Saturday, November 16, 2024

28 లక్షల జీతం వచ్చే ఉద్యోగం మానేసిన ఐఐటీ గ్రాడ్యుయేట్.. ఇప్పుడు నెలకు కోటి ఆదాయం

ఐఐటీ, ఐఐఎం వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదివిన వారు సాధారణంగా అత్యధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎంచుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఐఐటీలు, ఐఐఎంలలో చదివిన వారు వినూత్న స్టార్టప్‌లను ప్రారంభించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కొందరు ఇండస్ట్రీలో సక్సెస్‌లు సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వారిలో సాయికేష్ గౌడ్ ఒకరు. సాయికేష్ ఐఐటీ గ్రాడ్యుయేట్ మరియు ఇటీవల తన వెంచర్ కోసం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాయికేష్ సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఏడాదికి రూ.28 లక్షలు వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత కంట్రీ చికెన్ కో అనే కంపెనీని స్థాపించిన సాయికేశ్.. ప్రస్తుతం నెలకు రూ.కోటి సంపాదిస్తున్నాడు. దీని ద్వారా పారిశ్రామికవేత్త కావాలని కలలు కంటున్న యువతకు సాయికేష్ స్ఫూర్తిగా నిలిచారు.

సాయికేశ్ ఐఐటీ వారణాసి నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వెంటనే ఓ కంపెనీ నుంచి రూ.28 లక్షలు జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే, వ్యాపారవేత్త కావాలనే అతని కల అతన్ని ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టేలా చేసింది. సాయికేశ్‌ ఉత్సాహాన్ని, అభిరుచులను గమనించిన హేమాంబర్‌రెడ్డి పరిశ్రమలో అతనితో చేతులు కలపడానికి ముందుకు వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ సమీ ఉద్దీన్‌తో కలిసి ‘కంట్రీ చికెన్ కో.’ ప్రారంభించారు హేమాంబర్ రెడ్డికి పౌల్ట్రీ పరిశ్రమలో నైపుణ్యం ఉంది. మాంసం పరిశ్రమ ప్రక్రియల గురించి కూడా అవగాహన ఉంది. అలా హేమాంబర్ రెడ్డి అనుభవంతో పాటు సాయికేష్ నిబద్ధత, కఠోర శ్రమతో ఈ వెంచర్ తక్కువ కాలంలోనే విజయవంతమైంది.

మొదట్లో, చాలా మంది అతని వ్యాపారం గురించి అసహ్యించుకున్నారు. అయితే, సాయికేష్ సంకల్పం మరియు పట్టుదల కంట్రీ చికెన్ కోను విజయపథంలో నడిపించాయి. ఇప్పుడు సాయికేష్ మరియు అతని బృందం భారతదేశపు మొట్టమొదటి ప్రామాణికమైన ఆర్గానిక్ చికెన్ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ప్రగతినగర్‌లో ఈ రెస్టారెంట్లను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్లు ఏర్పాటయ్యాక 70 మందికి ఉపాధి లభించింది.

కంట్రీ చికెన్ కో. ఇది దక్షిణ భారత రాష్ట్రాలలో 15,000 మంది రైతులతో టై-అప్‌లను కలిగి ఉంది. వారి నుండి నాటు కోళ్లను పోటీ ధరలకు కొనుగోలు చేస్తుంది. ఇకపై కంట్రీ చికెన్ కో. ఆరోగ్యకరమైన కోళ్ల పెంపకం పద్ధతులపై రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ అభ్యాసం కస్టమర్‌లకు రుచికరమైన, అద్భుతమైన నాణ్యమైన చికెన్‌ని అందించడానికి కంపెనీని ఎనేబుల్ చేసింది. తాజా నివేదికల ప్రకారం, 2022-2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 5 కోట్లను ఆర్జించనుంది. ముఖ్యంగా జనవరి 2022 నుండి ఏప్రిల్ 2023 మధ్య కాలంలో ఈ కంపెనీ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఇప్పుడు దాని నెలవారీ ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.1.2 కోట్లు. వరకు పెరిగింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు.

Personal Loan: పర్సనల్ లోన్‌ను గడువు కంటే ముందే చెల్లిస్తే ఇన్ని లాభాలు!

Benefits Of Personal Loan Prepayment: ప్రజలు బ్యాంక్‌ల నుంచి తీసుకునే రుణాల్లో వ్యక్తిగత రుణాల సంఖ్య చాలా ఎక్కువ. పర్సనల్ లోన్ ఒక అసురక్షిత రుణం (Unsecured Loan). ఈ లోన్‌ కోసం ఏ ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. రుణం చాలా సులభంగా లభిస్తుంది. పేపర్ వర్క్ కూడా తక్కువ.

అయితే.. మిగిలిన బ్యాంక్‌ లోన్లతో పోలిస్తే వ్యక్తిగత రుణం కాస్త ఖరీదైనది, దీనిలో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అంటే, రుణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యయాన్ని పరిమితం చేయడానికి పర్సనల్‌ లోన్‌ ముందస్తు చెల్లింపు (Prepayment Of Personal Loan) ఒక సరైన మార్గం.

ముందస్తు చెల్లింపు అంటే ఏంటి?
పర్సనల్ లోన్ ప్రిపేమెంట్ అంటే లోన్ అగ్రిమెంట్‌లో చెప్పిన సమయం లేదా లోన్‌ టెన్యూర్‌ కంటే ముందే మొత్తం బాకీని లేదా లోన్‌లో కొంత భాగాన్ని చెల్లించడం. మీరు తీసుకున్న వ్యక్తిగత రుణాన్ని గడువుకు ముందే తిరిగి చెల్లించినప్పుడు, బ్యాంకులు ఔట్‌ స్టాండింగ్ అమౌంట్‌కే (మిగిలివున్న రుణ మొత్తం) ఛార్జీ విధిస్తాయి. దీనిని ఫోర్‌క్లోజర్ ఛార్జ్ (Foreclosure charge) అంటారు. రుణం తీసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉన్నట్లే, రుణాన్ని మూసివేయడానికి కూడా ఫోర్‌క్లోజర్ ఛార్జీలు చెల్లించాలి.

ఫోర్‌క్లోజర్ ఛార్జ్ ఎంత ఉంటుంది?
ఇది, తీసుకున్న రుణం, రుణదాత (బ్యాంకు) నిబంధనలు & షరతులపై ఆధారపడి ఉంటుంది. ఒక బ్యాంక్‌కు, మరో బ్యాంక్‌కు ముందస్తు చెల్లింపుపై ఛార్జీ మారుతుంది. చాలా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) లోన్ ప్రి-పేమెంట్‌పై లాక్-ఇన్ పీరియడ్‌ను (Lock-in period on loan prepayment) విధిస్తాయి. ఈ లాక్‌-ఇన్‌ పిరియడ్‌లో లోన్‌ క్లోజ్‌ చేయడానికి ఉండదు, బ్యాంక్‌ను బట్టి ఇది కొన్ని నెలలు ఉంటుంది. ఈ వ్యవధి తర్వాత రుణం పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించొచ్చు. ఈ కేస్‌లో, ఔట్‌ స్టాండింగ్‌ అమౌంట్‌ మీద 2 నుంచి 5 శాతం వరకు ప్రి-పేమెంట్ పెనాల్టీ లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జీని వసూలు చేస్తారు.

ఇప్పుడు కొన్ని బ్యాంక్‌లు ఫోర్‌క్లోజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. అంటే.. లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ముగిసిన తర్వాత మిగిలిన ఔట్‌స్టాండింగ్‌ మొత్తాన్ని కట్టేస్తే చాలు. బ్యాంక్‌లు అదనంగా ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు.

వడ్డీ డబ్బు ఆదా
వ్యక్తిగత రుణాన్ని ముందుగానే తిరిగి చెల్లించడం వల్ల వడ్డీ రూపంలో ఖర్చు చేసే డబ్బు తగ్గుతుంది. మీరు ఎంత త్వరగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే అంత తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం, వివిధ బ్యాంకుల వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు (Interest rates on personal loans) 9.99% నుంచి 24% మధ్య ఉన్నాయి. అధిక వడ్డీకి లోన్‌ తీసుకున్న వ్యక్తులు, అ అప్పును ముందుగానే తిరిగి చెల్లించడం మంచిది. పర్సనల్ లోన్ ప్రి-పేమెంట్ వల్ల, వడ్డీ రూపంలో చెల్లించే డబ్బు ఆదా అవుతుంది.

మరికొన్ని ప్రయోజనాలు
వ్యక్తిగత రుణాన్ని గడువుకు ముందే తిరిగి చెల్లించడం వల్ల లోన్‌ EMI మిగులుతుంది, మీ నెలవారీ బడ్జెట్ మెరుగుపడుతుంది. ఇతర రుణం తీసుకోవడానికి డౌన్ పేమెంట్‌ రూపంలో పొదుపు చేయడం, పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించడం లేదా పదవి విరమణ ప్రణాళిక వంటి ఇతర ఆర్థిక లక్ష్యాల కోసం మీరు ఆ డబ్బును ఉపయోగించవచ్చు.

పర్సనల్ లోన్ ప్రి-పేమెంట్ తర్వాత మీ క్రెడిట్ స్కోర్‌పై తక్షణం ఉండదు. అయితే, మొత్తం లోన్‌ను ముందుగానే చెల్లించినందున దీర్ఘకాలంలో క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మీరు భవిష్యత్తులో తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందొచ్చు.

85 అంగుళాల 4K స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసిన Xiaomi ! ధర,స్పెసిఫికేషన్లు

షియోమీ సంస్థ నుండి కొత్త Xiaomi TV S85 Mini LED స్మార్ట్ టీవీ మోడల్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఈ 85 అంగుళాల టీవీ 64జీబీ స్టోరేజ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, వై-ఫై 6 వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో విడుదలైంది.ఈ అద్భుతమైన టీవీ ధర మరియు ఫీచర్ల వివరాలను పరిశీలిద్దాం.
షియోమీ టీవీ S85 మినీ LED స్పెసిఫికేషన్‌ల వివరాలు: ఈ టీవీలో మినీ LED ప్యానెల్ ఉంది. ముఖ్యంగా Xiaomi TV S85 మినీ LED మోడల్ 1200 nits బ్రైట్‌నెస్ సౌకర్యంతో వచ్చింది. షియోమీ సంస్థ ఈ టీవీ డిజైన్ రూపకల్పనపై చాలా శ్రద్ధ చూపింది.

అదేవిధంగా, ఈ షియోమీ 85 అంగుళాల టీవీ 4K రిజల్యూషన్ మరియు 144 Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో వస్తుంది. కాబట్టి ఈ టీవీ అత్యుత్తమ స్క్రీన్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ అద్భుతమైన షియోమీ టీవీకి ప్రత్యేకంగా మాస్టర్ పిక్చర్ క్వాలిటీ ఇంజిన్ మద్దతు ఇస్తుంది.

ఈ మాస్టర్ పిక్చర్ క్వాలిటీ ఇంజిన్ టెక్నాలజీ ఆప్టిమైజ్ కలర్స్, కాంట్రాస్ట్, క్లారిటీ మరియు మోషన్‌తో సహా పలు ప్రత్యేక ఫీచర్లను అందిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ప్రత్యేకమైన స్క్రీన్ అనుభవాన్ని అందిస్తుంది.

ఈ టీవీ 95% DCI-P3 కలర్ గామట్, అధిక కాంట్రాస్ట్ రేషియోతో సహా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ అద్భుతమైన టీవీ లో బ్లూ లైట్ టెక్నాలజీ మరియు ఫ్లికర్ తగ్గింపుకు కూడా మద్దతు ఇస్తుంది.

ఈ Xiaomi TV S85 మినీ LED మోడల్ శక్తివంతమైన క్వాడ్-కోర్ A73 ప్రాసెసర్ మద్దతుతో వచ్చింది. ఈ ప్రాసెసర్ మెరుగైన పనితీరును అందిస్తుంది. అలాగే, ఈ టీవీ HyperOSలో పనిచేస్తుంది. కాబట్టి ఈ 85 అంగుళాల టీవీలో రకరకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉండటం గమనార్హం.

ఈ టీవీ ప్రత్యేకంగా గేమింగ్ ప్రియుల కోసం రూపొందించబడింది. Xiaomi TV S85 Mini LED మోడల్ 4GB RAM మరియు 64GB స్టోరేజ్‌తో విడుదల చేయబడింది. కాబట్టి ఈ టీవీలో అన్ని యాప్‌లను సజావుగా ఉపయోగించుకోవచ్చు. ఈ టీవీ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR), ALLM (ఆటో తక్కువ లేటెన్సీ మోడ్) కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇది డాల్బీ విజన్ పనోరమిక్ సౌండ్ సపోర్ట్‌తో నాలుగు స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. కాబట్టి ఈ టీవీ అత్యుత్తమ ఆడియో అనుభూతిని అందిస్తుంది. అలాగే, ఈ అద్భుతమైన స్మార్ట్ టీవీ Wi-Fi 6, HDMI పోర్ట్, USB పోర్ట్ మొదలైన వాటితో సహా వివిధ కనెక్టివిటీ ఫీచర్లకు మద్దతుతో వస్తుంది.

ముఖ్యంగా షియోమీ TV S85 మినీ LED మోడల్ ప్రస్తుతం చైనాలో మాత్రమే లాంచ్ చేయబడింది. త్వరలోనే ఈ టీవీని భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, ఈ షియోమీ టీవీ ధర 7999 యువాన్లు (భారత కరెన్సీలో రూ. 92,163) గా లాంచ్ అయింది.

అదేవిధంగా, షియోమీ త్వరలో భారతదేశంలో వివిధ అద్భుతమైన టీవీలను లాంచ్ చేయాలనీ యోచిస్తోంది. ఈ సంస్థ తీసుకొచ్చిన ప్రతి స్మార్ట్ టీవీకి మంచి ఆదరణ లభిస్తుండడం గమనార్హం.

Gold Rate: గోల్డ్ @ 71000.. నేడు కళ్లు తిరిగే రేటుకు పసిడి పరుగు.. ఇంకెంత కాలం..??

Gold Price Today: ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరలతో ప్రజలు కళ్లతో చూసి ఆనందపడటమే తప్ప చేతితో కొనుక్కోలేని పరిస్థితులు నెలకొన్నాయి. పసిడి రేటు పరుగులకు హద్దు అదుపు లేకుండా పోవటంతో నేడు దాదాపు 10 గ్రాముల ధర సరికొత్త గరిష్ఠమైన రూ.71 వేల మార్కుకు చేరుకుంది.
దీంతో దేశంలోని పసిడి ప్రియుల కళ్లలో బాధ కనిపిస్తోంది. వేగంగా పెరుగుతున్న బంగారం ధరలు అసలు ఏ కారణంగా పెరుగుతున్నాయి, ఇంకెంత కాలం ఈ ధోరణి కొనసాగుతుందనే ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఈ ఏడాది మధ్యలో వడ్డీ రేట్లను సెంట్రల్ బ్యాంకులు తగ్గించే అవకాశాలు కనిపిస్తుండటంతో పెట్టుబడిదారులు తమ డబ్బును పసిడి, వెండిలోకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఊహించని రీతిలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. ఇది సాధారణ ఆభరణాల కొనుగోలుదారుల జేబులకు పెద్ద కన్నం వేస్తున్నాయి.

నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.750 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.65,000, దిల్లీలో రూ.64,250, ముంబైలో రూ.64,100, కలకత్తాలో రూ.64,100, కేరళలో రూ.64,100, బెంగళూరులో రూ.64,100, వడోదరలో రూ.64,150, జైపూరులో రూ.64,250, మంగళూరులో రూ.64,100, నాశిక్ లో రూ.64,130, అయోధ్యలో రూ.64,250, బళ్లారిలో రూ.64,100, గురుగ్రాములో రూ.64,250, నోయిడాలో రూ.64,250 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నేడు నిన్నటితో పోల్చితే రూ.760 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.70,910, దిల్లీలో రూ.70,020, ముంబైలో రూ.69,870, కలకత్తాలో రూ.69,870, కేరళలో రూ.69,870, బెంగళూరులో రూ.69,870, వడోదరలో రూ.69,920, జైపూరులో రూ.70,020, మంగళూరులో రూ.69,870, నాశిక్ లో రూ.69,900, అయోధ్యలో రూ.70,020, బళ్లారిలో రూ.69,870, గురుగ్రాములో రూ.70,020, నోయిడాలో రూ.70,020గా ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.64,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,870 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.2000 పెరిగి రూ.84,000 వద్ద కొనసాగుతోంది.

Garlic Prices : రూ.400కి ఎగిసిన వెల్లుల్లి.. ఇప్పుడు రూ.40 కి దిగింది

Garlic Prices : భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి. వెల్లుల్లి ధర పతనంతో సామాన్యులు, గృహిణులు ఎంతో ప్రయోజనం పొందుతారు. అయితే రైతులు మాత్రం ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. రైతుల పొలాల నుంచి వెల్లుల్లి పంట మార్కెట్లకు చేరడం మొదలైంది. మార్కెట్‌లోకి కొత్త ఉత్పత్తులు రావడంతో వెల్లుల్లి ధరలు పడిపోయాయి. నెల రోజుల క్రితం వరకు కిలో రూ.350 నుంచి రూ.500లకు పైగా ఉన్న టోకు ధర ఇప్పుడు రూ.40 నుంచి రూ.60కి చేరుకునేలా ఇప్పుడు వెల్లుల్లి పరిస్థితి నెలకొంది. వెల్లుల్లి ధర పతనం కావడంతో కూరగాయల దుకాణాలు, కిరాణాల్లో కనిపించకుండా పోయిన వెల్లుల్లి ఇప్పుడు మళ్లీ కనిపించడం మొదలైంది.
వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లుల్లి కొత్త పంట సిద్ధంగా ఉందని, స్థానిక స్థాయిలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. తవ్విన తర్వాత రైతులు వ్యాపారులకు, మార్కెట్లకు వెల్లుల్లిని విక్రయించడం ప్రారంభించారు. మార్కెట్‌లో వెల్లుల్లి పరిమాణం పెరగడంతో దాని ధర ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పుడు దీని ధరలు రానున్న రోజుల్లో మరింత తగ్గనున్నాయి. మార్కెట్‌లో వెల్లుల్లి విక్రయించే రైతు విక్రమ్‌మీనా మాట్లాడుతూ.. గత ఏడాది చాలా మంది రైతులు వెల్లుల్లిని ఉత్పత్తి చేయకపోవడంతో గిట్టుబాటు ధర లభించలేదు. వెల్లుల్లి ఉత్పత్తి తక్కువగా ఉండడంతో మార్కెట్‌లో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగి ధరలు విపరీతంగా పెరిగాయి. రైతులు తమ పొలాల్లో వెల్లుల్లిని పెంచడం ప్రారంభించారు. చాలా మంది రైతులు సమయానికి ముందే వెల్లుల్లిని తవ్వడం ప్రారంభించారు. దీని కారణంగా వెల్లుల్లి గడ్డలు చిన్నవిగా, పచ్చిగా ఉన్నాయి. స్థానిక వెల్లుల్లి ధర ప్రస్తుతం కిలో రూ.100 పలుకుతున్నప్పటికీ, హైబ్రిడ్ వెల్లుల్లి ధర తక్కువగానే ఉంది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మార్కెట్ లోకి వెల్లుల్లి రాక పెరుగుతుంది.
వెల్లుల్లి వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటారు. రాజస్థాన్‌లోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో, శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అనేక రకాల ఊరగాయలు, ఆహార పదార్థాలు తయారు చేస్తారు. ఇందులో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తారు. అందుకే శీతాకాలంలో వెల్లుల్లికి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు వేసవి కాలం ప్రారంభమైంది. కాబట్టి వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో వేడి మొత్తం పెరుగుతుంది. అందుకే ఇప్పుడు ప్రజలు కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలలో వెల్లుల్లిని చాలా తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు.

IPL సంచలనం మయాంక్‌ యాదవ్‌ లైఫ్ స్టోరీ! ఆకలితో ఎదిగిన ఒక స్పీడ్ స్టార్ కథ!

ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లోనే కాదు.. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఓ 21 ఏళ్ల కుర్రాడి పేరు మారుమోగిపోతోంది. ఐపీఎల్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ అతనే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌. ఈ రెండు మ్యాచ్‌లతోనే ఐపీఎల్‌ చరిత్రనే తిరగరాశాడు మయాంక్‌ యాదవ్‌ అనే ఓ స్పీడ్‌స్టర్‌. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఆడుతూ.. మంగళవారం బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గంటకు ఏకంగా 156.7 కిలో మీటర్ల వేగంతో బంతి విసిరి.. చివరి మ్యాచ్‌లో తాను సృష్టించిన రికార్డును తానే బ్రేక్‌ చేశాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యాదవ్‌.. గంటకు 155.8 కిలో మీటర్ల బంతి విసిరి.. ఐపీఎల్‌ 2024 సీజన్‌లోనే ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా నిలిచిచాడు.

ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 14 రన్స్‌ ఇచ్చి.. 3 కీలక వికెట్లు పడగొట్టి.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ముఖ్యంగా.. ఆర్సీబీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరున్‌ గ్రీన్‌ను మయాంక్‌ యాదవ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసిన విధానం మాత్రం మొత్తం టోర్నీకే హైలెట్‌గా నిలిచేలా ఉంది. ఆ బాల్‌ను గ్రీనే కాదు ప్రపంచంలో కొమ్ములు తిరిగిన బ్యాటర్లు కూడా ఆడలేరని చాలా మంది క్రికెట్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు. నిప్పులు చిమ్ముకుంటూ వచ్చిన ఆ బాల్‌.. గ్రీన్‌ బ్యాట్‌ను ముందుకు తెచ్చేలోపే.. జెడ్‌స్పీడ్‌తో దూసుకెళ్లి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఆ వేగానికి గ్రీన్‌ ఒక్కడే కాదు.. మొత్తం ఆర్సీబీ ఆటగాళ్లు కళ్లు తేలేశారు.

ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన 8 ఓవర్లు బౌలింగ్‌ చేసిన మయాంక్.. లీగ్ చరిత్రలోనే గంటకు 150 కిలో మీటర్ల వేగంతో అత్యధిక బంతులేసిన బౌలర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. అయితే వేగం ఒక్కటే కాకుండా.. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంత్‌ ఉండటం మయాంక్‌ యాదవ్‌ను డేంజరస్‌గా మారుస్తోంది. గతంలో ఉమ్రాన్‌ మాలిక్‌ కూడా 150కి పైగా వేగంతో బంతులేసినా.. సరైన లైన్‌ అండ్‌ లెంత్‌ లేక ఇబ్బంది పడ్డాడు. కానీ, మయాంక్‌ యాదవ్‌లో మాత్రం కచ్చితత్వంతో బంతులేస్తూ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారిన మయాంక్‌ యాదవ్‌ పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడుకుంటే.. ఇతను ఢిల్లీకి చెందిన కుర్రాడు. అ‍క్కడే పుట్టి పెరిగాడు. మయాంక్‌ వాళ్ల నాన్న ప్రభు చిన్నపాటి వ్యాపారం చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. అందులోనా.. ఫాస్ట్‌ బౌలర్లంటే మరీ ఇష్టం. అందుకే తన కొడుకును కూడా ఒక గొప్ప ఫాస్ట్‌ బౌలర్‌గా చూడాలనుకున్నారు. అందుకోసం ప్రభు ఎంతో కష్టపడ్డాడు. టీవీలో డేల్‌ స్టెయిన్‌, మోర్నీ మోర్కెల్‌, మిచెల్‌ జాన్సన్‌ లాంటి ఫాస్ట్‌ బౌలర్లు ఎలా బౌలింగ్‌ చేస్తున్నారో చూడు అంటూ మయాంక్‌ యాదవ్‌కు చూపించేవాడు ప్రభు. దాంతో.. స్పీడ్‌ బౌలింగ్‌పై మయాంక్‌ యాదవ్‌ కూడా మక్కువ పెంచుకున్నాడు. అక్కడి నుంచి క్రికెట్‌ ప్రాక్టీస్‌ మొదలు పెట్టిన యాదవ్‌ను 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతన్ని సోనెట్‌ క్లబ్‌లో చేర్పించాలని ప్రభు విశ్వప్రయత్నాలు చేశాడు. సోనెట్‌ క్లబ్‌లో చేర్పించడానికి ఆడిషన్స్‌ కోసం ఆయన ఏడాది పాటు కష్టపడాల్సి వచ్చింది. నెట్స్‌లో బౌలింగ్‌ వేసి, కోచ్‌ తారక్‌ సిన్హాను మెప్పించడంతో మయాంక్‌కు సోనెట్‌ క్లబ్‌లో చేరే ఛాన్స్‌ వచ్చింది. ఆ సమయంలో మయాంక్‌ యాదవ్‌ వద్ద కనీసం మంచి షూ కూడా ఉండేవి కావు. క్లబ్‌ తరఫునే అతనికి మంచి షూ అందించారు.

దశ తిరిగిపోయింది ఇక్కడే..
2021లో దేశవాళి టోర్నీ అయిన విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా మొహాలీలోని ఐఎస్‌ బింద్రా స్టేడియంలో యూపీ, ఢిల్లీ టీమ్స్‌ పక్కపక్కనే ప్రాక్టీస్‌ చేశాయి. ఆ సమయంలో అప్పటి యూపీ కోచ్‌ విజయ​ దహియా.. మయాంక్‌ బౌలింగ్‌ను చూసి ఫిదా అయిపోయాడు. ఇలాంటి బౌలర్‌ లక్నో టీమ్‌లో ఉంటే బాగుంటుందని వెంటనే.. అప్పటి లక్కో టీమ్‌ మెంటర్‌ గౌతమ్‌ గంభీర్‌కు కాల్‌ చేసి చెప్పేశాడు. దాంతో 2022 ఐపీఎల్‌ వేలంలో మయాంక్‌ యాదవ్‌ను బేస్‌ప్రైజ్‌ రూ.20 లక్షలకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ కొనుగోలు చేసింది. కానీ, ఆ సీజన్‌లో అతనికి ఆడే అవకాశం రాలేదు. అలాగే ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఆడే ఛాన్స్‌ వచ్చినా.. సరిగ్గా మ్యాచ్‌కి ఒక రోజు ముందు ప్రాక్టీస్‌ చేస్తూ.. సరైన షూ లేకపోవడంతో తడిపిచ్‌పై జారిపడి గాయపడ్డాడు. అలాగే గత సీజన్‌లో బరిలోకి దిగే అవకాశం కోల్పోయాడు.

ఇలా కాదని.. ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుంచి తనకు సరిపడా, మంచి గ్రిప్‌ ఉన్న షూస్‌ తెప్పించుకుని.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అరంగేట్రం చేసి.. తన సత్తా చాటుతున్నాడు. ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫాస్ట్‌ బౌలర్‌గా ఎదగాలనే కసి, తపన, ఆకలితో ఈ స్థాయికి చేరుకున్న మయాంక్‌ యాదవ్‌.. దేశానికి ఆడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. అది కూడా త్వరలోనే తీరిపోయే ఛాన్స్‌ ఉంది. ఇదే ఫామ్‌ను కంటీన్యూ చేస్తూ.. జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా తరఫున మయాంక్‌ యాదవ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒక వైపు బుమ్రా, మరోవైపు మయాంక్‌ యాదవ్‌ బంతులు సంధిస్తుంటే.. బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

Pulipirlu:రాత్రి ఇలా చేస్తే పులిపిర్లు నొప్పి లేకుండా ఉదయానికి రాలిపోతాయి.చాలా సింపుల్.!

Pulipirlu:రాత్రి ఇలా చేస్తే పులిపిర్లు నొప్పి లేకుండా ఉదయానికి రాలిపోతాయి…చాలా సింపుల్… పులిపిర్లు అనేవి ఒక రకమైన వైరస్ వ్యాపించడం వల్ల వస్తాయి.
ఇవి మనలో చాలా మందిలో కనబడుతూ ఉంటాయి. పులిపిర్లు ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది కూడా కలుగుతుంది. మానసిక ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో కూడా పులిపిర్లు సమస్య ఉంటుంది. .

పులిపుర్లు ఉండటం వల్ల పెద్దగా సమస్య ఏమీ ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం దురద నొప్పి అనేవి ఉంటాయి. రాత్రి ఇలా చేస్తే పులిపిర్లు నొప్పి లేకుండా ఉదయానికి రాలిపోతాయి. పులిపిర్లను తగ్గించుకోవటానికి ఒక మంచి ఇంటి చిట్కా ఉంది.పులిపిర్లు రాగానే చాలా మంది పులిపిర్లను కాల్చడం, కత్తిరించడం వంటివి చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఈ చిట్కా ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది.
కాబట్టి ఈ చిట్కా ట్రై చేయండి. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఒక బౌల్ లో పావు స్పూన్ సున్నం, పావు స్పూన్ వంటసోడా,పావుస్పూన్ లో సగం పసుపు, సరిపడా నీటిని పోసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని టూత్ పిక్ సాయంతో పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి పావుగంట అయ్యాక శుభ్రం చేయాలి.

ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పులిపిర్లు రాలిపోతాయి. అదే రాత్రి సమయంలో అయితే ఈ మిశ్రమాన్ని పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి ప్లాస్టర్ అంటించాలి. మరుసటి రోజు ఉదయం ప్లాస్టర్ తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు చేస్తే నొప్పి లేకుండా పులిపిర్లు రాలిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Election Code – ఐటీ ఫోకస్!​ లక్ష దాటితే లెక్క చెప్పాల్సిందే

కొత్త రూల్స్ తీసుకొచ్చిన ఎలక్షన్​ కమిషన్​ఎన్నికల నిబంధనలు మరింత కఠినం
బ్యాంకు లావాదేవీలపైనా పెద్ద ఎత్తున నిఘా
అధిక ట్రాన్షాక్షన్ అకౌంట్ల డీటెయిల్స్ సేకరణ
ఐటీ శాఖకు బ్యాంకుల నుంచి సమాచారం
రూల్స్ బ్రేక్ చేస్తే భారీగా ట్యాక్స్ కట్టాల్సిందే
ఎన్నికల వేళ సాధారణ ప్రజలకు తప్పని తిప్పలు
అనుమానాస్పద లావాదేవీలపైనా నిఘా
నగదు జమ, విత్​డ్రాయల్స్​ విషయంలోనూ జాగ్రత్త
పరిమితికి మించి పైసలు జమ చేస్తే అంతే సంగతి

దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నగదు లావాదేవీలపై ఈసీ నిఘా పెట్టింది. రూల్స్ మరింత కఠినతరం చేసింది. పౌరుల బ్యాంకు అకౌంట్లలో ట్రాన్షాక్షన్ పై దృష్టిసారించింది. ఇప్పటికే ఎన్నికల వేళ సాధారణ ప్రజలకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో.. కొత్త ఆర్ధిక ఏడాదితో పాటు, ఎన్నికల నిబంధనలు ప్రజలకు మరింత చుక్కలు చూపనున్నాయి. ఏప్రిల్‌ 1నుంచి ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేని సాధారణ ప్రజలకు కూడా ఎన్నికల సంఘం విధించిన మార్గదర్శకాల రాక గుబులు పుట్టిస్తోంది. కొత్త ఆర్ధిక ఏడాది నేపథ్యంలో నగదు, బ్యాంకు డిపాజిట్లపై ఈసీ కీలక సూచనలు చేసింది. సరికొత్త నిబంధనలను తెరపైకి తెస్తూ ఆర్బీఐ అమలులోకి తీసుకొస్తోంది. సాధారణ పౌరుల ఖాతాపై నిఘా పెట్టి.. రెండు నెలల్లో రూ.లక్షకు మించి డిపాజిట్ చేసిన అకౌట్ల డిటెయిల్స్ ఐటీ శాఖతోపాటు ప్లయింగ్ స్క్వాడ్ కు పంపాలని ఆదేశించింది.

అనుమానాస్పద లావాదేవీలపై నిఘా

పార్లమెంట్ ఎన్నికల వేళ ఈసీ అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టింది. ఇప్పటికే ఎన్నికల కోడ్‌ కారణంగా రాష్ట్రంలో పెండ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులకు కూడా సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక రకాలుగా ఈసీ నిబంధనల చట్రం అమలు చేస్తున్న తీరు గుర్తించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సంరంభానికి తెర లేచిన నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ పార్టీలు, అభ్యర్థులు డబ్బు విరివిగా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణలో డబ్బు ప్రభావం ఎక్కువని ఈసీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియ సాగుతున్న వేళ.. బ్యాంకుల్లో అనుమానాస్పదంగా సాగే ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

లక్షకు మించి డిపాజిట్​.. తనిఖీ చేయాలని ఆదేశాలు

ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారుల (సీఈఓ)కు సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల్లో ₹లక్ష పైచిలుకు డిపాజిట్‌, విత్‌ డ్రాయల్‌ చేసిన అకౌంట్స్‌, ఒకే జిల్లాలో పలువురికి ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసిన ఖాతాల వివరాలను సేకరించాలని పేర్కొంది. బ్యాంకుల్లో ₹ లక్షకు మించి డిపాజిట్‌ చేసిన అభ్యర్థి, ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులు, పార్టీల ఖాతాల వివరాలను సేకరించాలని సీఈఓలను ఈసీ ఆదేశించింది. ₹ 10 లక్షలు డిపాజిట్‌ చేసిన ఖాతాల వివరాలను ఆదాయం పన్ను విభాగం అధికారులకు అందజేయాలని సూచించింది. జిల్లా ఎన్నికల అధికారులు అన్ని బ్యాంకుల నుంచి సమాచారం తెప్పించుకోవాలని, ఆ డేటాలో అనుమానాస్పదమైన లావాదేవీలు ఉంటే వాటి వివరాలను ప్లయింగ్‌ స్క్వాడ్‌లకు ఇవ్వాలని పేర్కొంది.

నగదు జమ, విత్ డ్రాపై ఐటీ నిఘా
దేశంలో, రాష్ట్రంలో పలు బ్యాంకులు జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లను అందిస్తుండగా, మరి కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్‌తో సేవింగ్స్‌ అకౌంట్‌ సేవలు అందిస్తున్నాయి. బ్యాంకు ఖాతాలలో అకస్మాత్తుగా అత్యధిక మొత్తంలో నగదు జమ, నగదు విత్‌డ్రాలపై ఐటీ శాఖ నిఘా పెంచింది. పరిమితికి మించితే భారీగా పెనాల్జి లను వసలూ చేసి విచారణ జరిపేందుకు నిర్ణయించింది. ఈ నిబంధన ప్రకారం సాధారణ సేవింగ్స్‌ అకౌంట్‌లో ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్‌ – మార్చి ) క్యాష్‌ డిపాజిట్‌ పరిమితి రూ.10 లక్షలుగా నిర్ణయించారు. రూ.10 లక్షలకు మించి లావాదేవీలు జరిపితే బ్యాంకులు వెంటనే ఆదాయపు పన్ను శాఖకు సమచారాన్ని అందించనున్నాయి. ఆ వెంటనే దసరు అనుమానిత లావాదేవీలపై ఐటీ శాఖ ఖాతాదారుకు నోటీసులు జారీ చేయనుంది. రూ. 10 లక్షలకు మించిన డిపాజిట్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆధారాలు ఖాతాదారు చూపాల్సి రానుంది. కరెంటు ఖాతాలకు ఆర్థిక సంవత్సరానికి రూ.50 లక్షల వరకు పరిమితి ఉంటుందని, ఆదాయపు పన్ను చట్టం 1962, సెక్షన్‌ 114బీ ప్రకారం ప్రతి బ్యాంకు రూ. 10 లక్షలకు మించి లావాదేవీలు జరిగిన ఖాతాల వివరాలను ఐటీ శాఖకు అందిచాల్సి ఉంటుందని వెల్లడించింది. ఖాతాదారునికి ఎన్ని బ్యాంకు అకౌంట్ల ఉంటే అన్నింట్లో కలిపి ఆర్థిక సంవత్సరానికి రూ.10 లక్షల వరకే డిపాజిట్‌ పరిమితి ఉంటు-ంది.

₹10 లక్షలు మించితే భారీగా పన్ను..

సేవింగ్స్‌ అకౌంట్లలో రోజుకు రూ.లక్ష వరకు డిపాజిట్‌ చేయవచ్చని, ఒకవేళ చాలా రోజులు లావాదేవీలు జరపకపోతే రూ.2.5 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చని చెబుతున్నారు. మొత్తంగా ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించకూడదు. 10 లక్షలు మించి మీరు క్యాష్‌ డిపాజిట్‌ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు ఆధారాలు సమర్పించాలని, లేనిపక్షంలో 60 శాతం ట్యాక్స్‌తో పాటు, 25 శాతం సర్‌ ఛార్జ్‌, 4 శాతం సెస్‌ను పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుందని ఐటీ శాఖ హెచ్చరిస్తోంది. నిబంధనలు అతిక్రమించి రూ. 10 లక్షలకు మించి నగదు డిపాజిట్‌ చేసే డబ్బులో 89 శాతం పన్ను రూపంలో కోల్పోవాల్సి వస్తుందని తాజాగా వెల్లడగించారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 194 ఎన్‌ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. కోటికి మించి నగదు విత్‌ డ్రా చేస్తే 2 శాతం టీ-డీఎస్‌ వర్తిస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఒకవేళ ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్‌ చేయని వారైతే రూ. 20 లక్షలకు మించి విత్‌ డ్రా చేస్తే 2 శాతం టీ-డీఎస్‌ వర్తిస్తుందని వెల్లడించారు. అదే రూ. కోటి దాటితే వీరికి 5 శాతం టీ-డీఎస్‌ వర్తిస్తుంది.

AC కొంటున్నారా? 2024లో బెస్ట్ ACలు ఇవే!

మండే ఎండాకాలం రానే వచ్చింది. ఇప్పటికే ఏసీలు ఉన్న వాళ్లంతా దుమ్ము దులిపి వాటిని ఆన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇల్లు చల్లగా ఉండాలన్నా.. ప్రశాంతంగా నిద్రపోవాలన్నా ఇప్పుడు వస్తున్న 43 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకోవాలంటే కచ్చితంగా ఏసీ, కూలర్లు ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే చాలామంది సమ్మర్ వచ్చిన తర్వాత ఏసీలు కొనాలి అని ఫిక్స్ అవుతూ ఉంటారు. కొనాలని ఫిక్స్ అయ్యాక వారి మైండ్ సవాలక్ష ప్రశ్నలు వస్తాయి. ఎలాంటి ఏసీ కొనాలి? ఎంతలో కొనాలి? ఎంత కెపాసిటీ ఉన్న ఏసీ కొనాలి? అసలు ఏ ఏసీ మంచిది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. మరి.. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

ఏసీ కొనే ముందు మీరు మీ అవసరాన్ని తెలుసుకోవాలి. మీరు ఇంటి కోసం ఏసీ కొంటున్నారా? ఆఫీస్ కోసం ఏసీ కొంటున్నారా? ఆఫీస్ కోసం కొనే ఏసీలు కెపాసిటీ ఎక్కువ ఉండాలి. ఎక్కువ స్టార్ రేటింగ్ ఉండేవి మంచిది. ఎక్కువ సంవత్సరాలు వారెంటీలు ఇచ్చే ఏసీలను కొనుగోలు చేయాలి. అదే ఇంటికి అయితే చాలానే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ మీ బడ్జెట్ ఎంత అనేది నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ఆ బడ్జెట్ లో ఉన్న మోడల్స్ ని వెతకాలి. ప్రస్తుతం ఏసీ అంటే 35 వేలకు తక్కువలో ఉండటం లేదు. ఏసీ కొనే సమయంలో మీ గది పరిమాణం ఎంతో తెలుసుకోవాలి. ఆ గది సైజ్ ని బట్టి మీరు ఎంత కెపాసిటీలో ఏసీ కొనాలో ఫిక్స్ అవ్వాలి. మీ గది కాస్త చిన్నదే అయితే 1 టన్ ఏసీ సరిపోతుంది. 250 స్వేర్ ఫీట్ ఉండే గది అయితే 1.5 టన్ తీసుకోవచ్చు. అదే మీరు హాల్ లో ఏసీ పెట్టుకోవాలి అన్నా, 350 స్క్వేర్ ఫీట్ గది అయినా 2 టన్ ఏసీ తీసుకోవాల్సి ఉంటుంది.
కెపాసిటీ తర్వాత ఇన్వర్టర్ చూసుకోవాలి. మీరు ఏసీ కొనే సమయంలో ఇన్వర్టర్ ఏసీనో కాదో తెలుసుకోవాలి. అందులోనూ స్టాండర్డ్ ఇన్వర్టర్ కాకుండా ఇప్పుడు మార్కెట్ లోకి వస్తున్న డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీలను కొనుగోలు చేస్తే మంచిది. ఇవి సింగిల్ ఇన్వర్ట్ తో పోలిస్తే.. డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీలు ఎక్కువ చల్లదనాన్ని కూడా ఇస్తాయి. పవర్ వాడకం కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత మీరు స్టార్ రేటింగ్ చూసుకోవాలి. నో స్టార్ ఏసీలు, 1 స్టార్, 2 స్టార్ అంటూ 5 స్టార్ వరకు రేటింగ్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే దీనిలో స్టార్ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే.. మీకు పవర్ బిల్ అంత తక్కువ వస్తుంది. అలాగే స్టార్ పెరిగే కొద్దీ ఏసీ ధర కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తక్కువ బడ్జెట్ లో మీరు ఏసీ ప్లాన్ చేస్తే 3 స్టార్ ఏసీ తీసుకోవడం మంచిది.

3 స్టార్ ఏసీకి 5 స్టార్ ఏసీకి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ధర పెరుగుతుంది. కాస్త తక్కువగా వాడే వాళ్లు అయితే 3 స్టార్ ఏసీ సరిపోతుంది. వీటి తర్వాత మీరు సర్వీస్ గురించి తెలుసుకోవాలి. ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అలాగే వారంటీ గురించి కచ్చితంగా అడిగి తెలుసుకోండి. పీసీబీ వారెంటీ 5 ఏళ్లు, ఇన్వర్టర్ కంప్రెసర్ వారెంటీ 10 ఏళ్లు ఉంటే చాలా మంచిది. ధర తక్కువ అని పీసీబీ వారెంటీ తక్కువ ఉన్న ఏసీలను కొనుగోలు చేయకండి. ఇది 2024 కాబట్టి ఈ ఏడాది మోడల్స్ కొనాలి అనేం లేదు. ఎందుకంటే ఏసీ ఇయర్ మారే కొద్దీ పెద్దగా ఏం ఛేంజెస్ రావు. 2023 ఏసీ అయినా కాస్త తక్కువ ధరలో వస్తే తీసుకోవచ్చు. మీ కోసం ఇ-కామర్స్ సైట్స్ లో బాగా అమ్ముడవుతున్న కొన్ని ఏసీల వివరాలు ఇచ్చాం. నచ్చితే ఆ లింక్ క్లిక్ చేసి కొనేసుకోండి.

రైల్వేలో 9 వేల పైగా ఉద్యోగాలు! కాస్త కష్టపడితే జాబ్ మీదే.. పూర్తి వివరాలు ఇవే

ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎంతో మంది యువత లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకు తగినట్లుగానే రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తరచూ ఉద్యోగాలకు సంబంధించి ఏదో ఒక నోటిఫికేషన్ విడుదలవుతుంటాయి. తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖలో తొమ్మిది వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలానే ఈ దరఖాస్తు ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. మరి.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే మంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. రైల్వే శాఖలోని 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానించింది. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునే గడవు త్వరలో ముగియనుంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. రైల్వే శాఖలోని ఈ టెక్నీషియన్ పోస్టులకు ఏప్రిల్‌ 8వ తేదీ రాత్రి 11.59గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 21 ఆర్‌ఆర్‌బీల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.rrbapply.gov.in/#/auth/landing క్లిక్ చేయండి. ఇక నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నోటిఫీకేషన్ లో మొత్తం 9,144 ఉద్యోగాలు ఉండగా.. వీటిలో టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 సిగ్నల్‌ 1092 పోస్టుల ఉన్నాయి. అలానే టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి. మొత్తంగా 9,144 పోస్టులకు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

వయో పరిమితి:
ఈ పోస్టులకు సంబంధించి వయో పరిమితి విషయానికి వస్తే.. టెక్నీషియన్ గ్రేడ్‌ 1 సిగ్నల్‌ పోస్టులకు జులై 1,2024 నాటికి 18 నుంచి 36 ఏళ్లు ఉండాలి. అలానే టెక్నీషియన్ గ్రేడ్‌ 3 పోస్టులకు జులై 1,2024 నాటికి 18 నుంచి 33 ఏళ్లు మించరాదు. అయితే ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులు.. ఆయా కేటగిరీల వారికి వయో సడలింపు కల్పించారు.

దరఖాస్తు ఫీజు:
ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు రూ.500 పీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష రాసిన తరువాత 500లో నుంచి రూ.400 రిఫండ్‌ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ,ఎక్స్‌సర్వీస్‌మెన్‌,మహిళలు,థర్డ్‌జెండర్‌,మైనార్టీలు, ఈబీసీలు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వీరికి మాత్రం పరీక్ష తర్వాత ఫీజు మొత్తాన్ని రిఫండ్‌ చేస్తారు.

ఎంపిక విధానం:
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధృవీకరణ పత్రాల పరిశీలన అనంతరం మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతం:
టెక్నీషియన్‌ గ్రేడ్‌ -1 సిగ్నల్‌ పోస్టులకు 7 సీపీసీలో లెవెల్‌-5 కింద ప్రారంభ జీతం రూ.29,200 ఉంటుంది. అలానే టెక్నీషియన్ గ్రేడ్‌-3 పోస్టులకు లెవెల్‌ -2 కింద రూ19,990 చొప్పున జీతం ఇస్తారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు.. విద్యార్హతలు, వయో పరిమితి, జోన్‌ల వారీగా పోస్టుల సంఖ్య, పరీక్ష విధానం, సిలబస్‌ వంటి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.

NVS: నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ పోస్టులు – ఖాళీల వివరాలు -ఎంపిక విధానం

NVS: నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ పోస్టులు
నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి… డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఎన్‌వీఎస్‌ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న ఎన్‌వీఎస్‌ ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్‌ఎల్‌ఐలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. ఫిమేల్‌ స్టాఫ్ నర్స్: 121 పోస్టులు

2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5 పోస్టులు

3. ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు

4. జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్: 4 పోస్టులు

5. లీగల్ అసిస్టెంట్: 1 పోస్టు

6. స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు

7. కంప్యూటర్ ఆపరేటర్: 2 పోస్టులు

8. క్యాటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు

9. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381 పోస్టులు

10. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు

11. ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు

12. మెస్ హెల్పర్: 442 పోస్టులు

13. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 1,377.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్.

దరఖాస్తు విధానం: కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.03.2024.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.04.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 02.05.2024 నుంచి 04.05.2024 వరకు.

Diabetic Patients : మధుమేహమున్నవారు కాస్త బరువు పెరిగితే ఆయుష్షు కూడా పెరుగుతుందట.. కానీ కండీషన్స్ అప్లై..

Death Risk for Diabetes Patients : బరువు పెరగడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్​ సమస్యలు వస్తాయి. అయితే ఇది అన్ని సందర్భాల్లో నిజం కాదు అంటుంది తాజా అధ్యయనం. టైప్ 2 మధుమేహం అనేది పూర్తిగా బాడీ మాస్ ఇండెక్స్​పై ఆధారపడి ఉంటుంది. న్యూ స్టడీ ప్రకారం ఆరోగ్యకరమైన బరువు ఉన్నవారితో పోలిస్తే.. ఊబకాయం ఉన్నవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఏడు రెట్లు ఎక్కువని తేలింది. అంతేకాకుండా 65 ఏళ్లు పైబడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు కొంత బరువు పెరిగితే ప్రాణాంతక సమస్యలను తగ్గించుకోవచ్చని వెల్లడించింది.

వాళ్లు బరువు పెరిగితే మంచిదట
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్యకరమైన శరీరం బరువు కోసం బరువు తగ్గుతారు. మరికొందరు అనుకున్న దానికంటే ఎక్కువ బరువు తగ్గిపోతారు. దానినే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ అంశాన్ని ప్రభావితం చేస్తూ.. తాజాగా అధ్యయనం పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 65 ఏళ్లు పైబడిన మధుమేహం ఉన్న వ్యక్తులు కొంత బరువు పెరగడం వల్ల మరణించే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఈ కొత్త పరిశోధన వెల్లడించింది. మధుమేహం, హృదయనాళ ఆరోగ్యాన్ని నిర్వహించడంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

మధుమేహం సమస్య ఉన్నవారిలో బరువు తగ్గాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన బరువును కూడా కొందరు కోల్పోతూ ఉంటారు. యూకే బయో బ్యాంక్​ ఇచ్చిన డేటా ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్​తో బాధపడేవారిలో ఆరోగ్యకరమైన బరువు ఉండాలని చూపిస్తుంది తాజా అధ్యయనం. బరువు తగ్గిపోవాలనే ధోరణికి వ్యతిరేకంగా.. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు మరణాలు, గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే.. మధ్యస్థమైన, ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండాలంటున్నారు. అనుకున్న దానికంటే బరువు తక్కువగా ఉంటే కాస్త బరువు పెరిగితే మంచి ప్రయోజనం పొందవచ్చని చెప్తున్నారు.

వయసుని బట్టి మారుతుంది..
చైనాలోని జియాంగ్ యాంగ్ సెంట్రల్ హస్పిటల్​కు చెందిన డాక్టర్ షాయోంగ్ జు నేతృత్వంలో టైప్ 2 డయాబెటిస్​ బరువుపై అధ్యయనం చేశారు. సాధారణంగా (23-25)BMIని కలిగిన ఉన్న 64 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు ఉన్నవారిపై గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు 26-28 BMIతో ఉంటే మితమైన అధిక బరువుగా పరిగణిస్తారు. కానీ ఇది గుండె జబ్బుల నుంచి మరణించే సమస్యను మరింత దూరం చేస్తుందని అధ్యయనం తెలిపింది. టైప్ 2 డయాబెటిస్​ రోగుల BMI వయసుని బట్టి మారుతుందని తెలిపారు.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి సరైన BMI అనేది ఆ రోగి వయసు, కార్డియో మెటబాలిక్ ప్రమాద కారకాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కాబట్టి వృద్ధులు బరువు తగ్గడం గురించి కాకుండా.. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉంటే మంచిదని గుర్తించాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాల్సి ఉంటుంది.

Arunachala temple: అరుణాచలం వెళ్తున్నారా? ఏ రోజు ఎలాంటి ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసా?

Arunachala temple giri pradakshina: ప్రపంచంలోనే అత్యంత మహిమాన్వితమైన శైవ క్షేత్రాలలో తిరువణ్ణామలై ఒకటి. ఈ క్షేత్రంలో కొలువైన శివలింగం.. పంచభూత లింగాలలో ఒకటని హిందూ పురాణాలలో చెప్పబడింది. తిరువణ్ణామలై క్షేత్రాన్నే అరుణాచలం అని కూడా పిలుస్తారు. అరుణాచల ఆలయానికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో.. అక్కడ చేసే గిరి ప్రదక్షిణకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి అక్కడ కొండ మీద జరిగే జ్యోతి ప్రజ్వలన క్రతువు నబూతో నభవిష్యత్తి అన్నట్టుగా ఉంటుంది. దాదాపు మూడు టన్నుల నెయ్యితో కొండ మీద వెలిగించే భారీ దీపం పదిహేను రోజలు ఆరిపోకుండా వెలుగుతుండటం అక్కడి ప్రత్యేకత. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి కోట్లమంది భక్తులు అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారని అక్కడి నిర్వాహకులు చెప్తుంటారు.

పరమేశ్వరుడు అగ్ని లింగ రూపంలో వెలిసిన అద్బుత క్షేత్రమే అరుణాచలం. అనేక మహిమలు కలిగిన అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినంత మాత్రానే గత జన్మల చెడు కర్మలన్నీ కరిగిపోతాయని క్షేత్ర పురాణంలో ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. అయితే ఏ రోజు అరుణగిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందనేది కూడా అందులో పొందుపరిచినట్లు పండితులు చెప్తున్నారు.

సోమవారం నాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సమస్త లోకాలను ఏలే శక్తి వస్తుందని పండితులు చెప్తున్నారు.
మంగళవారం నాడు చేసే ప్రదక్షిణ వల్ల పేదరికం తొలగిపోతుందని.. ఎంతటి పేదవాడైనా గిరిప్రదక్షిణ తర్వాత ధనవంతుడు అవ్వడమే కాకుండా తరతరాల వరకు వాళ్ల వంశం సుభిక్షంగా ఉంటుందంటున్నారు. ఇక మరణానంతరం ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందంటున్నారు. ఎంతో మంది సిద్దులు ఇప్పటికీ మంగళవారం నాడే గిరి ప్రదక్షిణలు చేస్తారంటున్నారు.
బుధవారం అరుణగిరి ప్రదక్షిణ వల్ల లలిత కళలలో రాణిస్తారని.. జీవితంలో అన్ని విషయాలలో విజయం సాధిస్తారంటున్నారు. అలాగే గురువారం ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందని.. ఆత్మజ్ఞానం కోసం తపించే ఎంతో మంది అరుణగిరి ప్రదక్షిణ గురువారం చేస్తారని తెలుపుతున్నారు.
శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని… మరణానంతరం ఆ వ్యక్తి ఆత్మ నేరుగా వైకుంఠానికి వెళ్తుందని చెప్తున్నారు. శనివారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే నవగ్రహాల కటాక్షం సిధ్ధిస్తుందని.. శనిదోషాలు హరించుకుపోతాయని, కష్ట కారుకుడైన శని శాంతిస్తాడని పండితులు అంటున్నారు.
ఆదివారం నాడు అరుణగిరి ప్రదక్షిణలు చేస్తే కైలాసప్రాప్తి కలుగుతుందంటున్నారు పండితులు. పిల్లలు లేని భార్యాభర్తలు నియమనిష్టలతో భక్తిగా 48 రోజుల పాటు గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందంటున్నారు. గిరి ప్రదక్షిణ చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టివచ్చిన పుణ్య ఫలం లభిస్తుంది. రెండవ అడుగులో పవిత్ర తీర్ధాలలో స్నానం చేసిన ఫలితం వస్తుందని… మూడవ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుందని… నాలుగవ అడుగు వేయగానే అష్టాంగ యోగం చేసిన ఫలితం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.
తిరువణ్ణామలైలో జరిగే కార్తీక దీపోత్సవం నాడు ఐదు సార్లు గిరికి ప్రదక్షిణలు చేస్తే పాప కర్మల నుంచి విముక్తి లభిస్తుందని… భరణీ దీపం రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఒక సారి, ఏడు గంటలకు ఒకసారి, పదకొండు గంటలకు ఒకసారి, సాయంకాలం దీపదర్శన సమయాన మరోసారి, రాత్రి 11గం.లకు చివరిసారి మొత్తం ఆరోజు.. ఐదు సార్లు గిరి ప్రదక్షిణలు చేస్తే ఘోర పాపాలన్నీ హరిస్తాయని పండితులు సూచిస్తున్నారు. అయితే గిరి ప్రదక్షిణం చేసి రాగానే స్నానం చేయడమో.. నిద్రపోవడమో చేయకూడదని వాటివల్ల పుణ్యఫలం తగ్గి పాపం ఫలం పెరుగుతుందని కాబట్టి ఆరోజంతా భగవన్నామ స్మరణలోనే గడపాలంటున్నారు పండితులు.

Astrology: మీరు ఏప్రిల్ లో పుట్టారా- ఆ ఒక్కటీ మినహా మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా!

ఒకరి వ్యక్తిత్వం…వారు పుట్టిన తేదీ, సమయం, రాశి, తిథి..ఆ రోజు గ్రహాల స్థితిని బట్టి అంచనా వేస్తారు. అయితే పుట్టిన నెల ఆధారంగా కూడా లక్షణాలు చెప్పొచ్చంటారు జ్యోతిష్య పండితులు.
ఏప్రిల్ నెలలో పుట్టిన వారు స్నేహానికి విధేయులు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తారు. ఏరంగులో ఉన్నప్పటికీ ఆకర్షణీయమైన లుక్ వీరి సొంతం. నమ్మకానికి మరో పేరు వీరు..ఎదుటివారి నుంచి కూడా అదే ఆశిస్తారు. జీవితంలో ఏ సంబంధంలోనైనా జాగ్రత్తగా ఉంటారు.
ఏప్రిల్ నెలలో పుట్టిన వారు స్వతంత్ర భావాలు కలిగిఉంటారు, వారి పనులు వారే స్వయంగా వారి ఆలోచనలకు అనుగుణంగా చేసుకుంటారు. ఎవ్వరి జోక్యాన్ని అస్సలు ఇష్టపడరు. అవసరం అయితే ఆ పని నుంచి తప్పుకుంటారు కానీ ఇతరులు రుద్ది చెబితే మాత్రం తగ్గేదేలే అంటారు
ఈ నెలలో పుట్టిన వారు శక్తివంతులు, తెలివితేటలు మెండుగా ఉంటాయి,చాలా యాక్టివ్ గా ఉంటారు.
కోపం ఎక్కువైనప్పటికీ ఇతరలు మంచికోసమే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. వేరే వారికి మార్గదర్శకత్వంగా ఉంటారు
ఏప్రిల్లో పుట్టిన వారికి మానసిక ధైర్యం వీరికి చాలా ఎక్కువ..ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుని పనులు చేసుకుంటారు. తలపెట్టిన పనిని మధ్యలో వదిలేయరు..ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పూర్తిచేసి చూపిస్తారు
ఏప్రిల్ నెలలో పుట్టిన వారు ప్రతి విషయంలో ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటారు. నిజాయితీ కారణంగా చాలామందికి శత్రువుగా మారినా వారిని ఎదుర్కొంటారు కానీ తమ తీరుని మాత్రం మార్చుకోవాలి అనుకోరు
ఇంట్లో, కార్యాలయంలో, వారి వ్యక్తిగత జీవితంలోనూ మంచి స్థానంలో ఉంటారు..ఉండాలని ఆశపడతారు..అందుకు తగిన ప్రయత్నం చేస్తారు.
జీవితంలో అభివృద్ధి చెంది తమ ఆశలు నెరవేర్చుకుంటారు..తృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి దాంపత్య జీవితం బావుంటుంది. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉండవు. పరస్పర అవగాహన ఉంటుంది
అదృష్టంతో పాటూ పరిస్థితులు కూడా సహకరిస్తాయి
ఏప్రిల్ నెలలో పుట్టిన వారు సోమరితనం దరిచేరనివ్వరు.. పనినే దైవంగా భావిస్తారు.

ఏప్రిల్లో పుట్టిన వారి ఆరోగ్యం: ఈ నెలలో పుట్టిన వారికి సహజంగా కంటి, పంటి, చెవికి సంబంధించిన సమస్యలు వస్తాయి. జ్వరం, తలపోటు ఎక్కువగా బాధిస్తుంటాయి

ఆర్థిక స్థితి: ఈ నెలలో జన్మించిన వారు బాగా సంపాదిస్తారు. అనుకోని ధననష్టం ఉంటుంది కానీ ఎలాంటి సమస్యలను అయినా తట్టుకుని జీవితంలో స్థిరంగా నిలబడతారు

అనుకూలవారాలు: సోమవారం, శుక్రవారం అదృష్టాన్నిస్తాయి..మంగళవారం, గురువారం కలిసొస్తుంది

కలిసొచ్చే రంగులు: పింక్ కలర్ వీరికి కలిసొచ్చే రంగు

నోట్: ఈ ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

AP Pension Distribution: ఏపీలో 2 విధాలుగా పెన్షన్ పంపిణీ, మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్

Andhra Pradesh Pension News: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య పెన్షన్ టాపిక్ పై విమర్శలు, ఆరోపణల యుద్ధం కొనసాగుతోంది. పెన్షన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అవ్వా తాతలకు పెన్షన్లు ఇవ్వడానికి వైసీపీ సర్కార్ కు మనసు రాక, తమపై దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

2 విధాలుగా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం (ఏప్రిల్ 3) నుంచి అవ్వాతాతలకు, ఇతర లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు విధానాల్లో పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైనవారు, వితంతువులకు మాత్రం ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేయనున్నారు. మిగతా విభాగాల పెన్షన్ లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ద్వారా పింఛన్ ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుదూర ప్రాంతాల నుంచి పింఛన్ కోసం వచ్చే గిరిజన ప్రాంతాల వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని కలెక్టర్లను ఆదేశించింది.

రాత్రి 7 గంటల వరకు పనిచేయాలి..
ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అసలే ఎన్నికల టైమ్ కావడంతో పాటు పింఛన్ల పంపిణీకి తగినంతగా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవటంతో 2 విధాలుగా పింఛన్లు పంపిణీకి సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాలు ఉద‌యం 9 గంటల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కూ సేవలు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బుధవారం మధ్యాహ్నం పింఛన్ల పంపిణీ ప్రారంభించి.. ఏప్రిల్ 6 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సర్కార్ ఆదేశించింది.

ఎన్నికల కోడ్ తెచ్చిన తిప్పలు..
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాలంటీర్లతో పెన్షన్ నగుదు పంపిణీ చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించింది. వాలంటీర్లు పెన్షన్ నగదును లబ్ధిదారులకు నేరుగా ఇవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రధాన ఎన్నికల ఆధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో సైతం వాలంటీర్లు పొల్గనకూడదని, ఎవరైనా ప్రచారం చేసినట్లు గుర్తిస్తే వారిని విధుల నుంచి తప్పిస్తూ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈసీ రూల్స్, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తప్పిస్తున్నారు. మరోవైపు తమను పెన్షన్ల పంపిణీకి దూరం చేయడంతో వాలంటీర్లు కొన్ని ప్రాంతాల్లో రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేసి తాము గత నెల వరకు పెన్షన్లు పంపిణీ చేసిన ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Turmeric Reducing Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ తగ్గించడంలో పసుపు సూపర్‌.. ఈ విధానంలో వాడితే మంచి ఫలితాలు..!

Turmeric Reducing Belly Fat: నేటి రోజుల్లో చాలామంది బెల్లీఫ్యాట్‌తో బాధపడుతున్నారు. శారీరక శ్రమ తగ్గడం, కూర్చొని పనిచేసే ఉద్యోగాలు పెరగడం వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. దీనివల్ల తరచుగా అనారోగ్యానికి గురై హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు మార్కెట్‌లో కొత్తగా వచ్చే అన్ని వెయిట్‌ లాస్‌ ప్రొడాక్ట్స్‌ కొని వాడుతున్నారు. దీనివల్ల వెయిట్, ఫ్యాట్‌ తగ్గడం ఏంటో కానీ సైడ్‌ ఎఫెక్ట్స్‌ మాత్రం వస్తున్నాయి. అందుకే సహజసిద్దంగా మన వంటగదిలో లభించే పసుపును వాడి బెల్లిఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం.

పసుపులో కనిపించే ప్రధాన మూలకం కర్కుమిన్. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, జీవక్రియను మెరుగుపరిచే లక్షణాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రెండు లక్షణాలు బరువు తగ్గడంలో సాయపడుతాయి. అధిక బరువు ఊబకాయంతో బాధపడేవారికి తరచుగా శరీరంలో వాపు సమస్య ఉంటుంది. పసుపులో ఉండే కర్కుమిన్ ఈ మంటను తగ్గించడంలో సాయపడుతుంది. బరువు తగ్గే ప్రక్రియను సులభతరం చేస్తుంది.

మెటబాలిజం పెరగడం శరీరంలోని జీవక్రియలు ఎంత వేగంగా జరిగితే అంత ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ శరీరం జీవక్రియను పెంచడంలో సాయపడుతుంది. దీని కారణంగా శరీరం త్వరగా కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది.

బరువు తగ్గడానికి పసుపును ఎలా తీసుకోవాలి? పసుపు నీరు : ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా పసుపు పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి ఉదయం పరగడుపున తాగాలి.బరువు తగ్గడానికి ఇది సులభమైన అత్యంత ప్రభావవంతమైన చిట్కా.

పసుపు పాలు : ఒక గ్లాసు వేడి పాలలో అర చెంచా పసుపు పొడి కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి తాగాలి. దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా మంచి నిద్ర కూడా వస్తుంది. ఆహారంలో చేర్చండి : మీ కూరగాయలు, పప్పులలో పసుపును క్రమం తప్పకుండా చేర్చండి. దీనివల్ల ఆహారం రుచి పెరగడమే కాకుండా బరువు తగ్గడానికి సాయపడుతుంది.

Kiren Rijiju: “ఇది 1962 నాటి భారతదేశం కాదు”..చైనాకు కేంద్రమంత్రి వార్నింగ్..

Kiren Rijiju: డ్రాగన్ కంట్రీ చైనా, భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌ని తమదిగా చెప్పుకుంటోంది. తాజాగా అరుణాచల్‌లో పలు ప్రాంతాలకు కొత్త పేర్లను పెట్టింది. ఈ పరిణామంపై భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. పేర్లు మార్చినంత మాత్రాన ఏం జరగదని, అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని భారత విదేశీ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ వివాదంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం బలమైన సరిహద్దు విధానానని కలిగి ఉందని, ఇదే చైనాను చికాకు పెట్టిందని ఆయన అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై కేంద్రమంత్రి స్పందిస్తూ.. ప్రస్తతం భారతదేశం 1962 నాటిది కాదని, ప్రతీ అంగుళాన్ని కాపాడుకుంటామని అన్నారు. 1962 నాటి ఇండియా-చైనా యుద్ధం గురించి ప్రస్తావించారు. బెదిరిస్తే భయపడటానికి భారత్ చిన్న, బలహీన దేశం కాదని ఆయన చెప్పారు. సరిహద్దు విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరించే ప్రభుత్వం భారతదేశంలో ఉందని, ఈ విషయాన్ని చైనీయులు అకస్మాత్తుగా గ్రహించి ఉంటారని ఆయన అన్నారు. సరిహద్దుల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి, ఇతర పనుల గురించి చైనా అధికారులు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.

2014 వరకు లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సరిహద్దు సమస్యల్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ విషయాన్ని 2013లో అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అంగీకరించారని కిరణ్ రిజిజు అన్నారు. దీనికి వారు చెప్పిన కారణం అంగీకరించేదిలా లేదని, సరిహద్దుల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు చైనా మన దేశంపై దండెత్తే పరిస్థితి కాణమవుతుందని కాంగ్రెస్ పేర్కొందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాలను పూర్తిగా రక్షణ లేకుండా చైనీయులు ఆక్రమించేలా విడిచిపెట్టబడ్డాయని అన్నారు.

Pension Scheme: రైతులకు మోడీ సర్కార్‌ నుంచి నెలకు రూ.3 వేల పెన్షన్‌.. దరఖాస్తు చేయడం ఎలా?

వృద్ధాప్యంలో ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మంధన్ యోజనను తీసుకొచ్చింది. పథకం కింద నెలవారీ నిర్ణీత మొత్తం జమ చేయబడుతుంది. అలాగే 60 ఏళ్ల వయస్సు పూర్తయిన తర్వాత, డిపాజిట్ చేసిన మొత్తాన్ని జీవితాంతం ప్రతి నెలా పెన్షన్‌గా అందుకుంటారు..
వృద్ధాప్యంలో ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మంధన్ యోజనను తీసుకొచ్చింది. పథకం కింద నెలవారీ నిర్ణీత మొత్తం జమ చేయబడుతుంది. అలాగే 60 ఏళ్ల వయస్సు పూర్తయిన తర్వాత, డిపాజిట్ చేసిన మొత్తాన్ని జీవితాంతం ప్రతి నెలా పెన్షన్‌గా అందుకుంటారు. పథకం కోసం లబ్ధిదారుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు పథకం ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పథకంలో చేరిన రైతుల సంఖ్య 24 లక్షలు దాటింది.

రైతులకు ఏటా రూ.36 వేలు పింఛన్‌

రైతు కుటుంబాల జీవనశైలిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం 12 సెప్టెంబర్ 2019న ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజనను ప్రారంభించింది. పీఎం కిసాన్ మంధన్ అనేది ఒక సహకార పథకం. చిన్న, సన్నకారు రైతులు పెన్షన్ ఫండ్‌కు నెలవారీ చందా చెల్లించడం ద్వారా పథకంలో సభ్యులు కావచ్చు. పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతు నెలవారీ వాయిదాను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3,000 అవుతుంది. అంటే మీకు ఏటా రూ.36 వేలు వస్తాయి.

3 వేల పింఛను కోసం ఎంత డిపాజిట్ చేయాలి?

ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా రైతులకు 3000 రూపాయల పెన్షన్ ఇస్తుంది. ఈ పథకంలో దరఖాస్తుదారు వయస్సు ప్రకారం పెట్టుబడి మొత్తం నిర్ణయించబడుతుంది. 18 నుంచి 40 ఏళ్లలోపు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. నెలవారీ వాయిదాలను రూ.55 నుండి రూ.200 వరకు డిపాజిట్ చేయవచ్చు. రైతులు నెలకు ఎంత మొత్తంలో జమ చేస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తుంది. ఒక రైతు నెలకు రూ.200 జమచేస్తే కేంద్రం వాటాతో కలిపి నెలకు రూ.400 అతని ఖాతాలో జమ అవుతుంది.

పెన్షన్ కోసం దరఖాస్తు విధానం

వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. రైతులు ఈ పథకం ద్వారా పెన్షన్ ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం, జన్ సేవా కేంద్రం ద్వారా ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పీఎం కిసాన్ కోసం దరఖాస్తులను నోడల్ అధికారి కార్యాలయంలో కూడా అందజేయవచ్చు. ఇది కాకుండా, మాన్‌ధన్ యోజన ప్రయోజనాలను పొందడానికి రైతులు నేరుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేయవచ్చు. దీని కోసం అధికారిక వెబ్‌సైట్ maandhan.in ను సందర్శించడం ద్వారా స్వీయ-ఎన్‌రోల్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత, మీరు ఆన్‌లైన్ ఫారమ్‌లో అవసరమైన వివరాలను పూరించి సమర్పించాలి.

కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం….స్కూళ్లలో రోజుకు 3 సార్లు వాటర్ బెల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఎండలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును తప్పించేందుకు పాఠశాలల్లో మూడు సార్లు వాటర్ బెల్ కొట్టాలని ఆదేశించింది. ఉదయం 8.45, 10.05, 11.50 గంటలకు బెల్ కొట్టాలని సూచించింది. విద్యార్థులు క్రమం తప్పకుండా మంచి నీటిని తాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఒంటి పూట బడులు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

మధుమేహుల ఆరోగ్యంపై సబ్జా గింజల మ్యాజిక్..లాభాలు మామూలుగా లేవుగా!!

జీవనశైలి సరిగ్గా లేకపోతే, శరీరంలో అనేక వ్యాధులు రావడం ప్రారంభమవుతాయి. అలసట, అనారోగ్యం ఒక వ్యక్తిని ఒత్తిడికి గురి చేస్తుంది. చెడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవనశైలి కారణంగా అనేక రోగాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది ప్రజలు మధుమేహం, మలబద్ధకం వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. మధుమేహం రావడం సర్వసాధారణం. నీరు, ఫైబర్ లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఇటువంటి సమస్యలను తగ్గించడానికి లేదా ఉపశమనం పొందడానికి ఇంటి నివారణలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఆయుర్వేదంలో చాలా ప్రయోజనకరంగా భావించే సబ్జా గింజలతో మధుమేహం, మలబద్ధకాన్ని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం..

మధుమేహం నయం కాదు. అయితే, కొన్ని ఇంటి చిట్కాలు, ఆయుర్వేద ఔషధాలు తీసుకోవడం వల్ల బ్లడ్‌ షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. సబ్జా విత్తనాల్లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. మీరు తరచుగా మలబద్ధకంతో బాధపడుతుంటే, ప్రతిరోజూ సబ్జా గింజలను తినండి. ఇందులో పీచు పుష్కలంగా ఉండి మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

మధుమేహంతో బాధపడేవారు సబ్జా గింజలను తీసుకోవచ్చు. వీటిని మీరు తాగే నీళ్లలో నానబెట్టుకుని తాగటం ఉత్తమం. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగటం వల్ల ఫలితం ఉంటుంది. శరీరంలోని బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. తక్కువ నీరు త్రాగడం, సరైన జీవనశైలి కారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సబ్జా గింజలు వీలైనంత ఎక్కువ నీరు త్రాగడమే కాకుండా మూత్రనాళ ఇన్ఫెక్షన్లను కూడా నయం చేస్తాయి.

Sri Maddi Anjaneya Swamy Temple: చెట్టుమానులో ఆంజనేయస్వామి ఆలయం..! ఎక్కడో తెలుసా?

Sri Maddi Anjaneya Swamy Temple History and Significance: ఆంజనేయ స్వామి పేరు వినగానే మనసులోని అన్ని భయాలు దూరమవుతాయి. తనను నమ్మిన భక్తుల భయాలను దూరం చేసి, విజయాలను అందించే ఆంజనేయుడు అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. అయితే.. చెట్టుమానులో ఆంజనేయస్వామి కొలువై ఉన్న ఓ అరుదైన ఆలయం ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి గూడెం మండలంలోని గురవాయి గూడెంలో ఉంది.

స్థలపురాణం ప్రకారం, త్రేతాయుగంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. పేరుకు రాక్షసుడే అయినా, ‘జీవహింస చేయను, కత్తిపట్టను’ అనే నియమం మీద జీవించేవాడు. సీతమ్మ జాడకై హనుమ లంకకు వచ్చినప్పుడు అతని వ్యక్తిత్వం చూసి, భక్తుడిగా మారాడు. రామ రావణ యుద్ధంలో ఆ యుద్ధంలో రాముడి ‘హనుమా.. హనుమా’ అంటూ ఆత్మత్యాగం కన్నుమూశాడు. అతడే ద్వాపర యుగంలో ‘మధ్వికుడు’ అనే పేరుతో జన్మించి కౌరవుల పక్షాన పోరాడాడు. అప్పడు కూడా అర్జునుడి జెండా మీద ఆంజనేయుడిని చూసి గత జన్మస్మృతిని పొంది ఆంజనేయుడిని స్మరిస్తూనే కన్నుమూశాడు.

అతడే కలియుగంలో ‘మధ్యుడు’ అనే పేరుతో జన్మించి హనుమ గురించి తపస్సు చేసుకుంటూ అనేక ప్రదేశాలు తిరుగుతూ నేటి గురవాయి గూడెం వద్ద గల ఎర్రకాలువ ఒడ్డున నివాసం ఏర్పరుచుకుని, తపస్సు చేశాడు. ముసలితనంలో ఓరోజు స్నానం చేసి వచ్చే వేళ ఎండకు సొమ్మసిల్లి పడిపోగా ఆంజనేయుడు కోతి రూపంలో వచ్చి పండు ఇచ్చి తినిపిస్తాడు. తర్వాత తన భక్తుడికి నిజరూపంలో దర్శనమివ్వగా, నీతోనే శాశ్వతంగా ఉండేలా వరం కావాలని మధ్యుడు కోరతాడు. ‘నీవు మద్దిచెట్టుగా మారు. నేను నీ కిందే కొలువై ఉండిపోతాను’ అని హనుమ వాగ్దానం చేయగా, నాటి నుంచి నేటి వరకు స్వామి ఆ చెట్టుకిందే నిలబడిపోయారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ ఆలయంలోని స్వామి ఓ చేతిలో పండు, మరో చేతిలో గదతో స్వయంభువుగా వెలిశాడు. అలాగే శిఖరం లేని ఈ ఆలయానికి తెల్ల మద్ది చెట్టే నేటికీ శిఖరంగా ఉంది. క్రీ.శ. 1166లో స్థానికులకు ఇక్కడ దర్శనమివ్వగా అక్కడ ఒక చిన్న గుడిని నిర్మించారు. 1978లో దానిని విస్తరించి అభివృద్ధి చేసినా, ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు. ప్రతి మంగళవారం వేలాది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. వైష్ణవ సంప్రదాయంలో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రంలో సువర్చలా సమేత ఆంజనేయస్వామికి కల్యాణం నిర్వహిస్తారు. ఏటా వేలాది మంది ఇక్కడ హనుమత్ దీక్షలు తీసుకుంటారు.

శని, కుజ, రాహు గ్రహదోషాలున్న వారు ఇక్కడ శనివారం పూజచేయించుకుంటే అవి తొలగిపోతాయని, ఈ ఆలయంలో 7 మంగళవారాలు 108 చొప్పున ప్రదక్షిణలు చేసిన వారి కోరిక తప్పక తీరుతుందని స్థానికుల నమ్మకం. ఆంజనేయుడిని దర్శించుకున్న భక్తులు.. ఆలయానికి 4 కి.మీ దూరంలో జంగారెడ్డిగూడెంలో భాగంగా ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రాన్ని సందర్శించి, అక్కడి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామినీ దర్శించుకుంటారు.

Papaya: బొప్పాయితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ దీన్ని ఇలా తింటేనే మంచిది!

బొప్పాయిలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది కెరోటినాయిడ్స్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. డార్క్ స్పాట్స్‌తో పాటు ముడతలు, ఫైన్ లైన్‌లను తగ్గించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది.
బొప్పాయి.. అందరికీ అందుబాటులో ఉండే చవకైన రుచికరమైన, జ్యూసీ పండు. ఇది వేసవి కాలంలో తినడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా తీపి మరియు జ్యుసిగా ఉంటుంది, ఇది తిన్న తర్వాత చాలా తాజాగా అనిపిస్తుంది. బొప్పాయి చాలా రుచికరమైన పండు, ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఉండే పాపిన్ అనే ఎంజైమ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడతాయి. అంతే కాదు బొప్పాయి తినడం వల్ల చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు.. బొప్పాయిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.

బొప్పాయి ప్రయోజనాలు:

షుగర్‌ని నియంత్రించడం నుండి బరువు తగ్గడం వరకు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బొప్పాయి చాలా రుచికరమైన పండు. ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఉండే పాపిన్ అనే ఎంజైమ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల, బొప్పాయిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయి సహజమైన భేదిమందు కూడా. ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినడం వల్ల ప్రేగుల కదలిక మెరుగుపడుతుంది. ఉబ్బరం సమస్యను నివారిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి:

బొప్పాయిలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది కెరోటినాయిడ్స్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది.

గుండెకు ప్రయోజనకరం:

బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందువల్ల, బొప్పాయి తినడం ఆరోగ్యకరమైన గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:

బొప్పాయిలో లైకోపీన్, విటమిన్ సి ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. డార్క్ స్పాట్స్‌తో పాటు ముడతలు, ఫైన్ లైన్‌లను తగ్గించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఫలితంగా మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది.

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది:

బొప్పాయిలో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది . ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది.

కడుపు నిండుగా ఉంటుంది:

బొప్పాయిలో ఫైబర్ ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. దీని కారణంగా, అతిగా తినాలనే కోరిక ఉండదు. బరువు పెరగడం లేదా ఉబ్బరం వంటి సమస్యలను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

TG డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ-2024 పరీక్షల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. 11,062 టీచర్ పోస్టు భర్తీ కోసం తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్ లైన్ లో అప్లికేషన్ల ఫీజు చెల్లించేందుకు గడువు ఏప్రిల్ 2 వరకు, దరఖాస్తులు సమర్పించేందుకు ఏప్రిల్ 3వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఫీజు చెల్లింపుకు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో తాజాగా గడువును పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం వచ్చే జూన్ 20 వ తేదీ వరకు ఛాన్స్ కల్పించారు. దీంతో అభ్యర్థులు రూ. 1000 చొప్పున అఫ్లికేషన్ ఫీజు చెల్లించి జూన్ 20 రాత్రి 11:50 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు.
కాగా జులై 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. గతేడాది సెప్టెంబర్ 6వ తేదీన 5,089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆ డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి పోస్టుల సంఖ్యను 11,062కు పెంచి సీఎం రేవంత్ రెడ్డి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

KCRకు బిగ్ షాక్.. కుటుంబంలో మరొకరి అరెస్ట్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును ఆదిబట్ల పోలీసులు ఎట్టకేలకు మంగళవారం అరెస్టు చేశారు. ఆదిబట్లలోని ఓ భూ సెటిల్మెంట్‌లో తన అనుచరులతో కలిసి స్థలం వద్దకు వెళ్లి సృష్టించిన దౌర్జన్యం మీద బాధితుడు ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఆదిబట్ల పోలీసులు కల్వకుంట్ల కన్నారావు పరారీలో ఉన్నాడని, అతని అనుచరులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించిన సమయంలోనే కన్నారావు తన న్యాయ వాది ద్వారా హై కోర్టుతో పాటు, స్థానిక కోర్టులలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాటిని న్యాయమూర్తి తిరస్కరించడంతో మంగళవారం పోలీసు లు కన్నారావును అరెస్టు చేశారు. ఆయనను రిమాండ్‌కు పంపనున్నారు. ఈ కేసులో కన్నారావుతో పాటు మరో 32 మంది మీద అభియోగాలను ఆదిబట్ల పోలీసులు నమోదు చేశారు.

BREAKING: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వారు ఎవరెవరంటే?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అదేశాల మేరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్, ఐసీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఐఏఎస్‌లు రాజబాబు, గౌతమి, లక్ష్మి షా ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌లు బదిలీ అయ్యారు

SBI shares: 30 ఏళ్ల క్రితం ఎస్‌బీఐలో తాతకు షేర్లు.. ఇప్పటి విలువ చూసి మనవడు షాక్‌!

పొదుపు విషయంలో మనకంటే మన పూర్వీకులే ముందు వరుసలో ఉంటారు. పెద్దగా పెట్టుబడి సాధనాలు అందుబాటులో లేని రోజుల్లో భావితరాల కోసం ఆస్తులు కూడబెట్టేవారు. అలాంటిది స్టాక్‌ మార్కెట్‌ గురించి పెద్దగా అవగాహన లేని 30 ఏళ్ల క్రితమే ఓ వ్యక్తి ఎంతో ముందుచూపుతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) షేర్లను కొని, వాటిని అలానే వదిలేశారు. అప్పట్లో రూ.500 పెట్టి కొన్న వాటాల నేటి విలువ చూసి ఆశ్చర్యపోవడం ఆయన మనవడి వంతైంది.

చండీగఢ్‌కు చెందిన డాక్టర్‌ తన్మయ్‌ మోతీవాలా చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా పని చేస్తున్నారు. ఆయన తాత 1994లో రూ.500 విలువైన ఎస్‌బీఐ షేర్లను కొనుగోలు చేశారు. ఇటీవల కుటుంబ ఆస్తులను ఒకచోట చేర్చినప్పుడు దీనికి సంబంధించిన షేర్ల సర్టిఫికెట్‌ను కనుగొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఈ షేర్లను తన తాత విక్రయించకుండా అలానే వదిలేశారని, వాటి గురించి మరిచిపోయారని పేర్కొన్నారు. ఆ వాటాల విలువ ఇప్పుడు డివిడెండ్లు ఏవీ కలపకుండానే రూ.3.75 లక్షలు అయ్యిందని మోతీవాలా తెలిపారు. ఇప్పుడు ఆ మొత్తం ఎక్కువ కానప్పటికీ.. 30 ఏళ్లలో 750 రెట్లు రిటర్నులు ఇవ్వడమంటే సాధారణ విషయం కాదని తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.
ఈ స్టాక్స్‌ను డీమ్యాట్‌ అకౌంట్లోకి మార్చడానికి పేరు, చిరునామాలో పొరపాట్లు ఉన్నాయని, అందుకోసమే ఓ కన్సల్టెంట్‌ను సంప్రదించానని మోతీవాలా తెలిపారు. ఇది కాస్త క్లిష్టమైన వ్యవహారమని, అందుకు కొంత సమయం కూడా పడుతుందన్నారు. ఈ వాటాలను విక్రయించాలని తాను అనుకోవడం లేదన్నారు. ఈ వైద్యుడి పోస్ట్‌ వైరల్‌గా మారడంతో కొందరు నెటిజన్లు స్పందించారు. ‘మన పెద్దవాళ్లను చూసి నేర్చుకోవాలి’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది అంటూ మరో యూజర్ కామెంట్‌ పెట్టారు. ఎస్‌బీఐ ఉద్యోగి అయిన తన తండ్రి అప్పట్లో 500 షేర్లను కొనుగోలు చేశారని, ఆయన మరణానంతరం తాను ఆ షేర్లను విక్రయించినట్లు చెప్పారు. ఆ తర్వాత ఈక్విటీల్లో మదుపు చేయడం ప్రారంభించాననని పేర్కొన్నాడు.

రూ.500 కాదు.. రూ.5వేలు!
డా.తన్మయ్‌ ట్వీట్‌ వైరల్‌గా మారడంతో కొందరు అదెలా సాధ్యమంటూ ఆరాతీయడం మొదలుపెట్టారు. దీంతో తన్మయ్‌ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవానికి తన తాత షేర్లు కొన్నది 5 వేల రూపాయలకు అని, ముఖ విలువ ఆధారంగా రూ.500గా లెక్కించి తాను పొరబడినట్లు పేర్కొన్నారు. అలాగే, స్టాక్‌ స్ప్లిట్‌ కారణంగా షేర్ల సంఖ్య 500 అయ్యాయని, కాబట్టి వాటి మొత్తంలో ఎలాంటి తేడా లేదని తెలిపారు. ఈక్విటీల్లో దీర్ఘకాలంలో పెట్టుబడుల వల్ల ప్రయోజనం గురించి చెప్పడమే తన ఉద్దేశమని తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు.

నాటి గాంధార రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్‌.. గాంధారీ ఇచ్చిన శాపంతోనే ఇప్పటికీ ఇబ్బందుల్లో ఉందా

మహాభారత కాలంలో గాంధార రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్‌ అని చాలామంది అంటారు. దీనికి రుజువు ఇదిగో అంటూ ఆ దేశంలోని ఒక నగరాన్ని ఇప్పటికీ కాందహార్ అని పిలుస్తారు. ఈ పదం గాంధార నుంచి ఉద్భవించింది. దీని అర్థం ‘సువాసనల భూమి’. ఈ పదం ఋగ్వేదం, మహాభారతం, ఉత్తర-రామాయణం వంటి వివిధ పాత గ్రంథాల్లో ప్రస్తావించబడింది. సహస్రనామం ప్రకారం శివుని పేర్లలో గాంధారం ఒకటి. గాంధార మొదటి నివాసులు శివ భక్తులని కూడా నమ్ముతారు.

మహాభారతం- కాందహార్ మధ్య సంబంధం
గాంధార సామ్రాజ్యంలో నేటి తూర్పు ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర పాకిస్తాన్, వాయువ్య పంజాబ్ ఉన్నాయి. మహాభారతం వేదవ్యాస మహర్షి రచించిన సంస్కృత ఇతిహాసం. ఇందులో కౌరవ, పాండవ యువరాజుల మధ్య జరిగిన యుద్ధ కథ. ఈ ఇతిహాసం ప్రకారం సుమారు 5500 సంవత్సరాల క్రితం గాంధారాన్ని సుబల రాజు పరిపాలించాడు. అతనికి గాంధారి, శకుని అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె గాంధారీకి హస్తినాపుర రాజ్యానికి యువరాజు అయిన ధృతరాష్ట్రుడితో వివాహం జరిగింది.

గాంధారం కాందహార్ అయింది
మహాభారత పురాణం ప్రకారం గాంధారికి కౌరవులు అని పిలువబడే 100 మంది కుమారులు ఉన్నారు. వీరు సోదరులైన పాండవులతో జరిగిన యుద్ధంలో మరణించారు. కురు క్షేత్ర యుద్ధానంతరం గాంధార సామ్రాజ్యంలో స్థిరపడిన వారు క్రమంగా నేటి సౌదీ అరేబియా, ఇరాక్‌లకు వలస వెళ్లారు. గాంధార ప్రాంతం నుంచి శివారాధకులు క్రమంగా అంతరించిపోయి బౌద్ధమతం వ్యాప్తి చెందడంతో గాంధారం పేరు కాందహార్ గా మారింది. ఇది మాత్రమే కాదు చంద్రగుప్తుడు, అశోకుడు, టర్కీ విజేత తైమూర్ , మొఘల్ చక్రవర్తి బాబర్ లతో పాటు మౌర్య పాలకులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. బహుశా ఈ పాలకులలో ఒకరి పాలనలో గాంధార పేరు మారిపోయిందని చారిత్రిక కథనం.

ఆఫ్ఘనిస్తాన్‌పై గాంధారి శాపం ప్రభావం
పురాణాల కథల ప్రకారం కౌరవుల తల్లి అయిన గాంధారి శ్రీకృష్ణుడిని శపించడంతో ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది. దీనితో పాటు గాంధారి తన సోదరుడు శకునిని కూడా శపించింది. ఎందుకంటే గాంధారి తన కొడుకుల మరణానికి తన సోదరుడైన శకుని కారణంగా భావించింది. తన 100 మంది కొడుకులను చంపిన గాంధార రాజు శకుని రాజ్యంలో ఎప్పుడు ఎవరూ శాశ్వతంగా నివసించరని.. ఇక్కడ శాంతి ఉండదు, ఎల్లప్పుడూ బాధలు పడతారని.. రక్తం కారుతూ ఉండే వాతావరణం ఉంటుందని శాపాన్ని ఇచ్చింది.

అలా గర్భ శోకంతో గాంధారి ఇచ్చిన శాపం వల్ల ఆఫ్ఘనిస్తాన్‌లో ఎప్పుడూ శాంతి వాతావరణం ఉండదని నమ్ముతారు. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత, అంతకు ముందు కూడా శాంతి లేదు. ఈ దేశాన్ని ఇప్పటి వరకూ ఎవరు పాలించినా స్థానికులు టెన్షన్, గొడవలు లేకుండా జీవించలేదు. ఈ కారణాలన్నింటికీ కారణం గాంధారి శాప ప్రభావమేనని నమ్ముతారు.

ఆ మహా శివుడు స్థాపించిన పురాతన నగరం.. కాశీని వారణాసి అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

మతపరమైన ప్రాముఖ్యతతో పాటు, ఇతర కారణాల వల్ల కూడా ఈ నగరం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ లభించే బనారసీ చీరల నుండి రుచికరమైన బనారసీ పాన్ వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. దూరప్రాంతాల ప్రజలు వాటిని ఇష్టపడతారు. ఇక్కడ జరిగే గంగా హారతి ఒక సుందరమైన దృశ్యం. ప్రతిరోజూ అనేక మంది హారతిని దర్శించుకునేందుకు గంగా ఘాట్‌కు వస్తుంటారు.
భారతదేశానికి ఉన్న గొప్ప చరిత్ర, సంస్కృతి కారణంగా మన దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ మన గతాన్ని తెలియజేస్తాయి. ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న నగరాలకు కూడా దేనికది ప్రత్యేక చరిత్ర కలిగి ఉంది. మన దేశంలో వందలు వేలు కాదు..వేల సంవత్సరాల పురాతన నగరాలు చాలా ఉన్నాయి. వారణాసి, కాశీ విశ్వనాధుడి కొలువైన నగరం. ఈ నగరాలలో ఒకటి. ఇది భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ నగరం గొప్ప చరిత్ర, దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

వేల సంవత్సరాల పురాతన నగరం..

ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అనేక నగరాలు ఉన్నాయి. వాటి ఆధారంగానే చాలా సంవత్సరాల క్రితమే మానవ నాగరికత ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడినట్లు రుజువు చేస్తుంది. వారణాసి కూడా అటువంటి నగరం. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల జాబితాలో చేర్చబడింది. దేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా పిలువబడే వారణాసి సుమారు 3000 సంవత్సరాల పురాతనమైనది అని నమ్ముతారు. ఈ నగర చరిత్ర సుమారు 11వ శతాబ్దం నాటిది. అయితే, కొంతమంది పండితులు ఈ నగరం 4000-5000 సంవత్సరాల పురాతనమైనది అని నమ్ముతారు.
వారణాసి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..

వారణాసిని భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని అని పిలుస్తారు. అంతేకాదు.. ఈ నగరాన్ని ‘బనారస్’ మరియు ‘కాశీ’ అని కూడా పిలుస్తారు. ఈ నగరం హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. దీనిని అవిముక్త్ క్షేత్రం అని కూడా పిలుస్తారు. గంగ, శివుడు కొలువైన ఈ నగరానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వారణాసి అనేక సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక, మతపరమైన కేంద్రంగా విరాజిల్లుతోంది.

అందుకే ఈ నగరాన్ని వారణాసి అని పిలుస్తారు…

ఈ నగరానికి వారణాసి అనే పేరు వరుణ నది, అసి నది అనే రెండు స్థానిక నదుల నుండి వచ్చింది. ఈ రెండు నదులు వరుసగా ఉత్తరం, దక్షిణం నుండి వచ్చి గంగా నదిలో కలుస్తాయి. ఇది కాకుండా, ఈ నగరం పేరు గురించి పురాతన కాలంలో వరుణ నదిని వారణాసి అని పిలుస్తారని, దాని కారణంగా ఈ నగరాన్ని వారణాసి అని పిలుస్తారు. ఇది కాకుండా, ఈ నగరాన్ని బనారస్, కాశీ, సిటీ ఆఫ్ లైట్, సిటీ ఆఫ్ భోలేనాథ్ మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు.

శివుడు కాశీ నగరాన్ని స్థాపించాడు..

వారణాసి మూలం గురించి ప్రస్తావించినట్టయితే.. మాట్లాడుతూ మత విశ్వాసాలు, పురాణాల ప్రకారం శివుడు ఈ కాశీ నగరాన్ని సుమారు 5000 సంవత్సరాల క్రితం స్థాపించాడు. అంతే కాదు, 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథుని రూపంలో శివుడు ఇక్కడ భక్తులతో పూజలందుకుంటున్నాడు. నేటికీ బనారస్ హిందువులకు ప్రధాన పుణ్యక్షేత్రం కావడానికి ఇదే కారణం. ఈ నగరం స్కాంద పురాణం, రామాయణం, మహాభారతం, పురాతన వేదం, ఋగ్వేదంతో సహా అనేక హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడింది.

అందుకే బనారస్ కూడా ప్రసిద్ధి చెందింది..

మతపరమైన ప్రాముఖ్యతతో పాటు, ఇతర కారణాల వల్ల కూడా ఈ నగరం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ లభించే బనారసీ చీరల నుండి రుచికరమైన బనారసీ పాన్ వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. దూరప్రాంతాల ప్రజలు వాటిని ఇష్టపడతారు. ఇక్కడ జరిగే గంగా హారతి ఒక సుందరమైన దృశ్యం. ప్రతిరోజూ అనేక మంది గంగా ఘాట్‌కు చేరుకుంటారు. ఇది కాకుండా ఇక్కడ ఉన్న అస్సీ ఘాట్, దశాశ్వమేధ ఘాట్ కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. ఇక ఇక్కడ దొరికే ఆహారం గురించి చెప్పాలంటే, బనారసీ పాన్‌తో పాటు, కచోరీ సబ్జీ, చెనా దహీ వడ, బటర్ మలైయో, చుడా మాటర్, లస్సీ రుచి చూడకుండా వెళితే.. మీ వారణాసి టూర్‌ అసంపూర్ణమే అవుతుంది.

రోజుకు రూ.100 పొదుపుతో.. కోటీశ్వరుడు అయిపోవచ్చు! ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే?

ప్రస్తుతం అందరికి పెట్టుబడులు పెట్టాలని ఉన్నా కూడా.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రిటర్న్స్ వస్తాయి అని అందరికి సందేహాలు ఉంటాయి. మరి వీటిలో ఏది బెస్ట్ అనేది చూసేద్దాం, వీటిలో గ్యారెంటీ రిటర్న్స్ కోసమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి .. పొదుపు పథకాలు, పోస్టాఫీస్ స్కీమ్స్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి ఉండనే ఉన్నాయి. అవి కాకుండా ఈ మధ్య.. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. స్టాక్ మర్కెట్స్ లో రిస్క్ ఎక్కువ ఉన్న కారణంగా .. దానికంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లు బెస్ట్ ఆప్షన్ అని అందరు భావిస్తున్నారు. ఇక్కడ కూడా సరైన.. పథకాలలో ఇన్వెస్ట్ చేస్తే కనుక భారీగానే రిటర్న్స్ అందుకోవచ్చు.. ఇందులో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది, అంటే డబ్బు డబ్బుపై ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చు.

ఇక ఈ మ్యూచువల్ ఫండ్స్ లో.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) పెట్టుబడి బెటర్ అని అందరు భావిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ నెల నెల కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చు.. ఇక్కడ ముందుగా ప్రతి నెలా ఎంత డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారనేది నిర్ణయించుకోవాలి. అలా రూ. 100 ఆదా చేయడం ద్వారా కూడా కొన్నేళ్లలో రూ. కోటి ఫండ్ సృష్టించవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు రూ. 100 అంటే.. SIP ద్వారా అది ఒక నెలకు రూ. 3000 పెట్టుబడి అవుతుంది. ఇలా క్రమం తప్పకుండా.. 21 సంవత్సరాల పాటు.. పెట్టుబడి పెడుతూ ఉండాలి. 21 సంవత్సరాలంటే.. సుమారు 250నెలలు.. నెలకు రూ. 3 వేల చొప్పున 250 నెలలకు .. మీ అమౌంట్ రూ. 7.56 లక్షలు మాత్రమే అవుతుంది.

కాగా, మ్యూచువల్ ఫండ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కారణంగా.. అవి దీర్ఘ కాలంలో.. మంచి రాబడిని అందిస్తాయి. వీటిలో 20% వరకు రాబడిని అందించే ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేది.. ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని ,మంచి ఫండ్ ఎంపిక చేసుకొని పెట్టుబడి పెట్టడం మంచిది. మీరు పెట్టె పెట్టుబడికి.. 20 శాతం వార్షిక రాబడి ప్రకారం. 21 సంవత్సరాలలో రూ. 1.16 కోట్లకు చేరుతుందన్నమాట. పెట్టుబడి ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే.. రిటర్న్స్ ఇంకా ఎక్కువ మొత్తంలో ఆశించవచ్చు.

CM జగన్‌కు నాకు పరిచయమే లేదు.. సోదరుడిపై YS షర్మిల సెన్సేషనల్ కామెంట్స్

ఏపీ సీఎం, సోదరుడు జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడని.. ఈ జగన్ మోహన్ రెడ్డికి నాకు పరిచయం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని.. వైఎస్ఆర్ బిడ్డ నిలబడుతుందని తెలిపారు. ఈ నిర్ణయం నాకు సులువైంది కాదని.. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని చీలుస్తుంది అని తెలుసు.. అయినా తప్పని సరి పరిస్థితిలో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. జగన్ నా అనుకున్న వాళ్ళను అందరినీ నాశనం చేశాడు.. హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడని ఫైర్ అయ్యారు. కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇచ్చాడు, ఇదే తట్టుకోలేక పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన వాళ్లకు శిక్ష లేదు, హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు, అన్ని సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవు అని అసహనం వ్యక్తం చేశారు.
మళ్ళీ అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడం తట్టుకోలేక పోయానన్నారు. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని, వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్, వివేకా రామ లక్ష్మణుడిలా ఉండేవాళ్ళన్నారు. వివేకా ఆకరి కోరిక నన్ను ఎంపీగా చూడాలని.. నన్ను ఎందుకు ఆయన ఎంపీగా ఉండమని అడిగారో ఇవ్వాళ అర్థం అయ్యిందన్నారు. నేను హత్యా రాజకీయాలకు విరుద్ధమని, ఒక హంతకుడు పార్లమెంట్ మెట్టు ఎక్కకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని ముంచారని ధ్వజమెత్తారు. రాజన్న రాజ్యం అని చెప్పి రాక్షస రాజ్యం తెచ్చాడని, ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Health

సినిమా