శ్రీశైలంలో ఇకపై అవి నిషేధం! భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త!

దేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవాలయం కూడా ఒకటి. అయితే ఇది నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కొలువై ఉంది. కాగా, తరుచు కోట్లాదిమంది భక్తులు ఈ శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు తరలివెళ్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే తరుచు దేశం నలుమూలాల నుంచి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటున్న భక్తులకు తాజాగా ఆలయ ఈవో ఓ ముఖ్య గమనిక జారీ చేశారు. ఇకపై తిరుపతి వెంకటేశ్వర ఆలయం మాదిరిగానే ఇక్కడ కూడా ఆ రూల్స్ ను పాటించాలని ప్రకటించారు. ఇంతకీ అదేమిటంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గా కొలువైన శ్రీశైలం మల్లిఖర్జున స్వామి దేవాలయం గురించి అందరికీ తెలిసిందే. కాగా, ఇక్కడ తరుచు ఎంతోమంది భక్తులు ఆ భ్రమరాంబిక, మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు తరలి వెళ్తుంటారు. అయితే ఇకపై శ్రీశైలం ఆలయానికి సందర్శించిన భక్తులకు తాజాగా ఆలయ ఈవో ముఖ్య గమనిక జారీ చేశారు. అదేమిటంటే.. ఇప్పటి నుంచి శ్రీశైలంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌‌ను నిషేధించినట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఈ క్రమంలోనే ఆలయ ఆవరణతో పాటుగా శ్రీశైలం పరిధిలో.. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించకూడదన్నారు. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్‌ సంచులు వినియోగించాలని ఆదేశించారు. ఇక ప్లాస్టిక్‌ బాటిల్స్‌కు బదులుగా మట్టి, స్టీల్‌, రాగి, గాజు బాటిల్స్‌ను మంచి నీళ్ల కోసం ఉపయోగించుకోవాలన్నారు. కాగా, పర్యావరణ పరిరక్షణలొ భాగంగా.. శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఈవో తెలిపారు. ఇక వాస్తవానికి గతేడాది నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం విధించామని.. ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శ్రీశైలాన్ని ప్లాస్టిక్‌ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని దానికి అందరూ సహకరించాలని కోరారు.

ఈ క్రమంలోనే పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి పర్యవేక్షకులు, ఆయన దేవస్థానం చెక్ పోస్టు దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను శుభ్రం చేశారు. అంతేకాకుండా.. శ్రీశైలంకు వచ్చే వాహనాలను అధికారులు తనిఖీ చేశారు. ఇక వారికి ప్లాస్టిక్‌ బాటిళ్లను తీసుకురాకుండా కట్టడి చేస్తున్నారు. అయితే శ్రీశైంలో ఇకపై ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా జూట్ సంచులు, గుడ్డ సంచులు, కాగితపు కవర్లు వినియోగించాలని సూచిస్తున్నారు. కాగా, స్థానిక వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు కూడా ఈ నింబంధనలను పాటించాల్సిందేనని ఆయన కోరారు. అలాగే రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని.. ప్రతి రోజు తనిఖీలు చేపడతామని.. అప్పటికి మార్పు రాకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నారు. ఇక తిరుమలతో పాటుగా పలు దేవాలయాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం కొనసాగుతోంది. ఇప్పటికే తిరుమలలో ఈ ప్లాస్టిక్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అలిపిరి చెక్ పాయింట్ దగ్గర తనిఖీలు జరుగుతున్నాయి.. అక్కడే ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు కొండపైకి రాకుండా.. అక్కడే స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. కనుక ఇప్పుడు ఈ తరహాలోనే శ్రీశైలంలో కూడా ప్లాస్టిక్‌ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *