Thursday, November 14, 2024

Balakrishna: బాలయ్య జోరు చూసి కుర్ర హీరోలు కంగారు.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్..

వయసు పెరిగేకొద్దీ మీకు అలుపొస్తుందేమో.. నాకు ఊపొస్తుందంటున్నారు బాలయ్య. ఆయన జోరు చూసి కుర్ర హీరోలు కూడా కంగారు పడుతున్నారు. 60 ప్లస్‌లో 20 ప్లస్ కుర్రాడిలా రచ్చ చేస్తున్నారు నటసింహం. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలు, ఇంకోవైపు డిజిటల్‌తో ట్రిపుల్ బొనాంజాకు రెడీ అవుతున్నారు బాలయ్య. ఆయన స్పీడ్‌కు కారణమేంటి..? బాలయ్య దూకుడు చూస్తుంటే ముచ్చటేస్తుంది.

వయసు పెరిగేకొద్దీ మీకు అలుపొస్తుందేమో.. నాకు ఊపొస్తుందంటున్నారు బాలయ్య. ఆయన జోరు చూసి కుర్ర హీరోలు కూడా కంగారు పడుతున్నారు. 60 ప్లస్‌లో 20 ప్లస్ కుర్రాడిలా రచ్చ చేస్తున్నారు నటసింహం.

వయసు పెరిగేకొద్దీ మీకు అలుపొస్తుందేమో.. నాకు ఊపొస్తుందంటున్నారు బాలయ్య. ఆయన జోరు చూసి కుర్ర హీరోలు కూడా కంగారు పడుతున్నారు. 60 ప్లస్‌లో 20 ప్లస్ కుర్రాడిలా రచ్చ చేస్తున్నారు నటసింహం.

హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా ఆయనెప్పుడూ బిజీగానే ఉంటారు. ఇప్పుడు కూడా సినిమాలు, రాజకీయాలతో పాటు డిజిటల్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు NBK. జూన్ 10న పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చారు బాలయ్య.

బోయపాటి సినిమా ప్రకటనతో పాటు.. బాబీ సినిమా టీజర్ విడుదలైంది. చాలా రోజులుగా చర్చలో ఉన్న బోయపాటి సినిమాను అధికారికంగా ప్రకటించారు. రామోజీరావు మరణం దృష్ట్యా హిందూపూర్‌లో జరగాల్సిన పూజా కార్యక్రమాలు వాయిదా వేశారు.

బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా టీజర్ విడుదలైంది. దీనికి వీరమాస్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

సినిమాలు మాత్రమే కాదు.. అన్‌స్టాపబుల్ సీజన్ 4కి కూడా రంగం సిద్ధమవుతోంది. నాలుగో సీజన్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్నారు ఆహా. ఈసారి రాజకీయ నాయకులు కూడా రాబోతున్నారని తెలుస్తుంది.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి సినిమాలు, డిజిటల్‌, రాజకీయాలు, బసవతారకం.. అన్నింటికీ టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు బాలయ్య.

గుడ్ న్యూస్‌.. ఇకపై యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు: యూజీసీ

న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండు సార్లు ప్రవేశాలు నిర్వహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్‌(యూజీసీ) అనుమతించింది. ఈ విషయాన్ని కమిషన్ చైర్‌పర్సన్ ఎమ్ జగదీష్ కుమార్ మంగళవారం వెల్లడించారు.

2024-25 విద్యా సంవత్సరం నుంచి సంవత్సరానికి రెండుసార్లు అంటే జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు. మే 5న జరిగిన యూజీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కాగా ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రతి సంవత్సరం జూలై-ఆగస్టులో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. దీనివల్ల భారతదేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు జూలై-ఆగస్టులో ప్రారంభమై మే-జూన్‌లో అకడమిక్ సెషన్‌ను ముగిస్తున్నాయి.

గత ఏడాది ఒక అకాడమిక్ సంవత్సరంలో దూరవిద్యలో(ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్‌) విద్యార్థులు జనవరి, జూలైలో రెండుసార్లు ప్రవేశం పొందేందుకు యూజీసీ అనుమతించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు అయిదు లక్షల మంది విద్యార్థులు మరో విద్యా సంవత్సరం వరకు వేచి ఉండకుండా అదే ఏడాది డిగ్రీలొ చేరడానికి సహాయపడిందని కుమార్ పేర్కొన్నారు.

”మన దేశంలోని యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్‌ కల్పించినట్లయితే అది ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా బోర్డు ఫలితాల్లో ఆలస్యం, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల జులై-ఆగస్టులో ప్రవేశం పొందలేకపోయిన వారికి ఎంతో దోహదపడుతుంది. రెండుసార్లు అడ్మిషన్‌ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఏడాది సమయం వృథా కాకుండా ఉంటుంది. అటు కంపెనీలు కూడా రెండుసార్లు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లు నిర్వహించుకోవచ్చు. తద్వారా పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి’ అని యూజీసీ చీఫ్‌ వెల్లడించారు.

రెండుసార్లు ప్రవేశాలు కల్పించడం వల్ల ఉన్నత విద్యా సంస్థలు తమ ఫ్యాకల్టీ, ల్యాబ్‌, క్లాస్‌రూమ్‌, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని వెల్లడించారు. భారతీయ విద్యా సంస్థలు ఈ విధానం పాటించడం వల్ల అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు దోహదపడుతుందన్నారు. తద్వారా పోటీ ప్రపంచంలో మనం మరింత మెరుగుకావచ్చని, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించినట్టు ఉంటుందన్నారు.

దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఈ విధానాన్ని పాటించడం తప్పనిసరి కాదన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది కలిగిన ఉన్నత విద్యా సంస్థలు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రెండుసార్లు ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా విద్యాసంస్థల అంతర్గత నిబంధనలను మార్చుకోవాలని సూచించారు.

NEET-UG Exam: ‘పరీక్షకున్న గౌరవం దెబ్బతింటుంది’.. నీట్‌ 2024 రద్దు పిటిషన్లపై సుప్రీం

దిల్లీ: వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ – 2024 పరీక్షలో (NEET-UG 2024 Exam) అవతవకలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నీట్‌ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై జస్టిన్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అమనుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ జరిపింది. పరీక్షను క్యాన్సిల్ చేయడం అంత సులువు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

‘‘ఇది మీరు అనుకున్నంత సులభం కాదు. అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవితత్ర దెబ్బతింటాయి. అందువల్ల ఈ ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. దీనిపై స్పందన తెలియజేయాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)కి నోటీసులు జారీ చేసింది. ఇక, ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్‌ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా ఎన్‌టీఏ తమ సమాధానం తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ ఏడాది మే 5వ తేదీన నీట్ యూజీ -2024 ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. జూన్‌ 4న ఫలితాలను ప్రకటించారు. అయితే తొలుత జూన్‌ 14న ఫలితాలను వెల్లడిస్తామని చెప్పి.. అంతకంటే ముందే ఓట్ల లెక్కింపు జరుగుతుండగా విడుదల చేయడం వివాదానికి దారితీసింది. ఈ ఫలితాల్లో (NEET Result) 67 మంది విద్యార్థులకు ఆలిండియా మొదటి ర్యాంక్‌ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది.

ఈ పరీక్షలో పేపర్‌ లీకేజీ (Paper Leak) జరిగిందని, ఫలితాల్లోనూ అక్రమాలు (Malpractice) చోటుచేసుకున్నాయని కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

AP EAPCET Results Released ..know your result

EAPCET Results Today : ఇంజినీరింగ్ (Engineering), వ్యవసాయ (Agriculture), ఫార్మసీ కోర్సుల్లో (Pharmacy Course) ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్‌ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు.

ఈ విషయం గురించి సెట్‌ ఛైర్మన్‌, జేఎన్‌టీయూ్‌ కాకినాడ వీసీ ప్రసాద్‌ రాజు వివరించారు.

ఈ క్రమంలోనే ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ ఛార్జ్‌ చైర్మన్‌ రామమోహన్‌ రావుతో కలిసి ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల (EAPCET Results 2024) చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఈఏపీ సెట్‌ ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించింది.

ఈ సారి పరీక్షకు 3,62,851 మంది దరఖాస్తులు చేసుకోగా..వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ కు 2,58,373 మంది ,వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు సంబంధించి 80,766 మంది ఈ పరీక్షలు రాశారు.

ఈ పరీక్షలో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. దాని ఆధారంగానే ర్యాంకులను ప్రకటిస్తారు.

Chandrababu: సీఎం ప్రమాణానికి ముందు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో సీబీఎన్ మాట్లాడుతూ.. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

ఎందుకు వదిలిపెట్టకూడదనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు కూడా. తప్పు చేసిన వారిని వదిలిపెడితే అదొక అలవాటుగా మారిపోతుందన్నారు. అందుకే చట్టపరంగా వారిని కచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు అన్నారు. విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు ఈ సభావేదికగా హెచ్చరించారు. అంతేకాదు.. పదవి వచ్చిందని విర్రవీగొద్దని వినయంగా మాత్రమే ఉండాలని ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. కాగా.. ఎన్నికల్లో, ఫలితాల తర్వాత ఏపీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.

ట్రాఫిక్ గురించి మరోసారి..!

‘ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతాననే శపధాన్ని ప్రజలు గౌరవించారు. ప్రజల గౌరవాన్ని నిలబెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దాం. పోలవరం పూర్తితో పాటు నదుల అనుసంధానం చేస్తే ప్రతీ ఏకరాకు నీరివ్వొచ్చు. పోలవరం పూర్తి చేసే దిశగా ప్రతీ ఒక్కరం కృషి చేద్దాం. మాకు హోదా అనేది సేవ కోసమే. మేము కూడా సామాన్య మనుషులమే. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దు. ఐదు నిమిషాల ఆలస్యం అయినా పర్వాలేదు. సిగ్నల్ సిగ్నల్ మధ్య 1 నిమిషం ఉంటే చాలు. మళ్లీ చెబుతున్నా.. నా కాన్వాయ్ వెళ్లేటప్పుడు ట్రాఫిక్ అస్సలు ఆపొద్దు. ప్రజలు ఇబ్బంది పడే విధంగా రూల్స్ మార్చవద్దు’ అని చంద్రబాబు పోలీసులకు కీలక సూచనలు చేశారు.

నూడుల్స్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈ విషయాలు తెలిస్తే అస్సలు ముట్టుకోరు!

నూడుల్స్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈ విషయాలు తెలిస్తే అస్సలు ముట్టుకోరు!

ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌ల్లో అందుబాటులో ఉండే నూడుల్స్ చిన్నా పెద్ద ప్లేట్లకు ప్లేట్లు లాగించేస్తుంటారు. అంతేకాకుండా ఎక్కడికైనా వెళ్లినా తొందరగా అయిపోతుందని నూడుల్స్ చేసుకొని బాక్స్‌లో పెట్టుకుని మరీ వెళ్తుంటారు కొందరు.

అయితే గత కొద్ది రోజుల నుంచి ఇన్‌స్టంట్ నూడుల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటిని తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి.. తమ వెంట క్యారీ చేస్తూ ఆకలేసి నప్పుడల్లా నూడుల్స్ తయారు చేసి తింటున్నారు.

ఆఫీసుల్లో, బస్సుల్లో ఇన్‌స్టంట్ నూడుల్స్ రెండు నిమిషాల్లోనే రెడీ కావడంతో బాగున్నాయని లొట్టలేసుకుని లాగించేస్తున్నారు. అంతేకాకుండా సమయం సేవ్ అయిందని సంతోషపడుతున్నారు తప్ప తమ ఆరోగ్యానికి మేలు చేస్తాయా లేదా అనే ఆలోచన కూడా చేయడం లేదు. చిన్నారులు సతాయించినా సరే నూడుల్స్ చేసి పెడతానని తల్లులు చెబుతుంటారు. దీంతో వారు సైలెంట్‌గా ఉండి చెప్పినట్లు వింటారు. అలాగే ఏడవకుండా ఆడుకుంటారు. అయితే ఇన్‌స్టంట్ నూడుల్స్ వల్ల ఆరోగ్యానికి హానీ కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*ఇన్‌స్టంట్ నూడుల్స్‌ రుచికరంగా ఉండటానికి అధిక సోడియంను యాడ్ చేస్తారు. కాబట్టి వాటిని తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అంతేకాకుండా గుండె పోటు ప్రమాదం పెరిగి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది.

* వీటిల్లో కేలరీలు ఎక్కువగా ఉండి ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. పోషకాల లోపానికి దారి తీసి పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

* నూడుల్స్‌లో యాక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనం ఉంటుందని ఇటీవల ఓ అధ్వమనంలో తేలింది. అయితే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

*ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో ఫైబర్ అధికంగా ఉండి జీర్ణవ్యవస్థకు దెబ్బతీస్తుంది. దీంతో ఉబ్బరం, మలబద్ధకం, అతిసారానికి కారమై ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.

* ప్రస్తుతం అధిక బరువు సమస్యతో బాధ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. దానికి కారణం.. కూర్చుని జాబ్ లో చేస్తూ కష్టపడటానికి ఆసక్తి చూపించడం లేదు. అలాగే ఇన్‌స్టంట్ ఫుడ్స్, ప్యాకేజింగ్ ఆహారాలు తింటూ అలాగే కూర్చుంటున్నారు. దీంతో కేలరీలు పెరగడంతో.. అధిక బరువు బారిన పడుతున్నారు. తర్వాత తగ్గేందుకు చిట్కాలు పాటిస్తూ నానా తంటాలు పడుతున్నారు. అయితే నూడుల్స్ అధిక బరువు కారణమవుతాయి. కాబట్టి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.

*నూడుల్స్ టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఉండి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.

తితిదే ఈవో ధర్మారెడ్డిని సెలవులో పంపిన ప్రభుత్వం

తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్‌ఛార్జ్‌ ఈవో ఏవీ ధర్మారెడ్డిని ప్రభుత్వం సెలవులో పంపింది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్‌ఛార్జ్‌ ఈవో ఏవీ ధర్మారెడ్డిని ప్రభుత్వం సెలవులో పంపింది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డిని మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు సాధారణ సెలవులపై పంపిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన తిరుపతి దాటి వెళ్లేందుకు అనుమతించినా, రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణంపై అధ్యయనం

కూటమి కీలక హామీ అయిన మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం పథకం అమలుపై కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసింది.

కూటమి కీలక హామీ అయిన మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం పథకం అమలుపై కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసింది. వీటిలో ఏది మన రాష్ట్రంలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఓ నివేదికనూ సిద్ధం చేశారు. దీని ప్రకారం.. మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం పథకానికి తెలంగాణ అనుసరిస్తున్న విధానమే మన రాష్ట్రానికి సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ఉన్నాయి. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా? రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఇస్తారా అనే అంశాలు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ‘సున్నా’ ఛార్జ్‌తో టికెట్‌ జారీ చేస్తారు. ఇలా జారీచేసిన టికెట్ల అసలు ఛార్జీ ఎంతో లెక్క కట్టి.. వాటిని రీయింబర్స్‌ చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరుతుంది.

టికెట్ల ద్వారా నెలకు రూ.500 కోట్లు..
ఏపీలో ప్రస్తుతం ఆర్టీసీకి టికెట్ల రూపంలో నెలకు రూ.500 కోట్లు వస్తున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు సుమారు రూ.200 కోట్లు రాబడి తగ్గుతుందని అంచనా. మరోవైపు ఆర్టీసీ తన రాబడిలో నెలకు రూ.125 కోట్లు ప్రభుత్వానికి ఇస్తోంది. పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న రూ.125 కోట్లు నిలిపేయడంతో పాటు, మిగిలిన రూ.75 కోట్లను ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌గా తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆదేశాలపైనే విధివిధానాలు ఆధారపడి ఉంటాయని తెలిపాయి.

సమష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళదాం: పవన్‌ కల్యాణ్

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి కలిసి కట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు.

విజయవాడ: గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి కలిసి కట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు. కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్‌ మాట్లాడారు.

‘‘తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. అందరం కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజారిటీలతో గెలిచాం. 164 శాసనసభ స్థానాలు, 21 ఎంపీలను ఎన్డీయే కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం ఇది. కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని ఇప్పటం సభలో చెప్పాం.. అదే మాటపై నిలబడ్డాం. ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం.. తగ్గాం.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. మనందరం సమష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతామని చెప్పాం.

ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి. నాలుగు దశాబ్దాల అనుభవం, అభివృద్ధిపై అపారమైన అవగాహన, పెట్టుబడులను తీసుకొచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల అధ్యక్షులను తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించే శక్తి ఉన్న చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరం. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను. అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పడిన బాధను చూశాను. మంచిరోజులు వస్తాయి.. కన్నీళ్లు పెట్టొద్దని చెప్పాను. ఆ రోజులు వచ్చాయి. చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నా.. అద్భుతమైన పాలన అందివ్వాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. ఈ సందర్భంగా పవన్‌ను చంద్రబాబు ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలిపారు.

అమరావతే రాజధాని.. ఆర్థిక రాజధానిగా విశాఖ: చంద్రబాబు

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది.

అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారు. ఎన్నికల్లో 93 శాతం సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదు. ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగింది.

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం
మీ అందరి సహకారంతో బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారు. సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారు’’

రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది..
‘‘14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లాం. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది. సంక్షోభంలో ఉంది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి. రైతులు అప్పులపాలయ్యారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలి. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదు. అమరావతి రాజధానిగా ఉంటుంది. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందాం’ అని చంద్రబాబు వెల్లడించారు.

Breaking: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదల

Breaking: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదల

కొత్త ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలిచింది.

అప్పులతో పాలన ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్థికంగా చేయూత ఇచ్చింది. పన్నుల పంపిణీ కింద రూ.5, 655 కోట్లను విడుదల చేసింది. ఏపీతో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. తెలంగాణకు రూ. 2,937 కోట్లు, యూపీకి రూ.25,069 కోట్లు, బిహార్‌కు రూ.14,056 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికంగా ప్రధాని మోడీ అండగా నిలిచారని తెలిపారు.

కొండపి రికార్డు.. ఒక నియోజకవర్గం.. నలుగురు ఎమ్మెల్యేలు

Four Candidates For one Segment have Won The AP Election 2024 as MLAs : ఒక నియోజకవర్గం.. నలుగురు ఎమ్మెల్యేలు .. అదేంటంటారా? ఆ ఒక్క సెగ్మెంట్‌కి నలుగురు అభ్యర్ధులు ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం వాసులు జిల్లాలు దాటి వెళ్లి మరీ హిట్ కొట్టారు. దాంతో ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన ఆ సెగ్మెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత స్పెషల్‌గా ఫోకస్ అవుతుంది. గతంలో కూడా ఆ సెగ్మెంట్ వాసులు బయటకెళ్లి గెలిచారు. అయితే ఈ సారి అంతమంది గెలవడంతో కొండపిలో వారి బంధుగణం తెగ హ్యాపీ అయిపోతుంది ఇంతకీ ఎవరా నలుగురు? ఎక్కడెక్కడ నుంచి గెలిచారు?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూ తెలుగు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో కూటమి 164 స్థానాల్లో గెలిస్తే.. ఒక్క టీడీపీనే 135 సెగ్మెంట్లు సొంతం చేసుకుంది. ఆ 135 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఒకే నియోజకవర్గ వాసులవ్వడం విశేషం. ఆ నలుగురిలో ముగ్గురు వేర్వేరు నియోజకవర్గాల నుంచి గెలవగా.. ఒకరు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి ఆ ఘనత దక్కింది .. 2009 ఎన్నికల ముందు వరకు కొండపి జనరల్ సెగ్మెంట్.. డీలిమిటేషన్‌లో అది ఎస్సీ రిజర్వుడు స్థానమైంది. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి చెందిన నలుగురు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఘన విజయాన్ని అందుకున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలీ నుంచి గెలిచిన మాజీ మంత్రి, గంటా శ్రీనివాసరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిలు ఈ నియోజకవర్గానికి చెందినవారే . ఈ నలుగురిది కొండేపి నియోజకవర్గం కావడం విశేషం.

గంటా శ్రీనివాసరావు సొంత ఊరు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం చింతలపాలెం.. ఆయన విశాఖపట్నానికి వెళ్లి.. అక్కడే సెటిలయ్యారు. విశాఖపట్నంలో వ్యాపారాలు చేసిన గంటా శ్రీనివాసరావు.. ఆతర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1999లో టీడీపీ నుంచి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. గంటా 2004 ఎన్నికల్లో చోడవరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలుపొంది. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో.. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో తొలిసారి మంత్రి అయ్యారు.

2014 ఎన్నికలకు గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరి విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో గంటా విశాఖ నార్త్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఈ సారి మళ్లీ భీమిలీకి షిఫ్ట్ అయి 92,401 ఓట్ల మెజార్టీతో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ని చిత్తు చేసి.. తిరిగి మంత్రి వర్గం రేసులోకొచ్చారు. ప్రతిసారి సెగ్మెంట్ మారినా గెలుస్తూ వస్తున్న ఆయన లక్కీ లీడర్ బ్రాండ్ నిలపెట్టుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కొండపిలో ఆయన బంధుగణం కథలుకథలుగా చెప్పుకుంటుంటారు.

దామచర్ల జనార్థనరావు సొంత గ్రామం ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెం.. జనార్థన్ తాత దామచర్ల ఆంజనేయులు టీడీపీలో సీనియర్ నేత.. మంత్రిగా కూడా పనిచేశారు. ఆంజనేయులు ఆయన 1994, 99లో కొండపి నుంచే విజయాలు సాధించారు. తాత రాజకీయ వారసుడిగా జనార్థన్ 2010లో టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కొండేపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో.. తెలుగు దేశం పార్టీ అధిష్టానం ఒంగోలు ఇంఛార్జ్ బాధ్యతల్ని అప్పగించింది.

వైసీపీ ఎఫెక్ట్‌తో 2012లో ఒంగోలు ఉప ఎన్నిక జరిగింది. జనార్థన్ టీడీపీ నుంచి పోటీచేసి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి మాజీ మంత్రి బాలినేనిని ఓడించారు. 2019లో మరోసారి ఒంగోలు నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి బరిలోకి దిగి. 34,026 ఓట్ల తేడాతో బాలినేనిపై విజయం సాధించారు. అలా ఆ కొండపి లీడర్ రెండోసారి అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నారు.

చీరాల నుంచి గెలిచిన మద్దలూరి మాలకొండయ్యది కూడా కొండిపి నియోజకవర్గమే. ఆయన తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ఒంగోలు ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. మళ్లీ 2024 ఎన్నికలకు ముందు యాక్టివ్ అయ్యారు. మాలకొండయ్యకు టీడీపీ బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించింది. ఎన్నికల్లో చీరాల టీడీపీ టికెట్ కేటాయించగా వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్‌పై 20,894 ఓట్ల తేడాతో విజయం సాధించారు కొండయ్య. ఆయన మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో తొలిసారి కొండపి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో మరోసారి పోటీచేసిన ఆయన ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సైతం వైసీపీని మట్టి కరిపించారు. ఈ సారి 24, 756 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి, ఆదిమూలపు సురేష్‌పై ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టి ఎస్సీ కోటాలో మంత్రిగా ఫోకస్ అవుతున్నారు.

ఆ నలుగురే కాదు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, కొండపి, కందుకూరు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత పోతుల రామారావు కూడా కొండపి నియోజకవర్గానికి చెందినవారే కావడం విశేషం.

DRDO Recruitment: రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు! నెలకు రూ.40 వేల జీతం..

ప్రస్తుత సమాజంలో ఉద్యోగం దొరకడం గగనంగా మారింది. ప్రతి ఏటా డిగ్రీలు పాస్ అయ్యి బయటకు వచ్చే యువత లక్షల్లో ఉంటే..ఉద్యోగాలు మాత్రం వేల సంఖ్యలో మాత్రమే ఉంటున్నాయి.

దాంతో చాలా మందికి జాబ్ దొరకడం లేదు. ఇదే సమయంలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. కారణం..ఉద్యోగ భద్రత, సమాజంలో లభించే గౌరవ, మర్యాదలు లభిస్తాయని భావన. అందుకు ఏళ్ల తరబడి శ్రమిస్తూ.. నిద్రాహారాలు మాని మరి.. పరీక్షల కోసం ప్రిపేరవుతుంటారు. ఈ క్రమంలోనే రాత పరీక్షలు లేకుండా కూడా పలు జాబ్ నోటిఫికేషన్లు విడులవుతున్నాయి. తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..రాత పరీక్ష లేకుండా ఏకంగా 40 వేలు సంపాదించే అవకాశం దొరికింది. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎంతో మంది యువత వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. కొందరు బ్యాంక్ ఉద్యోగాల వైపుకు వెళ్తుంటే, మరికొందరు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా పలు రకాల జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుంటాయి. తాజాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వలో ప్రధాన సంస్థల్లో ఒకటైనా డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)లో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలకు భర్తీకి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్, సాలరీ, ఎగ్జామ్స్ విధానం వంటి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ రక్షణకు సంబంధించిన కీలక రంగాల్లో డీఆర్డీవో ఒకటి. దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక తరచూ డీఆర్డీవో నుంచి వివిధ రకాల నోటిఫికేషన్లు విడుదలవుతుంటాయి. తాజాగా కూడా డీఆర్డీవో లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఒక భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఇటీవలే డీఆర్టీవోలోని జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

దరఖాస్తు విధానం:

డీఆర్డీవో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో విడుదలైన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకనే వారు అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ద్వారా చేసుకోవచ్చు. అందులోకి వెళ్లి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇక డీఆర్టీవో విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 19 చివరి తేదీగా ఉంది. ఈ తేదీలోపు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు:

డీఆర్డీవో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో పోస్టులకు కొన్ని అర్హతలను నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించాలి. అలానే కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో ఎంఈ లేదా ఎంటెక్ కలిగి ఉండాలి.

వయోపరిమితి:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి గరిష్ట వయోపరిమితి 28 ఏళ్లు మాత్రమే ఉండాలి. అలానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు మరో ఐదేళ్లు సడలింపు ఉంటుంది. అలానే ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఇక జీతం విషయానికి వస్తే.. డీఆర్డీవోలో ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెల జీతం రూ.37 వేల తో పాటు హెచ్ఆర్ఏ అదనంగా చెల్లిస్తారు. అలా మొత్తం రూ.40 వేలకు వస్తుందని తెలుస్తోంది.

ఉద్యోగ ఎంపిక విధానం:

ఈ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జూన్19, 20 తేదీల్లో ఈ ఇంటర్వూలు జరగనున్నాయి. ఈ రెండు రోజుల ఉదయం 8:30 గంటల నుంచి 10:00 గంటల మధ్య రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా ‘వీసా’వహులకు తీపి కబురు

అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా(ఎఫ్‌-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా(ఎఫ్‌-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలో ఫాల్‌ ఎడ్యుకేషన్‌ సీజన్‌ ఆగస్టు-సెప్టెంబరులో ప్రారంభమవుతుంది. సాధారణంగా సీజన్‌ చివరి వారంలో ఒక దఫా ఇంటర్వ్యూలో వీసా దరఖాస్తు ఆమోదం పొందనివారికి మరో అవకాశం కల్పిస్తారు. ఈ దఫా ఆగస్టు నెలాఖరు వరకు వీసా స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించటం విశేషం. ఆ సీజన్‌లో అమెరికా వెళ్లేందుకు ఇప్పటికే స్లాట్లు తీసుకున్న విద్యార్థులకు సోమవారం నుంచి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన తొలి విడత ఇంటర్వ్యూ తేదీల(స్లాట్ల)ను అమెరికా ఈ నెల రెండో వారం ప్రారంభంలోనే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దఫా పెద్దసంఖ్యలో భారతీయ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా దశలవారీగా స్లాట్లు విడుదల చేయనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. విద్యార్థి వీసా సీజన్‌లో ఆగస్టు చివరి వరకు స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది. చివరి నిమిషంలో వెళ్లేవారికీ ఉపయుక్తంగా ఉండాలన్న ఆలోచనతో ఆగస్టు దాకా ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో మరిన్ని స్లాట్లు విడుదల చేయనున్నారు. దిల్లీలోని రాయబార కార్యాలయం, హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతాలలోని కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్లు అందుబాటులో ఉన్నట్లు కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం ప్రకటించింది.

విద్యార్థులకు 24న అవగాహన కార్యక్రమం
ప్రస్తుత ఫాల్‌ సీజన్‌తోపాటు 2025 స్ప్రింగ్‌ సీజన్‌లో అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం హైబ్రిడ్‌ విధానంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో హాజరు కావాలనుకునేవారు bit.ly/EdUSASVS24 ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా హాజరు కావాలనుకునేవారికి ఎస్‌.ఎల్‌.జూబ్లీ కాంప్లెక్స్, 4వ అంతస్తు, రోడ్‌ నంబర్‌ 36, జూబ్లీహిల్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో అమెరికా వీసా కాన్సులర్‌ అధికారి వీసా దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించనున్నారు.

AP Land Titling Act: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుకు సిద్ధం..

AP Land Titling Act: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుకు సిద్ధం.. చంద్రబాబు రెండో సంతకం దానిపైనే..
అమరావతి: రాష్ట్ర ప్రజలను భయకంపితులను చేసిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022) రద్దు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెండో సంతకాన్ని భూ హక్కు చట్టం రద్దు దస్త్రంపైనే పెట్టనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు రెవెన్యూశాఖ నుంచి ప్రభుత్వానికి అందాయి. దీనిని న్యాయశాఖ వద్దకు పంపబోతున్నారు. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల అనంతరం చంద్రబాబు ఈ దస్త్రంపై సంతకం చేసిన తర్వాత.. చట్టం రద్దుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత జరిగే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో టైటిలింగ్‌ చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశపెడతారు.

నీతీ ఆయోగ్‌ నమూనా చట్టానికి తూట్లు పొడిచి..
గత వైకాపా ప్రభుత్వం రూపొందించిన టైటిలింగ్‌ చట్టంలో పేర్కొన్న నిబంధనలు ప్రజల స్థిరాస్తుల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి. సొంత స్థిరాస్తులపై చట్టబద్ధ హక్కులను నిర్ణయించే అధికారాన్ని అధికారులకు అప్పగించి, యాజమాన్య హక్కుల కల్పన బాధ్యతల నుంచి సివిల్‌ కోర్టులను వైకాపా ప్రభుత్వం తప్పించడం దుమారాన్ని రేపింది. వైకాపా ప్రభుత్వం 2023 అక్టోబర్‌ 31 నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జీవో జారీచేయడం భూ యజమానులకు ఆందోళన కలిగించింది. అలాగే..చట్టంలోని సెక్షన్‌- 28కి అనుగుణంగా ఏపీ ల్యాండ్‌ అథారిటీని ఏర్పాటు చేస్తూ దానికి ఛైర్‌పర్సన్, కమిషనర్, సభ్యులను నియమిస్తూ గతేడాది డిసెంబర్‌ 29న ప్రభుత్వం జీవో జారీచేసింది. నీతీ ఆయోగ్‌ ప్రతిపాదించిన టైటిలింగ్‌ చట్టానికి వైకాపా ప్రభుత్వం తూట్లు పొడిచి.. తన ఇష్టమొచ్చినట్లు నియమ నిబంధనలు రూపొందించి, అందరిని కలవరానికి గురిచేసింది. నీతీ ఆయోగ్‌ ప్రతిపాదించిన ‘నమూనా టైటిలింగ్‌ చట్టం’ సెక్షన్‌-5లో టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(టీఆర్‌ఓ) నియామకం గురించి కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నోటిఫికేషన్‌ జారీచేయడం ద్వారా ఏ అధికారినైనా (ఎనీ ఆఫీసర్‌) టీఆర్‌వోగా నియమించవచ్చని తెలిపింది. అయితే.. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం సెక్షన్‌ 5లో ‘ఏ వ్యక్తినైనా(ఎనీ పర్సన్‌)టీఆర్‌ఓగా నియమించవచ్చని పేర్కొంది. రికార్డుల్లో యజమానుల పేర్లను ఓ సారి చేర్చి నోటిఫై చేసిన తర్వాత మూడేళ్లలోపు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే యాజమాన్య హక్కు విషయంలో ఈ వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించాలని నమూనా చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర చట్టంలో మూడేళ్ల కాలాన్ని రెండేళ్లకు కుదించారు. రికార్డుల్లో నమోదైన యాజమాన్య హక్కుపై అభ్యంతరం వ్యక్తం చేసే గడువును రెండేళ్లకే పరిమితం చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే నీతీ ఆయోగ్‌ నమూనా చట్టం సెక్షన్‌ 16 ప్రకారం హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం హైకోర్టులో అప్పీల్‌కు అవకాశం ఇవ్వలేదు. హైకోర్టులో రివిజన్‌కు మాత్రమే దాఖలు చేసుకోవాలని పేర్కొన్నారు. భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికార పరిధి నుంచి రాష్ట్రంలోని సివిల్‌ కోర్టులను పూర్తిగా పక్కనపెట్టిన(సెక్షన్‌ 38) జగన్‌ సర్కారు.. హైకోర్టులో అప్పీల్‌కు అవకాశం లేకుండా కేవలం రివిజన్‌కు అవకాశాన్నికల్పించడం తీవ్రఆందోళన కలిగించింది.

న్యాయస్థానాల తీర్పులనూ పక్కనబెట్టి..
భూ యాజమాన్య హక్కు వివాదాన్ని పరిష్కరించేందుకు నీతీఆయోగ్‌.. నమూనా టైటిలింగ్‌ చట్టం ద్వారా మూడు అంచెల వ్యవస్థను సిఫార్సు చేసింది. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం ద్వారా ఈ వ్యవహారాన్ని రెండు అంచెలకే పరిమితం చేశారు. న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని అధికారుల చేతుల్లో భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికారాన్ని వైకాపా ప్రభుత్వం కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. భూ హక్కులను అధికారులు నిర్ణయించలేరని, న్యాయస్థానాలు మాత్రమే ఈ విషయాన్ని పరిష్కరించగలవని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం పెడచెవినపెట్టింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా నెలల తరబడి కోర్టు విధులను బహిష్కరించినా ప్రభుత్వం స్పందించలేదు.

Volunteers: రెంటికీ చెడిన 1.08 లక్షల మంది వాలంటీర్లు

వైకాపా ఎమ్మెల్యేలు చెప్పారనో, ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారనో రాజీనామా చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.

వైకాపా ఎమ్మెల్యేలు చెప్పారనో, ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారనో రాజీనామా చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఉన్నదాంతో పాటు రాబోతున్న అదనపు ఆర్థిక ప్రయోజనాలూ కోల్పోతున్నామని వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 6,398, పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యల్పంగా 515 మంది ఉన్నారు.

ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం చేయాలన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఒత్తిళ్లతో వీరు వాలంటీరు ఉద్యోగాలను వదులుకున్నారు. వీరిలో చాలామంది ప్రచారంలో వైకాపా అభ్యర్థులకు అండగా నిలబడ్డారు. ఓటర్లకు తాయిలాల పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. తీరా, ఎన్నికల్లో వైకాపా బోర్లా పడటం, ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తమ భవిష్యత్తేంటని ప్రశ్నిద్దామన్నా, వైకాపా నేతలు ముఖం చాటేస్తున్నారని వాపోతున్నారు. ఒత్తిళ్లకు తలొగ్గక కొనసాగిన వారంతా మంచి రోజులు రాబోతున్నాయని ఆశిస్తున్నారు. వాలంటీర్ల పారితోషికం రెట్టింపు చేస్తామన్న చంద్రబాబు హామీ వారిని ఊరిస్తోంది.

EAPCET : ఈఏపీసెట్ ఫలితాలు నేడు విడుదల!

EAPCET Results Today : ఇంజినీరింగ్ (Engineering), వ్యవసాయ (Agriculture), ఫార్మసీ కోర్సుల్లో (Pharmacy Course) ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్‌ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు.

ఈ విషయం గురించి సెట్‌ ఛైర్మన్‌, జేఎన్‌టీయూ్‌ కాకినాడ వీసీ ప్రసాద్‌ రాజు వివరించారు.

ఈ క్రమంలోనే ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ ఛార్జ్‌ చైర్మన్‌ రామమోహన్‌ రావుతో కలిసి ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల (EAPCET Results 2024) చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఈఏపీ సెట్‌ ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించింది.

ఈ సారి పరీక్షకు 3,62,851 మంది దరఖాస్తులు చేసుకోగా..వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ కు 2,58,373 మంది ,వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు సంబంధించి 80,766 మంది ఈ పరీక్షలు రాశారు.

ఈ పరీక్షలో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. దాని ఆధారంగానే ర్యాంకులను ప్రకటిస్తారు.

కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు – జగనే టార్గెట్ !

Raghuramakrishna Raju : మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు అప్పట్లో జరిగిన ఘటనలతో పాటు వాటికి సంబంధించిన సాక్ష్యాలను కూడా జత చేశారు.

పుట్టిన రోజు నాడు అరెస్టు చేసిన సీఐడీ అధికారులు

2021 మే 14వ తేదీన రఘురామకృష్ణరాజు హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నారు. ఆ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడ్డారు. ఏ కేసు పెట్టారో.. ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పలేదు. వెంటనే గుంటూరుకు తరలించారు. అయితే వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఆ రోజు రాత్రి గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో ఉంచారు. అరెస్టు చేసిన తర్వాత సీఐడీ అధికారులు సుమోటో రాజద్రోహం కేసులు పెట్టినట్లుగా ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. కుట్ర ఉందని కేసు పెట్టారు.

అదే రోజు రాత్రి కస్టోడియల్ టార్చర్

ఉదయమే కోర్టులో హాజరు పరిచే సమయంలో ఆయన నడవలేకపోయారు. కోర్టులో తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. తనను కొడుతున్న దృశ్యాలను లైవ్ లో ఇతరులకు చూపించారని రఘురామ ఆరోపించారు. వ్యవహారం హైకోర్టుకు చేరడంతో దీంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు చేయించాలని ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు గాయాలు కాలేదని.. వేరే సమస్యల వల్ల కాళ్లకు ఇబ్బందులు వచ్చాయని నివేదిక ఇచ్చారు. అయితే డాక్టర్లు తప్పుడు నివేదికలు ఇచ్చారని.. తనకు హైదరాబాద్లో సైనిక ఆస్పత్రిలో పరీక్షలు చేయించాలని రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్ష – కొట్టారని రిపోర్ట్

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ సైనిక ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. అక్కడ ఆయనకు గాయాలు అయినట్లుగా తేలింది. బలమైన వస్తువుతో కొట్టడం ద్వారా గాయం అయినట్లుగా తేలడంతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో రాజద్రోహం సెక్షన్లను నిలిపివేసింది. ఆ తర్వాత తనపై జరిగిన దాడి విషయంలో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు. తనను అరెస్టు చేసిన అధికారుల కాల్ రికార్డులను భద్ర పరిచేలా.. ఆదేశాలు తెచ్చుకున్నారు. సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది.

జగన్ చంపాలని చూశారని ఆర్ఆర్ఆర్ ఆరోపణ

జగన్మోహన్ రెడ్డి తనను చంపేందుకు ప్రయత్నించారని రఘురామ గట్టిగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రఘురామ ఫిర్యాదుపై గుంటూరు ఎస్పీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నాడు సొంతంగా కేసు పెట్టిన అధికారులు.. అందరి కాల్ రికార్డులు భద్రపర్చి ఉండటంతో.. ఒక వేళ దర్యాప్తు చేస్తే .. జగన్, ఐపీఎస్ సునీల్ కుమార్ ఇబ్బందుల్లో పడుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

యథావిధిగా విద్యా కానుక పంపిణీ , సమాంతరంగా టెండర్లు, నాణ్యతపై విచారణ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా కానుకను యథావిధిగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వం మారినందున విద్యాకానుకను ఏంచేస్తారనే సందిగ్ధత నెలకొన్నందున ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. 13న బడులు తెరుచుకునే రోజు నుంచే పంపిణీ మొదలుపెట్టనుంది. 2024-25 విద్యా సంవత్సరంలో పంపిణీకి ఇప్పటికే కిట్లను సిద్ధంచేసింది. అయితే ఓవైపు పంపిణీతో పాటు మరోవైపు విద్యాకానుకపై విచారణను కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఐదేళ్లలో విద్యా కానుకలో భారీగా అక్రమాలు జరిగాయి.
నాణ్యతలేని బ్యాగులు, బూట్లు కొనుగోలు చేసిన విషయం గతంలోనే బయటపడింది. కావాల్సిన కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం ఇష్టారాజ్యంగా టెండర్ల విధానం మార్చేసింది. న్యాయ సమీక్షను తప్పించుకునేందుకు టెండర్ల ప్యాకేజీలుగా విడగొట్టి ఒక్కటీ రూ.వంద కోట్లు దాటకుండా చేసింది. చివరికి ఈ విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యా కానుక కిట్లకు ఏకంగా టెండర్లను ఎత్తివేసింది. నేరుగా కాంట్రాక్టర్లకు రూ.630 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టింది. టెండర్లు అక్కర్లేదని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆదేశాలు జారీచేయగా, దానిని సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అమలుచేశారు. కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి తక్కువకు ఇస్తామన్న వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించగా, సరిగ్గా అంతకముందున్న 19 మంది కాంట్రాక్టర్లనే సమగ్రశిక్ష ఎంపిక చేసింది. మరి వారే ఎలా ఎంపికయ్యారనేది అధికారులకే తెలియాలి. ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది

అమూల్ డెయిరీ బిజినెస్‌తో భారీ లాభాలు.. ఫ్రాంఛైజీ ఇలా తీసుకోండి

Amul: ప్రపంచంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి. దేశంలో చాలా మంది రైతులు, ఇతరులు డెయిరీ మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్నారు.

మంచి ఆదాయం వచ్చే బిజినెస్‌లో డెయిరీ మార్కెట్‌ ఒకటిగా గుర్తింపు పొందింది. పాలు, పాల ఉత్పత్తుల అమ్మకంతో భారీగా లాభాలు పొందవచ్చు. అయితే సొంతంగా బిజినెస్ ప్రారంభించడానికి బదులుగా, డెయిరీ కంపెనీల్లో డీలర్‌షిప్ లేదా ఫ్రాంచైజీ తీసుకోవడం మంచిది. దీనివల్ల వ్యాపారం త్వరగా ప్రారంభించవచ్చు, పెట్టుబడి కూడా తగ్గుతుంది. కంపెనీ రెప్యుటేషన్ కారణంగా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే లాభాలు అందుకోవచ్చు.

* బెస్ట్ బిజినెస్ ఫ్రాంచైజీ..

భారతదేశంలో డెయిరీ బిజినెస్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు అమూల్. ఈ సంస్థ 1946 నుంచి వివిధ రకాల డెయిరీ ప్రొడక్టులను అమ్ముతూ దేశంలోనే టాప్‌ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. అందుకే డెయిరీ బిజినెస్ చేయాలనుకునే వారు అమూల్ ఫ్రాంఛైజీ తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రాసెస్, పెట్టుబడి, లాభాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

* ఫ్రాంచైజీతో మంచి లాభాలు

భారతదేశంలో టాప్‌ డెయిరీ ప్రొడక్టు కంపెనీల్లో ఒకటైన అమూల్, ఫ్రాంచైజీ ఓనర్‌ లాభంలో వాటా తీసుకోదు. అందుకే చాలా ప్రాంతాల నుంచి ఫ్రాంచైజీ కోసం భారీ రిక్వెస్టులు వస్తున్నాయి. కానీ తమ ప్రొడక్టులను కమీషన్‌పై అమూల్‌ అందుబాటులో ఉంచుతుంది. ఈ ఫెసిలిటీలతో ఫ్రాంఛైజ్ ఓనర్‌ ఈ బ్రాండ్ ప్రొడక్టులను అమ్మి మరింత లాభం అందుకుంటారు.

* రిక్వైర్‌మెంట్స్‌ ఏంటి?

భారతదేశంలో అమూల్ రెండు రకాల ఫ్రాంచైజీలు అందిస్తోంది. కంపెనీ నుంచి ఫ్రాంచైజీ పొందాలంటే, సొంత దుకాణం లేదా వ్యాపారం కోసం తగినంత భూమి ఉండాలి. ఇందుకు కొన్ని అర్హతలు కూడా ఉండాలి. కంపెనీ అందించే ఫ్రాంచైజీల్లో అమూల్ అవుట్‌లెట్స్‌, పార్లర్స్‌ లేదా కియోస్క్, ఐస్ క్రీం స్కూపింగ్ పార్లర్స్‌ ఉన్నాయి. అమూల్ అవుట్‌లెట్స్‌, పార్లర్ లేదా కియోస్క్‌ కోసం కనీసం 150 చదరపు అడుగుల స్థలం ఉన్న షాప్ ఉండాలి. ఐస్‌క్రీం స్కూపింగ్ పార్లర్‌ కోసం కనీసం 300 చదరపు అడుగుల స్థలం ఉండాలి.

* దరఖాస్తు చేసుకునే సైట్ ఇదే..

ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేయడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.amul.com ఓపెన్ చేయాలి. అవసరమైన వివరాలన్నీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అవుట్‌లెట్‌కు సంబంధించిన వారి వివరాలను retail@amul.coop ఇమెయిల్ అడ్రస్‌కి పంపాలి.

* ఎంత ఖర్చు అవుతుంది?

అమూల్ అవుట్‌లెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు రూ.25,000 డిపాజిట్ చేయాలి. ఇది నాన్‌ రీఫండబుల్‌ అమౌంట్. ఈ ఛార్జీ కాకుండా, కంపెనీ నిబంధనల ప్రకారం అవుట్‌లెట్ ఫ్రాంచైజీకి తగినట్లుగా చేయడానికి రూ.1 లక్ష ఖర్చు చేయాలి. ఫ్రీజర్స్, ఎక్విప్‌మెంట్‌పై మరో రూ.75,000 పెట్టుబడి పెట్టాలి.

* ఐస్ క్రీం ఫ్రాంచైజీ..

ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీని తీసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు షాప్ ఫ్రాంచైజీని సిద్ధం చేయడానికి రూ.4 లక్షలతో పాటు రూ.50,000 సెక్యూరిటీ మనీగా ఖర్చు చేయాలి. ఫ్రాంచైజీకి అవసరమైన పరికరాల కోసం మరో రూ.1.50 లక్షలు కూడా అవసరమవుతాయి.

* లాభాలు ఎలా ఉంటాయి?

అమూల్ కంపెనీ పాల ఉత్పత్తులపై 10 శాతం కమీషన్, ఐస్‌క్రీమ్‌పై 20 శాతం కమీషన్, హాట్ చాక్లెట్ డ్రింక్స్, షేక్స్, రెసిపీ ఐస్‌క్రీమ్‌లపై 50 శాతం కమీషన్ లభిస్తుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు పాలసీల డీటేల్స్ వివరంగా తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ లింకు https://amul.com/m/amul-franchise-business-opportunity విజిట్‌ చేయవచ్చు.

CBI Recruitment: నిరుద్యోగులకు అలర్ట్.. 3,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

CBI Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ బ్యాంకు డిగ్రీ అర్హతతో ఇటీవల 3,000 అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఇందుకు అప్లికేషన్ ప్రాసెస్ గతంలోనే ముగిసింది. అయితే బ్యాంకు తాజాగా అప్లికేషన్ విండోను మళ్లీ ఓపెన్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

* జాబ్ రిక్రూట్ మెంట్..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి కొన్ని నెలల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చింది. అప్లికేషన్ ప్రాసెస్ 2024 ఫిబ్రవరి 21న ప్రారంభమై మార్చి 27న ముగిసింది. అయితే జూన్ 6న బ్యాంకు అప్లికేషన్ విండోను మళ్లీ రీఓపెన్ చేసింది. అభ్యర్థులు జూన్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్ టెస్టు జూన్ 23న జరగనుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://centralbankofindia.co.in/en విజిట్ చేయవచ్చు.

* అప్లికేషన్ ఫీజు

ఈ పోస్టులకు అప్లై చేసుకునే SC, ST, EWS, మహిళా అభ్యర్థులు రూ.600 ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి. దీనికి GST అదనం. PWBD అభ్యర్థులు రూ. 400 + GST, మిగతా అభ్యర్థులందరూ రూ. 800 + GST ఫీజు చెల్లించాలి.

* అర్హత, వయో పరిమితి

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసేవారు ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో కనీసం గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సమాన అర్హతలు ఉండాలి. అయితే 31.03.2020 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే అప్లికెంట్స్ 1996 ఏప్రిల్ 1 నుంచి 2004 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది.

* స్టైఫండ్ ఎంత?

ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000 స్టైఫండ్‌ చెల్లిస్తారు. ఇది అప్రెంటిస్‌షిప్ పొజిషన్ కాబట్టి ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ ఏవీ ఉండవు.

* సెలక్షన్ ప్రాసెస్

అప్లై చేసిన వారు ముందు ఎగ్జామ్ రాయాలి. రాత పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్టు కూడా క్లియర్ చేయాలి. అప్లికెంట్స్‌కు తప్పనిసరిగా స్థానిక భాషపై పట్టు ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ ఉన్నట్లు ఒక సర్టిఫికెట్ కూడా సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.

* ఆన్ లైన్లో ఎగ్జామ్..

ఆన్‌లైన్ రిటెన్ ఎగ్జామ్‌లో మొత్తం 5 సెక్షన్లు ఉంటాయి. క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లీష్, & రీజనింగ్ ఆప్టిట్యూడ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్; బేసిక్ రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్; బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్; బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్; బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్ చెక్ చేయవచ్చు.

వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్.. కొంపముంచిన అమెరికా!

సూపర్ ఓవర్లు.. సంచలన ఫలితాలతో టీ20 ప్రపంచకప్ 2024 ఆసక్తికరంగా సాగుతోంది. డ్రాప్ ఇన్ పిచ్‌లతో సిక్సర్ల వర్షం కురువకపోయినా.. బౌండరీల మోత మోగకున్నా..

లో-స్కోరింగ్ థ్రిల్లర్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. మరీ ముఖ్యంగా పసికూన జట్లు వరల్డ్ బెస్ట్ టీమ్స్‌కు ఊహించని షాక్ ఇస్తున్నాయి.

న్యూజిలాండ్‌కు పసికూన అఫ్టాన్ షాకిస్తే.. పాకిస్థాన్‌ను అమెరికా కోలుకోలేని దెబ్బ తీసింది. శ్రీలంకను బంగ్లాదేశ్ మట్టికరిపించింది. సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించినంత పని చేసింది. ఈ సంచలన ఫలితాలు.. ఆయా జట్లను ఇంటిదారి పట్టిస్తున్నాయి. పసికూనల ధాటికి న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు సిద్దంగా ఉన్నాయి.

ముఖ్యంగా గ్రూప్-ఏలో భారత్, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో ఉన్న పాకిస్థాన్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ గ్రూప్‌లో రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచిన టీమిండియా 4 పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత కెనడా, అమెరికాలతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు పెద్ద కష్టం కాదు.

పాకిస్థాన్, కెనడాపై విజయం సాధించిన అమెరికా కూడా 4 పాయింట్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్, ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ రెండింటిలో ఒక్కటి గెలిచినా అమెరికా ఖాతాలో 6 పాయింట్స్ చేరుతాయి. వారి రన్ రేట్ కూడా 0.626తో మెరుగ్గానే ఉంది. కాబట్టి అమెరికాకే సూపర్-8 చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిన పాకిస్థాన్, ఐర్లాండ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్, కెనడాతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచినా పాక్ ఖాతాలో 4 పాయింట్స్ చేరుతాయి. పాక్ సూపర్ 8 చేరాలంటే అమెరికా తమ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిపోవాలి.

అప్పుడు పాక్, అమెరికా 4 పాయింట్స్‌తో సమంగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు సూపర్ 8కు వెళ్తోంది. ప్రస్తుతం పాక్ కంటే అమెరికా రన్‌రేట్ మెరుగ్గా ఉంది. మెరుగైన రన్ రేట్ సాధించాలంటే పాక్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

దాంతోనే ఈ టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమణ తప్పదనే అభిప్రాయం కలుగుతోంది. అమెరికా చేతిలో ఓడటం పాకిస్థాన్ కొంపముంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

25 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన నోకియా 3210.. ఫీచర్లు ఇవే..

Nokia 3210 4G | ఇంటర్నెట్‌ డెస్క్‌: నోకియా (Nokia) బ్రాండ్‌పై ఫోన్లు తయారుచేసే హెఎండీ గ్లోబల్‌ సంస్థ.. నోకియా 3210 4జీ (Nokia 3210 4G) ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

25 ఏళ్ల క్రితం లాంచ్‌ అయిన ఈ మోడల్‌ మరోసారి నోకియా ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్‌ ధరను రూ.3,999గా నిర్ణయించారు. అమెజాన్‌, హెచ్‌ఎండీ ఈ స్టోర్‌ వెబ్‌సైట్లలో కొనుగోలు చేయొచ్చు. మరోసారి అదే రెట్రో లుక్‌ను కొనసాగించారు. నీలం, పసుపు, నలుపు రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే. ఇందులో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే ఉంటుంది. యునిసోక్‌ టీ107 ప్రాసెసర్‌ అమర్చారు. వెనకవైపు 2 ఎంపీ కెమెరా అమర్చారు. 64 ఎంబీ ర్యామ్‌ ఇచ్చారు. యూట్యూబ్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌, న్యూస్‌, గేమ్స్‌ కోసం వేర్వేరుగా యాప్స్‌ ఇచ్చారు. స్నేక్‌ గేమ్‌ను కొనసాగించారు. ఈ ఫోన్‌లో 1450 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. యూఎస్‌బీ టైప్‌-సి పోర్టుతో వస్తుండడం గమనార్హం. 3.5 ఎంఎం జాక్, ఎంపీ3 ప్లేయర్‌, ఎఫ్‌ఎం రేడియో, డ్యూయల్‌ సిమ్‌ 4జీ voLTE సపోర్ట్‌తో ఈ ఫోన్‌ వస్తోంది.

Jayasudha: హనీమూన్ లో అలా జరిగింది.. అందుకే మతం మార్చుకున్నా.!

Jayasudha: సహజనటి జయసుధ తన అందం,నటనతో ఇండస్ట్రీలో న్యాచురల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.ఈ హీరోయిన్ ఏ పాత్రలోనైనా సరే చాలా సహజంగా ఒదిగిపోతుంది.

అందుకే అందరూ ఈమెను సహజ నటి అని అంటారు.అంతేకాదు సహజనటి అనే బిరుదు కూడా జయసుధకు వచ్చింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ మొదట హిందదువు అయినప్పటికీ ఆ తర్వాత క్రిస్టియన్ మతంలోకి మారిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ మతంలోకి మారడానికి ప్రధాన కారణం అదే అంటూ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో జయసుధ చెప్పుకొచ్చింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. జయసుధ మొదట్లో బిజినెస్ మాన్ అయినా రాజేంద్రప్రసాద్ ని పెళ్లి చేసుకొని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు జితేంద్ర కపూర్ సోదరుడు అయిన నితిన్ కపూర్ ని ప్రేమించి పెళ్లాడింది. అయితే నితిన్ కపూర్ తో పెళ్లయ్యాక థాయిలాండ్ కి ఈ జంట హనుమాన్ కి వెళ్లారట ఇక ఆ సమయంలో అక్కడ నీళ్లలో బోటింగ్ చేద్దామని నితిన్ జయసుధ తో చెప్పారట. (Jayasudha)

కానీ నీళ్లంటే భయం ఉన్న జయసుధ నేను చేయను అని చెప్పిందట.అయితే రెండు రోజులు అయ్యాక మూడో రోజు తన భర్త కోరికను కాదనలేక సముద్రం లో జెట్ స్కీం కి వెళ్ళిందట.ఇక అలా వెళ్ళినా కొద్దిసేపు బాగానే అనిపించినప్పటికీ ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయి ఆమె నీళ్లలో మునిగి పోయిందట. అయితే ఈతరాని జయసుధ నా జీవితం ఇంతటితో అయిపోయింది చనిపోతున్నాను అని భావించి హిందువు అయినప్పటికీ ఏసుక్రీస్తు దేవున్ని తలుచుకుందట.

అయితే అలా తలచుకున్న కొద్దిసేపటికే ఆమెకు ఆకాశంలో ఉన్న సూర్యకిరణాల్లో ఏసుక్రీస్తు రూపం కనిపించిందట. ఆ తర్వాత శ్వాస బిగబట్టుకొని నీళ్ల నుండి జయసుధ బయటపడిందట.అలా ఆ సంఘటన జయసుధ ను హిందువు నుండి క్రిస్టియన్ మతంలోకి మారేలా చేసిందట.(Jayasudha)

పింఛన్ల పెంపుపై కసరత్తు .. రూ.4 వేల పింఛను పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు

సామాజిక భద్రత పింఛన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ.4 వేల పింఛను పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని తెదేపా, జనసేనలు ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించాయి. దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామని హామీనిచ్చాయి. పింఛను జులై 1వ తేదీన అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులున్నారు. వీరికి పింఛను నగదు చెల్లింపులకుగాను నెలకు రూ.1,939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేలు (జులై 1న ఇచ్చే పింఛను రూ.4 వేలు+ ఏప్రిల్‌ నుంచి రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలు) చొప్పున, దివ్యాంగులకు రూ.6 వేల పింఛనుకు జులై 1న పంపిణీ చేయడానికి రూ.4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి అయితే నెలకు రూ.2,800 కోట్లు వ్యయం అవుతుందని లెక్కగట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించనున్నారు.

దివ్యాంగ పింఛనుదారులు 8 లక్షల మంది
దివ్యాంగ పింఛనుదారులు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం రూ.3 వేలు పింఛను తీసుకుంటున్నారు. వీరి పింఛనును రూ.6 వేలకు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవి కాకుండా పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేల పింఛను, కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛను అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాల్ని వైద్యశాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సేకరిస్తున్నారు.

50 ఏళ్లకు వర్తింపచేస్తే ఎంత మంది వస్తారు?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు 50 ఏళ్లకే పింఛనును అమలు చేస్తామని ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఆయా సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంత మంది ఉన్నారు, వారిలో ఇప్పటికే పింఛను పొందుతున్న వారు ఎంతమంది.. అనే వివరాలను సమీకరిస్తున్నారు.

నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్సార్‌ విగ్రహం తొలగింపు

వైకాపా పాలనలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భారీ విగ్రహాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు సోమవారం తొలగించారు.

వైకాపా పాలనలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భారీ విగ్రహాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు సోమవారం తొలగించారు. నాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన పెద్దల సమక్షంలోనే నేడు తొలగించడం గమనార్హం. సమాజానికి విద్యావంతులను అందించే విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నేతల విగ్రహాలు పెట్టడం సరికాదని అప్పట్లో ఎంత మొత్తుకున్నా ఉపకులపతి ఆచార్య రాజశేఖర్‌ పట్టించుకోలేదు. వర్సిటీ నిధులతో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటి ప్రభుత్వ సలహాదారు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఆహ్వానించి, పాలకుల ప్రాపకానికి పాకులాడారు.

విగ్రహాన్ని తొలగించాలని కొన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్న విద్యార్థులు.. సోమవారం ఉదయం టీఎన్‌టీయూసీ, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. నాటి ప్రభుత్వ మెప్పు కోసం మూడు రాజధానులకు అనుకూలంగా విశ్వవిద్యాలయంలో సమావేశాలు, చర్చావేదికలు నిర్వహించడం, వైకాపా ప్లీనరీకి పార్కింగ్‌ స్థలం కేటాయించడం వంటి చర్యలకు పాల్పడిన వీసీపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఆందోళనకారులతో వీసీ రెండు దఫాలుగా చర్చించారు. రెండు రోజుల్లో విగ్రహాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు. అందుకు వారు ససేమిరా అన్నారు. సాయంత్రం లోపు తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. మరోపక్క తన అవినీతిపై కూడా విద్యార్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు వీసీకి సంకేతాలు అందాయి. విధిలేని పరిస్థితుల్లో మెట్టు దిగిన రాజశేఖర్‌.. అప్పటికప్పుడు పొక్లెయిన్‌ తెప్పించి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు.

వైకాపాకు నెల్లూరు మేయర్‌ రాజీనామా

నెల్లూరు నగర మేయర్‌ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్‌.. వైకాపాకు రాజీనామా చేశారు.

నెల్లూరు నగర మేయర్‌ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్‌.. వైకాపాకు రాజీనామా చేశారు. కార్పొరేషన్‌ ఛాంబర్‌లో సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ‘నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 14 నెలల క్రితం అధికార వైకాపాను వీడినప్పుడు మేమూ ఆయన వెంటే నడిచాం. మేయర్‌ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినా వైకాపా నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి బెదిరింపులు, ఒత్తిళ్లతో వెనక్కు తగ్గాం. వైకాపాలో ఉన్నా మాకు రాజకీయ భిక్షపెట్టిన శ్రీధర్‌రెడ్డిని పల్లెత్తుమాట అనలేదు. కుటుంబ పెద్దగా ఆయన మమ్మల్ని క్షమించి అక్కున చేర్చుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.

13న పాఠశాలల పునః ప్రారంభం మెమో సర్కులర్

13న పాఠశాలల పునః ప్రారంభం మెమో సర్కులర్

 

 

Malla Reddy : టీడీపీ వైపు మాజీ మంత్రి మల్లారెడ్డి చూపు.. అధ్యక్ష పదవి కోసం!

Telangana : బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీ (TDP) లోకి వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు (Chandrababu) హయాంలో పనిచేసిన మల్లారెడ్డి మరోసారి టీడీపీ అధికారంలోకి రావడంతో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

టీడీపీలో చేరితే తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తామంటున్నారని తన అనుచరులు, బీఆర్ఎస్‌ కౌన్సిలర్లతో మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నట్లు సన్నిహిత వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి.

పరోక్షంగానైనా సీఎం రేవంత్ కు దగ్గరవ్వాలని..
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ మల్లారెడ్డి (Malla Reddy) కబ్జా భూములపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. కాగా పరోక్షంగానైనా సీఎం రేవంత్ కు దగ్గరవ్వాలంటే చంద్రబాబుతో దోస్తీకోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు చెబితే రేవంత్ వింటాడని, తెలంగాణలోనూ పవన్‌కల్యాణ్ హవా ఉందని మల్లారెడ్డి అనుచరులతో కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబుతో మంతనాలు జరిపారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయబతున్నారంటూ ప్రచారం జరుగుతోది. అయితే ఈ వార్తలపై స్పందించిన మల్లారెడ్డి
ఇదంతా తప్పుడు ప్రచారమంటూ ఖండిస్తున్నారు.

Poonam Kaur: చెల్లి, తల్లితో కలిస్తేనే జగన్ కు జయం.. పూనమ్‌కౌర్‌ పోస్టు వైరల్‌..

Poonam Kaur: ఏపీ ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పోటీచేసిన అధికార వైఎస్సార్‌సీపీ ఘోరంగా ఓడిపోయింది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా.. చిత్తుగా ఓడిపోయి కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీ నేతలు జీర్ణంచుకోలేకపోతున్నారు. ఇక అభిమానులు అయితే జగన్‌ ఓడిపోలేదు.. జనం ఓడిపోయారు.. ఆరు నెలల్లో జగన్‌ జనానికి గుర్తొస్తాడు అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కొందరు ఈవీఎంల ట్యాంపరింగ్‌ గురించి సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అభిమాన నటి కూడా జగన్‌ గురించి కీలక పోస్టు పెట్టారు. ఇప్పుడు అది వైరల్‌గా మారింది.

పూనమ్‌కౌర్‌ పోస్టు వైరల్‌..
టాలీవుడ్‌ నటి పూనమ్‌కౌర్‌ మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. తెలుగుతోపాటు పలు సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి.. సినిమాయేతర విషయాలను పోస్టు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని పూనమ్‌ చేసే ట్వీట్లు నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆమె ‘వై నాట్‌ 175 అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు’ అని ట్వీట్‌ చేసింది. దీనికి #andhrapradesh అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా జోడించింది. ఈ పోస్ట్‌ క్షణాల్లో వైరల్‌ గా మారింది. అయితే వైసీపీ అభిమాని అయిన పూనమ్‌ ఇలా పోస్టు పెట్టడంతో అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేశారో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకున్నారు.

కూటమి ప్రభుత్వంపై కూడా..
ఏపీలో అధికారంలోకి రాబోతున్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి గురించి కూడా ఆమె ఇటీవల ఓ ట్వీట్‌ చేశారు. సుగాలి ప్రతి కేసు త్వరగా పరిష్కరించాలని కోరింది. తాజాగా మరో ఆసక్తికర ట్వీట్‌ చేసింది పూనమ్‌ కౌర్‌. ఈసారి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గురించి స్పందించింది.

ఫ్యామిలీలో కలిసిపోవాలి..
ఈ ట్వీట్‌లో పూనమ్‌ జగన్‌ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ‘గత ఎన్నికల సమయంలో జగన్‌ విజయంలో భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కీలక పాత్ర పోషించారు. వారు తమదైన మార్గాల్లో సహనం, పట్టుదలను నేర్పారు. ఇప్పుడు వారంతా కలిసుండాలని కోరుకుంటున్నా’ అని పూనమ్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరలవుతోంది. దీనిపై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు స్పందిస్తున్నారు. వైఎస్‌.జగన్‌ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలంగా ప్రజల్లోకి రావాలని అభిమానులు కూడా కామెంట్లు పెడుతున్నారు.

Health

సినిమా