టీడీపీలోకి వైసీపీ మాజీమంత్రి

www.mannamweb.com


రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైసీపీ మాజీమంత్రి టీడీపీ మంత్రితో కలిసి ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాజీమంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. దీంతో త్వరలో జోగి రమేష్ టీడీపీలో చేరతారని చర్చ జరుగుతోంది.