Hair Regrowth Tips : మందారను మీ జుట్టుకు ఈ విధంగా అప్లై చేస్తే బట్టతల దూరమవుతుంది

Hibiscus Benefits For Hair : మందార చెట్టు ఇంట్లో ఉంటే చాలు. దాని పూలు దేవుడి పూజకే కాకుండా జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. దాని ఆకులు కూడా హెయిర్​ గ్రోత్​కి మంచివి.
అయితే మందార పువ్వు జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. ప్రకాశవంతమైన, సిల్కీ హెయిర్​ కోసం మీరు మందార పూలను ఉపయోగించవచ్చు. బట్టతలను దూరం చేయడంలో మందార ఎంతో ఎఫిక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

జుట్టు రాలిపోవడానికి వివిధ కారణాలు ఉంటాయి. మీకు జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు మీరు మీ హెయిర్​ కేర్​ రోటీన్​లో వీటిని చేర్చుకోవడం వల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. బట్టతల రాకుండా, చుండ్రును దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. పొడిబారిన సమస్యను దూరం చేస్తూ.. జుట్టును డీప్ కండీషన్ చేస్తుంది. జుట్టు మెరిసిపోవడాన్ని ఆలస్యం చేస్తుంది. అయితే మందారను మీరు నేరుగా ఉపయోగించవచ్చు. కానీ వాటిని వివిధ పదార్థాలతో కలిపి అప్లై చేసినప్పుడు అది మరింత ఎఫెక్టివ్​గా పని చేస్తుంది. ఇంతకీ మందారను ఎలాంటి పదార్థాలతో తలకు అప్లై చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగుతో కలిపి..

పెరుగుతో మందారను కలిపి తయారు చేసుకునే హెయిర్ మాస్క్ మీ జుట్టును బలంగా, మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా లోపలి నుంచి పోషణను అందిస్తుంది. ఓ మందార పువ్వు, 5 మందార ఆకులు, 5 టేబుల్ స్పూన్ల పెరుగుతో మీరు హెయిర్ మాస్క్ చేసుకోవచ్చు. మీ జుట్టు పొడవును బట్టి వీటి కొలత మారుతుంది. ఆకులు, పువ్వులు కడిగి.. మిక్సీలో వేసుకుని పేస్ట్ చేయండి. దానిలో పెరుగు వేసి మెత్తని పేస్ట్​గా చేసుకుని హెయిర్​కి మాస్క్​గా అప్లై చేయవచ్చు. దీనిని గంటపాటు ఉంచి.. గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ హెయిర్ మాస్క్​ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయవచ్చు.

Related News

ఉసిరి కాయలతో..

ఉసిరి, మందార హెయిర్​ మాస్క్​ మీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టును బలోపేతం చేస్తుంది. మందార పువ్వులు, ఆకులును పేస్ట్ చేసి లేదా వాటిని పొడిని ఉసిరి పొడితో కలిపి.. నీరు వేసి పేస్ట్​గా చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్​ను స్కాల్ప్​ నుంచి జుట్టు వరకు బాగా అప్లై చేసి 45 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయండి. దీనిని కూడా మీరు వారానికి రెండుసార్లు అప్లై చేయవచ్చు.

అల్లంతో..

అల్లం కూడా జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిని మందారతో కలిపి హెయిర్​ మాస్క్​గా అప్లై చేస్తే జుట్టు రీగ్రోత్ అవుతుంది. అల్లం రసం, మందార పూల పొడిని బాగా కలిపి మెత్తని పేస్ట్​గా అప్లై చేయాలి. ఈ పేస్ట్​ని మీ స్కాల్ప్​కు అప్లై చేయండి. అరగంట అలాగే ఉంచి తర్వాత కడిగేయండి. వారానికి రెండుసార్లు దీనిని తలకు అప్లై చేయవచ్చు. బట్టతలతో ఇబ్బంది పడేవారికి ఈ మాస్క్ మంచి ఫలితాలు ఇస్తుంది. మందార పూలను ఈ విధంగా అప్లై చేసినప్పుడు వాటిలో పోషకాలు పెరిగి జుట్టుకు మంచి ఫలితాలు అందుతాయి.

Related News