Friday, November 15, 2024

Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!

వేసవి కాలం వచ్చిందంటే ఎండ, వేడి, చెమట కాయలు మామూలే.. చెమట తెచ్చే చికాకుతో అస్తమానూ చర్మం చిరాకుగా ఉంటుంది. దానితో పాటు దురద, దద్దుర్లు, జిడ్డు మామూలుగా ఉండే సమస్యలు. చెమట పొక్కులు సహజంగా అందరిలోనూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే వీటితో వచ్చే చికాకును వదిలించుకోవాలంటే మాత్రం కొన్ని చిట్కాలు పాటించక తప్పదు.

వదులుగా ఉండే దుస్తులు ధరించండి..

వేడి వల్ల ఏర్పడిన దద్దుర్లు తగ్గాలంటే ఎండ వేడికి చెమటను పీల్చే విధంగా కాటన్ వస్త్రాలను, వదులుగా ఉండే వాటిని ధరించాలి. పాలిస్టర్, నైలాన్ వంటి సింథటిక్ వస్త్రాలను ధరించండ చికాకును కలిగిస్తుంది. అందుకే వీటిని తగ్గించుకోవడం మంచిది. దీనితో దద్దుర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

హైడ్రేటెడ్‌గా ఉంటే..

వేడి దద్దుర్లకు ప్రధాన కారణాల్లో డీహైడ్రేషన్ ఒకటి. దీనితో చెమట అధికంగా ఉంటుంది. శరీరం వేడెక్కినప్పుడు చల్లబరచడానికి చెమటను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్థితిలో శరీరానికి నీటిని అందించకపోతే డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఈ చెమట వేడి దద్దుర్లు కలిగిస్తుంది. ఈ పరిస్థితిని తగ్గించడానికి దాహం అనిపించకపోయినా ఎండ సమయాల్లో నీటిని అధికంగా తీసుకోవడం మంచిది. అలాగే అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల హైడ్రేటింగ్ గా ఉంచుతాయి.

వేడి అధికంగా ఉన్నప్పుడు ఎండ తగ్గిన తర్వాత సాయంత్రాలు చల్లని గాలికి ఆరుబయట ఉండేట్టుగా చూసుకోవాలి. కాస్త శరీరం చల్లబడిన తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. ఇది శరీరంలో చెమట ద్వారా పెరుకున్న బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది.

టాల్కమ్ పౌడర్…

టాల్కమ్ పౌడర్ చెమటను గ్రహించి, చర్మాన్ని పొడిగా ఉంచడానికి మంచి మార్గంగా ఉంటుంది. చర్మపు మడతల మధ్య ఘర్షణను తగ్గిస్తుంది. స్నానం తర్వాత ఒంటిని పొడిగా ఉంచాలి. మెడ, తొడలు, ఇతర భాగాల్లో టాల్కమ్ పౌడర్ రాయాలి. ఇది చర్మాన్ని చికాకు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

విరామం తీసుకోవడమే..

ఎండలో ఎక్కువ సమయం తిరిగే పనిని వాయిదా వేయండి. ఇది శరీర ఉష్ణోగ్రత పెరిగేలా చేస్తుంది. అధిక చెమట, వేడి దద్దుర్ుల కారణంగా ఏర్పడతాయి. మరీ తప్పని పరిస్థితుల్లో ఎండలో వెళ్లాల్సి వస్తే గొడుగు, తలకు టోపి వంటి వాటిని ధరించడం మంచిది.

పరిస్థితి మరీ అలా ఉంటే..

చెమట,. ఉక్క కారణంగా చెమటకాయలు అధికంగా ఉంటే మాత్రం తగిన చర్యలు తీసుకోవడం మంచిది. డాక్టర్ సలహా మేరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ తెలుగు సినిమా… దటీజ్ కృష్ణ…

యాభై ఏళ్ళ కిందే 125 దేశాల్లో రిలీజయిన మొట్టమొదటి ఇండియన్ Pan World సినిమా మన డేషింగ్ & డేరింగ్ సూపర్ స్టార్ కృష్ణ తీసిన మోసగాళ్ళకు మోసగాడు . తెలుగు సినిమా రంగంలో సాహసాలకు , మొండితనానికి , మంచితనానికి మారు పేరు కృష్ణ . ట్రెజర్ హంట్ టైటిల్ తో ఇంగ్లీషులోకి డబ్ చేసి తీసారు . తమిళంలోకి డబ్ అయితే మొత్తం సినిమా ఖర్చు ఆరు లక్షలూ అక్కడే వసూలు అయ్యాయట . హిందీలో రిలీజయితే అక్కడా కనక వర్షం కురిపించింది . 1972 లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది .

రాజస్థాన్ లోని థార్ ఎడారి , బికనీర్ కోట , శివబాడి దేవాలయం , దేవీకుండ్ సాగర్ , సిమ్లా , కుఫ్రీ , టిబెట్ కు సమీపాన గల నార్కందా స్నోఫాల్ తో పాటు సట్లెజ్ నదీ తీరాన తట్టా పానీ ప్రాంతాల్లో , ఆల్మోస్ట్ సినిమా అంతా ఔట్ డోర్లో తీసారు . గుర్రాలు , ఛేజింగులు , సాహసాలు , అయ్యబాబోయ్ అవన్నీ కృష్ణకే చెల్లు . నేను చూసిన ఓ డజను ఇంగ్లీషు సినిమాల్లో బాగా నచ్చింది మెకన్నాస్ గోల్డ్ . ఆ సినిమా స్థాయిలో సాంకేతికంగా అద్భుతంగా నిర్మించారు దీన్ని.

కె యస్ ఆర్ దాస్ – కృష్ణల కాంబినేషన్ లక్కీ కాంబినేషన్ . వి యస్ ఆర్ స్వామి ఫొటోగ్రఫీ , ఆదినారాయణరావు బేక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఎవర్ గ్రీన్ సినిమాగా తీర్చిదిద్దింది . చెప్పుకోవలసిన మరో వ్యక్తి ఆరుద్ర . ఆయనే కధతో పాటు మాటల్నీ చాలా రుచికరంగా వండారు .


ఈ సినిమా పేరు చెప్పగానే ఎవరికయినా ముందుగా గుర్తుకొచ్చేది నాగభూషణమే . జిత్తులమారి నక్క పాత్ర . అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే సిగ్గూశరం లేని పాత్ర . ఆరోజుల్లో అలాంటోళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టే సంఖ్యలో ఉండే వారు . ఇప్పుడు వాళ్ళ సప్లయి విపరీతంగా పెరిగిపోయింది .

సాధారణంగా కృష్ణ స్వంత సినిమాలలో భారీ తారాగణం ఉంటుంది . ఎక్కువ మందిని ఎకామడేట్ చేస్తారు. విశాల హృదయుడు కృష్ణ . అదే బాటలో ఈ సినిమాలో హేమాహేమీలందరూ నటించారు . విజయనిర్మల , జ్యోతిలక్ష్మి , యస్ వరలక్ష్మి , శాంతకుమారి , గుమ్మడి , సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి , రావు గోపాలరావు , ధూళిపాళ , మరెంతో మంది నటించారు .

పాటలూ హిట్టే . కోరినదీ నెరవేరినది , కత్తిలాంటి పిల్లోయ్ , ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా పాటలు బయటా హిట్టయ్యాయి . సినిమా అంత హిట్ కాదు పాటలు . అయితే బేక్ గ్రౌండ్ మ్యూజిక్ హాలివుడ్ లెవెల్లో ఉంటుంది . బోయపాటి శీనుని కట్టేసయినా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ఉండవచ్చు అని తెలిపేందుకు తప్పక చూపాలి . అతనికే కాదు ; డైలాగులు వినిపించకుండా ఢాం ఢాం బేక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వినిపిస్తున్న దర్శకులకు , సంగీత దర్శకులకూ ఇలాంటి హిట్ సినిమాలు చూపాలి .

ఫస్ట్ రిలీజులోనే కాదు ; రిపీట్ రన్సులో కూడా ఇరగతీసేస్తున్న లెజెండరీ సినిమా ఈ మోసగాళ్ళకు మోసగాడు . మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసినట్లు గుర్తు . ఎన్ని సార్లు చూసానో గుర్తు కూడా లేదు . యూట్యూబులో ఉంది . చూడనివారు ఒకరోఅరో ఉంటే చూసేయండి . థియేటర్లో చూస్తే ఎంజాయ్ చేస్తారు .

ప్రపంచంలోనే లోతైన సముద్రపు గొయ్యి.. శాస్త్రవేత్తలకు ఇదో పజిల్‌..

మెక్సికోలోని యుకాటాన్ ద్వీపకల్పంలో ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రపు బిలం ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రాథమిక పరిశోధనలో దీని లోతు 1,380 అడుగులు అని చెప్పారు. అయితే ఇది మరింత లోతుగా ఉండవచ్చు. ఈ నీలిరంగు లోపల గుహలు, సొరంగాల నెట్‌వర్క్ ఉండవచ్చని, ఇందులో కనిపించని జీవులు కూడా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అలాంటి అనేక విషయాలు సముద్రపు లోతుల్లో దాగి ఉన్నాయి. వాటి గురించి మానవులకు అస్సలు తెలిసి ఉండదు. చాలా సార్లు మనకు ఏమైనా తెలియని విషయాలను వెతుకుతున్నప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు కనిపిస్తాయి. మెక్సికోలోని యుకాటాన్ ద్వీపకల్పంలో శాస్త్రవేత్తలు అలాంటి ఒక విషయాన్ని కనుగొన్నారు. ఇది ఒక పెద్ద సముద్ర బిలం, ఇది ప్రపంచంలోనే లోతైన బిలం అని చెప్పారు. దీనికి ‘తామ్ జా బ్లూ హోల్’ అని పేరు పెట్టారు. ఈ సముద్రపు బిలం దక్షిణ చైనా సముద్రంలో ఉన్న డ్రాగన్ హోల్ కంటే 390 అడుగుల లోతులో ఉంది. డ్రాగన్ హోల్ ఇప్పటి వరకు లోతైన సముద్రపు గుంతగా పరిగణిస్తారు. దీని లోతు 990 అడుగులు.

ఈ నీలిరంధ్రము ఇప్పటి వరకు చేరుకోనంత వరకు విస్తరించి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ మెరైన్ సైన్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనంలో, చెతుమల్ బేలో ఉన్న తామ్ జా బ్లూ హోల్ సముద్ర మట్టానికి కనీసం 1,380 అడుగులు (1,380 అడుగులు) దిగువన ఉందని స్కూబా – డైవింగ్ యాత్రలో తీసుకున్న కొత్త కొలతలు సూచిస్తున్నాయని పరిశోధకులు నివేదించారు. 420 మీటర్లు వరకు విస్తరించి ఉంది. ఈ నీలిరంగు లోపల గుహలు, సొరంగాల నెట్‌వర్క్ ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఇది ఇప్పటివరకు మనం మానవులు కూడా చూడని జీవులను కలిగి ఉండవచ్చు.

నీలిరంధ్రాలు ఎలా ఏర్పడతాయి ?

Discovery.com ప్రకారం, నీలిరంధ్రాలు వాస్తవానికి నిలువు సముద్రపు గుహలు, ఇవి మంచు యుగంలో హిమనదీయ ప్రవాహాల ద్వారా వేలాది సంవత్సరాలుగా ఏర్పడ్డాయి. ఈ భారీ సింక్ హోల్స్ తరచుగా వందల అడుగుల కిందకు విస్తరించి ఉంటాయి. బ్లూ హోల్ లోపల ఆక్సిజన్ కొరత ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భారీ క్రేటర్స్‌లో హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు నిండి ఉండటం వల్ల అవసరమైన పరికరాలు లేకుండానే ప్రజలు పాతాళంలోకి వెళ్లడం ప్రమాదకరం. అయితే త్వరలోనే ఈ నీలిరంగు దిగువకు చేరుకుంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

బహమాస్‌లోని బ్లూ హోల్‌లో బాక్టీరియా కనిపించింది..

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం 2012 లో బహామాస్‌లోని బ్లూ హోల్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు గుహల లోతులో బ్యాక్టీరియాను కూడా కనుగొన్నారు. అయితే ఇది మినహా అక్కడ వేరే జీవం కనిపించలేదు. ఇప్పుడు ఈసారి ‘తామ్ జా బ్లూ హోల్’ దిగువన శాస్త్రవేత్తలు ఏమి కనుగొంటారో చూడాలి.

Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌‌ బోనులో చిక్కిన చిరుత, వారం రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత

Samshabad Leopard: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. గత వారం రోజులుగా చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత వారం చిరుతను గుర్తించిన విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖకు సమాచారం ఇచ్చారు.
చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేసినా వాటికి చిక్కకుండా తిరుగుతోంది. రెండ్రోజుల క్రితం ఏకంగా రన్ వేపై ప్రత్యక్షమైంది. చిరుత పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఓ దశలో చిరుత బోనులో చిక్కకపోవడంతో దానిని మత్తు మందు ఇచ్చి బంధించాలని భావించారు.

సీఐఎస్ఎఫ్ అధికారులు కూడా చిరుత ఎయిర్‌పోర్ట్‌లోకి రాకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేకు సమీపంలో గత ఆదివారం చిరుత కలకలం సృష్టంచింది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు పెట్రోలింగ్ సిబ్బంది రన్ వే పై చిరుతను గుర్తించారు. చిరుతను పట్టుకునేందుకు వెంటనే ఆపరేషన్ చేపట్టారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిరుత సంచరిస్తుందనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు పెట్రోలింగ్ సిబ్బంది మొదట చిరుతను గుర్తించారు.

రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ రన్ వే పై చిరుత దర్శనం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు, వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఆపరేషన్ చిరుత చేపట్టారు. ఆహారాన్ని వెదక్కుంటూ చిరుత ఎయిర్‌ పోర్ట్ ప్రహారీ దాటి లోపలకు వస్తున్నట్టు గుర్తించారు. దీంతో రన్ వే పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్(Shamshabad) పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ప్రహరీ గోడను దూకి ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి ప్రవేశించింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు గుర్తించారు.

చిరుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడను దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లు తగలడంతో కంట్రోల్ రూమ్ లో అలారం మోగింది. దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టు సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుతతో పాటు రెండు కూనలు ఉన్నట్లు ఎయిర్ పోర్టు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చేపట్టారు. వారం రోజులుగా రాత్రి సమయాల్లో ఎయిర్‌ పోర్ట్‌లోకి వస్తున్న చిరుత వచ్చిన మార్గంలోనే బయటకు వెళ్లిపోతోంది. చిరుతను బంధించేందుకు పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసి అందులో ఎరలు ఉంచారు.

బోనులో ఉంచిన మేక మాంసాన్ని తీసుకెళ్లిన చిరుత అందులో చిక్కలేదు. దీంతో మత్తు ప్రయోగించాలని భావించారు. చిరుత కదలికలను తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు, బోన్ లు ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఒకసారి శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుత కలకలం రేపింది. తాజాగా ఇప్పుడు మరోసారి చిరుత సంచారాన్ని గుర్తించారు. ఎట్టకేలకు అధికారుల ప్రయత్నాలు ఫలించి శుక్రవారం రాత్రి బోనులో చిక్కినట్టు ప్రకటించారు. వైద్య పరీక్షల తర్వాత చిరుతను సురక్షిత ప్రాంతంలో విడిచి పెట్టనున్నారు. చిరుత కూనల కోసం గాలింపు చేపట్టారు.

అమిత్ షా ఫేక్ వీడియో కేసులో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ పోలీసులకు చిక్కకుండా తెలంగాణ పోలీసుల భారీ స్కెచ్..!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ కామెంట్ చేస్తున్న రిజర్వేషన్ల రద్దు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు నోటీసుల పేరుతో యాక్షన్‌లోకి దిగగానే దానికి కౌంటర్‌గా తెలంగాణ పోలీసులు మాస్టర్ స్కెచ్ వేశారు. విచారణ పేరుతో ఢిల్లీకి పిలిపించాలనుకున్న వ్యూహం ఆలస్యం అవుతుండడంతో మరికొద్దిమందికి నోటీసులు ఇవ్వడానికి, ఇప్పటికే నోటీసులు అందుకున్నవారిని అరెస్టు చేయడానికి, వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. దీన్ని పసిగట్టిన తెలంగాణ పోలీసులు ఫేక్ వీడియోతో సంబంధం ఉందన్న అనుమానంతో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించకపోయినా వారంతా సీసీఎస్ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ఢిల్లీ పోలీసుల అదుపులోకి వెళ్లడానికి ముందే తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లను పట్టేశారు. ఆ రాష్ట్ర పోలీసుల దర్యాప్తులోకి వెళ్లకుండా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. మన్నె సతీష్, నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్, గీత, విష్ణు, వంశీ అనే ఏడుగురు ప్రస్తుతం సీసీఎస్ పోలీసుల నియంత్రణలో ఉన్నట్లు సమాచారం. వారిని కస్టడీలోకి తీసుకున్నట్లుగానీ, అరెస్టు చేసినట్లుగానీ పోలీసులు చూపకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఆ ఏడుగురి కుటుంబ సభ్యుల తరఫున హెబియస్ కార్పస్ పిటిషన్ కోర్టులో దాఖలయ్యే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఢిల్లీ పోలీసుల అదుపులోకి వెళ్తే ఈ వ్యవహారం మరింత వేడెక్కుతుందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వీరెక్కడ ఉన్నారన్నది గోప్యంగానే ఉండిపోయింది.

అమిత్ షా ఫేక్ వీడియోకు సంబంధించి బీజేపీ స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి గత నెల 27న సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ పోలీసులు ఒకవైపు దర్యాప్తులో భాగంగా తెలంగాణకు వచ్చి నోటీసులు ఇవ్వడంతో ఏ క్షణమైనా వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావించింది. దీంతో వారి కంట్రోల్‌లోకి వెళ్ళకుండా రాష్ట్ర పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. ఒకవేళ ఢిల్లీ పోలీసులు ఒత్తిడి తెచ్చినట్లయితే సైబర్ క్రైమ్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ (నెం. 1014/2024) ప్రకారం వారిని విచారిస్తున్నామని, అవసరమైతే అరెస్టు చేస్తామని చెప్పి ఇక్కడే ఉంచే అవకాశమున్నది. కేసు ఎంక్వయిరీలో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నామని వివరించి ఢిల్లీ పోలీసులకు అప్పజెప్పకుండా తెలంగాణ పరిధిలోనే ఉంచాలన్నది ప్లాన్.

ఢిల్లీ పోలీసులు గత నెల 28న గాంధీభవన్‌కు వెళ్ళి కొద్దిమందికి నోటీసులు ఇచ్చే విషయమై కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి రామచంద్రారెడ్డిని కలిసి మాట్లాడి నలుగురు సోషల్ మీడియా సెల్ వారియర్లకు నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం పీసీసీ చీఫ్‌గా ఉన్నందున ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో మరికొద్దిమందికి నోటీసులు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు గ్రహించిన కాంగ్రెస్ లీడర్లు జాగ్రత్తపడి కొద్దిమంది సోషల్ వారియర్లను ఢిల్లీ పోలీసులకు అందుబాటులో లేకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా ఏడుగురి గురించి వార్తలు వస్తున్నట్లుగానే మరికొద్దిమంది కాంగ్రెస్ సోషల్ వారియర్లు సైతం త్వరలో రాష్ట్ర పోలీసుల అదుపులోకి వెళ్ళే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు ఒకే విడతలో మే 13న పోలింగ్ జరగనున్నందున అప్పటిలోగా మరికొద్దిమందికి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకోవాలని, విచారణకు తీసుకెళ్ళాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం సైతం ఒక టీమ్ గాంధీభవన్‌కు వచ్చి ఎంక్వయిరీ చేసింది. ఈ విషయాన్ని పసిగట్టిన స్థానిక బేగంబజార్ పోలీసులు ఏ కారణంతో గాంధీభవన్‌కు వెళ్ళారంటూ వారిని ఆరా తీసినట్లు తెలిసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ తన విమర్శల వేడిని పెంచుతూ ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. పొలిటికల్ డిబేట్‌కు దారితీసింది. పోలింగ్ జరిగే లోపు అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులు, దాన్ని నివారించాలని రాష్ట్ర పోలీసులు భావిస్తుండడంతో ఏ రోజు ఏ టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Postal Ballot : పోస్టల్ బాలట్ ద్వారా ఓటు వేయు విధానం.. ఇలా అయితే ఇన్వాలిడ్ చేస్తారు…. పూర్తి వివరాలు

Oplus_131072

పోస్టల్ బ్యాలట్ లెక్కేంచేటప్పుడు ఈ క్రింది విషయాలు పరిగణనలోకి తీసుకొని పోస్టల్ బ్యాలట్ invalid చేస్తారు.

1.Form 13A డిక్లరేషన్ లో అసెంబ్లీ / పార్లమెంట్ పేర్లు వ్రాసారా, లేదా.

2 అదే Form 13A లో మీకు ఇచ్చిన పోస్టల్ బ్యాలట్ సీరియల్ నెంబర్ ఖాళీ లో పూరించారా లేదా.

3.Form 13 A లో పోస్టల్ బ్యాలట్ వేసే వ్యక్తి సంతకం చేసి, అడ్రస్ వ్రాసారా? లేదా?

