Saturday, November 16, 2024

పెట్టుబడి డబుల్ అయ్యే పోస్టాఫీస్ స్కీం ఇదే.. 5 లక్షలు పెడితే చేతికి 10 లక్షలు

డబ్బుకు ప్రాధాన్యత పెరుగుతున్నా కొద్దీ ఆదాయ మార్గాల కోసం వెతుకులాట ఎక్కువై పోతున్నది. కొందరు రెండో ఆదాయం కోసం పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నారు. మరికొంత మంది ఉన్నడబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టి లాభాలను పొందాలని చూస్తున్నారు. పెట్టుబడి పెట్టేందుకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే భద్రతతో కూడిన గ్యారంటీ రిటర్స్న్ పొందాలనుకుంటే మాత్రం ప్రభుత్వానికి చెందిన స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా మీ పెట్టుబడి డబుల్ అయ్యే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? పోస్టాఫీస్ అందించే కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెడితే అది రెండింతలు అవుతుంది. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చేతికి 10 లక్షలు వస్తాయి.

కిసాన్ వికాస్ పత్ర స్కీం పోస్టాఫీసులతో పాటుగా బ్యాంకుల్లో కూడా తెరవొచ్చు. ఈ పథకంలో కనిష్టంగా 1000 పెట్టుబడిపెట్టొచ్చు. గరిష్టంగా ఎంత పెట్టుబడైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ లో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడి 9.5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. కిసాన్ వికాస్ పత్ర పథకంలో 7.5 శాతం వడ్డీరేటు అందించబడుతుంది. 18 ఏళ్లు పైబడిన వారు ఒక్కరిగా లేదా ముగ్గురు కలిసి ఈ అకౌంట్ ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు గార్డియన్స్ సమక్షంలో ఈ పథకంలో చేరొచ్చు.

5 లక్షలకి.. 10 లక్షలు:

కిసాన్ వికాస్ పత్ర పథకంలో రూ.5000 ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీ తర్వాత రూ.10,000 పొందుతారు. అదే రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ. 10 లక్షలు పొందొచ్చు. అంటే మీరు ఎంత మొత్తం పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి అది డబుల్ అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం.. ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, పథకం మెచ్యూరిటీ కాలానికి అంటే 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 5 నెలల్లో 10 లక్షల రూపాయలను తిరిగి పొందుతారు. అంటే, మీరు వడ్డీ నుంచి నేరుగా 5 లక్షల రూపాయలు అందుకోవచ్చు.

LPG eKYC: అలాంటిదేమి లేదు.. గ్యాస్‌ సిలిండర్‌ కస్టమర్ల ఈ-కేవైసీ గడువుపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి

ల్‌పీజీ సిలిండర్ల కోసం ఈకేవైసీ (eKYC) అథెంటికేషన్ ప్రక్రియను పాటించేందుకు ఎలాంటి కాలపరిమితి లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీస్పష్టం చేశారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ రాసిన లేఖపై పూరీ స్పందించారు.

మస్టరింగ్ తప్పనిసరి అయినప్పటికీ, సంబంధిత గ్యాస్ ఏజెన్సీలలో దీన్ని చేయాలనే నిబంధన సాధారణ ఎల్‌పిజి హోల్డర్లకు అసౌకర్యంగా ఉందని సతీశన్ లేఖలో పేర్కొన్నారు. నకిలీ ఖాతాలను తొలగించడానికి, వాణిజ్య సిలిండర్ల మోసపూరిత బుకింగ్‌ను నిరోధించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు లేదా OMCలు ఎల్‌పిజి కస్టమర్‌ల కోసం ఇకెవైసి ఆధార్ ప్రామాణీకరణను అమలు చేస్తున్నాయని హర్దీప్ సింగ్ పూరి మంగళవారం ప్రకటించారు.

అయితే, ఈ ప్రక్రియ ఎనిమిది నెలలకు పైగా అమలులో ఉందని, నిజమైన వినియోగదారులకు మాత్రమే ఎల్‌పిజి సేవలు అందేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నామని పూరీ స్పష్టం చేశారు.

వంట గ్యాస్ సిలిండర్ల వినియోగదారుల ఈ-కేవైసీ ప్రక్రియకు ఎటువంటి తుది గడువు లేదని ఆయన స్పష్టం చేశారు. 2023లోనే ఎల్పీజీ ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర చమురు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా గ్యాస్ ఏజెన్సీలు తమ కస్టమర్ల ఈ-కేవైసీ ప్రక్రియ మొదలు పెట్టాయి. గ్యాస్ ఏజెన్సీల వద్దే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కొన్ని సంస్థలు పట్టుబట్టడంతో వంట గ్యాస్ వినియోగదారులు ఇబ్బందుల పాడుతున్న నేపథ్యంలో హార్థీప్‌సింగ్‌ పూరీ ఈ ప్రకటన చేశారు.

గ్యాస్‌ వినియోగదారులు తమ సమయానుకూలంగా సమీపంలో ఉన్న గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ సెంటర్‌కు వెళ్లి కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. అలాగే కేంద్ర చమురు సంస్థల యాప్‌లు ఇన్ స్టాల్ చేసుకుని సొంతంగా ఈ-కేవైసీ అప్ డేట్ చేయొచ్చు’ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.

Car Subscription: కొనకుండానే షి’కారు’ కల సాకారం.. ఈ కొత్త మోడల్‌తో నెలకో కొత్త కారు మీ సొంతం..

రోనా అనంతర పరిణామాల్లో కార్లలో ప్రయాణాలు పెరిగాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కన్నా ఏదైనా కారులో అయితే కుటుంబంతో కలిసి ప్రయాణించొచ్చు అని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు.

ఈ క్రమంలో కార్ల వినియోగం పెరిగింది. అయితే కొంత మందికి కార్లల ప్రయాణం అంటే ఇష్టం ఉంటుంది కానీ.. దానిని కొనేంత స్తోమత ఉండదు. పోనీ సెకండ్ హ్యాండ్ కారు కొందామంటే దానికొచ్చే రిపేర్లు ఇబ్బంది పెడతాయి. అందుకే మరో ఆప్షన్లో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. అదే కార్ సబ్‌స్క్రిప్షన్ లేదా లీజ్ మోడల్. అన్ని ప్రముఖ ఆటోమోబైల్ కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్లో మీకు నచ్చిన కారును మీరు కోరుకున్నంత కాలం పాటు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతి నెలా నిర్ధేశిత మొత్తం చెల్లిస్తే సరిపోతోంది. కార్ మెయింటెనెన్స్ తో మీకు పనిలేదు.. జస్ట్ పెట్రోల్ లేదా డీజిల్, టోల్ చార్జీలు చెల్లించుకుంటే సరిపోతుంది. వినడానికి బావుంది కదా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కార్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ఇదే..

దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఈ కార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే మీరు ఈ మోడల్ ని సబ్ స్కైబ్ చేసుకోవాలంటే కొంత మొత్తాన్ని మీరు డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డౌన్ పేమెంట్ చెల్లించాల్సి వస్తుంది. మీరు ఎంచుకున్న కారు మోడల్ ని బట్టి మీరు చెల్లించాల్సిన డిపాజిట్ ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు ప్రతి నెల దానికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

కార్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ వల్ల ప్రయోజనాలు..

  • కారు కొనుగోలు చేయాలంటే అది చాలా ధనంతో కూడుకున్నది. దాని కోసం లోన్లు తీసుకోవడం, ప్రతి నెలా దానిని చెల్లించడం ఇబ్బందిగా ఉంటుంది.
  • అలాగే ఎక్కువగా కార్లు మారుస్తూ ఉండే వారికి ఇది బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు నచ్చిన కారు కోసం సబ్ స్రైబ్ చేసుకోవచ్చు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వదులుకోవచ్చు.
  • అయితే కారు మీ వద్ద ఉన్నప్పుడే చేయాల్సిన మెయింటెనెన్స్, ఇన్సురెన్స్, ట్యాక్స్ వంటి వన్నీ మీరు నెలవారీ చెల్లించే ఫీజులోనే కవర్ అవుతాయి.
  • మన దేశంలో ఈ విధంగా అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు గానీ.. యూఎస్, యూరోప్ లలో ఈ ట్రెండ్ పాపులర్ అయ్యింది.
  • మీరు వెళ్లే దూరాలను ముందుగానే చెబితే.. తక్కువ దూరాలు ఉంటే మీ సబ్​స్క్రిప్షన్ చార్జీలు కూడా బాగా తగ్గుతాయి. ఒకవేళ తక్కువ దూరాలకు సబ్​స్క్రిప్షన్ తీసుకుని ఎక్కువ దూరాలు వెళ్తే.. అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

కార్ సబ్​స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి..

మన దేశంలో ఈ సబ్​స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలంటే వ్యక్తుల పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్ కం ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది. వ్యాపారం కోసం తీసుకుంటే మీ బ్యాంక్ స్టేట్ మెంట్లు, ఐటీ రిటర్న్ కూడా ఇవ్వాలి. కంపెనీ పేరు మీద తీసుకుంటే ఆరు నెలల ఆ కంపెనీ బ్యాంక్ స్టేట్ మెంట్ కూడా సమర్పించాలి.

కార్ రెంటల్‌కి కార్ సబ్​స్క్రిప్షన్‌కి తేడా ఏంటి..

ఈ విధానం గురించి చెప్పగానే చాలా మందికి కార్ రెంటల్ గుర్తొచ్చి ఉంటుంది. అయితే కార్ రెంటల్స్ కి కార్ సబ్​స్క్రిప్షన్ కి చాలా తేడా ఉంది. కార్ రెంటల్ అనేది తక్షణ అవసరాల కోసం మాత్రం ఉపయోగపడే పద్ధతి మాత్రమే. ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ నుంచి కారును అద్దెకు తీసుకుని, గంటలు, రోజుల వ్యవధిలో కారును వాడుకోవచ్చు. అదే సమయంలో కార్ సబ్ సబ్​స్క్రిప్షన్ అనేది నెలవారీగా ఉంటుంది. దీని కోసం ముందుగానే కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సబ్​స్క్రిప్షన్ తో పోల్చితే రెంటల్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

Microsoft: ఆండ్రాయిడ్ ఫోన్ వద్దు.. ఐఫోనే ముద్దు.. మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం

హ్యాకింగ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. దాని బారి నుంచి రక్షణ పొందటానికి ఆయా కంపెనీలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ కూడా దీనికి మినహాయింపు కాదు. హ్యాకింగ్ బారి నుంచి తప్పించుకోవడానికి ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చైనాలో పనిచేసే తమ కంపెనీ ఉద్యోగులు పని సంబంధిత విషయాలనే కేవలం ఐఫోన్లను మాత్రమే ఉపయోగించాని, ఆండ్రాయిడ్ పరికరాల వాడకాన్ని ఆపివేయాలని ఆదేశించింది.

భద్రతా కారణాలు..

మైక్రోస్టాఫ్ట్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక భద్రతా పరమైన కారణాలు ఉన్నాయి. చైనాలో తమ సంస్థ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడమే దీని వెనుక ఉద్దేశం. మైక్రోసాఫ్ట్ కు చెందిన గ్లోబల్ సెక్యూర్ ఫ్యూచర్ ఇనిషియేటివ్ (ఎస్ఎఫ్ఐ)లో భాగంగా ఉద్యోగుల సైబర్ సెక్యూరిటీ పద్ధతులను మెరుగుపరుస్తోంది. తాజా ఆదేశాల ప్రకారం చైనాలో పనిచేస్తున్న ఆ కంపెనీ ఉద్యోగులు తాము పని చేసే కంప్యూటర్లు, ఫోన్లకు లాగిన్ అయినప్పుడు గుర్తింపు ధ్రువీకరణ కోసం కేవలం ఆపిల్ పరికరాలను మాత్రమే ఉపయోగించాలి.

డేటాకు ముప్పు లేకుండా..

చైనాలో గూగుల్ ప్లే సేవలు లేవు. హువాయ్, షియోమి వంటి స్థానిక కంపెనీలు తమ సొంత ప్లాట్ ఫాంలను డెవలప్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ ఫోన్ల ను ఉపయోగించడం వల్ల డేటాకు ఏదైనా ముప్పు ఏర్పడుతుందని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అలాగే చైనా కూడా మైక్రోసాఫ్ట్ లాంటి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారు చేయడానికి ప్రయత్నాలు చేయడం కూడా దీనికి ప్రధాన కారణం.

సిబ్బందికి పరికరాలు..

ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్లను ఉపయోగిస్తున్న సిబ్బందికి ఐఫోన్ 15 పరికాలను అందజేస్తోంది. గూగుల్ సేవలు అందుబాటులో ఉన్న హాంకాంగ్‌తో సహా చైనాలోని వివిధ హబ్‌లలో వీటిని అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది.

హ్యాకర్ల నుంచి రక్షణ..

ఇటీవల పెరుగుతున్న భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ ఈ చర్య తీసుకుంది. హ్యాకర్ల నుంచి ఆ కంపెనీ పదే పదే దాడులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఎస్ఎఫ్ఐ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన భద్రత చర్యలకు నడుంబిగించింది.

సైబర్ భద్రత..

మైక్రోసాఫ్ట్ తీసుకున్న కొత్త నిర్ణయాన్ని బహిరంగంగా తెలియజేయలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రతను మెరుగుపరచడానికి ఆ కంపెనీ తీసుకున్న చర్యగా దీనిని భావిస్తున్నారు. క్లౌడ్ దుర్బలత్వాలను వేగంగా పరిష్కరించడం, క్రెడెన్షియల్ రక్షణను బలోపేతం చేయడం, ఉద్యోగుల కోసం బహుళ కారకాల ప్రమాణీకరణను అమలు చేయడం వంటివి దీనిలో ఉన్నాయి.

Best Seeds to Eat: ఈ విత్తనాలు ఆరోగ్యానికి దివ్యౌషధం.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో..

రోగ్యమే మహా భాగ్యం ఇది మనకు చిన్నప్పటి నుంచి పెద్దలు నేర్పుతున్నదే. ఇది నిజం కూడా. అందుకే మనం తినే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యంగా ఉండడానికి తినే ఆహారం సమతుల్యంగా ఉండేలా ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్, ఫైబర్ వంటి అనేక పోషకాలను చేర్చుకుంటాము. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, చిరు ధాన్యాలు, పాల ఉత్పత్తులలో మనకు ఈ పోషకాలు లభిస్తాయి. అయితే పండ్లు, కూరగాయలతో పాటు.. కొన్ని రకాల విత్తనాలు కూడా ఆహారంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ విత్తనాలను అనేక విధాలుగా తినే ఆహారంలో చేర్చుకోవచ్చు. అంతేకాదు ఈ విత్తనాల సహాయంతో అనేక ఆరోగ్యకరమైన వంటకాలను కూడా చేయవచ్చు.

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. నేడు సూపర్‌ఫుడ్‌ల వలె పనిచేసే అనేక విత్తనాలు ఉన్నాయి. వీటిల్లో శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి అనేక పోషకాలను అందించే బెస్ట్ సీడ్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.. వీటిని తినే ఆహారంలో భాగంగా చేసుకుంటే.. ఆరోగ్యం కూడా ఉంటారు.

పొద్దుతిరుగుడు విత్తనాలు: పొద్దుతిరుగుడు విత్తనాలు లేదా పొద్దుతిరుగుడు గింజలను ఇతర డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ గింజల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. అంతేకాదు అదనంగా ఇందులో చాలా ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫైబర్ ఉన్నాయి. దీని కారణంగా గుండె ఆరోగ్యం ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలను ఆరోగ్యంగా ఉంచడంలో పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నాయి.

నువ్వులు: నలుపు లేదా తెలుపు నువ్వులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ చిన్న గింజలు ఎన్నో రకాల పోషకాల భాండాగారం. ఇవి రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో సహకరిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని ఎముకలు ధృడంగా తయారవుతాయి.

గుమ్మడి గింజలు: గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. వీటిల్లో అమైనో ఆమ్లాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటు, జింక్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరం బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు రోజూ గుమ్మడి గింజలను తింటే బరువు అదుపులో ఉంటుంది.

అవిసె గింజలు: అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉత్తమమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా వీటిలో ఉంటాయి. అందుకని అవిసె గింజలను పొడిని తయారు చేసుకుని లేదా సలాడ్ రూపంలో తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మలబద్ధకం లేదా ఏదైనా కడుపు సంబంధిత సమస్య ఉంటే.. తప్పనిసరిగా తినే ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది.ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

ఉద్యోగాల జాతర.. 55,000 పోస్టులకు నోటిఫికేషన్.. ఇదే కదా నిరుద్యోగులకు కావాల్సింది..

మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇండియా పోస్ట్, ఐబీపీఎస్, ఎస్‌ఎస్‌సీ వంటి సంస్థలు జాబ్ నోటిఫికేషన్స్ జారీ చేశాయి.

ఈ రిక్రూట్‌మెంట్స్‌ డ్రైవ్స్‌తో ఏకంగా 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఆ నోటిఫికేషన్స్ ఏవో చూద్దాం.

* ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్

ఇండియా పోస్ట్ జీడీఎస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడుతోంది. ఈ నోటిఫికేషన్‌తో 35,000 ఖాళీలు భర్తీ కానున్నాయి. పదో తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్‌ను ఆపరేట్ చేయడం తెలిసి ఉండాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ జూన్ 25న ప్రారంభం కాగా, ఈ గడువు జులై 15న ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక పోర్టల్ indiapostgdsonline.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

* SSC MTS రిక్రూట్‌మెంట్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 8,326 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.18000 నుంచి రూ.22,000 మధ్య లభిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఎస్‌సీసీ పోర్టల్ ssc.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ జులై 31న ముగుస్తుంది.

* ఐబీపీఎస్

ఐబీపీఎస్ 6,128 క్లర్క్ పోస్ట్‌ల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాచిలర్ డిగ్రీ చదివినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ.19,900 నుంచి రూ.47,920 మధ్య లభిస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు గరిష్టంగా 27 సంవత్సరాల లోపు ఉండాలి. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ibpsonline.ibps.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు జులై 21న ముగుస్తుంది.

* IDBI బ్యాంక్ రిక్రూట్‌మెంట్

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) 31 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. బ్యాచిలర్ డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 25-45 సంవత్సరాల మధ్య ఉండాలి. జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 1,000; SC, ST, PwD కేటగిరీ అభ్యర్థులు రూ. 200 ఫీజు చెల్లించాలి.

* హెచ్‌ఎస్‌ఎస్‌సీ

హర్యాణా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (HSSC) 6,000 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. ఇంటర్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ hssc.gov.in విజిట్ చేయాలి.

Gold Price Today: హమ్మయ్యా.! బంగారం ధరలు భారీగా దిగొచ్చాయ్.. తులం ఎంతుందంటే.?

పిరి పీల్చుకో వినియోగదారుడా.. బంగారం ధరలు భారీగా తగ్గాయి. గడిచిన వారం రోజులుగా పైపైకి ఎగబాకుతున్న గోల్డ్ రేట్స్‌కి చెక్ పడింది. మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఇది గోల్డ్ లవర్స్‌కి కాస్త రిలీఫ్‌ను ఇచ్చే అంశం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగినప్పటికీ.. దేశీయంగా ఆ ప్రభావం కనిపించకపోవడం గమనార్హం. అయితే వచ్చేది పండుగల సీజన్ కాబట్టి.. మరోసారి బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరగనుంది. దీంతో గోల్డ్ రేట్స్ మళ్లీ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 2 రోజులుగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 600 మేరకు తగ్గింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 550 మేర దిగింది. ఈ క్రమంలో జులై 10న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67 వేల 100 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులానికి రూ. 73 వేల 200 పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 67 వేల 250 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ. 73 వేల 350 వద్ద ఉంది.

వెండి ధరలు..

వెండి కూడా బంగారం బాటలో పయణిస్తోంది. గత వారం రోజులుగా పెరుగుతూపోతోన్న వెండి ధరలకు బ్రేక్ పడింది. గడిచిన 2 రోజుల్లో రూ. 1000 మేరకు తగ్గింది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి రూ. 99 వేల దగ్గర ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ. 93900గా, ముంబై, ఢిల్లీలలో రూ. 94,500గా కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి రూ. 95,100 వద్ద ఉంది.

Postal Jobs: నిరుద్యోగులకు శుభవార్త..35వేల పోస్టుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..పూర్తి వివరాలివే

Postal Jobs: ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు అదిరిపోయే వార్తను అందించింది. దాదాపు 35వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటే..దేశవ్యాప్తంగా పలు పోస్టల్ సర్కిళ్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు అర్హులైన నిరుద్యోగుల నుంచి పోస్టల్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉండగా..ఎలక్షన్ కోడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నోటిఫికేషన్ ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 35000 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు పదవ తరగతి పూర్తి చేయాలి. ఎంపిక విధానం కూడా పదో తరగతి మార్కుల ఆధారంగానే ఉంటుంది. పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఈపోస్టులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18ఏండ్ల నుంచి 40ఏండ్ల మధ్య ఉండాలి.

ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీపీఎం, ఏబీఏం వంటి పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ. 10వేల నుంచి రూ.12వేల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ https://indiapostgdsonline.gov.in/ సందర్శించి తెలుసుకోవచ్చు. గతేడాది 50వేలకు పైగా జీడీఎం పోస్టులను భర్తీ చేశారు.

