Airport: ఇండియాలోనే అతి పెద్ద విమానశ్రయం ఇదే! ఢిల్లీ, ముంబై ఇవేవి కావు…

ప్రపంచంలోని బెస్ట్ ఎయిర్ పోర్టుల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో ఇస్తాంబుల్ విమానాశ్రయం టాప్‌లో నిలిచింది. భారత్ నుండి ఒకే ఒక్క ఎయిర్ పోర్టు ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.


ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, 84.23 స్కోరుతో ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అయితే భారతదేశంలో అతి పెద్ద విమానాశ్రయం ఏంటో తెలుసా?

భారతదేశంలో ఎన్నో విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని లొకేషన్ , కనెక్టివిటీ మరియు నిర్మాణం పరంగా ఒక్కో ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకంగా ఉన్నాయి. అయితే వీటిలో అతిపెద్ద విమానాశ్రయం ఏంటి అనే విషయం తెలుసుకుందాం!

భారతదేశంలోని టాప్ 10 అతిపెద్ద విమానాశ్రయాల జాబితా గురించి తెలుసుకుందాం!
భారతదేశంలోని అతిపెద్ద విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి స్థానంలో నిలిచింది. 5,500 ఎకరాలతో విస్తీర్ణంపరంగా దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా నిలిచింది. అంతే కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద రన్‌వే ను కలిగి ఉంది. RGIAలో 4,260 మీటర్ల పొడవైన రన్ వే ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయల టాప్ 10 ఇవే!
1- మొదటి స్థానంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిలిచింది. 5,500 ఎకరాల్లో విమానాశ్రయం ఉంది.

2. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు,5,106 ఎకరాల విస్తీర్ణంతో రెండో స్థానంలో ఉంది.

3. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 4,008 ఎకరాలతో మూడో స్థానంలో ఉంది.

4. గోవాలోని మోపా వద్ద ఉన్న మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నాలుగో స్థానంలో ఉంది. 2,132 ఎకరాల్లో ఈ విమానాశ్రయం ఉంది.

5. గోవా, పనాజీ విమానాశ్రయం 1,700 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది దేశంలోని అతిపెద్ద విమానాశ్రయాల జాబితాలో ఐదో స్థానంలో ఉంది.

6. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, 1640 ఎకరాలతో ఆరో స్థానంలో ఉంది.

7.రాంచీలోని బిర్సాముండా ఎయిర్ పోర్ట్, 1560 ఎకరాలతో ఏడో స్థానంలో ఉంది.

8. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది ఎనిమిదో స్థానంలో ఉంది.

9. నాగ్‌పూర్‌లోని డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం 1460 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.తొమ్మిదో స్థానంలో ఈ విమానాశ్రయం ఉంది.

10. పదో స్థానంలో కొచిలోని కొచిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఈ విమానాశ్రయం విస్తీర్ణం 1300 ఎకరాలు.

ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్ పోర్ట్స్ జాబితాలో మిడిల్ ఈస్ట్ మరియు ఆసియా దేశాల్లోని విమానాశ్రయాలు టాప్‌లో ఉన్నాయి. మొదటి ఐదు విమానాశ్రయాల్లో నాలుగు స్థానాల్లో ఈ దేశాలకు చెందినవే ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.