SSC CHSL Notification 2024: SSC భారీ నోటిఫికేషన్.. ఇంటర్ అర్హతతో 3,712 పోస్టులు.. అప్లై చేశారా..!

SSC CHSL Notification 2024: ఇంటర్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారికి భారీ శుభవార్త చెప్పింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

3,712 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, వయస్సు వంటి మొదలైనవి ఇప్పుడు తెలుసుకుందాం..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా 3,712 ఖాళీలను భర్తీ చేయనుంది. ఎస్ఎస్‌సీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 8, 2024న ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రంలో లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షా విధానం, ఫీజు, చివరి తేదీ వంటి మొదలైన విషయాలను కింద తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య
3,712

విభాగాలు
లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
డేటా ఎంట్రీ ఆపరేటర్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఏ

దరఖాస్తు విధానం
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా ఎస్ఎస్‌సీ వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు
ఇంటర్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు
ఈ పోస్టులకు అప్లై చేయలనుకునే అభ్యర్థుల వయస్సు.. 18 ఏళ్ల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 08-04-2024
దరఖాస్తు చివరి తేదీ: 04-05-2024
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 10-05-2024 నుంచి 11-05-2024 తేదీల మధ్య మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశాన్ని SSC బోర్డు కల్పించింది.

పరీక్షా ఫీజు
సాధారణ అభ్యర్థులు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ కు చెందిన వారికి ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్ ఎగ్జామినేషన్ మూడు దశలుగా జరగుతుంది.
టైర్-1 పరీక్ష 1 నుంచి 5 & 8 నుంచి 12-07-2024 తేదీల్లో జరుగుతుంది.
టైర్-2 పరీక్షకు సంబంధించిన తేదీలను SSC బోర్డు వెల్లడించలేదు.
టైర్-3లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది.

అయితే టైర్-1 పరీక్షలో అర్హత మార్కుల సాధించిన వారు మాత్రమే టైర్-2 పరీక్షకు అర్హులవుతారు. టైర్-2 పరీక్షలో కూడా సెలక్ట్ అయిన వారికి టైర్-3 టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ మూడు దశల్లో ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో కూడా ఎవరైతే ఎంపిక అవుతారో వారికి ఉద్యోగం లభిస్తుంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్ ఎగ్జామినేషన్ కు అప్లై చేయాలకునే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం www.ssc.nic.in వెబ్​సైట్​ ను సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *