Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే మీరు తక్కువ నీరు తాగుతున్నారని అర్థం.. నిర్లక్ష్యం చేయవద్దు..!

Health Tips: మన బాడీలో 70 శాతం నీరు మాత్రమే ఉంటుంది. శరీరంలో జరిగే ప్రతి పనికి నీరు అవసరం ఉంటుంది. ఆహారం తీసుకోకుండా నీరు తాగుతూ ఒక వ్యక్తి వారం రోజులపాటు బతకవచ్చు.
అయితే నీరు తాగే పద్దతులు, నియమాలు చాలా మందికి తెలియవు. కాబట్టి ఒక వ్యక్తి తన శరీర అవసరాలకు అనుగుణంగా మాత్రమే నీటిని తాగాలి. శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను విస్మరిస్తే డీహైడ్రేషన్ తీవ్రమైన సమస్య ఎదురవుతుంది. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ రోజు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

నీటి కొరత వల్ల సమస్యలు

శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు అనేక సమస్యలు పెరుగుతాయి. వాటిలో యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం, అజీర్ణం మొదలైన సమస్యలు ఎదురవుతాయి. ముఖంపై మొటిమలు రావడం ప్రారంభమవుతుంది. నీటి కొరత వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఏర్పడి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
డీ హైడ్రేషన్‌ లక్షణాలు

Related News

శరీరంలో నీటి కొరత కారణంగా మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే నీరు తాగాలి. నీరు లేకపోతే శరీరంలో విషపదార్థాలు పెరిగి ముఖంపై మొటిమలు రావడం మొదలవుతాయి. ఈ సమస్య ఉన్నట్లయితే నీటిని తాగడం ప్రారంభించాలి. నీరు లేకపోవడం వల్ల ప్రైవేట్ పార్ట్‌లలో దురద, మంట మొదలవుతుంది. యూరిన్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట మొదలవుతుంది.

శరీరంలో నీటి కొరత కారణంగా చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. చిన్న వయస్సులోనే ముడతలు ఏర్పడుతాయి. శరీరంలో నీరులేకపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి. తలలో నిరంతరం నొప్పి ఉంటుంది. నీటి కొరత కారణంగా శరీరంలోని కండరాలలో నొప్పి, తిమ్మిర్లు, దృఢత్వం వంటి సమస్యలు మొదలవుతాయి. నీటి కొరత కారణంగా ఒక వ్యక్తి విపరీతమైన అలసట, ఒత్తిడి, గందరగోళానికి గురవుతాడు. దీని కారణంగా అతడికి చిరాకు పెరుగుతుంది.

Related News