వైకాపా నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి సిటీ న్యూరో సెంటర్‌లో చేర్పించారు. ప్రస్తుతం బొత్సకు చికిత్స కొనసాగుతోందని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

































