Saturday, November 16, 2024

Maruti Suzuki Swift 2024: కళ్లు చెదిరే ఫీచర్లు.. అతి తక్కువ ధరతో మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త లుక్ చూశారా?

Maruti Suzuki Swift 2024: మీరు కూడా కారు కొనాలనే యోచనలో ఉన్నారా?? అయితే మీకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లతో మారుతి స్విఫ్ట్ న్యూ వేరియంట్ వచ్చేసింది.. మారుతి సుజుకీ స్విఫ్ట్ నాల్గవ తరం మోడల్ ను విడుదల చేసింది. అంతేకాదండోయ్ దీని ధర కేవలం రూ.6.50 లక్షల నుంచి ప్రారంభం కావడం విశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం.. అసలు ఆ కారు ఎలా ఉండనుంది? అందులో ఉన్న అత్యాధునిక ఫీచర్లు ఏంటి అనేది తెలుసుకుందాం.

దేశంలో అత్యధికంగా ఆదరణ పొందిన హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో మారుతి సుజుకీ స్విఫ్ట్ ఒకటన్న సంగతి తెలిసిందే. దీని 2024 అప్ డేటెడ్ వెర్షన్ రిలీజ్ అయింది. డిజైన్ లో పెద్దగా మార్పులు లేనప్పటికీ ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉన్నాయని తెలుస్తోంది. స్విఫ్ట్ లో కొత్తగా 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ తో.. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5- స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఇంజిన్ కు అనుసంధానం చేయబడింది. ఇది లీటర్ కు 25.72 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని ఆ సంస్థ వెల్లడించింది.

అంతేకాదు క్యాబిన్ లో ఫ్రాంక్స్, బ్రెజా, బాలెనో తరహాలో ప్రీమియం లుక్ కొనుగోలుదారులను అమితంగా ఆకట్టుకుంటుంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ ను కూడా అందించడం విశేషం. టాప్ ఎండ్ మోడల్ లో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్, 360 డిగ్రీ కెమెరా, వైర్ లెస్ ఛార్జింగ్, టైప్ -సి ఛార్జింగ్ పోర్ట్ తో పాటు వెనుక భాగంలో ఏసీ వెంట్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

కొత్త స్విఫ్ట్ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగులను ప్రామాణికం చేసింది. ఇక ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర రూ.6.50 లక్షలు మొదలుకొని రూ.9.65 లక్షల వరకు ఉండగా.. ప్రస్తుతం ఐదు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇంజిన్ 80 బిహెచ్పీ పవర్, 112 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

డిజైన్ లో స్వల్ప మార్పులు ఉన్నాయి. కొత్త గ్రిల్ ను అమర్చడంతో పాటు ఎల్ఈడీ డీఆర్ఎల్ తో హెడ్ ల్యాంపులను ఇచ్చారు. ఇక వెనుకభాగంలో స్కిడ్ ప్లేట్ తో కొత్త బంపర్, అలాగే సి -ఆకారపు డీఆర్ఎల్ లతో స్పెషల్ లైట్లను అమర్చడం విశేషం.

AP Elections: సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!

అమరావతి, : వైసీపీ (YSR Congress) సోషల్‌ మీడియా టీమ్ చీఫ్‌ సజ్జల భార్గవరెడ్డిపై (Sajjala Bhargav Reddy) కేసు నమోదైంది. ఇటీవల టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన ఫిర్యాదుతో గురువారం నాడు ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. భార్గవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా టీమ్‌లను నిందితులుగా చేరుస్తూ సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు పెన్షన్లను
AP Elections: సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!
అమరావతి, ఆంధ్రజ్యోతి: వైసీపీ (YSR Congress) సోషల్‌ మీడియా టీమ్ చీఫ్‌ సజ్జల భార్గవరెడ్డిపై (Sajjala Bhargav Reddy) కేసు నమోదైంది. ఇటీవల టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన ఫిర్యాదుతో గురువారం నాడు ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. భార్గవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా టీమ్‌లను నిందితులుగా చేరుస్తూ సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు పెన్షన్లను ఆపించారని.. కుట్రతో, విద్వేషాలు రగిల్చేలా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ టీమ్‌ తప్పుడు ప్రచారం చేసిందని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఏంటి..?

భార్గవ్ ఆధ్వర్యంలో ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లను, పింఛన్ లబ్దిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని క్లియర్ కట్‌గా ఫిర్యాదులో వర్ల పేర్కొన్నారు. అంతేకాదు.. పెన్షన్లను చంద్రబాబు ఇంటి వద్ద ఇవ్వాలని కోరారన్న విషయాన్ని కూడా ఫిర్యాదులో నిశితంగా వివరించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. వైసీపీ ఐవిఆర్ఎస్ కాల్స్‌పై సీఐడీ దర్యాప్తు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తాజాగా.. సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా సీఐడీ నుంచి ఎన్నికల కమిషన్ నివేదిక వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయన్నది తెలుస్తుంది.

రాత్రిపూట చల్లటి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? ఇది తెలిస్తే షాక్ అవుతారు..!

ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం తట్టుకోలేక ప్రజలు ఏసీలు, కూలర్లను పరుగులు పెట్టిస్తున్నారు. వేడి ఉబ్బరంతో రాత్రి నిద్రపోయే ముందు కూడా మరోసారి చల్లటి నీళ్లతో స్నానం చేస్తున్నారు.

అయిన్నప్పటికీ ఒంటిపై చెమటలు వరదలుగా కారుతున్నాయంటూ వాపోతున్నారు. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే..వేసవిలో రాత్రిపూట స్నానం చేయడం ఒంటి ఆరోగ్యానికి మంచిదేనా..? అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా..? రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కారణంగా, కొంతమంది అన్ని కాలాలలో రాత్రిపూట స్నానం చేసి నిద్రపోతుంటారు. అయితే రాత్రి పడుకునే ముందు తలస్నానం చేయడం నిజంగా ఆరోగ్యానికి మంచిదా, చెడ్డదా అని తెలుసుకుందాం.

వేసవిలో రాత్రిపూట స్నానం చేయడం ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజంతా మనిషి శరీరంలో చెమట, ధూళి, విషపదార్థాలు పేరుకుపోతాయి. ఇది ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. కాబట్టి రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల మన శరీరం శుభ్రపడుతుంది. మనకు బాగా నిద్ర పడుతుంది. కాబట్టి రాత్రి సమయంలో మీకు నచ్చిన విధంగా చల్లటి నీటితో లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. అలాగే రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

రాత్రిపూట స్నానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవటం తప్పనిసరి. అంటే రాత్రి భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. వాస్తవానికి, రాత్రి భోజనం తర్వాత మన శరీరం జీర్ణక్రియకు చురుకుగా మారుతుంది. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల ఈ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. రాత్రి భోజనానికి ముందు లేదా పడుకునే ముందు కనీసం 1-2 గంటల ముందు స్నానం చేయాలి. మీకు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా, రాత్రిపూట స్నానం చేయడం వల్ల మీ సమస్య మరింత తీవ్రమైతే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

అలాగే, ఉదయాన్నే స్నానం మిమ్మల్ని నిద్రనుంచి ఉత్సహపరుస్తుంది. మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. అయితే నిద్రను ప్రేరేపించడానికి, మీరు తప్పనిసరిగా రాత్రి స్నానం చేయాలి. స్నానం మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. మీకు మంచి నిద్ర కోసం దోహదం చేస్తుంది. రాత్రిపూట స్నానం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రోజంతా శరీరం వేడిగా ఉంటుంది. దానికి చెక్ పెట్టాలంటే రాత్రిపూట స్నానం చేయడం చాలా ముఖ్యం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు MannamWeb.com బాధ్యత వహించదు.)

Habits: జీవితంలో సక్సెస్‌ అవ్వాలని ఉందా.? ఈ అలవాట్లను మార్చుకోండి..

జీవితంలో సక్సెస్‌ అవ్వాలని ఉందా.? ఈ ప్రశ్న అడిగితే ఎవ్వరైనా ఠక్కున ఉందనే చెబుతారు. విజయాన్ని కోరుకోని వారు ఎవరు ఉంటారు చెప్పండి. అయితే విజయం కోరుకున్నంత సులువు కాదు.

ఇందుకోసం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. విజయం సాధించిన ప్రతీ ఒక్కరి వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి. అయితే ఆ కష్టాలను ఇష్టాలుగా స్వీకరిస్తేనే విజయం సొంతం చేసుకోవచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే కచ్చితంగా కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* అందరికీ రోజులో ఉండేది 24 గంటల మాత్రమే. అయితే ఎవరు ఎక్కువగా ఆ సయాన్ని ఉపయోగించుకుంటారనేదే విజయాన్ని నిర్ణయిస్తుంది. ఇందుకోసం మొదట చేయాల్సింది ఉదయాన్నే త్వరగా మేల్కోవడం. 5 గంటలకు నిద్రలేవడాన్ని అలవాటు చేసుకోండి రోజులో ఎంత సమయం మిగులుతుందో మీరే గమనిస్తారు.

* విజయం సాధించే వారిలో ఉండే మరో లక్షణం పుసక్త పఠనం. జీవితంలో గొప్ప స్థానంలో ఉన్న వారికి కచ్చితంగా పుస్తకం చదివే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా మోటివేషనల్‌కు సంబంధించిన పుస్తకాలను చదవడం వల్ల మీలో ఉత్సాహం వస్తుంది. ఒక్కసారి పుస్తకం చదవడం చేసుకుంటే మీలో జరిగే మార్పును స్పష్టంగా గమనిస్తారు.

* ఇక జీవితంలో అనుకున్నది సాధించాలంటే ముందుగా మన ఆరోగ్యం బాగుండాలి. అందుకే సక్సెస్‌ అయిన ప్రతీ ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంటారు. కచ్చితంగా ఉదయం వ్యాయామాలు చేస్తుంటారు. మంచి ఆహారం తీసుకుంటారు. రాత్రి సమయానికి నిద్రపోతారు. తక్కువ జబ్బులు పడేవారే ఎక్కువ పనిచేస్తారని గుర్తుంచుకోవాలి.

* మీ పక్కన ఉండే వారు కూడా పాజిటివ్‌ ఆలోచనతో ఉండే వారినే ఎంచుకోండి. అలాంటి వారితోనే స్నేహం చేయండి. కొందరు నిత్యం నెగిటివ్‌ ఆలోచనతో, నెగిటివ్‌ మాటలతో విసిగిస్తుంటారు. అలాంటి వారితో స్నేహం చేస్తే మీరు కూడా నెగిటివ్‌ దారిలోనే వెళ్తారు.

* జీవితంలో విజయం సాధించిన వారు ఎప్పుడైనా ఇతరులతో వాదనలకు దూరంగా ఉంటారు. వీలైనంత తక్కువ వాదిస్తుంటారు. ఎదుటి వ్యక్తితో వాదించే సందర్భంగా వచ్చినా సైలెంట్‌గా ఉంటారు తప్ప.. వాదనలకు దిగరు.

KL Rahul: లక్నో కెప్టెన్‌గా తప్పుకుంటున్న కేఎల్ రాహుల్.. 2025లో రిటైన్‌ కూడా కష్టమే!

KL Rahul to quit Lucknow Super Giants: ఉప్పల్ మైదానంలో బుధవారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ల‌క్నో నిర్ధేశించిన 166 ప‌రుగుల టార్గెట్‌ను ఎస్ఆర్‌హెచ్ కేవ‌లం 9.4 ఓవ‌ర్ల‌లోనే చేధించింది.

సొంత మైదానంలో స‌న్‌రైజ‌ర్స్ ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శ‌ర్మ‌లు లక్నో బౌలర్లను ఊచ‌కోత కోశారు. ఈ ఇద్దరి వీరబాదుడుకు ఎస్ఆర్‌హెచ్ ఈజీగా విజ‌యాన్ని అందుకుంది. ఘోర ఓటమితో ల‌క్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ నిరుత్సాహానికి గుర‌య్యాడు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత తనకు మాట‌లు రావ‌డం లేద‌ని పేర్కొన్నాడు.

ఘోర ఓటమి తర్వాత ల‌క్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్‌ గోయెంకా కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌పై మండిపడ్డాడు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2024లో లక్నో ఆడే చివరి రెండు మ్యాచులకు రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించకపోవచ్చని తెలుస్తోంది. ‘లక్నో తదుపరి మ్యాచ్‌ను మే 14న ఢిల్లీతో ఆడనుంది. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడం కోసం రాహుల్ కెప్టెన్సీని వదిలేస్తాడని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చివరి రెండు మ్యాచుల్లోనూ గెలిస్తేనే లక్నోకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు’ అని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.

ఐపీఎల్‌లోకి లక్నో ప్రాంచైజీ అడుగుపెట్టినప్పటినుంచి కేఎల్‌ రాహుల్ నాయకత్వం వహిస్తున్నాడు. అతడి సారద్యంలో జట్టు 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌ దిశగా దూసుకెళ్లినా.. గత రెండు మ్యాచుల్లో భారీ ఓటమితో అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిచినా ప్లే ఆఫ్స్‌కు వెళ్తామనే గ్యారంటీ లేదు. దీంతో వచ్చే సీజన్‌ కోసం కొత్త కెప్టెన్‌ను ఎంచుకొనే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. 2025 మెగా వేలానికి ముందు రాహుల్‌ను రిటైన్‌ చేసుకునే అవకాశాలు చాలా తక్కువని వార్తలు వస్తున్నాయి. ఫ్రాంచైజీ ఓనర్ కెమెరాల ముందే సీరియస్‌గా మాట్లాడటంతో కేఎల్‌ రాహుల్ నోచుకున్నాడట. దాంతో స్వయంగా అతడు జట్టును వీడే ఛాన్స్‌ ఉందని కొందరు అంటున్నారు.

Allu Arjun: పవన్ కు సపోర్ట్ గా అల్లు అర్జున్.. పోస్ట్ వైరల్

Allu Arjun: జనసేనాని పవన్ కళ్యాణ్ కు రోజురోజుకూ ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతుంది. పవన్ నిజాయితీ మెచ్చి.. సినీ ప్రముఖులు పవన్ కు అండగా నిలబడుతున్నారు.

సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు పవన్ కే తమ సపోర్ట్ అంటూ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే మెగా హీరోలు ప్రచారంలో పాల్గొని తమ మద్దతు తెలుపుతుంటే.. సీనియర్ హీరో నరేష్, కుర్ర హీరోలు నాని, రాజ్ తరుణ్ లాంటి వారు ట్విట్టర్ ద్వారా జనసేనకు సపోర్ట్ గా ఉన్నట్లు తెలుపుతున్నారు.

ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పవన్ వెంట నిలబడ్డాడు. బన్నీ ప్రచారానికి రాకపోయినా.. తాను ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ కే సపోర్ట్ ఉంటానని తెలుపుతూ పోస్ట్ చేశాడు. ” మీ ఎన్నికల ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. మీ జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ మీరు ఎంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడూ గర్వపడుతున్నాను. కుటుంబ సభ్యునిగా, నా ప్రేమ మరియు మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఆశించినదంతా సాధించినందుకు నా శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

గత ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ తరుపున బన్నీ నిలబడ్డాడు. ఇప్పుడు కూడా తన సపోర్ట్ అందివ్వడంతో ఆయన అభిమానులు సైతం పవన్ కు మద్దతుగా నిలబడుతున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. దీని తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో బన్నీ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

టెన్త్‌తో ఆగి… ఆపైన అడ్డా కూలీ దశ నుంచి… సింగరేణి సీఎండీ కుర్చీ దాకా…

అడవిరాముడు సినిమా ఆరోజుల్లో 500 రోజులు ఆడింది .. అది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామం .. ఒక అభిమాని ఒక పాట కోసం 500 రోజులు ఆ సినిమా చూసాడు .. ఆ పాటకున్న పవర్ అలాంటిది .. ఆ పాట వింటే ఇప్పటికి ఉత్సహమే కలుగుతుంది .. పని చేయాలనే కసి పెరుగుతుంది

మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మా…
పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ.
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.
మహాపురుషులౌతారు…
తరతరాలకి తరగని వెలుగౌతారు.

ఈ పాట ప్రస్తుత సింగరేణి సి & ఎండీ బలరాం నాయక్ గారికి వర్తిస్తుంది. సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాదభీమా పథకం ప్రారంభించిన సందర్బంగా సింగరేణి ఉద్యోగగణం ఆయన్ని అభినందిస్తోంది..

ఒక కార్మికుని కష్టం మరొక కార్మికునికి మాత్రమే అర్ధమవుతుంది .. ఒక ఇంటి పెద్దకు ఎమన్నా అయితే ఆ ఇంటి పరిస్థితి ఏంటి అనేది ఒక మధ్యతరగతి కుటుంబ వ్యక్తి కి మాత్రమే తెలుస్తుంది .. నిజం చెప్పాలంటే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సింగరేణిలో ఎవరూ చెయ్యని .. ఊహకందని పథకాన్ని ప్రవేశ పెట్టడం ఆ గొప్పతనం ఒక బలరాం గారికి చెందుతుంది ..

ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుండి సి & ఎండి స్థాయి వరకు ఎదగడం మామూలు విషయం కాదు …

ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి, హైదరాబాద్ కి పొట్ట చేత పట్టుకొని వచ్చి, నల్లకుంటలో , అంబర్పేటలో, చే నెంబర్ లో అడ్డా కూలి నుండి కసిగా చదివి, దేశంలోనే ఉన్నత పరీక్షలో ఒకటైన సివిల్ సర్వీసెస్ లో ఐఆర్ఎస్ లో సెలెక్ట్ అయ్యి, వివిధ విభాగాల్లో పని చేసి, ఈరోజు కొన్ని వేల కోట్ల కంపెనీకి అధిపతి అయ్యారు ..

బలరాంనాయక్‌ది రాజాపూర్ మండలం, తిరుమలగిరి తండా.. పేదరికంతో ఉన్నత చదువులు చదవలేకపోయారు. అయితేనేం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు సింగరేణి సీఎండీ బలరాంనాయక్.. హన్యానాయక్, కేస్లీ దంపతులు మొదటి సంతానం బలరాంనాయక్.

వీరిది నిరుపేద కుటుంబం కావడంతో బలరాం నాయక్ సొంత తండా తిరుమగిరిలో 1 నుంచి 4వ తరగతి చదివారు. ఆ తర్వాత 5 నుంచి 8 వరకు నడుచుకుంటూ వెళ్లి సమీపంలోని పెద్దరేవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో, 9 నుంచి 10 వరకు జడ్చర్లలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ జడ్చర్లలోని కాకతీయ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్.. 19 ఏళ్లకే పెళ్లి, పిల్లలు… పవర్ కట్ ఉంటే అపార్ట్‌మెంట్లలో ఆరో ఫ్లోర్ వరకు సిలిండర్లు మోసుకెళ్లిన ఉదాహరణలు కూడా ఉన్నాయట… ఒక్కడే 18 వేల మొక్కలు నాటాడు…

తండ్రికి తోడుగా ఉంటూ ఆటో నడుపుతూ.. గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి వేస్తూ.. ఇంటర్ తో పాటు ఓపెన్లో డిగ్రీ పూర్తిచేసి 2010లో సివిల్స్ 834 ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు.

అసిస్టెంట్ కమిషనర్.. బలరాంనాయక్ ముందుగా 2012లో అసిస్టెంట్ కమిషనర్గా మేడ్చల్ డివిజన్లో బాధ్యతలు స్వీకరించి.. ముంబయిలో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సయిజ్ కమిషనర్గా పనిచేశారు. అక్కడ ఏడేళ్లు పనిచేసిన తర్వాత 2019లో సింగరేణికి వచ్చి.. 2023 వరకు సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్) గా పనిచేశారు.

తాజాగా సింగరేణి సీఎండీగా బాధ్యతలు తీసుకున్న బలరాంనాయక్ సింగరేణి కార్మికులకు ఎదో చెయ్యాలనే సంకల్పం .. ఆ దిశలో మొదటి అడుగు కోటి రూపాయల ప్రమాదబీమా .. ఆయనకు సొంత తండా అంటే అమితమైన ప్రేమ. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. పాఠశాల విద్యా ర్థులకు కావాల్సిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ పాటు ఇతరత్రా అవసరమైన వస్తువులను తోటి మిత్రులతో కలిసి అందజేస్తారు…. (రచయిత -చాట్లపెల్లి పురుషోత్తం)

(ఇది ఒక సక్సెస్ స్టోరీ… ఓ ఆటో డ్రైవర్ ఏకంగా సింగరేణి వంటి సంస్థకు సీఎండీ పోస్టు దాకా ఎదగడం మామూలు విషయమేమీ కాదు… అదీ టెన్త్ వరకు మాత్రమే రెగ్యులర్ స్కూలింగ్‌తో… పైన ఉన్న కథనం ఓ వాట్సప్ గ్రూపులో కనిపించింది… ఇంకా వివరాలు స్టడీ చేస్తే మరిన్ని నిజాలు, విషయాలు తెలిసేవేమో… కానీ ఇది చాలు తన ఎదుగుదలను పట్టి చూడటానికి… అభినందనలు బలరాం నాయక్… కీప్ గోయింగ్…

ఇంతకుముందు ఆ ప్లేసులో ఉన్న ఐఏఎస్ మీద బోలెడు ఆరోపణలు… ఆ ప్లేసులోకి బలరాం నాయక్ రావడం కూడా ఓ పాజిటివ్ వైబ్… మా హీరో ఇది పీకాడు, అది పీకాడు, తోపు, తురుం అనే పిచ్చి భక్తిభావజాలం నుంచి బయటపడి ,ఇలాంటి రియల్ హీరోల గురించి కదా చదవాల్సింది… మొన్న 12 ఫెయిల్ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది, ఈయన స్టోరీ ఏమీ తక్కువ కాదు… ఎక్కువే…)

పొటాషియం తగ్గితే ఏమవుతుంది? అది లభించే పదార్థాలు ఏమిటి?

శరీరంలో పొటాషియం తగ్గితే బలహీనత, అలసటగా వుంటుంది. కండరాల తిమ్మిరి కనిపిస్తుంది. గుండె కొట్టుకోవడం అసాధారణంగా వుంటుంది. కనుక శరీరంలో పొటాషియం తగినంత వుండేవిధంగా చూసుకోవాలి. పొటాషియం లోపిస్తే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాము.

వైట్ బీన్స్ ఉత్తమమైన వాటిలో ఒకటి, అరకప్పులో 421 మి.గ్రా పొటాషియం ఉంటుంది.
చిలకడ దుంపలు కూడా పొటాషియం నిల్వలున్న ఉత్తమ ఆహార వనరులలో ఒకటి.
బచ్చలికూర ఒక గొప్ప ఎంపిక, ఇందులో కప్పుకు 839 మి.గ్రా పొటాషియం ఉంటుంది.
టొమాటో ఉత్పత్తులు, టొమాటో సాస్ వంటివి పొటాషియంతో నిండి ఉంటాయి.
నారింజ వంటి పుల్లని పండ్లలో విటమిన్ సి వుంటుంది, అలాగే పొటాషియం కూడా లభిస్తుంది.
అరటిపండ్లు పొటాషియం వుంటుంది. ఒక అరటిపండులో 451 మి.గ్రా పొటాషియం ఉంటుంది
150 గ్రాముల అవకాడోలో 1120 మి.గ్రా పొటాషియం లభిస్తుంది.
కొబ్బరి నీరు తీపి- వగరు, తక్కువ చక్కెర, ఎలక్ట్రోలైట్‌లలో ఎక్కువగా ఉంటుంది.

Telugodu : చంద్రబాబు బయోపిక్.. ఇది ఎప్పుడు చేసారు.. స్కిల్ డెవలప్మెంట్ అరెస్ట్‌తో..

Telugodu : మరో నాలుగు రోజుల్లో దేశమంతటా ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తిగా మారిన రాజకీయాలు అంటే.. అవి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీతో ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ హీట్ కనిపిస్తుంది. ఒకరి పై ఒకరు విమర్శలు, పార్టీ ప్రచారాలతో ఏపీ రాజకీయాలు దేశమంతటా వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రచారాలకు డిజిటల్ మీడియాని ఏపీ పొలిటిషన్స్ బాగా ఉపయోగించుకుంటున్నారు.

ఈక్రమంలోనే కమర్షియల్ యాడ్స్ తో పాటు కొన్ని సినిమాలను కూడా తెరకెక్కించి జనాలు ముందుకు తీసుకు వస్తున్నారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలే వ్యూహం, శపథం, యాత్ర 2, వివేకం (వైఎస్ వివేకానందా బయోపిక్), తాజాగా తెలుగోడు. ఈ తెలుగోడు సినిమా చంద్రబాబు బయోపిక్ గా తెరకెక్కింది. ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసుతో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ అరెస్ట్ తోనే ఈ బయోపిక్ కథని స్టార్ట్ చేసారు.

పథకాలు, సంక్షేమాలతో పాటు ఐటీ రంగాన్ని డెవలప్ చేసి, ఎన్నో వేల ఉద్యోగలు ఇచ్చి రాష్ట్ర ఎకానమీని పెంచడంలో చంద్రబాబు చేసిన విషయాలను, ఆయన విజనరీని చూపిస్తూ తెలుగోడు సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ సినిమాని డైరెక్ట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. గంట పదిహేను నిముషాలు ఉన్న ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది చూసేయండి.

Pakistan : పాకిస్థాన్ లో తారాస్థాయికి ప్రాంతీయ వాదం.. ఏడుగురు పంజాబీల హత్య

Pakistan : పాకిస్థాన్‌లో ప్రాంతీయ వివాదం తారాస్థాయికి చేరుకుంటోంది. గత నెలలోనే పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన 11 మంది బలూచిస్థాన్‌లో మరణించారు. వీరిలో తొమ్మిది మంది పంజాబీల కారణంగానే బస్సు దిగి మృతి చెందారు. ఇప్పుడు బలూచిస్థాన్‌లోని గ్వాదర్‌లో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. గ్వాదర్‌లో గురువారం ఉదయం ఏడుగురిని కాల్చిచంపారు. ఈ ప్రజలందరూ కూలీలు, వారి వారి గదులలో నిద్రిస్తున్నారు. ఈ సంఘటన గ్వాదర్‌లోని సురబందర్‌లో జరిగింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ దాడికి ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే ఇది ప్రాంతీయ ప్రాతిపదికన జరిగిన హింసగా కూడా పరిగణించబడుతుంది.

బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ బుగ్తీ ఈ ఘటనను బహిరంగ ఉగ్రవాదంగా అభివర్ణించారు. అలా చేసే వారిని వదిలిపెట్టబోమని అన్నారు. మృతుల కుటుంబాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని బుగ్తీ తెలిపారు. ఉగ్రవాదులను, వారికి సహకరించే వారిని వదిలిపెట్టబోమని చెప్పారు. అంతే కాదు ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఎంత బలవంతంగానైనా ప్రయోగిస్తామని బుగ్తీ చెప్పారు. పాకిస్తానీ రక్తపు బొట్టు చిందించిన వారికే జవాబుదారీగా ఉంటుందని అన్నారు.

బలూచ్ వేర్పాటువాద సంస్థలే ఈ ఘటనకు పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు. దీనికి ముందు కూడా గ్వాదర్‌తో సహా బలూచిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో పంజాబ్ ప్రజలను, చైనీయులను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ తరచూ ఈ దాడులకు బాధ్యత వహిస్తూ వస్తోంది. బలూచిస్థాన్‌కు స్వయంప్రతిపత్తి కల్పించాలని ఈ సంస్థ డిమాండ్ చేస్తోంది. అంతే కాదు ఇక్కడ చైనా ప్రాజెక్టులపై కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుండి, బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తుంక్వా వంటి ప్రావిన్సులలో వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి.

తమ సంస్కృతి, భాష, ప్రయోజనాలను పాకిస్థాన్ విస్మరించిందని ఈ ప్రావిన్సుల్లోని పెద్ద వర్గం నమ్ముతోంది. పష్టూన్లు తమను తాము ప్రత్యేక సంఘంగా, ప్రత్యేక దేశంగా భావిస్తారు. ఇది మాత్రమే కాదు, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో కూడా పరిచయం కలిగి ఉన్నారు. ఇద్దరూ తమను తాము సాధారణ పష్టూన్ సంస్కృతికి చెందిన వారని భావిస్తారు. అదేవిధంగా బలూచిస్థాన్, సింధ్ ప్రజలు కూడా తమపై పంజాబీ ఆధిపత్యం మోపబడిందని నమ్ముతారు. పాకిస్తాన్ సైన్యం, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీలో పంజాబీల ఆధిపత్యంపై ఈ రాష్ట్రాల్లో అసంతృప్తి ఉంది.

Curry Leaves : కరివేపాకును ఉదయాన్నే నమిలి తింటే ఇన్ని ప్రయోజనాలా..?

Curry Leaves : ఈ రోజుల్లో ఆస్తులు సంపాదించడం కాదు ఆరోగ్యంగా ఉండటమే చాలా ముఖ్యం. ఎందుకంటే ఆస్తులు లేకపోతే సంపాదించుకోవచ్చు గానీ.. అనారోగ్యం పాలు అయితే మాత్రం ఆరోగ్యాన్ని సంపాదించుకోవడ అంత ఈజీ కాదు. అందుకే ఎలాంటి రోగాలు రాకముందే చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉంచే ఔషధాలు మన చుట్టూనే ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో కరివేపాకు కూడా ఒకటి. దాని వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే అస్సలు వదలరు. కరివేపాకును ఉదయాన్నే నమిలి తింటే మాత్రం ఎన్నో లాభాలు ఉంటాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Curry leaves జీర్ణక్రియ ఆరోగ్యం..
కరివేపాకును ఉదయాన్నే నమిలి తింటే జీర్ణ ప్రక్రియ ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఉదయాన్నే పరిగడుపున తంటే మాత్రం జీర్ణ ఎంజైమ్ లు ఉత్తేజితమవుతాయి. దాంతో ప్రేగు కదలికలు చాలా సులభతరం అవుతాయి. దాంతో మలబద్దకం లాంటి సమస్యలు తగ్గిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు.

curry leaves మార్నింట్ సిక్నెస్ మటుమాయం..
ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే చాలా మందికి రక్తహీనత, బలహీనత లాంటివి అనిపిస్తాయి. అంతే కాకుండా వాంతులు, వికారం లాంటివి కూడా ఎక్కువగా అనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న వారంతా కూడా కరివేపాకును ఉదయాన్నే నమిలి తింటే మాత్రం ఈ సమస్యలు అన్నీ మటుమాయం అవుతాయి. ఉదయాన్నే కరివేపాకును నమిలి తింటే మాత్రం మార్నింగ్ సిక్నెస్ తగ్గిపోతుంది.

curry leaves బరువు తగ్గడం..
ఉదయాన్నే కరివేపాకును నమిలి తింటే అధిక బరువుతో బాధపడుతున్న వారికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఈజీగా వారు బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే కరివేపాకును నమిలి తింటే నిర్వషీకరణ బాగా జరుగుతుంది. దాంతో ఆటోమేటిక్ గా కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. కరివేపాకు ఇందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

curry leaves జుట్టుకు చాలా మంచిది..
కరివేపాకు జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఉదయం పూట ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగాలి. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు తింటే మాత్రం జుట్టు రాలే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఉదయాన్నే టిఫిన్ తినే ఒక 30 నిముషాల ముందు ఈ కరివేపాకును తింటే జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి.

CM Jagan: లండన్ పర్యటనపై జగన్‌‌కు సీబీఐ షాక్..

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందన్నారు. లండన్‌లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నారని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్థుల కేసులో విచారణ జరుగుతోందని.. అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. ఈ దశలో విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ తరుఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. గతంలో కూడా విదేశీ పర్యటనకు సీబీఐ కోర్ట్ అనుమతించిందని తెలిపారు. ఇరు వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో తీర్పును ఈ నెల 14 కు సీబీఐ కోర్ట్ వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ 13వ తేదీన ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన ప్రణాళిక బయటకు వచ్చింది. అది కాస్తా ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన అక్రమాస్తుల కేసులకు సంబంధించిన బెయిల్‌ షరతుల్లో సీబీఐ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న నిషేధం ఉంది. ఈ క్రమంలోనే కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నెల 17 నుంచి జూన్‌ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్‌ ఈ నెల 6న నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఆ కోర్టు ప్రధాన న్యాయాధికారి టి.రఘురాం విచారణ చేపట్టారు. కుటుంబ పర్యటన నిమిత్తం ఇంగ్లండ్‌ (లండన్‌), స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని జగన్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతులు సడలించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు. నేడు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది.

కళ్లు చెదిరే ఆఫర్.. 18 వేలకే 50 వేల స్మార్ట్ టీవీ.. త్వరపడండి…

Popular e-commerce companies are announcing cool cool offers in hot summer . smart phones, smart TVs and other electronic gadgets . ముఖ్యంగా చాలా కంపెనీలు smart TVs లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. మీరు ఇటీవల smart TVs కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ప్రసిద్ధ వాణిజ్య సంస్థ ఒక smart TVsపై 32 వేల వరకు తగ్గింపును ప్రకటించింది. మీరు టీవీని కొనుగోలు చేయాలనుకుంటే త్వరపడండి.

smart TVs లు కొనాలనుకున్నా.. ధరలు ఎక్కువగా ఉండడంతో కొనేందుకు కాస్త వెనక్కు తగ్గారు. వివిధ కంపెనీల smart TVs లు అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి మీరు తక్కువ ధరలో క్రేజీ ఫీచర్లతో కూడిన smart TVs కోసం చూస్తున్నారా? అయితే మీలాంటి వారికి ఇదే మంచి సమయం. ఈ వాణిజ్య సంస్థ 43 అంగుళాల smart TVs పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఏకంగా TV ధరలో 63 శాతం భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ప్రసిద్ధ e-commerce giant company లో TCL iFalcon 43 అంగుళాల అల్ట్రా HD 4K Smart Google TV తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇందులో Google Assistant, Dolby Audio 10 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ TV అసలు ధర రూ. 49,999. కానీ ఈ smart TVs పై 63 శాతం భారీ తగ్గింపును ప్రకటించారు. దీంతో 43 అంగుళాల 4K Smart Google TV ధర కేవలం రూ. 18, 499 మీరు పొందవచ్చు. అంటే మీరు 31,500 ఆదా చేస్తారు. సరికొత్త ఫీచర్లతో కూడిన ఈ smart TVs పై డిస్కౌంట్లతో పాటు exchange offers and bank offers కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఎందుకు ఆలస్యం చేసి మీ smart TVs కలను వెంటనే నిజం చేసుకోండి.

Aavesham: 150 కోట్ల ఫహాద్ ఫాజిల్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడాలంటే?

Malayalam film Aavesham is now streaming on Amazon Prime: ఇటీవలి కాలంలో మలయాళ సినిమా అనే కాదు అన్ని బాషల OTT వ్యాపారం బాగా తగ్గిపోయిందని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు సినిమాల విడుదలకు ముందు OTT కాంట్రాక్టులు జరిగేవి, కానీ ఇప్పుడు అలాంటి ఒప్పందాలు చాలా అరుదుగా జరుగుతున్నాయి. విడుదల తర్వాత కూడా హిట్లుగా నిలుస్తున్న చాలా తక్కువ చిత్రాలకు OTTల ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఫహద్ ఫాసిల్ హీరోగా నటించిన ఆవేశం సినిమాకి మాత్రం రిలీజ్ కి ముందే మంచి డీల్ వచ్చింది. ఎట్టకేలకు ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నెల తిరగకుండానే OTTలో రిలీజ్ అయింది. ఈ సినిమా నిన్న అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆ లెక్కన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 29వ రోజున OTTకి వచ్చేసింది. ఇది థియేట్రికల్ విడుదలకు ముందు జరిగిన OTT ఒప్పందం అని అంటున్నారు. OTT హక్కుల ద్వారా ఈ సినిమా గట్టిగానే లాభపడింది అంటున్నారు. ఈ సినిమా OTT హక్కుల విక్రయం ద్వారా 35 కోట్లు రాబట్టినట్లు ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్లు నివేదించారు. ఫహద్ ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ ఈ చిత్రానికి హైలైట్. ఈ యాక్షన్ కామెడీ సినిమా బెంగళూరు నేపథ్యంలో తెరకెక్కింది. రంగా అనే ఒక లోకల్ రౌడీ అలాగే కేరళ నుండి బెంగుళూరులో చదువుకోవడానికి వచ్చిన మలయాళీ విద్యార్థుల బృందం మధ్య ఏం జరిగింది ? అనేదే ఈ సినిమా కథాంశం. విద్యార్థులుగా హిప్స్టర్, మిథున్ జై శంకర్ మరియు రోషన్ షానవాస్ పోషించారు.

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున ద్వారానికి మామిడి, అశోక ఆకుల తోరణాలు కడతారు.. రీజన్ ఏమిటో తెలుసా

హిందూమతంలో వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున సంపదల దేవత అయిన లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. లక్ష్మీ దేవికి ఇంట్లో స్వాగతం చెప్పడానికి.. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి, అశోక ఆకులను తోరణాలుగా కడతారు. ఇంటి ప్రధాన ద్వారంపై విల్లు కట్టడం లక్ష్మీ దేవి స్వాగతానికి చిహ్నం. ఇలాంటి ఇంట్లో ఉన్నవారిపై లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఉంటుందని.. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని విశ్వాసం.

అక్షయ తృతీయ రోజున కొన్ని సాధారణ పనులు చేస్తే సంపదల దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తుంది. అంతేకాదు జీవితంలో ఆర్థికంగా లాభపడతారని విశ్వాసం. ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయ తిథిని జరుపుకోనున్నారు. ఈ రోజు ఉదయం 5:35 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పూజకు అనుకూలమైన సమయం.

లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ.. శుభం కలగాలని అక్షయ తృతీయ రోజున మామిడి ఆకులు లేదా అశోక ఆకులతో చేసిన తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద కట్టాలి. ఇలా చేయడం వలన అదృష్టం కలుగుతుందని.. ఇంటిలో సానుకూల శక్తి ఉంటుందని విశ్వాసం. అంతేకాదు డబ్బు ఇబ్బందులు తీరతాయని ఆర్ధికంగా లాభాలను పొందుతారు. ఈ ఆకుల నుంచి వచ్చే గాలిని పీల్చడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నమ్మకం.
మామిడి ఆకుల తోరణం:
హిందూ మతంలో మామిడి తోరణాలు విశిష్ట స్తానం ఉంది. పండగలు, పర్వదినాలు, శుభకార్యాలు ఇలా సంతోషకరమైన సందర్భంలోనైనా మామిడి ఆకులను తోరణాలుగా కట్టి.. ఇంటి ద్వారాలను అలంకరిస్తారు. కొంతమంది మామిడి ఆకుల మధ్య అందం కోసం బంతి పువ్వులను కూడా చేర్చి మాలగా అల్లుతారు. ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాదు కలశాన్ని కూడా మామిడి ఆకులతో ఏర్పాటు చేస్తారు.

అశోక ఆకుల తోరణం:
అశోక ఆకులను కూడా హిందువులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ఆకులతో చేసిన తోరణాలను ఇంటి ప్రధాన ద్వారంపై వేలాడదీస్తారు. అశోక ఆకులతో పాటు బంతి పువ్వులను జత చేసి తోరణం గా అల్లితే మరింత అందంగా కనిపిస్తుంది. ఈ దండను తలుపులకు ఇరువైపులా వేలాడదీసినా అందంగా కనిపించడంతో పాటు.. దీని నుంచి వచ్చే గాలి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

జీవితంలో ఆర్ధిక పురోగతిని పొందడానికి అక్షయ తృతీయ రోజున బంగారు ఆభరణాలు లేదా నాణెం కొనుగోలు చేసి ఉత్తరం వైపు ఉంచవచ్చు. మర్నాడు దానిని తీసుకుని భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఉత్తర దిక్కుకు అధినేత కుబేరుడు.. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు నిలిచి జీవితంలో పురోభివృద్ధి జరుగుతుందని విశ్వాసం. అంతే కాకుండా జీవితంలోని అడ్డంకుల నుంచి ఉపశమనం పొంది ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది.

Fact Check : పీటీఐ పేరుతోనూ ఆంధ్ర ఎన్నికలపై ఫేక్ సర్వేలు – ఇదే అసలు నిజం !

PTI survey on AP elections is fake : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో అక్కడి రాజకీయ పార్టీలు అన్ని రకాల అస్త్రాలతో ఎన్నికల యుద్ధం చేస్తున్నాయి.

ఇందులో ఫేక్ పోస్టులు వైరల్ చేయడం కూడా ఒకటిగా కనిపిస్తోంది. పోటాపోటీగా రెండు వైపు నుంచి ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాటిలో సర్వేలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ సర్వే అంటూ ఒక వార్త వైరల్ అయింది.

ఇందులో అధికార వైఎస్ఆర్సీపీ ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందన్నట్లుగా ఉంది. ఇది వైరల్ కావడంతో పీటీైఐ సంస్థ స్పందించింది. ఇంటూరి రవి కిరణ్ అనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఈ పోస్టును తన సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టారు. ( ఇక్కడ )

ఈ వైరల్ పోస్టుపై పీటీఐ ఫ్యాక్ట్ చెక్ బృందం పరిశీలన జరిపింది. పీటీఐ వాటర్ మార్క్ తో ఉన్న సర్వేను PTI అసలు పబ్లిష్ చేయలేదని తేలింది. PTI అసలు ఎలాంటి ప్రీపోల్ సర్వేను ప్రచురించలేదని ఆ స్క్రీన్ షాట్ ఫేక్ అని స్పష్టం చేసింది.

క్లెయిమ్
మే 7వ తేదీన ఓ ఫేస్బుక్ యూజర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని ఓ ప్రీపోల్ సర్వేను ప్రకటించారు. పీటీఐ వాటర్ మార్క్తో ఉన్న ఆ సర్వేను PTI ప్రకటించిన సర్వే అనే అర్థంలో పోస్టు చేశారు. వాటి లింకులు ఇవి ( ఇక్కడ & ఇక్కడ ). ట్విట్టర్లోనూ పలువురు లింక్స్ షేర్ చేశారు.

ఇన్వెస్టిగేషన్

ఈ స్క్రీన్ షాట్ను కాసేపటికే వైరల్ చేసినట్లుగా PTI సిబ్బంది గుర్తించారు. ఫేస్ బుక్, ఇన్ స్టాలతో సహా పలు చోట్ల ఈ ఫేక్ స్క్రీన్ షాట్ కనిపించింది. వాటిని ఇక్కడ.. ఇక్కడ చూడవచ్చు.

వెంటనే ఈ స్క్రీన్ షాట్కు సంబంధించి PTI వెబ్సైట్ టీంతో పాటు ఇతర న్యూస్ వెబ్ సైట్స్ ను స్కాన్ చేసిన తర్వాత ఇలాంటి ప్రీపోల్ సర్వేను చేయలేదని తేలింది.

” ఇది ఫేక్ స్క్రీన్ షాట్. ఇలాంటి ప్రీపోల్ సర్వేలు PTI ప్రకటించలేదు. కొంత మంది తప్పుడు పద్దతుల్లో PTIలోగోను ఉపయోగించుకున్నారు ” అని PTI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ జి సుధాకర్ నాయర్ పీటీఐ ఫ్యాక్ట్ చెక్ డెస్క్కు స్పష్టం చేశారు.

చివరిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడి్యాలో PTI వాటర్ మార్క్ తో షేర్ అవుతున్న స్క్రీన్ షాట్ ఫాల్స్ అని తేలింది.

క్లెయిమ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై PTI చేసినట్లుగా చెబుతున్న ప్రీపోల్ సర్వే

ఫ్యాక్ట్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై PTI అలాంటి ప్రీపోల్ సర్వేలు ప్రకటించలేదు. అది ఫేక్ న్యూస్.

కంక్లూజన్
ఏపీ ఎన్నికలపై PTI సర్వే అంటూ సర్క్యూలేట్ అవుతున్న స్క్రీన్ షాట్ ఫేక్. అలాంటి సర్వేలను పీటీఐ ప్రకటించలేదు.

Storage Container:పప్పులు,పిండి వంటి వాటిని సులభంగా స్టోర్..కంపార్ట్‌మెంట్‌ లో ఉన్న item ని బటన్‌ను నొక్కడం ద్వారా చాలా సులభంగా తీసుకోవచ్చు

Storage Container:ఈ Storage Container రొటేట్ అవుతుంది. దీనిలో కిచెన్ కి సంబందించిన రకరకాల items.. అంటే బియ్యం,పప్పులు,పిండి వంటి వాటిని వేసుకోవచ్చు.

దీనిలో 6 కంపార్ట్‌మెంట్‌ లు ఉన్నాయి. అలాగే ఒక్కో కంపార్ట్‌మెంట్‌ లో కేజీ పప్పులు లేదా పిండిని పోయవచ్చు.

కంపార్ట్‌మెంట్‌ లో ఉన్న item ని బటన్‌ను నొక్కడం ద్వారా చాలా సులభంగా తీసుకోవచ్చు. దీని మీద బ్యాంకు ఆఫర్, cash బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.

ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Storage Container

https://amzn.to/4dt1Za7

Lion : సింహం తన పిల్లలకు వేటలో ట్రైనింగ్ ఎలా ఇస్తుందంటే.. చూస్తే ఒళ్ళు జలదరించాల్సిందే.. వైరల్ వీడియో

Lion : అడవిలో ఉండే క్రూర మృగాలలో సింహం స్థానం ప్రత్యేకమైనది. అడవికి రాజుగా కొనసాగే ఆ జంతువు.. వేటలో ప్రత్యేకమైన శైలిని అనుసరిస్తుంది. ఎంతటి జంతువునైనా అవలీలగా వేటాడుతుంది. తను వేటాడే జంతువు గొంతును తన పదునైన దంతాలతో పట్టుకొని చీల్చి చంపేస్తుంది.. తన ఆకలి మొత్తం తీరేదాకా అక్కడే ఉండి.. చనిపోయిన జంతువు శరీర భాగాలను ఇష్టంగా ఆరగిస్తుంది. అందుకే సింహం అంటే ఎలాంటి జంతువులైనా భయపడుతుంటాయి. సింహం ఆ స్థాయిలో వేటాడుతుంది కాబట్టే సింహ స్వప్నం అనే నానుడి స్థిరపడిపోయింది.

ముందుగానే చెప్పినట్టు సింహం వేటాడే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే అది తన పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. యూట్యూబ్లో @insights లో సింహం తన పిల్లలకు వేటలో శిక్షణ ఇస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దట్టమైన అడవిలో కొంతమంది పర్యాటకులు తమ కార్లలో ఒక దారిలో ఉన్నారు. ఆ దారి వెంట ఒక తల్లి సింహం.. తన పిల్లలతో కలిసి వెళ్తోంది. ఆ పిల్లలు రెండు నుంచి మూడు నెలల వయసు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. తల్లి సింహం వెళుతుంటే.. పిల్ల సింహాలు దానిని అనుసరిస్తున్నాయి.. మిగతా జంతువుల బారి నుంచి ఎలా రక్షణ పొందాలో ఆ తల్లి సింహం ఆ పిల్ల సింహాలకు నేర్పినట్టుగా ఆ వీడియోలో కనిపిస్తోంది.. వాస్తవానికి ఏదైనా జంతువును వేటాడుతున్నప్పుడు ఆడ సింహం తన పిల్లలను పక్కన పెట్టుకుంటుందట. అది వేటాడుతున్నప్పుడు ఆ పిల్ల సింహాలు చూసి అలాగే చేస్తాయట. మాంసాన్ని తినే విధానాన్ని కూడా తల్లి సింహం పిల్ల సింహాలకు నేర్పుతుందట. ఇలాంటి వ్యవహారాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ మగసింహం జోక్యం చేసుకోదట. అలాంటి పరిస్థితి వస్తే అది దూరంగా వెళుతుందట.

ఇక పిల్ల సింహాలు తల్లి సింహం వద్ద కొన్ని నెలలపాటే పాలు తాగుతాయట. ఆ తర్వాత అవి వేటను మొదలుపెడతాయట. చిన్న చిన్న జింకలను వేటాడిన తర్వాత.. ఆ అనుభవంతో మిగతా జంతువులను వేటాడుతాయట. అలా వేటాడే క్రమంలో కొన్నిసార్లు సింహం పిల్లలు చనిపోతాయట. ఎక్కువసార్లు మాత్రం తల్లి పర్యవేక్షణలోనే పిల్ల సింహాలు ఇతర జంతువులను వేటాడుతాయట. అనుకోని పరిస్థితుల్లో మాత్రమే పిల్ల సింహాలు వేటకు వెళ్తాయట. పిల్ల సింహాలు ఒకవేళ వేటలో చనిపోతే.. తల్లి సింహం ఆ సంఘటనా స్థలాన్ని వాసన ద్వారా పసిగడుతుందట. పిల్ల సింహం శరీరంపై అయిన గాయాలను చూసి.. ఏ జంతువు చంపిందో గుర్తిస్తుందట. ఆ తర్వాత అదును చూసి ఆ జంతువును చంపేస్తుందట. కాగా, యూట్యూబ్లో ఇన్ సైట్స్ ద్వారా పోస్ట్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

మామిడి పండు తిన్న వెంటనే ఈ 5 పదార్థాలు తినకూడదు, ఎందుకు?

మామిడి పండు సీజన్ వచ్చేసింది. తీయటి మామిడి పండు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.

మామిడి పండు తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదు, తాగితే కడుపు నొప్పి, ఎసిడిటీ వస్తుంది.
మామిడి పండు తిన్న అర్థగంట తర్వాత మంచి నీళ్లు తాగాలి.
మామిడి పండుతో కలిపి ఐస్ క్రీమ్ తినకూడదు, ఇది అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.
మామిడి పండు తిన్న తర్వాత స్పైసీ ఫుడ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
శీతల పానీయాలను తాగిన వెంటనే మామిడిని తినడం కూడా హానికరం.
ఇది డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయ కూర తినరాదు.
ఇది వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించవచ్చు.

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాము.

వెల్లుల్లి మీ బ‌రువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది, రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మ‌లు తింటే జిమ్‌కెళ్లినంత లాభం.
జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేస్తుంది, అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది.
వెల్లుల్లిలో వున్న అడ్రినలైన్‌ నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది.
శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మార్చి రక్తపోటును నియంత్రిస్తుంది.
మొటిమలు, నల్లమచ్చలు తగ్గేందుకు పచ్చి వెల్లుల్లి రెబ్బలు 2 తీసుకుని వాటిని నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.
రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత జబ్బులు రావు.
వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడం లాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు.
పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తినడం మంచిది

ఓరి దేవుడా.. యువతి ప్రాణాలను మింగేసిన పువ్వు.. ఇంతకీ ఏంజరిగిందంటే..

కరివేరు (ఎర్ర గన్నేరు) మొక్క
స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ఫోన్‌లో మాట్లాడటం మొదలు పెడితే.. దానిలో మునిగిపోతారు. తాము ఏమి చేస్తున్నామో గుర్తించరు. ఎదుటి వారు ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోరు. కొంతమందికి నడుస్తూ ఫోన్ మాట్లాడే అలవాటు ఉంది. అలా కొందరు ఫోన్ మాట్లాడుతూ తమకు తెలియకుండానే దూరంగా నడుచుకుంటూ వెళ్తూ… తమకు అవసరం లేని ప్రదేశానికి చేరుకుంటారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు చుట్టూ ఉన్న వస్తువులను ఎంచుకొని వాటిని తాకడం..వాటితో ఆడడం, లేదా నోటిలో పెట్టుకోవడం వంటి పనులు చేస్తారు. అయితే అలా చేసే సమయంలో కూడా వారి దృష్టి అప్పటికీ ఫోన్‌పైనే ఉంటుంది. అలా సెల్ ఫోన్ మాట్లాడుతూ యాక్సిడెంట్స్ అయిన యువతీ యువకుల గురించి వార్తలువింటునే ఉన్నాం.. అయితే తాజాగా ఓ యువతి తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ దానిలో మునిగిపోయింది.. అలా తోటలో నడుచుకుంటూ వెళ్తూ కరివేరు మొక్క నుంచి పువ్వుని తెంచి దానిని నోట్లో పెట్టుకుని తినేసింది. అప్పుడు కూడా ఆ యువతి తాను చేసిన పనిని గుర్తించలేదు.. చివరికి గురించే పువ్వుని ఉమ్మేసింది. అయినప్పటికీ ఆ యువతి మర్నాడు మరణించింది. ఈ విషాద ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం రాష్ట్రంలోని అలప్పుజా జిల్లాకు చెందిన 24 ఏళ్ల సూర్య సురేంద్రన్ కు UKలో నర్సుగా ఉద్యోగం వచ్చింది. దీంతో యూకే వెళ్లేందుకు ఆదివారం కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంది. అయితే ఎయిర్‌పోర్టులో సూర్య ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే స్పందించిన సిబ్బంది సూర్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. సోమవారం మరణించింది. గుండెపోటు వలన యువతి మరణించిందని వైద్యులు వెల్లడించారు.

సూర్య మరణించే ముందు వైద్యులు, కుటుంబసభ్యులకు ఆదివారం విమానాశ్రయానికి వచ్చే ముందు బంధువులు, స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతున్నానని చెప్పింది. ఈ సమయంలో పొరపాటున కరివేరు పువ్వుని నమిలినట్లు.. ఈ విషయం గుర్తించిన వెంటనే.. తాను వెంటనే దానిని ఉమ్మివేసినట్లు చెప్పింది. అయితే అప్పటికే పువ్వులోని విషం ఆ యువతి కడుపులోకి చేరింది. పోస్ట్‌మార్టం నివేదికలో కూడా కరివేరు పువ్వు మరణానికి కారణమని పేర్కొన్నారు.

మహిళలకు షాకింగ్ న్యూస్.. మల్లెపువ్వులను కొనిపెట్టుకుంటే డేంజర్‌లో పడ్డట్టే! (వీడియో)

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది అన్ని నిత్యావసర వస్తువులు కల్తీ అయిపోతున్నాయి. అయితే కొందరు టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తే.. మరికొందరు మాత్రం చెడుకు వాడుతున్నారు. ముఖ్యంగా పలు రసాయనాలు వాడుతూ వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారు. కూరగాయలు, పండ్లు, పూలు కొనుగోలు దారులకు అట్రాక్టింగ్‌గా కనిపించడానికి పలు రకాల రంగులు వాడుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసి ఉంటాం.

అయితే ఇప్పుడు మహిళలు జడలో పెట్టుకునే మల్లెపువ్వుల కోసం కూడా రసాయనాలు వాడుతూ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎండాకాలంలో మల్లె పువ్వులు విరివిగా అందుబాటులో ఉంటాయి. దీంతో మహిళలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదా.. ఏదైనా ఫంక్షన్స్‌కు కొనుగోలు చేసి మరీ జడలో పెట్టుకుంటుంటారు. అయితే మల్లెపువ్వులను ‘కాపర్ సల్ఫేట్’ లో ముంచి తీస్తున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలో.. మల్లె పువ్వులు దండలు పట్టుకుని కొందరు వాటిని కాపర్ సల్ఫేట్ కలిపిన నీటిలో ముంచి ఆ పువ్వులను మరో ట్రేలో వేస్తున్నారు.

అయితే ఇలా చేయడం వల్ల పువ్వులు చాలా సేపు తాజాగా కనిపిస్తాయి. కానీ మహిళలు వీటిని పెట్టుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. కాపర్ సల్ఫేట్ వల్ల పలు ఇబ్బందులకు గురి కాకూడదంటే.. మల్లె పువ్వులు కొనకుండా ఇతర పువ్వులు కొని పెట్టుకోవడం మంచిది. లేదంటే డేంజర్‌లో పడ్డట్టే.

AP Election: కాంగ్రెస్ లో ఆశలు రేపుతున్న ఆ రెండు సీట్లు! ఈక్వేషన్లు ఇవే..!

ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏపీని అడ్డంగా చీల్చిందన్న విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో ఓటర్లు భారీ షాకిచ్చారు. ఒక్క సీట్లోనూ కాంగ్రెస్ ను గెలిపించకుండా ఏకంగా డిపాజిట్లు లేకుండా చేసేశారు. గత ఎన్నికల్లోనూ అదే పరిస్ధితి. ఇప్పుడు ముచ్చటగా ముడోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి రెండు నియోజకవర్గాలు మాత్రం ఆశలు రేపుతున్నాయి. సున్నా నుంచి రెండు సీట్లు గెల్చుకుంటే ఈసారి కాంగ్రెస్ అద్భుతం చేసినట్లే. రాష్ట్ర విభజన తర్వాత ప్రజాగ్రహంతో వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలనూ ఒక్క సీటు కూడా లేకుండానే ముగించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం సీఎం జగన్ తో విభేదిస్తున్న ఆయన చెల్లెలు వైఎస్ షర్మిలను తెచ్చుకుని ఏకంగా పీసీసీ ఛీఫ్ పదవే కట్టబెట్టారు. వాస్తవంగా షర్మిల తప్ప ఆ పదవిలో ఎవరున్నా ఈసారి కూడా కాంగ్రెస్ హ్యాట్రిక్ ఓటమి ఖాయమై ఉండేది. కానీ షర్మిల ఎంట్రీతో నత్తలా పడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కాస్త చలనం వచ్చింది.
దీన్ని సొమ్ముచేసుకుంటూ రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని, వైసీపీలో సీట్లు రాని ఎమ్మెల్యేలను చేర్చుకుని కాంగ్రెస్ నావను షర్మిల నడిపిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం రెండు చోట్ల ఆ పార్టీకి బోణీ కొట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఉన్నఈ రెండు సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు భిన్నమైన అంశాలు దోహదం చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని శింగనమల, మడకశిర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నట్లు తాజా సర్వేలు చెప్తున్నాయి. శింగనమల నుంచి మరోసారి బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి, మాజీ పీసీసీ ఛీఫ్ సాకే శైలజానాథ్ పై ఈసారి గెలుపు అంచనాలు కనిపిస్తున్నాయి. అదీ ముక్కోణపు పోటీలో శైలజనాథ్ వైపు ఓటర్లు మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. గతంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, వివాదరహితుడు కావడం, మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ అవుతున్నాయి.
మరోవైపు ఇదే జిల్లాలోని మడకశిర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కరికెర సుధాకర్ కూడా గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ మధ్య ముక్కోణపు పోటీ జరుగుతున్నా స్థానికంగా పట్టున్న మాజీ పీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డికి సన్నిహితుడైన సుధాకర్ కు ఆయన నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న రఘువీరా సుధాకర్ కోసం మాత్రం నియోజకవర్గంలోని దాదాపు 500 గ్రామాలు స్వయంగా తిరిగారు. దీంతో రఘువీరాకు ఉన్న మంచిపేరు సుధాకర్ కు గెలుపుకు బాటలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Hyderabad vs Lucknow: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్‌.. రికార్డుల మీద రికార్డులు

సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్‌నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని హైదరాబాద్‌ ఓపెనర్లిద్దరే 9.4 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేశారు. ట్రావిస్ హెడ్ (89*; 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (75*; 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఊచకోతతో ఉప్పల్ స్టేడియం ఊర్రూతలూగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ పలు రికార్డులు నమోదు చేసింది.

వాటిపై ఓ లుక్కేద్దాం.

ఐపీఎల్ చరిత్రలో 160 కంటే పైచిలుకు స్కోరును అత్యంత వేగంగా ఛేదించిన తొలి జట్టుగా హైదరాబాద్‌ రికార్డు సృష్టించింది.
టోర్నీలో ఒక మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు (167) చేసిన జట్టుగానూ అవతరించింది. తర్వాత రెండు స్థానాల్లోనూ (దిల్లీపై 158/4), (ముంబయిపై 148/2) హైదరాబాదే ఉంది.

ఒక సీజన్‌లో పవర్ ప్లేలో రెండుసార్లు 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి జట్టుగా హైదరాబాద్ నిలిచింది.
ఒక ఐపీఎల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు (146 సిక్సర్లు.. 12 మ్యాచ్‌ల్లో) బాదిన జట్టుగా హైదరాబాద్‌ ఆరెంజ్ ఆర్మీ రికార్డును సొంతం చేసుకుంది. 2018లో చెన్నై 145 సిక్స్‌లు..

16 మ్యాచ్‌ల్లో పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్స్‌లు (35) బాదిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు నెలకొల్పాడు. 195 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
ఒక ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడు కూడా అభిషేక్ శర్మనే.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక బంతులు మిగిలుండగా (100 కంటే ఎక్కువ టార్గెట్ ఉన్న మ్యాచ్‌ల్లో) విజయం సాధించిన జట్టుగా హైదరాబాద్‌ రికార్డు సృష్టించింది.
ఐపీఎల్‌లో పవర్‌ ప్లేలో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ స్కోర్లు చేసిన రెండో ఆటగాడిగా ట్రావిస్ హెడ్(4) నిలిచాడు. ఇవన్నీ అతడు ఈ సీజన్‌లో చేసినవే. డేవిడ్ వార్నర్ (6) తొలి స్థానంలో ఉన్నాడు.

Andhra Pradesh : కడప బాద్‌షా ఎవరో?

ఈ దఫా వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ మధ్య బిగ్‌ఫైట్‌

తొలిసారి వైఎస్‌ కుటుంబం నుంచి అక్కాతమ్ముడి పోటీ

కాంగ్రెస్‌ తరఫున తొలిసారి షర్మిల బరిలోకి

ఆమెకు మద్దతుగా సునీత ప్రచారం

వైసీపీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డి

టీడీపీ అభ్యర్థిగా మొదటిసారి భూపేశ్‌రెడ్డి పోటీ

వివేకా హత్య కేసే ప్రధాన ప్రచారాస్త్రం

రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప లోక్‌సభ నియోజకవర్గం.. ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు అడ్డా. కళలు, కవులు, ఖనిజాభివృద్ధి, మత సామరస్యానికి నిలయం.. తిరుమలేశుని కడప దేవునికడప.. కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నడచిన ఈ గడ్డలో.. ఈసారి లోక్‌సభ ఎన్నికలు హైవోల్టేజీ రగిలిస్తున్నాయి. కడప లోక్‌సభ స్థానం 1952లో ఆవిర్భవించింది.

తొలినాళ్లలో ఇది కమ్యూనిస్టుల కోట. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో సీపీఐ గెలిచింది. 1957లో కాంగ్రెస్‌ నెగ్గింది. ఆ తర్వాత 1962, 67, 71 ఎన్నికల్లో వరుసగా సీపీఐ విజయం సాధించింది. అనంతరం కాంగ్రె్‌సదే పైచేయి అయ్యింది. 1984లో టీడీపీ నుంచి డి.నారాయణరెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. 1989 నుంచి ఈ స్థానం వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా మారింది. 1989, 91, 96, 98 ఎన్నికల్లో వైఎస్‌ వరుసగా గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వైఎస్‌ వివేకా ఎన్నికయ్యారు. 2009లో జగన్‌ గెలిచారు.

వైసీపీ స్థాపించిన తరువాత కాంగ్రెస్‌ ఎంపీగా రాజీనామా చేసి 2011 ఉప ఎన్నికలో బరిలోకి దిగి విజయం సాధించారు. 2014, 19 ఎన్నికల్లో వరుసగా అవినాశ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పుడు మూడోసారి పోటీ చేస్తున్నారు.

వైసీపీ ఓట్ల చీలికతో టీడీపీకి లబ్ధి!

ప్రస్తుత ఎన్నికల్లో మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి.. తన అన్న సీఎం జగన్మోహన్‌రెడ్డిని నేరుగా సవాల్‌ చేస్తున్నారు. జగన్‌ నిలబెట్టిన తన చిన్నాన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డి కుమారుడు అవినాశ్‌రెడ్డిపై ఆమె పోటీచేస్తున్నారు. ఒకప్పుడు పులివెందుల ఉప ఎన్నికలో రాజశేఖర్‌రెడ్డి భార్య విజయలక్ష్మి, తమ్ముడు వివేకానందరెడ్డి తలపడ్డారు. అయితే కడప లోక్‌సభ స్థానంలో వైఎస్‌ కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు పోటీచేస్తుండడం ఇదే తొలిసారి.

2019 ఎన్నికల్లో జగన్‌ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేసిన షర్మిల.. నేడు అదే పార్టీని ఢీకొంటున్నారు. టీడీపీ సైతం ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణరెడ్డి కుమారుడు భూపేశ్‌రెడ్డిని బరిలోకి దింపింది. వైసీపీ ఓట్ల చీలికపైనే టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఆ ఓట్లు షర్మిల, అవినాశ్‌ మధ్య చీలిపోతే టీడీపీ నెగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

వివేకా హత్య చుట్టూ..

2019 ఎన్నికల ముందు జరిగిన తన చిన్నాన్న వివేకా హత్యను జగన్‌ అనుకూలంగా మలుచుకుని రాజకీయంగా లబ్ధిపొందారు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని ఎన్నికల ముందు డిమాండ్‌ చేసిన ఆయన.. గద్దెనెక్కాక ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దర్యాప్తు సీబీఐకి వెళ్లాక అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

దస్తగిరి అప్రూవర్‌గా మారిన తర్వాత శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిల పాత్ర తెరపైకి వచ్చింది. అయినా అవినాశ్‌ కుటుంబానికి జగన్‌ అండగా నిలిచారు. చెల్లెలు సునీత భర్త రాజశేఖర్‌రెడ్డే హత్య చేసి ఉంటారని ప్రత్యారోపణ చేశారు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్‌కే మళ్లీ ఎంపీ టికెట్‌ ఇవ్వడాన్ని షర్మిల, సునీత జీర్ణించుకోలేకపోయారు. అవినాశ్‌కు టికెట్‌ ఇవ్వడం వల్లే తాను పోటీ చేస్తున్నానని షర్మిల చెబుతున్నారు. ఆమెకు మద్దతుగా సునీత ప్రచారం చేస్తున్నారు. కడప, బద్వేలు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో వివేకా అభిమానులు మెండుగా ఉండడంతో వారి ప్రచారం ఇక్కడే సాగుతోంది.

– కడప, ఆంధ్రజ్యోతి

నియోజకవర్గ స్వరూపం

(కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బ ద్వేలు(ఎస్సీ), కమలాపురం, మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్లు)

మొత్తం ఓటర్లు 16,39,066

పురుషులు 8,00,857

మహిళలు 8,37,993

ట్రాన్స్‌జెండర్లు 216

అవినాశ్‌రెడ్డి బలాలు..

సీఎం జగన్‌ అండ. జగన్‌ బహిరంగసభలో నా తమ్ముడు అమాయకుడు అంటూ వెనకేసుకురావడం, ఎమ్మెల్యేలందరితో సఖ్యతగా ఉండడం, జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండడం.. సీఎం భార్య భారతీరెడ్డి స్వయంగా ప్రచారం చేస్తుండడం.

బలహీనతలు..

వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడి(ఏ-8)గా సీబీఐ చార్జిషీట్‌ వేయడం.. వివేకాను అవినాశే చంపించాడంటూ ఆయన కుమార్తె సునీత, షర్మిల ఊరూవాడా ప్రచారం చేస్తుండడంతో అవినాశ్‌పై పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకత. ఇప్పటికే జగన్‌ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత.. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి.. స్టీల్‌ ప్లాంటుకు మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు.. అవినాశ్‌ సన్నిహితుల భూకబ్జాలు, దందాలు.

షర్మిల రెడ్డి బలాలు..

రాజశేఖర్‌రెడ్డి కుమార్తెగా ప్రజల్లో ఆదరణ. జగన్‌ జైలులో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి వైసీపీని నిలబెట్టినా.. అధికారంలోకి వచ్చాక ఆమెను దూరం పెట్టడం. ఆస్తులివ్వకుండా ఇబ్బంది పెట్టడం, వివేకా హత్య కేసులో న్యాయం చేయండని కొంగుచాపి అడగడం.. ఆడబిడ్డ కావడంతో మహిళల్లో సానుభూతి. కాంగ్రె్‌సకు సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్‌, దళితులు వైసీపీని వీడి కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం. క్రైస్తవులతో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ సమావేశాలు.

బలహీనతలు..

నిన్నమొన్నటిదాకా హైదరాబాద్‌కే పరిమితం కావడం.. స్థానిక నేతలపైనే ఆధారపడాల్సి రావడం.. రెండుచోట్ల మినహాయిస్తే మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు లేకపోవడం.

భూపేశ్‌ రెడ్డి బలాలు..

తొలిసారి పోటీ.. అయినా అండగా టీడీపీ కేడర్‌.. ప్రధానంగా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి సొంత బాబాయి ఆదినారాయణరెడ్డి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. ఇక్కడ వారి కుటుంబానికి సొంతగా ఓటుబ్యాంకు ఉంది. యువకుడు కావడం, అందరితో కలిసిపోవడం.. సూపర్‌సిక్స్‌ పథకాలు జనంలోకి బాగా వెళ్లడం.. వైసీపీ ఓట్లను షర్మిల చీలిస్తే టీడీపీ లాభపడే అవకాశం.

బలహీనతలు..

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలతో సమన్వయం సాధించలేకపోవడం.. ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో అనుభవం లేకపోవడం.. టీడీపీ నేతలు సొంత నియోజకవర్గాలకు పరిమితం కావడం.. పార్లమెంటు స్థానంపై దృష్టిపెట్టకపోవడం..

Risks Of Fast Eating: భోజనం త్వరగా చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Risks Of Fast Eating: ఉరుకులు పరుగులు జీవితాలను కొనసాగిస్తున్న ఈ రోజుల్లో కనీసం తినడానికి కూడా సమయం దొరకడం లేదు. ఆఫీసు, కాలేజీలు, స్కూళ్లు అంటూ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రావడానికి రాత్రి అవుతుంది.

ముఖ్యంగా ఆఫీసు పనుల్లో బిజీగా ఉండే వారైతే కనీసం భోజనం చేయడానికి కూడా సమయం కేటాయించలేని పరిస్థిలులు నెలకొన్నాయి. ఈ తరుణంలో దొరికిన కాసేపట్లోనే గబగబా తినేసి పనుల్లోకి వెళిపోతున్నారు. అయితే ఇలా త్వరగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

బరువు తగ్గడం..

బిజీ పనుల్లో పడి చాలా మంది వేగంగా భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎంత తింటున్నారో కూడా తెలియని పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఇలా త్వరగా తినడం వల్ల శరీరానికి అవసరం ఉన్న దానికంటే తక్కువ ఆహారం తీసుకునే అవకాశాలు ఉంటాయట. ఇలా చేయడం వల్ల శరీర బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

గుండె సంబంధింత వ్యాధులు..

ఆహారం త్వరగా తినడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందట. వేగంగా తినడం వల్ల మెటబాలిక్ సిండ్ంరోమ్ కలిగి ఉండే వారిలో గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్, డయాబెటిస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ మేరకు 2019లో జరిగిన హార్ట్ జర్నల్ లో ప్రచురితమైన ఓ నివేదికలో వెల్లడైంది. వేగంగా తిన్న వారిలో ఎక్కువ మంది గుండె జబ్బుల వ్యాధుల బారిన పడుతున్నారని తేలింది.

జీర్ణ సమస్యలు..

ఆహారాన్ని త్వరగా తినడం వల్ల నమిలి తినే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇందువల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

చక్కెర స్థాయిలు పెరిగే ఛాన్స్..

త్వరగా భోజనాన్ని పూర్తి చేసే వారిలో చక్కెర స్థాయిలు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్స్, షుగర్ వంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

Election Duty : ఎన్నికల విధులకు గైర్హాజరు.. 40 మందిపై సస్పెన్షన్ వేటు!

lection Duty : తెలంగాణలో ఎన్నికల విధులకు హాజరుకాని 40 మంది పీఓలు, ఏపీఓపై సస్పెన్షన్ వేటు పడింది. పలు సెక్షన్లకు సంబంధించిన అధికారులపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎలక్షన్ ట్రైనింగ్ కోసం హాజరుకావాలంటూ పలుమార్లు పడేపదే ఆదేశాలు జారీచేసినా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఎన్నికల విధులకు గైర్హాజరు అయిన అధికారులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం (అర్‌పీ ఆక్ట్) 1951 ఉల్లంఘన కింద సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన 40మందిలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నెల 9,10వ తేదీలలో జరుగు శిక్షణ తరగతులకు హాజరుకాని వారిపై కూడా ఇదే తరహా చర్యలు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ హెచ్చరించారు.

ఆ 3 బ్రాండ్ల ఫోన్స్ వాడుతున్నారా? మీ పర్సనల్ డేటా హ్యాకర్స్ చేతిలోకి !

స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అప్ డేట్స్, ఫోటోలు, వీడియోలు, పర్సనల్ మెసేజ్ లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇలా అన్నీ ఆ స్మార్ట్ ఫోన్ లో ఉంటాయి. స్మార్ట్ ఫోన్ వచ్చాక..

ప్రజల జీవన విధానం కూడా చాలా మారిపోయింది. అలాగే జీవితం తేలికగా మారింది. కానీ, అదే సమయంలో స్మార్ట్ ఫోన్ వల్ల అనర్థాలు, నష్టాలు, కష్టాలు కూడా పెరిగాయి. చిన్న పొరపాటు కూడా మీ వ్యక్తిగత డేటా మొత్తాన్ని హ్యాకర్ల చేతుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు ఏకంగా మూడు కంపెనీల ఫోన్లు వాడుతున్న వారికి ఈ ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది.

స్మార్ట్ ఫోన్లు బాగా వినియోగిస్తున్నారు. అయితే, మన వ్యక్తిగత సమాచారం మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సురక్షితంగా ఉన్నాయా? అవి ఖాయమని చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు హ్యాకర్లు కూడా కొత్త మార్గాల్లో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు టెక్ నిపుణులు చెబుతున్న వార్త చూస్తుంటే స్మార్ట్ ఫోన్ వాడాలంటే తికమక పడాల్సిందే. షియోమీ, రెడ్‌మీ, పోకో కంపెనీలకు చెందిన డివైజ్‌లలో ఈ ప్రాణాంతక వైరస్ ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఐదు రోజుల పాటు ఈ మూడు కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్లలో ఈ ప్రమాదకరమైన వైరస్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఓవర్ సెక్యూర్డ్ అనే బ్లాగ్‌లో ఈ వివరాలు ప్రచురించబడ్డాయి. వారు చెప్పినదాని ప్రకారం, Xiaomi, Redmi, Poco పరికరాలలో ప్రమాదకరమైన వైరస్లు కనుగొనబడ్డాయి, అవి సిస్టమ్ ఫైల్‌లు లేదా ఇతర అనువర్తనాలు కావచ్చు. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది, ఇది మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లకు అందించగలదు. MIUI మరియు Hyper OSని ఉపయోగించే Xiaomi, Redmi మరియు Poco పరికరాలలో ఈ సమస్య కనుగొనబడింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, Xiaomi తన MIUIని హైపర్ OSగా రీబ్రాండ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు ఆ హైపర్ ఓఎస్ లోనే ఈ తరహా సమస్య వచ్చి వినియోగదారులను కలవరపెడుతోంది. Gallery, Get Apps, Mi Video, MIUI Bluetooth, Phone Services, Print Spooler, Security, Security Core Component, Settings, Share Me, System Tracing, Xiaomi Cloudలో వైరస్ గుర్తించబడిందని బ్లాగ్ వెల్లడించింది. అయితే దీన్ని ఎంతవరకు నమ్మాలో తెలియడం లేదు. ఎందుకంటే ఈ విషయమై Xiaomi ఇంకా ఎలాంటి అధికారిక హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ మూడు కంపెనీలు ఈ వైరస్‌ను గుర్తించడం మరియు పరిష్కరించడం గురించి త్వరలో అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు

BIG TV Survey: బిగ్ టీవీ ప్రీ-పోల్ సర్వే.. ఏపీ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే..

BIG TV Survey on AP Assembly Elections 2024: మరోవారంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా అన్ని పార్టీలు ప్రచార జోరును మరింత పెంచాయి. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఏ ఇద్దరు ఒకే చోటు చేరినా ఓట్లు, రాజకీయ నాయుకులు గురించే చర్చించుకుంటున్నారు. తాను అనుకున్న పార్టీనే గెలుపు గుర్రం అని.. రాష్ట్రంలో ఆ పార్టీనే చక్రం తిప్పుతుందని శఫథాలు చేసుకుంటున్నారు.

అయితే ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తాము మెచ్చిన పార్టీనే గెలుస్తుందని బలంగా నమ్ముతారు.. అందులో ఎవరినీ తప్పు పట్టలేము. ఇటువంటి సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా కొన్ని సర్వేలు చేపట్టి గెలుపు తమదే నంటూ భుజాలు గజాలు చేసుకుంటున్నాయి. ప్రీ-పోల్ సర్వే తమకే అనుకూలంగా ఉన్నందున తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలంటూ మరింత ప్రచారం చేసుకుంటున్నాయి.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఏది ఫేక్ నో.. ఏది రియల్ నో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ఓ సర్వే చేసింది. ఈ ప్రీ-పోల్ సర్వే ద్వారా ఓటరు నాడిని పసిగట్టి.. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అంచనా వేసి సంచలన సర్వేను విడుదల చేసింది.

మే 13వ తేదీన రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీనికోసం ఇప్పటికే ఎన్నికల సంఘం కసరత్తులు మొదలుపెట్టగా.. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీని కాదని ప్రజలు కూటమికే అధికారం కట్టబెట్టనున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 116 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తేలింది. వైసీపీ ప్రభుత్వం కేవలం 59 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని తేలింది.


టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా.. 69 స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని సర్వే తేల్చింది. 27 స్థానాల్లో అధికారి పార్టీ పోటీ ఇస్తున్నా సరే విజయం మాత్రం టీడీపీకే దక్కతుందని సర్వే తేల్చింది. మొత్తంగా 144 స్థానాలకు గాను 96 స్థానాలు టీడీపీ దక్కించుకోనున్న తెలుస్తోంది. జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి.. 16 స్థానాలను కైవసం చేసుకుంటుదని సర్వే అంచనా.

కూటమిలో భాగంగా 10 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగుతున్న బీజేపీ.. 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. ఇకపోతే వై నాట్ 175 అంటున్న వైసీపీ ప్రభుత్వం కేవలం 59 స్థానాలకే పరిమితం కానున్నట్లు సర్వేలో వెల్లడైంది. గతంలో వైసీపీకి 151 స్థానాలు రాగా.. ఐదేళ్ల పాలనలో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లి 59 స్థానాలకే పరిమితం చేయనున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది.

YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ

YS Viveka Murder Case- కడప: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. చిన్నాన్న వివేకాను హత్య చేసిన వారికి టికెట్లు సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారని షర్మిల (YS Sharmila), సునీత పలుమార్లు వ్యాఖ్యానించారు.

నేరస్తులను అసెంబ్లీ, పార్లమెంట్ లకు పంపించవద్దంటూ సైతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో కడప కోర్టులో వైఎస్ షర్మిల, సునీతలకు ఎదురుదెబ్బ తగిలింది.

వివేకా కేసుపై మాట్లాడొద్దు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావించరాదని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. బాబాయ్ వివేకా కేసుపై ప్రచారం చేయకూడదని కడప కోర్టు సునీత, షర్మిలను ఆదేశించింది. దాంతో కడప కోర్టు ఆర్డర్ను డిస్మిస్ చేయాలని హైకోర్టులో వివేకా కుమార్తె డాక్టర్ సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఆపై సునీత పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కడప కోర్టులోనే తేల్చుకోవాలని వారికి హైకోర్టు సూచించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న కడప కోర్టు.. షర్మిల, సునీత దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ.. షర్మిల, సునీతకు, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిలకు రూ.10 వేల జరిమానా విధించింది కడప కోర్టు. జిల్లా లీగల్ సెల్కు జరిమానాను కట్టాలని సూచించింది.

Health

సినిమా