SBI Bank Jobs 2026: రూ.50 లక్షల జీతంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. ముంబై, హైదరాబాద్‌లలో ఉన్న వివిధ బ్రాంచుల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 116 అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..


పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుల సంఖ్య: 12
డిప్యూటీ మేనేజర్ (ఐఎస్‌ ఆడిట్) పోస్టుల సంఖ్య: 104
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉద్యోగానుభవం ఉండాలి. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు అభ్యర్ధుల వయసు జనవరి 31, 2026వ తేదీ నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి. డిప్యూటీ మేనేజర్ (ఐఎస్‌ ఆడిట్) పోస్టులకు జనవరి 31, 2026వ తేదీ నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 15, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకైతే రూ.50 లక్షలు, డిప్యూటీ మేనేజర్ (ఐఎస్‌ ఆడిట్) పోస్టులకైతే నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది లింక్‌లో చెక్‌ చేసుకోండి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.