BIG TV Survey: బిగ్ టీవీ ప్రీ-పోల్ సర్వే.. ఏపీ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే..

BIG TV Survey on AP Assembly Elections 2024: మరోవారంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా అన్ని పార్టీలు ప్రచార జోరును మరింత పెంచాయి. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఏ ఇద్దరు ఒకే చోటు చేరినా ఓట్లు, రాజకీయ నాయుకులు గురించే చర్చించుకుంటున్నారు. తాను అనుకున్న పార్టీనే గెలుపు గుర్రం అని.. రాష్ట్రంలో ఆ పార్టీనే చక్రం తిప్పుతుందని శఫథాలు చేసుకుంటున్నారు.

అయితే ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తాము మెచ్చిన పార్టీనే గెలుస్తుందని బలంగా నమ్ముతారు.. అందులో ఎవరినీ తప్పు పట్టలేము. ఇటువంటి సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా కొన్ని సర్వేలు చేపట్టి గెలుపు తమదే నంటూ భుజాలు గజాలు చేసుకుంటున్నాయి. ప్రీ-పోల్ సర్వే తమకే అనుకూలంగా ఉన్నందున తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలంటూ మరింత ప్రచారం చేసుకుంటున్నాయి.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఏది ఫేక్ నో.. ఏది రియల్ నో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ఓ సర్వే చేసింది. ఈ ప్రీ-పోల్ సర్వే ద్వారా ఓటరు నాడిని పసిగట్టి.. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అంచనా వేసి సంచలన సర్వేను విడుదల చేసింది.

మే 13వ తేదీన రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీనికోసం ఇప్పటికే ఎన్నికల సంఘం కసరత్తులు మొదలుపెట్టగా.. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీని కాదని ప్రజలు కూటమికే అధికారం కట్టబెట్టనున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 116 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తేలింది. వైసీపీ ప్రభుత్వం కేవలం 59 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని తేలింది.


టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా.. 69 స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని సర్వే తేల్చింది. 27 స్థానాల్లో అధికారి పార్టీ పోటీ ఇస్తున్నా సరే విజయం మాత్రం టీడీపీకే దక్కతుందని సర్వే తేల్చింది. మొత్తంగా 144 స్థానాలకు గాను 96 స్థానాలు టీడీపీ దక్కించుకోనున్న తెలుస్తోంది. జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి.. 16 స్థానాలను కైవసం చేసుకుంటుదని సర్వే అంచనా.

కూటమిలో భాగంగా 10 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగుతున్న బీజేపీ.. 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. ఇకపోతే వై నాట్ 175 అంటున్న వైసీపీ ప్రభుత్వం కేవలం 59 స్థానాలకే పరిమితం కానున్నట్లు సర్వేలో వెల్లడైంది. గతంలో వైసీపీకి 151 స్థానాలు రాగా.. ఐదేళ్ల పాలనలో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లి 59 స్థానాలకే పరిమితం చేయనున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *