Sunday, November 17, 2024

ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ ఆహ్వానం – ఎన్నికల వరాలు..???

ఏపీలో పెండింగ్ హామీల కోసం ఉద్యమం దిశగా ఉద్యోగ సంఘాలు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది..
ఇప్పటికే పీఆర్సీ ఏర్పాటు పైన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..తాజా చర్చల ద్వారా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అంశాల పరిష్కారం పైన నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగుల ఆందోళన : ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయంగా.. పాలనా పరంగా వరుస నిర్ణయాల ప్రకటనకు సిద్దమవుతోంది. ఏపీలో ఉద్యోగుల సమస్యల సుదీర్ఘ కాలంగా పరిష్కారం కాలేదు. దీంతో, పలు సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పైన హామీలు ఇస్తున్నారు కానీ, అమలు చేయటం లేదంటూ ఉద్యోగ సంఘాల నేతలు నిరసనకు సిద్దం అవుతున్నారు. దీంతో, ప్రభుత్వం అలర్ట్ అయింది. చర్చలకు ఆహ్వానించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘాలతో రేపు (సోమవారం) చర్చలకు సిద్దమైంది. గతంలో ఇచ్చిన హామీల అమలు గురించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

 

నిరసనల దిశగా : ఉద్యోగులకు డీఏలతో పాటుగా బకాయిలు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంది. గతంలో జరిగిన చర్చల ద్వారా ఆర్దికేతర అంశాలను ప్రభుత్వం పరిష్కరించింది. ఆర్దిక పరమైన అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. దీంతో, ఈ బకాయిల పైన ఉద్యోగ సంఘాలు పట్టు బడుతున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్న సమాచారం మేరకు దాదాపు రూ 6,700 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. సరెండర్ లీవుల నగదుతో పాటుగా ఇతర బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని వాపోతున్నారు. ఇక, ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగా తమ సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు సంఘాలు సిద్దమయ్యాయి.

 

ప్రభుత్వం చర్చలు : దీంతో, ఇప్పుడు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించటం ద్వారా వీటి పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. పెండింగ్ బకాయిల పైన గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఎంత మేర వెంటనే చెల్లిస్తారనే అంశం పైన క్లారిటీ వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆసక్తిగా చూస్తున్నాయి. దీంతో పాటుగా పీఆర్సీ ప్రకటించినా ఇప్పటి వరకు అధ్యయనం ప్రారంభం కాలేదని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. పీఆర్సీ నివేదిక, అమలుకు సమయం పట్టనుంది. దీంతో, ఉద్యోగులకు ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెండింగ్ డీఏలు, బకాయిలు, మధ్యంతర భృతిపైన ఈ చర్చల్లో ప్రభుత్వం వెల్లడించే నిర్ణయం పైన ఉద్యోగులు ఆసక్తిగా చూస్తున్నారు.

FASTag: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్టాగ్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..!

టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూళ్ళపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను తొలగించాలని నిర్ణయించింది.
గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.

తాజాగా దాని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి. లేదంటే, తగినంత ఫాస్టాగ్‌ యాప్‌లో క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిసారీ ఇలాంటి తలనొప్పులు లేకుండా, ఫాస్టాగ్‌ల నుంచి GPS ఆధారిత టోల్ సిస్టమ్‌కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో వాహనదారులకు హైవే ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా సాగుతుందని కేంద్ర భావిస్తోంది.

కేంద్రం తీసుకువచ్చిన ఫాస్టాగ్‌ సిస్టమ్ ఎలక్ట్రానిక్ ట్యాగ్స్‌.. వీటితో టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించేందుకు వీలవుతుంది. ట్రాఫిక్ రద్దీ, టోల్ ఫ్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి 2016 లో వీటిని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఇప్పటికీ లో-బ్యాలెన్స్ అలర్ట్స్, సాంకేతిక లోపాలు వంటి కొన్ని సమస్యలను వాహనదారులు ఎదుర్కొంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని వాహనదారుల ఇబ్బందుల పరిష్కారానికి GPS ఆధారిత టోల్ సిస్టమ్‌ తీసుకు రావాలని ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది.

GPS ఆధారిత టోల్ సిస్టమ్ అనేది ఒక కొత్త టెక్నాలజీ.. ప్రస్తుతం దీనిని దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలోని అటల్ సేతు వంటి కొన్ని రహదారులపై విజయవంతంగా పరీక్షించారు. ప్రత్యేక సీసీ కెమెరాలతో కదిలే వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేయడం ద్వారా ఇది సులువుగా పని చేస్తోంది. ఆ కెమెరాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీతో వర్క్ చేస్తోంది. ఈ సిస్టమ్‌లో వెహికిల్ రిజిస్ట్రేషన్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ అమౌంట్‌ను తీసివేసుకుంటుంది. GPS-ఆధారిత టోల్ సిస్టమ్ ఫాస్టాగ్‌ల కంటే అనేక ప్రయోజనాలు ఆఫర్ చేస్తోంది.
జీపీఎస్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటు లోకి వస్తే, టోల్ ప్లాజాల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించాల్సిన, ఆపాల్సిన అవసరం రాదు. దీనివల్ల ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఫాస్టాగ్స్‌ను రీఛార్జ్ చేయడం లేదా తగినంత బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉండదు. దీనివల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగు పడుతుంది. ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు కంటిన్యూగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి పోవచ్చు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురు కావంటున్నారు నిపుణులు.

GPS ఆధారిత టోల్ సిస్టమ్ ఫాస్టాగ్స్‌ను పూర్తిగా భర్తీ చేసే అవకాశం లేదు. ప్రధాన రహదారులతో ప్రారంభించి క్రమంగా అన్ని చోట్లా దీనిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఇది వచ్చినంత మాత్రాన ఫాస్టాగ్‌లు నిరుపయోగంగా మారవు. వీటిని చిన్న రహదారులపై లేదా బ్యాకప్ ఆప్షన్‌ గా భవిష్యత్తులో కూడా ఉపయోగించవచ్చు.
2024, ఏప్రిల్ ప్రారంభంలో GPS ఆధారిత టోల్ సిస్టమ్‌ను దేశ వ్యాప్తంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌ల విజయం, డేటా ప్రైవసీ వంటి ఏవైనా సమస్యలను పరిష్కరించాక ఈ సిస్టమ్‌ను వెంటనే అమల్లోకి తీసుకు రావచ్చు. మొత్తం మీద GPS ఆధారిత టోల్ సిస్టమ్ భారత దేశంలో హైవే ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చగలదు. టోల్ బూత్‌ లను తొలగించడం, మరింత సమర్థవంతమైన వ్యవస్థను అందిస్తూ, ఇది దేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రయాణికులు, సరకు రవాణాదారులకు ప్రయాణ సమయాన్ని, సౌకర్యాన్ని మెరుగు పరుస్తుంది.

Spoiled Egg:కోడిగుడ్డు పాడైపోయిందని ఎలా తెలుసుకోవాలి? ఏం చేయాలి?

