కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. ఇక మహిళల అకౌంట్లలో డబ్బు జమ!ఎప్పుడంటే?

కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. ఇక మహిళల అకౌంట్లలో డబ్బు జమ!ఎప్పుడంటే?


ఎవరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభంజనం సృష్టించింది. టీడీపీ, బీజేపీ జనసేన కూటమికి 164 స్థానాలతో ఏపీ ప్రజలు చారిత్రాత్మక అఖండ విజయం అందించారు.

అయితే కూటమి విజయానికి మహిళలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల ముందే టీడీపీ నేతలు మహిళలు, వృద్ధులు తమకు అండగా ఉన్నారని తప్పక కూటమి గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే టీడీపీ ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి మేనిఫెస్టో రూపకల్పనలో పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. మహిళలు, వృద్ధులను ఆకట్టుకునేలా ఆరు అద్భుతమైన పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ పథకంలో ఒకటైన.. స్త్రీనిధి కింద ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. మరో పథకం ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000 అందిస్తామని ప్రకటించారు. ‘దీపం’ స్కీం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని చెప్పారు. కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీ ‘ఉచిత బస్సు ప్రయాణం’ ఒకటి. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త ప్రభుత్వంలోకి అడుగు పెట్టారు. ఇక నెల తిరిగేలోపే మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారని సమాచారం