Eating Dal : పప్పులు ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతుంటారు డాక్టర్లు. అయితే అందులో అన్ని పప్పులు ఆరోగ్యానికి మంచివి కాదండోయ్. కేవలం కొన్ని పప్పులు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తుంటాయి.
అందులో కంది పప్పుకూడా చాలా ముఖ్యమైనది. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. కందిపప్పు తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయనుకుని అందరూ దాన్ని దూరం పెడుతుంటారు. కానీ వాస్తవానికి కందిపప్పుతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు వదలరు. కందిపప్పులలో సైన్స్ చెబుతున్న దాని ప్రకారం చాలానే పోషకాలు ఉన్నాయి.
Eating Dal పోషకాలు పుష్కలం..
కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, సెలీనియం, మాంగనీస్, ప్రోటీన్ లాంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవి మన బాడీకి అత్యధికంగా మేలు చేస్తాయి. బాడీకి కావాల్సిన మెజార్టీ పోషకాలు కందిపప్పులోనే ఉన్నాయి. ప్రోటీన్లకు పెట్టింది పేరు కందిపప్పు. మాంసంలో ఉండే ప్రోటీన్లు ఈ పప్పులోనే ఉంటాయి. అందుకే శాఖాహారులకు ఇది ఒకరకంగా మాంసాహారమే. ఈ పప్పును వారంలో రెండుసార్లు తింటే మాత్రం ఎముకలను దృఢంగా ఉంచడంతో పాటు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో బాగానే సాయం చేస్తుంది.
ఇంకో విషయం ఏంటంటే దీన్ని తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఎందుకంటే ఇందులో ఉండే పీచు పదార్థాలు మీ కడుపును నిండుగా ఉంచి అతిగా తినకుండా కంట్రోల్ చేస్తుంది. దాని వల్ల బరువు తగ్గుతారు. దాంతో పాటు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో ఉత్తమంగా పని చేస్తుంది. కంది పప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా దీన్ని హాయిగా తినొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక గర్భిణి స్త్రీలకు అయితే ఇది దివ్య ఔషధం. ఎందుకంటే సరైన పోషకాలు లేకపోతే శిశువు ఎదగదు. అందుకే గర్భిణులు దీన్ని తినాలి. ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి శిశువు ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా కంది పప్పు సులభంగా జీర్ణమవుతుంది. దాన్ని తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే దాన్ని అధికంగా తినొద్దు. వారంలో ఒక రెండు సార్లు తింటే సరిపోతుంది.