Sunday, November 17, 2024

Peru – బండరాయిలో గుడి… గుళ్లొ రహస్యం -19 చిన్న చిన్న గదులను కలుపుతూ నిర్మించిన ఓ విశాలమైన గది అప్పటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

బండరాయిలో గుడి… గుళ్లొ రహస్యం
అదో పురాతన గుడి. అన్ని గుడుల్లాంటిది కాదు. మిగతా గుడులకూ దానికీ చాలా వ్యత్యాసముంది. దాన్ని కట్టిన విధానమే కాదు… దాని చరిత్రలో దాగున్న రహస్యాలూ ఆశ్చర్యం కలిగిస్తాయి. అవేంటో చదివేయండి.
పెరూలోని కస్కో అనే పట్టణానికి సమీపంలో ఉందా గుడి. 15వ శతాబ్దం కాలానికి చెందిన ఇన్‌కాన్‌ రాజ్య పాలకులు దాన్ని నిర్మించారు. తర్వాతి కాలంలో ఐరోపా సేనలు ఇన్‌కాన్‌ సామ్రాజ్యంపై దాడి చేసి కోటలు, గుడులను నేలమట్టం చేశాయి. అయితే ఈ గుడిని మాత్రం అలాగే వదిలేశాయి.


* ఇదో ఏకశిలా నిర్మాణం. కొండల సమీపంలో ఉన్న ఓ పేద్ద రాయిని తొలుస్తూ ఈ గుడి మొత్తాన్ని నిర్మించడం విశేషం. ఈ గుడికి చేరుకోవడానికి మెట్లను సైతం అదే రాయిలో తొలిచారు.

* గుడి ప్రాంగణంలోనూ అద్భుత నిర్మాణాలున్నాయి. కొండల్లో సహజసిద్ధంగా ఉన్న గుహలను కలుపుతూ విశాలమైన గదులను నిర్మించారు

* 19 చిన్న చిన్న గదులను కలుపుతూ నిర్మించిన ఓ విశాలమైన గది అప్పటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

* ఈ గుడిలో కాలువ లాంటి నిర్మాణం ఉంది. అందులో రక్తం లేదా ఎర్రటి ద్రవపదార్థం సంవత్సరాల తరబడి పారినట్లు ఆధారాలు లభించాయి. దీన్ని బట్టి ఇన్‌కాన్‌ రాజ వంశీకులు తాము ఆరాధించే స్వర్గదేవతలకు రక్త తర్పణం చేసే ఆచారం ఇక్కడ కొనసాగి ఉండొచ్చని భావిస్తున్నారు.
* ఈ గుడిలో ఎలాంటి విగ్రహాలు లేవు. అప్పటి ప్రజలు సూర్యచంద్రులను పూజించేవారని, అందుకే ఇక్కడ విగ్రహాలు లేవని కొందరంటారు.

Health tips : భోజనానికి ముందు ఒక్కటి తింటే చాలు.. ఎన్నేళ్లు వచ్చిన యవ్వనంగా ఉంటారు..

ముప్పై ఏళ్లు కూడా నిండక ముందే యూత్ ముఖంపై ముడుతలు వస్తున్నాయి..
దాంతో అందవిహీనంగా కనిపిస్తారు. ఇక అందంగా కనిపించాలని వాడని క్రీములు ఉండవు.. అలాంటి కెమికల్స్ వాడటం వల్ల ఉన్న ముడుతలు ఏమోగానీ లేనిపోని చర్మసమస్యలను కొని తెచ్చుకున్నవారం అవుతాము.. అందుకే ఈరోజు మీకోసం న్యాచురల్ గా ఈ ముడుతలను తగ్గించే టిప్ ను తీసుకొచ్చాము.. అదేంటో.. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉసిరికాయ గురించి అందరికి తెలుసు.. ఇవి రుచికి పుల్లగా, వగరుగా ఉంటాయి.. అందుకే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు.. వీటిలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. పచ్చి ఉసిరికాయలతో పాటు ఎండిన ఉసిరికాయల్లో కూడా ఈ పోషకాలు ఉంటాయి.. ఆయుర్వేదంలో విరివిగా వీటిని ఉపయోగిస్తారు.. ఎన్నో రోగాలను నయం చేస్తుంది.. ఉసిరికాయలతో జామ్ కూడా మంచిదే.. జ్ఞాపక శక్తి మెరుగుపతుంది.. రక్తాన్ని పెంచుతుంది..

ఎండిన ఉసిరికాయలను రోజూ భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల చర్మం పై ముడుతలు, చర్మ సమస్యలు తొలగిపోవడంతో పాటు జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.. నిత్య యవ్వనంగా ఉండవచ్చు. ఈ విధంగా ఉసిరికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఏ రూపంలో తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చెయ్యండి..

వారానికి ఒక్కసారి ఇలా చేస్తే వద్దన్నా సరే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

సాధారణంగా కొందరి జుట్టు( hair ) చాలా ఒత్తుగా ఉంటుంది. అలాంటి వారిని చూస్తే కాస్త ఎక్కువే అసూయ కలుగుతుంది. ఈ క్రమంలోనే ఎంత కేర్ తీసుకుంటున్నా సరే తమ జుట్టు అలా ఎందుకు లేదు అని తెగ మదన పడుతూ ఉంటారు.
నిజానికి ఒత్తయిన జుట్టును ఎవ్వరైనా పొందొచ్చు. కానీ అందుకు పోషకాహారం తీసుకోవడం తో పాటు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే వద్దన్నా సరే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి. వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ బియ్యం( rice ) వేసుకుని ఆరు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసి మరో ఆరు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జెల్లీ ఫామ్ లో ఉండే జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) వేసి బాగా మిక్స్ చేయాలి. అపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి. గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. వారానికి కేవలం ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ గ్రోత్ ( Hair growth )అనేది అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా, పొడుగ్గా మారుతుంది. ఈ రెమెడీ వల్ల కురులు స్మూత్ గా షైనీ గా మారతాయి. తలలో దురద, ర్యాషెస్ సమస్యలు ఉంటే దూరం అవుతాయి. మరియు జుట్టు త్వరగా తెల్లబడకుండా సైతం ఉంటుంది.

Puri Making Tips: పూరీలు ఎక్కువ నూనె లాగుతున్నాయా.. అయితే ఈ సింపుల్ ట్రిక్‌తో ఆయిల్ సేవ్ చేయండి..

పూరీ తింటుంటే నూనె ఎక్కువగా ఉంటే తినడానికి ఇష్టపడం. పర్ఫెక్ట్ పూరీలు చేయడానికి మనలో చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ చాలా సార్లు పూరీలు వేయించేటప్పుడు..
దానిలో చాలా నూనె లాగేస్తుంది. నూనె పట్టుకున్న పూరిని చూస్తే తినాలని అనిపించదు. ఎందుకంటే అది స్వయంగా అనారోగ్యకరమైనదిగా కనిపిస్తుంది. అటువంటి పూరీలను వదిలించుకోవడానికి.. మేము మీ కోసం ఈ ప్రత్యేక చిట్కాలను తీసుకువచ్చాం. దీని సహాయంతో మీరు రౌండ్-రౌండ్ నూనె లేకుండా పూర్తిగా హాయిగా వేయించుకోవచ్చు. ఇలాంటి సమస్యలకు ఈ ట్రిక్స్‌తో చెక్ పెట్టొచ్చు.

మీకు పఫ్డ్ పూరీలు కావాలనుకున్నప్పుడు.. పిండిని కొద్దిగా గట్టిగా కలపండి. పూరీల కోసం పిండిని తేలికగా పిసికి కలుపుతూ.. పాన్‌లో ఎక్కువ నూనె పోయండి.
పూరీ కోసం పిండిని పిసికి కలుపుతున్నప్పుడు.. దానిలో కొంత నూనె, నెయ్యి పోయండి.
పూరి పిండిలో నూనె, నెయ్యి పోస్తే పగలదు. ఇలా చేస్తే పొంగిన పూరిలు వస్తాయి
పూరీ పిండిని పిసికిన తర్వాత దానిని గాలికి తెరిచి ఉంచవద్దు. పూర్తిగా కప్పి ఉంచండి. లేకుంటే అది పూరీలు విరిగిపోతాయి. పిండిని పిసికిన తర్వాత మూతపెట్టి అరగంట ఉంచండి. దీనివల్ల పూరీ ఉబ్బి, బాగుంటుంది.
పూరీ పిండిని నూనె రాసిన తర్వాతే రోల్ చేయండి. ఇలా చేయడం ద్వారా పూర్తిగా పగిలిపోయే పరిధి పెరుగుతుంది.
పూరీని వేయించడానికి ముందు నూనెను బాగా వేడి చేయండి

పూరీ వేయించడానికి బాణలిలో నూనె బాగా వేడి చేయండి. పూరీని వేడి అయిన తర్వాతే నూనెలో పూరీలను వేయండి, ఈ సందర్భంలో పూరీలో నూనె పుట్టుకునే స్కోప్ ఉండదు. అందుచేత రోల్డ్ పూరీని నూనెలో వేసే ముందు నూనెను సరిగ్గా వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల పూరీ నూనెను లాగే అవకాశం ఉండదు.

ప్యాన్‌లో తక్కువ నూనె ఉన్నా.. పూరీని చేస్తున్నప్పుడు సరైన పద్దతిలో చేయకపోయినా నూనె అధికంగా లాగేస్తుంది.

Self Confidence : పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపాలి.. ఈ చిట్కాలను చూడండి.

పిల్లలకు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. దానిని ఎలా సాధించాలనే దానిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే.. ప్రధానంగా పిల్లలకు కావలసింది క్రమశిక్షణ, కష్టాలు, డబ్బు లేకున్నా పరిస్థితులను ఎదుర్కొవడం, సంస్కారం ఇలా అన్నీ నేర్పించాలి.
ఇందులో ప్రధానంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం నేర్పాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి
సానుకూల పదాలను మాత్రమే వాడండి : పిల్లల ముందు ప్రతికూల పదాలను ఎప్పుడూ వాడకండి, ఎందుకంటే అవి పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలను అతిగా కట్టడి చేయవద్దు లేదా భయపెట్టవద్దు. పరీక్ష సమయంలో మళ్లీ మళ్లీ చదువుకోవాలని, చదువుకోకుంటే ఫెయిల్ అవుతారంటూ భయాందోళనలకు గురి చేయవద్దు. కార్యక్రమాలు, సమావేశాల సమయంలో పిల్లలను వేదికపైకి పంపాలి. చీకట్లో నడవడం నేర్పించాలి. ఆంక్షలు విధించకూడదు.
పిల్లలను మరీ గారాబం చేయవద్దు : పిల్లలు చెప్పే మాటలకు తల ఊపడం అవస్థలను తెచ్చిపెడుతుంది. అంటే పిల్లలు అడిగినవన్నీ ఇవ్వడం మానేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇదే అలవాటు అవుతుంది. ప్రతిసారీ వారు అడిగినవి ఇవ్వడం వల్ల.. మన ఇవ్వలేని పరిస్థితుల్లో వారు ఇబ్బంది పడతారు. పిల్లలు ఓపిక నేర్చుకునేలా మనకు అవి వద్దు అని వారికి నచ్చజెప్పాలి. అవసరానికి మించి గారాబం ప్రమాదం.

పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వండి : ఉదయం అమ్మ చేసిన అల్పాహారం గురించి కొన్ని సార్లు పిల్లలు చిరాకు పడతారు. ఇది లేదా అది లేదా అని కోరుకోవడం పిల్లల సాధారణ స్వభావం. వారికి కావలసిన చిరుతిండిని తయారు చేసి ఆనందంగా తిననీయండి. బయట తినుబండాలను ప్రోత్సహించవద్దు. ఇంట్లో ఆహారం శ్రేష్టత గురించి వివరించండి.

వారి చిన్న చిన్న గొడవలను పరిష్కరించుకోనివ్వండి : పాఠశాలలో పిల్లలు వారి స్నేహితులతో గొడవపడతారు. ఇది సర్వసాధారణం. అయితే..
ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్నే తగువు తీర్చుకోమ్మనడం ఉత్తమం. వారి స్నేహాన్ని చక్కదిద్దుకోవడానికి తెలివైన మాటలు చెప్పండి. భవిష్యత్తులో స్నేహితులు, బంధువులతో సత్సంధాలను కొనసాగించడానికి ఇది వారికి సహాయపడుతుంది.

Knee Pain – ఇవి పాటిస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు అయినా దెబ్బకు పరార్ అవ్వడం ఖాయం..

మోకాళ్ళ నొప్పు(knee pain )లతో బాగా సతమతం అవుతున్నారా..? వీటి కారణంగా ఎక్కువ సేపు నిలబడాలన్నా, నడవాలన్నా కష్టంగా అనిపిస్తుందా..? మోకాళ్ళ నొప్పుల నుండి విముక్తి పొందడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా..?
హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు వాడుతున్నారా..? అయినా సరే మోకాళ్ళ నొప్పులు తగ్గడం లేదా..? డోంట్ వర్రీ ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు అయినా సరే సహజంగానే తగ్గు ముఖం పడతాయి. మరి ఇంకెందుకు లేటు ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

తులసి టీ( Tulsi Tea ).. మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడేందుకు అద్భుతంగా సహాయపడుతుంది. మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నవారు రోజుకు ఒక కప్పు తులసి టీ ని తాగితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అల్లం నూనె కూడా మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి. అలాగే ఒక కప్పు అల్లం తురుమును వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ను మోకాళ్ళకు అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అద్భుతమైన పెయిన్ కిల్లర్ గా పని చేస్తుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు నైట్ నిద్రించేముందు ఒక గ్లాసు ఆవు పాలల్లో చిటికెడు పసుపు వేసి మరిగించి తీసుకోవాలి. ఇలా చేస్తే ఎముకల సాంద్రత పెరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి. మోకాళ్ళ నొప్పుల కారణంతో కొందరు ఎప్పుడూ కుర్చీకే పరిమితం అవుతుంటారు. కానీ రోజుకు 20 నిమిషాలు అయినా వాకింగ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇక నట్స్, ఆకుకూరలు, పన్నీర్, చేపలు, నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పెరుగు, గుడ్లు వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. ఇవి ఎముకలను దృఢపరుస్తాయి. మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడేందుకు ఎంతగానో సహాయపడతాయి.

Drinking Water – నీరు త్రాగడానికి సరైన సమయం తెలుసుకోవాలి, లేకపోతే అది ప్రయోజనానికి బదులుగా ఆరోగ్యానికి నష్టమే.!

మంచి ఆరోగ్యానికి ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగటం చాలా అవసరం . వేసవిలో విపరీతమైన చెమట కారణంగా నీటి అవసరం మరింత పెరుగుతుంది. నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను తెస్తుంది.
కానీ సరైన సమయంలో నీరు తాగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి.

సరైన సమయంలో నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ఊబకాయం మరియు మలబద్ధకం వంటి వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. నీటి యొక్క అపారమైన ప్రయోజనాలను పొందాలంటే, దానిని త్రాగడానికి సరైన సమయాన్ని తెలుసుకోవడం ముఖ్యం.నీరు ఎప్పుడు త్రాగకూడదు అనేది కూడా ముఖ్యం.

ఈ సమయంలో నీళ్లు తాగొద్దు ..!

చాలా మంది తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు. కొంతమంది భోజనాల మధ్య నీరు త్రాగడం ప్రారంభిస్తారు. అయితే ఈ తప్పులు చేయకండి. ఎందుకంటే ఇది చాలా సమస్యలకు దారి తీస్తుంది.

ఎప్పుడు నీళ్లు తాగకూడదు ?
1 . పడుకునే ముందు నీళ్లు తాగకూడదు.

2 తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు.

3 మూత్ర విసర్జన తర్వాత నీరు త్రాగకూడదు.

4 భోజనం చేసేటప్పుడు నీరు త్రాగకూడదు

నీరు ఎప్పుడు త్రాగాలి ?

1 ఉదయం నిద్ర లేవగానే ముందుగా గోరువెచ్చని నీరు త్రాగాలి.

2 తినడానికి 30 నిమిషాల ముందు నీరు త్రాగాలి.

3 వ్యాయామానికి ముందు, సమయంలో మరియు తర్వాత నీరు త్రాగాలి.

4 పడుకునే ముందు 1-2 గంటల ముందు నీరు త్రాగాలి.
5 మీకు తలనొప్పి మరియు మైగ్రేన్ ఉన్నప్పుడు ఎక్కువ నీరు త్రాగండి.

కస్టమర్లకు Ola గుడ్ న్యూస్..ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25వేల తగ్గింపు

ఈ-స్కూటర్ తయారీసంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్ 1 సిరీస్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ బైకులపై రూ.25 వేల వరకు తగ్గించినట్లు శుక్రవారం (ఫిబ్రవరి16) వెల్లడించింది.
డిస్కౌంట్ ఫిబ్రవరి నెలలో మాత్రమే అమల్లోకి వస్తుందని ఓలా కంపెనీ తెలిపింది.

Ola S1 ధరతోపాటు Ola S1 ఎయిర్ ధర కూడా రూ. 1.19 లక్ష ల నుంచి రూ. 1.05 లక్షలకు తగ్గించారు. Ola S1 ప్రో ధర ఇప్పుడు రూ.1.48 లక్షల నుంచి రూ. 1.30 లక్షలకు తగ్గించబడింది. ఇవన్నీ షోరూమ్ ధరలు. గత నెల (జనవరి)లో కూడా S1 X+ పై Ola Electric రూ. 20వేల తగ్గింపును అందించింది. దీంతోపాటు S1ప్రో, S1 ఎయిర్ పై పొడిగించిన ఉచిత వారంటీ, ఎక్ఛేంజ్ బోనస్ , క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లను అందించింది.

కస్టమర్లకు ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. జీరో డౌన్ పేమెంట్ , నో కాస్ EMI , జీరో ప్రాసెసింగ్ ఫీజులు, ఆకర్షణీమైన 7.99 శాతం వడ్డీ రేటు ఉంటాయి. వినియోగదారులకు ఎలక్ట్రిక్ మొబిలిటీకి మరింత ఆకర్షణీయంగా , ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా ఓలా ఆఫర్లను అందిస్తోంది.
డిస్కౌంట్లతోపాటు అదనంగా Ola Electric S1 ఎయిర్, S1 ప్రో స్కూటర్ల కోసం బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాల లేదా 80000 కి.మీ వారంటీని ఇస్తున్నారు. కస్టమర్లు అదనంగా రూ.5 వేల చెల్లిస్తే.. 1లక్ష కి.మీ పొడగించిన వారంటీని పొందొచ్చు. రూ.12,500 చెల్లించి 1.25 లక్షల కి.మీ. పొడిగించిన వారంటీని ఎంచుకోవచ్చు.

PM Kisan: రైతులకు మోదీ సర్కార్ తీపికబురు..ఆ రోజే 16వ విడత పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ..!!

PM Kisan: నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడిగా ఎకరాకి ఏడాదికి రూ. 6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి మూడు సార్లు రూ. 2000 చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఈ డబ్బులు పడుతున్నాయి. చివరి సారి గతేడాది నవంబర్ 15వ తేదీన ఈ డబ్బులు పడ్డాయి. ఇప్పుడు 16వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉన్నది.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి.. రైతులకు పెట్టుబడి కోసం ఎకరాకు రూ. 5 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు అందించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రారంభించిన తర్వాత కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ రైతులు రైతు బంధు పథకం కింద వచ్చే డబ్బులతోపాటు మోడీ ప్రభుత్వం వేసే డబ్బుల కోసమూ ఎదురుచూస్తుంటారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 16వ విడత డబ్బులు ఈ నెలలో పడనున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయని తెలిసింది. ఈ డబ్బులు రావాలంటే.. రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి.
ఈకేవైసీకి గడువు కూడా ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. కాబట్టి, ఇంతలోపే ఈకేవైసీ పూర్తి చేసుకుంటే.. ఆ తర్వాత ఈ నెల చివరి వారంలో మోడీ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి. ఈ స్కీం కింద డబ్బులు పొందాలంటే.. ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పిల్లలు ఎత్తు పెరగాలంటే తినిపించాల్సిన ఆహారాలు ఇవే.. ఇవి తింటే ఎన్నో లాభాలంటూ?

ఈ మధ్య కాలంలో తల్లీదండ్రులలో చాలామంది పిల్లలు ఎత్తు లేరని తెగ టెన్షన్ పడుతున్నారు. పిల్లలు పొట్టిగా ఉండటం వల్ల పిల్లలు సైతం ఆత్మనూన్యతకు గురవుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి.
పిల్లలకు కొన్ని ఆహారాలు ఇవ్వడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పిల్లల్లో ఎత్తు పెరగడానికి క్యాల్షియం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. సోయాబీన్స్, సోయా మిల్క్ ను రెగ్యులర్ గా డైట్ లో భాగంగా చేస్తే పిల్లలు ఎత్తు పెరిగేలా చేయవచ్చు.

రెగ్యులర్ గా పాలు తాగడం ద్వారా కూడా పిల్లలు సులువుగా ఎత్తు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పిల్లల ఆహారంలో మాంసాన్ని భాగం చేయడం ద్వారా కూడా పిల్లలు ఎత్తు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లలు ఎత్తు పెరగడంలో గుడ్లు ఎంతగానో సహాయపడతాయి. ప్రతిరోజూ గుడ్లు తినడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.

పిల్లలు బెండకాయలను ఎక్కువగా తింటే సులువుగా ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల ఎత్తు పెరగాలని భావించే తల్లీదండ్రులు పిల్లల ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. పిల్లలకు సరైన పోషకాహారం లభిస్తే పిల్లలకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడంతో పాటు సులువుగా ఎత్తు పెరుగుతారు. పిల్లల విషయంలో తల్లీదండ్రులు అన్ని విధాలుగా కేర్ తీసుకోవాలి.

పిల్లలు క్యారెట్ ను తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగే ఛాన్స్ ఉంటుంది. బీన్స్ తినడం వల్ల కూడా ఎత్తు పెరిగే అవకాశాలు ఉంటాయి. బెండకాయలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. బచ్చలికూర, బఠానీలు, అరటిపండు, సోయాబీన్, పాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పిల్లలకు పౌష్టికాహారం అవసరం అనుకున్న వాళ్లు ఈ ఆహారాలను తినిపిస్తే మంచిది.

AP DSC: ఏపీలో డీఎస్సీ పరిస్థితి ఏంటంటే?

News Update : 19/2/2024 1 pm news 

????️????️ డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్య గమనిక

కోర్టు హాల్ నెంబర్ 6 లో జడ శ్రావణ్ కుమార్ గారు డీఎస్సీ కేసు మీద వాదించడం జరిగింది. ప్రభుత్వ తరపు లాయర్ సమయం కోరిన కారణంగా రేపటికి వాయిదా వేయడం జరిగింది.
ఇవాళ చీఫ్ జస్టిస్ గారు కోర్టుకి రాలేదు.
రేపు డీఎస్సీ కేసు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బెంచ్ ముందుకు విచారణకు రానుంది.

 

AP DSC: ఏపీలో ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏటా మెగా డీఎస్సీ ప్రకటిస్తానని జగన్ చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో అస్సలు పట్టించుకోలేదు.
సరిగ్గా ఎన్నికల ముంగిట 6100 ఉపాధ్యాయ పోస్టులకు జగన్ సర్కార్ నోటిఫికేషన్ జారీచేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. అంతకుముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించడానికి డిసైడ్ అయ్యింది. కానీ ఈ నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో డీఎస్సీ నియామక ప్రక్రియ కొనసాగుతుందా? లేదా? అన్న ఆందోళన నెలకొంది.

గతంలో డీఎస్సీ తో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ను నిర్వహించేవారు. ఈసారి మాత్రం వేర్వేరుగా నిర్వహించడానికి నిర్ణయించారు. టెట్లో వచ్చిన మార్కులను 20 శాతం వెయిటేజీతో డీఎస్సీ లో కలపనున్నారు. అయితే సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల వ్యవధి ముందు డీఎస్సీ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు పోస్టుల సంఖ్య తగ్గించడంపై కూడా పెద్ద దుమారమే రేగుతోంది. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు సర్కార్ 7,100 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో జగన్ ఇవి ఒక పోస్టులేనా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కేవలం 6,100 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడంపై విమర్శలు చుట్టుముడుతున్నాయి.

మరోవైపు ఎస్ జి టి టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకాశం జిల్లా కు చెందిన బొల్లా సురేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం ద్వారా లక్షలాదిమంది డిఈడి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని చెప్పుకొచ్చారు. ఎన్ సి టి ఈ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని కూడా ఆరోపించారు. తప్పులతడక నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలకు ఏపీ ప్రభుత్వం ఆడుకుంటుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై రేపు కోర్టు వాదనలు విననుంది. ఒకవేళ పిటిషనర్ అభిప్రాయంతో ఏకీభవిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Success Story : విదేశాల్లో చదవలేదు.. పెద్ద డిగ్రీలు లేవు.. కానీ రూ.8000కోట్ల వ్యాపార సామ్రాజ్యం

Success Story : వ్యాపారం చేయడం, దానిని విజయవంతం చేయడం.. అంటే ఒక నదికి రెండు చివరలు లాంటివి. ఈ రెండు చివరలను అనుసంధానించే వ్యక్తి మాత్రమే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాడు.
పార్లే ఆగ్రో యజమాని నదియా చౌహాన్ అటువంటి దానికి ఉదాహరణగా నిలిచారు. నదియా విదేశాల్లో చదవలేదు లేదా పెద్ద డిగ్రీని పొందలేదు. కేవలం తన తండ్రి ఇచ్చిన అనుభవంతో రూ.300 కోట్ల విలువైన కంపెనీని రూ.8000 కోట్ల క్యాపిటల్‌గా మార్చాడు.

నదియా 2003లో తన తండ్రి ప్రకాష్ చౌహాన్‌తో కలిసి పార్లే ఆగ్రో కంపెనీలో చేరారు. అప్పట్లో కంపెనీ టర్నోవర్ రూ.300 కోట్లు మాత్రమే. 2017 సంవత్సరం నాటికి కంపెనీ ఆదాయం రూ.4,200 కోట్లకు చేరుకోగా, 2022-23లో రూ.8,000 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ విజయం వెనుక ఉన్నది కేవలం నదియా తెలివితేటలే అని చెబుతున్నారు.
నదియా చిన్నప్పటి నుండి వ్యాపార నైపుణ్యాలను నేర్చుకోవడం ప్రారంభించింది. ముంబైలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో తన ఖాళీ సమయాన్ని తన తండ్రితో గడపడం ప్రారంభించింది. 37 ఏళ్ల నదియా ప్రస్తుతం కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె అక్క షానా చౌహాన్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

నదియా జన్మించిన 1985 సంవత్సరంలో పార్లే ఆగ్రో కంపెనీ కూడా ప్రారంభమైంది. ఆ సమయంలో అతని తండ్రి ప్రకాష్ చౌహాన్ స్వీడిష్ కంపెనీకి చెందిన మామిడి ఉత్పత్తులను టెట్రా ప్యాక్‌లలో తయారు చేసేవారు. నదియా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 17 సంవత్సరాల వయస్సులో కంపెనీలో చేరారు. కంపెనీ సంపాదనలో 95 శాతం ఫ్రూటీ అనే ఒక ఉత్పత్తి నుండి మాత్రమే వచ్చినట్లు ఆమె కనుగొన్నారు.
నదియా ఇతర ఉత్పత్తుల వైపు తన దృష్టిని పెంచుకుంది. 2005 సంవత్సరంలో Appy Fizzని ప్రారంభించింది. ఇది చాలా ప్రజాదరణ పొందిన ఉత్పత్తిగా మారింది. దీని తరువాత ఆమె కంపెనీ దేశంలోని మొట్టమొదటి నిమ్మరసంతో సహా అనేక ఇతర ఉత్పత్తులను ప్రారంభించింది. దీని తర్వాత, తన సోదరితో కలిసి తాను అనేక తయారీ యూనిట్లను స్థాపించారు. ఉత్పత్తిని పెంచడం ప్రారంభించింది.

success story: రూ.5 వేలతో ప్రారంభించిన వ్యాపారం లక్షల టర్నోవర్ గా మారింది..

పూజా కాంత్ ఢిల్లీ నివసిస్తున్న ఓ సాధారణ మహిళ. ఆమె 2015 లో ‘పూజా కి పొట్లీ’ పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆమె మాక్రేమ్ ఆర్ట్ అంటే చేతితో తయారు చేసిన పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది.
పూజ ఎంబీఏ పూర్తి చేసింది. ఆమె చాలా సంవత్సరాలు కార్పొరేట్ రంగంలో పనిచేశారు. కానీ కొడుకు పుట్టాక 2012లో ఉద్యోగం మానేసింది. ఆమె తన బిడ్డకు ఎక్కువ సమయం ఇవ్వాలని నిర్ణయించుకుని ఉద్యోగం వదులుకుంది. వ్యాపారవేత్తగా ఎదిగింది.

ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఆమెకి నచ్చలేదు. 2015లో పూజా భర్త ఆమెకు స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు. బోరు కొట్టకుండా ఉండాలంటే ఇంటి వ్యాపార ఆలోచన కోసం చూడమని ఆమె భర్త ఆమెను కోరాడు. పూజా ఈ కళను నేర్చుకునేందుకు ఎలాంటి శిక్షణ, వర్క్‌షాప్ చేయలేదు. అయితే యూట్యూబ్ చూసి నేర్చుకున్నట్లు పూజ తెలిపారు. అయితే ఆమెకు కళపై పూర్తి పట్టు సాధించడానికి రెండేళ్లు పట్టింది.

కళ పట్ల ఆమెకు ఉన్న ఇష్టం కారణంగా కుట్టు, ఎంబ్రాయిడరీ, నేత వంటి కళలలో ప్రావిన్యయం సాధించింది. ఉత్పత్తులను ఆకర్షణీయంగా తాయారు చేశారు. ప్లాంట్ హ్యాంగర్లు, వాల్ హ్యాంగర్లు, బెడ్ రన్నర్‌లు, టేబుల్ రన్నర్‌లు మొదలైన అలంకార వస్తువులను తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టారు. దీని ద్వారా ఆమె మరింత మంది మహిళలకు పని కల్పించారు.

2012లో ఉద్యోగం వదిలే సమయానికి పూజ జీతం నెలకు రూ.30 వేలు. 2015లో ‘పూజా కి పొట్లీ’ ప్రారంభించినప్పుడు రోజుకు ఒకటి రెండు ఆర్డర్లు వచ్చేవి. అప్పట్లో రూ.5-6 వేలు సంపాదన వచ్చేది. కాలక్రమేణా ఇవి ప్రతి వారం సుమారు 100 ఆర్డర్‌లకు పెరిగాయి. ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న ఆమె భర్త కూడా పూజకు ఆమె వ్యాపారంలో సహాయం చేయడం ప్రారంభించాడు. 2021 ఆర్థిక సంవత్సరంలో వెంచర్ ఆదాయం రూ. 20 లక్షలకు చేరుకుంది. ఆ తర్వాత 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.30 లక్షలకు పెరిగింది.

పూజా తన ఉత్పత్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తోంది. ‘పూజా కి పొట్లీ’ వెబ్‌సైట్‌తో పాటు, ఆన్‌లైన్ ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, ఎట్సీ వంటి మార్కెట్‌ప్లేస్‌లలో కూడా విక్రయిస్తున్నారు. బ్రాండ్ కార్పోరేట్ ఆర్డర్‌లను కూడా పెద్దమొత్తంలో పొందుతుంది. ఆన్‌లైన్ మాధ్యమం ద్వారానే ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆమె తన వ్యాపారాన్ని రూ.5 వేలతో ప్రారంభించిన్నట్లు చెప్పారు.

రాత్రివేళ నానబెట్టి పరగడుపున ఈ నీటిని తాగితే అమృతం కంటే ఎక్కువే.. ఆ సమస్యలు రమ్మన్నా రావు..

మనమందరం ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం.. మంచి జీవనశైలి.. ఆరోగ్యకరమైన ఆహారం.. మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతాయి. సాధారణంగా ఉదయం నిద్ర నుంచి లేవగానే నడక, వ్యాయామాలు చేస్తుంటారు.
అన్నింటిలో మొదటిది, చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే వేడి నీటిని తాగుతారు. దీనితో పాటు చాలా మంది రాత్రిపూట పలు పదార్థాలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగుతారు. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. అలాంటి వాటిల్లో శనగలు ఒకటి.. శనగలను రాత్రిపూట నీటిలో నానబెట్టి.. ఆ నీటిని ఉదయాన్నే తాగితే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రాత్రి పడుకునే ముందు కొన్ని శనగలు తీసుకుని, వాటిని కడిగి, రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం నిద్రలేచిన తర్వాత, ఆ నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవాలి. మీరు పచ్చి పప్పు నీరు త్రాగకూడదనుకుంటే, పప్పును ఉడకబెట్టి.. ఆ నీటిని తాగవచ్చు..

శనగలు లేదా.. శనగ పప్పును నానబెట్టడం లేదా ఉడకబెట్టినప్పుడు, అందులో ఉండే పోషకాలు నీటిలో కూడా శోషించబడతాయి. ఈ పోషకాలు పుష్కలంగా ఉన్న నీటిని తాగడం వల్ల శరీరానికి తగని పోషణ అందుతుంది. నానబెట్టిన శనగల నీరు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలకు మంచి మూలమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మీకు ఇష్టమనుకుంటే.. ఆ నీటితోపాటు.. శనగలను కూడా తినవచ్చు..

జీర్ణక్రియ: నానబెట్టిన శనగ నీటిలో సరైన మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది.

బరువు తగ్గుతుంది: శనగలు లేదా శనగపప్పును రాత్రి నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. దీనివల్ల బరువు తగ్గే ప్రయాణం సులభతరం అవుతుంది. ఇందులో ఫైబర్ సరైన పరిమాణంలో లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది.

శక్తి పెరుగుతుంది: నానబెట్టిన శనగల నీటిలో ఉండే పోషకాలు శక్తిని పెంచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది సహజ శక్తి పానీయం. దీన్ని తాగడం వల్ల శరీరం కూడా హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

రోగనిరోధక శక్తి : అనేక కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, అనేక రకాల విటమిన్లు శనగల నీటిలో లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

చర్మ సౌందర్యం పెరుగుతుంది: ఈ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీంతో చర్మ సౌందర్యం కూడా మరింత పెరుగుతంది.

జాగ్రత్తలు.. మీకోసమే..
ప్రతి ఒక్కరి శరీర నిర్మాణం, నిర్వహణ భిన్నంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తికి సరిపోయేది మరొక వ్యక్తికి కూడా సరిపోతుందన్న అవకాశం లేదు.. అందువల్ల, ప్రారంభంలో తక్కువ పరిమాణంలో తీసుకోండి. దాని వినియోగం వల్ల ఎటువంటి సమస్య లేనట్లయితే, మీరు దానిని కొనసాగించవచ్చు. ముందుగా మీకో సలహా.. మీ రోజువారీ ఆహారంలో శనగల నీటిని చేర్చుకునే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.

Ceiling Fac Clean: సీలింగ్ ఫ్యాన్‌ను తళతళమని మెరిపించాలంటే వీటిని పాటించాల్సిందే!

సమ్మర్ సీజన్ కాకపోయినా.. ఎండాకాలం దాదాపు వచ్చేసినట్టే అనిపిస్తోంది. అప్పుడే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇంట్లో ఉండే ఫ్యాన్‌కు బాగా పని పడుతుంది.

ఇప్పటివరకూ వేసీ వేయట్టు ఫ్యాన్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఇంట్లోని ఫ్యాన్లు గిర్రునా తిరుగుతూనే ఉంటాయి. అయితే ఫ్యాన్‌పై పేరుకుపోయిన దుమ్మును వదిలించడం అంటే మామూలు పని కాదు. ఇంటిని అప్పుడప్పుడూ శుభ్రం చేసినా.. ఫ్యాన్‌ని మాత్రం ఏ పండుగలకో శుభ్రం చేస్తారు. దీంతో దుమ్ము ఎక్కువగానే పేరుకుపోతుంది.

దుమ్ము ఎక్కువగా ఉంటే ఫ్యాన్ స్పీడుగా తిరగదు. తడిగుడ్డతో తుడిచినా పెద్దగా ఫలితం ఉండదు. నల్లగా మరకలు ఉంటాయి. అయితే ఈసారి ఈ ట్రిక్స్‌ ఫాలో అయి చూడండి. ఫ్యాన్‌కు ఉన్న దుమ్ము, ధూళి పోయి.. స్పీడుగా తిరుగుతుంది. ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

వెనిగర్:

వెనిగర్‌తో ఎలాంటి మరకలైనా.. డస్ట్‌ని అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వెనిగర్‌తో కొద్ది నిమిషాల్లోనే ఫ్యాన్ తళతళమని మెరిసిపోతుంది. ఒక గిన్నెలోకి వెనిగర్, కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఫ్యాన్‌ మీద వేయండి. ఆ తర్వాత ఒక తడి క్లాత్ తీసుకుని దానితో ఫ్యాన్‌ని తుడవండి. కొద్ది క్షణాల్లోనే ఫ్యాన్‌పై ఉండే దుమ్ము వదులుతుంది.

ఆలీవ్ ఆయిల్:

ఆలీవ్ ఆయిల్‌తో కూడా ఫ్యాన్ కు పట్టిన దుమ్మును ఫాస్ట్‌గా వదిలించుకోవచ్చు. ఫ్యాన్ రంగు కూడా మారకుండా ఉంటుంది. ముందుగా పైపైన ఉన్న దుమ్మును తుడిచేసి.. ఆ తర్వాత కొద్దిగా ఆలీవ్ ఆయిల్ రాయండి. నెక్ట్ కాటన్ క్లాత్‌ సహాయంతో ఫ్యాన్‌ని తుడవండి. ఇలా చేయడం వల్ల ఫ్యాన్‌కు పట్టని దుమ్ము మొత్తం వదులుతుంది. ఆలీవ్ ఆయిల్ ప్లేస్‌లో కొబ్బరి నూనెను కూడా ఉపయోగించుకోవచ్చు.

బేకింగ్ సోడా:
బేకింగ్ సోడాతో కిచెన్‌లో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అలాగే ఫ్యాన్‌పై ఉండే దుమ్మును కూడా త్వరగా వదిలించుకోవచ్చు. ఏదైనా సబ్బు నీళ్లలో బేకింగ్ సోడాను కలుపుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ లేదా స్పాంజీ తీసుకుని ఫ్యాన్‌పై తుడవండి. ఈజీగా దుమ్ము వచ్చేస్తుంది. ఇలా ఇంట్లోనే ఉండే వాటితో ఫ్యాన్‌ దుమ్మును వదలించుకోవచ్చు.

షుగర్ 300 దాటిందా.. వర్రీ వద్దు ఈ హెర్బల్ టీలతో నార్మల్ చేసుకోండి

మధుమేహం( Diabetes ).. ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందిని మదన పెడుతున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి. ఈ మొండి వ్యాధిని నయం చేయడం చాలా కష్టం. కానీ అదుపులో ఉంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది.
పెద్దవారిలో చక్కెర స్థాయిలు భోజనానికి ముందు 70 నుండి 130 ఎమ్‌జీ/డీఎల్‌ ఉండాలి. అలాగే భోజనం తర్వాత 140 ఎమ్‌జీ/డీఎల్‌ కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉన్నట్టు. అయితే ఒక్కోసారి కొందరికి షుగర్ 300, 400 దాటేస్తుంటుంది.

ఫలితంగా తీవ్రమైన అలసట, తలనొప్పి, చూపు మందగించడం, తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, ఉన్నట్లు బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అంతేకాదు అదే రేంజ్ లో షుగర్ లెవెల్స్( Sugar Levels ) కంటిన్యూ అయితే బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటివి జరిగే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి. అందుకు ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీలు( Herbal Tea ) చాలా అద్భుతంగా సహాయపడతాయి.

ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది కలబంద టీ( Aloevera Tea ). షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయని వర్రీ అవుతున్న వారు ఖాళీ కడుపుతో రోజు ఒక కప్పు కలబంద టీ ను తీసుకోండి. ఇలా చేశారంటే చాలా వేగంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. అలాగే మధుమేహులకు దాల్చిన చెక్క టీ( Cinnamon Tea ) కూడా చాలా మేలు చేస్తుంది.

రోజుకు ఒక కప్పు దాల్చిన చెక్క టీను తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పడుతుంది. భారీగా పెరిగిన షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లోకి తెస్తుంది. చమోమిలే టీ.. దీనినే చామంతి టీ( Chameleon Tea ) అని కూడా పిలుస్తాము.

మధుమేహం ఉన్నవారికి ఈ టీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి హెల్ప్ చేస్తాయి. షుగర్ ను కంట్రోల్ చేస్తాయి. ఇక ఈ హెర్బల్ టీలతో పాటు నిత్యం అరగంట వ్యాయామం చేయండి. పోషకాహారాలను డైట్ లో చేర్చుకోండి.

ఒత్తిడికి దూరంగా ఉండండి. కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి. మరియు మద్యపానం, ధూమపానం అలవాట్లను మానుకోండి.

Diabetes : గుడ్ న్యూస్.. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ స్వీట్లు తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్..!

Diabetes : ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఈ సమస్య వయసు తరహా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది.. దీనికి కారణం ఆహారపు అలవాట్లు అయి ఉండొచ్చు.
అయితే మధుమేహం వ్యాధిగ్రస్తులు స్వీట్లు అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.. ఎందుకంటే తినలేరు.. కావున ఇవి తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని భయం.. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఈ స్వీట్లు తిన్నా కానీ షుగర్ పెరగదు అంట.. తక్కువ క్యాలరీలు స్వీట్లు లేదా క్యాలరీలు లేని స్వీట్ తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వారిలో అని ఏమి నష్టం ఉండదు..

సహజంగా ఎన్ఎస్ఎస్ బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. షుగర్ ఉన్న వ్యక్తులలో బ్లడ్ లో గ్లూకోస్ ని నియంత్రించే సాధనంగా నిత్యం సిఫార్ చేస్తున్నారు. సహజంగా ఎంఎస్ఎస్ లో అడ్వాన్స్మెంట్, స్టేవియా దాని ఉత్పణాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం బరువు నియంత్రణ కోసం సేవియా లాంటి చెక్కర రహిత స్వీట్ నెర్లకు వ్యతిరేకంగా సలహాలు ఇచ్చారు.. కార్బోహైడ్రేట్ చెక్కర తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చక్కెర వాడకం వలన కలిగే ప్రతికూల ఆరోగ్య ఫలితాలు ఊబకాయం, హైపర్ టెన్షన్, మధుమేహం వ్యాధులు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

sugar patients eat these sweets Diabetes levels will be controlled

చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. అనారోగ్యం మైన ఆహారం ఈ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇటువంటి సమయంలో తక్కువ కేలరీల స్వీట్లను తీపి రుచి త్యాగం చేయకుండా చక్కెర క్యాలరీలు తీసుకోవడం తగ్గించడానికి సురక్షితమైన అంశం అయితే వీటి వాడకం కూడా మితంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. చక్కెర క్యాలరీల వాడకం తగ్గించడంలో బరువు నిర్వహణలో ఉండడానికి ఉపయోగపడుతుంది.. మొత్తం ఖాళీ క్యాలరీలు ఆహారంలో నాణ్యత ప్రధాన నిర్ణయాధికరం అవి స్పష్టంగా తెలుస్తోంది. కావున తక్కువ చెక్కర గల స్వీట్లు తీసుకోవడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎటువంటి హాని జరగదు..

High Cholesterol: ఈ కొత్త లక్షణాలు ఉంటే మీలో కూడా చెడు కొలెస్ట్రాల్‌ విచ్చలవిడిగా పెరిగినట్లే..

How To Lower High Cholesterol: ఆధునిక జీవనశైలి పాటించేవారిలో ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీని కారణంగా చాలా మందిలో అధిక కొలెస్ట్రాల్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

అయితే శరీరంలో చెడు కొవ్వు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందిలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఈ కింది సమస్యలు వస్తే తప్పకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పెరినట్లేనని నిపుణులు చెబుతున్నారు. అయితే శరీరంలో ఎలాంటి లక్షణాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఈ నొప్పులు వస్తాయి:

కీళ్లు:

చాలా మందిలో కీళ్ల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

మెడ:

మెడ నొప్పులు రావడానికి ప్రధాన కారణం కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా మెడ నొప్పి రావడం వల్ల ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ఛాన్స్‌ కూడా ఉంది.

పొట్ట:

తరుచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారిలో కూడా కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశాలున్నాయి. అతిగా కొలెస్ట్రాల్‌ పెరగడం కారణంగానే గ్యాస్‌, ఆమ్లత్వం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

గుండె:

ప్రస్తుతం చాలా మందిలో గుండె ప్రాంతంలో నొప్పి ఉంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగనట్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా తీవ్ర గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

గుడిలో శఠగోపం తలపై ఎందుకు పెడతారు ?

ప్రతి రోజు లేదా వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళడం దాదాపుగా అందరికీ అలవాటు ఉంటుంది. మరి దేవాలయంలో తీర్థం, శఠగోపం, కానుక/దక్షిణ చూస్తూనే ఉంటాం. అయితే.. తీర్థం గురించి ఎంతో కొంత తెలుసు. దానిలో కలిపే ఔషధులు, తులసీ తదితరాలతో ఆరోగ్యం, మనస్సు, వాక్కు శుచి అవుతుంది. అయితే వెండి లేదా రాగి లేదా ఇత్తడి శఠగోపం ప్రతీ భక్తుడి తలపై పెడుతారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి ? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.

శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక పేర్కొంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు.
ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశిస్తుందని చెబుతారు. అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకను తలుచుకోవాలంటారు పండితులు. శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అని అంటారు. శఠగోపం అంటే త్యంత గోప్యమైనది అని అర్థం. భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు.

శఠగోపం విశేషాలు:

శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు. అంటే మనము కోరికలను శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే.శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది.

భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు. శఠగోపం వలన కలిగే ఫలితం: శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శఠగోప్యమును తలమీద ఉంచిన ప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. ఏది ఏమైనా మన పూర్వీకులు ఏర్పాటుచేసిన వాటిలో సైన్స్ తప్పక ఉంటుంది. అయితే అది శాస్త్రం మరింత అభివృద్ధ చెందినప్పుడు మరింత వెలుగులోకి వస్తుంది.

– శ్రీ

Walking benefits: ప్రతిరోజూ 30నిమిషాలు నడిస్తే 5 అద్భుత ప్రయోజనాలు.. కొలెస్ట్రాల్-రక్తపోటుతో సహా 5 వ్యాధులు అదుపులో

ప్రస్తుతం చాలా మందికి బైకు, స్కూటీ లేదా కారు ఉన్నాయి, దాని ద్వారానే బయట పనులన్నీ చేసుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం.
మీరు ఉదయం లేదా సాయంత్రం క్రమం తప్పకుండా నడవడం ప్రారంభిస్తే, మీరు అనేక వ్యాధులను నివారించవచ్చు. నడక.. శరీరాన్ని ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం నుంచి ఉపశమనం పొందవచ్చు. నడక వల్ల కలిగే 5 గొప్ప ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది : రోజూ దాదాపు 30 నిమిషాల పాటు నడవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగులు చాలా ఉపశమనం పొందవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) నివేదిక ప్రకారం.. సాధారణ శారీరక శ్రమ కొలెస్ట్రాల్ స్థాయిలను వేగంగా తగ్గిస్తుంది. వ్యాయామం కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడానికి దారితీస్తుంది. రెగ్యులర్ బ్రిస్క్ వాకింగ్ కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

BP నియంత్రణ: ఒక పరిశోధనలో రోజుకు మూడు సార్లు ఒక మోస్తరు లేదా చురుకైన నడక ద్వారా రక్తపోటును నియంత్రించడం సులభం అని కనుగొనబడింది. నడవడం ద్వారా రక్తనాళాల దృఢత్వం తొలగిపోయి రక్త ప్రసరణ సులభంగా మెరుగుపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. నడవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సులువుగా జరిగి రక్తనాళాలకు ఎలాంటి నష్టం జరగదు.
బరువు తగ్గడంలో ప్రభావవంతంగా : నడక.. కేలరీలను బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది. కేలరీలను బర్న్ చేయడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు. మీ నడక వేగానికి మరియు బరువు తగ్గించుకునే దూరానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. మీరు క్యాలరీ కాలిక్యులేటర్ ద్వారా మీ అసలు కేలరీల బర్న్‌ని నిర్ణయించవచ్చు.

మధుమేహం నుండి ఉపశమనం : తిన్న తర్వాత కాసేపు నడవడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం తర్వాత రోజుకు మూడు సార్లు 15 నుండి 30 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా మెరుగుపడతాయని ఒక అధ్యయనం కనుగొంది . భోజనం చేసిన తర్వాత మీ దినచర్యలో నడవడం చాలా ప్రయోజనకరం. ఇది రోజంతా శారీరకంగా నిర్వహించడానికి కూడా మీకు సహాయపడుతుంది.
మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి : రెగ్యులర్ వాకింగ్ మీ మోకాళ్లు మరియు ఇతర కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే నడక కీళ్లకు మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు నడక ద్వారా నొప్పిని తగ్గించుకోవడం వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వారానికి 7-8 కిలోమీటర్లు నడవడం వల్ల కూడా కీళ్లనొప్పులను నివారించవచ్చు.

Devotional -శనీశ్వరుడిని శనివారం ఇలా స్తుతిస్తే.. ఆ బాధలన్నీ వుండవు.. తెలుసా..?

కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. దీనిని అందజేసేది శనీశ్వరుడు.

ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను కర్మ ఫలదాత అంటారు. ఒడిదొడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు.

సూర్యభగవానుడు, ఛాయా సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అనీ, ఛాయాసుతుడు అనీ అంటారు. నవ గ్రహాల్లో కీలకమైన శని.. జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు.
అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది.

అయితే, రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. ఇక శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం. శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు.

అందుకే శనివారం విష్ణు ఆరాధన చేయాలి. అలాగే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు. అలాగే భక్తితో ” ఓం శం శనైశ్చరాయ నమః ” 108 సార్లు ఉచ్ఛరిస్తే సమస్త శనిదోషాలు తొలగిపోతాయి.
అలాగే శనివారం పూట..
సూర్యపుత్రో దీర్ఘదేహః

విశాలక్ష శ్శివప్రియ:

మందచార: ప్రసన్నాత్మా

పీడాం దహతు మే శని:

నమస్తే మంద సంజ్ఞాయ

శనైశ్చర నమోస్తు

ప్రసాదం మమదేవేశ

దీనస్య ప్ర్రణతస్యచ

నమస్తే కోణ సంస్థాయ

పింగళాయ నమోస్తుతే

నమస్తే బభ్రు రూపాయ

కృష్ణాయచ నమోస్తుతే.. అనే శనీశ్వర మంత్రంతో స్తుతిస్తే ఏలినాటి దోషం తొలగిపోతుంది.

Kitchen Tips: జీలకర్రతో మీకు తెలియని లాభాలు ఎన్నో.. మీ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి!!

జీలకర్ర గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే రోజూ మనం మసాలాల్లో, తాళింపులుల్లో వాడుతూనే ఉంటాం. మనం తిన్న ఆహారాన్ని అరగించడానికి జీలకర్ర బాగా సహాయపడుతుంది.
ఇంకా జీలకర్ర వల్ల మనకు తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. బరువు తగ్గడం మొదలు ఎన్నో జీర్ణ సమస్యల వరకూ ఎన్నో సమస్యలు వీటితో చెక్ పెట్టవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా.

-జీలకర్ర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. జీలకర్ర వల్ల చాలా సమస్యల నుండి బయట పడవచ్చు. ఉదయం లేచిన వెంటనే జీలకర్ర నీళ్లు తాగితే లాభం ఉంటుంది. బాడీని డిటాక్సీ ఫై చేయడానికి జీలకర్ర సహాయ పడుతుంది.

-చర్మ, మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు ఉన్నవారు జీలకర్రను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. వేయించిన జీలకర్ర పొడిని పేస్ట్ చేసి ముఖానికి రాసుకుంటే మీ ముఖానికి నిగారింపుతోపాటు మెుటిమలు వంటి సమస్యలు తొలగిపోతాయి.
మధుమేహ రోగులకు జీలకర్ర చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. 8 చెంచాల వేయించిన జీలకర్ర పొడిని రోజుకు రెండు సార్లు తింటే డయాబెటీస్ అదుపులో ఉంటుంది.

-జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండె నొప్పుల రాకుండా సహాయపడుతుంది.

-ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర విత్తనాలు, అల్లం, తేనె, తులసి ఆకులు వేసుకుని తాగడం వల్ల జలుబు నుండి సులువుగా ఉపశమనం లభిస్తుంది.

-జీలకర్ర పొడిని పొడిగా చేసుకుని మజ్జిగలో వేసుకుని తాగితే గర్భాశయ బాధలు తగ్గుతాయి.

-జీలకర్రను బాగా వేయించి కొద్దిగా ఉప్పు కలిపి తినటం వల్ల పొట్టనొప్పి, అజీర్ణం, మార్నింగ్ సిక్ నెస్‌, వాంతి వికారం, వంటి అనారోగ్యాలకు చెక్ పెడుతుంది.
జీలకర్రను నిమ్మరసంతో కలిపి సుర్యోదయం, సూర్యాస్తమ సమయంలో రెండుపూటలా తింటే.. తలతిప్పడం, కడుపులో వేడిని సమస్యలను తగ్గిస్తుంది.

-జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ-ఆక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉండటం వల్ల శరీరంలో చేరిన మురికిని, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

Golden Lizard : కంచిలోని బంగారు, వెండి బల్లుల వెనక అసలు రహస్యం తెలుసా!.

Golden Lizard : మన ఇళ్ళల్లో బల్లులను చూస్తూ ఉంటాం.. వీటిని చూసి చాలా మంది భయపడుతుంటారు. బల్లి మనపై పడిందంటే ఏదోగా అశుభం జరుగుతుందని భావిస్తుంటారు. దానిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇవి మనం తినే ఆహార పదార్థాలలో పడితే విషంగా మారాతాయని వాటిని తిన్నవారు మరణిస్తారని ప్రజల్లో ప్రచారం కూడా ఉంది. బల్లి మన శరీరంపై పడితే వెంటనే బల్లి శాస్త్రము చూసుకోవటం అలవాటు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని తాకిన వారికి బల్లి వారి శరీరంపై పడినా దుష్పలితం వుండదని అంతా నమ్ముతుంటారు.

అందుకే చాలా మంది కంచి వెళితే బంగారు, వెండి బల్లులను తాకిరావటం మాత్రం మర్చిపోరు. తమిళనాడులోని కాంచీపురం అత్తి వరదరాజ స్వామి ఆలయంలో ఉన్న బంగారు బల్లి విశిష్టత గురించి చాలా మందికి తెలియదు.

అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వసిస్తుంటారు. కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం…

బంగారు వెండి బల్లికి సంబంధించిన గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి వారు నీటిని తీసుకువచ్చే సమయంలో వారి కుండలో ఒ బల్లి పడింది. ఈవిషయాన్ని వారు గుర్తించలేదు. అది చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపిస్తాడు. శాపవిముక్తి కల్పించమని ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్ధిస్తారు..కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు.

బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది. బల్లి మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. బల్లి పడినప్పుడు భయపడ కుండా….కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి,మనకు ఇష్టమైన దేవతలకు పూజించటం వల్ల ఆ దోషం పోతుందని శాస్త్రం చెస్తోంది.

కంచిలోని బంగారు బల్లిని తాకటంతో అప్పటివరకూ చేసిన పాపాలు తొలగిపోతాయన్న నమ్మకం భక్తుల్లో ఉంది. వాస్తవానికి బంగారు బల్లులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రస్తుతం బంగారు బల్లి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉంది. శేషాచల అడవుల్లో ఎక్కవగా కనిపించే ఈ జీవులు ఇటీవల కాలంలో కనుమరుగై పోతున్నాయి. రాతి గుహలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ బంగారు వర్ణం కలిగిన బల్లులు కనిపిస్తుంటాయి.

మధ్యాహ్న భోజనంలో.. టైం ఫాలోకాకపోతే వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే..!

ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండడమంటే సవాలుతో కూడుకున్న విషయమనే చెప్పాలి. రోజుకో వ్యాధి పుట్టుకొస్తున్న ఈ జనరేషన్ లో.. నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు పాటించినా జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ అలా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో డబ్బు సంపాదించాలన్న ధ్యాసలో చాలా మంది సరిగా నిద్ర పోవట్లేదు, సమయానికి తిండి తినట్లేదు. అనారోగ్యం పాలవడానికి ఇవి చాలదా. కాబట్టి తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో.. దాన్ని సరైన సమయానికి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సమయానికి భోజనం చేస్తే అనేక కడుపు సంబంధిత సమస్యలను నివారించవచ్చు. మరి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో బాలీవుడ్ ప్రముఖుల అభిమాన పోషకాహార నిపుణుడు రిజుతా దివేకర్ చెప్పిందేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కలిగే నష్టాలు

ఎసిడిటీ
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య అంటే సరైన సమయానికి భోజనం చేయకపోతే, కడుపులో ఎసిడిటీ సమస్య తలెత్తవచ్చు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనేక ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయని రిజుతా దివేకర్ అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, కడుపు సంబంధిత వ్యాధులను నివారించాలనుకుంటే, సరైన సమయంలో భోజనం చేయడం చాలా అవసరం. కడుపులో ఎసిడిటీ సమస్య ఏర్పడడాన్ని వైద్య భాషలో గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి లేదా యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి అంటారు.

తలనొప్పి

సమయానికి భోజనం చేయకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆకలి వల్ల వస్తుంది. భోజనం ఆలస్యం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఈ తలనొప్పి కారణంగా కొన్నిసార్లు చిరాకు కూడా వస్తుంది.

గ్యాస్

మధ్యాహ్నం భోజనం చేయకపోతే కడుపులో గ్యాస్ సమస్య రావచ్చు. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, మీథేన్, హైడ్రోజన్, ఆక్సిజన్‌లతో తయారైన వాయువులు కూడా పొత్తికడుపులో నొప్పిని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆలస్యంగా భోజనం చేసే అలవాటును మార్చుకుంటే చాలా మంచిది.

Beauty Tips : రోజుకి 2 నోట్లో వేసుకుంటే చాలు.. 60లో కూడా యవ్వనం పరుగులు పెడుతుంది..

Beauty Tips : వైరస్ క్రీములు, బ్లాక్ ఫంగస్ క్రిములు దాడి మనమీద చేయటం ద్వారా మనకు ఆరోగ్యం పట్ల రక్షణ వ్యవస్థ పట్ల చాలా శ్రద్ధ పెరిగింది కదా.. ఈరోజుల్లో అందరికీ రక్షణ వ్యవస్థ గురించి కాస్త ఎక్కువ ఆలోచన పెరిగింది.
కాబట్టి అలాంటి రక్షణ వ్యవస్థకు సంబంధించిన పోషకాలు మన శరీరంలో రక్షక దళాలకి ఆయుధాలు లాగా పనికొస్తాయిఅన్నమాట.. అన్ని పోషకాలు కంటే నెంబర్ వన్ గా ఉపయోగపడే పవర్ ఫుల్ ఆయుధం. అన్నిటికంటే ఎక్కువగా బాడీ ఉపయోగించుకుని మరి పోషకం రక్షణ వ్యవస్థ బాగా పనిచేయటానికి వాటికి ఉపయోగపడేది విటమిన్ సి. ఇది వేడి చేస్తే నశిస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కానీ వేడి చేసిన వాటిలో పూర్తిగా నశిస్తుంది. అలాంటి విటమిన్ సి బాగా ఎక్కువ ఉన్న నెంబర్ వన్ ఆహారము పెద్ద ఉసిరికాయలు.

కార్తీకమాసంలో మనందరం ఉసిరి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి దానికి పసుపు బొట్లు పెట్టి ఏదో చేస్తుంటాం కదా.. మరి ఎందుకు ఉసిరి చెట్టుకు పూజలు చేసే సంస్కృతి ప్రదర్శనలు ఎందుకు చెప్పారో తెలుసా.. మరి ఆ ఉసిరికాయలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు అసలు ఎన్ని చెప్పడానికి వీల్లేదు.. అందుచేతనే ఆ ఉసిరికాయలు మన మనిషి జీవితానికి ఇంత లాభానందిస్తున్నది.. ఆ ఉసిరికాయలు అందించే ఉసిరి చెట్టుకి మనం ఏమి ఇచ్చా రుణం తీర్చుకోగలుగుతానికి కార్తీక మాసంలో దానికి ఒక నమస్కారం పెట్టే సంస్కృతి అందించారు. ఎప్పుడన్నా కావాలంటే ఉసిరికాయ ముక్కలును మార్కెట్లో అమ్ముతుంటారు. ఉప్పు లేకుండా ఎండ పెడుతుంటారు. సహజంగా వాటిని అలా ఎండపెట్టిన ఉసిరికాయ ముక్కలు తెచ్చుకుని ముక్కల్ని కాస్త నోట్లో వేసుకుని వక్కపొడి లాగా భోజనానంతరం మూడు పూటలాముక్కలు చప్పరిస్తూ ఉండండి.

Beauty Tips of Dry Amla

ఆ ఉసిరికాయ ముక్కలు ఎండిన విటమిన్ సి నశించదు.. ఈ ఎండపెట్టిన ఉసిరికాయ ముక్కలు తెచ్చుకుని దాన్ని పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ ఒక సీసాలో ఉంచుకుని దాన్ని రోజు రెండు స్పూన్ల తీసుకొని ఒక చిన్న ప్లేట్ లో వేసేసి అందులో మూడు నాలుగు స్పూన్లు తేనె వేసేసేయండి. ఉసిరిపొడి కాంబినేషన్ అట్ల నాకండి. పది నిమిషాలు సేపట్లో నాకుతుంటే చాలా టేస్టీగా కాంబినేషన్ బాగుంటుంది. తేనె పవర్ ఫుల్ ఆంటీ బ్యాక్టీరియా ఆంటీ వైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి ఉసిరికాయని పొడి రూపంలో కూడా ఇట్లా వాడండి. ఉసిరికాయ మంచిదని ఆవకాయలు మాత్రం మంచిది కాదు.. ఈ పెద్ద ఉసురికాయలుతో రోటి పచ్చళ్ళు ఇతర వాటిలన్నిటిలో వాడుకోండి. చాలా ఫ్రెష్ గా మనకు ఆయుధం మీరు అందించినట్లు అవుతుంది..

