Thursday, November 14, 2024

Star Light Medical Academy Ongole -KVR Star LIght

Star Light Medical Academy Ongole -KVR Star LIght

ఫిజిక్స్ @41 

కె.వి.ఆర్ స్టార్ లైట్
– నీట్ 2024లో 645 మార్కులతో అగ్రస్థానం
-టీ ఎస్,ఈ ఏపీ సెట్ మెడికల్ విభాగంలో స్టేట్ 622, 1015 ర్యాంకు
ఒంగోలు  కెవిఆర్ స్టార్ లైట్ అకాడమీ

PHONE : 88 99 11 99 88   /  9492 11 66 26

For More information about STAR LIGHT Visit https://www.kvrstarlightmedicalacademy.comcom

K.V.R STARLIGHT NEET-2024 TOPPER REVIEW

K.V.R STARLIGHT Medical academy NEET-2024 Toppers review

K.V.R  Star Light Medical Academy Ongole

వసతులు – క్లాస్ రూమ్స్ – డైనింగ్ – హాస్టల్ …


ఫిజిక్స్ @41 కె.వి.ఆర్ స్టార్ లైట్
– నీట్ 2024లో 645 మార్కులతో అగ్రస్థానం
-టీ ఎస్,ఈ ఏపీ సెట్ మెడికల్ విభాగంలో స్టేట్ 622, 1015 ర్యాంకు
ఒంగోలు  కెవిఆర్ స్టార్ లైట్ అకాడమీ భవనం
కెవిఆర్ స్టార్ లైట్ అధినేత కేవీఆర్

విశాలాంధ్ర- ఒంగోలు
నీట్ 2024లో ఫిజిక్స్ లో 50 ప్రశ్నలకు గాను 41 ప్రశ్నలు కె.వి.ఆర్ స్టార్ లైట్ నీట్ అకాడమీ అందజేసిన వర్క్ షీట్ల నుండి, నోట్స్, క్వశ్చన్ పేపర్ల నుండి రావటం ఫిజిక్స్ కె.వి.ఆర్ ప్రత్యేకత. ప్రతి ఏడాది 60 శాతం మంది విద్యార్థులు డాక్టర్ సీట్లను సాధిస్తూ విజయ పరంపరలో కొనసాగుతున్న విద్యాసంస్థ. స్థాపించిన ఆరు సంవత్సరాల కాలంలో 280 మందికి పైగా డాక్టర్లను అందించిన మెడికల్ అకాడమీ. ఈ ఏడాది నీట్ 2024 ఫలితాలలో 720 మార్కులకు గాను నాగ సాయి 645 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమంగా నిలవటమే కాకుండా, ఫిజిక్స్ లో 98.6% మార్కులు సాధించడం విశేషం. కేవలం అకాడమీలో కాకుండా ఆన్లైన్ ద్వారా కెవిఆర్ స్టార్ లైట్ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఫిజిక్స్ కోసం చేరటం విశేషం. వైజాగ్, తుని, హైదరాబాద్, విజయవాడ, కర్నూల్, అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి వంటి ప్రాంతాల నుండి విద్యార్థులు ఫిజిక్స్ క్లాస్ లను ఆన్లైన్లో విని, కెవిఆర్ స్టార్ లైట్ లో నీట్ కోసం చేరటం విశేషం. ఈ సందర్భంగా కెవిఆర్ స్టాల్ లైట్ అధినేత కెవిఆర్ మాట్లాడుతూ అకాడమీ స్థాపించిన నాటినుండి తమ విద్యార్థులు ప్రతి ఏడాది ఫ్రీ మెడికల్ సీట్లు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2018లో మొదటి బ్యాచ్ గా 16 మంది విద్యార్థులకు ఉచిత ఎంబిబిఎస్ సీట్లు, 2019లో22 మంది విద్యార్థులు, 2023లో 31 మంది విద్యార్థులు, 2024లో 34 మంది విద్యార్థులు ఉచిత మెడికల్ సీట్లు సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు కేవలం ఫిజిక్స్ కోసం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఆన్లైన్లో కెవిఆర్ క్లాస్ విని, తర్వాత వారి వారి కాలేజీలకు వెళ్లటం గొప్ప విషయం అన్నారు. కష్టతరమైన ఫిజిక్స్ సబ్జెక్టును జీరో నుండి ప్రారంభించి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకుపోతున్నట్లు పేర్కొన్నారు. ఒంగోలులో నాలుగు స్వంత భవనాలలో క్లాసులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలికలకు ప్రత్యేకమైన క్లాసులతోపాటు, ప్రత్యేకమైన హాస్టల్లో వసతి కలదు అన్నారు. యాజమాన్యమే ఫిజిక్స్ లెక్చరర్ కావడం కె.వి.ఆర్ స్టార్ లైట్ అకాడమీ కి కలిసి వచ్చిన అంశం. ఈ ఏపీ సెట్ లో తమ విద్యార్థి నాగ సాయి మెడికల్ విభాగంలో 1015 స్టేట్ ర్యాంక్ సాధించినట్లు కె.వి.ఆర్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు కోసం యూట్యూబ్లో, కెవిఆర్ స్టార్ లైట్ అకాడమీ సైట్ లో చూడవచ్చన్నారు.

 

 

 

 

 

AP Revenue Department: ఏపీ రెవెన్యూ శాఖలో కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు చేసింది. కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపుల వంటి ఫైళ్లని నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని పేషీ సిబ్బందికి సూచించింది.

మరోవైపు.. సచివాలయంలో రికార్డులు తారుమారుపై అధికారులు అలర్ట్ అయ్యారు. పలు కీలక విభాగాల్లో రికార్డులను భద్రపర్చాలని జీఏడీ ఆదేశాలు జారీ చేసింది. రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలకు జీఏడీ సర్క్యులర్ జారీ చేసింది. సీఎస్ కార్యాలయం సహా వివిధ శాఖల కార్యదర్శులకు ఫైళ్లను డేటాను సేఫ్టీగా ఉంచాలని ఆదేశించింది. గవర్నర్ ఆదేశాల మేరకు సర్కులర్ జారీ చేస్తోన్నట్టు జీఏడీ వెల్లడించింది. భూముల కేటాయింపులు, కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, ఉన్నతాధికారుల బదిలీలు వంటి ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దని జీఏడీ స్పష్టం చేసింది. ఫైళ్లతో పాటు ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న రికార్డులను భద్రపరిచేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Pawan Kalyan: పవర్ స్టార్ నిజజీవితంలో కూడా పవర్ ఫుల్, హోమ్ మినిస్టర్?

పవన్ కళ్యాణ్ నూటికి నూరు శాతం విజయం నమోదు చేసుకున్నారు. అంటే తన పార్టీ నుండి నిలబడిన అభ్యర్థులు అందరినీ గెలిపించుకున్నారు. అభిమానులు ముద్దుగా పవర్ స్టార్ అని పిలుచుకునే పవన్ కళ్యాణ్, త్వరలోనే పవర్ ఫుల్ హోమ్ మినిస్టర్ పదవిని అలంకరిస్తారని అభిమానులు ఆశగా వున్నారు. నిజజీవితంలో కూడా పవర్ స్టార్ అవుతారని ఎదురుచూస్తున్నారు.

నాకు 21 సీట్లు గెలిపించండి, భారతదేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపుకు చూసేలా చేస్తాను అని ఒక సభలో అన్న పవన్ కళ్యాణ్ ఆ మాటని నిజం చేసి చూపించారు. కూటమిలో తన పార్టీకి కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని ఎన్ని సీట్లలో పోటీ చేశారో, అన్ని సీట్లు గెలిచి వంద శాతం సక్సెస్ తో రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్. అదీ కాకుండా సెంట్రల్ లో వున్న భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి, తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకునేట్టు చేశారు పవన్ కళ్యాణ్. ఆ పొత్తువలనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిన రెండు పార్లమెంటు స్థానాలు, తెలుగు దేశం గెలిచిన 16 స్థానాలు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడానికి కీలకం అయ్యాయి. అందుకే భారతదేశం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపుకే చూస్తోంది. (Pawan Kalyan is going to be the new Home Minister of Andhra Pradesh?)

ఇదిలా ఉంటే, వెండితెరపై ఎన్నో జీవితానికన్నా మిన్నగా వుండే పాత్రల్లో నటించిన పవన్ కళ్యాణ్ ని, పవర్ స్టార్ గా అభిమానులు పిలుచుకుంటూ వుంటారు. అతను తన పాత్రలతో లక్షలాది అభిమానులను మెప్పిస్తూ వుంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెండితెరపైనే హీరోగా చెయ్యడం కాదు, నిజ జీవితంలోనూ హీరో అయ్యారు. నిన్న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో తెలుగు దేశం, బీజేపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీ తో గెలవడానికి పవన్ కళ్యాణ్ కీలకం అయ్యారు. అందుకే 135 సీట్లు గెలిచిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అని ఎన్నోసార్లు చెప్పారు. (Pawan Kalyan fans wanted to see him as Home Minister of Andhra Pradesh)

నిన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చంద్రబాబునాయుడు ఆలింగనం చేసుకొని, అభినందనలు తెలిపారు. అంటే పవన్ కళ్యాణ్ నిన్నిటి గెలుపులో ఎంతటి పెద్ద పాత్ర పోషించారో అందరూ ఊహించుకోవచ్చు. వెండితెరపై నటుడిగా వున్న, పవన్ కళ్యాణ్ నిజజీవితంలో హీరో అయ్యారు. తనవలనే ఇంతటి విజయం వచ్చిందని అందరూ అంటున్న, తానేమీ పెద్దగా సంబరపడిపోలేదు, ఎగిరి గంతులు వెయ్యలేదు, వినమ్రంగానే అన్నీ స్వీకరించారు. పవర్ వచ్చింది కదా అని చాలామంది చాలా మాటలు మాట్లాడుతారు, కానీ పవన్ కళ్యాణ్ అటువంటి మాటలు ఏమీ మాట్లాడకుండా, ఎంతో వినమ్రతతో, నవ్వుతూ అందరినీ పలకరించారు. తనలో ఒక్క పిసరంత గర్వం కూడా కనిపించలేదు. అందుకే కదా, అతనికి లక్షలాది అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. అటువంటి నాయకుడు కావాలనే అతని అభిమానులు ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నారు. గర్వంగా అసెంబ్లీలో అడుగుపెడతా అన్నారు, అలానే ఎంతో హుందాగా, గౌరవంగా, గర్వంగా అడుగుపెడుతున్నారు. (Power Star Pawan Kalyan is going to be the powerful man in real life too)

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ కి ఎటువంటి పదవి లభిస్తుందో అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కూటమిలో జనసేన పార్టీ భాగస్వామ్యం కాబట్టి, ఈ పార్టీకి కూడా మంత్రి పదవులు ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. అందుకే అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ కి హోమ్ మినిస్టర్ మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రిగా కూడా చేస్తారని ఎదురుచూస్తున్నారు. “మాకయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ఫుల్ మినిస్టర్ గా ఉండబోతున్నారు అని అనుకుంటున్నాం, అలాగే ఉప ముఖ్యమంత్రిగా కూడా చూడాలని వుంది,” అని చెప్పారు, ప్రదీప్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ నాయకుడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకోసం అక్కడ ప్రచారం చేసిన వాళ్లలో ప్రదీప్ రెడ్డి కూడా వున్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు కోసం మా అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నాం, ఎందుకంటే అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి హోదాలో ఉండబోతున్నారు అనేది తెలుస్తుంది.

ఒకవేళ హోమ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే కనక, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిజ జీవితంలో కూడా చాలా పవర్ ఫుల్ పవర్ స్టార్ అవుతారు. పరిశ్రమలో కూడా అందరూ ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి సినిమా పరిశ్రమలో అందరితో సత్సంబంధాలు వున్నాయి. ఇంతకు ముందు ప్రభుత్వం పరిశ్రమకి చేసిందేమీ లేదు, పరిశ్రమతో అంతగా సంప్రదింపులు ఎక్కువగా జరపలేదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉంటే, పరిశ్రమకి మంచి జరుగుతుంది అని పరిశ్రమలో అందరూ అనుకుంటూ వున్నారు. పరిశ్రమతో పాటు పవర్ స్టార్ అభిమానులు కూడా ఆ సమయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

AP Election Result: సలహాదారు పదవికి సజ్జల రాజీనామా

అమరావతి, జూన్ 05: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయితే ఆయన తన రాజీనామా లేఖను మంగళవారం సాయంత్రమే సాధారణ పరిపాలన శాఖకు అందజేసినట్లు తెలుస్తుంది. సజ్జల… తన కార్యాలయ సిబ్బంది ద్వారా రాజీనామా లేఖను సాధారణ పరిపాలన శాఖకు పంపిరచారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడ్డాయి.

ఆ క్రమంలో ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ఓటరు.. కూటమికి పట్టం కట్టారు. దీంతో వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటామనుకున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆశలపై ఓటర్లు నీళ్లు జల్లారు. ఇక పలితాలు వెలువడగానే వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. మరోవైపు జగన్ ప్రభుత్వంలో సలహాదారులుగా వ్యవహరించిన వారంతా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు.

Chandrababu: నాడు నో అపాయిట్మెంట్.. నేడు మోదీ పక్కనే చంద్రబాబు!

అవును.. నాడు వద్దునుకున్నారు.. కనీసం కలుస్తామంటే అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు..! రండి కలుద్దామని చెప్పి వద్దన్న సందర్భాలూ ఉన్నాయ్..! మీతో పనేముంది జీరో కదా అన్నట్లుగా చూసిన పరిస్థితి..! ఐదంటే ఐదేళ్లు.. సీన్ కట్ చేస్తే అదే జీరో, హీరోగా మారారు..! దీంతో రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఆయనవైపే చూస్తోంది..! ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుందిగా.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, విజనరీ.. అభివృద్ధి, ఐటీ టక్కున గుర్తొచ్చే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu)..!

ఇదీ అసలు కథ..!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన చంద్రబాబుకు బీజేపీ పెద్దల నుంచి గ్రాండ్ వెల్‌కమ్ అందినది. అంతేకాదు.. నరేంద్ర మోదీ (Narendra Modi) తన పక్కనే కూర్చొబెట్టుకుని మరీ ముచ్చటించారు. ‘చంద్రబాబు గారు మీరు మాట్లాడండి’ అని సమావేశంలో టీడీపీ అధినేతకు సమయం కూడా కేటాయించారు. దీంతో రెండు నిమిషాలపాటు మోదీ గురించి, సమావేశం విషయాలను పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు టీడీపీ తన అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియోపై టీడీపీ శ్రేణులు, బాబు వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


నాడు.. నేడు..!

చూశారుగా.. నాడు చంద్రబాబును ఎలా చూశారు..? నేడు ఎలా చూస్తున్నారో..? ఇదీ చంద్రబాబు, పసుపు దళపతి రేంజ్ అంటూ టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. నాడు అపాయిట్మెంట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నుంచి.. నేడు రండి రండి అని పిలిపించుకొని పక్కన కూర్చొబెట్టుకునే వరకూ వచ్చిందంటే దటీజ్ సీబీఎన్ అంటూ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కాగా.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీడీపీ ఎంపీలు కీలకమనే విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసే టీడీపీ ఎన్నికలకు వెళ్లి భారీ విజయాన్ని దక్కించుకుంది. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు కూడా. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీ పెద్దలను పిలిపించిన మోదీ.. ఏకగ్రీవ తీర్మానం చేయించారు. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు జరిగిన ఎన్డీయే కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదీ ఢిల్లీలో నాడు.. నేడు చంద్రబాబు క్రేజ్.. రేంజ్!!

Andhra Pradesh: ఫస్ట్ టైమ్ ఆ జిల్లా ఓటర్ల విలక్షణ తీర్పు.. పాత సాంప్రదాయానికి చరమగీతం!

జిల్లా చరిత్రలోనే కనివిని ఎరుగని విక్టరీ… ఒక్కటంటే ఒక్కటి కూడా ఇతర పార్టీలకు దక్కని వైనం.. పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్స్, మూడు లోక్ సభ స్థానాల్లో కూటమి అభ్యర్ధులదే విజయం. కేవలం విజయమేనా.. భారీ మెజార్టీలు. సమీక్షించుకునే అవకాశం కూడా లేని విధంగా అధికార పార్టీకి ఘోర ఓటమి. ఈ ఫలితాలతో ఎలా ఉండబోతోంది ఏపీ రాజకీయం? విపక్షం ఉనికిని ఎలా చాటుకుంటుంది? ఇదే ఇప్పడు హాట్‌టాపిక్ మారింది.

గుంటూరు కారమే కాదు.. ఇక్కడి రాజకీయం కూడా యమ ఘాటు. అందుకే రాష్ట్ర రాజకీయాల్లోనే గుంటూరుజిల్లాకో ప్రత్యేక స్థానం. గత నాలుగు ఎన్నికల్లోనూ జిల్లా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో విపక్ష కూటమికి చారిత్రక విజయాన్ని కట్టబెట్టారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరుజిల్లాలో టీడీపీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. 19 అసెంబ్లీ స్థానాల్లో 18 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. 2009లో పునర్విభజన తర్వాత పదిహేడు నియోజకవర్గాలుగా మారితే అందులో పదకొండు కాంగ్రెస్ గెలిచింది. ఆరు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీకి ఐదు సీట్లొస్తే.. పన్నెండు స్థానాల్లో గెలిచి టీడీపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 15 సీట్లు గెలిస్తే.. టీడీపీ రెండు సీట్లతో సరిపెట్టుకుంది.

2004 నుంచీ నాలుగు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే ఉమ్మడి గుంటూరుజిల్లా ప్రజలు పూర్తి ఏకపక్షంగా కాకుండా ప్రత్యర్ధి పార్టీలకు ఎంతో కొంత అవకాశమిస్తూ వచ్చారు. కానీ మొదటిసారి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లూ కూటమి ఖాతాలో పడ్డాయి. ఉమ్మడి గుంటూరుజిల్లాలో ఈసారి పదహారు చోట్ల టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. జనసేనకు ఇచ్చిన తెనాలి నుంచి ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ గెలిచారు. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలోని మూడు పార్లమెంట్ స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో పల్నాడు ప్రాంతంలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాన్ని వైసీపీనే గెలిచింది. అప్పట్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు 20వేలకు పైనే మెజారిటీ వచ్చింది., అదే ట్రెండ్ కొనసాగిస్తూ ఈ సారి పల్నాడులోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. ఐదుగురు 25వేలకు పైనే మెజారిటీ సాధించారు. నర్సరావుపేటలో అరవింద్‌బాబుకు మాత్రమే 20వేల లోపు మెజారిటీ వచ్చింది. రాజధాని అంశం గుంటూరు జిల్లాతో పాటు పల్నాడు ప్రాంతంలో గట్టి ప్రభావం చూపించిదన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత గుంటూరు గడ్డపై ఆ పార్టీకి ఇదే అతిపెద్ద విజయమని పార్టీ తమ్ముళ్లు సంబరపడుతున్నారు.

AP Politics: వైసీపీ ఘోరపరాజయానికి కారణం అదేనా.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ..

ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనపై ఓటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాలు స్పష్టం చేశాయి. సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్ల రూపాయిలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా ఓట్లు పడకపోవడం వైసీపీ అధినేత జగన్‌ను ఆశ్చర్యం కలిగించింది.

ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనపై ఓటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాలు స్పష్టం చేశాయి. సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్ల రూపాయిలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా ఓట్లు పడకపోవడం వైసీపీ అధినేత జగన్‌ను ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధపొందిన లబ్ధిదారులు ఓట్లు వేస్తారని భావించిన జగన్ ఆశలు నెరవేరలేదు.

ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేశామని జగన్ చెప్పుకున్న గొప్పలను ప్రజలు విశ్వసించలేదు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి.. సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు అప్పులు చేయడం ప్రజలకు నచ్చలేదు. రాజధాని విషయంలో జగన్ నిర్ణయాన్ని ప్రజలు తప్పుపట్టారనేది ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.

సంక్షేమ పథకాలు అమలు చేసినా.. పేద, మధ్య తరగతి ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేసినా ఓట్లు ఎందుకు పడలేదనే ప్రశ్నకు వైసీపీ నాయకులకే సమాధానం దొరకడంలేదట. వైసీపీ ఇంతటి ఘోర పరజాయానికి కారణం ఏమిటో అర్థం కావడంలేదట. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదంటే ప్రజలు జగన్ తీరుపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతోంది. వైసీపీ ఓటమికి జగన్ పాలనాతీరు ఒక కారణమైతే.. మరోకటి జగన్ ప్రవర్తన అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది.

ముఖ్యంగా ఐదేళ్ల పాలనలో ఏ మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారనేది ఒక ఎత్తైతే.. ప్రభుత్వ ప్రవర్తన ఏ విధంగా ఉందనేది మరో ఎత్తు. వైసీసీ అధినేత జగన్‌తో పాటు ఆయన మంత్రివర్గంలోని సహచరుల ప్రవర్తన ప్రజలకు నచ్చకపోవడంతోనే ఈ విధమైన తీర్పు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

సంక్షేమ పథకాలు అమలు చేసినా.. పేద, మధ్య తరగతి ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేసినా ఓట్లు ఎందుకు పడలేదనే ప్రశ్నకు వైసీపీ నాయకులకే సమాధానం దొరకడంలేదట. వైసీపీ ఇంతటి ఘోర పరజాయానికి కారణం ఏమిటో అర్థం కావడంలేదట. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదంటే ప్రజలు జగన్ తీరుపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతోంది.

వైసీపీ ఓటమికి జగన్ పాలనాతీరు ఒక కారణమైతే.. మరోకటి జగన్ ప్రవర్తన అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. ముఖ్యంగా ఐదేళ్ల పాలనలో ఏ మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారనేది ఒక ఎత్తైతే.. ప్రభుత్వ ప్రవర్తన ఏ విధంగా ఉందనేది మరో ఎత్తు. వైసీసీ అధినేత జగన్‌తో పాటు ఆయన మంత్రివర్గంలోని సహచరుల ప్రవర్తన ప్రజలకు నచ్చకపోవడంతోనే ఈ విధమైన తీర్పు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

అహంకారమే కొంపముంచిందా..

ప్రజలు దేనినైనా సహిస్తారు కానీ.. అహంకారాన్ని ఉపేక్షించబోరనడానికి తెలంగాణ, ఏపీ ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తమకు తిరుగులేదు అన్ని స్థానాల్లో విజయం మాదే.. అభ్యర్థికంటే తనను చూసే ఓటేస్తారని తెలంగాణలో గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ భావించారు. కానీ ప్రజలు మాత్రం అభివృద్ధి, సంక్షేమం పక్కనపెడితే అహంకారాన్ని సహించబోమని తీర్పునిచ్చారు. ప్రతిపక్షాలను పట్టించుకోకుండా.. ప్రజలను చిన్నచూపు చేసే నాయకులు మాకొద్దని తిరస్కరించారు. వ్యవస్థలను తప్పుదోవపట్టించి.. రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటే సహించేది లేదంటూ కేసీఆర్‌ను గద్దె దించారు.

ప్రస్తుతం ఏపీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రఅభివృద్ధిని పక్కనపెట్టి.. రాజకీయ కక్ష తీర్పుకోవడానికి వ్యవస్థలను ఉపయోగించుకున్నారనేది బహిరంగ రహస్యం. తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి వేధింపులకు గురిచేయడం ప్రజలకు నచ్చలేదు. ప్రజాపాలన అందిచమని అధికారం ఇస్తే ప్రజలను, రాష్ట్ర అభివృద్ధి గాలికొదిలేసి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయడాన్ని ప్రజలు తిరస్కరించారనేది ఎన్నికల ఫలితం స్పష్టం చేస్తోంది.

నాయకుడు అహంకారంతో విర్రవీగితే ఏమౌతుందో ప్రజలు రుచి చూపించారు. ఐదేళ్లు సీఎంగా జగన్మోహన్ రెడ్డి విపరీతమైన అహంకార ధోరణిని ప్రదర్శించడమే ప్రస్తుతం ఆయన ఓటమికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. వైసీపీ నాయకుల ప్రవర్తనే వారిని ఓడించిందనే చర్చ జరుగుతోంది. వైసీపీలో గ్రామ స్థాయి నాయకుడు మొదలు రాష్ట్రస్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పడం మానేసి… ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడాన్ని రాష్ట్రప్రజలు అంగీకరించలేదనేది ఈ ఫలితాలకు తర్కాణం.
తాను పదుల సంఖ్యలో నొక్కిన బటన్లు ఓట్లు తెచ్చిపెట్టలేదని ఫలితాల తర్వాత జగన్ బాధపడటం కన్నా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలకు పోకుండా అభివృద్ధిపై దృష్టిపెడితే ఇలాంటి ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చేది కాదనే చర్చ రాష్ట్రంలో నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అహంకారంతో వ్యవహరించే నాయకులకు ఏపీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

CID Chief Sanjay: సెలవు పెట్టి అమెరికా వెళ్తున్న సీఐడీ బాస్‌ సంజయ్‌

CID Chief Sanjay: సెలవు పెట్టి అమెరికా వెళ్తున్న సీఐడీ బాస్‌ సంజయ్‌

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ ముఖ్యనేతలపై తప్పుడు కేసుల నమోదులో కీలకంగా వ్యవహరించిన అత్యంత వివాదాస్పద అధికారి సీఐడీ అడిషనల్‌ డీజీ సంజయ్‌ సెలవుపై వెళ్లనున్నారు. ఈ బుధవారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటన వెళ్లేందుకంటూ ఆయన దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెంటనే అనుమతినిస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడం.. రేపో మాపో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న తరుణంలో ఆయన సెలవు పెట్టి విదేశాలకు వెళ్తుండడం విశేషం.

అమరావతీ.. ఊపిరిపీల్చుకో!

వైకాపా పాలనలో అనేక నిర్బంధాలు, ఆంక్షలు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిన రాజధాని రైతుల్లో కూటమి ఘన విజయంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆకాశమే హద్దు అన్నట్లుగా వారు మంగళవారం వీధుల్లోకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు.

తుళ్లూరు: వైకాపా పాలనలో అనేక నిర్బంధాలు, ఆంక్షలు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిన రాజధాని రైతుల్లో కూటమి ఘన విజయంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆకాశమే హద్దు అన్నట్లుగా వారు మంగళవారం వీధుల్లోకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు సీఎం కాబోతుండడంతో నినాదాలు చేస్తూ టపాసులు కాల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. ‘జై అమరావతి’, ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’ అమరావతీ ఊపిరి పోసుకో..’ అంటూ నినాదాలు చేశారు. అమరావతి ఉద్యమ గీతాలకు నృత్యం చేస్తూ ఆకుపచ్చ, పసుపు కండువాలను గాలిలో తిప్పుతూ కేరింతలు కొట్టారు. అమరావతి రూపకర్త చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారంటూ హర్షం వ్యక్తంచేశారు. ఐదేళ్లుగా పడుతున్న బాధలు తొలిగాయని తమకు మంచి రోజులు వచ్చాయన్న ఉత్సాహం రైతుల్లో కనిపించింది.

తుళ్లూరు శిబిరంలో భారీ ఎల్‌ఈడీ తెర ఏర్పాటుచేసి రైతులు, మహిళలు ఫలితాలను మంగళవారం ఉదయం నుంచే ఉత్కంఠగా వీక్షించారు. ఫలితాల కోసం అందరూ టీవీలకు అతుక్కుపోవడంతో రాజధాని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రెండు రౌండ్లలోనే ఓటింగ్‌ సరళి తెలిసిపోవడం… తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీ సాధిస్తుండడంతో ఒక్కసారిగా రోడ్లపైకి దూసుకొచ్చారు. ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. జై అమరావతి. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. స్థానిక ఆలయాల్లో రైతులు, రైతుకూలీలు, మహిళలు పూజలు చేశారు.
మందడం, వెలగపూడిలో మహిళలు పసుపు చీరలు ధరించి రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహాలను నీటితో శుద్ధి చేసిన అనంతరం క్షీరాభిషేకం నిర్వహించారు. జోహార్‌ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. వెలగపూడి శిబిరంలో అమరావతి గీతాలకు నృత్యాలు చేశారు. దొండపాడులో మహిళలు పెద్ద సంఖ్యలో శిబిరానికి చేరుకొని జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. తమ కష్టాలు తొలగిపోయాయంటూ మందడంలో మహిళలు మిద్దె సెంటర్‌లో కేకులు కోసి పంచారు. జై అమరావతి, చంద్రబాబునాయుడు వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బోరుపాలెంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తెదేపా, జనసేన నాయకులు జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తంచేశారు. వడ్డమాను గ్రామంలో మహిళలు పసుపు రంగును చల్లుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఐనవోలు గ్రామంలో డీజేలతో తెదేపా, జనసేన యువత హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉద్దండరాయునిపాలెంలో సైకిళ్లకు జెండాలు కట్టుకుని ర్యాలీగా గ్రామంలో తిరిగారు. పెదపరిమిలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు పుట్టి రామచంద్రరావుతో కలసి యువత టపాసులు కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమరావతికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు వందనాలంటూ తుళ్లూరు శిబిరంలో మహిళలు మోకాళ్లపై నిలుచొని చేతులు జోడించి వందనం చేశారు. వెలగపూడి, తుళ్లూరు శిబిరాలను ఇటీవల పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సతీమణి కవిత, కుమార్తె మానస సందర్శించారు. రైతుల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఏబీవీని, రైతులను జగన్‌ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, అంతిమంగా న్యాయం జరిగిందన్నారు.
తుళ్లూరు డీఎస్పీ ఓవరాక్షన్‌
రాజధాని గ్రామాల్లో రోడ్లపై గస్తీ తిరుగుతున్న తుళ్లూరు డీఎస్పీ అశోక్‌కుమార్‌ గౌడ్‌.. తన సిబ్బందితో హడావుడి చేశారు. రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న రైతులు, మహిళల వద్దకు వచ్చి 144 సెక్షన్‌ అమల్లో ఉందని, అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని మైక్‌లో అల్టిమేటం జారీ చేశారు. అక్కడ గుమికూడిన వారిని పోలీసులు సెల్‌లో వీడియోలు, ఫొటోలు తీశారు. డీఎస్పీ ఓవరాక్షన్‌పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ ఐదేళ్లుగా మమ్మల్ని సీఎం జగన్, మీరు చాలా ఇబ్బందులు పెట్టారు. కూటమి గెలుపుతో అయినా మీరు మారరా? ఇంకా ఎన్నాళ్లు మమ్మల్ని కట్టడి చేస్తారు? ఇక ఎవరికీ తలవంచేది లేద’ని మండిపడ్డారు. దీంతో చేసేది లేక డీఎస్పీ వెనుదిరిగారు.

అమరావతి అగ్రపథాన నిలుస్తుంది

రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడం, కేంద్రంలో మరోసారి మోదీ ప్రధానిగా కొలువుదీరనుండడం అమరావతికి శుభసూచకం. ఈ విజయం రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతుల్లో ఆనందాన్ని నింపింది. కేంద్రం నుంచి అన్ని విధాలా తోడ్పాటు అందుతుందన్న నమ్మకం ఉంది. గ్రీన్‌ఫీల్డ్‌ రాజధానిగా ప్రపంచంలో అగ్రపథాన అమరావతి నిలుస్తుంది.

ఆరె శివారెడ్డి, కన్వీనర్, అమరావతి పరిరక్షణ సమితి

జగన్‌ దుష్ట పాలనకు చరమ గీతం

అమరావతిపై జగన్‌ కక్షగట్టి అరాచకం సాగించారు. దుష్టపాలనకు నేటితో ప్రజలు చరమగీతం పాడారు. కూటమి గెలుపు ప్రజలందరి విజయం. రాజధానిపై జగన్‌ సాగించిన దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన వీర మహిళల శపథం నెరవేరింది.

పువ్వాడ సుధాకర్, రాజధాని రైతు ఐకాస సమన్వయ కమిటీ సభ్యుడు

రాష్ట్రానికి, అమరావతికి చంద్రోదయం

రాష్ట్రంలో ఐదేళ్ల రాక్షస పాలనకు ఓటర్లు ముగింపు పలికారు. రాష్ట్రానికి, అమరావతికి చంద్రోదయం అయింది. రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అయింది. అమరావతికి ఇక అన్నీ మంచి రోజులే.

పోతుల బాలకోటయ్య, అధ్యక్షుడు, అమరావతి బహుజన ఐకాస

Sharad Pawar: మహారాష్ట్రలో సీనియర్‌ పవార్‌దే పైచేయి

Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్‌ పవార్‌ మరోసారి తన ప్రాధాన్యాన్ని చాటుకొన్నారు. పార్టీ చీలికతో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. తనదైన వ్యూహాలతో మెరుగైన ఫలితాలు సాధించారు.

ముంబయి: ఎన్సీపీ, శివసేన పార్టీల్లో చీలికల కారణంగా మహారాష్ట్ర రాజకీయాలు ఈసారి అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ లోక్‌సభ ఎన్నికలు ఎన్సీపీ నేత శరద్‌ పవార్ (Sharad Pawar) రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నాయని రాజకీయ పండితులు విశ్లేషించారు. ఎట్టకేలకు కాలం పెట్టిన పరీక్షలో ఆయనే నెగ్గారు. అసలు వర్గం తనదేనని దాదాపు నిరూపించుకున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019 నాటితో పోలిస్తే రాష్ట్రంలో ఎన్డీయే బలం సగానికి పైగా తగ్గిపోవడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు.

చీలికతో ఎన్సీపీ రాజకీయంగా బలహీనపడ్డప్పటికీ.. కాకలు తిరిగిన నేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) తన అనుభవాన్ని రంగరించారు. ఆయన వర్గం ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేసిన 10 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. తద్వారా మహారాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును నిలుపుకొన్నారు. 83 ఏళ్ల పవార్ అటు జాతీయస్థాయిలో ‘ఇండియా’, ఇటు రాష్ట్రంలో మహా వికాస్‌ అఘాడీ (MVA) కూటమిలో కీలక పాత్రధారిగా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో 50 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ మాజీ కేంద్ర మంత్రి తన పార్టీ NCP (SP)ని గట్టెక్కించడంలో ఒంటరి పోరాటం చేశారు. కొత్త గుర్తుతో పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో తనదైన వ్యూహాలతో అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశారు. సొంత పార్టీ అభ్యర్థులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూటమి గెలుపు కోసం శ్రమించారు.

మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలుండగా.. ఎంవీయే పక్షాలతో కలిసి ఎన్సీపీ (ఎస్పీ) 10 స్థానాల్లో పోటీ చేసింది. ఎనిమిదింటిలో గెలుపొందింది. సతారా, రావర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. సతారాలో బీజేపీకి గట్టి పోటీనిచ్చింది. తాజా ఫలితాలతో అసలైన ఎన్సీపీ తమదేనని శరద్‌ పవార్‌ నిరూపించుకున్నట్లు రాజకీయ విశ్లేషకుడు ప్రకాశ్‌ అకోల్కర్‌ అభిప్రాయపడ్డారు. అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కార్యకర్తల్లో ఈ ఫలితాలు ఉత్సాహం నింపాయి.

2019లో కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన కలిసి ఎంవీయే కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. 2022లో శివసేనలో తిరుగుబాటుతో పరిస్థితులు మారిపోయాయి. ఏక్‌నాథ్‌ శిందే వేరుకుంపటి పెట్టుకొని భాజపాతో కలిసి సీఎం కుర్చీ కైవసం చేసుకున్నారు. మరోవైపు గత ఏడాది అజిత్‌ పవార్‌ ఎన్సీపీని చీల్చి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా చేరారు. మాజీ కేంద్రమంత్రి ప్రఫుల్‌ పటేల్‌ సైతం శరద్‌ పవార్‌ను కాదని చీలిక వర్గంలో చేరడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాదాపు 40మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు అజిత్‌ క్యాంపులో చేరి పెద్ద దెబ్బే కొట్టారు. పైగా అసలైన పార్టీ తమదేనంటూ కోర్టు మెట్లెక్కారు. ఈక్రమంలో అజిత్‌, ఆయన వర్గం ఎన్ని విమర్శలు చేసినా శరద్‌ పవార్‌ మాత్రం పెద్దగా స్పందించలేదు. స్వయంగా చెల్లి వరుసైన శరద్‌ పవార్‌ కూతురు సుప్రియా సూలేపై, అజిత్‌ పవార్‌ ఆయన సతీమణి సునేత్రాను బారామతిలో బరిలోకి దింపారు.

ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ.. అజిత్‌ పవార్‌ వర్గం కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే పోటీ చేసి ఒక్క సీటులో గెలుపొందింది. అజిత్‌ సతీమణి సునేత్ర సైతం ఓడిపోవడం గమనార్హం. మొత్తానికి మహారాష్ట్రలో ఎన్డీయే అంచనాలు తలకిందులయ్యాయి. మొత్తం 48 స్థానాలకుగాను 2019 నాటితో పోలిస్తే రాష్ట్రంలో ఆ కూటమి బలం సగానికి పైగా తగ్గిపోయింది. ఎంవీయే పోటీచేసిన కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌ పవార్‌) 30 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్డీయే కూటమి 17 స్థానాల్లో గెలుపొందింది.

PM Modi: మోదీ 3.Oకు ముహూర్తం ఫిక్స్‌.. జూన్‌ 8న ప్రమాణస్వీకారం..!

PM Modi: ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్‌ 8న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.

దిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ (PM Modi) సిద్ధమవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్‌ 8వ తేదీన సాయంత్రం దిల్లీలోని కర్తవ్యపథ్‌లో మోదీ ప్రమాణస్వీకార (Modi Oath Taking Ceremony) కార్యక్రమం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ వేడుకకు కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం.

మంగళవారం నాటి ఫలితాల్లో ఎన్డీయే (NDA) కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్‌ చివరిసారిగా భేటీ అయి, ప్రస్తుత లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేసింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతల కీలక సమావేశం జరగనుంది. శుక్రవారం భాజపా, ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఎన్డీయే కొత్త ఎంపీలతో కలిసి మోదీ.. రాష్ట్రపతిని కలవనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో (Lok Sabha Election Results) భాజపా 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 99 స్థానాలతో కాంగ్రెస్‌ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ మార్కు (272)ను ఎన్డీయే దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.

పిఠాపురంలో పవన్‌ గెలుపు.. తన పేరు మార్పుపై స్పందించిన ముద్రగడ

Mudragada: పిఠాపురంలో పవన్‌ గెలుపు.. తన పేరు మార్పుపై స్పందించిన ముద్రగడ
పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్‌ విసిరిన మాజీ మంత్రి మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. కిర్లంపూడిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

కిర్లంపూడి: పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్‌ విసిరిన మాజీ మంత్రి మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. కిర్లంపూడిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

‘‘పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తామని సవాల్‌ చేశా. అలా చేయకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పా. పేరు మార్చాలని గెజిట్‌ దరఖాస్తు పెట్టుకుంటా’’ అని ముద్రగడ తెలిపారు.

డియర్ కళ్యాణ్ హృదయం ఉప్పొంగుతోంది.. చిరు ఎమోషనల్ ట్వీట్

Chiranjeevi Congratulates Pawan Kalyan oVer Victory: పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆయనకు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది మెగా ఫ్యామిలీ నుంచి మెగా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ గెలుపు నేపథ్యంలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది.

నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం 9 న!

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ నెల తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11.53 గంటలకు ఆయన పదవీప్రమాణం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయు. పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. 12న కూడా ఒక ముహూర్తాన్ని వారు సూచించారు. కానీ మరీ ఆలస్యమవుతుందని టీడీపీ ముఖ్యులు వద్దనుకున్నారని అంటున్నారు. ఇప్పుడు ప్రమాణ స్వీకార స్థలంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మంగళగిరికి తూర్పు దిశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని వాస్తు పండితులు సలహా ఇచ్చారు. ఆ దిశలో విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి పక్కన అనువైన మైదానం కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారు. కాగా.. బాబును లాంఛనంగా కూటమి నేతగా ఎన్నుకోవడానికి టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏడో తేదీన నిర్వహించే అవకాశం ఉంది. బాబును శాసనసభలో తమ నేతగా ఎన్నుకుని.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు లేఖ అందిస్తారు. ఆయన్నుంచి ఆహ్వానం అందాక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకోవైపు.. ఆయన, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్తున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశానికి రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్‌ చేసి ఆహ్వానించారు.

నాలుగోసారి సీఎంగా..

చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. 1995లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మొదటిసారి, 1999 ఎన్నికల్లో గెలిచి రెండోసారి సీఎం మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఎన్నికల్లో గెలిచి మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు నాలుగోసారి కాబోతున్నారు. ఎన్టీఆర్‌ కూడా టీడీపీ తరపున 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినా ఆయన ఇంతకాలం పదవిలో కొనసాగలేదు.

AP Elections 2024 – Results Live Links

ఎలక్షన్ ఫలితాలు – అధికారిక వెబ్ సైట్

కింద ఇవ్వబడిన అధికారిక ఎలక్షన్ కమీషన్ వారి వెబ్ సైట్ నుంచి

* ఆదిఖ్యం లొ ఎవరున్నారు

* ఏ పార్టీ వారు ఉన్నారు

* ఎన్ని ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

* ఏ రౌండ్ ఎవరు ఆదిత్యంలో ఉన్నారు

* నియోజకవర్గం / పార్లమెంట్ అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు , [ ఫోట్ తో సహా ]

* రౌండ్ రౌండ్ కి ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి

* ఎలక్షన్ ఫలితాలు

* మ్యాప్ లో ఎలక్షన్ ఫలితాలు
* ఎవరికి ఎంత శాతం ఓట్లు వచ్చాయి

పూర్తి సమాచారం కింద లింక్ ద్వారా తెలుసుకోవచ్చు

https://results.eci.gov.in/AcResultGenJune2024/partywiseresult-S01.htm
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. 
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 
ఉదయం 8.30 కి EVM ల కౌంటింగ్ ప్రారంభిస్తారు. 
కాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
 అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో పోటీలో ఉన్న 46 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 
అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. 
అత్యధికంగా విశాఖ పార్లమెంటు బరిలో 33 మంది అభ్యర్థులు… 
రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అత్యల్పంగా  12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
తొలి ఫలితం  నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లతో వెల్లడవ్వనుంది. 
 రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో 29 రౌండ్లతో చివరిగా ఫలితం వెలువడనుంది. 
భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. 
రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా చర్యలు చేపట్టారు అధికారులు.

 

 NTV Telugu News LIVE

 

ETV LIVE

 

SAKSHI TV LIVE 

 

 

 

 

Bengaluru: బెంగళూరులో కుండపోత వర్షం.. 133 ఏళ్ల రికార్డు బ్రేక్‌!

Bengaluru: బెంగళూరులో కుండపోత వర్షం.. 133 ఏళ్ల రికార్డు బ్రేక్‌!

బెంగళూరు: నీటి ఎద్దడితో అల్లాడిన కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) నగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు. నగరంలో ఆదివారం ఒక్కరోజే దాదాపు 111 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌ నెలకు సంబంధించి ఒక్కరోజులోనే ఈ స్థాయి వర్షం కురవడం 133 ఏళ్లలో ఇదే తొలిసారని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. జూన్‌ 1, 2వ తేదీల్లో కలిపి మొత్తం 140.7 ఎం.ఎం వర్షపాతం నమోదైంది. దీంతో ఏటా జూన్‌ మొత్తంలో కురిసే సగటు వర్షపాతాన్ని (110.3 ఎంఎం) ఇప్పటికే దాటేసినట్లు తెలిపారు. నగరంలో చివరిసారి 1891 జూన్‌ 16న ఆ నెలకు సంబంధించి రోజువారీ అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది.
దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని రీతిలో జల సంక్షోభాన్ని బెంగళూరు ఇటీవల ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నీటివృథాపై అధికారులు జరిమానాలూ విధించారు. ఈ క్రమంలోనే నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని, దక్షిణ కన్నడ, ఉడిపి, హవేరి, బళ్లారి, బెంగళూరు, మైసూరు తదితర జిల్లాలకు యెల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన పరిస్థితులను ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Read more National News

 

AP Election 2024: లెక్కింపు బాధ్యతల నుంచి ఉపాధ్యాయుల్ని తప్పించేశారు.. ఆఖరి నిమిషంలో కీలక నిర్ణయం

AP Election 2024: లెక్కింపు బాధ్యతల నుంచి ఉపాధ్యాయుల్ని తప్పించేశారు.. ఆఖరి నిమిషంలో కీలక నిర్ణయం

కర్నూలు: కర్నూలు జిల్లాలో మంగళవారం జరగబోయే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎక్కువ మంది ఉపాధ్యాయులను తప్పించడం చర్చకు దారితీస్తోంది. పీవోలుగా, ఏపీవోలుగా విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు ఓట్ల లెక్కింపు బాధ్యతలు ఎందుకు అప్పగించలేదనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏకంగా 50 శాతం వరకు తమ సేవల్ని ప్రభుత్వం ఉపయోగించుకుందని కొందరు ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు. తాజాగా సార్వత్రిక ఓట్ల లెక్కింపు బాధ్యతలు నిర్వహించేందుకు గానూ జిల్లా ఉన్నతాధికారులు సుమారు 300 మందికి శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం. రెండుసార్లు ఇచ్చిన శిక్షణకు తామంతా హాజరయ్యామని, ఆఖరి నిమిషంలో తమను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడంలేదంటూ కొందరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ప్రశ్నలకు ఉన్నతాధికారులు కూడా తగిన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. దీనిపై కర్నూలు కలెక్టర్‌ జి.సృజనను ‘ఈనాడు’ సంప్రదించగా ఉపాధ్యాయులు స్థానిక సంస్థల యాజమాన్యం పరిధిలో ఉండటంతో వారి సేవలను వినియోగించుకోవడం లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో పనిచేసేవారు ఓట్ల లెక్కింపునకు అనర్హులైతే తమకు ఎందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యాసంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్న కొద్దిమంది ఉపాధ్యాయులకు మాత్రమే లెక్కింపు విధులు అప్పగించారని, జడ్పీ యాజమాన్యంలో పనిచేస్తున్న ఎస్జీటీ, స్కూల్‌అసిస్టెంట్లలో ఎవరికీ లెక్కింపు బాధ్యతలు అప్పగించలేదని వివరిస్తున్నారు.

గురువుల్లో కలకలం
ఓట్ల లెక్కింపు సిబ్బందికి గత మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఉపాధ్యాయులు వెళ్లకుండా వారికి తగిన సూచనలు ఇవ్వాలని కర్నూలు జిల్లా డీఈవో తన పరిధిలోని డీవైఈవోలకు, ఎంఈవోలకు వాట్సప్‌ సందేశం పంపించడంతో ఉపాధ్యాయవర్గాల్లో కలకలం రేగింది. ఆ సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. లెక్కింపు విధులకు హాజరు కావాలని ఉన్నతాధికారుల నుంచి అధికారికంగా ఫోన్లు, వాట్సప్‌ సందేశాలు వచ్చిన వారు మాత్రమే దీనికి వెళ్లేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Read more AP News

 

Pudina Chutney : వేడి వేడి అన్నంలోకి పుదీనా-శనగల చట్నీ.. కమ్మటి రుచి.. తింటే ఆహా.. అంటారు

అన్నం కోసం మనం రకరకాల చట్నీలు చేస్తుంటాం. వాటిని కలుపుకొని తింటే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా పుదీనా చట్నీ ఇంట్లో తయారు చేశారా?

అందులో శనగలు వేసి చేశారా? ఈ రెసిపీ చూసేందుకు, తినేందుకు, వాసన చూసేందుకు చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్లీ కావాలి అంటారు. అంతటి రుచి ఉంటుంది. ఈ పుదీనా చట్నీ కేవలం అన్నంలోకే కాదు.. స్నాక్స్‌లోకి కూడా వాడుకోవచ్చు. కమ్మని రుచిని ఇస్తుంది.

పుదీనాను సాధారణంగా చట్నీలు, కొన్ని మసాలా దినుసులలో సువాసన కోసం ఉపయోగిస్తారు. పుదీనా ఆకులు రుచికే కాదు.. అనేక ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుల్లో కేలరీలు చాలా తక్కువ. ఇందులో కరగని ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.

పుదీనా ఆకులు జీర్ణక్రియలో బాగా సహాయపడతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. కడుపులో ఎసిడిటీని నివారిస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గుండెల్లో మంట మొదలైన సమస్యల నుండి రక్షిస్తుంది. ఈ లక్షణాలతో పాటు బరువు తగ్గడంలో కూడా పుదీనా సహాయపడుతుంది.

చాలా మంది పుదీనా చట్నీని ఇష్టపడతారు. మనం అన్నం లేదా అల్పాహారం కోసం పుదీనా చట్నీని ఎలా తయారు చేయవచ్చు? పుదీనా చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి? ఎలా చెయ్యాలి చట్నీ చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం

పుదీనా-శనగల చట్నీకి కావాల్సిన పదార్థాలు

పుదీనా ఆకులు – 2 కప్పులు, కొత్తిమీర – 1/2 కప్పు, శనగలు – 3/4 కప్పు, కొబ్బరి – 1/2 కప్పు, జీలకర్ర – 1 tsp, వెల్లుల్లి – 8, పచ్చిమిర్చి – 5, ఎర్ర మిర్చి – 2, చింతపండు-1/4 tsp, వంట నునె కొద్దిగా, రుచికి ఉప్పు

పుదీనా-శనగల చట్నీ ఎలా చేయాలి?

ముందుగా శనగలు ఒక పాత్రలో వేసి వేయించాలి. పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో నూనె వేయండి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి రెండు నిమిషాలు వేయించాలి.

దీని తర్వాత చింతపండు రసం, కొబ్బరి వేసి వేయించాలి. 1 నిమిషం వేయించడానికి సరిపోతుంది. దీని తరువాత ఈ మసాలా తీసుకొని మిక్సింగ్ జార్ లో వేసి, ఉప్పు వేసి, వేయించిన శనగలు వేసి, కొంచెం నీరు పోసి గ్రైండ్ చేయాలి. సన్నటి చట్నీకి కావలసినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

అంతే మీరు తినాలి అనుకునే.. రుచికరమైన పుదీనా-శనగల చట్నీ సిద్ధంగా ఉంది. చపాతీ, ఇడ్లీ, దోసెలతో కూడా దీనిని తినవచ్చు. వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది.

పుదీనా ఆకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజువారీ సలాడ్‌లో కొన్ని తాజా పుదీనా ఆకులను మిక్స్ చేసి పచ్చిగా తినండి. ఇది కడుపు ఉబ్బరాన్ని నివారించడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. పుదీనా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వలన కూడా ఉపయోగం ఉంటుంది.

Read More Food – Recipes Articles

 

నరసింహ స్వామిని ఆరాధిస్తే ఆ బాధలన్నీ తొలగిపోతాయా? ఆ అవతారం ప్రత్యేకతలేమిటీ?

విష్ణుమూర్తి దశవతారాల్లో ఒకటి నరహింహావతారం. ఈ రూపంలో విష్ణుమూర్తి సగం నరుడు, సగం సంహం ఆకృతిలో ఉంటాడు. ఈరూపంలో నాలుగు నుంచి పదహారు చేతులలో రకరకాల ఆయుధాలతో, రౌద్రరసం ఉట్టిపడే సింహ ముఖంతో దర్శనమిచ్చే దైవస్వరూపం నరసింహావతారం.

ఈ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం, జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలను తొలగిస్తాడనేది నమ్మకం.

సకల విశ్వాన్ని పాలించే విష్ణుమూర్తి లోక కల్యాణార్థం ప్రతి యుగంలో ఒక రూపంలో అవతరించాడు. ప్రతీ జీవి భగవంతుడి స్వరూపమే అని తెలిపేందుకు ప్రతీకగా యుగానికి ఒక్కో రూపంలో తన మహిమ చూపించాడు. అలా వెలసిన అవతారాల్లో నరసింహావతారం నాలుగొవదిగా చెప్పవచ్చు. సకళ మానవాళిని చెడు నుంచి హింస నుంచి కాపాడేందుకు అవతరించిన దేవదేవుడే నరసింహుడు. ఈ అవతారం సత్యయుగానికి చెందినదిగా చెప్పవచ్చు. ఈ అవతారాన్ని నరసింహుడు లేదా నరసింగముడు అని పిలుస్తారు. దుష్టత్వం నుంచి మానవతను కాపాడేందుకు అవతరించి దైవంగా భక్తులు కొలుచుకునే అవతారం ఈ నరసింహావతారం.

నరసింహావతారంలో సగం శరీరం నరుడిగాను సగం శరీరం సింహలా భీకరంగా ఉంటుంది. ఈ అవతారానికి 4 నుంచి 16 చేతులు వివిధ రకాల ఆయుధాలు ధరించి ఉంటాయి. భీకరావతారంలో ఉన్నప్పటికీ నరహింహుడి ఒక చేయి అభయముద్ర ధరించి శిష్ట జన రక్షణను సూచిస్తూ ఉంటుంది. లక్ష్మీ దేవి సహితంగా ప్రసన్న వదనంతో కూర్చున్న నరసింహుడు ఆరాధనీయుడు.

కేవలం ఈ భంగిమలో మాత్రమే కాదు దాదాపుగా 74 ఇతర భంగిమల్లో కూడా నరసింహావతారం కనిపిస్తుంది. చేతిలో ధరించిన ఆయుధాన్ని బట్టి ఆయన రూపానికి నామాలున్నాయి. నరసింహుడి ఆరాధనకు చాలా నిర్ధుష్టమైన నియమాలు ఆచరించాల్సి ఉంటుంది. ఆ స్వరూపాల్లో ఉగ్ర, కరంజ, లక్ష్మీ వరాహ, యోగ, జ్వాల, మలాల, భార్గవ, క్రోధ నరసింహ స్వరూపాలు బాగా ప్రాచూర్యంలో ఉన్నాయి.

నరసింహ ఆరాధనతో కలిగే లాభాలు

ఈ స్వామి వారిని ఆరాధించడం వల్ల చాలా రకాల ఐహిక కష్టాల నుంచి కడతేర వచ్చు. నియమ నిష్టలతో నరసింహారాధన చేసుకునే వారికి మోక్షం సంప్రాప్తిస్తుంది. సకల పాపాలు హరిస్తాయి. రోగ బాధ నుంచి విముక్తి లభిస్తుంది. గ్రహపీడల నుంచి స్వామి రక్షిస్తారు. లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించే వారికి కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్య ఆయురారోగ్యాలు సంప్రాప్తిస్తయాని శాస్త్రాలు చెబుతున్నాయి. న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తున్న వారు స్వామి వారిని సేవించుకుంటే తప్పక విజయం లభిస్తుందట. శారీరక, మానసిక ప్రశాంతతకు స్వామి ఆరాధన దోహదం చేస్తుందట. ఏ ఇంట్లో స్వామికి నిత్యం పూజాధికాలు జరుగుతుంటాయో ఆ ఇల్లు సకల సౌఖ్యాలతో కళకలలాడుతుంది.

Manabadi Nadu Nedu STMS Latest App Download

MANA BADI NADU NEDU STMS Android APP Latest Version Download Mana Badi – Nadu Nedu is to strengthen the infrastructure and transform the existing infrastructure of the schools in the mission mode in a phased manner over a period of three years, starting from 2019-20.

Under Mana Badi – Nadu Nedu program, following 9 infrastructure components have been taken up. (I) Toilets with running water (ii) ) Drinking water supply (iii) Major and minor repairs (iv) Electrification with fans and tube lights (v) Furniture for students and staff (vi) Green chalk boards (vii) Painting to schools (viii) English labs and (ix) Compound walls.

MANA BADI NADU NEDU STMS Android APP Latest Version Download APK. Download MANA BADI NADU NEDU Latest Version Mobile APK APP. This STMS NADU NEDU APP is very useful for All the Head Masters of Nadu Nedu for Uploading the Bills. Use Always the Latest Updated Version of NADU-NEDU APP.

Download…. Mana Badi Nadu Nedu Latest App 

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌పై పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు

గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్‌పై సోషల్ మీడియాలో ఎటువంటి వార్ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీపై తన స్టాండ్ ఏమిటో చెప్పాలని కొందరు, టీడీపీ తరపున ప్రచారం చేయాలని, వీడియో విడుదల చేయాలని.. ఇలా రకరకాలుగా ఆయనపై వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌పై పిఠాపురం వర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR)పై సోషల్ మీడియాలో ఎటువంటి వార్ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీ (TDP)పై తన స్టాండ్ ఏమిటో చెప్పాలని కొందరు, టీడీపీ తరపున ప్రచారం చేయాలని, వీడియో విడుదల చేయాలని.. ఇలా రకరకాలుగా ఆయనపై వార్తలు వైరల్ అయినప్పటికీ.. ఎన్టీఆర్ (NTR) మాత్రం ఏం స్పందించకుండా నిశ్శబ్దంగానే ఉన్నారు. అయినా కూడా ఆయనపై ఏదో రకంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా పిఠాపురానికి (Pithapuram) చెందిన టీడీపీ నేత ఎస్‌విఎస్‌ఎన్ వర్మ (SVSN Varma) ఓ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడమే కాకుండా.. ఆయనపై తారక్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి. ఇంతకీ వర్మ ఏమన్నారంటే..

‘‘రమ్మనండి ఎన్టీఆర్‌ని సినిమాలు మానేసి.. ఫుల్ టైమ్ రాజకీయాలలోకి. ఏదో ఒక పదవి ఇచ్చి కూర్చోబెడతాం. లోకేష్‌తో ఎన్టీఆర్‌కి పోలిక ఏముంది. నారా లోకేష్ సీన్సియర్‌గా పార్టీ కోసం పని చేస్తున్నారు. 60 లక్షల సభ్యత్వం చేశారు.. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చే విధానాన్ని లోకేష్ (Nara Lokesh) అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం లోకేష్ కీలకంగా మారారు. ఎవరైనా సరే రాజకీయంగా పార్టీ కోసం పని చేస్తే కచ్చితంగా గుర్తింపు వస్తుంది. పార్టీ కోసం త్యాగం చేసే ఉద్దేశ్యం ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వదిలేసి రావాలని స్వాగతిస్తున్నాను. నందమూరి హరికృష్ణకు రాజ్యసభ ఇచ్చారు, నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆ కుటుంబానికి లేని బాధ మిగతా వాళ్లకు ఎందుకు?’’ అని పిఠాపురం వర్మ (Pithapuram Varma Comments) ప్రశ్నించారు.

దీనిపై ఎన్టీఆర్ అభిమానులు (Jr NTR Fans) గరం గరం అవుతున్నారు. వర్మను ఉద్దేశించి అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌తో ప్రస్తుతం వర్మ మరోసారి వార్తలలో హైలెట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకొన్ని గంటలలో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న వేళ సోషల్ మీడియాలో ఈ రచ్చ ఏంటని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

100 ఏళ్లనాటి పురాతన గంధర్వ మహల్.. ఎక్కడో కాదు మన ఏపీలోనే.. చూస్తే స్టన్..

ఓ జమీందారు కలల సౌధం ఆ గంధర్వమహల్ నిర్మాణం. పల్లెటూరులో కళ్ళు చెందిరే డిజైన్‎లు, విదేశీ వస్తువులతో మహల్ నిర్మాణం నేటికీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయిన్పటికీ చెక్కు చెదరని భవంతిగా చరిత్రకెక్కింది. అదే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో నిర్మించిన గంధర్వ మహల్. రాజస్థాన్ విహార యాత్రకు వెళ్లిన ఆ యువ జమీందారుకు తన స్వగ్రామంలో అందమైన ప్యాలస్ నిర్మించాలన్న సంకల్పించారు.

అయిన్పటికీ చెక్కు చెదరని భవంతిగా చరిత్రకెక్కింది. అదే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో నిర్మించిన గంధర్వ మహల్.

రాజస్థాన్ విహార యాత్రకు వెళ్లిన ఆ యువ జమీందారుకు తన స్వగ్రామంలో అందమైన ప్యాలస్ నిర్మించాలన్న కోరికతో1918లో గంధర్వ మహల్ నిర్మాణం మొదలుపెడితే 1924 లో పూర్తి అయ్యింది. గొడవర్తి నాగేశ్వరావు చౌదరీ అనే జమీందారు ఆచంట గ్రామంలో ఈ మహల్ నిర్మించారు.

గంధర్వమహల్ నిర్మాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అప్పట్లో ఈ భవన నిర్మాణానికి గానుగు సున్నంలో కోడిగుడ్ల సొనా కలిపి ఆ మిశ్రమంతో గోడలు నిర్మించారు. అందుకే ఇప్పటికీ మహల్ గోడలు చెక్కుచెదరకుండా అలానే ఉన్నాయి. కలప బర్మా నుండి, ఇనుప దిమ్మలు లండన్ నుండి ఓడల్లో చెన్నైకి వచ్చాయట. అక్కడ నుండి ఆచంట గోదావరి తీరానికి పడవలులో జల రవాణా ద్వారా తెప్పించారు.

గంధర్వ మహల్ నిర్మాణం పూర్తిన సమయంలో ఆ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో విదేశాలు నుండి జనరేటర్లు తెప్పించి మరీ మహల్ మొత్తం విద్యుత్ దీప కాంతులలో మెరిసిపోయేలా చేశారట జమీందార్లు. అప్పట్లో ఈ మహల్ నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అయ్యిందని చెబుతుంటారు. అంతేకాదు మహల్ సెంట్రల్ హాల్‎లో కనిపించే పియానో లండన్ నుండి తీసుకువచ్చారు.

1885లో లండన్‎లో జరిగిన ఎగ్జిబిషన్‎లో ఈ పియానో‎కు రజిత పతకం గెలవడం విశేషం. ఇప్పటికీ ఈ పియానో సుస్వరాలను పలికించడం విశేషం. మహల్‎హాలులో ఇరువైపులా బిల్జియం నుండి తెప్పించిన ప్రత్యేకమైన అద్దాలను అమర్చారు. వీటి విశేషం ఏమిటంటే ఈ అద్దం ఎదురుగా నుంచుని చూస్తే ఏడు ప్రతిబింబాలు ఒకదాని ప్రక్కన మరోకటి నిల్చున్నట్లు కనబడుతుంది.

ఈ గంధర్వ మహల్‎లో నాటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్‎టి రామారావు, నారా చంద్రబాబు నాయుడులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ మహల్‎లోనే బస చేసేవారు. నేటితో ఈ గంధర్వ మహల్ నిర్మించి 100 సంవత్సరాలు పూర్తవ్వడంతో గంధర్వమహల్ నిర్మించిన జమీందారు గొడవర్తి నాగేశ్వరరావు మనవళ్ళు శతాబ్ద ఉత్సవాలు జరపాలని నిశ్చయించుకున్నారు.

 

  • Beta

Beta feature

Radhika SarathKumar: భార్య గెలవాలని.. హీరో పొర్లు దండాలు: వీడియో వైరల్‌

Radhika SarathKumar: లోక్‌సభ ఎన్నికల్లో తన భార్య విజయాన్ని కాంక్షిస్తూ సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ పొర్లుదండాలు పెట్టారు. ఆ వీడియో వైరల్‌ అయ్యింది.

తన నటనతో దక్షిణాదిన సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటి రాధికా శరత్‌ కుమార్‌ (Radhika SarathKumar) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులోని విరుదునగర్‌ (Virudhunagar) స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఆమె విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని కాంక్షిస్తూ రాధిక భర్త, సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ ప్రత్యేక పూజలు చేశారు.

ఆదివారం రాత్రి విరుదునగర్‌లోని శ్రీ పరాశక్తి మారియమ్మన్‌ ఆలయాన్ని రాధిక దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత శరత్‌ కుమార్‌ (SarathKumar) ఆలయ ప్రాంగణంలో పొర్లు దండాలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. రాధిక తరఫున ఎన్నికల ప్రచారంలోనూ ఈ నటుడు చురుగ్గా పాల్గొన్నారు

2006లో రాధిక (Radhika SarathKumar) రాజకీయ ప్రస్థానం మొదలైంది. తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే ఏడాది అగ్ర నాయకత్వం వారిని తొలగించింది. 2007లో వారు ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (AISMK) పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో ఆమె సేవలు అందించారు. కొద్దిరోజుల క్రితం ఏఐఎస్‌ఎంకేను భాజపా (BJP)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు కమలం పార్టీ టికెట్ దక్కింది.

ఇక విరుదునగర్‌ స్థానం నుంచి నటికి పోటీగా దివంగత నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకరన్‌ బరిలోకి దిగారు. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా డీఎండీకే తరఫున ఆయనను నిలబెట్టారు. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ మరోసారి పోటీ చేశారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. మరి ఈ ఆసక్తికర సమరంలో రాధికను గెలుపు వరిస్తుందో, లేదో తెలియాలంటే మంగళవారం వరకు ఆగాల్సిందే..!

మీ పాన్‌కార్డు ఆధార్‌తో లింక్‌ అయ్యిందా..? ఈ సింపుల్‌ టిప్స్‌‌తో తెలుసుకోవడం చాలా ఈజీ

పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) అనేది భారత ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ఒక ప్రత్యేకమైన పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్ నెంబర్‌గా ఉంటుంది. పాన్‌ కార్డు లామినేటెడ్ ప్లాస్టిక్ కార్డ్ రూపంలో అందిస్తూ ఉంటారు. ఇది పన్ను సంబంధిత ప్రయోజనాల కోసం భారతదేశంలోని వ్యక్తులు, సంస్థలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా పని చేస్తుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి, అధిక-విలువ లావాదేవీలను నిర్వహించడానికి, పన్ను చెల్లింపుదారులు, ఆదాయపు పన్ను శాఖ మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడానికి పాన్ అవసరం. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థ చేసిన అన్ని ఆర్థిక లావాదేవీలను వారి పాన్‌కి లింక్ చేయడం ద్వారా పన్ను ఎగవేతను ట్రాక్ చేయడంలో నిరోధించడంలో కూడా సహాయపడుతుంది.ఈ నేపథ్యంలో పాన్‌ కార్డుతో ఆధార్‌ లింక్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఇటీవల ఆదాయపు పన్ను శాఖ ఒక రిమైండర్‌ను జారీ చేసింది. పన్ను చెల్లింపుదారులు తమ పాన్‌ను మే 31, 2024లోగా ఆధార్‌తో లింక్ చేయాలని విజ్ఞప్తి చేశారు. గడువును తప్పిన వారికి మూలం వద్ద పన్ను మినహాయింపు ఎక్కువగా ఉంటుందని డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 206ఏఏ, 206 సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నిర్ధారిస్తుంది. 2017 ఆర్థిక చట్టం 1961 నాటి ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 139ఏఏని ప్రవేశపెట్టింది. ఆధార్ పొందేందుకు అర్హత ఉన్న ప్రతి వ్యక్తి పాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు లేదా వారి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు తప్పనిసరిగా వారి ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా కోట్ చేయాలి. జూలై 1, 2017 నుండి అమలులోకి వస్తుంది.

పాన్‌తో ఆధార్‌ లింక్‌ చెక్‌ చేయడం ఇలా
ముందుగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారిక వెబ్‌సైట్లో సైన్ ఇన్ చేయకుండానే పాన్-ఆధార్ లింక్ స్థితిని వీక్షించవచ్చు.
ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీలో, ‘త్వరిత లింక్‌లు’కి వెళ్లి, లింక్ ఆధార్ స్థితిపై క్లిక్ చేయాలి.
మీ పాన్, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, వ్యూ లింక్ ఆధార్ స్థితిపై క్లిక్ చేయాలి.
ధ్రువీకరణ అనంతరం మీ లింక్ ఆధార్ స్థితికి సంబంధించిన సందేశం కనిపిస్తుంది.
ఆధార్-పాన్ లింక్ ప్రోగ్రెస్‌లో ఉంటే మీ ఆధార్-పాన్ లింకింగ్ అభ్యర్థన ధృవీకరణ కోసం యూఐడీఏఐకు పంపామని, దయచేసి హోమ్ పేజీలో ‘లింక్ ఆధార్ స్టేటస్’ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా స్థితిని తర్వాత తనిఖీ చేయండి అని వస్తుంది.
ఆధార్ పాన్ లింకింగ్ విజయవంతమైతే మీ పాన్ ఇప్పటికే ఇచ్చిన ఆధార్‌కి లింక్ చేయబడింది అని చూపతుంది.

ఆరా మస్తాన్ సర్వే లీక్..వైసీపీ గెలిచే 104 స్థానాల లిస్ట్ ఇదే

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు. జాతీయ సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా, స్థానిక సర్వేలు మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని ప్రకటించాయి.

అయితే స్థానికంగా చేసిన ఆరా సర్వేనే మెజార్టీ ప్రజలు నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఆయన గతంలో చేసిన సర్వేలన్నీ కూడా విజయవంతం అయ్యాయి.

ఆరా మస్తాన్ మరోసారి ఏపీలో జగన్ పార్టీదే విజయం అని తేల్చి చెప్పారు. తాజాగా ఆరా మస్తాన్ వైసీపీ గెలుస్తుందని చెప్పిన 104 స్థానాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్ అవుతోంది.ఓసారి లిస్ట్‌ను పరిశీలిస్తే..

శ్రీకాకుళం

—————–

1. పలాస

2. పాతపట్నం

3. ఎచ్చెర్ల

4. రాజాం

5. పాలకొండ

విజయనగరం

————————

6. చీపురుపల్లి

7. కురుపాం

8. సాలూరు

9. గజపతినరం

10. పార్వతీపురం

11. శృంగవరపుకోట

విశాఖపట్నం

——————–

12. చోడవరం

13. మాడుగుల

14. అరకు

15. పాడేరు

16. పాయకరావుపేట

17. వైజాగ్ సౌత్

18. పెందుర్తి

తూర్పుగోదావరి

————————

19. అనపర్తి

20. జగ్గంపేట

21. రామచంద్రపురం

22. రంపచోడవరం

23. తుని

24. రాజానగరం

25. అమలాపురం

26. రాజోలు

27. ప్రత్తిపాడు

పశ్చిమగోదావరి

————————-

28. కొవ్వూరు

29. గోపాలపురం

30. ఆచంట

31. పోలవరం

32. ఉంగుటూరు

33. నిడవదొలు

34. చింతలపూడి

35. దెందులూరు

కృష్ణ

———

36.తిరువూరు

37. నూజివీడు

38. గుడివాడ

39. పెడన

40.పామర్రు

41 విజయవాడ వెస్ట్

42 నందిగామ

43. జగ్గయ్యపేట

గుంటూరు

——————

44. పెదకూరపాడు

45. నరసరావుపేట

46. గురజాల

47. మాచర్ల

48. సత్తెనపల్లి

49. వినుకొండ

50. గుంటూరు ఈస్ట్

51. బాపట్ల

ప్రకాశం

————-

52. వై పాలెం

53. దర్శి

54. మార్కాపురం

55. గిద్దలూరు

56. కనిగిరి

57. కందుకూరు

నెల్లూరు

————–

58. కావాలి

59. ఆత్మకూరు

60. ఉదయగిరి

61. వెంకటగిరి

62. సర్వేపల్లి

63. గూడూరు

64. సూళ్లూరుపేట

65. నెల్లూరు రూరల్

చిత్తూరు

————–

66. పుంగనూరు

67. పూతలపట్టు

68. తిరుపతి

69. జీ నెల్లూరు

70. సత్యవేడు

71. మదనపల్లి

72. శ్రీకాళహస్తి

73. చిత్తూరు

74. చంద్రగిరి

75. తంబళ్లపల్లె

అనంతపురం

———————-

76. రాప్తాడు

77. సింగనమల

78. అనంతపురం అర్బన్

79. కదిరి

80. ధర్మవరం

81. మడకశిర

82. గుంతకల్లు

కర్నూల్

————–

83. ఆలూరు

84. ఆదోని

85. మంత్రాలయం

86. ఎమ్మిగనూరు

87. నంద్యాల

88. ఆళ్లగడ్డ

89. శ్రీశైలం

90. కోడుమూరు

91. పత్తికొండ

92. డోన్

93. నందికొట్కూర్

94. పాణ్యం

కడప

———–

95. కడప

96. పొద్దుటూరు

97. జమ్మలమడక

98. పులివెందుల

99. రాయచోటి

100. రైల్వే కోడూర్

101. మైదుకూరు

102. బద్వేల్

103. కమలాపురం

104. రాజంపేట

ఈ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది నిజంగా ఆరా మస్తాన్ చేసిన సర్వేకు సంబంధించినదేనా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

వాటర్‌ ట్యాంక్‌లో మృత‌దేహం.. అవే నీళ్ల‌ను పదిరోజులుగా వాడుతున్న జనం!

నల్లగొండలో దారుణ ఘ‌ట‌న‌
మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో మృతదేహం ల‌భ్యం
మృతుడిని ఆవుల వంశీగా గుర్తించిన‌ అధికారులు
ఇటీవ‌లే నాగార్జునసాగర్‌లో మినీ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలొదిలిన వైనం
ఈ ఉదంతం మరువకముందే ఇప్పుడు మ‌రో ఘ‌ట‌న‌
ఇటీవ‌లే నాగార్జునసాగర్‌లో ఎండల తాకిడితో దాహం తీర్చుకోవడానికి ఒకదాని వెంట ఒకటి మినీ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలొదిలిన వైనం బయటపడిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో దారుణం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. నల్లగొండ మున్సిపాలిటీలోని 11వ‌ వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో ఓ మృతదేహం క‌నిపించింది. వాటర్ ట్యాంకులో నీళ్ల‌ను చెక్ చేయగా అందులో శ‌వం క‌నిపించ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని బ‌య‌ట‌కు తీశారు.

కాగా, ఆ మృత‌దేహాన్ని హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు అధికారులు. అతడు పది రోజుల క్రితం అదృశ్యం కావ‌డంతో మిస్సింగ్‌ కేసు నమోదైయింది. ఈ క్ర‌మంలో తాజాగా వాట‌ర్ ట్యాంకులో అత‌ని శ‌వం దొరికింది. అయితే, అతడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డ‌డా ? లేక ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా అనే విషయం తెలియాల్సి ఉంది.

కాగా, ఇలా మృత‌దేహం ఉన్న‌ ఇవే నీళ్లను గత పది రోజులుగా మున్సిపాలిటీ జ‌నాలు తాగుతున్నారు. దాంతో శ‌వం ఉన్న‌ నీటిని ప‌ది రోజుల నుంచి వాడిన‌ట్లు తెలుసుకున్న‌ స్థానికులు త‌మ‌కు ఏం అవుతుందోన‌ని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Hema: సినీ నటి హేమ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న బెంగళూరు పోలీసులు

Hema: సినీ నటి హేమ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న బెంగళూరు పోలీసులు

హేమను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన సీసీబీ పోలీసులు
మే 20న రేవ్ పార్టీలో పాల్గొన్న సినీ నటి హేమ
ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసులు
సినీ నటి హేమ కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీసీబీ పోలీసులు ఆమెకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి సీసీబీ పోలీసులు ఈరోజు హైదరాబాద్ వచ్చారు.

నటి హేమ మే 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఆమె రక్తనమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని హేమతో పాటు… రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురికి నోటీసులు ఇచ్చారు. మొదటిసారి గత సోమవారం విచారణకు హాజరు కావాలని, రెండోసారి జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె సీసీబీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు.

EPFO: 7.5 కోట్ల మందికి గుడ్‌న్యూస్‌ – పీఎఫ్‌ ఖాతాలో ఈ తప్పులను ఆన్‌లైన్‌లోనే మార్చొచ్చు

How To Update Name KYC Details In PF Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తన ఖాతాదార్ల సౌలభ్యం కోసం EPFO చాలా సేవలను ఆన్‌లైన్‌ చేసింది. దీనివల్ల, ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్‌లైన్‌లోనే చాలా పనులు పూర్తి చేయవచ్చు.

కొన్నిసార్లు, ఈపీఎఫ్ ఖాతా తెరిచేటప్పుడు పేరు, వయస్సు వంటి వివరాలు తప్పుగా నమోదు చేస్తుంటారు. ఈ వివరాలను ఆఫ్‌లైన్‌ ద్వారానే కాదు, ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ అప్‌డేట్ చేయవచ్చు. గతంలో, దీనికోసం ఉద్యోగి జాయింట్ డిక్లరేషన్ ఫారాన్ని కంపెనీ యజమాని పూరించాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ వివరాలను ఆన్‌లైన్‌లోనే మార్చవచ్చు.

ఆన్‌లైన్‌ ద్వారా EPF ఖాతాల్లో 11 మార్పులు చేయవచ్చు:
EPF చందాదార్లు ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం 11 విషయాలను అప్‌డేట్‌ చేయవచ్చు. సభ్యుని పేరు, జెండర్‌, పుట్టిన తేదీ, తల్లి/తండ్రి పేరు, సంబంధం, వైవాహిక స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం మానేయడానికి కారణం, ఉద్యోగం మానేసిన తేదీ, పౌరసత్వం, ఆధార్ వివరాలు వంటివాటిలో తప్పులను సరిచేయవచ్చు. అప్లికేషన్‌తో పాటు, ఆ అభ్యర్థనకు సంబంధించిన అవసరమైన రుజువు పత్రాలను ‍‌(Proof documents) కూడా అప్‌లోడ్ చేయాలి.

ఈపీఎఫ్‌లో వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలి? ‍‌(How to update EPF profile online?)
1. EPFOలో ఏవైనా వివరాలను అప్‌డేట్ చేయడానికి, ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్, epfindia.gov.in పోర్టల్‌లోకి వెళ్లండి.
2. తర్వాత, ‘For Employees’ విభాగంలోకి వెళ్లి, Services’ ఆప్షన్‌ ఎంచుకోండి.
3. తర్వాత ‘Member UAN/ Online Service’ ఆప్షన్‌ ఎంచుకోండి.
4. ఇప్పుడు మరో కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో UAN, పాస్‌వర్డ్ నమోదు చేయాలి.
5. తర్వాత, మీ EPF ఖాతా ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ, ‘Manage’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆపై ‘Joint Declaration’ బటన్‌ మీద క్లిక్‌ చేయండి.
6. మార్పులు చేయాలనుకుంటున్న మెంబర్ IDని ఎంచుకోండి.
7. వివరాలలో మార్పులు చేసేందుకు కొన్ని పత్రాల జాబితా కనిపిస్తుంది. మీ అవసరాన్ని బట్టి వాటి నుంచి ఎంచుకోవాలి.
8. వివరాల్లో మార్పులు చేసిన తర్వాత అవసరమైన రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయండి.
9. ఈ అభ్యర్థన మీ సంస్థ యాజమాన్యానికి వెళ్తుంది.

అభ్యర్థనను స్వీకరించిన కంపెనీ యాజమాన్యం, ఆ ఉద్యోగి రికార్డులను తనిఖీ చేస్తుంది. ఉద్యోగి అభ్యర్థన సరైనదే అని గుర్తిస్తేనే ఆ అప్లికేషన్‌ను ఆమోదిస్తుంది. దరఖాస్తు పట్ల సంస్థ సంతృప్తి చెందకపోతే తిరస్కరిస్తుంది. యాజమాన్యం ఆమోదం పొందిన అప్లికేషన్‌ సంబంధిత PF ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తుంది. ఈ కొత్త సదుపాయాన్ని ఉపయోగించి సభ్యులు తమ అభ్యర్థనలను సమర్పిస్తున్నారు. EPFO లెక్క ప్రకారం, ఇప్పటి వరకు 2.75 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో దాదాపు 40,000 అప్లికేషన్లను ప్రాంతీయ కార్యాలయాలు ఇప్పటికే పరిష్కరించాయి.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌‌పై సీఈవో మీనా కీలక ప్రకటన

అమరాతి: మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలవనున్న నేపథ్యంలో ఈ రోజు (సోమవారం) ఆంధప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమాన్ మీనా (Mukesh Kumar Meena) కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుందని ప్రకటించారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపు ఫలితాలపై ఓ అంచనా వస్తుందని ఆయన అంచనా వేశారు.

ఓటేసిన 3.33 కోట్ల మంది..

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని చెప్పారు. 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారని, మరో 26,721 మంది సర్వీసు ఓటర్‌లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారని చెప్పారు.

119 మంది అబ్జర్వర్లను నియమించిన ఈసీ

అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. కొన్ని చోట్ల లోక్‌సభ కౌంటింగ్ హాల్స్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రత్యేకంగా జరుగుతుందని, వేరే హాల్‌లో అక్కడ 8 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ మొదలు అవుతుందని వివరించారుు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం 119 మంది అబ్జర్వర్లను నియమించిందని పేర్కొన్నారు.

పోస్టల్ బ్యాలెట్లు 102 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 1 నుంచి 2 రౌండ్‌లలో లెక్కిస్తారని, 48 నియోజకవర్గాలలో 3 రౌండ్‌లు, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్‌లలో లెక్కిస్తారని చెప్పారు. ఇక ఏపీలో జనవరి 1 నుంచి జూన్ 2 వరకు మొత్తం రూ.483.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న మొత్తంలో రూ.170 కోట్లు నగదు, 62 కోట్ల విలువైన లిక్కర్, రూ.36 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186 కోట్ల విలువైన వస్తువులు, రూ.29 కోట్ల విలువైన గిఫ్ట్‌లు ఉన్నాయని తెలిపారు.

అమలాపురం పార్లమెంట్‌కు 27 రౌండ్‌లు
అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ లెక్కింపునకు మొత్తం 27 రౌండ్‌లు పడుతుందని ముకేశ్ కుమార్ మీనా వివరించారు. ఫలితానికి దాదాపు 9 గంటల సమయం పట్టొచ్చని అన్నారు. ఇక రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాలలో 13 రౌండ్‌లు ఉంటాయని, ఇందుకు 5 గంటల సమయం పడుతుందని అన్నారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలలో 26 రౌండ్‌ల లెక్కింపు జరుగుతుందని, కొవ్వూరు, నరసాపురంలలో 5 గంటల్లో ఫలితాలు వస్తాయని ముకేశ్ కుమార్ మీనా వివరించారు.

పటిష్ట భద్రత ఏర్పాటు
అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. మీడియా కౌంటింగ్ ప్రక్రియను చిత్రీకరణ చేసుకోవచ్చని, కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మీడియాకు మాత్రమే నిర్దేశించిన సెంటర్ వరకూ మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లవచ్చునని పేర్కొన్నారు.

మద్యం ఎక్కడా దొరకదు..
కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలు ముసివేస్తూ నిర్ణయం తీసుకున్నామని ముకేశ్ కుమార్ మీనా ప్రకటించారు. స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మద్యం విక్రయాలు జరగబోవని స్పష్టం చేశారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
67 కంపెనీల సాయుధ భద్రతా బలగాలు ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాలు, శాంతి భద్రతల కోసం వినియోగిస్తున్నామని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో రెడ్‌ జోన్‌గా ప్రకటించామని వివరించారు. కౌంటింగ్ రోజు జరిగిన హింస జరగకుండా చర్యలు చేపట్టామని, 185 హింస జరిగే ప్రాంతాల్లో గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేశామని ముకేశ్ కుమార్ మీనా వివరించారు.
12 వేల మందిని గుర్తించి బైండోవర్ చేశామని చెప్పారు. అలాగే పోలీసు పికెట్‌లు పెట్టామని ముకేశ్ కుమార్ మీనా చెప్పారు. ఇక క్యూఆర్టి టీమ్‌లు, కార్డెన్ సెర్చ్ చేస్తున్నామని వివరించారు. పోలింగ్ తర్వాత 1,400 చోట్ల కర్డెన్ సెర్చ్ చేశామని అన్నారు.

Gratuity Limit: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. డీఏ పెంపు తర్వాత గ్రాట్యుటీ పరిమితి పెంపు

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో కానుక అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని 4 శాతం పెంచిన తర్వాత గ్రాట్యుటీ పరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పదవీ విరమణ, మరణాల గ్రాట్యుటీ పరిమితిని 25 శాతం పెంచారు. దీంతో పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది. కొత్త గ్రాట్యుటీ పరిమితి జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఇటీవల కీల నిర్ణయాన్ని ప్రకటించింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021 లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ చెల్లింపు) రూల్స్, 2021 ప్రకారం పదవీ విరమణ,మరణాల గ్రాట్యుటీకి గరిష్ట పరిమితి ఇప్పుడు రూ. 25 లక్షలుగా ఉంది. వాస్తవానికి ఈ నిర్ణయం ఏప్రిల్ 30న తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం గురించి వివరాలను తెలుసుకుందాం.

గ్రాట్యుటీ అనేది చాలా కాలం పాటు పనిచేసిన ఉద్యోగికి కంపెనీ ఇచ్చే బహుమతి. ఇది జీతం, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌)కి అదనంగా ఇవ్వబడుతుంది. కంపెనీలో కనీసం ఐదేళ్లు పనిచేసినప్పుడే ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హత ఉంటుంది. మార్చి 7న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) విడుదలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) కూడా ఆమోదించబడింది. బేసిక్ పే/పెన్షన్‌లో ప్రస్తుతం ఉన్న 46 శాతం రేటు కంటే ఈ 4 శాతం పెరుగుదల ధరల పెరుగుదలను భర్తీ చేయడానికి ఉద్దేశించి ఈ మేరకు లాభాన్ని ఉద్యోగులకు అందించనున్నారు.

డీఏ పెంపుతో రవాణా భత్యం, క్యాంటీన్ అలవెన్స్, డిప్యూటేషన్ అలవెన్స్ వంటి ఇతర అలవెన్సులు కూడా 25 శాతం పెరిగాయి. డీఏ, డీఆర్‌ల పెరుగుదల వల్ల ఖజానాపై ఏడాదికి రూ. 12,868.72 కోట్ల ప్రభావం ఉంటుంది. ఈ నిర్ణయంతో దాదాపు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారు. గ్రాట్యుటీ, అలవెన్సుల పెంపుదల ఆర్థిక భద్రతను అందించడంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

Health

సినిమా