ఎరుపు రంగులోకి బ్రహ్మపుత్ర నది.. అసలు కారణం తెలిస్తే షాక్

భారతీయ ధార్మిక విశ్వాసాల్లో శక్తిపీఠాలకు అపారమైన ప్రాధాన్యం ఉంది. సతీదేవి శరీర భాగాలు భూమి పై పడిన చోట్లే ఈ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి.


అలాంటి ప్రాచీన శక్తిపీఠాల్లో అస్సాంలోని కామాఖ్య దేవాలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ స్థలం సతీదేవి యోని భాగం పడ్డ పవిత్ర భూమిగా చెబుతారు.

నీలాచల శిఖరం పై ఉన్న ఆలయం..

అస్సాం రాష్ట్ర రాజధాని డిస్పూర్‌కు దగ్గరగా, గౌహతి నగరానికి కేవలం 7-8 కిలోమీటర్ల దూరంలో నీలాచల పర్వతం పై కామాఖ్య అమ్మవారి ఆలయం వెలసింది. ఇక్కడ అమ్మవారు దుర్గమ్మ రూపంలో పూజలందుకుంటున్నారు. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులతో నిండిపోయే అంబుబాచి మేళా ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

అంబుబాచి మేళా విశిష్టత..

ఈ సంవత్సరం (2025) అంబుబాచి ఉత్సవాలు జూన్ 22న ప్రారంభమై, జూన్ 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నాలుగు రోజులపాటు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఈ నాలుగు రోజులు అమ్మవారు విశ్రాంతి తీసుకుంటారని భక్తులు పూజలను నిలిపివేస్తారు. ఈ మూడు రోజులను కామాఖ్య మాత ఋతుస్రావంలో ఉండే కాలంగా చెబుతారు. ఈ కాలంలో భక్తులు అమ్మవారిని ఆలయ గర్భగుడిలో దర్శించలేరు కానీ, ఆలయం చుట్టూ సేవలు చేయడం, స్మరణ చేయడం, తపస్సు చేయడం వంటివి కొనసాగుతాయి.

ఎరుపు రంగులోకి బ్రహ్మపుత్ర నది..

ఈ మూడు రోజుల పాటు బ్రహ్మపుత్ర నదిలోని నీళ్లు ఎర్రగా మారుతుందని స్థానికులు చెబుతారు. ఇది అమ్మవారి ఋతుస్రావాన్ని ప్రతిబింబించే ప్రకృతి సంకేతంగా భావిస్తారు.

ప్రసాదాల విశిష్టత

ఈ ఉత్సవ కాలంలో భక్తులకు రెండు ప్రత్యేక ప్రసాదాలు అందిస్తారు.

అంగోడక్ : ఈ ప్రసాదం పవిత్రమైన నీరు, అమ్మవారి శరీరాన్ని తాకినదిగా భావిస్తారు.

అంబుబాచి వస్త్రం : ఇది ఎర్రని వస్త్రం, రజస్వల కాలంలో అమ్మవారి యోని భాగాన్ని కప్పేందుకు ఉపయోగించినదిగా నమ్ముతారు. ఈ వస్త్రాన్ని అర్చకులు శుద్ధి చేసి, పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనిని పొందాలని అనేకమంది పోటీ పడతారు.

అంబుబాచి అంటే ఏమిటి ?

“అంబుబాచి” అనే పదానికి అర్థం – “నీటితో సంభాషణ”. వర్షాకాలం ప్రారంభంలో భూమి శక్తిని పునరుత్పత్తి చేయడానికి సిద్ధమవుతుందని భావిస్తూ ఈ వేడుక జరుపుకుంటారు. వ్యవసాయ పనులు ఈ రోజులలో నిలిపివేయడం, పవిత్రత రీత్యా శుద్ధి కార్యక్రమాల పై దృష్టి పెట్టడం వంటి విశేషాలు ఇందులో భాగంగా ఉంటాయి. నాల్గవ రోజు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది.

తాంత్రిక శక్తి కేంద్రం..

కామాఖ్య దేవాలయం తాంత్రిక విద్యలకు కీలక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అఘోరాలు, సాధువులు, తంత్ర శాస్త్రాధిపతులు దేశం నలుమూలల నుంచీ ఈ మేళాలో పాల్గొంటారు. అంబుబాచి సమయం తాంత్రికులకు సాధనలో అత్యంత శుభశక్తి కలిగిన క్షణాలుగా పరిగణించబడుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.