BREAKING: ఉచిత విద్యుత్ స్కీమ్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీముల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ మేరకు 100 రోజుల డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో స్కీమ్‌ల ఇంప్లిమెంటేషన్‌పై వేగం పెంచింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షలకు పెంచిన సర్కార్.. 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలపై అమలుపై కసరత్తు మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహజ్యోతి స్కీమ్‌లో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గృహజ్యోతి లబ్ధిదారులకు ఆధార్ తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. తనిఖీ వేళ అధికారులకు దరఖాస్తుదారులు ఆధార్ కార్డ్ తప్పని సరిగా చూపించాలని ఉత్వర్వుల్లో పేర్కొంది. ఆధార్ కార్డు లేని వారు వెంటనే ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల..ట్రైనింగ్స్ జరుపండి .!

సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. అన్ని జిల్లాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు.

Mysteries Temple: ఆ గుడిలో దీపం నీటితో వెలుగుతోంది. వర్షాకాలంలో పూర్తిగా మునిగే దేవాలయం ఎక్కడుందంటే..

మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాగే భారతీయ సంస్కృతిలో ఎందరో దేవతలు, దేవుళ్లకు సంబంధించిన కథల గురించి వినే ఉంటాం. కొన్ని ఆలయాలు స్వయంగా దేవుళ్లే నిర్మిస్తే.. మరికొందరు భక్తులు.. మహర్షులు నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. ఇక ఇప్పటికీ అటువంటి ఆలయాలను సందర్శిస్తూనే ఉంటాం. కొన్ని ఆలయాలు ఇప్పటికీ చేధించలేని రహాస్యాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటి ఆలయమే గడియాఘాట్ మాతాజీ మందిరం..

సాధారణంగా దేవుడి గుడిలో దీపాన్ని వెలిగించాలంటే..
నూనె లేదా నెయ్యి అవసరం.. కానీ ఆ ఆలయంలోని దీపాన్ని నీటితో వెలిగించవచ్చు. మధ్యప్రదేశ్ లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున గల గడియాఘాట్ మాతాజీ మందిరంలో అద్భుతాలు అనేకం. ఈ గుడిలోని దీపం నూనె, నెయ్యితో కాకుండా.. నీటితోనే వెలుగుతుంది. ఈ వింతను చూసేందుకు చుట్టు పక్కల జనాలు వేలాదిగా తరలివస్తుంటారు. దాదాపు ఐదేళ్ల నుంచి ఆ దీపం ఆరకుండా వెలుగుతూనే ఉంది. ఇక్కడి ప్రమిదలో నిత్యం నూనెకు బదులు నీటిని పోస్తున్నా కూడా దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది. ఆ దీపం ముందు నూనెతోనే వెలిగెదని.. కానీ ఓ రోజు అమ్మవారు కలలోకి వచ్చి ఆ దీపాన్ని నీటితో వెలిగించాలని చెప్పారని.. అప్పటి నుంచి దీపంలో నూనెకు బదులుగా నీటిని ఉపయోగిస్తున్నట్లుగీ ఆలయ పూజారులు తెలిపారు. ఇదే కాకుండా ఈ ఆలయం.. నదీ తీరంలో ఉండడం వలన వర్షకాలంలో పూర్తిగా మునిగిపోతుంది. మొత్తం వర్షకాలమంతా ఆలయం పూర్తిగా మూసి ఉంటుంది. మళ్లీ నవరాత్రులకే ఆలయాన్ని తెరుస్తారు. కానీ ఆ దీపం మాత్రం ఆరిపోదు.

Lemon And Ginger For Teeth : అల్లం, నిమ్మకాయతో ఇలా చేస్తే.. ఎలాంటి దంతాలు అయినా సరే తెల్లగా మారుతాయి..!

Lemon And Ginger For Teeth : ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం మన దంతాలను తెల్లగా, మెరిసేలా మార్చుకోవచ్చని మీకు తెలుసా… మన ముఖం అందంగా కనిపించడంలో దంతాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి.
దంతాలు తెల్లగా ఉంటే మన ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. కానీ మనలో చాలా మందికి దంతాలు గార పట్టి, పసుపు రంగులోకి మారిపోయి ఉంటాయి. దీని వల్ల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. పచ్చగా ఉండే దంతాల కారణంగా వారు అందరిలో సరిగ్గా నవ్వలేకపోతూ ఉంటారు. సరిగ్గా మాట్లాడలేకపోతూ ఉంటారు. దంతాలపై ఉండే గారను, పసుపుదనాన్ని తొలగించుకోవడానికి మార్కెట్ లో లభించే అన్ని రకాల టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఫలితం లేక నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటారు.

అలాంటి వారు ఈ చిన్న చిట్కాను వాడడం వల్ల 2 నిమిషాల్లోనే గార పట్టిన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేయడం చాలా సులభం. అలాగే దీనిని వాడడం కూడా చాలా సులభం. గార పట్టిన దంతాలను తెల్లగా మార్చే చిట్కా ఏమిటి… దీని కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం అర చెక్క నిమ్మరసాన్ని, ఒక ఇంచు అల్లం తురుమును, కొద్దిగా ఉప్పును, అర టీ స్పూన్ నిమ్మతొక్క తురుమును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా అల్లంపై ఉండే పొట్టును తీసేసి తురుముకుని గిన్నెలో వేసుకోవాలి.

Lemon And Ginger For Teeth

తరువాత నిమ్మరసాన్ని పిండి తొక్కను పారేయకుండా దానినే తురిమి వేసుకోవాలి. తరువాత ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బ్రష్ తో తీసుకుని దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉండే గార, పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. అలాగే దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దంతాలు గార పట్టడం, దంతాలు పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.

boiling milk at New House – Reason -పాలు ఎందుకు పొంగిస్తారు ?

Hindu tradition has us boiling milk on our new stove in an open pot until it boils over the sides. This symbolizes the abundance of prosperity and food which will bless the new home. After it has boiled over and you offer some to the deities of your choice, serve the milk with a bit of sugar to the guests in your home.

#పాలు ఎందుకు పొంగిస్తారు ?

నూతన గృహ ప్రవేశ సమయంలో కానీ ఇతర ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో పొయ్యిపై పాలు పొంగించడం సంప్రదాయం.

పాలు పొంగిన గృహాలు అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెబుతారు.

పాలు పొంగినట్లు గానే ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయని మన నమ్మకం.

దీని వెనక ఒక అర్థముంది. సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి.

ఆమె సముద్ర గర్భం నుంచి జన్మించింది.

నారాయణి హృదయేశ్వరుడు పాల సాగరమున పవళించిన శ్రీహరి.

అందుకే పాలు పొంగితే అష్టైశ్వరాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత, ధనం, సంతానం, అభివృద్ధి వెల్లివిరుస్తాయని నమ్ముతారు.

కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముందుగా ఆవును ప్రవేశపెట్టి తరువాత ఆ గృహ యజమాని లోపలికి ప్రవేశిస్తాడు.

గోవు కామధేనువుకు ప్రతిరూపం.

ఆవు తిరిగిన వారి ఇళ్లలో ఎలాంటి దోషాలు ఉండవు.

కొత్త ఇంట్లోకి చేరే సమయంలో గృహ యజమాని ఇంటి ఆడపడుచులను పిలిచి ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు.

ఆ పాలతో అన్నం వండి వాస్తుపురుషునికి సమర్పిస్తారు.

ఈ పూజతో ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు.

ఇంత మంచి జరుగుతుంది కాబట్టే ఇంట్లో పాలు పొంగించడం నిర్వహిస్తారు.

ఇంటి ఆడపడుచులకు పెద్దపీట వేస్తారు.

వదిన, ఆడపడచులకు మధ్య సఖ్యతకు ఇలాంటి కార్యక్రమాలు మరింత తోడ్పడుతాయి.

దీంతో పాటు కొత్తగా గృహాన్ని నిర్మించిన అనంతరం ప్రవేశించే కార్యక్రమంలో బంధుమిత్రులను పిలుస్తాం. అందరితో ఆనందంగా గడుపుతాం.

ఇలాంటి కార్యక్రమాలు అందర్ని ఒక్కచోటుకు చేర్చి బంధాలు బాంధవ్యాల విలువలను తెలిసేలా చెస్తాయి.

గోమాత వల్ల వచ్చే లాభాలను కూడా మనందరికీ తెలిసేలా చేస్తుందీ సాంప్రదాయం.

Health

సినిమా