Spoiled Egg: కోడిగడ్డులో పోషకాలు మెండు. అందువల్ల దీనిని ప్రతిరోజూ ఒకటి తినాలని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీంతో చాలా మంది ఏదో రకంగా కోడిగుడ్డును తీసుకుంటారు.
అయితే కోడిగుడ్లు ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల పాడైపోతాయి. వేసవి కాలంలో తొందరగా కుళ్లిపోతాయి. ఒక్కోసారి గుడ్డు పైకి బాగానేకనిపించిన లోపల మాత్రం పాడైపోతుంది. మరి కోడి గుడ్డు పాడిపోయిందని ఎలా తెలియాలి? దాని కోసం ఏం చేయాలి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆరోగ్యంగా ఉండేందుకు నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నవాటిని తీసుకోవడం వల్ల యాక్టివ్ గా ఉండమే కాకుండా ఎలాంటి బ్యాక్టీరియానైనా తట్టుకునే శక్తి వస్తుంది. విటమిన్లు ఎక్కువగా ఉన్న కొన్ని పదార్థాలనుకొనుగోలు చేయాలంటే చాలా ఖర్చవుతుంది. అన్ని వర్గాల వారికి ఎక్కువ పోషకాలు ఉండి తక్కువ ధరకు లభించే ఆహార పదార్థం కోడిగుడ్డు. కోడిగుడ్డును రకరకాలుగా తింటారు. కొందరు హాఫ్ బాయిల్ వేసుకొని తింటారు. మరికొందరు కర్రీ ద్వారా తీసుకుంటారు. కానీ ఉడికించిన కోడిగుడ్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
గుడ్డు తినడం వల్ల ఐ సైట్, శుక్లాలు వచ్చే అవకాశాలు తగ్గుతుంది. గుడ్డులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. విటీమిన్ ఈ తో పాటు జింక్, సెలీనియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల శారీరక శ్రమ చేసిన వారు తిరిగి శక్తిని పొందుతారు. గర్భిణులకు కాల్షియం అవసరం. దీంతో కోడిగుడ్డును తప్పనిసరిగా తినాలని చెబుతారు. గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కానీ హెచ్ డీఎల్ స్తాయి మెరుగవుతుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే గుడ్డు తప్పనిసరి అయిన నేపథ్యంలో చాలా మంది ప్రతి రోజూ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలామంది తమకు తెలియకుండానే పాడైపోయిన గుడ్డును తింటున్నారు. అయితే కోడిగుడ్డు నాణ్యమైందా? లేదా? తెలుసుకోవాలంటే చిన్న ట్రిక్ సరిపోతుంది. ఒక గ్లాసులో నీరు తీసుకొని అందులో షాప్ నుంచి తెచ్చిన కోడిగుడ్డును వేయాలి. అది పూర్తిగా మునిగిపోతే అది నాణ్యమైన గుడ్డు అని తెలుసుకోవాలి. లేక అది నీటిలో తేలియాడినట్లయితే అది పాడైపోయిందని గుర్తించాలి. ఇలా సరైన కోడిగుడ్డును తిని ఆరోగ్యంగా ఉండాలి.

Agniveer Recruitment 2024: ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్ మెట్.. ఫిబ్రవరి 13 నుంచి రిజిస్ట్రేషన్

Indian Army Agniveer Bharti 2024: ఇండియన్ ఆర్మీలో కొత్త అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 13 ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభమవుతుంది.
రిక్రూట్‌మెంట్‌పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు joinindianarmy.nic.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అగ్నివీర్ GD, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మన్‌తో సహా నాలుగు కేటగిరీలకు ఈ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. అగ్నివీరుడు కావాలనుకునే యువతకు ముందుగా ఆన్‌లైన్‌లో రాత పరీక్ష (కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహిస్తారు. ఆ తర్వాత శారీరక, వైద్య పరీక్ష ఉంటుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆధార్ కార్డ్, 10వ తరగతి మెమో డిజిలాకర్ ఖాతాతో లింక్ చేసుకోవాలి. దరఖాస్తుదారుల విద్యా ధృవీకరణ పత్రాలను సంబంధిత బోర్డు డిజిలాకర్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది.
అర్హతలు-నియమాలు..
అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD)కి 45 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. డ్రైవర్ రిక్రూట్‌మెంట్‌లో లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

అగ్నివీర్ టెక్నికల్ కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో (మొత్తం) 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు ఉండాలి.

అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ కి సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్/అకౌంట్స్/బుక్ కీపింగ్‌లో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.
అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ కు 10వ తరగతి ఉత్తీర్ణత ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. దరఖాస్తుదారు అన్ని సబ్జెక్టులలో 33 శాతం మార్కులు కలిగి ఉండాలి. అగ్నివీర్ ట్రేడ్స్‌మాన్ 8 తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారు అన్ని సబ్జెక్టులలో 33 శాతం మార్కులు కలిగి ఉండాలి. అన్ని పోస్టులకు వయోపరిమితి 17½ సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు ఉండాలి.

అగ్నిపథ్ పథకం కింద భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళంలో 4 సంవత్సరాల పాటు సైనికులను నియమిస్తారనే విషయం తెలిసిందే. 4 సంవత్సరాల తరువాత, 75 శాతం మంది సైనికులను ఇంటికి పంపుతారు. మిగిలిన 25 శాతం అగ్నిమాపక సిబ్బందిని శాశ్వత సైనికులుగా నియమిస్తారు.

బట్టతలకు విరుగుడు మంత్రం.. ఈ స్మార్ట్‌ డివైజ్‌!

బట్టతల మీద జుట్టు మొలిపించుకోవడం కోసం జనాలు నానా తంటాలు పడుతుంటారు. జుట్టు రాలడాన్ని అరి కట్టడానికి రకరకాల నూనెలను ఉపయోగిస్తుంటారు. మందు మాకులు వాడుతుంటారు.
బట్టతలను దాచుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కొందరు విగ్గులు వాడుతుంటారు.

బట్టతలపై జుట్టు కోసం ఇకపై ఇన్ని తంటాలు అక్కర్లేదు. హెల్మెట్‌లా కనిపించే ఈ పరికరాన్ని తలకు తొడుక్కుంటే చాలు. ఆరు నెలల్లోనే ఇది ఫలితాలను చూపించడం మొదలుపెడుతుంది. ఆస్ట్రియాకు చెందిన ‘నియోస్టెమ్‌’ కంపెనీ ఇటీవల ఈ పరికరాన్ని ‘హెయిర్‌లాస్‌ ప్రివెన్షన్‌ వెయిరబుల్‌’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది.

రోజూ అరగంట సేపు దీన్ని తలకు తొడుక్కుంటే, ఇది తలపైనున్న మూలకణాలను ఉత్తేజితం చేసి, జుట్టు రాలిపోయిన చోట తిరిగి జట్టు మొలిపిస్తుందని దీని తయారీదారులు చెబుతున్నారు. దీనిని వాడటం వల్ల దుష్ఫలితాలేవీ ఉండబోవని కూడా వారు చెబుతున్నారు. దీని ధర 899 డాలర్లు (రూ.74,734).

Business Idea: సొంతంగా వ్యాపారం చేయాలని ఉందా.? బెస్ట్‌ బిజినెస్ ఐడియా మీకోసం..

ప్రస్తుతం సొంతంగా బిజినెస్‌ చేయాలనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాలు పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
అయితే వ్యాపారం అనగానే నష్టం వస్తుందేమోననే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టాలు అనేవి ఉండవు. అలాంటి బెస్ట్‌ బిజిసెస్‌ ఐడియాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్లో కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మధ్య తరగతి కుటుంబాలు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో కార్‌ వాషింగ్ సెంటర్లకు డిమాండ్‌ పెరిగింది. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ కార్ల వినియోగం పెరిగింది. దీంతో మండల కేంద్రాల్లోనూ కార్ వాషింగ్‌ సెంటర్స్‌ వెలుస్తున్నాయి. కార్‌ వాషింగ్‌ సెంటర్‌ బిజినెస్ ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఇంతకీ కార్‌ వాషింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది.? ఎలాంటి లాభాలు ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కార్‌ వాషింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడానికి కనీసం రెండు కార్లను పార్క్‌ చేసేందుకు వీలు ఉండేలా స్థలం ఉండాలి. అలాగే కార్‌ వాషింగ్‌ కోసం ఒక ప్రొఫెషనల్‌ మిషన్‌ అవసరపడుతుంది. దీని ధర రూ. 12 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. 2 హార్స్‌ పవర్ మిషన్‌ ధర రూ. 14 వేలు ఉంటుంది. ఈ మిషన్‌తో పాటు 30 లీటర్ల వ్యాక్యూమ్‌ క్లీనర్‌ అవసరపడుతుంది. దీని ధర సుమారు రూ. 9 నుంచి రూ. 10 వేల వరకు ఉంటుంది. అలాగే షాంపూ, గ్లోవ్స్‌, టైర్‌ పాలిష్‌తో పాటు 5 లీటర్ల డ్యాష్‌బోర్డ్‌ పాలసీతో సహా వాషింగ్‌ సామాగ్రి అవసరపడుతుంది.

ఇవన్నీ రూ. 1500 నుంచి రూ. 2000 వరకు ఖర్చవుతుంది. కార్‌ వాషింగ్‌ ఏర్పాటు చేయడానికి స్థలం కాకుండా కనీసం రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు అవసరపడుతుంది. ఇక లాభాలు విషయానికొస్తే.. కారు వాషింగ్‌ ఛార్జీలు స్థలం బట్టి మారుతుంది. సాధారణంగా చిన్న నగరాల్లో కారు వాషింగ్‌కు రూ. 150 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. అదే పెద్ద నగరాల్లో అయితే రూ. 250 నుంచి రూ. 800 వరకు వసూలు చేయొచ్చు. అలాగే ఎస్‌యూవీ కార్ల విషయానికొస్తే రూ. 1000 వరకు కూడా ఆర్జించవచ్చు. కారు వాషింగ్ ద్వారా రోజుకు 8 నుంచి 10 కార్లను క్లీన్ చేసినా, నెలకు సరాసరి రూ. 80 వేల వరకు సంపాదించవచ్చు.

