AP : మా నాన్నను ఓడించండి: ఉప ముఖ్యమంత్రి కుమారుడు

మా నాన్నను ఓడించండి అంటూ ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్‌ ప్రచారం చేస్తున్నారు.
మంగళవారం ఆయన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ చిత్రంలో ”కన్న కొడుకుకు న్యాయం చేయలేనివారు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? ఆలోచించి ఓటు వేయండి. మా నాన్న బూడి ముత్యాలనాయుడిని ఓడించండి’ అని పేర్కొన్నారు. జిల్లాలో ఆ చిత్రం వైరల్‌ అవుతోంది.