారు. ఇలా రోజుకు వాటర్ బాటిళ్లు, 25 లీటర్ల క్యాన్లు కలిపి వెయ్యి వరకు అమ్మితే.. రూ. 20 వేల ఆదాయం వస్తుంది. అలా నెలకు రూ. 6 లక్షల ఆదాయం మీ సొంతం. కరెంట్ బిల్లు, సర్వీసులు, ఇతరత్రా ఖర్చులకు రూ. రెండున్నర లక్షలు పోయినా.. సుమారు 3 లక్షల వరకు మీకు లాభం వస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.