చేపలు లీన్ ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌కు మూలం. అవి మొత్తం ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. చేపలను ఏ ఆహారాలతో కలిపి తీసుకుంటామనేది చాలా ముఖ్యం.
అన్ని ఆహారాలను సీఫుడ్‌తో కలిపి తీసుకోకూడదు. కొన్నింటితో కలిపి తింటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. మరికొన్ని- కడుపు ఉబ్బరం, అజీర్తి, వికారం, డయేరియా వంటి సమస్యలకు దారితీస్తాయి. సీఫుడ్/చేపలతో కలిపి లేదా తిన్న తర్వాత ఏఏ ఆహార పదార్థాలను తీసుకోకూడదో తెలుసుకుందాం.
పాలు, పెరుగు లేదా ఇతర పాల ఉత్పత్తులను చేపలతో కలిపి తినడం వల్ల జీర్ణ అసౌకర్యం, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు చర్మ అలెర్జీలు, ఇన్‌ఫెక్షన్లు కూడా ఏర్పడవచ్చు. పాల ఉత్పత్తులు, చేపల్లో ఉండే అధిక ప్రొటీన్లు, ఇతర సమ్మేళనాలు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. చేపలు, నిమ్మజాతి పండ్లు కలిపి తినడం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు నిమ్మలోని ఆమ్లం చేపల ప్రొటీన్‌తో కలివడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
బాగా ప్రాసెస్ చేసిన లేదా వేయించిన ఆహార పదార్థాలను చేపలతో కలిపి తీసుకోవడం వల్ల కూడా అనారోగ్యానికి దారి తీయవచ్చు. వేయించిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్‌లు గుండె ఆరోగ్యానికి హానికరం. చేపలను బంగాళాదుంపలు, పాస్తా వంటి పిండి పదార్థాలు అధికంగా ఉండే వంటకాలతో కలపడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లు శరీరంలో చేరి జీర్ణ వ్యవస్థ మందగించే అవకాశం ఉంది.
కారంగా ఉండే ఆహారాలు చేపల సున్నితమైన రుచిని డామినేట్ చేయగలవు. అంతేకాకుండా, మసాలా ఆహారాలను చేపలతో కలిపి తిన్నప్పుడు గ్యాస్ట్రోఇంటెస్టినల్ అసౌకర్యం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావొచ్చు. బీన్స్, పప్పులు, చేపలు రెండూ ప్రొటీన్‌కు మూలాలే. వీటిని కలిపి తిన్నప్పుడు అజీర్తి, కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చేపలతో పాటు కాఫీ తాగడం వల్ల చేపల్లో ఉండే పాదరసం (మెర్క్యూరీ) శరీరానికి అందదు అనే వాదన కూడా ఉంది.
పుచ్చకాయ, నారింజ, నిమ్మకాయ వంటి వాటిని సీఫుడ్‌తో కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటివి కలుగుతాయి. చేపలు తిన్న తర్వాత టీ తాగడం కూడా మంచిది కాదు. అలా చేయడం వల్ల టీలో ఉండే టానిక్ యాసిడ్.. జీర్ణవ్యవస్థలో చికాకును కలిగిస్తుంది. సీఫుడ్, రెడ్‌వైన్ రెండింటిలోనూ హిస్టమైన్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల తీవ్రమైన అలెర్జీ, సైడ్ ఎఫెక్ట్స్, శారీరక అసౌకర్యం, తలనొప్పి వంటివి సంభవించవచ్చు.
చేపలకు సహజంగా శీతల స్వభావం ఉన్నందున, పాలకూర, దోసకాయ, పుచ్చకాయ వంటి ఇతర శీతల ప్రభావం ఉన్న ఆహారాలతో దీనిని కలిపి తినకూడదు. ఇది ఉబ్బరం, అజీర్ణానికి దారితీస్తుంది. చేపలతో కలిపి లేదా ఆ తర్వాత చిక్కుళ్ళు తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం తలెత్తవచ్చు. అలాగే కోకా కోలా వంటి అధిక ఆమ్ల పదార్థాలను కలిపి తీసుకుంటే అదే విధమైన జీర్ణ సమస్యలు వస్తాయి.

































