Glass symbol: గాజు గ్లాసు గుర్తుపై తేల్చేసిన ఈసీ..

www.mannamweb.com


Glass symbol: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. గాజు గ్లాసు గుర్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. కామన్‌ సింబల్స్‌ జాబితాలో గాజు గ్లాసు గుర్తును చేర్చింది కేంద్ర ఎన్నికల కమిషన్‌.. ఇప్పుడు ఇదే జనసేన పార్టీకి సెగ పెడుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంలో జనసేన హైకోర్టు మెట్లు ఎక్కిన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత టీడీపీ కూడా ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది.. ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా గాజు గ్లాసు గుర్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల కమిషన్‌.. ఏపీ వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం.. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు తెలిపిన ఈసీ.. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పేర్కొంది.

ఇక, ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని కోర్టు ముందు వాదనలు వినిపించింది ఎన్నికల కమిషన్‌.. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ లను ఆర్మెడ్ ఫోర్స్ కు పంపించినట్లు కోర్టుకు తెలిపింది.. ప్రీ పోల్ అలయన్స్ ను గుర్తించాలని చట్టబద్ధత లేదని కోర్టుకు తెలిపిన ఈసీ.. జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై నిన్నే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు వెల్లడించింది.. అయితే, జనసేన పార్టీ.. టీడీపీ – బీజేపీలతో ప్రీ పోల్ అలియెన్స్ లో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది టీడీపీ.. పొత్తులో భాగంగా అన్ని పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, ప్రచారం చేస్తున్నాయని తెలిపారు టీడీపీ న్యాయవాది.. ఇక, ఇప్పటికీ సింబల్స్ మార్చటానికి స్కోప్ ఉందని ఈసీ తెలపగా.. 62 అసెంబ్లీ, 5 పార్లమెంట్ పరిధిలో గాజు గ్లాస్ గుర్తు అలానే ఉందని కోర్టులో పేర్కొంది టీడీపీ.. నిరక్షరాస్యులైన ఓటర్లు కన్ ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఈ సింబల్ ను మార్చి వేరే వాటిని స్వతంత్య్ర అభ్యర్థులకు ఇవ్వాలని కోరింది.. ప్రీ పోల్ అలయన్స్ లో ఇబ్బందులను ఈసీ గుర్తించాలని కోరింది టీడీపీ.. దీంతో, విచారణను రేపటికి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.