Friday, November 15, 2024

Schools: పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలి.. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు

తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్‌: తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు.. పరదాలు కట్టి మళ్లీ తీసేసిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో పర్యటిస్తున్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వైకుంఠం కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు టీటీడీ జేఈవో గౌతమి స్వాగతం పలికారు.

కాగా, మాజీ సీఎం పర్యటనకు కట్టినట్లే ఇప్పుడు కూడా మళ్లీ దారి వెంట అధికారులు పరదాలు కట్టడంతో అటువంటి పనులు చేయొద్దంటూ వారికి సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయి.

తన పర్యటనల్లో అనవసరపు ఆంక్షలు వద్దని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని అన్నారు. దీంతో ఇప్పటికే సీఎం పలుసార్లు చెప్పారని, ఆ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని అధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయి.

చివరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అప్పటికప్పుడు అధికారులు తొలగించారు. కాగా, గత రాత్రి కడా తిరుమలలోని అతిథిగృహం వద్ద మంత్రి నారా లోకేశ్ పరదాలు కట్టి ఉండటాన్ని గమనించి, ఇంకా పరదాల సంస్కృతి పోలేదా అని అడిగారు. వద్దని చెప్పినప్పటికీ ఇప్పుడు కడా కొనసాగిస్తున్నారని చెప్పారు.

YS Jagan: వైసీపీ ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ కీలక భేటీ.. పలు అంశాలపై దిశానిర్దేశం

YS Jagan: వైసీపీ ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ కీలక భేటీ.. పలు అంశాలపై దిశానిర్దేశం

YS Jagan: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే త్వరలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరిగింది. త్వరలోనే జరిగే శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పలు అంశాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. పార్టీలో జోష్ నింపేందుకు జగన్‌ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత మూడు నాలుగు రోజులుగా వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు, కీలక నేతలతో ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీలకు వైఎస్‌ జగన్ దిశానిర్దేశం చేశారు. 40 శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారని మర్చిపోవద్దన్నారు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయన్నారు. ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరగాలన్నారు. మనకు కష్టాలు కొత్త కాదని.. ప్రలోభాలకు లొంగకుండా ప్రజల తరఫున పోరాడదామన్నారు. నాలుగైదు కేసులు పెట్టినంత మాత్రం భయపడవద్దని సూచించారు. మళ్ళీ వైసీపీ ఉవ్వెత్తున ఎగసి పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

శిశుపాలుని మాదిరిగా చంద్ర బాబు తప్పులు లెక్క పెట్టాలన్నారు. ఇప్పటికే ప్రజలకు అందాల్సిన స్కీమ్స్ డబ్బులు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం టీడీపీ , జనసేన, బీజేపీ హనీమూన్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. మరి కొంత సమయం కూటమికి ఇద్దామని.. ఆ తర్వాత ప్రజల తరపున పోరాటాలు చేద్దామని జగన్‌ వైసీపీ ఎమ్మెల్సీలకు సూచించారు. అసెంబ్లీలో వైసీపీ నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందని.. కాబట్టి శాసన మండలిలో గట్టిగా పోరాటం చేద్దామని ఆయన పేర్కొన్నారు.

Actor Prithviraj: కమెడియన్ పృథ్వీరాజ్‌కు బిగ్‌ షాక్‌.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ జారీ! ఏం జరిగిందంటే..

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్‌ నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ కోర్టు షాకిచ్చింది. తాజాగా పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మిప్రతినెలా మనోవర్తి చెల్లించాలంటూ గతంలోనే కోర్టు ఆదేశించినా భేఖాతరు చేయడంతో.. ఆమె మళ్లీ కోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించకపోవడంతో పాటు కోర్టుకు హాజరు కానందున నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు బుధవారం జారీ చేసింది.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలం సజవుగా సాగిన వీరికాపురంలో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. భార్య శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉండసాగింది. భర్త నుంచి తనకు నెలకు రూ.8 లక్షల భరణం ఇప్పించాలంటూ శ్రీలక్ష్మి 2017లో కోర్టును ఆశ్రయించింది. తన వివాహం అనంతరం విజయవాడలో తన పుట్టింట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించేవాడని, ఆసమయంలో అతని ఖర్చులన్నీ తమ పుట్టించివాళ్లే భరించారని ఆమె కోర్టుకు తెలిపింది. ఇక సినిమాల్లోకి వెళ్లాక పూర్తిగా మారిపోయిన ఆయన తనను తరచూ వేధించేవాడని కోర్టుకు విన్నవించింది. 2016 ఏప్రిల్‌ 5న ఇంట్లో నుంచి తనను వెళ్లగొట్టాడని, దీంతో అప్పటి నుంచి తన పుట్టింటిలోనే ఉంటున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు అందులో తెలిపింది. భర్త నుంచి తనకు నెలకు రూ.8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది.

దీనిని 2017 జనవరి 10న విచారించిన కోర్టు.. పృథ్వీరాజ్‌ తన భార్యకు నెలకు రూ.8 లక్షల భరణంతోపాటు.. కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది. ప్రతి నెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో పృథ్విరాజ్‌ హైకోర్టులో దీనిని సవాలు చేశాడు. కేసు వివరాలను పరిశీలించిన హైకోర్టు నెలకు రూ.22 వేలు చెల్లించాలని, అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. అయితే శ్రీలక్ష్మీకి భరణం చెల్లించడంతో పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. పైగా కోర్టుకు కూడా హాజరుకావడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోమారు భార్య శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేయడంతో.. విజయవాడ ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పృథ్వీరాజ్ పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కుపోయినట్లైంది.

NEET UG: నీట్‌ పరీక్షలో ఆ 1500 మందికి గ్రేస్‌ మార్కులను తీసేస్తాం

దిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్‌.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)- యూజీ 2024లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ (NEET) ఫలితాల్లో 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను (Grace marks) తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పింది.

ఈ ఏడాది జరిగిన నీట్‌ పరీక్ష (NEET UG 2024 Exam)లో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు ఇచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వీటిని కలిపారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో పాటు నీట్‌ పరీక్షలో అక్రమాలపై ఆరోపణలు రావడంతో గతవారం కేంద్ర విద్యాశాఖ నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్‌ మార్కులు (Grace marks) పొందిన 1563 విద్యార్థులపై ఈ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది.

కమిటీ నిర్ణయాలను కేంద్రం గురువారం సుప్రీంకోర్టు (Supreme Court)కు తెలియజేసింది. ‘‘కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్‌ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్‌ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. వారికి మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తాం. జూన్‌ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తాం’’ అని ధర్మాసనానికి కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాతే కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునే వారు.. గ్రేస్‌ మార్కులు లేకుండా ఒరిజినల్‌ మార్కులతో కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చని పేర్కొంది.

కౌన్సెలింగ్‌పై స్టేకు నిరాకరణ..
ఇక, నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ (NEET Paper Leak) ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. వెబ్‌ కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కౌన్సెలింగ్‌ యథాతథంగా ఉంటుందని చెప్పిన ధర్మాసనం.. ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగానే సమాధానం చెప్పాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)కి నోటీసులు జారీ చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. జులై 6వ తేదీ నుంచి నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ ఏడాది నీట్‌ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్‌ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ విద్యార్థులకు ర్యాండమ్‌గా 70 నుంచి 80 మార్కులు కలిపారని అన్నారు.

Petrol Diesel Price Today 13 June: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

Petrol Diesel Price 13 June 2024: యూఎస్లో వృద్ధి సంబంధ ఆందోళనలు, సప్లైపై అనుమానాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కొద్దిగా దిగి వచ్చాయి.

ప్రస్తుతం, WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.39 డాలర్లు తగ్గి 78.11 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 0.37 డాలర్లు తగ్గి 82.23 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై అంతర్జాతీయ రేట్లు ప్రభావం చూపడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ రేట్లు (Petrol-Diesel Rates Today In Telugu States):

తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)

జిల్లా పేరు నేటి పెట్రోల్ ధర నిన్నటి పెట్రోల్ ధర
హైదరాబాద్ (Petrol Price in Hyderabad) ₹ 109.41 ₹ 107.41
వరంగల్ అర్బన్ (Petrol Price in Warangal) ₹ 106.99 ₹ 106.84
వరంగల్ రూరల్ జిల్లా (Petrol Price in Warangal Rural) ₹ 107.06 ₹ 107.03
నిజామాబాద్ (Petrol Price in Nizamabad) ₹ 109.20 ₹ 109.20
నల్లగొండ (Petrol Price in Nalgonda) ₹ 107.54 ₹ 107.32
కరీంగనర్ (Petrol Price in Karimnagar) ₹ 107.52 ₹ 107.53
ఆదిలాబాద్ (Petrol Price in Adilabad) ₹ 109.57 ₹ 109.41
తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)

జిల్లా పేరు నేటి డీజిల్ ధర నిన్నటి డీజిల్ ధర
హైదరాబాద్ (Diesel Price in Hyderabad) ₹ 95.46 ₹ 95.65
వరంగల్ అర్బన్ (Diesel Price in Warangal Rural) ₹ 95.25 ₹ 95.11
వరంగల్ రూరల్ జిల్లా (Petrol Price in Warangal Rural) ₹ 95.32 ₹ 95.28
నిజామాబాద్ (Diesel Price in Nizamabad) ₹ 97.31 ₹ 97.31
నల్లగొండ (Diesel Price in Nalgonda) ₹ 95.76 ₹ 95.54
కరీంగనర్ (Diesel Price in Karimnagar) ₹ 95.74 ₹ 95.75
ఆదిలాబాద్ (Diesel Price in Adilabad) ₹ 97.66 ₹ 97.51
ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు నేటి పెట్రోల్ ధర నిన్నటి పెట్రోల్ ధర
విజయవాడ (Petrol Price in Vijayawada) ₹ 109.69 ₹ 109.73
గుంటూరు (Petrol Price in Guntur) ₹ 109.69 ₹ 109.73
విశాఖపట్నం (Petrol Price in Visakhapatnam) ₹ 108.29 ₹ 108.46
తిరుపతి (Petrol Price in Tirupati) ₹ 108.98 ₹ 109.64
కర్నూలు (Petrol Price in Kurnool) ₹ 108.91 ₹ 109.22
రాజమహేంద్రవరం (Petrol Price in Rajahmundry) ₹ 109.74 ₹ 108.98
అనంతపురం (Petrol Price in Anantapur) ₹ 109.62 ₹ 109.48
ఆంధ్రప్రదేశ్లో డీజిల్ ధరలు (Diesel Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు నేటి డీజిల్ ధర నిన్నటి డీజిల్ ధర
విజయవాడ (Diesel Price in Vijayawada) ₹ 97.52 ₹ 97.56
గుంటూరు (Diesel Price in Guntur) ₹ 97.52 ₹ 97.56
విశాఖపట్నం (Diesel Price in Visakhapatnam) ₹ 96.17 ₹ 96.33
తిరుపతి (Diesel Price in Tirupati) ₹ 96.81 ₹ 97.43
కర్నూలు (Diesel Price in Kurnool) ₹ 96.80 ₹ 97.09
రాజమహేంద్రవరం (Diesel Price in Rajahmundry) ₹ 97.55 ₹ 96.85
అనంతపురం (Diesel Price in Anantapur) ₹ 97.44 ₹ 97.33

AP Schools Reopening: ఏపీలో నేటి నుంచి బడులు ప్రారంభం – మొదటి రోజే ‘స్టూడెంట్స్‌ కిట్‌’ అందజేత

Andhra Pradesh Schools Reopen: ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు సుదీర్ఘ వేసవి సెలవు తర్వాత జూన్ 13న తెరచుకోనున్నాయి. కొత్త ప్రభుత్వం.. కొత్త విద్యా సంవత్సరంతో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. వాస్తవానికి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రుల ప్రమాణస్వీకార మహోత్సవం ఉండటంతో విద్యాశాఖ పాఠశాలల రీఓపెనింగ్ను ఒక రోజు వాయిదా వేసింది. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలల విద్యాక్యాలెండర్ను విద్యాశాఖ ఇప్పటివరకు విడుదల చేయలేదు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. కొత్త ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఫొటోలతో త్వరలోనే అకడమిక్ క్యాలెండర్ విడుదల చేయనుంది.

పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్స్ అందజేసే విధంగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికి సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్టూడెంట్ కిట్స్ను విద్యాశాఖ చేరవేసింది. విద్యార్థులకు ఎనిమిది రకాల వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 36 లక్షల విద్యా కానుక కిట్లను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. స్థానిక ఎమ్మేల్యేలతో స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయనున్నారు.

గత ప్రభుత్వం అందజేస్తున్న ‘జగనన్న విద్యాకానుక’ పేరున విద్యార్థులకు అందించే విద్యాకానుకను ఈసారి ‘స్టూడెంట్స్ కిట్’లుగా పేరుమార్చారు. విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్నభోజన పథకం కూడా ప్రస్తుత విద్యాసంవత్సరంలో పేరుమార్చారు. గతంలో జగనన్న గోరుముద్ద పేరుతో అమలు చేసే మధ్యాహ్న భోజనం పథకం ప్రస్తుతం ‘పీఎం పోషణ గోరుముద్ద’ పేరుతో అమలు చేయనున్నారు. మరోవైపు ఏ ఒక్క స్కూలులోను ఉపాధ్యాయుల కొరత లేకుండా తాత్కాలిక సర్దుబాట్లతో సమస్య పరిష్కారానికి అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.

విద్యాశాఖ అందజేస్తున్న కిట్లలో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలతోపాటు, టోఫెల్ వర్క్బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు ఉంటుంది. పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు వర్క్బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ ఇవ్వనున్నారు. ఇక 6 నుంచి 10 తరగతులకు నోట్బుక్స్ ఇస్తారు. ఈ విద్యాసంవత్సరం కూడా గతంలో ఇచ్చినట్టుగానే ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేస్తున్నారు. అలాగే, 3 నుంచి 10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే.

పదోతరగతి సోషల్ స్టడీస్ పుస్తకాలను CBSE బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ సబ్జెక్టులుగా NCERT సిలబస్ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ‘ఫ్యూచర్ స్కిల్స్’ కోర్సు(Future Skills Course)ను అందుబాటులోకి తెచ్చింది.

Amaravati Real Estate: అమరావతి భూముల ధరలకు రెక్కలు, దాదాపు పది రెట్లు పెరిగిన ల్యాండ్ రేట్లు

Amaravati Lands for Sale: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత అయిదేళ్లుగా చతికిలపడిన భూముల రేట్లు కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో రాజధాని ఆశలతో తిరిగి పుంజుకున్నాయి.

నిజం చెప్పాలంటే 2023 డిసెంబరు నెల నుంచే తిరిగి చంద్రబాబే ముఖ్యమంత్రి కానున్నారనే టాక్ రావడంతో నిర్జీవమైన భూముల ధరల్లో చలనం కనిపించింది.

మూడు రాజధానుల అంశాన్ని గత ప్రభుత్వం తెరపైకి తేవడంతో.. ఏపీ రాజధాని అమరావతితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు దాదాపు నాలుగేళ్లపాటు నేల చూపులు చూశాయి. ఇక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు మూతపడే పరిస్థితికొచ్చాయి. భూములు కొనుగోళ్ల పరిస్థితి అటుంచితే.. కనీసం అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు వైపు సైతం చూసేవారు లేని పరిస్థితి నెలకొంది. కానీ కొన్ని నెలల నుంచి పరిస్థితిలో మార్పు కనిపించింది. వైసీపీ ప్రభుత్వంపై రాజధాని అమరావతి ప్రజల్లో కూడగట్టుకున్న వ్యతిరేకత సైతం కూటమికి ఓటు వేసేలా చేసింది. చంద్రబాబు చేతికి తిరిగి పగ్గాలొస్తాయన్న భావించి, చంద్రబాబు సీఎం అయితే అమరావతినే రాజధానిగా అభివృద్ది చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ధరలు పెరిగేలా చేయడానికి కారణమైంది.

ఆరు నెలల్లో పది రెట్లకు పైగా..

గడిచిన ఆరు నెలల్లో అమరావతి రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం తుళ్లూరు, వెలగపూడి, మందడం, రాయపూడి తదితర గ్రామాలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు తదితర ప్రాంతాలు, తాడేపల్లి మండలం లోని పెనుమాక, ఉండవల్లి తదితర ప్రాంతాల్లో మొన్నటి వరకు రూ. 3,500 నుంచి రూ.4,000 వరకు ఉన్న గజం భూమి ఏకంగా రూ.45 వేలకు చేరిపోయిందని ఇక్కడి రియల్టర్లు చెబుతున్నారు. ఇక్కడ ఎకరం భూమి కొనాలంటే 15 నుంచి 20 కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. సమీపంలోని గుంటూరు, విజయవాడ వంటి నగరాల్లోనూ రియల్ వ్యాపారాలు పుంజుకున్నాయి. ఈ నెల ఒకటో తేదీ వరకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు రూ.40 లక్షల నుంచి 45 లక్షల మధ్య ఉండగా ఇప్పుడు 50 లక్షలు పైమాటే పలుకుతున్నాయంటున్నారు. నిర్మాణంలో ఉన్నవాటిని హాట్ కేకుల్లా అమ్ముతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా రియల్టర్ల హడావుడి, ప్రాంతాన్ని బాగుచేస్తోన్న కార్మికుల గలగలతో సందడి వాతావరణం నెలకొంది.

తీర్పుతో పునరుత్తేజం

జూన్ 4న కూటమికి విజయాన్ని అందిస్తూ ఎన్నికల ఫలితాలు రావడంతో.. అమరావతి ప్రాంత రైతులు, ప్రజల ఆశలు, కలలు నిజమయ్యాయి. దాదాపు 1600 రోెజులకు పైగా సుదీర్ఘంగా సాగిన అమరావతి రాజధాని ఉద్యమానికి తెరపడినట్లయింది. సరికొత్త ఆశలతో రాజధాని ప్రాంతమంతా ఊపిరి తీసుకుంది. అమరావతి ప్రాంతంలో కూటమి గెలుపు దరిమిలా నేతల నుంచి సంకేతాలు వెళ్లడంతో అధికారులు బాగుచేత పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో తుప్పు బట్టిపోయిన పరికరాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తుమ్మచెట్లు కొట్టేస్తూ రహదారులు సైతం నిర్మిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో రాజధాని అంశంపై ఆయన చేసే ప్రకటనలతో ఈ బూమ్ మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న ఇసుక విధానంతో నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ముఖ్యంగా తొలివారంలోనే కూటమి ప్రభుత్వం ఇసుక విధానంపై సమీక్షించే అవకాశముందని భావిస్తున్నారు.

అటూ ఇటూ వంద కిలోమీటర్ల పరిధిలో.. రియల్ పండగే..

తాజా పరిస్థితుల గతంలో రియల్ పెట్టుబడి పేరెత్తితే గతంలో హైదరాబాద్ వైపు చూసిన పెట్టుబడిదారులంతా ఇప్పుడు గుంటూరు, విజయవాడ పరిసరాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఎలా చూసుకున్నా రియల్ బూమ్ ఊహించని విధంగా ఊపందుకుంది. కేవలం రాజధాని ప్రాంతమే కాకుండా.. రాజధాని ప్రాంతమైన గుంటూరు, విజయవాడ ప్రాంతాలకే రియల్ బూమ్ పరిమితం కాకుండా అటు ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూముల ధరలపై ప్రభావం పడే అవకాశముందని రియల్ రంగ నిపుణులంటున్నారు. ఇప్పటికిప్పుడు ఈ తేడా కనిపించకపోయినా రానున్న రెండు మూడు నెలల్లో ధరలు విపరీతంగా పెరుగుతాయని చెబుతున్నారు.

శరవేగంగా అభివృద్ధి పనులు

రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొన్నటి వరకూ రాత్రుళ్లు చీకటిగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు ఇప్పుడు విద్యుత్తు వెలుగులతో తళతళలాడుతోంది. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకూ ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు 9 కిలోమీటర్ల మేర విద్యుత్తు వెలుగులు పునరుద్ధరించేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవడంతో సోమవారానికే సీడ్ యాక్సిస్ రోడ్డంతా విద్యుత్తు వెలుగులు సంతరించుకుంది. అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు.

డయాబెటిస్‌ రోగులకు వరం ఈ గింజలు.. డైలీ తిన్నారంటే మహమ్మారికి ఛూమంత్రం వేసినట్లే..

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సర్వసాధారణ సమస్యగా మారింది.. మునుపటి కాలంలో మధుమేహం సాధారణంగా 40-45 సంవత్సరాల తర్వాత వచ్చేది. కానీ ఈ రోజుల్లో పిల్లలు, వృద్ధులు, యువకులు అన్ని వయసుల వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఎవరికైనా ఒకసారి ఈ వ్యాధి వచ్చినట్లయితే.. అది జీవితాంతం విడిచిపెట్టదు.. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఇప్పటివరకు దీనికి నివారణ మందులను కనుగొనలేకపోయారు. భారతదేశంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది.. కాబట్టి ప్రతి ఒక్కరూ దాని గురించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు..

మధుమేహానికి వరం తామరపువ్వు విత్తనం..

డయాబెటిక్ రోగులు వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు.. దీంతో మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని చాలా వరకు నిర్వహించగల కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి.. వాటిలో తామర విత్తనాలు అద్భుతమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తామర పువ్వు విత్తనాల సహాయంతో డయాబెటిస్ ను ఎలా అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

వాస్తవానికి తామర పువ్వు విత్తనంలోని ఔషధగుణాలు మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.

ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. అలాంటి వాటిల్లో తామర గింజలు పోషకమైన ఆహారం కంటే తక్కువ కాదని పేర్కొంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పువ్వు విత్తనాలను వీలైనంత ఎక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.

తామర విత్తనాలు ఎందుకు ముఖ్యమైనవి..?

తామర గింజలలో చాలా పోషకాలు దాగున్నాయి. ఇందులో విటమిన్ బి6, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.. గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించగలవు. తామర విత్తనాలు క్రమం తప్పకుండా తింటే అధిక రక్తపోటును కూడా నియంత్రించవచ్చు.

భారతీయ సంస్కృతిలో తామర పువ్వును పవిత్రంగా పరిగణిస్తారు.. దీనిని పూజకు ఉపయోగిస్తారు. ఈ పువ్వు మూలాల నుంచి రుచికరమైన కూరను కూడా తయారు చేస్తారు. రుచికరమైన దీనిని ప్రజలు ఆస్వాదిస్తూ తింటారు. బురదలో పెరిగే ఈ పూలను అలంకరణకు కూడా ఉపయోగిస్తారు. అయితే.. మీ ఇంటి దగ్గరలో చెరువు లేకుంటే.. పెద్ద కుండీలో ఇళ్లల్లో కూడా ప్రత్యేక పద్ధతిలో పెంచుకోవచ్చు.

Mushrooms : డయాబెటిస్ కి పుట్టగొడుగులు మంచిదా.కాదా.!

Mushrooms : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ వ్యాధిగా మారింది. ఈ మధుమేహ సమస్యను ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు తమ ఆహారంపై ఎంత దృష్టి పెట్టాలి.

లేకుంటే ప్రమాదంలో పడ్డట్టే. ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటిస్ ఉన్నారు తీసుకునే పండ్లు,కూరగాయలు, ధాన్యాలు ఇక ఇతర ఆహార పదార్థాలను ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే డయాబెటిస్ ఉన్నటువంటి వారు తీసుకునే ఆహార పదార్థాల గురించి ప్రతినిత్యం కొన్ని ప్రశ్నలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి ఆహార పదార్థాలలో పుట్టగొడుగు ఒకటి. ఎంతో మంది ప్రజలు పుట్టగొడుగులు ఫంగస్ గా వర్గీకరించడం వలన రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పదార్థాలను కోల్పోతున్నట్లు గ్రహించకుండా వాటికి దూరంగా ఉంటున్నారు. పుట్టగొడుగు అనేది ఎంతో ఖరీదైన ఆహార పదార్థం. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అని భావిస్తున్నారు. అయితే డయాబెటిస్ ఉన్న పేషెంట్లు ఈ పుట్టగొడుగులను తినవచ్చా. లేదా. అనేది ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. నిజానికి పుట్టగొడుగులు మొత్తం ఆరోగ్యానికి మేలు చేయటం వలన డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. మధుమేహ వ్యాధి ఉన్నవారు తను తీసుకునే ఆహారంలో పుట్టగొడుగులను ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

డయాబెటిస్ రోగులకు పుట్టగొడుగులు ఎలా ఉపయోగపడతాయి

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది : పుట్టగొడుగులో తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్, గ్లైసోమీక్ లోడ్ కలిగి ఉన్నటువంటి ఒక సూపర్ ఫుడ్. ఇది రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిని పెరగకుండా నియంత్రించగలదు. అనగా దీని ద్వారా మీరు గ్లూకోస్ స్థాయిని తగ్గించవచ్చు..

కేలరీలు తీసుకోవడం నిర్వహించవచ్చు : పుట్టగొడుగులో చక్కెర కార్బోహైడ్రేట్లు అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. కొన్ని అధ్యయనాలు చాలా తక్కువ కార్బ్ ఆహారం మధుమేహా న్ని తగ్గించటంలో ఎంతో సహాయం చేస్తుంది అని సూచిస్తున్నారు. అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా వాటిని నియంత్రించకపోవచ్చు..

మధుమేహం నుండి రక్షణ : పుట్టగొడుగులు పాలీశాకరైడ్లు అనేవి ఉన్నాయి. ఇవి యాంటీ డయాబెటిక్ అనే ప్రభావం కలిగి ఉన్నాయి. ఇది మధుమేహం నుండి రక్షణ కవచాన్ని ఇస్తుంది. ఇంకా రోగుల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది..

బరువు తగ్గటం- గుండె ఆరోగ్యం : పొట్ట గొడుగులను ప్రతిరోజు తీసుకునే వారు తమ బరువును తగ్గించటం సులభం అవుతుంది. ఊబకాయం అనేది మధుమేహానికి మొదటి మెట్టుగా చెబుతారు. అంతేకాక అధిక బరువు అనేది గుండె సమస్యలను పెంచుతుంది. పుట్ట గొడుగులు కొలెస్ట్రాల్ ను నియంత్రించడం వలన గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది..

Mushrooms : డయాబెటిస్ కి పుట్టగొడుగులు మంచిదా…కాదా…

పొట్ట గొడుగుల ని ఎలా ఉడికించాలి : డైటరీ ఫైబర్, మినరల్స్,ప్రోటీన్లు, విటమిన్ బీ1,విటమిన్ బీ2,విటమిన్ బీ12, విటమిన్ సి, విటమిన్ ఇ, టెర్పెనెస్, క్వినోలోన్స్, స్టేరాయి డ్స్, ఫ్లేవనాయిడ్స్, కెరోటినా యిడ్స్, లాంటి యాంటీ ఆక్సిడెంట్లు బీటా గ్లూకాన్ లాంటి పాలీశాకరైడ్లు అధికంగా ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి ఈ పుట్ట గొడుగులను మీరు గనక సరిగ్గా ఉడికించినప్పుడే ప్రయోజనాలు అనేవి కూడా సరిగ్గా అందుతాయి. పుట్ట గొడుగులను కూరగా లేక సలాడ్ గా కూడా తీసుకోవచ్చు. ఇవి కాక తక్కువ నూనె, తక్కువ మంటలో వీటిని నెమ్మదిగా ఉడికించి వండుకోవాలి. అప్పుడే వీటి ప్రయోజనాలు అనేవి శరీరానికి పుష్కలంగా అందుతాయి…

కండలు పెరగాలని 6 లీటర్ల ద్రవం ఇంజెక్ట్ చేసుకున్నాడు.. కట్ చేస్తే..

ఈరోజుల్లో చాలామంది యువకులు ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెడుతున్నారు. బలమైన కండలు తిరిగిన శరీరం కోసం వ్యాయామశాలల్లో గంటల కొద్దీ కష్టపడుతున్నారు. కండలు పెంచడానికి ప్రోటీన్ పౌడర్ లాంటివి కూడా వాడతారు.

కానీ, పాలకూర తినే కార్టూన్‌ క్యారెక్టర్‌ పొపాయ్ లాగా కండలు వెంటనే పెరిగిపోవు. దీనికి చాలా సమయం, కృషి పట్టాలి.

అయితే, కిరిల్ టెరెషిన్( Kirill Tereshin ) అనే రష్యా కుర్రాడు కండలు పెంచుకోవడానికి చాలా వింతమైన, ప్రమాదకరమైన దారిని ఎంచుకున్నాడు. “రష్యన్ పొపాయ్,” “బజూకా హ్యాండ్స్”( “Russian Popeye,” “Bazooka Hands” ) అనే పేర్లతో పిలవబడే కిరిల్ తన కండలు చాలా పెద్దగా పెంచుకోవాలనే పిచ్చిలో పడ్డాడు. అందుకే వాసెలిన్‌ ( Vaseline )లాంటి ద్రవ పదార్థాన్ని ఏకంగా ఆరు లీటర్లు తన చేతుల్లోకి ఎక్కువగా ఇంజెక్ట్ చేసుకున్నాడు. దాంతో చేతులు చాలా ఉబ్బాయి. కిరిల్ ఈ వీడియోని టిక్‌టాక్ అనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ, అందరూ ఆశ్చర్యపడే బదులు, అతని ఆరోగ్యం పట్ల ఆందోళన పడ్డారు.

వైరల్ అయిన వీడియో, అతని చేతులు అసహజంగా పెద్దవిగా ఉన్నట్లు కనిపించింది. నెటిజన్లు వింతగా ఉన్న అతడి పెదవులను కూడా గమనించారు. చాలా మంది కిరిల్ శ్రేయస్సు గురించి ఆందోళన వ్యక్తం చేశారు, అతని పరిస్థితి ప్రాణాపాయంగా మారుతుందని, వైద్య సహాయం కోరాలని సూచించారు. కిరిల్ చర్యల వల్ల రక్తనాళాలు, కణజాలు దెబ్బతింటాయని, దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు కామెంట్లు చేశారు. ఇంజెక్షన్ల వల్ల వచ్చే చిక్కుల తెలుసుకున్నాక అతడు జాగ్రత్త పడ్డాడు. పెట్రోలియం జెల్లీని, ప్రభావిత కణజాలాలను తొలగించడానికి అతను అనేక శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. పరిస్థితి మరింత దిగజారితే చేతులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మహిళలను ఆకర్షించాలనే ఆశతో తాను ఈ విపరీతమైన చర్యకు పాల్పడ్డానని ఆ తర్వాత ఒప్పుకున్నాడు. కండలు తిరిగిన సహజ రూపానికి వస్తేనే అందంగా ఉంటాయని తెలుసుకున్నాడు.పెట్రోలియం జెల్లీని ఉపయోగించే ముందు, అతను తన కండరాలను నూనెతో పెంచుకోవడానికి ప్రయత్నించాడు, ప్రమాదాలు ఉన్నప్పటికీ, తనలాంటి కండలు తిరిగిన మగ వ్యక్తి అమ్మాయిలను ఈజీగా ఆకర్షించగలరని అతడు నమ్మాడు. ఆ తర్వాత అది ప్రాణాలకే ప్రమాదం అని తెలుసుకున్నాడు.

AP News: అసెంబ్లీ సమావేశాల కోసం ముస్తాబవుతున్న వివిధ పార్టీల కార్యాలయాలు

ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. ఒక రోజు అటో ఇటో సమావేశాలైతే నాలుగైదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల కోసం వివిధ పార్టీల కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. జనసేన పార్టీకి కొత్తగా జేఏఎస్ఎల్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచి టీడీఎల్పీ కేటాయించిన కార్యాలయాన్ని జేఎస్ఎల్పీకి కేటాయించడం జరిగింది.

అమరావతి: ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. ఒక రోజు అటో ఇటో సమావేశాలైతే నాలుగైదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల కోసం వివిధ పార్టీల కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. జనసేన పార్టీకి కొత్తగా జేఏఎస్ఎల్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచి టీడీఎల్పీ కేటాయించిన కార్యాలయాన్ని జేఎస్ఎల్పీకి కేటాయించడం జరిగింది. 2014 లో వైఎస్సార్‌ఎల్పీకి కేటాయించిన కార్యాలయాన్ని బీజేఎల్పీకి కేటాయిస్తున్నారు.

2014లో బీజేఎల్పీకి కేటాయించిన కార్యాలయాన్ని వైయస్ఆర్ఎల్పీకి కేటాయించడం జరిగింది. నాలుగు రోజుల నుంచి అసెంబ్లీలోని వివిధ పార్టీల కార్యాలయాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అన్ని కార్యాలయాలకూ అధికారులు శరవేగంగా రంగులు వేయిస్తున్నారు. మొదట 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచన ఉండటంతో ఆ సమయానికల్లా సిద్ధం చేసేందుకు అధికారులు పరుగులు పెడుతున్నారు. 17న బక్రీద్ కావడంతో అసెంబ్లీ సమావేశాలు మరో తేదీకి మారే అవకాశం ఉంది.

Calcium Rich Foods: క్యాల్షియం పుష్కలంగా ఉండే 7 ఆహారాలు.. ఇవి ఎముక ఆరోగ్యానికి ఎంతో మేలు..

Calcium Rich Foods: ఆరోగ్యకరమైన ఎముకల కోసం క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి అంటారు. ఎందుకంటే ఎముక ఆరోగ్యంతో పాటు కండరాల నిర్మాణానికి కాల్షియం ఎంతో అవసరం.

పాల పదార్థాలు ముఖ్యంగా పాలు చీజ్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు కొన్ని రకాల పండ్లలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ 7 రకాల ఆహార పదార్థాలు డైట్లో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది. ఇది ఎముక ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో అవసరం.

ఆరెంజ్..
ఆరెంజ్ రుచిగా ఉండటమే కాకుండా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఆరెంజ్ లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఒక మీడియం సైజులో 52 మిల్లీగ్రామ్స్ క్యాల్షియం ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ రూపంలో తీసుకున్న మీకు క్యాల్షియం లెవెల్స్ అందుతాయి. ఇది ఎముక ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఫిగ్స్..
ఫిగ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటే అంతే కాదు. ఇందులో కాల్షియం కూడా ఉంటుంది ఒక పండిన ఫిగ్గు లేకపోతే డ్రైడ్ ఫిగ్గు ఏదైనా తీసుకోవచ్చు ఇదే ఎముక ఆరోగ్యానికి మంచి ఖనిజం. 3 ఫిగ్స్ లో 50 మిల్లీగ్రామ్స్ క్యాల్షియం ఉంటుంది ఫిగ్స్ మనం స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. ఒక ఫిగ్స్ లో పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముక ఆరోగ్యానికి మంచిది.

కివి..
కివిలో కూడా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రుచికరంగా మనకి ఉంటుంది అంతేకాదు ఇందులో క్యాల్షియం ఉంటుంది ఒక మీడియం సైజ్ కివీలో 60 మిల్లీగ్రామ్ ల కాల్షియం ఉంటుంది. కీవీలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఆరోగ్యానికి మంచిది.

ప్రూన్స్..
ప్రూన్స్ జీర్ణ ఆరోగ్యానికి మంచిది. ఇందులో కాల్షియం ఉంటుంది. ప్రూన్స్ లో మూడు మిల్లీగ్రామ్ల క్యాల్షియం ఉంటుంది ఫ్రూన్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాల్షియం మన శరీరానికి అందుతుంది.

ఆప్రికాట్స్..
ఆఫ్రికాట్స్‌ లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఎముక అభివృద్ధి కూడా సహాయపడుతుంది. ఒక డ్రై ఆఫ్రికాట్స్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పండిన ఆఫ్రికాట్స్‌ని కూడా తీసుకోవచ్చు క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది తీసుకుంటే శరీర ఆరోగ్యానికి మంచిది.

మల్బరీస్..
మల్బరీస్‌లో కూడా క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పుకి మల్బరీస్‌లో 55 గ్రా మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది అంతే కాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ ఉంటాయి ఆరోగ్యానికి మంచిది.

బ్లాక్బెర్రీస్..
బ్లాక్ బెర్రీస్ లో కూడా క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు బ్లాక్ బెర్రీస్ లో 42 మిల్లీగ్రామ్ ల కాల్షియం ఉంటుంది అంతేకాదు ఇందులో ఫైబర్ మన శరీరానికి అవసరమైన ఖనిజాలు కూడా ఉంటాయి. బ్లాక్ బెర్రీస్ ఎముక ఆరోగ్యానికి కూడా మంచివి.

India Vs USA: ఐసీసీ రూల్ తెలియక కొంప ముంచుకున్న అమెరికా.. ఇదే భారత్ గెలుపునకు టర్నింగ్ పాయింట్

India Vs USA: టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్న అమెరికా.. భారత్ తో బుధవారం జరిగిన మ్యాచ్లో హోరాహోరీ గా ఆడింది. అనామక జట్టే అయినప్పటికీ పూర్తిస్థాయి ఓవర్లు ఆడింది.

బుమ్రా వంటి బౌలర్ ను ధాటిగా ఎదుర్కొంది. న్యూయార్క్ లాంటి మైదానంపై మూడు అంకెల స్కోర్ సాధించి సత్తా చాటింది. బౌలింగ్ లోనూ ఆకట్టుకుంది. చివరికి ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ.. స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించింది. ఈ మ్యాచ్ లో ఐసీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధన తెలియక అమెరికా తన కొంప తానే ముంచుకుంది. స్టాప్ క్లాక్ రూల్ తెలియక.. ఐదు పరుగులను అప్పనంగా టీమిండియాకు ఇచ్చింది.

ఏంటి ఈ రూల్

మ్యాచ్ లను సకాలంలో ముగించేందుకు ఐసీసీ స్టాప్ క్లాక్ నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం ఫీల్డింగ్ జట్టు ఓవర్ ముగిసిన నిమిషంలోపు తదుపరి ఓవర్ మొదలుపెట్టాలి. ఒక ఇన్నింగ్స్ లో ఇలా మూడుసార్లు నిమిషంలోపు మిగతా ఓవర్ మొదలు పెట్టకపోతే ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. ఈ సమయాన్ని థర్డ్ ఎంపైర్ స్టాప్ క్లాక్ సహాయంతో లెక్కిస్తాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో అమెరికా బౌలర్లు మూడుసార్లు నిమిషం లోపు మరో
ఓవర్ మొదలు పెట్టలేదు. అప్పటికి ఎంపైర్ రెండుసార్లు హెచ్చరించారు. మూడోసారి కూడా ఇదే సంఘటన పునరావృతం కావడంతో అదనంగా ఐదు పరుగులు పెనాల్టీ విధించాల్సి వచ్చింది. ఈ ఐదు పరుగులు టీమ్ ఇండియా పై ఒత్తిడిని చాలా వరకు తగ్గించాయి.

భారత జట్టు విజయ సమీకరణం 30 బంతుల్లో 35 పరుగులకు చేరుకున్నప్పుడు.. ఈ ఐదు పరుగులు లభించడం రోహిత్ సేనకు ఊరటనిచ్చింది. ఈ ఐదు పరుగులు రావడంతో భారత ఆటగాళ్లు సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు.. ఇక ఇదే సమయంలో 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్య కుమార్ యాదవ్ ఇచ్చిన సునాయాస క్యాచ్ ను సౌరభ్ నేత్రావల్కర్ అందుకోలేకపోయాడు. ఒకవేళ అతడు గనుక ఈ క్యాచ్ పట్టి ఉంటే ఆట తీరు మరో విధంగా ఉండేది. పెనాల్టీ అయిదు పరుగులు లభించకపోయినా ఫలితం మరోలా ఉండేది.

ఇక ఈ మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీష్ కుమార్(23 బంతుల్లో 27), స్టీవెన్ టేలర్(30 బంతుల్లో 24) టాప్ స్కోరర్ లుగా నిలిచారు. భారత బౌలర్ అర్ష్ దీప్ సింగ్(4/9) నాలుగు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా (2/14) రెండు వికెట్లు, అక్షర్ పటేల్ (1/25) కు ఒక వికెట్ దక్కింది.. లక్ష్య చేదనలో భారత జట్టు వెంట వెంటనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రూపంలో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రిషబ్ పంత్ వికెట్ నష్టపోయింది. అయితే సూర్య కుమార్ అజేయ అర్థ సెంచరీ, శివం దూబే 31 పరుగులతో రాణించాడు. సౌరభ్ నేత్రావల్కర్ 2/18, అలీ ఖాన్ 1/21 తో ఆకట్టుకున్నారు. గెలుపు ద్వారా టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సూపర్ -8 కు చేరుకుంది.

విలీనమా..వేరే గ్రూపా? ‘కారు’ దిగేందుకు రెడీగా మరో 22 మంది ఎమ్మెల్యేలు

బీఆర్​ఎస్​ పార్టీని వీడేందుకు దాదాపు మరో 22 మంది ఎమ్మెల్యేలు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ముగ్గురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరారు. వీరితోపాటు మిగిలిన 22 మందిని కలిపితే బీఆర్​ఎస్​ను వీడే ఎమ్మెల్యేల సంఖ్య 25కు చేరనుంది. వీరంతా అధికార పార్టీ శాసనసభా పక్షంలో విలీనం కావడంపై కాంగ్రెస్​తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పొలిటికల్​ సర్కిల్స్​లో టాక్​ వినిపిస్తున్నది. బీఆర్​ఎస్​ఎల్పీని పూర్తిగా సీఎల్పీలో విలీనం చేయడమా లేకుంటే వేరే గ్రూప్​గా ఉండడమా అనే దానిపై వీళ్లంతా సమాలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. లెజిస్లేచర్​ పార్టీని విలీనం చేయాలంటే గెలిచిన ఎమ్మెల్యేల్లో 2/3 వంతు ఎమ్మెల్యేలు బయటకు రావాల్సి ఉంటుంది.

ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 2/3 వంతు మంది (దాదాపు 26 మంది) ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వీళ్లంతా అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ ఇస్తే, ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్‌ఎల్పీగా గుర్తించి కాంగ్రెస్‌లో విలీనం చేసే అధికారం సభాపతికి ఉంటుంది. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం 25 మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు(ఇప్పటికే ముగ్గురు బీఆర్​ఎస్​ను వీడారు) బయటకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు.

ఇంకో ఒక ఎమ్మెల్యే కూడా మారేందుకు సిద్ధమైతే విలీనం చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే విలీనం కాకుండా.. తమను వేరే గ్రూప్​గా గుర్తించాలని, తమదే అసలైన బీఆర్​ఎస్​ ఎల్పీ అని అసెంబ్లీ స్పీకర్​ను ఈ ఎమ్మెల్యేలు కోరే చాన్స్​ కూడా ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. ఇదే జరిగితే.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఈ గ్రూప్​కే వస్తుంది. అందులో ఉండే ఎమ్మెల్యేకే లీడర్​ ఆఫ్​ అపొజిషన్​ దక్కుతుంది. ఫలితంగా ప్రతిపక్ష నేత హోదాను కూడా కేసీఆర్​ కోల్పోవాల్సి వస్తుంది. అయితే వేరు గ్రూప్​గా ఉంటే భవిష్యత్​లో పొలిటికల్​ ఈక్వెషన్స్​ ఎలా ఉంటాయనే తెలియదని, విలీనమే బెస్ట్​ అని కొందరు అనుకుంటున్నట్లు తెలిసింది.

నాడు బీఆర్​ఎస్​ చేర్చుకుందిలా..

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్.. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నది. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీడీపీకి చెందిన 12 మందిని, కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురిని, వైసీపీకి చెందిన ముగ్గురిని, బీఎస్పీకి చెందిన ఇద్దరిని, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యేను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని కేసీఆర్ తన పార్టీలో జాయిన్​ చేసుకున్నారు. వీరితో పాటు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను, మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు.

నాడు 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది బీఆర్ఎస్‌లో చేరగానే కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్‌కు కూడా అలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్​, తెల్లం వెంకట్రావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. మరో 22 మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కూడా ‘కారు’ దిగేందుకు రెడీ అవుతున్నట్లు టాక్​.

కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. ఇక మహిళల అకౌంట్లలో డబ్బు జమ!ఎప్పుడంటే?

కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. ఇక మహిళల అకౌంట్లలో డబ్బు జమ!ఎప్పుడంటే?

ఎవరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభంజనం సృష్టించింది. టీడీపీ, బీజేపీ జనసేన కూటమికి 164 స్థానాలతో ఏపీ ప్రజలు చారిత్రాత్మక అఖండ విజయం అందించారు.

అయితే కూటమి విజయానికి మహిళలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల ముందే టీడీపీ నేతలు మహిళలు, వృద్ధులు తమకు అండగా ఉన్నారని తప్పక కూటమి గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే టీడీపీ ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి మేనిఫెస్టో రూపకల్పనలో పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. మహిళలు, వృద్ధులను ఆకట్టుకునేలా ఆరు అద్భుతమైన పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ పథకంలో ఒకటైన.. స్త్రీనిధి కింద ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. మరో పథకం ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000 అందిస్తామని ప్రకటించారు. ‘దీపం’ స్కీం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని చెప్పారు. కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీ ‘ఉచిత బస్సు ప్రయాణం’ ఒకటి. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త ప్రభుత్వంలోకి అడుగు పెట్టారు. ఇక నెల తిరిగేలోపే మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారని సమాచారం

ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్య

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని ఎగువకురవవంకకు చెందిన దొరస్వామి (62)ని దుండగులు చంపారు.

కురవవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో దొరస్వామి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం భార్య మృతిచెందడంతో కుమార్తె హరితతో కలిసి ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున తలపై బలంగా కొట్టడంతో ఆయన మృతిచెందారు.

సమాచారం అందుకున్న మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ వలీబ్‌ బసు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లోనే కుమార్తె ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుమార్తెను పోలీసులు విచారిస్తున్నారు.

AP Speaker: ఏపీ స్పీకర్ పదవికి రేసులో ఆ ఐదుగురు.. ఎవరిని వరిస్తుందో..

AP Speaker: ఆంధ్రప్రదేశ్ లోటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కొలువుతీరబోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రాబునాయుడుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

ఇప్పటికే మంత్రులుగా ఎంపికైన వారి లిస్ట్ అందుబాటులోకి వచ్చింది. అయితే, అందులో కొందరు సీనియర్లకు స్థానం దక్కలేదు. దీంతో ఇప్పుడు వారికి ఎటువంటి అవకాశం కల్పిస్తారు అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ స్పీకర్ పదవికి వీరిలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. సీనియర్లలో స్పీకర్ పదవి కోసం రేసులో ఉన్నట్టుగా ముఖ్యంగా ఐదుగురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

ఆ ఐదుగురు..
AP Speaker: అయ్యన్న పాత్రుడు, కాలువ శ్రీనివాసులు, కొణతాల రామకృష్ణ, పితాని సత్యనారాయణ, బుచ్చయ్య చౌదరి స్పీకర్ పదవికి రేసులో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వీరిలో బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు ఇద్దరూ ఏడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో చంద్రబాబు తరువాత వీరిద్దరే సీనియర్లని చెప్పవచ్చు. దీంతో ఈ ఐదుగురిలోనూ వీరిద్దరి మధ్యే స్పీకర్ పదవికి పోటీ ఎక్కువ ఉన్నట్టు చెబుతున్నారు. ఇక కొణతాల రామకృష్ణ జనసేననుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జనసేనకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో సహా ముగ్గురికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో కొణతాలకు స్పీకర్ పదవి వస్తుందా అనేది అనుమానమే అని చెప్పవచ్చు. ఇక మిగిలిన వారిలో పితాని సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కాల్వ శ్రీనివాసులు కూడా మొదటి నుంచి టీడీపీతో కొనసాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచే స్పీకర్ పదవి ఇవ్వాలి అనుకుంటే కనుక సీనియార్టీ దృష్ట్యా అయ్యన్న పాత్రుడు.. బుచ్చయ్య చౌదరిలలో ఎవరికైనా ఇవ్వాలి. లేదూ వేరే సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటే కాల్వ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణాల్లో ఎవరికైనా ఛాన్స్ దక్కొచ్చు. ఈ నలుగురిలో ఎవరిని స్పీకర్ చేసినా.. కొణతాలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయా పరిశీలకులు చెబుతున్నారు.

అలా అయితే..
AP Speaker: కేంద్రంలో స్పీకర్ పదవి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, అక్కడ పురంధేశ్వరికి ఆ పదవి దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ నుంచి ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. బీజేపీకి రెండు పదవులు ఇస్తారని ముందు నుంచి ప్రచారంలో ఉన్నా.. చివరి నిమిషంలో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. ఇప్పుడు బీజేపీ కూడా స్పీకర్ పదవిని కోరుతోందని కూడా చెప్పుకుంటున్నారు. మొత్తమ్మీద చూస్తే.. ఏపీలో మంత్రి పదవుల కంటే క్లిష్టంగా స్పీకర్ ఎంపిక మారిందని చెబుతున్నారు విశ్లేషకులు.

స్టార్ హీరో బన్నీకి భారీ షాక్.. సాయితేజ్ అన్ ఫాలో చేయడానికి కారణాలివేనా

ప్రతి కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు సర్వ సాధారణం అనే సంగతి తెలిసిందే. ఆ సమస్యలను అంతకంతకూ పెంచుకుంటే సమస్యలు తప్పవు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ( YCP ) అభ్యర్థి తరపున ప్రచారం చేయడం వల్ల మెగా ఫ్యామిలీ కి శత్రువు అయ్యాడు.

నాగబాబు బన్నీ పరాయివాడు అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం అయింది. అయితే జనసేన గెలిచిన తర్వాత అల్లు అర్జున్ పవన్ కు శుభాకాంక్షలు చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ ట్వీట్ తో సమస్య సద్దుమణిగినట్టేనని అందరూ భావించినా ఎవరూ ఊహించని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మెగా మేనల్లుడు సాయితేజ్( Sai Dharam Tej ) సోషల్ మీడియాలో బన్నీ, స్నేహారెడ్డిని అన్ ఫాలో చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

అల్లు శిరీష్ ను మాత్రం సాయితేజ్ ఫాలో అవుతున్నారు. అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య దూరం పెరుగుతోందని ఈ ఘటనతో మరోసారి ప్రూవ్ అయింది. అయితే అల్లు హీరోను అన్ ఫాలో చేయడం గురించి సాయితేజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వైసీపీ అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేయడమే సాయితేజ్ కోపానికి కారణమని భోగట్టా.

పవన్( Pawan Kalyan ) ప్రమాణ స్వీకారం చేసిన రోజే సాయితేజ్ బన్నీని అన్ ఫాలో చేయడం కొసమెరుపు. ఈ ఘటనల గురించి భవిష్యత్తులో బన్నీ నోరు విప్పుతారేమో చూడాల్సి ఉంది. బన్నీని టార్గెట్ చేయడం విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ పుష్ప ది రూల్ చెప్పిన సమయానికి రిలీజ్ కావడం కష్టమనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బన్నీ మాత్రం ఈ వివాదాన్ని పెద్దది చేయడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

SBI బంపరాఫర్.. 45 నిమిషాల్లోనే లోన్ మంజూరు

ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు ఎంఎస్ఎంఈల రుణ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI..”SME డిజిటల్ బిజినెస్ లోన్స్(SME Digital Business Loans)”​ ప్రారంభించింది.

దీని ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME)కు కేవలం 45 నిమిషాల్లోనే లోన్ మంజూరు చేస్తామని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లు బ్యాంకు రుణాల వృద్ధి, లాభాలకు ఈ సంస్థలే కీలకమని భావిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా తెలిపారు. ఈ సంస్థల రుణ అవసరాలను వేగంగా మదింపు చేసి, రుణాలు మంజూరు చేసేందుకే ‘ఎస్‌ఎంఈ డిజిటల్‌ బిజినెస్‌ లోన్స్‌’ పేరుతో ప్రత్యేక పథకం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 10 సెకన్లలో MSMEల రుణ అర్హతను మదింపు చేసి, 45 నిమిషాల్లోనే రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

కొత్తగా ప్రారంభించిన ఈ విధానం సంప్రదాయంగా ఉన్న క్రెడిట్ అండర్ రైటింగ్, సుదీర్ఘ పరిశీలనల వంటి వాటిని తొలగిస్తుందని, చిన్న పరిశ్రమలకు లోన్ జారీ సరళంగా ఉండటం సహా వేగం పెరుగుతుందని తెలిపారు.

డేటా ఆధారిత లోన్ మంజూరు టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్న్స్, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు మొదలైనవాటితో పాటు అవసరమైన వివరాలను సమర్పిస్తే కేవలం 10 సెకన్లలోపే లోన్ మంజూరు చేయాలా, వద్దా అనేది సిస్టమ్ నిర్ణయిస్తుంది. ఈ విధంగా వేగంగా లోన్ మంజూరు చేయడానికి వీలవుతుంది. దీంతో ఎంఎస్ఎంఈల లోన్ మార్కెట్ లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని ఎస్బీఐ భావిస్తోంది.

ఇక,గత ఆర్థిక సంవత్సరం ఎస్బీఐ ఎంఎస్ఎంఈ సంస్థలకు రూ.4.33 లక్షల లక్షల కోట్ల రుణాలు ఇవ్వగా.. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువ.

IMMS Latest Updated Version Download

IMMS Latest App
IMMS App

IMMS Latest Updated Version Download

IMMS APP Download – IMMS Play Store APP Download -MDM – TMF Sanitation APP
IMMS APP Download – IMMS Play Store APP Download -MDM – Sanitation APP. Integrated MDM Monitoring System and Sanitation APP Download from Play Store. Every HM of the Every School has to enter the details of MDM and Meals Taken, Eggs Report, Chikkis Report and Sanitation Details in IMMS APP everyday. This IMMS APP is very useful for all Head Masters for Monitoring of MDM and School Sanitation. Download the IMMS APP from Google Play Store.

AP IMMS App Latest version has been updated. The newly released . Old version of IMMS App would not work from today on wards. School heads are requested to download newer version of IMMS for updating school details. The download direct link is given below.

Download IMMS Latest Updated version

School Attendance App latest Updated version Download

School Attendance App latest Updated version Download | Teachers Students Attendance latest updated App

SIMS-AP School Attendance APP latest Updated version Download | Teachers Students N Attendance latest updated APP

AP School Education Department has developed an Attendance APP based on Artificial Intelligence. This AI Based School Attendance app is named as SIMS AP. School Integrated Management System APP for All Schools in Andhra Pradesh. This SIMS AP New Students Attendance APP not only captures Teachers Attendance, But also capable of capturing Students attendance, Manage Leaves of Teachers, Teachers can Apply for Leaves using this SIMS School Attendance APP. Details of this APP and How to use this APP, Features of this Android School Attendance APP, How to Download / Install the Latest Official Version of SIMS AP AI Based Attendance APP is explained below.

Download….AP School Attendance APP

 

 

చంద్రబాబు మంత్రివర్గంలో కందుల దుర్గేశ్‌కు చోటు: ఎవరీ కందుల దుర్గేశ్..ఆయన బ్యాక్ గ్రౌండ్ ఓసారి చూద్దాం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. విజయవాడ గన్నవరం మండలం కేసరవల్లి ఐటీ పార్క్ మేధా టవర్స్ దగ్గర ఏర్పాటు చేసిన సభా స్థలంలో చంద్రబాబు నాయుడు ఉదయం 11.47 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో ఎవరెవరికి బెర్త్ దక్కుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే కందుల దుర్గేశ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. జనసేన పార్టీలో హేమాహేమీలను పక్కనపెట్టి మరీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు కందుల లక్ష్మీ దుర్గేశ్ ప్రసాద్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ బోలపేతం చేయడంలో పార్టీ అధ్యక్షుడిగా సక్సెస్ అవ్వడంతో అటు పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ఇటు కూటమి ఏర్పాటు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీతో సమన్వయం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించడంతో ఆయనకు కేబినెట్‌లో మంత్రి పదవి వరించింది. కందుల లక్ష్మీ దుర్గేశ్ ప్రసాద్ ప్రొఫైల్ ఓసారి చూద్దాం.

రాజకీయ జీవితం
కందుల లక్ష్మీదుర్గేశ్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీలో పలు విభాగాల్లో పనిచేశారు. 2007లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రాష్ట్రవిభజన అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2016 డిసెంబర్ 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీలో ఇమడలేకపోయిన కందుల దుర్గేశ్ 30 ఆగష్టు 2018న జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 42,685 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నిడదవోలు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు

మంత్రివర్గం కూర్పు-సామాజిక సమీకరణాలు
ఇకపోతే మంత్రివర్గం కూర్పులో జనసేనకు 3, బీజేపీకి ఒకరికి చోటు కల్పించారు. మంత్రివర్గంలో సగానికిపైగా కొత్తవారే ఉండటం గమనార్హం. ఈసారి కేబినెట్‌లో 17 మంది కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు. వీరలో 10 మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు ఉండటం విశేషం.చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. కాపు-4, కమ్మ-4, రెడ్డి-3, బీసీ-8 మంది, ఎస్సీ-ఇద్దరు, ఎస్టీ-1, ముస్లిం మైనారిటీ-1,, వైశ్య-1చోటు కల్పించారు. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో ముగ్గురు మహిళలకు ప్రాతినిథ్యం కల్పించారు. ఇకపోతే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన మాటను చంద్రబాబు నెలబెట్టుకున్నారు. ఇద్దరి నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇకపోతే ఎస్సీ సామాజిక వర్గం నుంచి

కొత్త మంత్రుల జాబితా ఇదే

1. కొణిదెల పవన్ కల్యాణ్
2. నారా లోకేశ్
3. కింజరాపు అచ్చెన్నాయుడు
4. కొల్లు రవీంద్ర
5. నాదెండ్ల మనోహర్
6. పొంగూరు నారాయణ
7. అనిత వంగలపూడి
8. సత్యకుమార్ యాదవ్
9. నిమ్మల రామానాయుడు
10. ఎన్ఎండీ ఫరూక్
11. ఆనం రామనారాయణరెడ్డి
12. పయ్యావుల కేశవ్
13. అనగాని సత్యప్రసాద్
14. కొలుసు పార్థసారథి
15. డోలా బాల వీరాంజనేయస్వామి
16. గొట్టిపాటి రవికుమార్
17. కందుల దుర్గేశ్
18. గుమ్మడి సంధ్యారాణి
19. బీసీ జనార్ధన రెడ్డి
20. టీజీ భరత్
21. ఎస్. సవిత
22. వాసంశెట్టి సుభాష్
23. కొండపల్లి శ్రీనివాస్
24. ముండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి

Deputy C M: రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి ఉందా? గతంలో సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో 23 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పదవిపై చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి వరిస్తుందని అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ రాజ్యంగంలో ఈ పదవి ఉందా.. డిప్యూటీ సీఎం పదవిపై గతంలో సుప్రీం కోర్టు ఏం చెప్పిందో చూద్దాం.

రాజ్యాంగంలోని 163, 164 అధికరణలు ముఖ్యమంత్రి, మంత్రివర్గానికి సంబంధించిన నిబంధనలను తెలియజేస్తాయి. ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్‌కు సలహా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం ఉంటుంది. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారని, మంత్రివర్గాన్ని కూడా ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్ నియమిస్తారనే నిబంధన ఉంది. అయితే ఈ రెండు పేరాల్లో డిప్యూటీ సీఎం పదవి ప్రస్తావన లేదు. రాష్ట్రంలో క్యాబినెట్‌ మంత్రితో సమానంగా డిప్యూటీ సీఎం పదవిని పరిగణిస్తారు. క్యాబినెట్ మంత్రికి లభించే జీతం, సౌకర్యాలే డిప్యూటీ సీఎంకు కూడా లభిస్తాయి.

డిప్యూటీ సీఎం నియామకంపై ఈ ఏడాది ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ విరుద్ధం కాదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నిజానికి డిప్యూటీ సీఎంల నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ప్రజా రాజకీయ పార్టీ అనే సంస్థ దాఖలు చేసింది. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం లాంటి పదవి లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ని ఉల్లంఘిస్తుందని

ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. డిప్యూటీ సీఎం పదవి అనేది ఒక పదవి అని, అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించదని అన్నారు. డిప్యూటీ సీఎం కావడం వల్ల ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేదా అధిక జీతం లభించదని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి మొదటి, అత్యంత ముఖ్యమైన మంత్రి అని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ ఉల్లంఘన కాదని స్ఫష్టం చేసింది

Teachers Facial Attendance గురించి ముఖ్య సమాచారం..

FACIAL ATTENDANCE :

జిల్లా లోని అందరు DyEOs మరియు MEO లకు తెలియచేయునది ఏమనగా తేది.13-06-2024 నుండి పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం అగును…

కావున SCHOOL ATTENDANCE APP నకు సంబంధించి పాఠశాల/కార్యాలయ సిబ్బంధి తమ వ్యక్తిగత/పాఠశాల/కార్యాలయముల యొక్క LOGIN & PASSWORD లను ఒక సారి చెక్ చేసుకొని సిబ్బంది మరియు విద్యార్ధుల యొక్క హాజరును App నందు సకాలములో నమోదు చేయునట్లు తగు చర్యలు తీసుకొనవలసినదిగా మీ పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలల వారికి తెలియచేయవలెను.
(Memo.No.Spl/A&I/2024-CSE,Dt.10.06.2024)

అలాగే EMS (studentinfo.ap.gov.in) పాఠశాల లాగిన్ నందు Services – Staff – Employee status లో సిబ్బంది యొక్క retire/death మొదలగు వివరములను update చేసుకొనవలసినదిగా తెలియచేయడమైనది.

Attendance App లో సిబ్బంది యొక్క retire/death/Abscond..మొదలగు deletion వివరములను update చేయుటకు ఒక letter రూపంలో DEO మెయిల్ కు MEO signed copy పంపవలెను

సమగ్ర శిక్ష : విద్యాప్రవేశ్ – 90 రోజుల కార్యక్రమం, రోజు వారి కార్యక్రమాల షెడ్యూల్ ఇదే !

SAMAGRA SIKSHA – GUNTUR – INSTRUCTIONS

📌 విద్యాప్రవేశ్ అనేది ఒక పాఠశాల సంసిద్ధత కార్యక్రమం.

📌 పూర్వ ప్రాథమిక విద్యను ముగించుకొని ఒకటవ తరగతిలో చేరుతున్న విద్యార్థుల సామర్ధ్యాల అంచనా మరియు అభ్యసన సామర్ధ్యాల పెంపు కొరకు చేపట్టిన కార్యక్రమం విద్యా ప్రవేశ్ .

📌 ఈ కార్యక్రమాన్ని జిల్లాలో రేపటినుండి అనగా 13.06.2024 నుండి 90 రోజులు పాటు నిర్వహించాలి .

📌90 రోజుల కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను పిడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుచున్నది. ప్రతిరోజు భాషాభివృద్ధి జ్ఞానాభివృద్ధి మరియు శారీరక అభివృద్ధికి సంబంధించి న మూడు కృత్యాలను విద్యార్థులచే సంబంధిత ఉపాధ్యాయులు చేయించవలెను. దీని కొరకు ప్రతిరోజు రెండు గంటల సమయాన్ని కేటాయించాలి.

📌 ఈనెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు NCERT, SCERT, సమగ్ర శిక్ష మొదలగు డిపార్ట్మెంట్లోని అధికారుల యొక్క టీం జిల్లాలో పర్యటించి విద్యాప్రవేశ్ కు సంబంధించిన బేస్ లైన్ పరీక్షను నిర్వహిస్తారు. బేస్ లైన్ పరీక్ష నిర్వహించే శాంపిల్స్ స్కూల్స్ వివరాలు ముందుగా ఎవరికీ తెలియజేయరు. జిల్లాలో ఏ ప్రాథమిక పాఠశాలలో నైనా ఈ సర్వే నిర్వహించే అవకాశం ఉన్నది గనుక అందరూ అప్రమత్తంగా ఉండవలెను.

📌 విద్యాప్రవేశ్ కార్యక్రమాలు అమలుపై ప్రతివారం గౌరవ డీఈవో గారు సమీక్ష నిర్వహిస్తారు. సంబంధిత రిపోర్టును ఎంఈఓ లు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి పంపవలసి ఉంటుంది.

📌FLN 60 డేస్ కోర్స్ లో శిక్షణ పొందిన DRP లు ఖచ్చితంగా వారి పాఠశాలల్లో ఒకటి రెండు తరగతులను ఖచ్చితముగా బోధించాలి.

📌 టీచింగ్ అట్ ది రైట్ లెవెల్ లో శిక్షణ పొందిన DRP లు కచ్చితంగా మూడు నాలుగు ఐదు తరగతులకు బోధించాలి.

📌 విద్యా ప్రవేశ కార్యక్రమాల అమలు కు వీడియో మరియు డాక్యుమెంటేషన్ ను జిల్లా కార్యాలయానికి ప్రతివారం పంపవలెను.
📌90 రోజుల తర్వాత ENDLINE పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.

🌱 మండల విద్యాశాఖ అధికారులు, సి ఆర్ సి హెడ్మాస్టర్లు, FLN KRP లు /DRPs ఈ కార్యక్రమం యొక్క అమలును మానిటరింగ్ చేయవలెను.

🌱 దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ త్వరలో పంపించడం జరుగుతుంది.

🌱 జిల్లాస్థాయిలో ఈ కార్యక్రమం అమలులో సందేహాలు ఉన్నట్లయితే జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ / అసిస్టెంట్ అకడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్, సమగ్ర శిక్ష వారిని సంప్రదించవచ్చు. SAMAGRA SIKSHA – GUNTUR

90 రోజుల రోజు వారి కార్యక్రమాల షెడ్యూల్ Download

 

T20 World cup -అమెరికాతో పోరులో చెమటోడ్చిన భారత్‌ గట్టెక్కించిన సూర్య, దూబె

భారత్‌తో మ్యాచ్‌ అంటే అమెరికా ఏమాత్రం పోటీ ఇస్తుంది అనుకుంటాం.. 111 పరుగుల లక్ష్యమంటే మన వాళ్లకు ఏపాటికి అని తేలిగ్గా తీసుకుంటాం.. కానీ బ్యాటర్లకు పీడకలలా మారిన న్యూయార్క్‌ స్టేడియంలో ఈ పసికూనే రోహిత్‌సేనకు చెమటలు పట్టించింది.

భారత్‌తో మ్యాచ్‌ అంటే అమెరికా ఏమాత్రం పోటీ ఇస్తుంది అనుకుంటాం.. 111 పరుగుల లక్ష్యమంటే మన వాళ్లకు ఏపాటికి అని తేలిగ్గా తీసుకుంటాం.. కానీ బ్యాటర్లకు పీడకలలా మారిన న్యూయార్క్‌ స్టేడియంలో ఈ పసికూనే రోహిత్‌సేనకు చెమటలు పట్టించింది. చిన్న లక్ష్యమే కొండంత స్కోరులా మారింది. ఒక దశలో భారత్‌కు ఓటమి భయాన్నీ కలిగించింది ఆతిథ్య జట్టు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో సూర్యకుమార్‌ యాదవ్, శివమ్‌ దూబె విలువైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గట్టెక్కించారు. మొదట అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో అమెరికాకు చెక్‌ పెట్టాడు.

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వరుసగా మూడో విజయంతో సూపర్‌-8లో అడుగు పెట్టింది. కానీ పాకిస్థాన్‌ మీదే కాదు.. అమెరికాపైనా రోహిత్‌సేనకు విజయం అంత తేలిగ్గా దక్కలేదు. టోర్నీ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన పరీక్షగా మారిన న్యూయార్క్‌ స్టేడియంలో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌ ఆపసోపాలు పడింది. 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లకు కానీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. సూర్యకుమార్‌ (50 నాటౌట్‌; 49 బంతుల్లో 2×4, 2×6), శివమ్‌ దూబె (31 నాటౌట్‌; 35 బంతుల్లో 1×4, 1×6) భారత్‌ను గెలిపించారు. అమెరికా బౌలర్లలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ (2/18) అదరగొట్టాడు. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అర్ష్‌దీప్‌ సింగ్‌ (4/9), హార్దిక్‌ పాండ్య (2/14)ల ధాటికి యుఎస్‌ 110 పరుగులకే ఆలౌటైంది. నితీశ్‌ (27), స్టీవెన్‌ టేలర్‌ (24) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.

షాక్‌ మీద షాక్‌..: న్యూయార్క్‌ పిచ్‌ ఎంత కఠినమైనప్పటికీ.. అమెరికా లాంటి జట్టు మీద 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌ అంత కష్టపడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. భారత కుర్రాడే అయిన నేత్రావల్కర్‌.. భారత్‌ను ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. రెండో బంతికే కోహ్లి (0)ని ఔట్‌ చేసిన అతను.. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో రోహిత్‌ (3)నూ పెవిలియన్‌ చేర్చాడు. 10 పరుగులకే ఓపెనర్లు వెనుదిరగడంతో భారత్‌ ఆత్మరక్షణలో పడింది. ఈ స్థితిలో పంత్‌ (18) కొంచెం ధాటిగా ఆడి యుఎస్‌ బౌలర్లపై పైచేయి సాధించాలని చూశాడు. మరో ఎండ్‌లో సూర్య క్రీజులో నిలదొక్కుకోవడానికి తంటాలు పడ్డాడు. 8వ ఓవర్లో 44/2తో భారత్‌ కుదురుకుంటున్న దశలో పంత్‌ను అలీ ఖాన్‌ బౌల్డ్‌ చేశాడు. అలీ ధాటికి స్టంప్‌ విరిగిపోయింది. ఈ స్థితిలో సూర్యకు జత కలిసిన శివమ్‌ దూబె ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. బంతి బ్యాట్‌ మీదికి రాకపోవడంతో తన శైలిలో షాట్లు ఆడడానికి అతను ఇబ్బంది పడ్డాడు. సూర్య షాట్లు కూడా చాలానే గురి తప్పాయి. 13 ఓవర్లకు భారత్‌ 60/3తో నిలవగా.. అప్పుడున్న పరిస్థితుల్లో 7 ఓవర్లలో 51 పరుగులు చేయడం కూడా చాలా కష్టంగానే కనిపించింది. అయితే సూర్య, దూబె సరైన సమయంలో బ్యాట్లు ఝళిపించడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. అండర్సన్‌ బౌలింగ్‌లో దూబె సిక్సర్‌ బాదితే.. శాండ్లీ బౌలింగ్‌లో సూర్య వరుసగా 6, 4 కొట్టడంతో చివరి 3 ఓవర్లలో 14 పరుగులతో సమీకరణం తేలికైపోయింది. తర్వాత మ్యాచ్‌ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.

అర్ష్‌దీప్‌ అదరహో..: ఈ ప్రపంచకప్‌లో బ్యాటర్లకు పీడకలగా మారిన న్యూయార్క్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన రోహిత్‌ మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ ఎంచుకోగా.. యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ తన పేస్, స్వింగ్‌తో అమెరికా జట్టుకు చుక్కలు చూపించాడు. హార్దిక్‌ పాండ్య సైతం పిచ్‌ను ఉపయోగించుకుని రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన బుమ్రా నుంచే యుఎస్‌ బ్యాటర్లకు ప్రధానంగా ముప్పు పొంచి ఉందనుకుంటే.. అతనీ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్టూ తీయకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రాను జాగ్రత్తగా ఆడిన యుఎస్‌ బ్యాటర్లు.. అర్ష్‌దీప్‌ ఉచ్చులో చిక్కుకున్నారు. తొలి బంతికే జహంగీర్‌ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పతనానికి శ్రీకారం చుట్టిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. ఓవర్‌ చివరి బంతికి గౌస్‌ (2)ను బుట్టలో వేసుకున్నాడు. పేలవ ఆరంభం తర్వాత కెప్టెన్‌ ఆరోన్‌ జోన్స్‌ (11), నితీశ్‌ (27)లతో కలిసి స్టీవెన్‌ టేలర్‌ జట్టును కాస్త మెరుగైన స్థితికి తీసుకెళ్లాడు. అయితే పరుగుల వేగం మాత్రం పెరగలేదు. 10 ఓవర్లకు కానీ యుఎస్‌ 50కి చేరుకోలేదు. రెండు సిక్సర్లు బాది స్కోరు బోర్డును కదిలించే ప్రయత్నం చేసిన టేలర్‌ను అక్షర్‌ బౌల్డ్‌ చేయగా.. తర్వాత నితీశ్, కోరీ అండర్సన్‌ (15) జోడీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ జోడీ ఆడుతున్నపుడు యుఎస్‌ 130 స్కోరు చేసేలా కనిపించింది. కానీ అర్ష్‌దీప్‌ రెండో స్పెల్‌లోనూ అమెరికాను దెబ్బ కొట్టాడు. నితీశ్‌ను పెవిలియన్‌ చేర్చాడు. అండర్సన్‌ వికెట్‌ను హార్దిక్‌ పడగొట్టాడు. హర్మీత్‌ (10), షాడ్లీ (11) పోరాడి స్కోరును వంద దాటించారు. మోనాంక్‌ గాయపడడంతో ఈ మ్యాచ్‌లో అమెరికాకు జోన్స్‌ నాయకత్వం వహించాడు.

అందుకే ఆ అయిదు పరుగులు

ఛేదనలో టీమ్‌ఇండియాకు 30 బంతుల్లో 35 పరుగులు కావాల్సి రావడంతో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ 16వ ఓవర్‌ ఆరంభానికి ముందు ఒక్కసారి సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారింది. భారత లక్ష్యంలో అయిదు పరుగులు కరిగిపోయాయి. దీనికో కారణం ఉంది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఓవర్‌ ఓవర్‌కు మధ్య నిమిషం మాత్రమే విరామం ఉంటుంది. ఒక ఓవర్‌ ముగిశాక మరో ఓవర్‌ వేసేందుకు బౌలర్‌ 60 సెకన్ల లోపే సిద్ధమవ్వాలి. ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ జట్టు మూడు సార్లు ఇలా చేయడంలో విఫలమైతే అప్పుడు అంపైర్లు అయిదు పరుగులు జరిమానాగా విధిస్తారు. అమెరికా ఈ నిబంధనను అతిక్రమించడంతో పెనాల్టీ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆ క్యాచ్‌ పట్టుంటే..

44 పరుగులకే 3 వికెట్లు పడ్డాయి. 11వ ఓవర్లో కానీ భారత్‌ స్కోరు 50 దాటలేదు. పరుగుల రాక చాలా కష్టంగా ఉంది. అలాంటి స్థితిలో అసహనంతో సూర్య ఓ షాట్‌ ఆడాడు. థర్డ్‌మ్యాన్‌ బౌండరీ దగ్గర నేత్రావల్కర్‌ క్యాచ్‌ కోసం ప్రయత్నించాడు. బంతి చేజారింది. అప్పటికి సూర్య 30 బంతుల్లో 22 పరుగులే చేశాడు. ఈ వికెట్‌ పడి ఉంటే భారత్‌ మరింత ఇబ్బందుల్లో పడేదే. గెలిచేందుకు అమెరికాకు మంచి అవకాశం లభించేదే.

అమెరికా ఇన్నింగ్స్‌: జహంగీర్‌ ఎల్బీ (బి) అర్ష్‌దీప్‌ 0; స్టీవెన్‌ టేలర్‌ (బి) అక్షర్‌ 24; గౌస్‌ (సి) హార్దిక్‌ (బి) అర్ష్‌దీప్‌ 2; ఆరోన్‌ జోన్స్‌ (సి) సిరాజ్‌ (బి) హార్దిక్‌ 11; నితీశ్‌ కుమార్‌ (సి) సిరాజ్‌ (బి) అర్ష్‌దీప్‌ 27; కోరీ అండర్సన్‌ (సి) పంత్‌ (బి) హార్దిక్‌ 15; హర్మీత్‌ (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ 10; షాడ్లీ నాటౌట్‌ 11; జస్‌దీప్‌ రనౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8
మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 110;
వికెట్ల పతనం: 1-0, 2-3, 3-25, 4-56, 5-81, 6-96, 7-98, 8-110;
బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-9-4; సిరాజ్‌ 4-0-25-0; బుమ్రా 4-0-25-0; హార్దిక్‌ 4-1-14-2; దూబె 1-0-11-0; అక్షర్‌ 3-0-25-1

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) హర్మీత్‌ (బి) నేత్రావల్కర్‌ 3; కోహ్లి (సి) గౌస్‌ (బి) నేత్రావల్కర్‌ 0; పంత్‌ (బి) అలీ ఖాన్‌ 18; సూర్యకుమార్‌ నాటౌట్‌ 50; శివమ్‌ దూబె నాటౌట్‌ 31; ఎక్స్‌ట్రాలు 9
మొత్తం: (18.2 ఓవర్లలో 3 వికెట్లకు) 111;
వికెట్ల పతనం: 1-1, 2-10, 3-44;
బౌలింగ్‌: సౌరభ్‌ నేత్రావల్కర్‌ 4-0-18-2; అలీ ఖాన్‌ 3.2-0-21-1; జస్‌దీప్‌ సింగ్‌ 4-0-24-0; షాడ్లీ 4-0-25-0; కోరీ అండర్సన్‌ 3-0-17-0

Janasena: జనసేనకు కీలక శాఖలు

మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారు. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు.

అమరావతి: మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారు. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు.

జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ను ఉపముఖ్యమంత్రిని చేయడంతోపాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు తెలిసింది. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు సమాచారం. పవన్‌ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలిసింది. లోకేశ్‌కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.. ప్రొటోకాల్‌ పాటించని అధికారులు

Chandrababu: తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.. ప్రొటోకాల్‌ పాటించని అధికారులు

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ప్రత్యేక విమానంలో తిరుపతి విచ్చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తిరుమల వెళ్తూ తిరుపతిలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద వాహన శ్రేణి ఆపి కార్యకర్తలకు అభివాదం చేసి వెళ్లారు. రాత్రికి తిరుమలలో బస చేయనున్న చంద్రబాబు.. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం 8గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు.

సీఎం పర్యటన సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. గాయత్రి నిలయం వద్ద సీఎంకు స్వాగతం పలికేందుకు వాహనం వద్దకు తితిదే అధికారులు ఎవరూ రాలేదు. ఆయన వాహనం దిగి గాయత్రీ నిలయం లోపలికి వెళ్లిన తర్వాత పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు తితిదే ఇన్‌ఛార్జి ఈవో వీరబ్రహ్మం యత్నించగా.. సీఎం తిరస్కరించారు.

AP School Admission Forms pdf

AP School Admission Forms pdf Andhra Pradesh School Admissions 2024 Form

School Education-Re-opening of schools with effect from 13.06.2024 for the Academic Year 2024-2025 – Permission accorded Communicated -Reg Memo.No.Spl/A&I/2024-CSE, Dated: 10.06.2024.

Further, the following instructions are issued to be followed by all Mandal Educational Officers and Head Masters in receiving and distribution of Student Kits:

1. The items delivered by the supplier at Mandal Stock Point shall be counted by the Mandal teams and ensure the quantity and quality of the items.

2. If any shortage of items at the time of counting is noticed, the same should.be immediately informed to the concerned supplier through official e-mail. duly extending a copy to the District Educational Officer/Additional Project Coordinator and State Project Director.

3. The Mandal team should ensure the quality of the items at the time of verification at Mandal Stock Point. If any damaged/ under quality/ Mismatch items are found supplied by the vendor, such items should be kept aside and informed to the supplier immediately through official e-mail and such items should be returned to the supplier. The supplier should be requested by the Mandal Educational Officer concerned to replace the above under quality/damaged/Mismatch items with new items immediately.

4. Acknowledgement should be given to the supplier only for the items that are received in good condition and in good quality. Under quality items/Damaged items/ Mismatch items should be rejected at the level of Mandal Educational Officer only. Such unqualified items should not be supplied to Schools and Students.

5. Proper accounts should be maintained by the District Educational Officer/Additional Project Coordinator/ Deputy Educational Officer/Mandal Educational Officer/Head Master regarding the receiving’s, distribution shortages, damages, mismatch, replacement. The concerned Regional Joint Directors/ District Educational Officers /Additional Project Coordinators / Community Mobilization Officers should take the responsibility of quality receiving’s and supplies to students for entire end to end monitoring.

6. All sample items of student kits should be displayed in Quality wall at Mandal Stock Points with out fail.

7. An annexure with details of suppliers, Phone numbers, e-mail addresses are enclosed herewith for favor of necessary action.

Download Admission Form Telugu | English

Health

సినిమా