మహారాష్ట్ర(Maharastra) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ(Shirdi ). షిర్డీ సాయి బాబాని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
షిర్డీ సాయిబాబాను పిలిస్తే పలికే దైవంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో సాయిబాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన(Railway Announcement) చేసింది. ఈ మేరకు షిర్డీ సాయిబాబా(Shirdi Sai Baba) దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. షిర్డీ వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ – నాగర్‌సోల్ మధ్య స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లు(Special Trains) వచ్చే నెల(జులై) 3 నుంచి 25వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లలో(Special Trains) థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది.
సికింద్రాబాద్ – నాగర్‌సోల్(Secunderabad-Nagarsole) ప్రత్యేక రైలు (07007) జులై 3 నుంచి ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపింది. ఈ క్రమంలో నాగర్‌సోల్ – సికింద్రాబాద్ స్పెషల్ రైలు (07002) ప్రతి శుక్రవారం అందుబాటులో ఉండనుంది. సాయంత్రం 5.30 గంటలకు నాగర్‌సోల్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు రెండు మార్గాల్లో మల్కాజ్‌గిరి, బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్బని, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్‌లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.