వారానికి ఒక్కసారి ఇలా చేస్తే వద్దన్నా సరే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

సాధారణంగా కొందరి జుట్టు( hair ) చాలా ఒత్తుగా ఉంటుంది. అలాంటి వారిని చూస్తే కాస్త ఎక్కువే అసూయ కలుగుతుంది. ఈ క్రమంలోనే ఎంత కేర్ తీసుకుంటున్నా సరే తమ జుట్టు అలా ఎందుకు లేదు అని తెగ మదన పడుతూ ఉంటారు.
నిజానికి ఒత్తయిన జుట్టును ఎవ్వరైనా పొందొచ్చు. కానీ అందుకు పోషకాహారం తీసుకోవడం తో పాటు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే వద్దన్నా సరే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి. వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ బియ్యం( rice ) వేసుకుని ఆరు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసి మరో ఆరు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జెల్లీ ఫామ్ లో ఉండే జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) వేసి బాగా మిక్స్ చేయాలి. అపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి. గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. వారానికి కేవలం ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ గ్రోత్ ( Hair growth )అనేది అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా, పొడుగ్గా మారుతుంది. ఈ రెమెడీ వల్ల కురులు స్మూత్ గా షైనీ గా మారతాయి. తలలో దురద, ర్యాషెస్ సమస్యలు ఉంటే దూరం అవుతాయి. మరియు జుట్టు త్వరగా తెల్లబడకుండా సైతం ఉంటుంది.

Related News