కంటి చికిత్స: కోత లేదు కుట్టడం లేదు, మీరు అద్దాలకు ‘టాటా’ చెప్పవచ్చు. మీ కంటి చూపు ఐదు నిమిషాల్లో తిరిగి వస్తుంది.

మేము శరీరంలోని అతి ముఖ్యమైన భాగం గురించి మాట్లాడినట్లయితే, అప్పుడు కళ్ళ పేరు ఖచ్చితంగా తీసుకోబడుతుంది, ఎందుకంటే వారి లోపం జీవితంలో చీకటిని సృష్టిస్తుంది .

ఈ రోజుల్లో జీవనశైలి చాలా బిజీగా మారింది, ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు మరియు ల్యాప్‌టాప్‌లపైనే గడుపుతున్నారు మరియు ఇది కళ్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

దీనివల్ల కంటిచూపు బలహీనమవుతుంది. అటువంటి పరిస్థితిలో, అటువంటి శస్త్రచికిత్స గురించి మేము మీకు చెప్తున్నాము, ఇందులో ఎటువంటి కోత లేదా కుట్టు ఉపయోగించబడదు. కేవలం ఐదు నిమిషాల శస్త్రచికిత్సతో మీ కంటి చూపు మెరుగుపడుతుంది.

ముఖ్యాంశాలలో సిల్క్ ఐ సర్జరీ

కళ్లు బలహీనంగా ఉన్నప్పుడు అద్దాలు పెట్టుకోవాలని ప్రతి ఒక్కరూ సలహా ఇస్తుంటారు. అద్దాలు ధరించడంలో ఇబ్బంది ఉంటే, కాంటాక్ట్ లెన్స్‌ల ఎంపికను సూచిస్తారు, కానీ మేము మీకు చెబుతున్న శస్త్రచికిత్సతో, మీ కంటి చూపు కేవలం ఐదు నిమిషాల్లో సరిచేయబడుతుంది. ఈ శస్త్రచికిత్స పేరు సిల్క్ ఐ సర్జరీ, ఇది ప్రస్తుతం ముఖ్యాంశాలలో ఉంది.

ఈ శస్త్రచికిత్స ఎలా జరుగుతుంది?

సిల్క్ ఐ సర్జరీకి సంబంధించిన ఒక అధ్యయనం నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI)లో ప్రచురించబడింది. ఈ సర్జరీలో సెకండ్ జనరేషన్ ఫెమ్టోసెకండ్ లేజర్ టెక్నిక్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ శస్త్రచికిత్స ద్వారా, కార్నియా తిరిగి ఆకారంలో ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఖచ్చితమైనది. విశేషమేమిటంటే ఈ సర్జరీలో ఎలాంటి కోత ఉండదు.

ఐదు నిమిషాల్లో సర్జరీ అయిపోతుంది

సమాచారం ప్రకారం, ఈ శస్త్రచికిత్సకు ముందు, రోగి యొక్క కళ్లను పరీక్షించారు. దీని తరువాత, కళ్ళు తిమ్మిరి చేయడానికి కంటి చుక్కలను ఉపయోగిస్తారు. సర్జన్లు ఫెమ్టోసెకండ్ లేజర్‌ను ఉపయోగిస్తారు మరియు కార్నియాలో చాలా చిన్న కోతను చేస్తారు. దీని తరువాత కార్నియాలో లెంటిక్యూల్ ఏర్పడుతుంది. వైద్యుల ప్రకారం, ఈ సమయంలో ఒక కన్ను లేజర్ చేయడానికి 10 నుండి 15 సెకన్లు మాత్రమే పడుతుంది. అదే సమయంలో, మొత్తం శస్త్రచికిత్స కేవలం ఐదు నిమిషాల్లో చేయబడుతుంది.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం

సిల్క్ ఐ సర్జరీ చేయించుకోవడానికి, రోగికి కనీసం 22 సంవత్సరాల వయస్సు ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ శస్త్రచికిత్స చేయించుకోకూడదు. అదే సమయంలో, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు ఆహారం ఇచ్చే వారు కూడా దూరంగా ఉండాలి. విశేషమేమిటంటే మయోపియా రోగులకు ఈ సర్జరీ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ సర్జరీ చేయించుకునే ముందు కచ్చితంగా కంటి పరీక్ష చేయించుకోండి. ఇది కాకుండా, డాక్టర్ మీ వైద్య చరిత్ర గురించి పూర్తి సమాచారాన్ని అందించాలి. ఈ శస్త్రచికిత్స చేయించుకునే ముందు, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

నిరాకరణ: వార్తల్లో ఇచ్చిన కొన్ని సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంటుంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, మీరు తప్పనిసరిగా సంబంధిత నిపుణులను సంప్రదించాలి.

Google Map: గూగుల్‌ మ్యాప్స్‌లో ఇల్లు, కార్యాలయం, దుకాణం లోకేషన్‌ను నమోదు చేయాలా? ఇలా చేయండి!

నేటి డిజిటల్ యుగంలో Google Maps మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మనం తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు గూగుల్‌ మ్యాప్‌ మనకు తోడుగా మారుతుంది.

దీని నావిగేషన్ సేవ మీరు ఏ ప్రదేశానికి చేరుకోవాలో సహాయపడుతుంది. మీకు కావాలంటే, మీరు దీని ద్వారా మీ వ్యాపారాన్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. మీ ఇల్లు, కార్యాలయం, దుకాణం చిరునామాను జోడించడానికి Google Maps మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ షాప్ లేదా ఆఫీస్ అడ్రస్ Google Mapsలో ఉంటే, కస్టమర్‌లు మీ చిరునామాను కనుగొనడం సులభం అవుతుంది.

మీరు ఎక్కడైనా బయట ఉన్నప్పుడు, ఇంటికి చేరుకోవడానికి గూగుల్‌ మ్యాప్‌ లో మీ ఇంటి చిరునామాను నమోదు చేయాలి. కానీ మీరు మీ ఇంటి చిరునామాను గూగుల్‌ మ్యాప్‌కు జోడించినట్లయితే, మీరు మీ ఇంటి చిరునామాను మళ్లీ మళ్లీ నమోదు చేయవలసిన అవసరం లేదు. మీరు ఇంటి చిరునామాను నేరుగా ఎంచుకోవచ్చు. మీరు ఉన్న ప్రదేశం నుండి మీ ఇంటికి మార్గం రూపొందించబడుతుంది. అప్పుడు మీరు నావిగేషన్ ద్వారా సులభంగా మీ ఇంటికి చేరుకోవచ్చు.

గూగుల్‌ మ్యాప్‌లో ఇంటి చిరునామాను ఇలా జోడించండి

  • Google మ్యాప్స్ యాప్‌ను తెరవండి.
  • ఇప్పుడు మీ గూగుల్‌ ఖాతాను నిర్వహించండికి వెళ్లండి.
  • ఇక్కడ నుండి మీరు నేరుగా మీ గూగుల్‌ ఖాతాకు వెళతారు.
  • గూగుల్‌ ఖాతాకు వెళ్లి వ్యక్తిగత సమాచారాన్ని ఎంచుకోండి.
  • ఇక్కడ మీరు చిరునామాల ఎంపికను పొందుతారు.
  • మీరు ఇల్లు, కార్యాలయం, ఇతర చిరునామాలలో ఏదైనా ఎంపికను ఎంచుకోవచ్చు.
  • ఇంటి చిరునామాలను జోడించడం ప్రారంభించండి.

గూగుల్‌ మ్యాప్‌కు వ్యాపార చిరునామాను జోడించండి:

మీరు గూగుల్‌ మ్యాప్స్‌లో దుకాణం లేదా కార్యాలయం చిరునామాను జోడించాలనుకుంటే, దీని కోసం మీరు వ్యాపార ప్రొఫైల్‌ను సృష్టించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. గూగుల్ మ్యాప్స్‌లో షాప్ లేదా ఆఫీస్ చిరునామాను యాడ్ బిజినెస్ అడ్రస్ అంటారు. మీరు ఈ చిరునామాను గూగుల్‌ మ్యాప్స్‌కి ఎలా జోడించవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

  • గూగుల్‌ మ్యాప్‌ యాప్‌ని తెరవండి.
  • యాప్ దిగువన కాంట్రిబ్యూట్ ఎంపికను ఎంచుకోండి.
  • స్థలాన్ని జోడించడం ద్వారా ఇది మీ వ్యాపారమా? అనే ఆప్షన్‌పై నొక్కండి.
  • ఇప్పుడు మీరు Chrome బ్రౌజర్‌కి వెళతారు.
  • ఇక్కడ, వ్యాపార పేరు, వ్యాపార వర్గం మొదలైన వ్యాపారానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • మొబైల్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. దానిపై OTP వస్తుంది.
  • OTPని నమోదు చేయడం ద్వారా ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి.
  • ఇప్పుడు వ్యాపారం స్థానాన్ని సెట్ చేయండి.
  • ఇక్కడ మీరు పని సమయాలు, వెబ్‌సైట్ వంటి వివరాలను ఇవ్వాలి.
  • మీ దుకాణం, కార్యాలయం లేదా వ్యాపార కేంద్రం ఫోటోను అప్‌లోడ్ చేయండి.
  • ఈ వ్యాపార చిరునామాను గూగుల్‌ మ్యాప్స్‌కి జోడించడానికి అభ్యర్థనను సమర్పించండి.
  • వ్యాపార చిరునామాను జోడించడానికి మీరు అందించిన సమాచారాన్ని గూగుల్‌ తనిఖీ చేస్తుంది. ప్రతిదీ సరిగ్గా ఉంటే, Google మ్యాప్స్‌లో మీ దుకాణం, కార్యాలయం చిరునామాను గూగుల్‌ జోడిస్తుంది.

Hyderabad: ఇకపై హైదరాబాద్ టూ తిరుపతి ప్రయాణం.. రయ్.. రయ్‌మని దూసుకెళ్లిపోవచ్చు

తెలంగాణలో రహదారుల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ అంశంపై అధికారులకు కీలక సూచనలు చేయడంతో పాటు..

సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు సీఎం రేవంత్. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు.. సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రహదారుల నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని వెంటనే తొలగిస్తామన్నారు.

రాష్ట్రంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపడుతున్న రహదారుల నిర్మాణంలో భూ సేకరణతో పాటు పలు ఇబ్బందులు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. ఆయా సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రహదారుల నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు ఈ భేటీలో పాల్గొంటారని, ఆయా సమస్యలపై చర్చించి అక్కడే సమస్యలను పరిష్కరించుకుందామని సీఎం సూచించారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో 12 రేడియల్ రోడ్లు వస్తాయి. వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు తీర ప్రాంతం లేనందున బందర్ పోర్టును అనుసంధానించేలా హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక హైదరాబాద్ -కల్వకుర్తి జాతీయ రహదారి నిర్మిస్తే తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. మన్నెగూడ రహదారి పనులనూ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఎన్‌హెచ్ఏఐ అధికారులకు సూచించారు.

కాంట్రాక్ట్ సంస్థతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలని వారికి సూచించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్‌-విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు కోసం ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలను అధికారుల దృష్టికి సీఎం తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సహకరించాలని అధికారులను సీఎం కోరారు.

AP News: భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..

భోగాపురం ఎయిర్‌పోర్ట్.. ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ కల. దీనిని సాకారం చేసి తీరుతామంటోంది ఎన్డీయే సర్కార్. ఈ ఎయిర్‌పోర్ట్ ఎప్పటిలోపు పూర్తి చేయాలనే దానిపై డెడ్‌లైన్ కూడా పెట్టుకున్నారు కేంద్రమంత్రి రామానాయుడు.

పౌరవిమానయాన మంత్రిగా కింజారపు రామ్మోహన్ ఉండటంతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై ఉత్తరాంధ్రవాసులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అతి త్వరలోనే ఈ ఎయిర్‌పోర్ట్ పూర్తై అందుబాటులోకి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వారి అంచనాలకు తగినట్టుగానే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్‌పోర్ట్‌ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రామ్మోహన్.. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలన్నారు.

విశాఖకు గుండెకాయ లాంటి భోగాపురం ఎయిర్‌పోర్టును 2026 నాటికి పూర్తి చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఆ ఎయిర్‌పోర్ట్ పూర్తైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఇప్పటికే నీటి ప్రాజెక్టులు, అమరావతి, విద్యుత్ శాఖపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు, మరోవైపు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. జూలై 11న విశాఖ వెళ్తున్న సీఎం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను కూడా పరిశీలిస్తారు. ఇప్పటి వరకూ పూర్తి చేసిన పనులపై నివేదిక తీసుకోనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై అక్కడి అధికారులను అడిగి మరింత సమాచారం తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను హోం మంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షిస్తున్నారు.

Kalki 2898 AD OTT: ప్రభాస్ ‘కల్కి’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ స్పెషల్ డే నుంచే స్ట్రీమింగ్!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జానర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు. ఇలా భారీ తారాగణంతో జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.900 కోట్లు దాటేసిన ప్రభాస్ రూ. 1000 కోట్ల మార్క్ కు అతి చేరువలో ఉంది. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోనూ కల్కి కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. నాగ్ అశ్విన్ టేకింగ్, ప్రభాస్, అమితాబ్, దీపికల యాక్టింగ్, గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ కల్కి కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో జనాలు థియేటర్లలకు పరుగుల పెడుతున్నారు.

ప్రస్తుతం థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తోన్న కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ సొంతం చేసుకున్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఒక్క హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

ఇదిలా ఉంటే థియేట్రికల్ రిలీజ్ తర్వాత సుమారు 7-8 వారాల తర్వాతే కల్కి ను ఓటీటీలోకి తీసుకురావాలని కల్కి నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ముందే డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి ‘కల్కి’ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది ను చూసే అవకాశముంది. కాబట్టి ఓటీటీ సంస్థలు కూడా ఈ తేదీనే లాక్ చేయనున్నాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. మరికొన్ని రోజులు ఆగితే కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పై ఫుల్ క్లారిటీ రానుంది.

అనంత-రాధికల పెళ్లికి ఫోటోగ్రఫీ ఎవరు? ఇతను రోజుకు ఎంత ఫీజు తీసుకుంటాడో తెలిస్తే షాకవుతారు

భారతదేశపు అతిపెద్ద వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు.

జులై 12న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.

ఆసియాలోని అత్యంత ధనవంతుడి కుమారుడు ఐరోపాలోని విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లో వివాహానికి ముందు వేడుకను జరుపుకున్నాడు. అయితే ఇప్పుడు అందరికి చూపు ఫోటోగ్రఫీ ఎవరన్నదానిపై ఆసక్తిగా ఉంది. ఇంతకు అంబానీ పెళ్లి వేడుకలో ఎవరు ఫోటోలు తీస్తారనేదానిపై చాలా మంది సెర్చ్‌ చేస్తున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ వీరి పెళ్లికి ఫోటో షూట్‌ చేయనున్నారు. ఫోటోగ్రఫీలో జోసెఫ్‌ రాధిక్‌కు మంచి పేరుంది.

జోసెఫ్‌ రాధిక్‌ ఇంతకు ముందు విరాట్‌ కోహ్లీ- అనుస్క, జస్ప్రిజ్‌ బుమ్రా-సంజన, రాజ్‌కుమార్‌రావ్‌ -పత్రలేఖ, ప్రియాంక చోప్రా-నిక్‌ జోనాస్‌ వంటి ప్రముఖల వివాహాలకు ఇతనే ఫోటో షూట్‌ చేశాడు. జోసెఫ్‌ రాధిక్‌కి ఫోటోగ్రఫీ అంటే మక్కువ. కాలేజీలో ఇంజనీరింగ్‌,మేనేజ్‌మెంట్‌ చదివాడు. ఇతనున 2001లో తన ఫోటోగ్రఫీను ప్రారంభించాడు. జోసెఫ్‌ రాధిక్‌ ప్రముఖ వెడ్డింగ్‌ డిజైనర్‌ని వివాహం చేసుకున్నారు. అయితే మీడియా కథనాల ప్రకారం.. జోసెఫ్‌ రాధిక్‌ రోజుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు (అన్ని పన్నులతో కలిపి) తీసుకుంటారట. అంతేకాదు అతను తన ఫోటోగ్రఫీ రుసుముతో పాటు ప్రయాణ/బస ఛార్జీలు కూడా వేరుగా వసూలు చేస్తారట.

NEET-UG Paper Leak Case: నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌.. ఇప్పటివరకు ఎందరు అరెస్టయ్యారంటే!

నీట్‌ యూజీ పేపర్ లీక్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసింది.

అరెస్టవారిలో ఒకరు నీట్‌ అభ్యర్థి కాగా, మరొకరు మరో నీట్ అభ్యర్థి తండ్రిగా సీబీఐ వెల్లడించింది. వీరిద్దరూ బీహార్‌కు చెందినవారిగా దర్యాప్తు సంస్థ తెలిపింది. నీట్‌-యూజీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నీట్‌ అభ్యర్థిని సీబీఐ నేరుగా అరెస్టు చేయడం ఇదే తొలిసారి. తాజాగా అరెస్ట్‌ అయిన ఇద్దరిలో ఒకరు నలందకు చెందిన నీట్‌-యూజీ అభ్యర్థి సన్నీ, మరొకరు గయాకు చెందిన మరో అభ్యర్థి తండ్రి రంజిత్‌ కుమార్‌గా సీబీఐ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 11కు చేరిందని అధికారులు మంగళవారం (జులై 9) తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు బీహార్ నీట్-యుజి పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 8 మందిని, గుజరాత్‌లోని లాతూర్, గోద్రాలో ఇద్దరిని, డెహ్రాడూన్‌కు చెందిన ఒకరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

కాగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో MBBS, BDS, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సులలో ప్రవేశాలకు నీట్‌ యూజీ 2024 పరీక్షనుఈ ఏడాది మే 5న విదేశాల్లో 14 సహా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే పేపర్‌ లీక్‌తోపాటు గ్రేస్‌ మార్కులు కలపడంపై దుమారం రేగింది. పైగా 67 మందికి ఫస్ట్‌ ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్‌ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి కొత్త ర్యాంకు కార్డులు జారీ చేసింది. మరోవైపు నీట్‌ పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం వీటన్నింటినీ కోర్డు విచారిస్తోంది. విచారణ పూర్తయ్యేంత వరకు నీట్ కౌన్సెలింగ్‌ నిర్వహించకూడదని కోర్టు ఆదేశించడంతో.. అప్పటి వరకు కేంద్రం కౌన్సెలింగ్‌ను వాయిదా వేసింది.

Gold Storage: ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు? పరిమితికి మించి ఉంటే ఏమవుతుంది?

భారతీయులకు బంగారు ఆభరణాలపై మంచి ప్రేమ ఉంది. ఈ బంగారం అన్నింటికంటే ఉపయోగపడుతుంది. మహిళలు కూడా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

ఏదైనా శుభ సందర్భంలో బంగారం లేదా వెండిని కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఈ బంగారం ధర ఆకాశాన్ని తాకింది. అయితే మన ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? దీని గురించి తెలుసుకుందాం.

మీకు ఆదాయం లేదా పన్ను మినహాయింపు ఆదాయం నుండి బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే. లేదా మీరు వారసత్వం ద్వారా బంగారం పొందినట్లయితే, మీరు దానిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే పరిమిత వరకు పొందిన బంగారు ఆభరణాలను ప్రభుత్వం జప్తు చేయదు. అయితే పరిమితికి మించి బంగారం కొనుగోలు చేసినట్లయితే బంగారం కొనుగోలు రశీదు చూపించాలి.

ఇంట్లో ఉంచుకున్న బంగారాన్ని అమ్మితే పన్ను కట్టాల్సిందే. మీరు మూడేళ్ల తర్వాత బంగారాన్ని విక్రయిస్తే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) అని పిలుస్తారు. దీనికి 20 శాతం పన్ను విధిస్తారు.

వారసత్వంగా వచ్చిన బంగారంపై పన్ను:

మీరు మూడు సంవత్సరాలలోపు బంగారు బాండ్‌ను విక్రయిస్తే, లాభం మీ ఆదాయానికి జోడిస్తారు. అలాగే ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. మీరు మూడు సంవత్సరాల తర్వాత బంగారు బాండ్‌ను విక్రయిస్తే, లాభం సూచికతో 20 శాతం పన్ను విధించబడుతుంది. ఇండెక్సేషన్ లేకుండా 10 శాతం. కానీ మీరు మెచ్యూరిటీ వరకు గోల్డ్ బాండ్‌ను కలిగి ఉంటే, లాభంపై పన్ను ఉండదు.

భారతదేశంలో మనం ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు?

1. భారతదేశంలో వివాహిత మహిళ 500 గ్రాముల బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు.

2. పెళ్లికాని మహిళ 250 గ్రాముల వరకు బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు.

3. పురుషులు 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవడానికి అనుమతిస్తారు.

Fitness: వారానికి ఎన్ని గంటలు వ్యాయామం అవసరమో తేల్చి చెప్పిన నివేదిక..

ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే కూడూ, గూడు, గుడ్డ అవసరం. కానీ ఇప్పుడు పరిస్తితి మారింది. మంచి ఆహారం, రక్షిత తాగునీరు, సరైన వ్యాయామం తప్పని సరి అంటున్నారు నిపుణులు.

ఒకప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్లు. అది నిజమే అనిపిస్తోంది. దీనికి కారణం ఏదైనా జబ్బు చేస్తే దానికి అయ్యే ఖర్చు కనీసం అంటే వేలల్లో ఉంటుంది.

రెండు వేలు ఖర్చు అయిపోయిందంటే ఒక మధ్య తరగతి కుటుంబానికి అరనెలపాటు సరుకులు వస్తాయి. వైద్యానికి చాలా ఖరీదైపోయింది. అందుకే ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పటి ఆధునిక యుగంతో యువత 70శాతానికి పైగా వ్యాయామంపై శ్రద్ద చూపడంలేదు. సరైన ఆహారం తీసుకోవడం లేదు.

ఇక మంచినీళ్లు తాగే విషయానికి వస్తే అస్సలు పట్టించుకోవడంలేదు. తద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరేప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. వీటన్నింటికీ చెక్ పెట్టి సంపూర్ణమైన ఆరోగ్యంగా జీవించాలంటే సరైన నిద్రతో పాటు వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం తప్పని సరి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది.

వ్యాయామానికి సరైన సమయం కేటాయించడం లేదని లాన్సెట్ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. వ్యాయామాన్ని ఐదేళ్ల వయసు నుంచే అలవరుచుకోవాలని తెలిపింది. వృద్దులైనప్పటికీ కనీసం వ్యాయామం చేయాలని సూచిస్తోంది. వ్యాయామాన్ని చేయకపోవడం వల్ల 10కోట్లకు పైగా ప్రజలు డయాబెటిస్‎కి గురవుతున్నట్లు చెబుతోంది.

పట్టుమని 30ఏళ్లు నిండకముందే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని అధ్యయనంలో వెల్లడైనట్లు చెబుతున్నారు. దేహం నిండా చెమటలు పట్టే వ్యాయామాలు, క్రీడలు అవసరమని తెలిపింది. వ్యాయామం చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగానూ ధైర్యంగా ఉండవచ్చని చెబుతున్నారు వైద్యనిపుణులు. డిప్రెషన్ , యాంగ్జైటీ, టెన్షన్, బ్రెయిన్ ప్రెజర్ నుంచి రిలీవ్ కలుగుతుందంటున్నారు మానసిక నిపుణులు.

Income Tax Return: ఈ 10 చిట్కాలు పన్ను చెల్లింపుదారులకు రిటర్నులు దాఖలు చేయడంలో ఉపయోగపడతాయి!

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే తేదీ జూలై 31తో ముగుస్తుంది. అందువల్ల, పన్ను చెల్లింపుదారులు తమ వద్ద రిటర్న్‌లు దాఖలు చేయడానికి సంబంధించిన అన్ని అవసరమైన సమాచారం, పత్రాలు ఉన్నాయని వీలైనంత త్వరగా నిర్ధారించుకోవాలి.

పన్ను నిబంధనలకు అనుగుణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం ముఖ్యం. జరిమానాల పడకుండా ఉండేందుకు సమయానికి పూర్తి చేయాలి. పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లు దాఖలు చేయడంలో ఉపయోగపడే చిట్కాల గురించి తెలుసుకుందాం.

అవసరమైన అన్ని పత్రాలను సేకరించండి. ఫారం 16, ఫారం 26AS, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్, ఇతర ఆదాయ వనరుల వివరాలు వంటి అన్ని అవసరమైన పత్రాలు మీ వద్ద ఉన్నాయని నిర్ధారించుకోండి.
సరైన ఐటీఆర్‌ ఫారమ్‌ను ఎంచుకోండి.

మీ ఆదాయ వనరు, వర్గం (జీతం, స్వయం ఉపాధి మొదలైనవి) ఆధారంగా సరైన ఐటీఆర్‌ ఫారమ్‌ను ఎంచుకోండి.
అన్ని ఆదాయ వనరుల గురించి సమాచారాన్ని అందించండి. జీతం, అద్దె, డిపాజిట్లపై వడ్డీ, డివిడెండ్‌లు, మూలధన లాభాలు వంటి అన్ని రకాల ఆదాయాలను మీ ఆదాయంలో చేర్చండి.
టీడీఎస్‌ వివరాలను తనిఖీ చేయండి. ఖచ్చితమైన సమాచారం కోసం ఫారం 26ASలో టీడీఎస్‌ వివరాలను తనిఖీ చేయండి.
క్లెయిమ్ రాయితీలు. మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవడానికి ఆదాయపు పన్నులోని 80C, 80D, 80E మొదలైన సెక్షన్‌ల కింద లభించే మినహాయింపుల ప్రయోజనాన్ని పొందండి.
పన్ను శాఖతో పూర్తి పారదర్శకతను నిర్ధారించడానికి, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం వంటి పన్ను మినహాయింపు ఆదాయం గురించి సమాచారాన్ని కూడా అందించండి.
ముందుగా మీ స్వీయ-అసెస్‌మెంట్ ఆధారంగా పన్ను చెల్లించండి.

తద్వారా మీరు రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు జరిమానాలు, వడ్డీని నివారించవచ్చు.
మీరు గత సంవత్సరం ఏదైనా నష్టాన్ని చవిచూసి, ప్రస్తుత సంవత్సరంలో దానిని ముందుకు తీసుకువెళ్లడానికి అవకాశం ఉంటే, మీరు దానిని ప్రస్తుత సంవత్సరం ఆదాయం ద్వారా భర్తీ చేయవచ్చు.
రిటర్న్‌ని ధృవీకరించండి. అలాగే ధృవీకరించండి. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను పూర్తిగా ధృవీకరించండి. ఆధార్ OTP, ITR-Vని EVC లేదా CPC, బెంగళూరుకు పంపడం ద్వారా మీ రిటర్న్‌ను ధృవీకరించండి.
రసీదులను సురక్షితంగా ఉంచండి. భవిష్యత్ సూచన కోసం, రిటర్న్ ఫైలింగ్ రుజువుగా రసీదు (ITR-V)ని సురక్షితంగా ఉంచండి.

Reliance Jio: జియో కస్టమర్ల కోసం కొత్త ‘ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్’ యాడ్-ఆన్ ప్లాన్స్‌

ఇటీవలి రిలయన్స్‌ జియో టారిఫ్ పెంపు తర్వాత ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని సరసమైన ప్లాన్‌లను తొలగించిన విషయం తెలిసిందే.

అయితే మూడు కొత్త ‘ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్’ యాడ్-ఆన్ ప్లాన్‌లను నిశ్శబ్దంగా ప్రవేశపెట్టడంతో టెల్కో ఈ సమస్యను పరిష్కరించింది. మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్లాన్‌కి యాడ్-ఆన్‌గా ఉంటాయి.

వినియోగదారు 5G అనుకూల పరికరాన్ని కలిగి ఉంటే కొత్త ప్లాన్‌లు అపరిమిత 5G కనెక్టివిటీని అందిస్తాయి. అయితే, Jio True 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే అపరిమిత 5G డేటా అందుబాటులో ఉంటుంది. అలాగే ఫోన్‌ తప్పనిసరిగా 5Gకి మద్దతు ఇవ్వాలి.నెట్‌వర్క్ 4Gకి మారినట్లయితే, ప్లాన్‌లు పరిమిత డేటాను అందిస్తాయి.

1. రూ.151 ప్లాన్:

4G డేటా: అధిక వేగంతో 9GB
5G డేటా: అధిక వేగంతో అపరిమితంగా (Jio True 5G నెట్‌వర్క్‌లో 5G-మద్దతు ఉన్న ఫోన్‌ల కోసం)

2. రూ.101 ప్లాన్:

4G డేటా: అధిక వేగంతో 6GB
5G డేటా: అధిక వేగంతో అపరిమితంగా (Jio True 5G నెట్‌వర్క్‌లో 5G-మద్దతు ఉన్న ఫోన్‌లకు)

3. రూ.51 ప్లాన్:

4G డేటా: అధిక వేగంతో 3GB

అపరిమిత 5Gని అందించే రూ. 1559 ప్లాన్, రూ. 359 ప్లాన్ వంటి కొన్ని సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో తొలగించిన తర్వాత చాలా మంది X లో భాగస్వామ్యం చేస్తున్నారనే ఫిర్యాదులను కొత్త ప్లాన్‌లు పరిష్కరిస్తాయి.

ఈ ప్లాన్‌లు కాకుండా, 2GB/రోజు లేదా అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉన్న వినియోగదారులు మాత్రమే అపరిమిత 5G డేటాకు అర్హులు. రోజుకు 1.5GB లేదా అంతకంటే తక్కువ డేటాను అందించే ఏదైనా డేటా ప్యాక్ పరిమితిని ఖచ్చితంగా పాటించాలి.

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల అన్ని ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, డేటా-ఆన్ ప్లాన్‌లపై టారిఫ్‌లను పెంచాయి. ప్లాన్లను 25 శాతం వరకు పెంచారు. వార్షిక ప్లాన్లలో అత్యధిక ధర వ్యత్యాసం చూడవచ్చు. రూ.2,999 విలువైన డేటా ప్యాక్‌లను రూ.3,599కి పెంచారు.

ధరల పెంపు చాలా మంది టెలికాం వినియోగదారులలో అసంతృప్తికి దారితీసింది. ఇది Xలో ‘BoycottJio’ అంటూ పోస్టులు పెడుతున్నారు.. కొంతమంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నట్లు తెలుస్తోంది.

నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

మనిషి జీవితంలో ఆహారం అనేది ఎంత ముఖ్యమైనదో.. ఆ క్రమంలోనే నిద్ర కూడా అలాంటి కీ రోల్‌నే పోషిస్తుంది. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా..

ప్రతీ ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటలసేపు పడుకోవడం చాలా ముఖ్యం. లేదంటే.. వారికి రోజు మొత్తంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. మరి మన ఆరోగ్యంలో ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న నిద్ర గురించి పలు ఆసక్తికర విషయాలు మీకు తెల్సా.? మనం నిద్రపోయే భంగిమను బట్టి.. మన వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చునట. సాధారణంగా ప్రతీ ఒక్కరూ ఒకే విధానంలో నిద్రపోరు. కొందరు వెల్లికల్లా పడుకుంటే.. మరికొందరు బోర్లా.. ఇంకొందరు ఎడమవైపునకు తిరిగి.. అలాగే మరికొందరు కుడివైపునకు తిరిగి.. కాళ్లు ముడుచుకుని ఒకరైతే.. తల కింద చెయ్యి పెట్టు మరొకరు.. ఇలా ఎవరికి.. వారికే నిద్రపోయేటప్పుడు సెపరేట్ భంగిమలు ఉంటాయి. మరి వాటి ద్వారా వారి వ్యక్తిత్వాలను చెప్పొచ్చునని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పక్కకు తిరిగి కాళ్లు ముడుచుకుని పడుకుంటే..

ఇలా పడుకునేవారు చాలా కష్టపడి పనిచేస్తారట. అలాగే వీరు చాలా సెన్సిటివ్.. చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోతుంటారు. అలాగే వీరిలో అసంతృప్తి కూడా ఎక్కువే. ఇక కుడిచెయ్యి తలకింద పెట్టు.. కుడివైపునకు తిరిగి పడుకునేవారి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుందట. వీరి ఎంచుకునే పనుల్లో విజయం సాధించడమే కాదు.. అందరూ వెళ్లే మార్గంలో కాకుండా సెపరేట్ రూట్‌లో వెళ్లేందుకు ట్రై చేస్తుంటారు. వీరికి అధికారం, డబ్బు దండిగా ఉంటాయి. మరోవైపు ఎడమ చెయ్యి తలకింద పెట్టుకుని.. ఎడమవైపునకు తిరిగి పడుకునేవారికి మంచి గుణాలు ఎక్కువ. పెద్దలను గౌరవిస్తారు. పనిలో నిబద్దత ఉంటుంది. అయితే ఆత్మవిశ్వాసం మాత్రం తక్కువ. ఇక వీరిలో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ క్రియేటివిటీ.

వెల్లికల్లా పడుకునేవారు, బోర్లా పడుకునేవారు..

వెల్లికల్లా పడుకునేవారికి ఎక్కువ స్వేఛ్చ ఉంటుందట. వారు ఫ్రీ-బర్డ్ అని చెప్పొచ్చు. అలాగే వీరు నలుగురిలోనూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఇక బోర్లా పడుకునేవారు సంకుచిత స్వభావం కలిగి ఉంటారు. అవసరమైతేనే ఇతరులతో మాట్లాడతారు. ప్రతీ పనిలోనూ అలసత్వం, ఎలాంటి లక్ష్యం లేకపోవడం వీరి స్వభావం. ఒకవైపునకు తిరిగి రెండు కాళ్లు ముడుచుకుని పడుకునేవారు స్వార్ధపరులట. అంతేకాకుండా వీరిలో అసూయ, పగ, ప్రతీకారాలు ఎక్కువ. ఇక ఇలాంటి వారు ప్రతీ పనిని చూసి భయపడటమే కాదు.. దానికి దూరంగా పారిపోతారు. అలాగే వీరు త్వరగా ఇతరుల దగ్గర మోసపోతారు కూడా.

Kidney Stone: మీకు కిడ్నిల్లో రాళ్లు ఉన్నాయా? ప్రతిరోజు ఉదయం ఈ ఆకులు నమలండి .. కరిగిపోతాయ్‌

గుండె, కాలేయం వంటి శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. నేటి అనారోగ్యకరమైన జీవనశైలి కిడ్నీ వ్యాధి రేటును పెంచింది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల గురించి చాలా తక్కువగా వినిపిస్తుంటుంది.చాలామందికి కిడ్నీలో రాళ్లంటే మొదట్లో అర్థం కాదు.

తత్ఫలితంగా, చికిత్స చేయకుండా వదిలేస్తే, రాళ్ళు పరిమాణంలో పెరుగుతాయి.

దిగువ వీపు లేదా దిగువ పొత్తికడుపులో విపరీతమైన నొప్పికి దారి తీస్తుంది. ఇది మూత్రవిసర్జన కష్టానికి దారితీస్తుంది. కిడ్నీలో రాళ్లు రావడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో తక్కువ నీరు తాగడం, ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

కిడ్నీలో రాళ్లను నివారించడానికి ఉత్తమ మార్గం పుష్కలంగా నీరు తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. కిడ్నీలో రాళ్లు చిన్నవిగా ఉంటే మందులతో కరిగించవచ్చు. అలాగే కొన్ని చిట్కాల ద్వారా కూడా రాళ్లను కరిగించవచ్చు.

కిడ్నీలో రాళ్లను తొలగించే ఔషధాలలో పథర్చట్టా మొక్క ఒకటిగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ ఉదయం ఈ మొక్క ఆకులను నమలండి. ఫలితాలు కొద్ది రోజుల్లోనే కనిపిస్తాయి.
పాతరచట్ట చెట్లు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తాయి. కానీ మీరు ఇంట్లో ఉన్న టబ్‌లో కూడా ఈ మొక్కను నాటవచ్చు. అంతేకాకుండా, వర్షాకాలంలో చిత్తడి అటవీ ప్రాంతాలలో పాతర్చట్ట చెట్లు స్వయంగా పెరుగుతాయి.
మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లయితే, పాతరచట్టా మొక్కతో పాటు, క్యాన్డ్ వాటర్, నిమ్మ, సిట్రస్ పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పుల్లని పెరుగును మీ రోజువారీ ఆహారంలో తీసుకోండి. చిన్న రాళ్లను ఆహారం, మందుల ద్వారా పంపవచ్చు. మరోవైపు, మద్యం, శీతల పానీయాలు తీసుకోవద్దు.
కిడ్నీలో రాళ్లను తొలగించే మార్గాలలో పుష్కలంగా నీరు తాగడం ఒకటి. అయితే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, రాయి పరిమాణం పెద్దగా ఉంటే, శస్త్రచికిత్స లేకుండా తొలగించడం సాధ్యం కాదు.
(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. వీటిని అనుసరించే ముందు నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.

VRS తీసుకుని తప్పించుకోగలరా ?

ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ కు చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించింది. ఆయన తీరుపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం మారగానే ప్రస్తుత ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు.

తనకు ఎలాగూ పోస్టింగ్ రాదు కాబట్టి .. వీఆర్ఎస్ తీసుకుంటానని బెదిరించడం ప్రారంభించారు. మొదట ఓ చిన్న తెల్ల కాగితంపై రాసి.. అదే తన వీఆర్ఎస్ విజ్ఞాపన పత్రంగా పరిగణించాలని చెప్పారు. కానీ సీఎస్ కార్యాలయం ఫార్మాట్‌లో ఇవ్వాలని అడగడంతో ఈ సారి డిజిటల్ సిగ్నేచర్ కాపీ చేసి ఇచ్చారు. కానీ అలా కూడా సంతకం పెట్టి ఇవ్వాల్సిందేనని వెంటపడటంతో అదే విధంగా ఇచ్చారు. చివరికి ఆయన వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించింది.

గతంలో కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాష్ ప్రయత్నించారు. కానీ ఆయనను తీసుకోలేదు. భవిష్యత్ లో తీసుకునే అవకాశాలు లేవు., ఆయన అంత చెడ్డపేరు తెచ్చుకున్నారు. అందుకే తనపై రకరకాల పుకార్లు పుట్టించుకుంటూ ఉంటారు. మొదట జగన్ దగ్గర బాగా చేరి ఆయన చెప్పినట్లుగా చేసి సీఎంవోను తానే నడిపించారు. తన కంటే పదకొండేళ్లు సీనియర్ అయిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసింది ప్రవీణ్ ప్రకాషే. తర్వాత జగన్ కు కూడా చిరాకు పుట్టిందేమో కానీ ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పంపారు. అప్పట్లో తాను వీఆర్ఎస్ తీసుకుని యూపీ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రచారం చేయించుకున్నారు. దీంతో జగన మళ్లీ ఏపీకి పిలిపించి టీచర్లను వేధించే పోస్టు ఇచ్చారు.

విద్యాశాఖలో వైసీపీ నేతల దోపిడీకి ఆయన చేసిన సాయం అంతా ఇంతా కాదు. చిక్కీల ఆర్డర్ దగ్గర నుంచి ఐబీ కరికులం పేరుతో చేసిన స్కాం వరకూ ప్రతీ దాంట్లోనూ ప్రవీణ్ ప్రకాష్ హస్తం ఉంది. విద్యార్థుల ఫీజుల డబ్బులు… ఇండియా టుడేకు ఐదు కోట్లు ధారబోసింది కూడా ప్రవీణ్ ప్రకాషే. జగన్ కోసం ఆయన అన్ని రకాల రూల్స్ ఉల్లంఘించారు. ఇప్పుడు దొరికిపోవడం ఖాయమని వీఆర్ఎస్ తీసుకున్నారు. కానీ ప్రభుత్వం 30 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ లోపు ఆయన చేసిన గూడుపుఠాణి మొత్తం బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి.

Clove for Diabetes: లవంగాలతో మధుమేహాన్ని కంట్రోల్ చేయటం ఎలానో తెలుసా ?

Clove for Diabetes: లవంగాలతో మధుమేహాన్ని కంట్రోల్ చేయటం ఎలానో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒక్కసారి ఈ జబ్బు వస్తే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే..

ఆరోగ్యంగా మరియు అందంగా ఉండవచ్చు. మనం నిత్యం ఇంట్లో వాడే మసాలాలతో ఎన్నో రకాల జబ్బులను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా చాలా రోగాలు ఇంటి నివారణలతో నయమవుతాయి. మధుమేహాన్ని నియంత్రించడానికి ఇప్పటికే చాలా చిట్కాలు తెలుసు. మన వంటగదిలో ఉండే లవంగాలు కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు లవంగాలతో మధుమేహాన్ని ఎలా తగ్గించుకోవాలి? మధుమేహ వ్యాధిగ్రస్తులకు లవంగాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Medicinal Properties:

లవంగాలలో అనేక ఔషధ గుణాలున్నాయి. విటమిన్లు, ఖనిజాలు, ఖనిజాలు మరియు ఫైబర్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మాంగనీస్ మరియు విటమిన్ కె కూడా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంచుతాయి. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల అనేక సమస్యలు అదుపులో ఉంటాయి.

Reduces stress:

మీ ఆహారంలో లవంగాలను చేర్చుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళన వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి మధుమేహం మాత్రమే కాకుండా అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి లవంగాలు తీసుకోవడం వల్ల ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు.

How to take cloves for diabetics:

డయాబెటిక్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి లవంగాలను తీసుకుంటారు. అయితే లవంగాలను ఎలా తీసుకుంటారనే సందేహం ఉంది. ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో 8 నుండి 10 లవంగాలను మరిగించి వడకట్టండి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు దీన్ని తాగాలి. మూడు నెలల పాటు ఈ డ్రింక్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అదేవిధంగా ఆహారం తీసుకోవడం కూడా నియంత్రణలో ఉండాలి.

రైతులకు శుభవార్త.. వ్యవసాయ రుణాలపై SBI కీలక నిర్ణయం

రైతులకు శుభవార్త.. వ్యవసాయ రుణాలపై SBI కీలక నిర్ణయం

వర్షాకాలం మొదలైంది. రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ రోజుల్లో వ్యవసాయం ఖర్చుతో కూడుకున్న పని. దుక్కిదున్నె నుంచి పంట చేతికి వచ్చే వరకు పెట్టుబడి పెట్టి రూ.వేలల్లో నష్టపోతున్నారు. కానీ అన్నదాతలు పెట్టుబడి కోసం అప్పులు చేస్తారు. పంట రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్, State Bank of India has given good news to the farmers . రైతులకు వ్యవసాయ రుణాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. SBI నిర్ణయంతో రైతులకు వ్యవసాయ రుణాలు వేగంగా అందుతాయి.

69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా State Bank of India వ్యవసాయ రుణాల మంజూరు కోసం ప్రత్యేక కేంద్రాలతో సహా మొత్తం 11 కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. రైతులకు త్వరితగతిన వ్యవసాయ రుణాలు మంజూరు చేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు SBI సిద్ధమైంది. ప్రస్తుతం వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చర్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను తెరిచారు. దీంతో రైతులకు వేగంగా రుణాలు అందుతాయి. అలాగే, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి బ్యాంక్స్ యాప్‌లలో మరిన్ని కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ చెల్లింపులను విస్తరించేందుకు బీమ్ SBI పే యాప్‌కు టాప్&పేను తీసుకొచ్చింది.

Yono App లో మ్యూచువల్ ఫండ్స్‌పై డిజిటల్ లోన్‌లను అందించనున్నట్లు State Bank of India ప్రకటించింది. సూర్య ఘర్ పథకం కింద రుణాలు మంజూరు చేసేందుకు సూర్య ఘర్ లోన్ పథకం ప్రవేశపెట్టబడింది. స్టేట్ బ్యాంక్ తన రెండవ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ కేంద్రాన్ని ఎన్‌ఆర్‌ఐ కస్టమర్ల కోసం పంజాబ్‌లోని పాటియాలో ప్రారంభించింది. న్యాయవాదులకు మరిన్ని సేవలు అందించేందుకు హైకోర్టుల్లోని బ్యాంకు శాఖలను రీడిజైన్ చేయనున్నట్టు తెలిపింది. గృహ రుణాల మంజూరు ప్రక్రియను మరింత పారదర్శకంగా చేస్తున్నట్లు State Bank of India తెలిపింది.

Common cold: జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నారా.. ? ఈ సూప్ ట్రై చేయండి

Common cold: జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నారా.. ? ఈ సూప్ ట్రై చేయండి

Common cold: వర్షాకాలం ప్రారంభమైంది. ఈ తరుణంలో చాలా రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, వైరస్ వంటి ప్రమాదకరమైనవి కూడా వ్యాపిస్తుంటాయి. మరోవైపు జలుబు, జ్వరం, దగ్గు వంటివి కూడా పీడిస్తుంటాయి. ఈ తరుణంలో జలుబు, జ్వరం తగ్గడానికి మందులు వాడుతూ ఉంటారు. ఆవిరి పట్టడం, కషాయం వంటివి తాగడం వంటివి తరచూ చేయడం వల్ల ఇలాంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తలెత్తినప్పుడు సరిగా ఆహారం తీసుకోలేకుండా గొంతు ఇబ్బందులకు గురిచేస్తుంది.

గొంతు నొప్పి వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది. అంతేకాదు గొంతు నొప్పి తగ్గాలన్నా కూడా వేడి వేడి చికెన్ సూప్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్ సూప్ వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. శరీరానికి ఎనర్జీ కావలన్నా కూడా చికెన్ సూప్ తాగితే మంచిది అంటున్నారు.

దీనిలో ఉండే అమినో యాసిడ్లు శరీరానికి అందడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఆకలిగా లేని సమయంలో, ఆహారం తినడానికి ఇబ్బందిగా అనిపించినపుడు మాంసాహారంతో తయారుచేసిన సూప్ మెదడు నరాలను యాక్టివ్‌గా ఉండేలా తయారుచేస్తుంది.

గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు తలెత్తిన సమయంలో సూప్ తాగడం వల్ల నాలుకకు రుచిని అందేలా చేస్తుంది. ముఖ్యంగా ప్లూ, ముక్కు దిబ్బడ, జలుబు వంటివి సోకినపుడు తెల్ల రక్తకణాలు రక్తంలో కలిసిపోయి ఎఫెక్ట్ అయిన శరీర భాగానికి బలాన్ని చేకూర్చుతుంది. చికెన్ సూప్ తాగడం వల్ల ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అయితే చికెన్ సూప్ లో దినుసులు, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసి తాగితే ఇంకా మంచి ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

AP Government Officers: పోస్టుల కోసం.. ఏపీ అధికారుల లాబీయింగ్

AP Government Officers: పోస్టుల కోసం.. ఏపీ అధికారుల లాబీయింగ్

AP Government Officers Lobbying for Posts: ఐదు సంవత్సరాలు అడ్డగోలుగా అధికారాన్ని ఎంజాయ్ చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించారు. వారి మాటే వేదమన్నట్లు.. రూల్స్ పక్కనపెట్టి ఏం చేయమంటే అది చేసి చూపిచ్చారు. అలాంటి స్వామిభక్తులు ఇప్పుడు ప్రభుత్వం మారగానే ప్లేట్ మారుస్తున్నారు. ఇప్పుడు తిరిగి పవర్ ఎంజాయ్ చేయడానికి తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కూటమి నేతలతో బంధుత్వాలు కలుపుకుంటూ కీలక స్థానాలలో పోస్టింగ్‌ల కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు. దాంతో అర్హత ఉన్నా వివిధ కారణాలతో లూప్ లైన్ లో ఉన్న అధికారులు ఇదేం గోలని టెన్షన్ పడుతున్నారంట.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హాయంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్, రెవెన్యూ లాంటి కీలక విభాగాలలో పోస్టింగ్ విషయంలో జరిగిన తంతుపై రాష్టమంతా నివ్వెర పోయింది. కొంతమందికి అసలు పోస్టింగ్ ఇవ్వడం అటుంచి కనీసం లూప్ లైన్ లో అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో వారు మూడు సంవత్సరాల పాటు జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారు రాష్ట వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నారు. సమర్థత ఉన్నప్పటికి వర్గం , సానుభూతి పరుడు లాంటి కారణాలతో ఇబ్బంది పెట్టారు. పోలీసు, రెవెన్యూ విభాగాలలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపించింది.

పలువురు అధికారులు గత ప్రభుత్వంలో చాలా హడావుడి చేసారు. కీలక స్థానాలో పనిచేశారు. మాజీ సీఎం జగన్‌కు ఆప్తులైన నాయకులు ఏం చెబితే అదే చేశారు. దాంతో టీడీపీ, జనసేన నాయకులు అప్పట్లో వారికి టార్గెట్ అయి పలు సమస్యల్లో ఇరుక్కున్నారు. అప్పట్లో టిడిపి శ్రేణులు అటువంటి అధికారులు, నేతలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఎన్నికల పోలింగ్ , తర్వాత కౌంటింగ్ కు ముందు కూడా టీడీపీ , కూటమి నాయకులపై చంద్రగిరి, తిరుపతి, పుంగనూరు లాంటి చోట్ల కేసులు నమోదు చేసారంటే ఎంత స్వామి భక్తిని ప్రదర్శించారో అర్థం అవుతుంది.

ఇలాంటి వారంతా ఇప్పుడు ఒక్కసారిగా అధికారం మారడంతో.. కూటమి నేతలతో బంధుత్వాలు కలుపుతూ.. గతంలో వారికి సన్నిహితులమని చెప్పుకుంటూ పోస్టింగ్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కీలక పోస్టుల కోసం పెద్ద మొత్తం డబ్బులు ఇస్తామని ప్రతిపాదనలు కూడా పెడుతున్నారంట. తిరుపతి నగర పాలక సంస్థలో మాస్టర్ ప్లాన్ రహాదారులు, టిడిఅర్ బాండ్స్‌ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఓ అధికారి అయితే నేను మీవాడినే గతంలో మీతోనే తిరిగాను. గత్యం తరం లేక వారు చెప్పినట్లు చేయాల్సి వచ్చిందంటూ.. ఎంతైనా ఇస్తాను తనను ఆ పోస్టులోనే కొనసాగించమని నాయకుల చుట్టు తిరుగుతున్నాడంట. అయితే అతని గురించి తెలిసిన వారు సిఫార్సు చేయడానికి భయపడుతున్నారంట.

ఇక పోలీసు విభాగంలోని గత ఐదు సంవత్సరాలు హాడావుడి చేసిన వారు సైతం ఇప్పుడు తాము చాల నిజాయితీగా పనిచేసామని.. అంతేకాక చాలా సార్లు కేసుల నుంచి బయట పడవేసామంటూ అంటు ఎమ్మెల్యేల చుట్టు తిరుగుతున్నారంట. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం మీరు గత ఐదు సంవత్సరాలలో ఎక్కడ పోస్టింగ్ చేసారో వివరాలు ఇవ్వండి పరిశీలిస్తామని అంటున్నారంట. గతంలో వారు ఎక్కడా పనిచేసారో అయా ప్రాంతాల టీడీపీ నాయకులతో మాట్లాడి వారి గురించి ఎంక్వైయిరీ చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో వైసీపీ నుంచి వచ్చి కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేల చుట్టు ప్రదక్షిణాలు ఎక్కువుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వారితో సన్నిహితంగా మెలిగిన వారు మీకోసం అప్పడు చేసాము. ఇప్పుడు మీరు అవకాశం ఇవ్వండి అని వత్తిడి తేస్తున్నట్లు సమాచారం. అయితే సిఐ నుంచి పైస్థాయి అధికారుల బదిలీలన్నీ పై నుంచి నడుస్తాయని చెప్పడంతో సదరు అధికారులు బిక్కచచ్చిపోతున్నారంట. వారి లాబీయింగ్ వ్యవహారం చూస్తూ.. గత ఐదు సంవత్సరాలుగా అర్హతలకు తగ్గ పోస్టింగ్‌లు లేక రాష్టం నలుమూలాల విసిరి వేయబడ్డ వారంతా ఇప్పుడైనా తమకు న్యాయం జరుగుతుందా లేదా అనే సందేహపడే పరిస్థితులు వచ్చాయంట.

రెవెన్యూ శాఖలో సైతం ఇలాంటి దందా నడుస్తోంది. అడ్డగోలుగా పనిచేసి అక్రమాలకు సహాకారించిన అధికారులు.. మీకు కూడా ఇలాగే పనిచేస్తాం.. మాకు అవకాశం ఇవ్వండి.. రెవెన్యూ లొసుగులతో మీకు లాభాలు కల్పిస్తామని అధికార నేతలకు ఓపెన్ అఫర్లు ఇస్తున్నారంట. అయితే అప్పట్లో ఇక్కట్లు ఎదుర్కొన్న ప్రజా ప్రతినిధులు వఓకే చెప్పడం లేదంటున్నారు. ఆర్డీఓ స్థాయి అధికారుల వ్యవహారం అంతా పై వారు చూసుకుంటారని ఎంఆర్వోతో పాటు కింది స్థాయి సిబ్బంది అయితే తాము చూస్తామని గతంలో తమను ఇబ్బందిపెట్టిన మీకు సహకరించే ప్రసక్తి లేదని తెగేసి చెప్తున్నారంట. మొత్తం మీద అధికార మార్పిడి తర్వాత పోస్టింగ్‌ల కోసం పోలీసులు ,రెవెన్యూలో తెగ లాబీయింగ్ జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీఓ, మున్సిపాలిటీల్లో కూడా ఇదే తతంగం నడుస్తోందంట. చూడాలి మరి వారి లాబీయింగులు ఎంత వరకు పనిచేస్తాయో.

Chandrababu cabinet: 16న చంద్రబాబు కేబినెట్ భేటీ, వాటిపైనే ప్రధానంగా

Chandrababu cabinet: 16న చంద్రబాబు కేబినెట్ భేటీ, వాటిపైనే ప్రధానంగా

Chandrababu cabinet meeting update(Andhra politics news): ఏపీలో చంద్రబాబు కేబినెట్ రెండోసారి సమావేశం కానుంది. ఈనెల 16న ఉదయం 11 గంటలకు భేటీ జరగనుంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గం చర్చించనుంది. ఈ క్రమంలో గురువారంలోగా శాఖల వారీగా చర్చించే అంశాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇంకా శాఖల వారీగా లెక్కలు తేలక పోవడంతో నాలుగు నెలలపాటు ఓటాన్ అకౌంట్ పెట్టాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఈలోగా మిగతా శాఖలపై శ్వేపత్రాలు రిలీజ్ చేయడం, ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌ను పరిశీలించనుంది. అప్పుడు కసరత్తు చేసి అప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుండగా మంగళవారం(నేడు) సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై ఆ భేటీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇళ్ల నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై చర్చ జరిగింది. డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం కీలకమన్నారు. సబ్సీడీ రుణాలు, వివిధ పథకాల కింద లబ్దిదారులను సహకరించాలని కోరారు.డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలకపాత్ర అని చెప్పుకొచ్చారు.

ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయానికొస్తే.. ఆర్థిక పరిస్థితి రీత్యా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం కష్టమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పుడున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మరో నాలుగు నెలలపాటు కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేయనుంది. ఆర్డినెన్స్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ఆమోదం కోసం ఆర్థిక‌శాఖ ఎదురుచూస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే సెప్టెంబరులో బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.

Ayurveda treatment: కీళ్ల నొప్పులా?

Ayurveda treatment: కీళ్ల నొప్పులా?

కీళ్లు వాచి, కదల్చలేనంతగా నొప్పి పెడుతూ ఉంటే ఆయుర్వేద చికిత్సలను ఆశ్రయించవచ్చు. వాపు తగ్గి, కదలికలు సులువయ్యేలా చేసే ఆయుర్వేద చికిత్సల్లో

కీళ్లు వాచి, కదల్చలేనంతగా నొప్పి పెడుతూ ఉంటే ఆయుర్వేద చికిత్సలను ఆశ్రయించవచ్చు. వాపు తగ్గి, కదలికలు సులువయ్యేలా చేసే ఆయుర్వేద చికిత్సల్లో ఇవి కొన్ని!

ఉలవలు: 100 గ్రాముల అడవి ఉలవలను పొడి చేసి, 50 గ్రాముల నువ్వుల నూనె కలిపి ముద్ద చేయాలి. ఈ ముద్దతో కీళ్ల మీద పట్టు వేసి, పలుచని వస్త్రం చుట్టాలి. ఇలా రాత్రంతా ఉంచితే ఉదయానికి వాపు, నొప్పి తగ్గుతాయి.

అందుగ బంక: అందుక చెట్టు బంక సేకరించి, 10 గ్రాముల బంకను 100 మిల్లీ లీటర్ల నీళ్లలో కలిపి, సగం అయ్యే వరకూ మరిగించి, చల్లార్చాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీళ్లను తాగాలి. ఇలా వారం రోజులు తాగితే కీళ్ల నొప్పులు అదుపులోకి వస్తాయి.

ఆముదం బెరడు: ఆముదం చెట్టు బెరడు 100 గ్రాములు, రేల చెట్టు వేర్లు 100 గ్రాములు తీసుకుని, ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. 30 గ్రాముల చూర్ణాన్ని 200 మిల్లీ లీటర్ల నీళ్లలో కలిపి రాత్రంతా కదలకుండా ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని పావు వంతు అయ్యేవరకూ మరిగించి, వడగట్టి తాగాలి. ఇలా 20 రోజుల పాటు క్రమంతప్పక చేస్తే కీళ్లనొప్పులు తగ్గుముఖం పడతాయి.

HeartAttack: హార్ట్ ఎటాక్‌కు నెలరోజుల ముందు కనిపించే సంకేతాలు ఇవే!

HeartAttack: హార్ట్ ఎటాక్‌కు నెలరోజుల ముందు కనిపించే సంకేతాలు ఇవే!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా హృద్రోగబాధితుల సంఖ్య పెరుగుతోంది. జీవనశైలి మార్పుల కారణంగా అనేక మంది చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యా్న్ని పదికాలాల పాటు కాపాడుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హృద్రోగాలకు సంబంధంచి అవగాహన పెంచుకోవాలి. వ్యాధి లక్షణాలు ఏంటి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, వంటి అంశాలపై అవగాహన ఉంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. వైద్యులు చెప్పే దాని ప్రకారం, హార్టెటాక్ వచ్చేందుకు నెల ముందు నుంచే శరీరంలో పలు మార్పులు వస్తాయట. అవేంటో ఓసారి చూద్దాం (Health).

హార్ట్ ఎటాక్‌కు ముందు చాలా మందిలో ఛాతి పట్టేసినట్టు, ఒత్తిడి పెట్టినట్టు ఉంటుందట. చాలా రోజుల ముందుగానే ఈ ఇబ్బంది మొదలవుతుందట.

తగినంత ఆహారం, నీరు తీసుకుంటున్నా నిత్యం నీరసం ఆవహించినట్టు ఉంటే కూడా సందేహించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు ఊపిరాడనట్టు ఉండటం, ఛాతిలో నొప్పి వంటివి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

కడుపులో తిప్పడం, అరగనట్టు ఉండటం వంటివి కూడా గుండెపోటుకు నెల రోజుల ముందు నుంచే ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాయి.

కొందరిలో అతిగా చెమటపోయడం కూడా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

హార్ట్ ఎటాక్‌కు ముందు శరీరంలోని ఇతర భాగాల్లో కూడా నొప్పి అనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. వీపు, భుజాలు, చేతులు, మెడ, దవడ వంటి చోట్ల నొప్పి అనిపిస్తుందని అంటున్నారు.

కాబట్టి వీటిని సాధారణ నొప్పుల్లా భావించకుండా ఇబ్బంది కలిగిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే రాబోయే ప్రమాదం నుంచి సులువుగా తప్పించుకోవచ్చని అంటున్నారు.

Cleaning Tips: బట్టలపై పడే మొండి మరకలను ఈజీగా వదిలించండి ఇలా..

Cleaning Tips: బట్టలపై పడే మొండి మరకలను ఈజీగా వదిలించండి ఇలా..

సాధారణంగా అప్పుడప్పుడు బట్టలపై మరకలు పడటం సహజం. అనుకోకుండా అలా కొన్ని సార్లు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆవకాయ మరకలు, నూనె, కూరలు, సింధూరం మరకలు అంత త్వరగా పోవు. ఈ మరకలు చాలా మొండిగా ఉంటాయి. సాధారణ బట్టలతో ఉతికినట్టు ఉతికినా.. బ్రష్ కొట్టినా ఇవి ఒక పట్టాన వదలవు. ఎక్కువ ఉతికినా.. రుద్దినా బట్టలు పాడైపోతాయి. ఇలాంటి సమస్యలకు ఎన్నో చిట్కాలు..

సాధారణంగా అప్పుడప్పుడు బట్టలపై మరకలు పడటం సహజం. అనుకోకుండా అలా కొన్ని సార్లు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆవకాయ మరకలు, నూనె, కూరలు, సింధూరం మరకలు అంత త్వరగా పోవు. ఈ మరకలు చాలా మొండిగా ఉంటాయి. సాధారణ బట్టలతో ఉతికినట్టు ఉతికినా.. బ్రష్ కొట్టినా ఇవి ఒక పట్టాన వదలవు. ఎక్కువ ఉతికినా.. రుద్దినా బట్టలు పాడైపోతాయి. ఇలాంటి సమస్యలకు ఎన్నో చిట్కాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మీ ముందుకు తీసుకొచ్చాం. ఎవరైతే ఎక్కువగా బట్టలపై పడే మొండి మరకలతో ఇబ్బంది పడుతూ ఉంటారో.. వారు ఈజీగా ఈ టిప్స్ పాటించవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

వెనిగర్:
బట్టలపై పడే మొండి మరలకను తొలగించడంలో వైట్ వెనిగర్ ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ఎలాంటి మరకలను అయినా వెనిగర్ ఈజీగా తొలగిస్తుంది. ముందుగా వెనిగర్‌ను గోరు వెచ్చటి నీటిలో కలపండి. అందులో మొండి మరకలు ఉండే దుస్తులను నానబెట్టండి. ఓ అరగంట తర్వాత ఆ దుస్తులను సబ్బు పెట్టి కాస్త బ్రెష్ కొట్టి చేతితో రుద్దితే మరకలు ఈజీగా పోతాయి. జిడ్డు, మొండి మరకలను తొలగించడంలో వెనిగర్ ఎంతో చక్కగా సహాయ పడుతుంది.

బేకింగ్ సోడా:
కిచెన్, ఇంటి అవసరాలకు బేకింగ్ సోడా ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ఇంట్లోని, కిచెన్‌లో మురికిని, మచ్చలను పోగొడుతుంది. అంతే కాకుండా అందాన్ని పెంచుకోవడంలో కూడా బేకింగ్ సోడా హెల్ప్ చేస్తుంది. అలాగే బట్టలపై పడ్డ మొండి మరకలను వదిలించుకోవడంలో కూడా బేకింగ్ సోడా చక్కగా పని చేస్తుంది. ముందుగా బట్టలను తడిపి మొండి మరకలను ఉన్న చోట బేకింగ్ సోడా వేసి రుద్దాలి. ఆ తర్వాత డిటర్జెంట్ వేసి వాటర్‌లో నానబెట్టాలి. ఆ తర్వాత ఉతికితే ఈజీగా మరక పోతుంది.

నిమ్మకాయ:
నిమ్మకాయ అందానికి, ఆరోగ్యానికి, కిచెన్ హ్యాక్స్‌కి ఎంతో చక్కగా పని చేస్తుంది. అంతే కాకుండా బట్టలపై పడ్డ మొండి మరకలను తొలగించడంలో కూడా నిమ్మకాయ చక్కగా ఉపయోగ పడుతుంది. మొండి మరకలు పడినచోట కొద్దిగా డిటర్జెంట్ వేసి దానిపై నిమ్మ చెక్కతో బాగా రుద్దాలి. కాసేపు పక్కన పెట్టి.. ఉతికితే మొండి మరక పోతుంది.

Health

సినిమా