Saturday, November 16, 2024

ఫోన్ నుండి ఈ ఫైల్‌ను తీసివేయకపోతే ఇబ్బందే.. 90% మంది చేసే తప్పు ఇదే!

ఫోన్ బాగా పని చేయడానికి, దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఫోన్ పాతదయ్యే కొద్దీ స్లో అవుతుందని కంప్లెయింట్ చేస్తుంటారు. మనం కొన్ని చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

మనలో చాలామంది “కాచీ(Cache)”అనే పదాన్ని వినే ఉంటారు. కానీ అది ఏమిటో,అది ఫోన్‌కు ఎలా హానికరమో కొంతమందికి మాత్రమే తెలుసు. ఫోన్ నుండి cache ఎలా క్లియర్ చేయవచ్చు, అది మీ ఫోన్‌పై ఎలా చెడు ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు చూద్దాం.

cache ని క్లియర్ చేయకపోతే ఫోన్ పనితీరు క్షీణించడం ప్రారంభమవుతుంది. cache ఫైల్‌లు కాలక్రమేణా స్టోర్ చేయబడతాయి, మీ ఫోన్ స్టోరేజ్ స్పేస్ ని ఆక్రమిస్తాయి. ఫోన్‌లో పూర్తి స్టోరేజ్ కారణంగా, ఇది యాప్ లోడ్ అయ్యే సమయాన్ని నెమ్మదిస్తుంది, యాప్‌ల మధ్య మారడం ఆలస్యం కావచ్చు, ఫోన్ కూడా నెమ్మదిగా పని చేయడం ప్రారంభించడం వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది.

cache క్లియర్ చేయడానికి, మీ Android ఫోన్‌లోని సెట్టింగ్‌ల మెనులో స్టోరేజ్ విభాగానికి వెళ్లండి. మీ డివైజ్ మోడల్ ఆధారంగా విభాగం వేర్వేరు స్థానాల్లో ఉండవచ్చు. స్టోరేజ్ మెనులో ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌ల లిస్ట్ ను చూడటానికి ‘యాప్‌లు(apps)’ లేదా ‘యాప్ స్టోరేజ్(app storage)’ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు cache లేదా డేటాను క్లియర్ చేయాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి. యాప్ సెట్టింగ్‌లలో మీరు ‘clear cache’ లేదా clear storage ఆప్షన్స్ చూస్తారు. తాత్కాలిక ఫైల్‌లను తొలగించడానికి ‘cleae cache’పై నొక్కండి. మీరు మళ్లీ లాగిన్ చేసి, యాప్‌ను రీసెట్ చేసే అవకాశం ఉన్న యాప్ డేటా మొత్తం చెరిపేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ‘clear storage’ని ఎంచుకోండి.

ఐఫోన్‌లో cacheని క్లియర్ చేయడం ఎలా?

-మీ iPhoneలో Safari యాప్‌ని ఓపెన్ చేయండి

-బుక్‌మార్క్‌ బటన్‌ను నొక్కండి, హిస్టరీ బటన్‌ను నొక్కండి, ఆపై క్లియర్ నొక్కండి.

-టైమ్ ఫ్రేమ్ కింద, మీరు ఎంత బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.

-గమనిక: మీరు Safari ప్రొఫైల్‌లను సెటప్ చేసి ఉంటే, ఆ ప్రొఫైల్ కోసం హిస్టరీ క్లియర్ చేయడానికి ప్రొఫైల్‌ను ఎంచుకోండి లేదా అన్ని ప్రొఫైల్‌లను ఎంచుకోండి.

– క్లియర్ హిస్టరీపై నొక్కండి.

Joint Pain Relief: ఈ పదార్థాలు తీసుకుంటే కీళ్ల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి..!

Joint Pain Remedies: ప్రస్తుత కాలంలో చాలా మంది మోకాళ్ల నొప్పులు, నడిచేటప్పుడు మోకాళ్ల నుంచి శబ్దం రావడం వంటి సమస్యలు కలుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం శరీరంలో క్యాల్షియం లోపం.

ఈ లోపం కారణంగా ఎముకలు బలహీనంగా ఉండడం వంటి సమస్యలు కలుగుతాయి. మోకాళ్ల నొప్పి సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు అనేక రకాల మందులను వాడుతూంటారు. ఇవి తాత్కాలిక ఉపశమనం పొందడానికి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు కొన్ని ఆయుర్వేద చట్కాలను పాటించడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ మోకాళ్ల నొప్పి సమస్యల నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు మూడు రకాల పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం నల్ల బెల్లం, అర కప్పు పుట్నాలు, ఒక గ్లాస్‌ పాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం ఎముకలు దృఢంగా తయారు అవుతాయి. నల్ల బెల్లంలో ఉండే ఫాస్పరస్‌ కండరాలను, ఎముకలను బలంగా తయారు చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే వ్యర్థలను తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు కూడా ఈ సమస్యను నుంచి బయటపడవచ్చు. జీర్ణవ్యవస్థతో బాధపడేవారికి దీని తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటాయి.

మోకాళ్ల నుంచి శబ్దాలు రావడం కూడా తగ్గుతాయి. అయితే వీటిని మధ్యాహ్నం భోజనం చేసిన రెండు గంటల తరువాత తీసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అలాగే దీంతో పాటు మెంతులను తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అయితే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.

అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు వీటని తీసుకోవచ్చు. అయితే మీర వీటిని తీసుకోనేముందు వైద్యుడిని సంప్రదించడంలో చాలా మంచిది. వీటితో పాటు క్యాల్షియంతో కూడిన ఆ హారపదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. దీని వల్ల ఎముకలకు ఎంతో మేలు కలుగుతుంది. క్యాల్షియంతో పాటు ఇతర విటమిన్‌లు, మినరల్స్‌ కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

Ebrahim Raisi : రైసీ హెలికాప్టర్ వాతావరణం కారణంగా కూలలేదు.. ఇరాన్ సంచలన ప్రకటన

Ebrahim Raisi : రైసీ హెలికాప్టర్ వాతావరణం కారణంగా కూలలేదు.. ఇరాన్ సంచలన ప్రకటన

Ebrahim Raisi : ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి సహా తొమ్మిది మంది మరణించారు. అజర్‌బైజాన్‌లోని కిజ్ కలాసి, ఖోడాఫారిన్ డ్యామ్‌లను ప్రారంభించిన తర్వాత రైసీ తిరిగి వస్తున్నారు. ఆయన మరణవార్త తెలియగానే ఇరాన్‌ మాత్రమే కాకుండా ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ఎప్పుడు, ఎలా, ఏమి జరిగింది… అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని అందించారు.

హెలికాప్టర్ క్రాష్‌పై, ఇరాన్ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అజర్‌బైజాన్ నుండి తిరుగు ప్రయాణంలో వాతావరణం స్పష్టంగా ఉందని సంచలనాత్మక విషయం వెల్లడించారు. రైసీ హెలికాప్టర్ రెండు హెలికాప్టర్ల మధ్య ఎగురుతోంది. 45 నిమిషాల ఫ్లైట్ తర్వాత, రైసీ హెలికాప్టర్ పైలట్ అకస్మాత్తుగా మేఘాల రాక గురించి హెచ్చరిక ఇచ్చాడు.

మేఘాలను నివారించడానికి, రైసీ పైలట్ తోడుగా ఉన్న హెలికాప్టర్‌లను పైకి ఎగరమని కోరాడు. మేఘాల పైన 30 సెకన్ల పాటు ప్రయాణించిన రైసీ హెలికాప్టర్ అకస్మాత్తుగా అదృశ్యమైంది. మిగిలిన ఇద్దరు హెలికాప్టర్ పైలట్లు రైసీ హెలికాప్టర్ పైలట్‌తో రేడియో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించారు. మేఘాలు కమ్ముకోవడంతో రెండు హెలికాప్టర్లు టేకాఫ్ కాలేదు.

రైసీ కాన్వాయ్‌తో పాటు మరో రెండు హెలికాప్టర్లలో ఒకదానిలో ఉన్న గులాం హుస్సేన్ ఇస్మాయిలీ, విమానం టేకాఫ్ అయినప్పుడు వాతావరణం బాగానే ఉందని, అయితే దట్టమైన మేఘాలలో రైసీ హెలికాప్టర్ తప్పిపోయిందని స్టేట్ టీవీకి చెప్పారు. ఇతర హెలికాప్టర్లు రేడియో ద్వారా వారిని చేరుకోలేకపోయాయి. అమీరాబ్దుల్లాహియాన్‌ను లేదా విమానంలో ఉన్న వ్యక్తులను ఎవరూ సంప్రదించలేకపోయారని ఇస్మాలీ చెప్పారు.

రైసీ మరణం ప్రపంచానికి మంచిది: ఆంటోనీ బ్లింకెన్
ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై అమెరికా అసంబద్ధమైన, దిగ్భ్రాంతికరమైన రియాక్షన్ ఇచ్చింది. రైసీ మరణం ప్రపంచానికి మంచిదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఇరాన్ ప్రజలకు మంచిది. రైసీ తన ప్రజలను అణచివేసాడు.

NEET results 2024 : త్వరలో నీట్​ యూజీ 2024 ఆన్సర్​ కీ విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

NEET results 2024 : నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) త్వరలో విడుదల చేయనుంది.

ఆ తర్వాత.. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్​కు హాజరైన అభ్యర్థులు.. exams.nta.ac.in/NEETలోకి వెళ్లి నీట్ యూజీ పరీక్ష ప్రొవిజనల్ ఆన్సర్ కీ చెక్​ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, తేదీలను ఉపయోగించి డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

నీట్ యూజీ ఆన్సర్ కీతో పాటు ప్రశ్నాపత్రం, అభ్యర్థుల సమాధానాలను కూడా ఎన్​టీఏ షేర్​ చేస్తుంది..

నీట్ యూజీ ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు తమ ఫీడ్ బ్యాక్ పంపాలని ఎన్​టీఏ విజ్ఞప్తి చేస్తుంది. ఇందుకోసం వారు ఒక్కో క్వైరీకి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను ఆన్సర్ కీ నోటిఫికేషన్​ విడుదలైన తర్వాత తెలుస్తోంది.

NEET results 2024 answer key : ఈ ఏడాది 24 లక్షల మంది అభ్యర్థులు.. ఈ జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష రాశారు. నీట్ యూజీ 2024 మే 5 న ఒకే షిఫ్ట్​లో, భారతదేశం అంతటా 557 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) జరిగింది.

ఇదీ చూడండి:- ICAI CA exam dates: సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించిన ఐసీఏఐ

నీట్ 2024 ఆన్సర్ కీని ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

స్టెప్​ 1:- exams.nta.ac.in. వెబ్​సైట్​లోకి వెళ్లండి.
స్టెప్​ 2:- నీట్ యూజీ 2024 పేజీని ఓపెన్ చేయండి.
స్టెప్​ 3:- మీ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేదీని నమోదు చేయండి.
స్టెప్​ 4:- వివరాలు సమర్పించాలి. ప్రొవిజనల్ ఆన్సర్ కీ, నీట్ యూజీ పరీక్షలో అడిగే ప్రశ్నలు తర్వాతి పేజీలో కనిపిస్తాయి.
NEET answer key 2024 : నీట్ యూజీ పరీక్షపై మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎన్​టీఏ హెల్ప్​లైన్​ నంబర్లు 011-40759000ను సంప్రదించవచ్చు. neet@nta.ac.in ఈ-మెయిల్ కూడా చేయవచ్చు.

తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్లు.. nta.ac.in, exams.nta.ac.in/NEET సందర్శించాలని ఎన్​టీఏ సూచించింది.

సాధారణంగా.. ఆన్సర్​ కీ విడుదలై, అభ్యంతరాలను నోట్​ చేసుకున్న కొన్ని రోజుల తర్వాత.. నీట్​ ఫలితాలు వెలువడతాయి. ఈ ఏడాది జరిగిన నీట్​ యూజీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి? అన్న దానిపై సమాచారం లేదు. త్వరలోనే ఓ అప్డెట్​ వచ్చే అవకాశం ఉంది. ఆన్సర్​ కీ విడుదల తేదీపైనా అతి త్వరలోనే ఒక అప్డేట్​ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

క్యాన్సర్‌కు కారణమయ్యే ఆనవాళ్లు లేవు.. ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌లకు క్లీన్‌ చిట్‌

భారత్‌కు చెందిన ప్రముఖ మసాలా బ్రాండ్‌లు ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ సంస్థలకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (fssai) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

ఆ రెండు సంస్థల అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లోక్యాన్సర్‌కు కారకమయ్యే ఎథిలీన్‌ ఆక్సైడ్‌ (eto) రసాయనాలు లేవని నిర్ధారించింది.

కొద్ది రోజుల క్రితం భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్‌ అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లో పరిమితికి మించి ఎథిలీన్‌ ఆక్సైడ్‌ అనే పురుగుల మందు ఉన్నట్లు కనుగొన్నామని హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఎస్‌) ఏప్రిల్‌ 5న ప్రకటించింది. ఈ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సీఎఫ్‌ఎస్‌ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ రీకాల్‌ చేసింది.

అందులో ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్‌ కర్రీ పౌడర్, సాంబార్‌ మసాలా మిక్స్‌డ్‌ మసాలా పౌడర్, కర్రీ పౌడర్‌ మిక్స్‌డ్‌ మసాలా పౌడర్‌ ఉన్నాయి.

ఎఫ్‌ఎస్‌ఏఐ అప్రమత్తం
ఆ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అన్నీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్‌ సేప్టీ కమిషనర్లు, రిజినల్‌ డైరెక్టర్లను అప్రమత్తం చేసింది. వెంటనే ఎవరెస్ట్‌, ఎమ్‌డీహెచ్‌ మసాల పొడుల శాంపిల్స్‌ కలెక్ట్‌ చేసి వాటిపై టెస్టులు చేయాలని ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు మహరాష్ట్ర, గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌లలో మసాల దినుసుల శాంపిల్స్‌ను కలెక్ట్‌ చేశారు.

ఇథిలీన్ ఆక్సైడ్‌ గురించి అన్వేషణ
పలు నివేదికల ప్రకారం.. అధికారులు మసాల దినుసుల శాంపిల్స్‌ను పరీక్షించారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో ఇథిలీన్ ఆక్సైడ్ కోసం నమూనాలను పరీక్షించారు.

28 ల్యాబ్‌ రిపోర్టులు
అయితే ఇప్పటివరకు 28 ల్యాబ్ రిపోర్టులు అందాయి. ఫుడ్ రెగ్యులేటర్‌ సైంటిఫిక్ ప్యానెల్ శాంపిల్స్‌ను విశ్లేషించగా వాటిలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనం లేదని తేలింది.

ఆ రెండు కంపెనీలకు క్లీన్‌ చిట్‌
అంతేకాదు ఇతర బ్రాండ్‌లకు చెందిన మరో 300 మసాలా శాంపిల్స్ పరీక్ష నివేదికలను కూడా విశ్లేషించింది. అయితే భారతీయ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమైనవని చూపిస్తూ క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థం ఆనవాళ్లు లేవని ఎమ్‌డీహెచ్‌, ఎవరెస్ట్‌లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

ఏడేళ్ల వయస్సులో కోడింగ్.. 16 ఏళ్ల వయస్సులోనే రూ.100 కోట్ల కంపెనీ.. అవస్థి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే

సాధారణంగా 16 సంవత్సరాల వయస్సు విద్యార్థులు అంటే పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్ చదవడంపై దృష్టి పెడుతూ ఉంటారు. 16 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్థినికి సొంతం గా కంపెనీ ఉందని చెబితే ఎవరూ కూడా నమ్మరు.

అయితే అవస్థి అనే విద్యార్థిని మాత్రం ఏడేళ్ల వయస్సులో కోడింగ్ నేర్చుకుని టెక్ పరిశ్రమలో అరుదైన ఘనతలను సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఏకంగా 100 కోట్ల రూపాయలు కావడం అవస్థి పూర్తి పేరు ప్రాంజలి అవస్థి( Pranjali Awasthi ) కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ విద్యార్థిని పేరు మారుమ్రోగుతోంది. డెల్వ్.ఏఐ ను ఆమె స్థాపించగా ఈ స్టార్టప్ గమనార్హం. ఈ సంస్థలో 10 కంటే ఎక్కువమంది ఉద్యోగులు పని చేస్తున్నారని భోగట్టా. 2022 సంవత్సరంలో ప్రాంజలి ఈ కంపెనీని స్థాపించారు.

తండ్రి ప్రోత్సాహం వల్లే ప్రాంజలి కెరీర్ పరంగా ఈ స్థాయిలో సక్సెస్ సాధించారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 11 సంవత్సరాల వయస్సులో ప్రాంజలి ఫ్యామిలీ భారత్ నుంచి ఫ్లోరిడా( Florida )కు మారింది. 13 సంవత్సరాల వయస్సులోనే ప్రాంజలి అవస్థి రీసెర్చ్ ల్యాబ్ లో ఇంటర్న్ షిప్ ద్వారా బిజినెస్ ప్రపంచంలో అడుగు పెట్టడం గమనార్హం. కరోనా సమయంలో ప్రాంజలి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ లపై దృష్టి పెడుతున్నారు. 3.7 కోట్ల రూపాయలతో ప్రారంభ నిధులను సేకరించి ప్రాంజలి కంపెనీని మొదలుపెట్టినా ఆమె కంపెనీ విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ప్రాంజలి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రాంజలి అవస్థి కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ప్రాంజలి అవస్థి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రాంజలి అవస్థి తల్లీదండ్రులను సైతం నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

Equity Funds: ఆ పథకాల్లో పెట్టుబడితో మీరే కింగ్‌లు.. మ్యూచువల్ ఫండ్స్‌లో టాప్ 5 ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ఇవే..!

ఇటీవల కాలంలో ఎస్ఐపీ మ్యూచువల్ ఫండ్స్ నిరంతర వృద్ధిని సాధిస్తున్నాయి. ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం ఏప్రిల్‌లో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు రూ. 20,371 కోట్ల ఇన్‌ఫ్లోలను నమోదు చేశాయి. ఇది రూ. 15,000 కోట్లకు పైగా ఇన్‌ఫ్లోలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత సంవత్సరంలో అత్యధిక రాబడిని అందించిన టాప్-5 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తెలుసుకుందాం.

ఎస్‌బీఐ పీఎస్‌యూ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్
ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ‘వెరీ హై రిస్క్’ రేటింగ్‌తో వస్తుంది. మే 2023, మే 2024 మధ్య గడిచిన ఒక సంవత్సరంలో ఈ ఫండ్ 99.50 శాతం రాబడిని ఇచ్చింది. దీని ప్రస్తుత నికర ఆస్తి విలువ యూనిట్ రూ. 34.50గా ఉంది. ఫండ్ పరిమాణం రూ. 2,352.22 కోట్లుగా ఉంది. పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ. 500తో తమ ఎస్ఐపీని ప్రారంభించవచ్చు.

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్
ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కూడా ‘వెరీ హై రిస్క్’ రేటింగ్‌తో వస్తుంది. మే 2023, మే 2024 మధ్య గడిచిన ఒక సంవత్సరంలో ఫండ్ 96.2 శాతం రాబడిని ఇచ్చింది. దీని ప్రస్తుత నికర ఆస్తి విలువ యూనిట్ రూ. 36.94గా ఉంది. ఫండ్ పరిమాణం రూ.4,115.15 కోట్లు. పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్‌లో నెలకు కేవలం రూ. 100తో తమ ఎస్ఐపీని ప్రారంభించవచ్చు.
రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఇలా..
Image
ముద్ర రుణంతో మారిన తలరాత.. వన్ షాట్‌తో లక్షాధికారి..
ఇన్వెస్కో ఇండియా పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్
ఈ థీమాటిక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కూడా ‘వెరీ హై రిస్క్’ రేటింగ్‌తో వస్తుంది. మే 2023, మే 2024 మధ్య గడిచిన ఒక సంవత్సరంలో, ఫండ్ 94.3 శాతం రాబడిని ఇచ్చింది. దీని ప్రస్తుత నికర ఆస్తి విలువ యూనిట్ రూ. 72.56గా ఉంది. ఫండ్ పరిమాణం రూ. 956.83 కోట్లుగా ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిదారులు తమ ఎస్ఐపీున నెలకు రూ. 500తో ప్రారంభించవచ్చు.

నిప్పాన్ ఇండియా పవర్ & ఇన్‌ఫ్రా ఫండ్ డైరెక్ట్ గ్రోత్
ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కూడా ‘వెరీ హై రిస్క్’ రేటింగ్‌తో వస్తుంది. మే 2023, మే 2024 మధ్య గడిచిన ఒక సంవత్సరంలో ఈ ఫండ్ 82 శాతం రాబడిని ఇచ్చింది. దీని ప్రస్తుత నికర ఆస్తి విలువ యూనిట్ రూ. 366.73గా ఉంది. ఫండ్ పరిమాణం రూ. 5,043.02 కోట్లుగా ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిదారులు నెలకు కేవలం రూ. 100తో తమ ఎస్ఐపీని ప్రారంభించవచ్చు.

క్వాంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్
ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కూడా ‘వెరీ హై రిస్క్’ రేటింగ్‌తో వస్తుంది. మే 2023, మే 2024 మధ్య గడిచిన ఒక సంవత్సరంలో ఈ ఫండ్ 80.6 శాతం రాబడిని ఇచ్చింది. దీని ప్రస్తుత నికర ఆస్తి విలువ యూనిట్‌కు రూ. 44.07గా ఉంది. ఫండ్ పరిమాణం రూ. 3,187.60 కోట్లుగా ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిదారులు తమ ఎస్ఐపీని నెలకు రూ. 1,000తో ప్రారంభించవచ్చు.

Personal Loan: ఈఎంఐ భారాన్ని అమాంతం తగ్గించే టిప్స్ ఇవి.. లోన్లు తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి..

పర్సనల్ లోన్లు ఇటీవల కాలంలో విరివిగా వినియోగిస్తున్నారు. ప్రజలు తమ అత్యవసర పరిస్థితుల్లో ఈజీగా ఈ రుణాలు పొందగలుగుతున్నారు. వీటి సాయంతో పిల్లల చదువులు, పెళ్లి ఖర్చులు, నగదు కొరత తీర్చుకుంటున్నారు. ఇది తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా నగదును అందిస్తుండటంతో వడ్డీ ఎక్కువైనా వీటిని అధికంగా వినియోగిస్తున్నారు. అయితే ప్రతి నెలా దాని ఈఎంఐని చెల్లించాల్సి వచ్చినప్పుడు అది భారం అవుతోంది. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈఎంఐ భారం కాకుండా.. ఎక్కువ కాలం ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

డౌన్ పేమెంట్‌గా చెల్లించండి..
మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తున్నట్లు అయితే ముందుగా డౌన్ పేమెంట్ అనేది చేయాలి. ఇది మీ లోన్ పై ఈఎంఐని తగ్గించడానికి దోహదపడుతుంది. అంతేకాక మీ రుణ మొత్తాన్ని కూడా తక్కువ చేస్తుంది. తద్వారా ఈఎంఐ భారం తగ్గుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 10 సంవత్సరాల కాలవ్యవధికి 11 శాతం వడ్డీ రేటుతో రూ. 10 లక్షల మొత్తాన్ని రుణంగా తీసుకుంటే.. 3 శాతం ప్రాసెసింగ్ ఫీజుతో 15 శాతం డౌన్‌పేమెంట్‌ను చెల్లిస్తే, ఈఎంఐ మొత్తం 11,708.75 వస్తుంది. అయితే, డౌన్ పేమెంట్ మొత్తాన్ని పెంచడం ద్వారా మీ ఈఎంఐ మొత్తం రూ. 9,642.50కి తగ్గుతుంది. మీరు బ్యాంకుకు తక్కువ వడ్డీని కూడా చెల్లించడం ముగుస్తుంది.

ఎక్కువ కాల వ్యవధి..
పర్సనల్ లోన్ మొత్తానికి లోన్ వ్యవధితో విలోమ సంబంధం ఉంటుంది. ఎక్కువ కాలం లోన్ కాలవ్యవధి ఎక్కువ కాలంగా విభజించబడినందున ఈఎంఐ తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ రుణగ్రహీతలు దీర్ఘకాలిక రుణంతో ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి రావచ్చు. ఎవరైనా వడ్డీపై డబ్బు ఆదా చేయాలనుకుంటే, ఎక్కువ మొత్తం ఈఎంఐలతో తక్కువ కాల వ్యవధిని ఎంచుకోవాలి.

స్టెప్-డౌన్ ఈఎంఐ ప్లాన్‌ని ఎంచుకోండి..
స్టెప్-డౌన్ ఈఎంఐ ప్లాన్‌లో, రుణగ్రహీత ఈఎంఐ చెల్లింపులు ఏటా తగ్గించబడతాయి. ఈ ప్లాన్‌లో, రుణం తీసుకున్న ప్రిన్సిపల్‌లో గణనీయమైన భాగాన్ని అలాగే రుణం వడ్డీ భాగాన్ని తిరిగి చెల్లించే వ్యవధిలో మొదటి కొన్ని సంవత్సరాలలో తప్పనిసరిగా తిరిగి చెల్లించాలి. అయితే, లోన్ వ్యవధి పొడిగించే కొద్దీ ఈఎంఐలు తగ్గుతాయి. ప్రిన్సిపల్‌ను గణనీయంగా తగ్గించడం ద్వారా, స్టెప్-డౌన్ ఈఎంఐ ఎంపిక రుణ చెల్లింపు భారాన్ని తగ్గిస్తుంది.

పార్ట్ ప్రీపేమెంట్..
సాధారణంగా 12 ఈఎంఐ రీపేమెంట్‌ల తర్వాత, రుణగ్రహీత గణనీయమైన మొత్తంలో లోన్‌ను చెల్లించిన తర్వాత చాలా మంది రుణదాతలు ఇచ్చే ఎంపిక ప్రీపేమెంట్. ఈ ప్రక్రియలో, రుణగ్రహీతలు లోన్‌లో గణనీయమైన భాగాన్ని చెల్లించాలి. బకాయి ఉన్న అసలు మొత్తం తగ్గినప్పుడు, వడ్డీ మొత్తం తగ్గుతుంది. ఫలితంగా ఈఎంఐ తగ్గుతుంది. పాక్షిక ప్రీపేమెంట్‌ను ఎంచుకోవడం ద్వారా, ఒకరు రుణ కాల వ్యవధిని అలాగే తక్కువ ఈఎంఐలను తగ్గించవచ్చు. అలాగే త్వరగా రుణ రహితంగా మారవచ్చు. ముందస్తు చెల్లింపుపై కొంత రుసుమును రుణదాతలు వసూలు చేస్తారు.

బ్యాలెన్స్ బ్యాంక్ బదిలీ..
బ్యాలెన్స్ బ్యాంక్ బదిలీ రుణగ్రహీతలు తమ బకాయి ఉన్న రుణ మొత్తాన్ని కొత్త రుణదాతకు బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. లోన్‌ను బదిలీ చేయడంతో పాటు, రుణగ్రహీత తక్కువ వడ్డీ రేటు, పొడిగించిన లోన్ రీపేమెంట్ కాలవ్యవధిని పొందవచ్చు. దీని వల్ల ఈఎంఐ తగ్గుతుంది. అయితే, ఎవరైనా ఈ సదుపాయాన్ని పొందాలని ఎంచుకుంటే, కొత్త రుణదాత అందించే తక్కువ వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకోకుండా, లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, లోన్ ఫోర్‌క్లోజర్ ఛార్జీలతో అనుబంధించబడిన ఖర్చులను లెక్కించాలని గుర్తుంచుకోండి.

Health Tips : మహిళలు దాల్చిన చెక్కను ఎందుకు తీసుకోవాలో తెలుసా? అస్సలు నమ్మలేరు..

Health Tips : మహిళలు దాల్చిన చెక్కను ఎందుకు తీసుకోవాలో తెలుసా? అస్సలు నమ్మలేరు..

మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన ఒకటి.. ఇది కేవలం వంటల్లో సువాసనలు పెంచడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా మహిళలకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. ఎలా తీసుకోవాలి? ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దాల్చిన చెక్క అనేది హార్మోన్లను నియంత్రించే గుణం ఉంటుంది. గర్భాశయంలో రక్తప్రవాహాన్ని పెంచి రుతుచక్రాన్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది.. పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్లు దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. కడుపు నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి..

ఇకపోతే పిసిఓఎస్ సమస్యతో బాధపడే స్త్రీలల్లో నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది. దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సెటివిటీ మెరుగుపడుతుంది…షుగర్ వ్యాధి నుంచి బయటపడవచ్చు.. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.. అంటే బరువును తగ్గించడంలో సహాయపడుతుంది..

గుండె పనితీరును మెరుగు పర్చడంలో ఇది బాగా సహాయపడుతుంది.. అంతేకాదు గుండె సమస్యల నుంచి బయట పడవేస్తుంది.. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. కడుపులో అసౌకర్యం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.. రోజు ఉదయం గ్లాస్ వేడి నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.. ఎన్నో సమస్యలకు దూరం కావచ్చు..

Viral Post: స్కూల్ వదిలేస్తాను- కానీ జుట్టు కత్తిరించుకోను..బాలుడి వింత పరిస్థితిపై తల్లిదండ్రుల ఆందోళన..కారణం ఏంటంటే..

మనం ఎక్కడ నివసిస్తున్నామో ఆ పరిసరాలకు అనుగుణంగా జీవించాలి. ఎందుకంటే, ఆయా ప్రాంతాలు, పరిసరాలను బట్టి దాని స్వంత నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు స్కూల్‌కు వెళుతున్నట్లయితే వారు ఆ స్కూల్‌ రూల్స్‌ పాటించాలి. పిల్లలు అలా చేయకపోతే తగిన శిక్ష ఉంటుంది. అలాంటి స్కూల్‌ రూల్స్‌ పట్టించుకోలేదనే కారణంగా ఓ పిల్లవాడిని స్కూల్‌ శిక్షించింది. అందుకు సంబంధించి కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ చిన్నారి కథ వైరల్ అవుతోంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పిల్లవాడి జుట్టు చాలా పొడవుగా ఉంది. అతడి అవతారం కారణంగా స్కూల్‌ డిసిప్లేన్ పాడుచేస్తుందని పాఠశాల నుండి బహిష్కరించారు. పిల్లవాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పినప్పటికీ స్కూల్‌ యజమాన్యం దీనిని వ్యాధిగా అంగీకరించడానికి సిద్ధంగా లేవు. ఆ విద్యార్థి 12 ఏళ్ల ఫరూక్ జేమ్స్. అతని జుట్టు మొత్తం అమ్మాయిలా కనిపిస్తుంది. అతనికి సమస్యగా మారింది. ఈ జుట్టు చాలా పెద్దగా ఉండటం వల్ల స్కూల్ యజామాన్యం నిరాకరించింది. కానీ, ఆ తల్లిదండ్రులు బాలుడి జుట్టును ఎందుకు కత్తిరించరు అనే ప్రశ్న సందేహం మీ మనస్సులో కూడా తలెత్తవచ్చు. దీని వెనుక తీవ్రమైన కారణం కూడా ఉంది.

జుట్టు కట్‌ చేస్తే ఫరూక్‌కు పట్టలేని భయం. దీని వెనుక తీవ్రమైన కారణం కూడా ఉంది. ఈ విషయమై ఫరూఖ్ తల్లి మాట్లాడుతూ.. డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం ఫరూఖ్‌ టాన్సురేఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దాంతో రోగి జుట్టు కత్తిరించుకోవాలంటే చాలా భయపడే పరిస్థితి నెలకొంది. పిల్లల తల్లిదండ్రులు ఈ భయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ ప్రపంచం అర్థం చేసుకోదు. దీనిపై పాఠశాల యాజమన్యం మాత్రం ఇది వ్యాధి కాదని సాకుగా చెబుతున్నారు.
తన బిడ్డ భయాన్ని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుకు జుట్టు అల్లి జడవేసి స్కూల్‌కి పంపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే పాఠశాల దీనికి అనుమతించలేదు. జుట్టు వల్ల అతను చాలాసార్లు పనిష్మెంట్‌కు గురయ్యాడు. ఇప్పుడు అతనికి పాఠశాల నుండి కూడా పంపిస్తారేమో అని భయం పట్టుకుంది. దాంతో తమ బిడ్డను ఎక్కడ చదివించాలో అర్థం కావడం లేదంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే, ఫరూక్ తన జుట్టు కారణంగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 లక్షల మందికి పైగా ఫరూక్‌ని వీక్షించారు.

Health Tips: వీటిని రోజుకు రెండు తీసుకుంటే చాలు.. ఒంట్లో కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది..

Health Tips: వీటిని రోజుకు రెండు తీసుకుంటే చాలు.. ఒంట్లో కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది..

అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అందుకే చాలా మంది బరువు తగ్గించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తుంటారు.. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. అలాంటి డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి అప్రికాట్.. దీన్ని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అప్రికాట్ గురించి అందరికి తెలుసు.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ముఖ్యంగా విటమిన్ ఎ, సిలు అధికంగా ఉంటాయి.. బీటా కెరోటిన్, లుటీన్, పోటాషియం, యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. అందుకే వీటిని రోజు మీ డైట్ లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. అంతేకాదు కండరాల సంకోచాన్ని తగ్గిస్తుంది.. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది..

హైబీపిని కంట్రోల్ చెయ్యడంలో ఇవి సహాయ పడతాయి.. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. ఇక వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది.. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.. దాంతో ఎక్కువసేపు తినకుండా ఉంటారు.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది.. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

Kidney Stones: ఈ చిట్కాలు పాటించండి.. కిడ్నీలో రాళ్లు సులభంగా తొలగిపోతాయి..!

Kidney Stones: ఈ చిట్కాలు పాటించండి.. కిడ్నీలో రాళ్లు సులభంగా తొలగిపోతాయి..!

Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. ఇది చాలామందిలో ఈ సమస్య కనిపిస్తుంది. కిడ్నీలో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్లేప్పుడు విపరీతమైన మంట వస్తూ ఉంటుంది. రాళ్ల పరిమాణం, సంఖ్యను బట్టి కిడ్నీలో రాళ్లు రావడానికి చాలా వారాలు, నెలలు పట్టవచ్చు. నీళ్లు తక్కువగా తాగడం, మాంసాహారం ఎక్కువగా తిన్నా, విటమిన్‌ బి6, సీ లోపం, విటమిన్‌ డి అధికంగా ఉన్నా, మద్యం ఎక్కువగా తాగేవారికి, ఆలస్యంగా భోజనం చేస్తున్నా.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. రాళ్ల పరిమాణం పెరిగి.. శస్త్రచికిత్సకు దారితీసే అవకాశం ఉంది. రాళ్లను కరిగించడానికి.. అనేక మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

కిడ్నీ స్టోన్ అనేది మూత్రంలో ఏర్పడే స్ఫటికాల నుంచి ఏర్పడే గట్టి పదార్థం. కాల్షియం స్టోన్స్ ఎక్కువగా కనిపించే మూత్రపిండాల్లో రాళ్లు, తర్వాత యూరిక్ యాసిడ్ రాళ్లు ఉంటాయి. కిడ్నీలో రాళ్లను తొలగించాలంటే ఏం చేయాలి? నీరు ఎక్కువగా తాగడం వల్ల చిన్న చిన్న రాళ్లు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే రాళ్లు ఎక్కువగా ఉన్నా, పెద్దవిగా ఉంటే తినడం, తాగడం వంటి వాటిపై మరింత శ్రద్ధ వహించాలి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ (NKF) ప్రకారం, మీరు మూత్రపిండాల తొలగింపు కోసం మందులతో పాటు క్రింది నివారణలను ప్రయత్నించాలి.

రోజుకు 3 లీటర్ల కంటే ఎక్కువ ద్రవాలు త్రాగాలి
రోజుకు కనీసం 2.5లీటర్ల ద్రవాలు తాగడం వల్ల మంచి మొత్తంలో మూత్రవిసర్జన జరుగుతుంది, ఇది రాళ్లను తొలగిస్తుంది.

అధిక ఆక్సలేట్ ఆహారాలకు దూరంగా ఉండండి
మీకు మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లయితే, బచ్చలికూర, అనేక బెర్రీలు, చాక్లెట్, గోధుమ ఊక, గింజలు, దుంపలు, టీ, రబర్బ్‌లను మీ ఆహారం నుండి పూర్తిగా తొలగించాలి. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లను ఏర్పరుస్తుంది.

కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి
కిడ్నీ రాళ్లు ఏర్పడిన పేషెంట్లు రోజూ వారి ఆహారంలో పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి. కాల్షియం తీసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవడం మానుకోండి
కాల్షియం అధికంగా తీసుకోవడం వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి. మీకు రాళ్లు ఉంటే, మీరు కాల్షియం సప్లిమెంట్లను తీసుకోకుండా ఉండాలి. కాల్షియం సప్లిమెంట్లను మీ వైద్యుడు, నమోదిత కిడ్నీ డైటీషియన్ ద్వారా వ్యక్తిగతీకరించాలి.

ప్రోటీన్ తగ్గించండి, ఉప్పు తీసుకోవడం నివారించండి
అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఎక్కువ కాల్షియాన్ని విసర్జించబడతాయి, ఇది మూత్రపిండాలలో ఎక్కువ రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది కాకుండా, సోడియం అధికంగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం పెరుగుతుంది, ఇది రాళ్ళు వచ్చే అవకాశాలను పెంచుతుంది. బీపీని నియంత్రించడానికి ఉప్పు తక్కువగా ఉండే ఆహారం కూడా ముఖ్యం.

విటమిన్ సి అధిక మోతాదులను తీసుకోవడం మానుకోండి..
మీరు ప్రతిరోజూ 60 mg విటమిన్ సి తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. రోజుకు 1000 mg లేదా అంతకంటే ఎక్కువ మోతాదులో విటమిన్‌ సి ఉంటే శరీరం మరింత ఆక్సలేట్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది రాళ్ల నిర్మాణానికి దారితీస్తుంది.

Bones Health : మీ ఎముకలు దృడంగా మారాలంటే ఈ ఒక్కటి తీసుకుంటే చాలు..

ఎముకలు దృడంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు.. సమ్మర్ లో విటమిన్ డి అవసరం చాలా అవసరం.. ఎండవేడికి ఢీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పక డైట్ లో చేర్చుకోవాలి.. అందులో ముఖ్యంగా పెరుగును అస్సలు మిస్ అవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.. పెరుగును సమ్మర్ లో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పెరుగులో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి.. పేగుల్లో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మొత్తం పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పెరుగును ప్రతి రోజూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..

పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.. అలాగే విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది.. ఆరోగ్యకరమైన ఎముకల కోసం కాల్షియం, విటమిన్ డి పోషకాలు అందేలా చూసుకోవడం ముఖ్యం.. అందుకే ప్రతి రోజూ మీ డైట్ లో పెరుగును యాడ్ చేసుకోవడం మంచిది..

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. హానికరమైన బ్యాక్టీరియా, వ్యాధికారకాల వృద్ధిని అడ్డుకుంటుంది. క్రమం తప్పకుండా ప్లెయిన్ యోగర్ట్‌ తింటే శరీర సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు. అంటువ్యాదులు రాకుండా చూస్తుంది..

పెరుగు చర్మానికి చాలా మంచిది.. ట్యాన్ అవ్వకుండా కాపాడుతుంది.. మొటిమల వాపును కూడా తగ్గించవచ్చు. డ్రై స్కిన్‌ని మృదువుగా మార్చుకోవచ్చు.. ఇంకా శరీరానికి కావలసిన ప్రోటీన్ లను అందిస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అందుకే మీ డైట్ లో రోజూ పెరుగును తీసుకోవడం మర్చిపోకండి..

Washing Fruits: పండ్లపై ఉండే రసాయణాలు తొలగాలంటే ఇలా చేయండి..

