Pension Scheme: రైతులకు మోడీ సర్కార్‌ నుంచి నెలకు రూ.3 వేల పెన్షన్‌.. దరఖాస్తు చేయడం ఎలా?

వృద్ధాప్యంలో ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మంధన్ యోజనను తీసుకొచ్చింది. పథకం కింద నెలవారీ నిర్ణీత మొత్తం జమ చేయబడుతుంది. అలాగే 60 ఏళ్ల వయస్సు పూర్తయిన తర్వాత, డిపాజిట్ చేసిన మొత్తాన్ని జీవితాంతం ప్రతి నెలా పెన్షన్‌గా అందుకుంటారు..
వృద్ధాప్యంలో ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మంధన్ యోజనను తీసుకొచ్చింది. పథకం కింద నెలవారీ నిర్ణీత మొత్తం జమ చేయబడుతుంది. అలాగే 60 ఏళ్ల వయస్సు పూర్తయిన తర్వాత, డిపాజిట్ చేసిన మొత్తాన్ని జీవితాంతం ప్రతి నెలా పెన్షన్‌గా అందుకుంటారు. పథకం కోసం లబ్ధిదారుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు పథకం ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పథకంలో చేరిన రైతుల సంఖ్య 24 లక్షలు దాటింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

రైతులకు ఏటా రూ.36 వేలు పింఛన్‌

రైతు కుటుంబాల జీవనశైలిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం 12 సెప్టెంబర్ 2019న ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజనను ప్రారంభించింది. పీఎం కిసాన్ మంధన్ అనేది ఒక సహకార పథకం. చిన్న, సన్నకారు రైతులు పెన్షన్ ఫండ్‌కు నెలవారీ చందా చెల్లించడం ద్వారా పథకంలో సభ్యులు కావచ్చు. పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతు నెలవారీ వాయిదాను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3,000 అవుతుంది. అంటే మీకు ఏటా రూ.36 వేలు వస్తాయి.

3 వేల పింఛను కోసం ఎంత డిపాజిట్ చేయాలి?

ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా రైతులకు 3000 రూపాయల పెన్షన్ ఇస్తుంది. ఈ పథకంలో దరఖాస్తుదారు వయస్సు ప్రకారం పెట్టుబడి మొత్తం నిర్ణయించబడుతుంది. 18 నుంచి 40 ఏళ్లలోపు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. నెలవారీ వాయిదాలను రూ.55 నుండి రూ.200 వరకు డిపాజిట్ చేయవచ్చు. రైతులు నెలకు ఎంత మొత్తంలో జమ చేస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తుంది. ఒక రైతు నెలకు రూ.200 జమచేస్తే కేంద్రం వాటాతో కలిపి నెలకు రూ.400 అతని ఖాతాలో జమ అవుతుంది.

పెన్షన్ కోసం దరఖాస్తు విధానం

వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. రైతులు ఈ పథకం ద్వారా పెన్షన్ ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం, జన్ సేవా కేంద్రం ద్వారా ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పీఎం కిసాన్ కోసం దరఖాస్తులను నోడల్ అధికారి కార్యాలయంలో కూడా అందజేయవచ్చు. ఇది కాకుండా, మాన్‌ధన్ యోజన ప్రయోజనాలను పొందడానికి రైతులు నేరుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేయవచ్చు. దీని కోసం అధికారిక వెబ్‌సైట్ maandhan.in ను సందర్శించడం ద్వారా స్వీయ-ఎన్‌రోల్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత, మీరు ఆన్‌లైన్ ఫారమ్‌లో అవసరమైన వివరాలను పూరించి సమర్పించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *