జగన్‌తో శతృత్వం.. సహవాసం రెండూ ప్రమాదమే

జగన్‌తో శతృత్వం అంటే ఎలా ఉంటుందో గత 5 ఏళ్ళలో అందరికీ రుచి చూపించారు. మరి ఆయనతో సహవాసం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలిగా!


ఆక్రమస్థుల కేసులలో జగన్‌తో సహవాసం చేసినవారు అనేకమంది ఆయనతో పాటు చంచల్‌గూడా జైలుకి వెళ్ళివచ్చారు. ఆ కేసులలో గత 14 ఏళ్ళుగా అందరూ తరచూ కోర్టులో అటెండెన్స్ వేసుకొని వస్తూనే ఉన్నారు.

వివేకా హత్య కేసులో ఒక్క చిన్న పిల్లోడు తప్ప మిగిలిన పిల్లగాయలందరూ జైలుకి, కోర్టుకి వెళ్ళి వస్తూనే ఉన్నారు. అది జగనన్న సహవాస దోషమే ఇది అని చెల్లెమ్మ షర్మిల వాదిస్తోంది.

జగనన్న కళ్ళలో ఆనందం చూసేందుకు ఎంపీ రఘురామకృష్ణరాజుని అరికాళ్లు వాచిపోయేలా కొట్టిన పోలీస్ అధికారులు ఇప్పుడు కన్నీళ్ళు కార్చుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

అలాంటి ఆనందం చూసేందుకే మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేయబోయి పోలీస్ స్టేషనల చుట్టూ తిరుగుతున్నారు. జగన్‌ సహవాసంతో ఆరితేరిన మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని తమ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అంబటి రాంబాబు, రోజా, గుడివాడ వంటివారు కూడా అసహనంతో ఎదురుచూస్తూనే ఉన్నారు.

పాపం.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బుద్ధిగా తన మానాన్న తాను రొమాన్స్ చేసుకుంటుంటే, మద్యలో జగన్‌ కళ్ళలో ఆనందం కోసం పవన్ కళ్యాణ్‌కి చెప్పు చూపించి వార్నింగ్ ఇవ్వడంతో అడ్డంగా బుక్ అయిపోయారు. ఈరోజే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మొదటి అధ్యాయం ప్రారంభించుకున్నారు.

మరియమ్మ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. మద్యంతర బెయిల్‌ నిరాకరించింది. కనుక ఇక ఏపీ పోలీసులదే ఆలస్యం.

రేషన్ బియ్యం అక్రమ రవాణా స్టోరీలో సకుటుంబ సమేత పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ లైన్లో ఉండగా, ‘కాకినాడ పోర్ట్ సీజ్’ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో అధినేత శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్‌పీ తదితరులని ఓ పక్క ఏపీ ఏసీబీ, మరోపక్క ఈడీ లైన్లో పెట్టాయి.

చివరికి తల్లీ, చెల్లీ, చెల్లి వరుస చెల్లీ, లక్షల మంది వాలంటీర్లు కూడా జగన్‌ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. వారందరి స్టోరీలు ట్రాజెడీయే.

ఈవిదంగా తనని నమ్ముకున్న ప్రతీ ఒక్కరికీ ఇంత మేలు చేసిన ఏకైక వ్యక్తి ఈ లోకంలో బహుశః జగన్‌ ఒక్కరే అయ్యుండవచ్చు.

ఇంతమంది ‘రపరప’ ఆడించేసిన జగన్‌ మాత్రం ఇంకా తాడేపల్లి ప్యాలస్‌లో సేద తీరుతూనే ఉన్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం.. సినిమా చూపిస్తా మావా.. ‘ అంటున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.