Hair Oils: ఈ నాలుగు నూనెలలో ఏ ఒక్కటి వాడినా జుట్టు రెండింతలు పెరగడం ఖాయం..!

ప్రతి ఒక్కరూ తమ జుట్టు మందంగా, దట్టంగా, పొడవుగా ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి కాలంలో అది చాలా అరుదు. జుట్టుకు తగిన జాగ్రత్తలు, తగిన పోషకాహారం అందించకపోతే జుట్టు పెరగదు, ఆరోగ్యంగా కనిపించదు. సాధారణంగా జుట్టు సంరక్షణలో భాగంగా రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ దానికంటే జుట్టు సంరక్షణ దినచర్యలో సహజమైన వస్తువులను ఉపయోగించడం చాలా మంచిది. ముఖ్యంగా జుట్టుకు నూనె పెట్టడం వల్ల జుట్టు రెండింతలు పెరిగేలా చేయవచ్చు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే నూనెలు ఏంటో తెలుసుకుంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఉల్లిపాయ నూనె..

ఉల్లిపాయ నూనెను మార్కెట్లో రెడీమేడ్ ది కొనుగోలు చేయవచ్చు. లేదంటే ఇంట్లోనే ఈ నూనె తయారుచేయవచ్చు. చిన్న ఉల్లిపాయలను నూనెలో వేసి బాగా ఉడికించి చల్లారిన తరువాత వడగట్టి గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు రాత్రి పూట జుట్టుకు పెట్టుకుని తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తుండాలి. ఇలా చేస్తుంటే జుట్టు రెండింతలు ఆరోగ్యంగా పెరుగుతుంది.

Related News

కలోంజి నూనె..

కలోంజి నూనె కూడా జుట్టు పెరగడంలో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ నూనె చేయడానికి, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను మంటపై వేడి చేసి, అందులో ఒక చెంచా కలోంజి గింజలు వేసి ఉడికించాలి. ఈ నూనె తీసి సీసాలో పెట్టుకోవాలి. ఈ నూనె జుట్టుకు జింక్, ఐరన్, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది.

కరివేపాకు నూనె ..

కొబ్బరి నూనెను జుట్టుకు రాసుకోవడం కామన్. అయితే ఈ నూనెలో కరివేపాకును కలిపి రాసుకుంటే అది జుట్టుపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. కరివేపాకు ఆకులు జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండటమే కాకుండా జుట్టు చిన్నతనంలోనే నెరసిపోయే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. 100 గ్రాముల నూనెలో కొన్ని కరివేపాకులను వేసి బాగా ఉడికించాలి. చల్లారిన తరువాత వడగట్టి గాజు సీసాలో పెట్టుకోవాలి. ఈ నూనెను ఇతర నూనెల మాదిరిగా తలకు మసాజ్ చేయడానికి ఉపయోగించవచ్చు.

బాదం నూనె..

పొడవాటి, మందమైన జుట్టు కోసం వారానికి రెండుసార్లు బాదం నూనెతో తలకు మసాజ్ చేయవచ్చు. బాదం నూనెతో జుట్టు మూలాలు బలంగా మారుతాయి. జుట్టు మృదువుగా మారుతుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలు పోతాయి. జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. చివర్లు చీలిపోవడంతో పాటు జుట్టు చిట్లడమనే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *