తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.. ప్రొటోకాల్‌ పాటించని అధికారులు

Chandrababu: తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.. ప్రొటోకాల్‌ పాటించని అధికారులు


తిరుమల: శ్రీవారి దర్శనం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ప్రత్యేక విమానంలో తిరుపతి విచ్చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తిరుమల వెళ్తూ తిరుపతిలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద వాహన శ్రేణి ఆపి కార్యకర్తలకు అభివాదం చేసి వెళ్లారు. రాత్రికి తిరుమలలో బస చేయనున్న చంద్రబాబు.. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం 8గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు.

సీఎం పర్యటన సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. గాయత్రి నిలయం వద్ద సీఎంకు స్వాగతం పలికేందుకు వాహనం వద్దకు తితిదే అధికారులు ఎవరూ రాలేదు. ఆయన వాహనం దిగి గాయత్రీ నిలయం లోపలికి వెళ్లిన తర్వాత పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు తితిదే ఇన్‌ఛార్జి ఈవో వీరబ్రహ్మం యత్నించగా.. సీఎం తిరస్కరించారు.