ప్రస్తుతం సహజంగా పండించే పండ్లు, కూరగాయలు చాలా తక్కువ. అన్ని పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు. వాటిని పండించే క్రమంలో వాటిపై పురుగు మందులు కొడుతుంటారు. వాటిని శుభ్రంగా కడిగి తినకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.
ఈ క్రిమిసంహారక మందులు తొలగేలా వాటిని ఇంట్లోనే ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం.. పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. సమతుల్య ఆహారం కోసం వీటిని కూడా తింటూ ఉండాలి. అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, మామిడిపండ్లు, జామకాయలు.. ఇలా అన్నింటినీ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. అయితే వీటన్నింటిని క్రిమిసంహారక మందుల ద్వారా పండించడం అధికమైంది కాబట్టి రసాయనాలు నిండిన పండ్లను అలాగే తింటే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

పండ్లు కొన్నాక వాటిని నేరుగా తినకూడదు. ఇంటికి తెచ్చాక కొంత సేపు వాటిని నీటిలో నాన బెట్టాలి. పండ్లు మునిగే వరకు నీటిలో వేసి నానబెట్టాలి. అరగంట పాటు అలా వదిలేయాలి. తర్వాత వాటిని చేతితో రుద్దుతూ… శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేస్తే వాటిపైనున్న పెస్టిసైడ్స్ పోయే అవకాశం ఉంది. రెండో పద్ధతి ఏమిటంటే.. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసి అందులో ఉప్పు వేసి బాగా కలపండి. ఆ నీటిలో పండ్లను వేసి అరగంట పాటు వదిలేయండి.
ఆ తర్వాత ఆ పండ్లను చేతితోనే శుభ్రంగా రుద్ది మరొకసారి కొళాయి కింద పెట్టి నీటిలో కడగండి. అలా కాకుండా స్టవ్ మీద గిన్నె పెట్టి నీరు వేసి మరిగించండి. కాస్త గోరువెచ్చగా అయినప్పుడు పండ్లను ఆ నీటిలో ఒక నిమిషం పాటు నానబెట్టండి. ఆ తర్వాత వెంటనే తీసి చల్లని నీటిలో వేయండి. వెనిగర్ పండ్లపై ఉన్న రసాయణాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నీటిలో రెండు చుక్కల వెనిగర్ వేసి బాగా కలపండి.
ఆ నీటిలో పండ్లను వేసి ఒక నిమిషం పాటు వదిలేయండి. ఆ తర్వాత వాటిని తీసి కొళాయి కింద పెట్టి చేత్తో రుద్ది కడగండి. ప్రతి ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది. పండ్లను కడిగేందుకు అది కూడా బాగా పనిచేస్తుంది. నీటిలో ఈ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి పండ్లను వేసి నానబెట్టాలి. ఆ తర్వాత ఆ పండ్లను తీసి కుళాయి కింద ఉన్న నీటిలో రుద్ది కడగాలి. ప్రస్తుతం మార్కెట్లో దొరికే పండ్లను తప్పకుండా కడిగే తినాలి. లేదంటే రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది.

మీరు ఇంటర్ పాసైతే చాలు.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో జాబ్ మీకోసమే !

డిగ్రీలు, పీజీలు చేసినా ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువగా ఉండటంతో పోటీ తీవ్రంగా ఉంది. ప్రైవేటు రంగంలోనూ ఇదే పరిస్థితి. మరియు మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నట్లయితే ఇది మంచి అవకాశం. ఇంటర్ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇంటర్ విద్యార్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం వస్తే మంచి జీతంతో దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది.

రక్షణ రంగంలో ఉద్యోగం సాధించాలని యువత కలలు కంటోంది. చాలామంది దీని కోసం సిద్ధమవుతారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిర్‌మెన్ గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మే 22 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.దీనికి సంబంధించిన రిక్రూట్‌మెంట్ ర్యాలీ చండీగఢ్‌లో జరగనుంది. భారత వైమానిక దళం జూలై 3 మరియు 12 మధ్య ఈ ర్యాలీని నిర్వహించనుంది.

అర్హత:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌మెన్ గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్ల వృత్తి విద్యా కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే.

వయో పరిమితి:

అభ్యర్థులు జూన్ 24, 2000 మరియు జూన్ 24, 2005 గడువు మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత పరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది.

Health Tips : పరగడుపున ఈ ఆహారాలను అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే?

రోజూ ఉదయం మనం తీసుకొనే ఆహారం ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.. రోజూ మొదలయ్యే సమయంలో బలమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినే ఆహారం మనల్ని రోజంతా ప్రభావితం చేస్తుంది.. కొవ్వు కలిగిన ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు.. అందుకే పరగడుపున కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోవద్దని నిపుణులు నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..

చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు.. కృత్రిమ రుచులు, రంగులతో కూడిన తృణధాన్యాలు తినడం మానుకోండి. వీటిని తినడం వల్ల కేలరీలు పెరుగుతాయి.. దాంతో బరువు పెరుగుతారు..

ఫ్రైస్, నూనెలో వేయించిన ఆహారాలను అస్సలు తీసుకోవడం మంచిది కాదు.. ఎందుకంటే సరిగ్గా జీర్ణం కాదు.. దాని వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

ఖాళీ కడుపుతో సిట్రస్ ఫ్రూట్స్ ను అస్సలు తీసుకోకూడదు.. మంచిది కాదని చెబుతున్నారు.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి..

ఉదయాన్నే కృత్రిమ రుచులు, స్వీటెనర్లతో కూడిన పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.. అలాగే జ్యుస్ లను తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. ఇంకా ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..

Weight Loss Drink: బరువు తగ్గాలనుకున్నారా.. ఉదయాన్నే ఇది తాగండి..!

చియా విత్తనాలు మన ఆరోగ్యకరానికి చాలా మంచిది. ఇవి తింటే శరీరం కూల్ గా ఉంటుంది. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయి. ఈ గింజలు పుదీనా కుటుంబానికి చెందిన సాల్వియా హిస్పానికమ్ నుండి వస్తాయి. వీటి రంగు ముదురు నలుపు రంగులో ఉంటాయి. చియా విత్తనాలు ప్రోటీన్ యొక్క పవర్‌హౌస్, అనేక ఇతర పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. చాలా మంది చియా విత్తనాలను తమ రోజువారీ ఆహారంలో భాగంగా వాడుతుంటారు. ఈ విత్తనాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..

సలాడ్‌లు, స్మూతీలు, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు, బ్రేక్‌ఫాస్ట్‌లలో ఎక్కువగా చియా సీడ్స్‌ను వేస్తారు. కానీ.. చియా గింజల నుంచి ప్రయోజనాలను పొందాలనుకుంటే.. చియా సీడ్ నీటిని తాగితే మంచిది. చియా గింజల నీటిని తాగితే.. శరీర బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వీటిల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా సమయం పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. ఎక్కువగా ఆకలి కాకుండా చేస్తుంది. అంతేకాకుండా.. శరీరంలో జీవక్రియను పెంచుతాయి.

చియా గింజల్లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం, ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇవి.. ఆరోగ్యకరమైన ప్రేగు, జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమవ్వడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది, ఇది అదనపు కేలరీలను బర్న్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇతర విటమిన్లు, ఖనిజాలు కూడా చియా విత్తనాలలో ఎక్కువగా ఉంటాయి. ఇనుము, కాల్షియం, విటమిన్ బి, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఫోలేట్ అధికంగా ఉంటాయి.

చియా విత్తనాలను తినడానికి ఒక సులభమైన మార్గం ఉంది. ఒక గ్లాసు చియా గింజల నీటిని తయారు చేయడానికి.. ఒక టీస్పూన్ చియా గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. కనీసం అరగంట సేపు నాననివ్వాలి. ఆ తరువాత.. నీటిని వడపోసి తాగాలి. చియా గింజల నీటి రుచి నచ్చకపోతే.. అందులో నిమ్మరసం, నారింజ రసం, నల్ల మిరియాలు, తేనెను కలిపి తాగవచ్చు. దీనిని ఉదయాన్నే తాగితే చాలా మంచిది.

ఊరిలో వింత మరణాలు.. వయసొచ్చిన అమ్మాయిలే టార్గెట్.. OTTని ఊపేస్తున్న థ్రిల్లర్!

ఊరిలో వింత మరణాలు.. వయసొచ్చిన అమ్మాయిలే టార్గెట్.. OTTని ఊపేస్తున్న థ్రిల్లర్!
ఓటీటీలోకి చాలానే సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో ఈ మధ్య ఎక్కువగా రివేంజ్, క్రైమ్, వైలెన్స్ ఉంటోంది. అయితే ఓటీటీ ఆడియన్స్ కూడా అలాంటి సినిమాలనే ఇష్టపడుతున్నారు. అందుకే ఓటీటీలో అలాంటి సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు అలాంటి ఒక సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. రావడం మాత్రమే కాకుండా.. ఓటీటీని ఊపేస్తోంది. కాకపోతే ఈ మూవీలో పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ లేకపోవడం వల్ల పెద్దగా ఆడియన్స్ కంట్లో పడలేదు. కానీ.. కథ పరంగా, నరేషన్ పరంగా, సీన్స్, ట్విస్టుల పరంగా మాత్రం చూసిన వాళ్లకి గట్టిగానే నచ్చేస్తోంది. మరి.. ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న సినిమా పేరు ‘కలియుగం పట్టణంలో’ పేరు కాస్త విచిత్రంగా ఉందని కంగారు పడకండి. ఆ టైటిల్ ని సినిమా కథకు యాప్ట్ అయ్యేలా అలా ప్లాన్ చేశారు. టైటిల్ చూశాక సినిమా కథ ఏంటో అర్థమయ్యే ఉంటుంది. అవును.. కలియుగంలో ప్రజలు, వారి జీవితాలు, ఆ వింత పోకడలు ఎలా ఉన్నాయి? అనే కోణంలో సాగే కథే ఇది. కాకపోతే ఇది వైలెన్స్, క్రైమ్ నేపథ్యంలో ఉంటుంది. సినిమా కథ మాత్రం కాస్త కొత్తగా ఉంటుంది. సినిమా చూసి నెక్ట్స్ సీన్ ఏంటో చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది. అంటే ఊహకు అందినట్లే ఉండి.. అందకుండా కథనం సాగుతుంది.

ఈ మూవీ చూడటానికి ఎంతో వింత కాన్సెప్ట్ అని అర్థమైపోతుంది. ఒక ఊరిలో జరిగే కొన్ని వింత మరణాల గురించి ప్రభుత్వం కూడా కలవర పెడుతూ ఉంటుంది. వయసుకొచ్చిన అమ్మాయిలు అనుమానాస్పదంగా చచ్చిపోతూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. దాని ఛేదించడానికి పోలీసులు కూడా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. నంద్యాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. అడవి, వింత మొక్కలు, ఔషధ మూలికలు అంటూ ఏవేవో జరుగుతూ ఉంటాయి. అసలు ఆ మూకలు ఏంటి? అవి సహజ మరణాలా? ఆత్మహత్యలా? హత్యలా? ఎవరికీ అర్థం కాదు. మరోవైపు హీరోకి ఒక ప్రేమకథ ఉంటుంది. ఆ కష్టం హీరోయిన్ దాకా వస్తుంది.

ఇలాంటి ఒక క్రేజీ మలుపులు, ట్విస్టులతో టాలీవుడ్ లో అయితే ఒక సినిమా ఇంతవరకు రాలేదు. పైగా ఇందులో తల్లీకొడుకు సెంటిమెంట్, కొడుకూ తండ్రి సెంటిమెంట్, ప్రేమ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ని అంతే బాగా చూపించారు కూడా. ఈ కలియుగం పట్టణంలో సినిమాని గట్టిగానే ప్లాన్ చేశారు అనిపిస్తోంది. ఈ కలియుగం పట్టణంలో సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలాంటి క్రేజీ కథలు చూసే అలవాటు ఉంటే మాత్రం మీకు తప్పకుండా నచ్చేస్తుంది.

Sleep:ప్రతిరోజు ఎంతసేపు నిద్రపోవాలి.. డాక్టర్స్ చెబుతున్నది కూడా ఇదే..? తప్పక తెలుసుకోండి

Sleep:సాధారణంగా చాలా మంది పొద్దస్తమానం నిద్రపోతుంటారు. మరికొందరు వేళాపాళా లేకుండా నిద్రిస్తుంటారు. ఇంకొందరు సమయం దొరికితో చాలు.. పడక ఎక్కుతుంటారు. అసలు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి. మనిషి శరీరానికి ఎన్ని గంటల నిద్రసరిపోతుంది.

ఎన్ని గంటలు నిద్రపోతే మనిషి శరీరానికి అలసట అనేది లేకుండా ఉంటుంది అనే అంశాలపై వైద్యులను సంప్రదిస్తే, వైద్యుల అభిప్రాయం మేరకు.. రోజులో మనిషికి ఏడు గంటల ప్రశాంతమైన నిద్ర కావాలని చెబుతున్నారు. నిద్ర అంతకన్నా ఎక్కువైనా.. తక్కవైనా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధనలో వెల్లడించారు.

అంతేకాదు, నిద్ర హెచ్చు తగ్గుల కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అమెరాకాలోని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీకి చెందిన భారతీయ శాస్త్రవేత్త అనూప్ శంకర్ బృందం నిద్రపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాలోని 30,000 మంది పెద్దవారిపై 2005లో వారు ఈ అధ్యయనం నిర్వహించారు.

ఈ పరిశోధనలో రోజుకి ఏడు గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే తొమ్మిది గంటలకుపైగా నిద్రపోయే వారికి గుండె సంబంధింత సమస్యలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నట్లు వారు తెలిపారు. ఎవరైతే ఐదు గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రించే 60ఏళ్ళ వయస్సు ఉన్న వారిలో ఈ సమస్యలు మూడింతలు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.

ఈ పరిశోధన ప్రకారం, తక్కువ సమయం నిద్రించేవారు యాంగినా (శ్వాస ఆడకపోవటం) వంటి సమస్యతో, అలాగే ఎక్కువ లేదా తక్కువ సమయం నిద్రించేవారు గుండెపోటు, పక్షవాతం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

అయితే.. వయస్సు, స్త్రీ, పురుషులు, పొగ తాగేవారు, మద్యపాన ప్రియులు, బక్కపలచనివారు, ఊబకాయులు ఇలా అందరి విషయాల్లోనూ ఈ ఫలితాల ఒకే రకంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

ఫుడ్ తీసుకునే ముందు వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఇన్ని లాభాలా..?

ఆహారం తీసుకునేముందు ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కువ నీరు తీసుకోవడం ద్వారా ఆహారం తీసుకునే మోతాదు తగ్గుతుంది. క్యారెట్లు, కీరదోస ముక్కలు వంటివి తినడం ద్వారా ఒబిసిటీ దూరం చేసుకోవచ్చు.

జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు ఆఫీసులో ఉంచుకోవాలి. ఏమీ తినకుండా వచ్చిన రోజు వాటిని తింటే శక్తి లభిస్తుంది. లేదంటే ఆకలి వల్ల మెదడు పని తీరు సన్నగిల్లుతుంది. పనిమీద ఏకాగ్రత ఉండదు. రోజంతా ఆ ప్రభావం ఉంటుంది.

అల్పాహారం తీసుకోనప్పుడు రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే టైప్2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంది.

ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల బయటి ఆహారం మీదకు మనసు లాగుతుంది. అలా బయట తిండికి అలవాటు పడితే త్వరగా బరువు పెరిగే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Blackheads:బ్లాక్ హెడ్స్ ఒక్క రోజులో మాయం అవ్వాలంటే…బెస్ట్ టిప్స్

Blackheads Remove Tips:ముఖాన్ని అందవిహీనంగా మార్చేవాటిలో బ్లాక్‌హెడ్స్ ప్రధానమైనవి. సెబాషియస్ అనే గ్రంథి నూనె పదార్థాన్ని(సెబమ్) అధికంగా విడుదల చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్ ఎక్కువైనా ఈ సమస్య వస్తుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే వీటిని నివారించుకోవడమే కాకుండా అందాన్ని కాపాడుకోవచ్చు.

1. గంధపు చెక్క పొడికి రోజ్‌వాటర్ కలిపి ఆ పేస్ట్‌తో ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ తగ్గడంతోపాటు చర్మం చల్లగా ఉంటుంది.
2. నాలుగు టేబుల్ స్పూన్ల బేకింగ్‌సోడాకు ఒక టీ స్పూన్ డెడ్‌ సీ సాల్ట్, రెండు స్పూన్ల నీటిని కలుపుకోవాలి. దీంతో చర్మాన్ని రుద్దుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
3. ఓట్‌మీల్ పౌడర్‌కు రోజ్‌వాటర్ కలుపుకుని ఆ పేస్ట్‌ను వేళ్లతో ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
4. సాధారణ చర్మతత్వం ఉన్నవారు ముల్తానీ మట్టికి రోజ్ వాటర్ కలుపుకుని చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల బ్లాక్‌హెడ్స్ తగ్గిపోవడమే కాకుండా చర్మం నున్నగా అవుతుంది.
5. మెంతి ఆకులను పేస్ట్‌లా దాన్ని చర్మంపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
6. పెరుగులో నల్లమిరియాల పొడివేసి బాగా కలిపి దాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
7. తాజా కొత్తిమీర ఆకుల నుంచి తీసిన రసం ఓ టేబుల్‌స్పూన్, పసుపు అర టీ స్పూన్ తీసుకుని ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు రాసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే కడుక్కోవాలి. ఇలా ఓ వారం చేస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి.
8. ద్రాక్షపండ్ల గుజ్జును బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Hair Fall:జుట్టు ఊడిపోతుందా….. నో ప్రోబ్లం…ఈ టిప్స్ ఫాలో అయితే సరి

HAir Fall Home Remedies:జుట్టు మన అందాన్ని రెట్టింపు చేస్తుందన్న విషయాన్నీ అందరు అంగీకరించాలి. అందమైన జుట్టును సొంతం చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జుట్టును ఎంత జాగ్రత్తగా చూసుకున్న,ఎంత పోషణ చేసిన ఊడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. జుట్టు అలా ఊడిపోకుండా ఉండాలంటే ఈ క్రింది చిట్కాలను పాటించండి.

1. ఉసిరికాయను ముక్కముక్కలుగా చేసుకొని బాగా ఎండబెట్టాలి. ఎండిన ఈ ముక్కలను కొబ్బరి నూనెలో వేడి చేసి ఒక రాత్రి అంతా ఉసిరి ముక్కలను నూనెలో ఉంచాలి. మరుసటి రోజు ఆ ముక్కలను తీసి వేసి ఆ నూనెను తలకు రాసుకోవాలి. ఈ నూనెను క్రమం తప్పకుండా రాసుకుంటే జుట్టు ఊడిపోవటం అనేది తగ్గి జుట్టు వత్తుగా,బలంగా,పొడవుగా పెరుగుతుంది.
2. ప్రతి రోజు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి రాసుకుంటే మంచి నిగారింపు వచ్చు జుట్టు ఊడటం క్రమేపి తగ్గుతుంది.
3. కొత్తిమీర రసాన్ని తలకు పట్టించి ఒక అరగంట అయిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఊడ టాన్ని నిరోదించవచ్చు.
4. నిమ్మకాయ గింజలు,మిరియాలు కలిపి ముద్దగా చేసుకొని తలకు బాగా పట్టించి బాగా అరిన తర్వాత తలస్నానం చేయాలి.
5. పెసలు ఉడికించి ముద్దగా చేసి దానిలో మెంతులపొడి కలిపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.
6. వంద గ్రాముల పెరుగులో ఒక గ్రాము మిరియాల పొడి కలిపి తలకు బాగా అప్ట్టించి ఆరిన తర్వాత స్నానం చేయాలి.
7. ప్రతి రోజు బాదం నూనెతో జుట్టు కుదుళ్ళ నుండి రెండు మూడు సార్లు మర్దన చేయాలి. ఈ విధంగా చేయుట వలన జుట్టు ఊడటం కొంతవరకు తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Gemstone Astrology:జన్మ రాశిని బట్టి ఏ రత్నం ధరించాలో మీకు తెలుసా ?

Gemstone Astrology:రత్నాలను కొందరు వారి అభీష్టానికి అనుగుణంగా ధరిస్తారు. లేదా వారి కామ్యాన్ని (కోరికని) బట్టి ధరిస్తుంటారు. అలాకాకుండా మీ జన్మరాశికి ఎటువంటి రత్నము ధరించడం మంచిదో తెలుసుకుని ధరిస్తే దానివలన విశేష ఫలితాలను పొందవచ్చును.

1. మేషం మరియు వృశ్చిక రాశుల వారికీ
మేషం మరియు వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు. వీరు పగడాన్ని ధరించడం శ్రేయస్కరం.

2. వృషభ మరియు తుల రాశుల వారికి
వృషభ మరియు తుల రాశులకు అధిపతి శుక్రుడు. వీరు పూర్తిగా తెలుపు లేకుండా లేత గోధుమ రంగులోని ముత్యాలను గానీ, వజ్రాన్నిగానీ ధరించవచ్చు.

3. మిథున మరియు కన్యారాశుల వారికి
మిథున మరియు కన్యారాశులకు అధిపతి బుధుడు. వీరు పచ్చను ధరించడం వలన మేలుకలుగుతుంది.

4. కర్కాటక రాశి వారికి
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. వీరు మంచి ముత్యాలను ధరించడం శ్రేయస్కరం.

5. సింహరాశి వారికి
సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశివారు మాణిక్యాన్ని ధరించడం మంచిది.

6. ధనూ రాశి మరియు మీనరాశుల వారికి
ధనూ రాశి మరియు మీనరాశులకు అధిపతి గురువు. ఈ రాశివారు పుష్యరాగాన్ని ధరించడం మేలుచేస్తుంది.

7. మకర కుంభ రాశుల వారికి
మకర కుంభ రాశులకు అధిపతి శని. వారు నీలాన్ని ధరించడం వలన శుభాలను పొందగలరు.

ఇవి కాకుండా ప్రతి రాశివారికీ ఆ సమయం లో గ్రహగతులనుబట్టి, స్థానాధిపతులు మారుతారు. ఇందు కొరకు జన్మకుండలిని, నవాంశను బట్టి జ్యోతిష్యులు రత్నాలను సూచిస్తారు. పైన చెప్పబడిన రత్నాల వివరాలు జన్మ రాశులను బట్టి చెప్పబడ్డాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Almonds Benefits:బాదం తినే విషయంలో 99 % మంది చేసే ఈ పొరపాటుని మీరు అసలు చేయకండి

Almonds Benefits In Telugu :బాదం పప్పు తినటం వలన అందం ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ప్రతి రోజు నాలుగు బాదంపప్పులను తినటం వలన శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులను తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు.

బాదం తినని వారు కూడా ఈ వీడియో చూసి తినటం అలవాటు చేసుకుంటారు. బాదం పప్పులో విటమిన్ ఇ, కొవ్వు, పీచు పదార్థాలు, యాంటి ఆక్సిడెంట్ గుణాలున్న ఫ్లెవనాయిడ్లు,మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌, పొటాషియం,సోడియం, మెగ్నీషియం, క్యాల్షియం,ఐరన్ సమృద్ధిగా ఉంటాయి.

ఇన్ని పోషకాలు ఉన్నా బాదంను ప్రతి రోజు తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం.ప్రతి రోజు బాదం పప్పులను తినటం వలన శరీరానికి అవసరమైన మంచి కొవ్వును పెంచి శరీరానికి హాని కలిగించే చెడు కొవ్వును తగ్గిస్తుంది. బాదంలో కాల్షియమ్, మేగ్నేషియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు,దంతాలు బలంగా ఉంటాయి.

ఈ పోషకాలు లోపం కారణంగా ఆస్టియో ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల మహిళలు తప్పనిసరిగా ప్రతి రోజు బాదం పప్పును తింటే ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు.బాదంలో విటమిన్ ‘E’ సమృద్ధిగా ఉండుట వలన యాంటీ -ఆక్సిడెంట్’గా పనిచేసి సూర్యరశ్మి కారణంగా వచ్చే చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉండుట వలన చర్మాన్ని హైడ్రేడ్ గాను,మృదువుగాను ఉంచుతుంది.

బాదంలో విటమిన్ ‘D’ మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉండుట వలన అనేక రకాల కాస్మోటిక్స్ తయారీలలో వాడుతున్నారు. శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే జుట్టు రాలిపోతుంది. అందువల్ల ప్రతి రోజు బాదం పప్పులను తినటం వలన జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.భోజనం చేయటానికి ముందు బాదం పప్పులను తినటం వలన బాదంలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించి తక్కువ ఆహారం తీసుకొనేలా చేస్తుంది. దాంతో బరువు కూడా తగ్గుతారు.

గర్భిణీ స్త్రీలకు బాదాం చాలా బాగా సహాయాపడుతుంది. బాదంలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండుట వలన ప్రసవ సమయంలో వచ్చే ఇబ్భందులను తగ్గిస్తుంది. అలాగే కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి బాగా సహాయాపడుతుంది.బాదంలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. బాదం తినేపుడు ఎక్కువగా నీరు తాగటం వల్ల, అది జీర్ణక్రియ రేటును పెంచుతుంది.

పేగుల కదలికలకు, సరిపోయే మోత్తంలో అంటే 4 బాదం తింటే సరిపోతుంది.బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

మధుమేహంతో బాధపడేవారు భోజనం తరువాత బాదంను తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్నిపెంచుతుంది. తద్వారా శరీరానికి అవసరమైన ఇన్సులిన్‌ ఉత్పత్తి జరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

AC: ఏసీలో టన్ను అంటే ఏంటో తెలుసా?..చాలామందికి తెలియని సమాధానం ఇదే

What is ton in air conditioner: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల కంటే ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏసీలను కొనుగోలు చేసేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

సాధారణంగా 1, 1.5 లేదా 2 టన్నుల ACలు ఇళ్లలో అమర్చబడి ఉంటాయి. అయితే ఏసీలో టన్ను అంటే ఏమిటి? చాలా కొద్ది మంది మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరు. ఇది ఏసీలో ఉండే గ్యాస్‌ని కొలుస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఎయిర్ కండీషనర్‌కు(AC)సంబంధించి టన్ను(Ton)అంటే అది గది నుండి విసిరే వేడి మొత్తం. ఒక గంటలో గది నుండి AC ఎంత వేడిని తొలగించగలదో టన్నులలో కొలుస్తారు

12000 BTUని 1 టన్ను అంటారు. BTU అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్. ఇది AC శీతలీకరణ సామర్థ్యాన్ని కొలవడానికి ఒక యూనిట్. 1 టన్ను AC 12000 BTU. 1.5 టన్నుల AC 18000 BTU. అయితే 2 టన్నుల AC 24000 BTU.గది చిన్నగా ఉంటే ఒక టన్ను ఏసీ సరిపోతుంది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 150 చదరపు అడుగుల గదిలో 1 టన్ను AC బాగా పని చేస్తుంది. 200 చదరపు అడుగుల గదికి 1.5 టన్నుల వరకు ఉండే ఏసీ సరిపోతుంది.

ఏవి ప్రభావితం చేస్తాయి?

ACఎంత ఎక్కువ ఉంటే, గది చల్లగా ఉంటుంది. అయితే గది పరిమాణం, ఇన్సులేషన్, పైకప్పు ఎత్తు, విండో పరిమాణం AC శీతలీకరణ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు.

AC ఎలా పని చేస్తుంది?

ఏసీ మొదట గదిలోని వేడి గాలిని లోపలికి తీసుకుంటుంది. దీని తర్వాత, శీతలీకరణ కాయిల్స్ శీతలకరణిని ఉపయోగించి వేడి, తేమను తొలగిస్తాయి. ఏసీలో అమర్చిన బ్లోవర్ ఆవిరిపోరేటర్‌పై గాలిని తిప్పుతుంది, తద్వారా అది చల్లబడుతుంది. ఇప్పుడు వేడి కాయిల్ సేకరించిన వేడిని బయటి గాలితో కలుపుతుంది. కంప్రెసర్ ఇండోర్ గాలిని చల్లబరచడానికి ఆవిరిపోరేటర్, కండెన్సర్ మధ్య కదులుతుంది. దీని తర్వాత, ఒక ఫ్యాన్ కండెన్సర్‌పై నడుస్తుంది, తద్వారా వేడి క్రమంగా పోతుంది. దీని తర్వాత ఫిల్టర్లు గాలిలోని చిన్న కణాలను తొలగిస్తాయి. చివరగా, థర్మోస్టాట్ ఎంత చల్లటి గాలిని వదలాలో చెక్ చేస్తుంది.

బుల్లెట్ కొనడం కన్నా ఈ కారు కొనడం బెస్ట్ ఏమో.. తక్కువ ధరలోనే మంచి మైలేజి, సేఫ్టీ

మారుతీ సుజుకి కంపెనీ కార్ల మాదిరిగానే టాటా మోటార్స్ కంపెనీ కార్లు కూడా మైలేజీ విషయంలో మంచి పేరును సంపాదించుకోవడం ప్రారంభించాయి. టాటా మోటార్స్ నుంచి బెస్ట్ మైలేజ్ కారు గురించి మాట్లాడినట్లయితే..

దాని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది, బలమైన సేఫ్టీ ఫీచర్స్ ని కూడా కలిగి ఉంది. విశేషమేమిటంటే దీని రన్నింగ్ కాస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ఏ 350సీసీ బైక్ కంటే తక్కువ. అంటే పెట్రోల్ ఖర్చులో కూడా చాలా ఆదా అవుతుంది. మనం మాట్లాడుకుంటున్న కారు.. టాటా యొక్క టియాగో సిఎన్‌జి (tata tiago cng). Tiago iCNG ను పెట్రోల్, CNG రెండింటిలోనూ కొనుగోలు చేయవచ్చు. కాబట్టి బుల్లెట్ కంటే ఈ కారు నడపడం ఎంత పొదుపుగా ఉంటుందో తెలుసుకుందాం.

మైలేజీ అద్భుతం

సాధారణంగా బుల్లెట్ 350 మైలేజ్ ట్రాఫిక్‌లో లీటరుకు 24-25 కిలోమీటర్లు. అంటే ఈ బైక్ 25 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఒక లీటర్ పెట్రోల్ ఖర్చవుతుంది. టాటా టియాగో iCNG కారు CNG మోడ్‌లో 28.06 km/kg వరకు మైలేజీని ఇస్తుంది. అయితే పెట్రోల్‌లో దీని మైలేజ్ లీటరుకి 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మైలేజీలో మాత్రమే కాదు, ఈ కారు చాలా విషయాలలో సారూప్య ధరల వాహనాల కంటే మెరుగ్గా ఉంది.

4 స్టార్ సేఫ్టీ రేటింగ్

దీని సెగ్మెంట్, ధరలో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ (tata tiago safety rating)కలిగిన మొదటి కారు ఇదే. దేశంలోనే అత్యంత సురక్షితమైన సరసమైన హ్యాచ్‌బ్యాక్ ఇదే. రెండు స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, EBDతో కూడిన ABS,కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారు అన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్, ట్రాన్స్మిషన్

టాటా టియాగో 1.2 లీటర్ ఆశించిన పెట్రోల్ ఇంజన్‌ను CNG ఆప్షన్ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ CNG మోడ్‌లో 73.5 bhp పవర్ ని, 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పరిచయం చేయబడిన మొదటి CNG కారు ఇదే.

ధర కూడా బడ్జెట్‌లోనే

టాటా టియాగో ధర రూ. 5.65 లక్షల నుండి మొదలై రూ. 8.90 లక్షల వరకు ఉంటుంది. దేశంలోని ప్రతి మూలలో టాటా మోటార్స్ అధికారిక సర్వీస్ సెటర్స్ ఉన్నాయి, దీని కారణంగా మీరు దాని సర్వీసింగ్‌లో ఎటువంటి సమస్యను ఎదుర్కోరు. మార్కెట్‌లో ఇది మారుతి సెలెరియో, వ్యాగన్ ఆర్, సిట్రోయెన్ సి3తో పోటీపడుతుంది.

piles Home Remedies:పైల్స్ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే చాలు.శాశ్వతంగా మాయం అవుతాయి

Piles Home Remedies In telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు,నీరు తక్కువగా తాగటం,మలబద్దకం సమస్య,ఒత్తిడి వంటి కారణాలతో పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

పైల్స్ సమస్య ఉన్నప్పుడు బాధ విపరీతంగా ఉంటుంది.

ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ సమస్య పరిష్కారానికి వాము ఎంతగానో సహాయపడుతుంది.

వాము ను తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక గ్లాసు పలుచని మజ్జిగ తీసుకొని దానిలో పావు స్పూన్ నల్ల ఉప్పు, పావు స్పూన్ వాముపొడి వేసి బాగా కలపాలి. ఈ మజ్జిగను ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగుతూ ఉండాలి. ఫైల్స్ సమస్య తగ్గే వరకు ఈ విధంగా తాగుతూ ఉండాలి.

మసాలాలు, కారాలు చాలా తక్కువగా తీసుకోవాలి. అధిక ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేస్తూ ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించాలి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది.

నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి ఫైల్స్ బారిన పడకుండా ఉంటాం. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడూ అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ ఇచ్చిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పిన్ చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి పైల్స్ సమస్య ఉన్నవారు ఈ చిట్కాను ఫాలో అవ్వండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Mobile Phone: మహిళలు ఫోన్ ను ఎక్కువ ఉపయోగిస్తున్నారా? అయితే అంతే సంగతులు..

Mobile Phone: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అరచేతిలో ఫోన్ తో ప్రపంచాన్ని చూస్తున్నారు. ఫోన్ చాలా అలవాటుగా మారింది కూడా. తినడం, పడుకోవడం, నీరు త్రాగడం మాదిరి ప్రాథమిక అవసరంగా మారిపోయింది ఫోన్.

చిన్నా.. పెద్ద..అనే తేడా లేకుండా ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వల్ల మన జీవన విధానం ఎంత సౌకర్యవంతంగా మారిందో, దాని వల్ల అంతే స్థాయిలో చెడు కూడా జరుగుతుంది. అధిక సమయం మొబైల్ వాడటం వల్ల తెలియకుండా చాలా జబ్బుల బారిన పడుతున్నారు.

విరామం లేకుండా మొబైల్ వాడుతుంటారు కొందరు. దీన్ని మొబైల్ అడిక్షన్ అంటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రస్తుతం అన్ని వయసుల వారు దీని బారిన పడుతున్నారు. మొబైల్ ఫోన్లకు పిల్లలే కాదు, ఇంట్లోని పెద్దలు కూడా అతుక్కుపోతున్నారు. మరి ఇలా చేయడం వల్ల ఏం నష్టం ఉందో తెలుసా? ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చొని మొబైల్ ఉపయోగిస్తే, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో మహిళలు గర్భాశయ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మొబైల్ అడిక్షన్ వల్ల గర్భాశయ ఎముకలకు సంబంధించిన సమస్య తలెత్తుతుంది అంటున్నారు నిపుణులు. దీనివల్ల తరచూ భుజాలు, మెడ, తలలో నొప్పితోపాటు దిగువ వీపుకు ఇది వ్యాపించే అవకాశం ఉందట. గర్భాశయ నొప్పి కొన్నిసార్లు విపరీతంగా రావడం వల్ల లేవడం, కూర్చోవడం, పని చేయడం కూడా కష్టంగా మారే అవకాశం ఉంది. గర్భాశయ సమస్యల వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ గంటల తరబడి ఫోన్ చూడటం కూడా పెద్ద సమస్య అంటున్నారు నిపుణులు.

ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు రిలాక్స్డ్ మోడ్‌లోకి వెళతుంటారు. దాని కారణంగా వారి శరీర పటుత్వం కోల్పోతారు. ఇలాగే కొనసాగితే మహిళల్లో సంతానలేమి సమస్యలు తలెత్తుతాయట. మెడ కదిలేటప్పుడు నొప్పి చేతులలో నొప్పి వెనుకభాగంలో బిగుతుగా అనిపించడం అదేపనిగా తలనొప్పి రావడం భుజాలు నొప్పి వంటివి గర్భాశయ సమస్యకు లక్షణాలు. అందుకే ఫోన్ ను ఉపయోగించడం చాలా తక్కువ చేయాలి అంటున్నారు నిపుణులు.

RCB vs RR: కోహ్లీ క్రేజీ రికార్డ్.. IPL హిస్టరీలో ఏకైక మొనగాడిగా అరుదైన ఘనత!

కోహ్లీ క్రేజీ రికార్డ్.. IPL హిస్టరీలో ఏకైక మొనగాడిగా అరుదైన ఘనత!

ఐపీఎల్-2024లో భీకర ఫామ్​లో ఉన్నాడు కింగ్ కోహ్లీ. అతడు కంటిన్యూస్​గా రన్స్ చేయడం వల్లే ఆర్సీబీ వరుస విజయాలు సాధిస్తోంది. అదే ఫామ్​ను రాజస్థాన్​ రాయల్స్​తో జరుగుతున్న ఎలిమినేటర్​లోనూ కొనసాగిస్తున్నాడు విరాట్. ఈ మ్యాచ్​లో బెంగళూరు బ్యాటింగ్​ను లీడ్ చేస్తున్నాడు కోహ్లీ. ఇప్పటిదాకా ఆడిన 22 బంతుల్లో 3 బౌండరీలు, ఓ సిక్స్ సాయంతో 33 పరుగులతో నాటౌట్​గా ఉన్నాడు. రాజస్థాన్​తో మ్యాచ్​తో అరుదైన ఘనతను అందుకున్నాడు కింగ్.

రాజస్థాన్ మ్యాచ్​తో 8 వేల పరుగుల క్లబ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు కోహ్లీ. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఈ ఫీట్ నమోదు చేసిన ఏకైక మొనగాడిగా నిలిచాడు. 8 వేల పరుగులు పూర్తి చేయడానికి విరాట్​కు 252 మ్యాచులు పట్టింది. క్యాష్​ రిచ్ లీగ్​లో అత్యధిక పరుగులు బాదిన వారిలో అతడే ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు. కోహ్లీ తర్వాత స్థానాల్లో శిఖర్ ధావన్ (6769), రోహిత్ శర్మ (6628), డేవిడ్ వార్నర్ (6565), సురేష్ రైనా (5528) ఉన్నారు.

చాహల్ రేర్ ఫీట్.. IPL హిస్టరీలో ఏ బౌలర్​కూ సాధ్యం కాని రికార్డు!

చాహల్ రేర్ ఫీట్.. IPL హిస్టరీలో ఏ బౌలర్​కూ సాధ్యం కాని రికార్డు!

ఐపీఎల్-2024 ఆసాంతం అద్భుతమైన బౌలింగ్​తో అదరగొట్టాడు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. మణికట్టు మాయాజాలంతో రాజస్థాన్ రాయల్స్​ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రవిచంద్రన్ అశ్విన్​తో కలసి ప్రత్యర్థి జట్ల పనిపట్టాడు. ఆర్సీబీతో జరుగుతున్న ఎలిమినేటర్​లోనూ అతడు తన మ్యాజిక్​ను కంటిన్యూ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ (33)ను వెనక్కి పంపాడు చాహల్. ఈ వికెట్​తో అతడు చరిత్ర సృష్టించాడు.

యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ హిస్టరీలో ఏ బౌలర్​కూ సాధ్యం కాని రికార్డును అతడు క్రియేట్ చేశాడు. కోహ్లీని ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్​ (66 వికెట్లు)గా అవతరించాడు చాహల్. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఆర్సీబీకి కూడా ఇంకా అతడే హయ్యెస్ట్ వికెట్ టేకర్ (139 వికెట్లు)​గా ఉన్నాడు. ఇలా ఐపీఎల్​లో రెండు జట్ల తరఫున టాప్ వికెట్ టేకర్​గా నిలిచిన ఒకే ఒక బౌలర్​గా చాహల్ రేర్ ఫీట్ నమోదు చేశాడు.

Health

సినిమా