4.అదే Form 13A డిక్లరేషన్ లో గెజిటెడ్ సంతకం ఉన్నదా? లేదా.
గెజిటెడ్ సంతకం క్రింద స్టాంప్ ఉన్నదా? లేదా తప్పనిసరిగా చూస్తారు అవి లేకపోతే మన పోస్టల్ బ్యాలట్ invalid చేస్తారు.

5.బ్యాలట్ పేపర్ లో మనకు నచ్చిన వారికి ఓటు మార్క్ చేసిన తరువాత ఆ బ్యాలట్ పేపర్ ను తగిన రీతిలో మడత పెట్టి inner కవర్ “A” లో ఉంచి కవరు అతికించాలి. మరియు కవరు పైన వివరాలు పూరించి తప్పనిసరిగా బ్యాలట్ సీరియల్ నెంబర్ కవరు పైన కూడా వేయాలి. అక్కడ బ్యాలట్ సీరియల్ నెంబర్ వేయకపోతే మీ ఓటు invalid అయినట్లే.
6.ఇప్పుడు డిక్లరేషన్ (Form 13A), మరియు inner”A”.బ్యాలట్ ఉంచి అతికించిన కవరు ఈ రెండు కలిపి outer cover “B” ( Form 13 C) లో ఉంచి outer cover”B” అతికించాలి.outer cover పైన వివరాలు పూర్తి చేసి signature of the voter అని ఉన్నచోట తప్పనిసరిగా సంతకం చేయాలి.

***
పోస్టల్ బ్యాలట్ లెక్కించేటపుడు
1. డిక్లరేషన్ పై assembly/పార్లమెంట్ వ్రాసారా, లేదా
2. బ్యాలట్ సీరియల్ నెంబర్ ఉన్నదా, లేదా
3. గెజిటెడ్ signature ఉన్నదా లేదా
4. బ్యాలట్ పేపర్ లో సరిగా tick/cross మార్క్ సరిగా గుర్తించారా, లేదా
5. బ్యాలట్ పేపర్ ఉంచిన inner “A” cover పైన బ్యాలట్ సీరియల్ నెంబర్ వేసారా, లేదా
6. డిక్లరేషన్ (Form 13A), inner “A” (Form 13B బ్యాలట్ ఉంచిన కవర్ ) ఈ రెండు outer cover”B” నందు ఉంచి outer కవర్ “B” పైన signature of the voter అన్న చోట సంతకం ఉందా, లేదా అని చూసి అన్ని సక్రమంగా ఉంటే మీ పోస్టల్ బ్యాలట్ లెక్కింపు లోనికి వెళుతుంది. ఇందులో చెప్పిన ఏ ఒక్కటి సరిగా లేకపోయినా మీ పోస్టల్ బ్యాలట్ invalid అవుతుంది.

కావున ఫ్రెండ్స్

మనం వేసే పోస్టల్ బ్యాలట్ సద్వినియోగం అయ్యే విధంగా అందరు తగుజాగ్రత్తలు తీసుకొని, పోస్టల్ బ్యాలట్ invalid కాకుండా ఉండాలని కోరుతున్నాము.

Breakfast : వామ్మో. అన్నాన్ని బ్రేక్ ఫాస్ట్ లో తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.!

Breakfast : సహజంగా చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు.. బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, వడ, దోశ లాంటివి చేసుకొని తింటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం బ్రేక్ ఫాస్ట్ లో అన్నాన్ని తినేస్తూ ఉంటారు. టిఫిన్ ఇడ్లీ, వడ, దోశ ఇలాంటివి చేయలేక డైరెక్ట్ గా అన్నమే తినేస్తూ ఉంటారు.. అయితే బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా..? బ్రేక్ ఫాస్ట్ లో అన్నాన్ని తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం… కొంతమంది ప్రతిరోజు ఉదయం అన్నం తింటూ ఉంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినడం వలన కొన్ని సమస్యలు వస్తాయి.

అయితే కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అన్నం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం… రైస్ లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి మీకు రోజుకు అవసరమైన శక్తిని ఇస్తాయి. అలాగే మిమ్మల్ని రోజంతా యాక్టివ్గా ఉంచుతాయి. కానీ మీరు అన్నాన్ని మరి అధికంగా తింటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.. రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్లు మీరు బరువు పెరిగేలా చేస్తాయి.. ఆంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా: బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను డీఎన్ఏ ను దెబ్బతీసే ప్రరాడికల్స్ నుంచి మీ శరీరాన్ని కాపాడతాయి. దీంతో మీ ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం తగ్గుతుంది…గుండె జబ్బులను కంట్రోల్లో ఉంచుతుంది: అన్నం తినడం వలన అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అన్నం తింటే మీ గుండె పదిలంగా ఉంటుంది.రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది; బియ్యం లో విటమిన్ డి, మెగ్నీషియం, పొటాషియం లాంటి విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంతోపాటు మీ శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి..అధిక బరువుకి చెక్; అన్నంలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అన్నం చాలా సులువుగా జీర్ణమవుతుంది. అలాగే మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే రోజు ఉదయం బ్రౌన్ రైస్ ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం చాలా మంచిది.. ఎక్కువ ఫాలిష్ వెయ్యని బియ్యాన్ని రోజుకి మూడుసార్లు తిన్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీనిని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవచ్చు..

Chiranjeevi : చిరంజీవి అందుకే రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు.. వైరల్ అవుతోన్న కమెడియన్ సునీల్ కామెంట్స్

చాలామంది సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగా భావిస్తుంటారు. ఆయా రంగాలకు సంబంధించిన వ్యాఖ్యలు, ప్రస్తావనలు కూడా డిఫరెంట్‌గానే ఉంటాయి. ఒక రంగం వారు మరో రంగం వారిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ మధ్య అందుకు భిన్నంగా జరుగుతోంది. ఎందుకంటే సినీ ప్రముఖులు రాజకీయాల్లో చేరుతున్నారు. రాజకీయ నాయకులు కూడా సినీ ప్రముఖులతో కలిసి మెలిసి తిరుగుతున్నారు. దీంతో సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఇరువైపులా పరస్పర వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు కామన్ అవుతుండగా.. ఇటు రాజకీయ, అటు సినీ వర్గాలతో పాటు ప్రజల్లోనూ అవి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రముఖ నటుడు, కమెడియన్ సునీల్ చిరంజీవి రాజకీయ జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఒకవైపు మెగాస్టార్ సోదరుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నాడు. తమ్ముడికి సపోర్ట్‌గా చిరంజీవి కూడా పిఠాపురం నుంచి ఎలక్షన్ క్యాంపెన్‌లో పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో ప్రముఖ హాస్య నటుడు సునీల్, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి సక్సెస్ కాలేకపోవడానికి అదే కారణమంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతుండటంతో ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది.

ఇంతకీ అప్పట్లో సునీల్ ఏమన్నారంటే.. ‘‘చిరంజీవి గారిని చాలామంది పొలిటికల్‌గా సక్సెస్ కాలేదని అంటుంటారు. అది నిజమే. ఆయన సక్సెస్ కాలేదు. కానీ ఆయన వర్క్ విషయంలో మాత్రం ఆయనే టాప్. ఆయనే నెంబర్ వన్. సొంత టాలెంట్‌తోనే చిరంజీవి ఈ స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లోనూ పది మందికి ఉపయోగపడాలనుకున్నారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. ఒక నాయకుడి చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒక్కరు రాంగ్ స్టెప్ వేసినా ఫలితం ఉండదు. చిరంజీవి విషయంలోనూ అదే జరిగింది. ఆయన చుట్టూ ఉన్నవారు తప్పుడు డెసిషన్స్ తీసుకోవడంవల్ల ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అదే ఆయన సక్సెస్ కాలేకపోవడానికి కారణం’’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా మెగాస్టార్‌కు, పవన్ కల్యాణ్‌కు ప్లస్ అవుతాయా? మైనస్ అవుతాయా? అనే డిస్కషన్ నడుస్తోంది.

Btech చేసి ఖాళీగా ఉన్నారా?.. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.. నెలకు 1,20,000 జీతం

ప్రస్తుతం టెకీలకు గడ్డుకాలం దాపరించింది. ఓ వైపు లే ఆఫ్స్, మరో వైపు కొత్త నియామకాలు లేక కెరీర్ అంధకారంలో పడిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఎంప్లాయీస్ ను తొలగిస్తున్నాయి. ఉద్యోగావకాశాల కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరి మీరు కూడా బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే ఈ అవకాశాన్ని వదలకండి. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. నిరుద్యోగులకు హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గుడ్ న్యూస్ అందించింది.

ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ(హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఎలక్ట్రానిక్స్, మెకానిక్ విభాగాల్లో బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వారు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1,20,000 జీతం పొందొచ్చు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తు ఫీజు రూ. 500. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 8 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టులు
06
విభాగాల వారీగా ఖాళీలు:
అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్)- 03
అసిస్టెంట్ ఇంజనీర్(మెకానికల్)-03
అర్హత:
అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
35 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల నుంచి 1,20,000 వరకు అందిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ను ది మేనేజర్ (హెచ్ ఆర్) రిక్రూట్ మెంట్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియోనిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ:
08-05-2024

పోలింగ్ సమీపిస్తున్న వేళ జగన్ కీలక నిర్ణయం – కూటమి ఫిక్స్..!!

ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. కూటమి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ప్రతీ సభలో జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. జగన్ తన ప్రచారం లో చంద్రబాబు లక్ష్యంగా వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. విశ్వసనీయత గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో పది రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ కూటమిని ఫిక్స్ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

వైసీపీ కొత్త ప్రచారం
టీడీపీ కూటమి, వైసీపీ ఇప్పటికే తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. జగన్ నవరత్నాలను కొనాగిస్తూనే అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ పెంపుతో ప్రజల్లోకి మరోసారి తీర్పు కోసం వెళ్తున్నారు. టీడీపీ కూటమి మేనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ ప్రతీ సభలో చంద్రబాబు హామీలను నమ్మవద్దని..2014లో ఇదే తరహాలో చెప్పిన హామీలను అమలు చేయలేదని చెబుతున్నారు. ఇదే సమయంతో తన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ తరహా ప్రచారం కొనసాగిస్తూనే..ప్రచారంలో మిగిలిన సమయంలో కొత్త తరహాలో ప్రజల ముందకు వెళ్లేలా తాజాగా నిర్ణయించారు.

మేనిఫెస్టోతో ప్రతీ ఇంటికి
వైసీపీ నవరత్నాల ప్లస్‌ మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి గడపకూ వెళ్లి, ప్రతి ఓటరుకు వివరించాలని డిసైడ్ అయ్యారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని నిరుపేదలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, పట్టణాలు, పల్లెల్లోని ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా కార్యాచరణ నిర్ణయించారు. వెంటనే దీనిని ప్రారంభించాలని ఆదేశించారు.దీంతో.. జగన్‌ కోసం సిద్ధం నినాదంతో పార్టీ క్యాడర్‌ ముందుకెళ్తుంది. అదే సమయంలో టీడీపీ,జనసేన మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదనే అంశంతో పాటుగా..సాధ్యం కాని హామీలను చంద్రబాబు ఇచ్చారనేది ఈ ప్రచారంలో వైసీపీ శ్రేణులు ప్రధానంగా వివరించనున్నారు. అటు జగన్ ప్రచారంలో విశ్వసనీయత గురించి ప్రశ్నిస్తున్నారు.

కూటమిని టార్గెట్ చేస్తూ ;;;
టీడీపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి చర్చ జరుగుతోంది. వైసీపీకి మించిన సంక్షేమం అందిస్తామని టీడీపీ చెబుతోంది. ఇదే సమయంలో అసలు టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు కలిసి పోటీ చేస్తున్న బీజేపీ నమ్మటం లేదని వైసీపీ వాదిస్తోంది. ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి మరో 9 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలోనే మేనిఫెస్టోను ప్రతీ ఇంటికి తీసుకెళ్లి ఓటర్ల మద్దతు కూడగట్టాలని వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు ఎన్నికల వేళ వైసీపీ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

ఈ గింజలు ఏం చేస్తాయిలే అనుకునేరు.. నానబెట్టి ఉదయాన్నే తాగితే ఆ సమస్యలన్నీ హాంఫట్..

మన వంటగదిలో ఎన్నో రకాల ఔషధాలున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.. రోజూ.. జీలకర్ర, ఆవాలు, మిరియాలు, లవంగాలు వంటి వివిధ రకాల మసాల దినుసులను మనం వంటలలో ఉపయోగిస్తాము. వీటితో పాటు మెంతి గింజలు కూడా చాలా ముఖ్యమైనవి. మెంతులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మన వంటగదిలో ఎన్నో రకాల ఔషధాలున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.. రోజూ.. జీలకర్ర, ఆవాలు, మిరియాలు, లవంగాలు వంటి వివిధ రకాల మసాల దినుసులను మనం వంటలలో ఉపయోగిస్తాము. వీటితో పాటు మెంతి గింజలు కూడా చాలా ముఖ్యమైనవి. మెంతులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మెంతులు రక్తాన్ని పల్చగా మార్చడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. కీళ్ల నొప్పులను కూడా దూరం చేసే శక్తి మెంతులకు ఉంది. అలాగే మూత్రనాళం, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, మెంతులను నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

మెంతి గింజలను వేడి నీటిలో రాత్రంతా నానబెట్టి, లేదా గోరువెచ్చని నీటిలో మరిగించి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల 5 అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి..

జీర్ణక్రియకు మంచిది: మెంతులు సహజ యాంటాసిడ్‌గా పనిచేస్తాయి. ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి. ఎసిడిటీ, గ్యాస్ వంటి అజీర్ణ సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతి నీళ్లను తాగితే మంచి ఫలితం ఉంటుంది. వర్షాకాలం, చలికాలంలో నానబెట్టిన మెంతి నీటిని తాగడం మంచిది.

కొలెస్ట్రాల్: మెంతి నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. మెంతులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) స్థాయిలను తగ్గించడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్స్‌లో పుష్కలంగా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో బాధపడేవారు ఈ హెల్తీ డ్రింక్‌ని రోజూ తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

నెలసరి సమస్యలు: మెంతులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలు ఋతు (పీరియడ్స్) తిమ్మిరితో సహా ఇతర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మెంతి నీళ్లలోని ఆల్కలాయిడ్స్ రుతుక్రమ నొప్పిని గణనీయంగా తగ్గించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి.

బరువు తగ్గుతుంది: మెంతులు కూడా బరువు తగ్గడంలో సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. డైట్ చేసేవారు మెంతి నీటిని ఖాళీ కడుపుతో డిటాక్స్ డ్రింక్‌గా తీసుకోవచ్చు. అయితే వీటిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

జుట్టు – చర్మం: మెంతుల్లో డయోస్జెనిన్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి.

మెంతులను ఇలా నానబెట్టండి..
1 గ్లాసు వేడి నీటిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి గట్టిగా మూత పెట్టండి. రాత్రంతా నాననివ్వండి. ఉదయాన్నే ఆ నీటిని ముందుగా తాగాలి. తర్వాత మెంతి గింజలను నమిలి తినాలి.. మెంతులు చాలా చేదుగా ఉంటే ఆ మిశ్రమాన్ని వడకట్టి ఆ నీటిని మాత్రమే తాగండి..

ఏపీలో సమస్యాత్మక నియోజకవర్గాలివే: 100 శాతం వెబ్‌క్యాస్టింగ్, భారీగా బలగాల మోహరింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించింది. ఆ నియోజకవర్గాల్లో భారీగాకేంద్ర బలగాలను మోహరించడంతోపాటు ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది ఎన్నికల సంఘం. దీంతోపాటు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా పేర్కొంది.

వీటితోపాటు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ సెంట్రల్, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, అన్నమయ్య జిల్లాలోని పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది. గతంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు, అల్లర్ల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌క్యాస్టింగ్ జరుగుతుంది. సీఏపీఎఫ్ బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులు భారీగా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించనున్నారు. జిల్లా కలెక్టర్లు లేదా ఎన్నికల అధికారులు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

మే 13న జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.

మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు ఎన్నికల అధికారులు. కాగా, రాష్ట్రంలో 29,897 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్​​కుమార్​మీనా గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో 12,438 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రంలో 64 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయాలన్నారు. 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్‌కాస్టింగ్‌ చేయాలని కేంద్ర పరిశీలకులు సిఫార్సు చేశారని తెలిపారు.

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌పై వింత నాటకం

ఫాం-12 సమర్పణ గడువు ముగియడానికి కొన్నిగంటల ముందు ఎన్నికల విధులు
దరఖాస్తు సమర్పించలేక పోవడంతో ఓటుహక్కు కోల్పోయిన వందల మంది
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేస్తారని కుట్ర!

ఈనాడు, అమరావతి: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. పోస్టల్‌ బ్యాలట్‌ దరఖాస్తు ఫాం-12 సమర్పణకు గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు, గడువు ముగిసిన తర్వాత ఎన్నికల విధులు కేటాయించడంతో కొంతమంది పోస్టల్‌ బ్యాలట్‌ సదుపాయం కోల్పోయారు. పోలింగ్‌ బూత్‌లలో ఇతర పోలింగ్‌ అధికారులు(ఓపీఓ)లుగా ఎస్జీటీ టీచర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యాసంస్థల్లోని ఒప్పంద ఉద్యోగులు, ఎయిడెడ్‌ సంస్థల్లో పని చేసేవారికి విధులు కేటాయించారు. వీరందరికీ పోస్టల్‌ బ్యాలట్‌ సదుపాయం కల్పించాలి. పోస్టల్‌ బ్యాలట్‌ ఫాం-12 సమర్పణకు గడువు ఈ నెల ఒకటో తేదీతో ముగిసింది. ఈ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు, ఆ తర్వాత కొందరికి ఎన్నికల డ్యూటీలు వేశారు. సమయం లేకపోవడంతో ఇలా డ్యూటీలు పడిన వారు పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసుకోలేక పోయారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఓపీఓలుగా విధులు కేటాయించినట్లు బుధవారం సాయంత్రం తెలిపారు. అప్పటికే పోస్టల్‌ బ్యాలట్‌ దరఖాస్తు సమర్పణకు గడువు ముగిసింది. ఎన్నికల సంఘం అలసత్వం కారణంగా వీరంతా ఓటుకు దూరమయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, విజయవాడలోని లయోలా కళాశాలల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. పోస్టల్‌ బ్యాలట్‌ దరఖాస్తు సమర్పణకు గడువు పొడిగించాలని అధికారులు కోరుతున్నా పట్టించుకోని ఎన్నికల సంఘం.. ఉద్యోగులకు మాత్రం ఇంకా విధులు కేటాయిస్తూనే ఉంది.

ఏమిటీ నిర్లక్ష్యం?
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్‌ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకోకుండా చేశారు. వర్సిటీలో పనిచేస్తున్న సుమారు 200 మంది ఒప్పంద ఉద్యోగులకు ఓపీఓలుగా డ్యూటీలు వేసినట్లు మంగళవారం ఆదేశాలనిచ్చి ఒక్క రోజులోనే అంటే బుధవారంలోపు పోస్టల్‌ బ్యాలట్‌ ఫాం-12 సమర్పించాలని సూచించారు. ఫాం-12ను ఎక్కడ సమర్పించాలనే దానిపై స్పష్టతనివ్వలేదు. కొంతమందికి భీమిలి నియోజకవర్గంలో ఓటు ఉండటంతో అక్కడికి వెళ్లి ఇచ్చారు. మరికొందరు విశాఖ ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలకు వెళ్లి సమర్పించగా.. చాలామంది ఫాం-12ను అసలు ఇవ్వనేలేదు. వాస్తవంగా వర్సిటీ తరఫున వాటిని తీసుకొని సహాయ రిటర్నింగ్‌ అధికారికి సమర్పిస్తే సరిపోతుంది. కానీ, ఒప్పంద ఉద్యోగుల ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడతాయనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు విమర్శలున్నాయి. దాదాపు 150 మంది ఫాం-12 సమర్పించ లేకపోయారు. మరో నలుగురికి బుధవారమే డ్యూటీలు వేసి, అప్పుడే ఫాం-12 సమర్పించాలని ఆదేశాలిచ్చారు.

శ్రీసత్యసాయి జిల్లాలో ఎస్జీటీ టీచర్లకు ఓపీఓలుగా డ్యూటీలు వేస్తున్నట్లు బుధవారం సాయంత్రం చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం సాయంత్రంతో పోస్టల్‌ బ్యాలట్‌ దరఖాస్తు ఫాం-12 సమర్పణకు గడువు ముగిసింది. సహాయ రిటర్నింగ్‌ అధికారులు ఫాం-12 తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో వీరంతా ఓటు హక్కును కోల్పోయారు.
విజయవాడలోని లయోలా కళాశాలలో ఎయిడెడ్‌ సిబ్బందితోపాటు అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేటు వారికి విధులు కేటాయించారు. వేసవి సెలవులు కావడంతో వారు విధులకు రావడం లేదు. ఎన్నికల డ్యూటీలు వేసినట్లు ఆలస్యంగా సమాచారం ఇచ్చారు. వీరికి సంబంధించిన ఫాం-12ను సమర్పించేందుకు గురువారం సహాయ రిటర్నింగ్‌ అధికారుల వద్దకు వెళ్లగా వాటిని తీసుకోవడానికి నిరాకరించారు.

Vavilaku:పెయిన్ కిల్లర్ ఆకు.ఈ ఆకులో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదలరు.ఇది నిజం

Vavilaku:పెయిన్ కిల్లర్ ఆకు…ఈ ఆకులో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదలరు…ఇది నిజం.. విశ్రాంతి లేకుండా ఎక్కువగా పని చేయడం, గంటల తరబడి వ్యాయామాలు చేసినప్పుడు, అధిక ఒత్తిడి, జ్వరం వచ్చినప్పుడు, పోషకాల కొరత వంటి కారణాలతో ఒంటి నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి.

అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలుగుతుంది.ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు నేచురల్ పెయిన్ కిల్లర్ గా పని చేసే వావిలాకు ఒంటి నొప్పులను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.

పల్లెటూర్లలో విరివిగా లభించే వావిలాకు ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒంటి నొప్పులు ఉన్నప్పుడు స్నానం చేసే నీటిలో గుప్పెడు ఆకులు వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.

ఒక కప్పు వావిలి ఆకులు తీసుకుని మెత్తని పేస్ట్ గా చేసి రసాన్ని తీయాలి. ఒక కప్పు ఆవ నూనె, ఒక కప్పు వావిలాకు రసం వేసి బాగా మరిగించాలి. ఈ నూనెను నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనె కొంచెం గోరువెచ్చగా చేసి శరీరం మొత్తానికి పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే .ఒంటి నొప్పులు తగ్గటమే కాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి.

తలనొప్పిగా ఉన్నప్పుడు వావిలి ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి నుదురు పై రాసి పదినిమిషాలయ్యాక శుభ్రం చేసుకుంటే తలనొప్పి మాయం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Walking Tips: మీ వయస్సు ప్రకారం ఎంత దూరం వాకింగ్ చేయాలో తెలుసా..

Walking Tips: సాధారణంగా బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండడానికి వ్యాయామం, వాకింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ వంటివి చేస్తుంటారు. అయితే ఇందులో వాకింగ్ అనేది చాలా పవర్ ఫుల్ అని నిపుణులు అంటున్నారు. వాకింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్ గా, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండాలంటే కూడా వాకింగ్ సహాయపడుతుంది. ఈ తరుణంలో వాకింగ్ చేయడానికి ఒక్కో వయసు వారికి ఒక్కో లిమిట్ ఉంటుంది. అయితే ఏ వయస్సు వారు ఎంత దూరం వాకింగ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాకింగ్ అంటే ప్రతీరోజూ అరగంట సేపు నడవాలి. దీనివల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. సాధారణంగా అయితే ఒక వ్యక్తి రోజుకు 10వేల అడుగులు నడవాల్సి ఉంటుంది. ఇందులో 5 నుండి 7 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు రోజూ 12 వేల నుంచి 15వేల అడుగులు నడవాల్సి ఉంటుంది.

18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వారైతే 12 వేల అడుగులు నడవాలి. 40 సంవత్సరాలు దాటిన వ్యక్తులు అయితే 11 వేల అడుగులు నడవాల్సి ఉంటుంది. ఇక 50 సంవత్సరాలు దాటిన వారైతే 10 వేల అడుగులు నడవాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులైతే 8వేల అడుగులు నడవాల్సి ఉంటుంది.

వయసు ప్రకారం వాకింగ్ చేస్తే శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుందట. వాకింగ్ చేసే అలవాటు ఉన్న వారికి గుండె జబ్బుల సమస్యలు దరికి చేరవని అంటారు. వీరికి గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Collagen: శరీరానికి కొల్లాజెన్ ఎందుకు అవసరం? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే..!

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్, విటమిన్, మినరల్స్ తో పాటుగా చాలా అవసరం. ఇలా శరీరానికి అవసరమైన వాటిలో కొల్లాజెన్ కూడా ఒకటి. ఇది శరీరానికి ఎందుకు అవసరం, దీని ప్రయోజనాలు ఏంటంటే..

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్, విటమిన్, మినరల్స్ తో పాటుగా చాలా అవసరం. ఇలా శరీరానికి అవసరమైన వాటిలో కొల్లాజెన్ కూడా ఒకటి. కొల్లాజెన్ చాలా అరుదుగా ఆహారాల నుండి లభ్యమవుతుంది. ఇది చర్మ ఆరోగ్యం నుండి ఎముకలు, కండరాలు పట్టుత్వంలో ఉండటం వరకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కొల్లాజెన్ వల్ల శరీరానికి చేకూరే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

కీళ్లనొప్పులు..

ప్రతి వ్యక్తి జీవితంలో వయసు పెరిగే కొద్దీ కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఆస్ఠియో ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుంది. ఇలా శరీరంలో తగ్గే కొల్లాజెన్ ను కొల్లాజెన్ రిచ్ పుడ్స్ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు. కీళ్లు దృఢంగా మారతాయి.

విదేశాలలో ముఖేష్ అంబానీకి ఉన్న విలాసవంతమైన ఆస్తుల చిట్టా ఇదీ..!

స్కిన్ ఎలాస్టిసిటీ..

కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వల్ల చర్మం ముడతలు పడుతుంది, వృద్దాప్యానికి లోనవుతుంది. అయితే కొల్లాజెన్ తీసుకుంటే చర్మం ఎలాస్టిసిటీ మెరుగవుతుంది. చర్మం మీద ముడతలు తగ్గి, యవ్వనంగా మారుతుంది.

గట్ ఆరోగ్యం..

కొల్లాజెన్ పేగు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది పేగు ఆరోగ్యానికి తోడ్పడే అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది గట్ లో మంటను తగ్గిస్తుంది. లీకీ గట్ సిండ్రోమ్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది.

ఎముకల నష్టం..

ఎముకలు ఎక్కువగా కొల్లాజెన్ తో తయారవుతాయి. వయసు పెరిగే కొద్దీ కొల్లాజెన్ తగ్గడం వల్ల ఎముకల ద్రవ్యరాశి కూడా తగ్గుతుంది. అదే కొల్లాజెన్ ఆధారిత ఆహారాలు తీసుకుంటే ఎముకల నష్టాన్ని నివారించవచ్చు. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

కండర ద్రవ్యరాశి..

కండరాల కణజాలానికి కొల్లాజెన్ అవసరం. కండరాలు బలంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. కొల్లాజెన్ బాగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి.

Delhi: 223 మంది ఉద్యోగులు ఔట్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) ఓ పక్క జైలు శిక్ష అనుభవిస్తుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆప్ ప్రభుత్వం నియమించిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్‌కు చెందిన 223 మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తూ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌క్సేనా ఆదేశాలు జారీ చేశారు. త‌క్ష‌ణ‌మే తన ఆదేశాలు అమ‌లులోకి రానున్నట్లు తెలిపారు.

గ‌తంలో ఢిల్లీ మ‌హిళా క‌మీష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా ప‌నిచేసిన స్వాతిమాలివాల్ అక్ర‌మాల‌కు పాల్పడ్డారని.. అనుమతి లేకుండా ఉద్యోగుల‌ను నియ‌మించార‌ని, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 40 మంది ఉద్యోగుల‌ నియామకానికి మాత్రమే అనుమ‌తి ఇస్తూ ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ ఆదేశాలు ఇచ్చింద‌ని, కానీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి లేకుండా 223 కొత్త పోస్టుల‌ను అంగీకరించారని ప్రధాన ఆరోపణ.

కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియ‌మించే అధికారం మహిళా కమిషన్‌కు లేద‌ని సక్సేనా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం కలిగించే ఎలాంటి చర్యలు తీసుకోరాదని కమిషన్‌కు తెలియజేశారు. ఈ నియామకాలు నిర్దేశించిన విధానాల ప్రకారం జరగలేదని విచారణలో తేలింది. అంతేకాకుండా DCW సిబ్బందికి వేతనం, భత్యాల పెంపుదలకు కూడా నిబంధనలు పాటించలేదని తెలిపింది.

రాజ్యసభ ఎంపీ కాకముందు ఆప్ నేత మలివాల్ తొమ్మిదేళ్లపాటు ఢిల్లీ మహిళా కమిషన్‌కు నాయకత్వం వహించారు. అయితే నియామకాల విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై మలివాల్ ఇంకా స్పందించలేదు. తాజా పరిణామం.. లెఫ్టెనెంట్ గవర్నర్, ఆప్ ప్రభుత్వం మధ్య అగ్గి రాజేసింది. సక్సేనా తమ పాలనను అడ్డుకుంటున్నారని ఆప్ ఆరోపిస్తోంది. ఆయన ఓ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని అన్నారు. లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైళ్లో ఉండగా తాజా పరిణామం చోటు చేసుకుంది.

AP Elections 2024: ఏపీ సర్కార్‌‌పై ఎన్నికల సంఘం సీరియస్

అమరావతి: ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్న దృష్ట్యా ఎన్నికల సంఘం (Election Commission) పలు నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. పలుమార్లు ఎన్నికల నియమాలను అధికార వైసీపీ తుంగలో తొక్కుతోంది. అయితే ఈ విషయం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి రావడంతో ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ సీఈఓ మీనా గురువారం మీడియా సమావేశంలో పలు కీలక విషయాలను పంచుకున్నారు. ప్రభుత్వ సింబల్‌ను కొన్ని ప్రకటనల్లో వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈసీ పర్మిషన్ కోసం వచ్చినప్పుడు బ్లర్ చేసే చూపారని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ సింబల్ ఉన్న ప్రకటలను తొలగించాలని సూచించామని తెలిపారు.

పోలింగ్ ఏర్పాట్లపై సీఈఓ మీనా ఏమన్నారంటే…

ఏపీ ఎన్నికల్లో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటు హక్కు వివియోగించుకోనున్నారని సీఈఓ మీనా తెలిపారు. ఫైనల్ ఎస్ఎస్ఆర్ కంటే తుది ఓటర్ల జాబితాలో 5.94 లక్షల మంది ఓటర్లు పెరిగారని తెలిపారు. ఏపీలో మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు రూ. 203 కోట్లు సీజ్ చేశామన్నారు. నగదుతో సహా మద్యం, గంజాయి, విలువైన ఆభరణాలను సీజ్ చేశామని చెప్పారు.

14 సెగ్మెంట్లల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ పెడుతున్నామన్నారు. అలాగే ఈ 14 సెగ్మెంట్లల్లో భద్రత కూడా పెంచుతామని చెప్పుకొచ్చారు. ఓటర్లకు ఎండతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. హోం ఓటింగ్ కోసం కేవలం 28,591 మంది మాత్రమే ఎంచుకున్నారని వివరించారు. మొత్తంగా 7,28,484 మంది హోం ఓటర్లు ఉంటే.. కేవలం 3 శాతం మాత్రమే హోం ఓటింగ్ కోరుకున్నారని తెలిపారు.

హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు(గురువారం) నుంచే ప్రారంభమైంది.. ఈ నెల 8వ తేదీతో పూర్తి అవుతుందని చెప్పారు. 8 తేదీ లోగానే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు గాజు గ్లాస్ గుర్తును మొత్తంగా 15 చోట్ల మార్చినట్లు తెలిపారు. ఆ 15 స్థానాల్లో స్వతంత్రులకు వేరే గుర్తులు కేటాయించినట్లు వివరించారు. విశాఖలో పార్లమెంట్ పరిధిలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయని చెప్పారు.

మంగళగిరి, తిరుపతి సెగ్మెంట్లల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరమని చెప్పారు. 15 వేల బ్యాలెట్ యూనిట్లను అదనంగా తెప్పించినట్లు తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను పోలీస్ అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఎవరికైనా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటే సెక్యూరిటీ ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు.374 మంది అసెంబ్లీ అభ్యర్థులకు.. 64 మంది పార్లమెంట్ అభ్యర్థులకు భద్రత కల్పించాలని పోలీస్ అబ్జర్వర్‌లు సూచించారని అన్నారు.

ఈ ఎన్నికల్లో 1.60 లక్షల బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నామన్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్లు ఎంత మేరకు వచ్చాయనేది ఇంకా ఫైనల్ కాలేదన్నారు. ఎన్నికల విధుల్లో 3.30 లక్షల మంది ఉన్నారని తెలిపారు. గోవా, హర్యానా, యానాం, తెలంగాణ నుంచి లిక్కర్ వస్తోందన్నారు.

గోవా, హర్యానా డీజీపీలతో తాము మాట్లాడామన్నారు. లిక్కర్ డంప్ , సరఫరా వెనుక ఒకరిద్దరికీ ఈ కేసుతో సంబంధముందని తెలిసిందన్నారు. ప్రతి జిల్లాలో ఎఫ్ఎస్టీ టీంలు నిఘా ఉన్నాయని తెలిపారు. మద్యం అక్రమాలను అరికడుతున్నామని ఏపీ సీఈఓ మీనా పేర్కొన్నారు.

ఎన్నికల వేళ ఉద్యోగులకు.. జగన్ సర్కార్‌ దిమ్మతిరిగే షాక్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అయినా సరే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకులివ్వడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. దీంతో.. ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి..

అమరావతి, మే 2: ఎన్నికల సమయంలో (AP Elections 2024) ఏపీ ప్రభుత్వం (AP Government) ఉద్యోగులకు కరెంట్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం కల్పించిన అకామిడేషన్‌లో కరెంటు బిల్లులు ఎక్కువ రావడంతో.. అపార్టమెంట్లలో ఉన్న వారి వద్ద నుంచే వసూలు చేయాలంటూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీ, విభాగాధిపతి కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి షేరింగ్‌‌పై ప్రభుత్వం అకామిడేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే. వీరు ఉంటున్న ప్లాట్‌ల విద్యుత్‌ బిల్లులు పరిమితికి మించి వస్తుండడంతో బిల్లులు చెల్లించాలని జీఏడీ అకామిడేషన్ విభాగాన్ని విద్యుత్ శాఖ కోరింది.
ఈ క్రమంలో పరిమితికి మించి 2లక్షల 79వేల 23 రూపాయలు విద్యుత్ వాడిన ఉద్యగులకు జీఏడీ అకామిడేషన్ విభాగం షాక్ ఇచ్చింది. ఇచ్చిన పరిమితికి మించి విద్యుత్ వినియోగించుకున్న ఉద్యోగులకు ప్రభుత్వం బిల్లు చెల్లించదని స్పష్టం చేసింది. పరిమితికి మించి వచ్చిన విద్యుత్ బిల్లులను ఆయా ప్లాట్‌లలో ఉన్న ఉద్యోగుల నుంచే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో వారి విద్యత్ కనెక్షన్ తొలగించే ప్రమాదం ఉందని పేర్కొంటూ సర్వీస్ అసోషియేషన్‌లకు ప్రభుత్వం తరపు నుంచి లేఖ రావడం ఉద్యోగులకు షాక్‌ గురయ్యేలా చేసింది.

Flipkart సేల్ మొదలైంది, ఏ యే ఫోన్ పై ఎంత ఆఫర్? లిస్ట్ చూడండి! ఆఫర్ల వివరాలు

ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఎట్టకేలకు ఈ రోజు మొదలైంది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో మే 2 నుండి మే 9 వరకు కొనసాగుతుంది. మరియు సేల్ లో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో వివిధ ఉత్పత్తులపై కొన్ని అద్భుతమైన ఆఫర్‌లు మరియు తగ్గింపులను అందిస్తుంది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో Samsung, Google, Apple, Xiaomi, Oppo మరియు మరిన్ని బ్రాండ్‌ల నుండి స్మార్ట్‌ఫోన్‌లపై కొన్ని అద్భుతమైన తగ్గింపు ఆఫర్ లను కూడా అందిస్తుంది. కాబట్టి, మీరు ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్లు మీకోసమే.

ఈ సేల్ లో బెస్ట్ డీల్‌ల కోసం ప్లాట్‌ఫారమ్ మొత్తం నావిగేట్ చేయడం మీకు చాలా కష్టం. అందుకే మేము వివిధ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల నుండి అత్యుత్తమ డీల్‌ల జాబితాను సంకలనం చేసాము. కాబట్టి, ఎటువంటి సందేహం లేకుండా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో మొబైల్‌లపై అత్యుత్తమ డీల్‌లను చూడవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 ఆఫర్ల వివరాలు : స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంక్ ఆఫర్‌లు మరియు తగ్గింపులు ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం మొబైల్ సెగ్మెంట్‌లో డీల్‌ను మరింత ఆకర్శణీయంగా కొన్ని మంచి తగ్గింపులు మరియు బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. కస్టమర్‌లు SBI క్రెడిట్ కార్డ్‌లు మరియు EMI లావాదేవీలతో 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు వివిధ స్మార్ట్‌ఫోన్‌లలో నో కాస్ట్ EMI ఎంపికలతో పాటు గొప్ప ఎక్స్ఛేంజ్ బోనస్‌లను పొందవచ్చు. ఈరోజు నుండి అమెజాన్ లో కూడా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మొదలైంది. ఇది మే 2 నుండి మే 7 వరకు కొనసాగుతుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 లో భారీ ఆఫర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్.

* ఈ సేల్‌లో, మీరు Motorola Edge 50 Pro ని రూ. 27,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

* Realme P1 Pro ప్రారంభ ధర రూ. 19,999.
* Vivo T2 Pro 5G ప్రారంభ ధర రూ. 20,999.
* Poco X6 Pro 5G ప్రారంభ ధర రూ. 22,999.
* Redmi Note 13 Pro 5Gని రూ. 21,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
* Infinix Note 40 Pro 5G ప్రారంభ ధర రూ. 19,999.
* Oppo Find N3 ఫ్లిప్‌ను రూ. 49,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
* Realme 12 Pro ప్రారంభ ధర రూ. 22,999 వద్ద అందుబాటులో ఉంది.
* Motorola Edge 40 Neo ప్రారంభ ధర రూ.19,999 వద్ద అందుబాటులో ఉంది.
* నథింగ్ ఫోన్ (2ఎ) బ్లూ ఈరోజు మొదటిసారిగా అందుబాటులోకి వస్తుంది మరియు మీరు దీన్ని రూ. 19,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

నీటిలో తేలియాడుతున్న వింత జీవి..చూసి షాక్ అయిన మత్స్యకారుడు:వీడియో వైరల్!

ఇటీవల సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చిత్ర విచిత్రమైన సంఘటనలు చూస్తున్నం. ట్వీట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎన్నో హాస్యస్పదమైన వీడియోలు , విచిత్ర విన్యాసాలు చూస్తున్నం.

ఈ భూమిపై రకరకాల జంతువులు ఉంటాయి. మనం చూడనివి ఈ భూమిపై ఎన్నో విచిత్రమైన, ప్రత్యేకమైన జీవులు దాగి ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని రకాల కొత్త జీవులు పుట్టడం చూస్తుంటాం. ఇలాంటి జంతువులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి వింత జీవులకు సంబంధించిన అనేక వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఇలాంటి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. పడవలో ప్రయాణిస్తున్న ఓ మత్స్యకారుడికి వింత అనుభవం ఎదురైంది. నీళ్లలో నుంచి పడవ లోకి ప్రవేశించిన ఓ వింత ప్రాణిని చూసి ఓ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. మత్స్యకారుడు పడవలో ప్రయాణిస్తుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నీటిలో తేలియాడుతున్న ఓ జీవి ఒడ్డుకు వెళ్తున్న పడవ దగ్గరకు వచ్చింది. వెళుతున్న పడవలో ఆ జీవి నిలబడి ఆ పడవను పట్టుకుని అందులో ఎక్కుతుంది. ఆ కోతి పడవ పైకి వచ్చి ఆ తర్వాత ముందుకు వెళ్లి కూర్చుంటుంది. వారు కోతిని బలవంతంగా దింపడానికి సమీపంలోని అటవీ ఒడ్డుకు తీసుకువెళతారు. చివరగా కోతి పడవ నుంచి దూకి సమీపంలోని అడవిలోకి వెళ్తుంది. దీన్ని స్పైడర్ కోతిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

AP Govt Employees: ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మొగ్గు ఎటు వైపు. రాజకీయ పార్టీల్లో గుబులు..

AP Govt Employees: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు Govt Empoyees, పెన్షనర్ల pensioners నాడి రాజకీయ పార్టీల Political Partysకు అందడం లేదు. వేతన జీవులు, మధ్య తరగతి ఉద్యోగస్తుల అండదండలు ఏ పార్టీకి దక్కుతాయో తెలియని పరిస్థితి ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, Teachers ఉపాధ్యాయులు గణనీయంగా ఉంటారు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీని Middle Class Voters మిడిల్ క్లాస్‌ ఓటర్లు, ఉద్యోగ వర్గాలు Employees గెలిపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

ఏపీలో 15లక్షల మంది ఉద్యోగులు…

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 14.76లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 4,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో లక్షా 28వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వంలో విలీనమైన ఏపీఎస్‌ ఆర్టీసీలో 53వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు అందుకున్న వారు దాదాపు ఆరులక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

పెన్షనర్లు….

ఏపీలో సర్వీస్ పెన్షనర్లు 3.58లక్షల మంది ఉన్నారు. సర్వీస్ పెన్షన్లపై ఆధారపడి ఫ్యామిలీ పెన్షన్ అందుకునే వారు మరో లక్ష మంది ఉన్నారు. ఇలా ప్రభుత్వ పెన్షనర్లు 4.58లక్షల మంది ఉన్నారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అన్ని శాఖల్లో, జిల్లాల్లో కలిపి లక్షా 20వేల మంది వరకు ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు 80వేల మంది, అంగన్‌ వాడీ వర్కర్లు, సహాయకులు మరో లక్షమంది ఉన్నారు. హోమ్‌ గార్డులు 15వేల మంది ఉన్నారు. మొత్తం అన్ని శాఖల్లో కలిపి 14,76వేల మంది ప్రభుత్వం నుంచి జీతాలు, పెన్షన్లు అందుకుంటున్నారు.

ఉద్యోగుల సమస్యలు పెండింగ్….

ఏపీలో దాదాపు ఏడాది కాలంగా ఉద్యోగ సంఘాలన్నీ సైలెంట్ అయిపోయాయి. రోడ్ల మీదకు ఎక్కి పోరాటాలు చేయడం లేదు. సీపీఎస్‌ ధర్నాలు, పిఆర్సీ ఆందోళనలు చాలా నెలల క్రితమే ఆగిపోయాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చదనే క్లారిటీ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలన్నీ సైలెంట్ అయిపోయాయి. గత కొన్నేళ్లుగా ఉద్యోగుల పెన్షన్లు, జీతాలు ప్రతి నెల మొదటి వారం తర్వాతే జమ అవుతున్నాయి. ఈ పరిస్థితిపై ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి గూడు కట్టుకున్నా సంక్షేమ పథకాల అమలు, నగదు బదిలీకే ప్రాధాన్యం ఇచ్చారు.

గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో నవరత్నాల అమలు, నగదు బదిలీ పథకాలకే తొలిప్రాధాన్యం దక్కింది. దీంతో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపు, డిఏ బకాయిలు, సరెండర్ లీవులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి వాటికి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలను చెల్లించకలేక పదవీ విరమణ వయసును 62ఏళ్లకు పెంచారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా పదవీ విరమణ వయసు వచ్చిన తర్వాతే బెనిఫిట్స్‌ చెల్లిస్తామని మెలిక పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యం విషయంలో కూడా పలు సమస్యలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు…

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరో మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఓటర్లుగా ఉన్నారు. బ్యాంకులు, రైల్వేలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పెట్రోలియం సంస్థలు, నేవీ, ఆర్మీ ఉద్యోగులు కూాడా గణనీయంగానే ఉన్నారు. సగటున ఒక్కో ఇంటికి నలుగురు ఓటర్లను లెక్కేసుకున్నా దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల్లో కనీసం 60-70లక్షల ఓట్లు ఉంటాయి.

త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఈ ఓట్లన్ని ఎటువైపు మొగ్గు చూపిస్తాయనేది కీలకంగా మారింది. సంక్షేమ పథకాలు అందుకునే ఓటర్లపై వైసీపీ భారీ ఆశలు పెట్టుకుంది. అదే సమయంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసుకునే వారికి నవరత్నాల్లో భాగంగా పెన్షన్లు, సంక్షేమ పథకాలను రద్దు చేశారు. 6 పాయింట్ల తనిఖీ పేరుతో లక్షల్లో లబ్దిదారులను తొలగించారు. అదే సమయంలో వారికి ఈహెచ్‌ఎస్‌ వంటి పథకాలను అమలు చేయడం లేదు.

ఉద్యోగుల సమస్యలు, వేతనాల చెల్లింపుతో పాటు అరకొర జీతాలతో ఉద్యోగాలు చేేేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పథకాల వర్తింపు అంశం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. గత ఎన్నికల్లో గెలుపొటముల మధ్య రెండు ప్రధాన పార్టీలు రెండింటికి మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే ఉండటంతో ఈ సారి ఉద్యోగుల ప్రభావం భారీగా ఉంటుందని అంచనా ఉంది.

శ్రీశైలంలో ఇకపై అవి నిషేధం! భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త!

దేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవాలయం కూడా ఒకటి. అయితే ఇది నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కొలువై ఉంది. కాగా, తరుచు కోట్లాదిమంది భక్తులు ఈ శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు తరలివెళ్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే తరుచు దేశం నలుమూలాల నుంచి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటున్న భక్తులకు తాజాగా ఆలయ ఈవో ఓ ముఖ్య గమనిక జారీ చేశారు. ఇకపై తిరుపతి వెంకటేశ్వర ఆలయం మాదిరిగానే ఇక్కడ కూడా ఆ రూల్స్ ను పాటించాలని ప్రకటించారు. ఇంతకీ అదేమిటంటే..

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గా కొలువైన శ్రీశైలం మల్లిఖర్జున స్వామి దేవాలయం గురించి అందరికీ తెలిసిందే. కాగా, ఇక్కడ తరుచు ఎంతోమంది భక్తులు ఆ భ్రమరాంబిక, మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు తరలి వెళ్తుంటారు. అయితే ఇకపై శ్రీశైలం ఆలయానికి సందర్శించిన భక్తులకు తాజాగా ఆలయ ఈవో ముఖ్య గమనిక జారీ చేశారు. అదేమిటంటే.. ఇప్పటి నుంచి శ్రీశైలంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌‌ను నిషేధించినట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఈ క్రమంలోనే ఆలయ ఆవరణతో పాటుగా శ్రీశైలం పరిధిలో.. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించకూడదన్నారు. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్‌ సంచులు వినియోగించాలని ఆదేశించారు. ఇక ప్లాస్టిక్‌ బాటిల్స్‌కు బదులుగా మట్టి, స్టీల్‌, రాగి, గాజు బాటిల్స్‌ను మంచి నీళ్ల కోసం ఉపయోగించుకోవాలన్నారు. కాగా, పర్యావరణ పరిరక్షణలొ భాగంగా.. శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఈవో తెలిపారు. ఇక వాస్తవానికి గతేడాది నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం విధించామని.. ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శ్రీశైలాన్ని ప్లాస్టిక్‌ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని దానికి అందరూ సహకరించాలని కోరారు.

ఈ క్రమంలోనే పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి పర్యవేక్షకులు, ఆయన దేవస్థానం చెక్ పోస్టు దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను శుభ్రం చేశారు. అంతేకాకుండా.. శ్రీశైలంకు వచ్చే వాహనాలను అధికారులు తనిఖీ చేశారు. ఇక వారికి ప్లాస్టిక్‌ బాటిళ్లను తీసుకురాకుండా కట్టడి చేస్తున్నారు. అయితే శ్రీశైంలో ఇకపై ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా జూట్ సంచులు, గుడ్డ సంచులు, కాగితపు కవర్లు వినియోగించాలని సూచిస్తున్నారు. కాగా, స్థానిక వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు కూడా ఈ నింబంధనలను పాటించాల్సిందేనని ఆయన కోరారు. అలాగే రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని.. ప్రతి రోజు తనిఖీలు చేపడతామని.. అప్పటికి మార్పు రాకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నారు. ఇక తిరుమలతో పాటుగా పలు దేవాలయాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం కొనసాగుతోంది. ఇప్పటికే తిరుమలలో ఈ ప్లాస్టిక్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అలిపిరి చెక్ పాయింట్ దగ్గర తనిఖీలు జరుగుతున్నాయి.. అక్కడే ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు కొండపైకి రాకుండా.. అక్కడే స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. కనుక ఇప్పుడు ఈ తరహాలోనే శ్రీశైలంలో కూడా ప్లాస్టిక్‌ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.

SIM Cards Block: పాకిస్తాన్‌లో 5 లక్షల మంది సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా..?

Pakistan: పాకిస్థాన్‌లో 5 లక్షల మందికి పైగా సిమ్ కార్డులు బ్లాక్ కాబోతున్నాయి. పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నంబర్లను బ్లాక్ చేయాలని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీని ఆదేశించింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారిపై ఈ చర్య తీసుకోనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రసంగించిన ఒక రోజు తర్వాత ఈ చర్య తీసుకోబడింది.

కాగా, రియాద్‌లో జరిగిన గ్లోబల్ బాడీ ఫోరమ్‌లో ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి పాకిస్తాన్ ఖర్చులను తగ్గించిందని అన్నారు. అంతే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించేలా అనేక ఆర్థిక సంస్కరణలు చేశామన్నారు. ప్రభుత్వ వినియోగదారులే కాకుండా ఇతర కంపెనీల కస్టమర్లకు చెందిన సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ టెలికమ్యూనికేషన్ అథారిటీని కోరింది. ఎన్నో హెచ్చరికలు చేసినా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయని వారిపై ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇక, ఆదాయపు పన్నులు చెల్లించని 5 లక్షల 6 వేల మందిపై ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మే 15లోగా ఈ 5 లక్షల మందిపై చర్యలు తీసుకోవాలని టెలికాం శాఖను పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కోరారు. దేశ ప్రజలు నిజాయితీగా పన్ను కట్టాల్సిన అవసరం ఉందని షాబాజ్ ప్రభుత్వం చెబుతోంది. పాకిస్థాన్‌లో 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కేవలం 45 లక్షల మంది మాత్రమే ఐటీఆర్‌ను దాఖలు చేయగా.. 2022లో ఆ సంఖ్య 59 లక్షలకు పైగా ఉంది. ఆదాయపు పన్ను చెల్లించని వ్యక్తులపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు కఠిన చర్యలకు దిగడానికి ఇదే కారణం.

Glass symbol: గాజు గ్లాసు గుర్తుపై తేల్చేసిన ఈసీ..

Glass symbol: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. గాజు గ్లాసు గుర్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. కామన్‌ సింబల్స్‌ జాబితాలో గాజు గ్లాసు గుర్తును చేర్చింది కేంద్ర ఎన్నికల కమిషన్‌.. ఇప్పుడు ఇదే జనసేన పార్టీకి సెగ పెడుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంలో జనసేన హైకోర్టు మెట్లు ఎక్కిన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత టీడీపీ కూడా ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది.. ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా గాజు గ్లాసు గుర్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల కమిషన్‌.. ఏపీ వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం.. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు తెలిపిన ఈసీ.. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పేర్కొంది.

ఇక, ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని కోర్టు ముందు వాదనలు వినిపించింది ఎన్నికల కమిషన్‌.. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ లను ఆర్మెడ్ ఫోర్స్ కు పంపించినట్లు కోర్టుకు తెలిపింది.. ప్రీ పోల్ అలయన్స్ ను గుర్తించాలని చట్టబద్ధత లేదని కోర్టుకు తెలిపిన ఈసీ.. జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై నిన్నే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు వెల్లడించింది.. అయితే, జనసేన పార్టీ.. టీడీపీ – బీజేపీలతో ప్రీ పోల్ అలియెన్స్ లో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది టీడీపీ.. పొత్తులో భాగంగా అన్ని పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, ప్రచారం చేస్తున్నాయని తెలిపారు టీడీపీ న్యాయవాది.. ఇక, ఇప్పటికీ సింబల్స్ మార్చటానికి స్కోప్ ఉందని ఈసీ తెలపగా.. 62 అసెంబ్లీ, 5 పార్లమెంట్ పరిధిలో గాజు గ్లాస్ గుర్తు అలానే ఉందని కోర్టులో పేర్కొంది టీడీపీ.. నిరక్షరాస్యులైన ఓటర్లు కన్ ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఈ సింబల్ ను మార్చి వేరే వాటిని స్వతంత్య్ర అభ్యర్థులకు ఇవ్వాలని కోరింది.. ప్రీ పోల్ అలయన్స్ లో ఇబ్బందులను ఈసీ గుర్తించాలని కోరింది టీడీపీ.. దీంతో, విచారణను రేపటికి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.

Sex Harassment Row: ప్రజ్వల్ రేవణ్ణకు లుకౌట్ నోటీసు జారీ

లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీయూ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుకౌట్ నోటీసు జారీ అయ్యాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం విదేశాల్లో ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. 2019లో హాసన్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ప్రజ్వల్ రేవణ్ణ ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల కేసును విచారించే ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు రేవణ్ణ త్వరగా హాజరుకావాలని, అతను హాజరుకాకపోతే అరెస్టు చేసే అవకాశం ఉందని సూచించారు. ఇదిలా ఉంటే దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావడానికి ఏడు రోజుల సమయం కావాలని అతను చేసిన అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. రేవణ్ణ ఇంట్లో వంట మనిషిగా పనిచేశానని చెప్పిన మహిళ.. జేడీఎస్ ఎంపీ తన కూతురిని వీడియో కాల్స్ ద్వారా వేధిస్తున్నాడని ఆరోపించింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన భారీ విజువల్స్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి.

మరోవైపు ఎన్నికల సీజన్‌లో ఈ ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. ఎన్నికల కోసం జేడీఎస్.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణలతో బీజేపీపై కాంగ్రెస్ సర్వత్రా దాడికి దిగింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి అశ్లీల వీడియోల పెన్‌డ్రైవ్ తీవ్ర కలకలం రేపింది. వందలాది వీడియోలు దాంట్లో ఉన్నాయి. పలువురి అమ్మాయిలతో ప్రజ్వల్ ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఇక మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. నిందితుడ్నికఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.

NCERT Recruitment 2024: పరీక్ష లేకుండా NCERT లో ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు 60,000 జీతం

Govt National Council Of Educational Research And Training (NCERT) Jobs 2024 : NCERTలో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) అకడమిక్ కన్సల్టెంట్, ట్రాన్సలేటర్, ఇతర పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించింది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ncert.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 10 మే 2024. దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరి విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు ప్రక్రియ, పోస్టుల వివరాలు మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో, మొత్తం 30 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించుకుంటారు.

పోస్టుల పూర్తి వివరాలు..

అకడమిక్ కన్సల్టెంట్- 3 పోస్టులు
ట్రాన్సలేటర్- 23 పోస్టులు
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో- 4 పోస్టులు

ముఖ్యమైన విద్యా అర్హత:
అకడమిక్ కన్సల్టెంట్ పోస్ట్ కోసం, అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి సంబంధిత సబ్జెక్టులో PhD డిగ్రీని కలిగి ఉండాలి.

ట్రాన్సలేటర్ పోస్ట్ కోసం, అభ్యర్థి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.

జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి
అకడమిక్ కన్సల్టెంట్ – 45 సంవత్సరాలు
ట్రాన్సలేటర్ – 45 సంవత్సరాలు
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో – 40 సంవత్సరాలు

నియామక ప్రక్రియ
అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీని కోసం ఎటువంటి రాత పరీక్ష నిర్వహించబడదు.

జీతం ఎంత?
అకడమిక్ కన్సల్టెంట్- రూ.60,000
ట్రాన్సలేటర్- రూ. 30,000
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో – రూ 31,000
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

దరఖాస్తు చేయడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్ ncert.nic.inకి వెళ్లండి. హోమ్ పేజీలో ఉన్న NCERT Recruitment 2024 ఈ లింక్‌పై క్లిక్ చేయండి. అవసరమైన అన్ని సమాచారాన్ని, పూర్తి వివరాలు అందులో మెన్షన్ చేయండి.

అవసరమైన పత్రాలు స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి నిర్ణీత దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ దరఖాస్తు ఫారమ్‌ను మీ వద్ద ఉంచుకోండి.

SSC మార్క్స్ మెమోస్ డౌన్లోడ్ అవుతున్నాయి…డైరెక్ట్ లింక్ ఇదే AP SSC 10th Class Marks Memos 2024

AP SSC 10th Class Marks Memos 2024

Rc.No. GE-EXAMOSSC(TEN)/2/2023-DGE Dated: 01-05-2024 PRESS NOTE

It is here by informed that, the Short Memos of the SSC Public Examinations, March 2024 hosted in this office website www.bse.ap.gov.in consequent on the release of SSC March results 2024 on 22.04.2024.

The Head Masters can download the short Memos from their School Login by clicking the Roll number of the student to get the marks memos and handover the same to the concerned students of their schools duly attested by them.

AP SSC 10th Class Marks Memos 2024 how to download AP SSC 10th Class Marks Memos 2024:

Go to   www.bse.ap.gov.in

Click on SSC Public Examinations 2024 – School Wise Results and Memorandum or click on the direct login link given below in the last

Enter User Id (School SSC Code) and Password

Click on Confirm School UDISE Code

Click on April – 2024 SCHOOL WISE RESULT

Click on Student Roll Number

Now SSC Short marks Memo Opened

Click on print Take print or save to Your PC

Download DGE Press Note
AP SSC Marks Memos 2024 Click here

IRCTC: తక్కువ బడ్జెట్‌లోనే.. షిర్డీ, శని శింగనాపూర్‌ ప్రయాణం

IRCTC tour paln low budget with Shirdi and Shani Singanapur

అనేక మంది షిర్డీ సాయిబాబాను(Shirdi sai baba), శని శింగనాపూర్(Shani Singanapur) శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలని భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.

అనేక మంది మహారాష్ట్ర(maharashtra)లోని షిర్డీ సాయిబాబాను(Shirdi sai baba), శని శింగనాపూర్(Shani Singanapur) శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలని భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే IRCTC ఈ రెండు ప్రాంతాలకు ట్రైన్ ద్వారా వెళ్లేందుకు చాలా తక్కువ ఖర్చుతో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఈ ప్యాకేజీ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ టూర్ ప్యాకేజీ పేరు: సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్

ఈ ప్యాకేజీలో షిర్డీ, శని శింగనాపూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు

ప్యాకేజీ కోడ్: SHR009

ప్రయాణ విధానం: రైలు

ఎన్ని రోజుల పర్యటన: 2 రాత్రులు, 3 రోజులు

రోజు: ప్రతి బుధవారం

ప్రయాణం: కాచీగూడ సాయంత్రం 6.40 గంటలకు ప్రారంభమవుతుంది

మీరు ఈ ప్యాకేజీని ఎంచుకుంటే మీరు రైలులో ప్రయాణించవచ్చు. ప్యాకేజీలో ఒక రోజు అల్పాహారం, స్లీపర్ క్లాస్, టోల్, పార్కింగ్, అన్ని పన్నులు ఉంటాయి. అదనంగా ప్రయాణికులకు ప్రయాణ బీమా అందించబడుతుంది. కానీ దేవాలయాలలో దర్శన టిక్కెట్లు. భోజనం, రాత్రి భోజనం, ఏదైనా అదనపు ఆహారం, రైలులో ఆహారం, టూర్ గైడ్, వ్యక్తిగత ఖర్చులు ప్యాకేజీలో చేర్చబడలేదు.

టికెట్ ధర ఎంత?

ఒకరి నుంచి ముగ్గురికి కలిపి టికెట్ బుక్ చేసుకుంటే (కంఫర్ట్ 3ఏ ఈ ప్యాకేజీ ధర ఒకరికి రూ.8,280, ఇద్దరికి రూ.7055, ముగ్గురికి రూ. 7040, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు ఇద్దరు కలిసి బుక్ చేసుకుంటే బెడ్ లేని పిల్లలకు రూ.4350. అదే స్టాండర్డ్ (SL)లో ప్రయాణించాలనుకుంటే ఒక వ్యక్తికి రూ.6595, ఇద్దరు కలిసి బుక్ చేసుకుంటే ఒకరికి రూ.5370, ముగ్గురికి రూ.5350, 5 నుంచి 11 ఏళ్ల బెడ్ లేని పిల్లలకు 4145 రూపాయలు. టికెట్‌ను సులభంగా రద్దు చేసుకునే వెసులుబాటు ఉంది. 15 రోజులలోపు టికెట్ రద్దు చేసుకుంటే 250 రూపాయలు తగ్గించి మిగిలిన మొత్తం అందిస్తారు.

MLC Kavitha: బిగ్ బ్రేకింగ్.. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు నిరాశ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ (CBI) కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తామని జడ్జి కావేరి బవేజా గురువారం ప్రకటించారు.

కాగా ఇదివరకే కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఏప్రిల్ 22న తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. నేడు (గురువారం) జైలా లేదా బెయిలా అనేది తేలుతుందని అంతా భావించారు. కానీ కవితను నిరాశకు గురిచేస్తూ తీర్పును మరోసారి కోర్టు వాయిదా వేసింది.

మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని, అరెస్ట్ నుంచి విచారణ వరకు కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని వాదనలు కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్‌గా ఉన్నందున ఎన్నికల్లో ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు.

ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని, కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని, మహిళగా ఆరోగ్యపరమైన కారణాలు పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలని కవిత న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ తరపు లాయర్లు వాదించారు. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు కవితకు తెలుసునని, ఇతరులు ఇచ్చిన స్టేట్‌మెంట్స్, ఆధారాలపై ఆమెను విచారించినా నిజాలు చెప్పడం లేదని కోర్టుకు సీబీఐ న్యాయవాదులు తెలిపారు. హై పొలిటికల్ పవర్ ఉన్న కవిత ఈ కేసు దర్యాప్తును ఆధారాలు సాక్ష్యాలను ప్రభావితం చేయగలరని బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదించింది.

Health

సినిమా