Credit Card: క్రెడిట్ కార్డుతో బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా?

ప్రతినెలా 28 నుంచి 1వ తేదీ మధ్య 3-4 రోజులు ఉంటాయి.. అవి మామూలు రోజుల్లాగే అనిపిస్తాయి. కానీ మనీషాకు ఇవే ఎక్కువ కాలంగా అనిపిస్తుంది. నిజానికి నెలాఖరుకు మనీషా బ్యాంక్ ఖాతాలో డబ్బు అయిపోతుంది.
ఇప్పుడు సమస్య ప్రతినెలా 28వ తేదీన SIP అమౌంట్ ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. మనీషా చాలాసార్లు అప్పు చేయాల్సి వచ్చింది. అలాగే బ్యాలెన్స్ తక్కువగా ఉండడంతో రెండుసార్లు బ్యాంక్ రూ.500 జరిమానా విధించింది. ఇంకేముంది. పేమెంట్ మిస్ అయితే CIBIL స్కోర్‌పై కూడా ప్రభావం పడుతుందనే టెన్షన్ కూడా ఉంది..

ఒక స్నేహితుడు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేయమని సలహా ఇచ్చాడు. మనీషాకు ఈ విషయం తెలియక ఆశ్చర్యపోయి, ఇలా కూడా అవుతుందా? అని అడిగింది. దీంతో అతడు.. అవును, ఇది కూడా అవుతుంది. మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీ బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. కానీ దానితో ప్రయోజనాలతో పాటు సమస్యలూ ఉన్నాయి. అన్నింటిలో మొదటిది క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బును ఎలా బదిలీ చేయాలి? అప్పుడు మీరు డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని తెలుసుకోండి. మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ యాప్‌లు లేదా అనేక బ్యాంకుల సైట్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ ఖాతాకు నేరుగా డబ్బును బదిలీ చేయవచ్చు. వివిధ బ్యాంకుల్లో డైలీ ట్రాన్స్ ఫర్ లిమిట్.. భిన్నంగా ఉండవచ్చని గుర్తుంచుకోండి. కాబట్టి మీ బ్యాంక్ నుంచి దీని గురించి సమాచారాన్ని ముందే తెలుసుకోండి.

మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా డబ్బును బదిలీ చేయవచ్చు. మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ సేవను అందించకపోతే… మీ ఖాతాకు లాగిన్ చేసి, ‘క్రెడిట్ కార్డ్’ విభాగానికి వెళ్లండి. అక్కడ ‘ట్రాన్స్ ఫర్’ ఆప్షన్ ను ఎంచుకుని… మీరు మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి. ఆపై సూచనలను అనుసరించి లావాదేవీని పూర్తి చేయండి. డబ్బును బదిలీ చేయడానికి మరొక మార్గం.. ఫోన్ కాల్. కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఫోన్ కాల్ ద్వారా ఫండ్ ను ట్రాన్స్‌ఫర్ చేసే సదుపాయాన్ని అందిస్తాయి. మీరు క్రెడిట్ కార్డ్ కంపెనీకి అవసరమైన వివరాలను అందించి, నిధులను బదిలీ చేయమని అడగాలి. దీని తర్వాత మీరు ఎంత మొత్తం బదిలీ చేయమంటారో చెప్పాక.. ట్రాన్స్ ఫర్ ప్రాసెస్ ను ఫాలో అవ్వచ్చు.
ఇప్పుడు చివరి పద్ధతి గురించి చూద్దాం. మీరు మీ చెక్కును సరిగా నింపండి. సాధారణంగా క్రెడిట్ కార్డ్‌ కంపెనీలు చెక్ బుక్ ను ఇవ్వవు. దీని కోసం మీరు క్రెడిట్ కార్డ్ కంపెనీని అడగాలి. దీనిని ‘చెక్ టు సెల్ఫ్’ అంటారు. ఇక్కడ సెల్ఫ్ అంటే చెక్ పై పేయీ నేమ్ రాయాలి. దీంతోపాటు ఇతర వివరాలు నింపాలి. తరువాత మీ బ్యాంక్ బ్రాంచ్ లో డిపాజిట్ చేయాలి. అది క్లియర్ అయ్యాక.. డబ్బు మీ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. అవసరమైన సమయంలో, క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేయడం వలన మీ అవసరాలు తీరుతాయి. అయితే ఇందులో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వాటి గురించి మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మొదటి విషయం ఏమిటంటే క్రెడిట్ కార్డ్ ముఖ్య ఉద్దేశం.. నేరుగా చెల్లింపులు చేయడం. ఈ విధంగా పదే పదే డబ్బును బదిలీ చేయడం ద్వారా, మీరు క్రెడిట్ కార్డ్‌ని సరిగ్గా ఉపయోగించలేరు. మీరు దానిని షాపింగ్ కోసం ఉపయోగించలేరు. మీరు దానితో రివార్డ్ పాయింట్‌లనూ పొందలేరు. మరో విషయం ఏమిటంటే, క్రెడిట్ కార్డు వినియోగం పరిమితికి మించి ఉంటే ఆదాయపు పన్ను శాఖ మీ లావాదేవీలను విచారించవచ్చు. క్రెడిట్ కార్డులపై సంవత్సరానికి రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసే వారి గురించి బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇస్తాయి. తరచుగా డబ్బు ట్రాన్స్ ఫర్ చేయడం వల్ల.. అది మిమ్మల్ని పన్ను అధికారుల రాడార్ కిందకు తీసుకురావచ్చని గుర్తుంచుకోండి.

ఈ విధంగా బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేయడం ద్వారా, క్రెడిట్ పరిమితిలో ఎక్కువ భాగం.. క్యాష్ విత్ డ్రాల్స్ వైపు వెళుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు పెరిగినప్పుడు, క్రెడిట్ కార్డ్ బకాయిలపై వడ్డీ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఒక్క చెల్లింపు అయినా డిఫాల్ట్ అయితే, మీ క్రెడిట్ స్కోర్ క్షీణిస్తుంది. మీ క్రెడిట్ చరిత్ర ప్రభావితం అవుతుంది. మీరు మరింత రుణం పొందడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. అందువల్ల, అత్యవసర పరిస్థితుల్లో నిధులను బదిలీ చేయడం సరైనదే అయినా.. దాన్ని అలవాటుగా మార్చుకోవడం మాత్రం సరికాదు. ఇలాంటి అధిక బదిలీలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. కాబట్టి క్రెడిట్ కార్డ్‌ని తెలివిగా ఉపయోగించడం చాలా ముఖ్యం.

Ac Power Saving Tips:ఏసీ ఉన్నప్రతి ఒక్కరు ఇలా చేస్తే కరెంట్ బిల్ 250 కి మించదు..బెస్ట్ సలహా

AC Power Saving Tips in Telugu :వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. AC లేనిదే ఒక క్షణం కూడా గడవదు. రోజు AC వేసుకుంటే నెల కరెంట్ బిల్ ఎంత వస్తుందో మన అందరికి తెలిసిన విషయమే.
అందుకే ఇప్పుడు వేసవిలో AC వేసుకున్న కరెంట్ బిల్ తక్కువ వచ్చే విధంగా కొన్ని చిట్కాల గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. ఈ చిట్కాలను పాటిస్తే కరెంట్ బిల్ చూసి భయపడవలసిన అవసరం లేదు.

హ్యాపీగా AC ఆన్ చేసుకోవచ్చు. గది తలుపులు తరచూ తెరిచి, మూయటం వలన బయట వేడి గాలి లోపలికి చొరబడుతుంది. దాంతో గదిలో చల్లదనం కోసం ఏసీ ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి గది తలుపులు తరచుగా తెరవకూడదు. తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీని ఆన్ చేసిన వెంటనే తొందరగా గది చల్లబడాలని ముందు 16 డిగ్రీల్లో ఉంచేసి ఆ తర్వాత తగ్గించడం సరైన పద్దతి కాదు. విద్యుత్ ఆదా కావాలని అనుకుంటే ఇలా చేయకుండా ముందు నుంచీ ఒకటే ఉష్ణోగ్రతలో ఉంచాలి.
దీని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.ఏసీ ఫిల్టర్లను వారానికి ఒకసారి తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఫిల్టర్ శుభ్రంగా ఉంటేనే గాలి విరివిగా కాయిల్స్ కు సరఫరా అయ్యి గది తొందరగా చల్లబడుతుంది. దీనితో కరెంట్ ఆదా అవుతుంది. ఏసీ టెంపరేచర్ 25-27 డిగ్రీల మధ్య ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే ఏసీ టెంపరేచర్ 18 డిగ్రీలు ఉంటే ఆ భారం కంప్రెషర్ మీద పడి విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది. 24 డిగ్రీలకు పైన టెంపరేచర్ ను సెట్ చేసుకోవడం ద్వారానే విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు.

గదిలో ఏసీ ఆన్ చేసి ఉన్న సమయంలో సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేస్తే గది తొందరగా చల్లబడుతుందని అందరూ భావించి సీలింగ్ ఫ్యాన్ వేస్తూ ఉంటారు. కానీ అది తప్పు. సీలింగ్ ఫ్యాన్ వేయటం వలన గది పైకప్పు నుంచి వేడి కిందకు వ్యాపిస్తూ ఉంటుంది. అప్పుడు మరింత చల్లదనం అవసరం అవుతుంది. విండో ఏసీ కంటే స్ల్పిట్ ఏసీ బెటర్. ఎందుకంటే ఎందుకంటే వేడి గాలి తేలికగా ఉంటుంది. దాంతో అది గదిలో ఫై భాగంలోకి చేరుతుంది.

స్ల్పిట్ ఏసీ గోడకు పై భాగంలో బిగించేది కనుక గాలి తొందరగా చల్లబడుతుంది. ఏసీని గది మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే గది అంతా చల్లగాలి సమంగా పంపిణీ అవుతుంది.విండోలు, తలుపులు సహా ఏ మార్గంలోనూ ఏసీ లీకేజీ లేకుండా చూసుకోవాలి. విండో ఉండి, దానికి గ్లాస్ లు ఉంటే కర్టెన్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఒకవేళ కర్టెన్ వేయకపోతే గదిలోకి వేడి వచ్చేసి చల్లబడటానికి సమయం ఎక్కువ పడుతుంది.ఏసీ ఉన్న గదిలో సీలింగ్ తప్పనిసరిగా ఉండాలి. గదిపైన మరో ఫ్లోర్ లేకపోతే కూల్ సెమ్ కోటింగ్ వేసుకోవడం వల్ల గదిలోకి ఉష్ణోగ్రత ప్రవేశించడం చాలా వరకు తగ్గిపోతుంది.గదిలో చల్లబడటానికి గదిలో ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి.
గది విస్తీర్ణం, కిటికీ ఎంత పరిమాణంలో ఉంది, దానికి అద్దాలు ఎంత మేర ఉన్నాయి, తూర్పు లేదా పడమర దిక్కులో ఆ గది ఉందా, గదిలో ఉన్న ఫ్లోరింగ్, గదిలో టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రికల్ వస్తువులు ఎన్ని ఉన్నాయి, గదిలోకి వేడి ప్రవేశించకుండా తీసుకున్న జాగ్రత్తలు ,గదిలో ఎంత మంది ఉన్నారు. వంటి అనేక అంశాలు గదిలోని ఉష్ణోగ్రత మరియు గది చల్లపడే పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన చిట్కాలను ఫాలో అయ్యి ఈ వేసవిలో AC వేసుకొని మరీ కరెంట్ బిల్ తగ్గించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

భారతీయ కళ మరియు సంస్కృతి యొక్క వారసత్వం మరియు సృజనాత్మకత కు నిదర్శనం: సంగమం 2024

భారతీయ కళ మరియు సంస్కృతి యొక్క వారసత్వం మరియు
సృజనాత్మకత కు నిదర్శనం: సంగమం 2024

శిబులాల్ ఫ్యామిలీ ఫిలాంత్రోపిక్ ఇనిషియేటివ్స్ (SFPI) – ధృపద్ మాస్ట్రో పండిట్ కిరీట్ సింగ్ మరియు సుఖద్ మాణిక్ ముండే, ఉదయ్ భవాల్కర్ తో కలిసి సంగమం యొక్క ఏడవ ఎడిషన్ను బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో నిర్వహించింది.
బెంగుళూరులోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి పండిట్ని కలిసిన శాస్త్రీయ సంగీత ఆరాధకులు ప్రత్యక్ష ధృపద్ ప్రదర్శనను తిలకించారు. ఉదయ్ భల్వాల్కర్ మరియు అతని బృందం.
అగ్రశ్రేణి ధ్రుపద్ గాత్ర విద్వాంసులుగా ప్రసిద్ధి చెందిన పండిట్ ఉదయ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గుర్తింపు, ప్రజాదరణ మరియు పునరుజ్జీవనంలో బలమైన ఎదిగిన శక్తి. అతను ఉస్తాద్ జియా ఫరీదుద్దీన్ దాగర్ (గాత్రం) మరియు ఉస్తాద్ జియా మొహియుద్దీన్ దాగర్ (రుద్ర-వీణ) యొక్క శిష్యుడు, ధృపద్ సంప్రదాయానికి మహోన్నతమైన స్తంభాలు. పండిట్ స్వరంలో మరియు రాగంలో లీనమైనప్పుడు స్వయం కరిగిపోతుందని మరియు సంగీతం మాత్రమే మిగిలిపోతుందని ఉదయ్ జీ అభిప్రాయపడ్డారు. అతని ఆకర్షణీయమైన శైలి తో, పండిట్ ఉదయ్ తన కళారూపం ద్వారా అన్ని నేపథ్యాల ప్రేక్షకులకు చేరువయ్యాడు మరియు కమ్యూనికేట్ చేస్తాడు. 1985లో భోపాల్లో తన మొదటి ప్రదర్శన నుండి ఉదయ్ భారతదేశం మరియు విదేశాలలో అనేక ప్రతిష్టాత్మకమైన పండుగలు మరియు కార్యక్రమాలలో ప్రదర్శన ఇచ్చాడు.
సంగమం వ్యవస్థాపకులు కుమారి శిబులాల్ మరియు SD శిబులాల్ సంగీతం పట్ల అపారమైన అభిరుచి నుండి జన్మించిన సంగమం భారతదేశ వారసత్వం మరియు విభిన్న కళారూపాలను విస్తృత ప్రేక్షకులకు ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, అదే సమయంలో మన సాంస్కృతిక వారసత్వంపై అవగాహన మరియు పరిరక్షణను ప్రోత్సహిస్తుంది.
సంగమంపై తన ఆలోచనలను పంచుకుంటూ, వ్యవస్థాపకురాలు (SFPI) కుమారి శిబులాల్ మాట్లాడుతూ, “సంగీతానికి ప్రజలను ఒకచోట చేర్చి, సరిహద్దులు మరియు భేదాలకు అతీతంగా ఒక ఉమ్మడి వేదికను సృష్టించగల సామర్థ్యం ఉంది. శిబు మరియు నేను ఇద్దరూ భారతీయ శాస్త్రీయ సంగీతం వైపు మొగ్గు చూపుతున్నాము, వారసత్వం మరియు సంస్కృతిపై మా అభిమానమే సంగమం కోసం కొన్ని సంవత్సరాల క్రితం బీజం వేసింది. ఈ చొరవ ద్వారా, భారతీయ సంగీతం మరియు నృత్య రూపాల గొప్పతనాన్ని చూసి స్ఫూర్తి పొందిన కళాభిమానులకు చేరువ కావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.

పండిట్ ఉదయ్ తన లైవ్ ద్రుపద్ ప్రదర్శనలో ఇలా అభిప్రాయపడ్డాడు, “కళాభిమానులను కలవడం ఎల్లప్పుడూ ఒక సంతృప్తికరమైన అనుభవం. విద్యావేత్తగా మరియు ప్రదర్శనకారుడిగా నా 40 సంవత్సరాల అనుభవంతో, అందమైన పురాతన కళారూపాన్ని పంచుకోవడం నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. బెంగుళూరు ఎల్లప్పుడూ చాలా స్వాగతించేది, మరియు సంగమంలో ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు కళ, కళాకారులు మరియు ఆరాధకుల మధ్య అంతరాన్ని తొలగిస్తాయి.
ధృపద్ కూడా ఉత్తర భారతీయ శాస్త్రీయ సంగీతం యొక్క పురాతన జీవన సంప్రదాయాలలో ఒకటి, గొప్ప, ప్రాచీన భారతీయ తత్వాలు మరియు దాని కళాత్మక విలువ వ్యవస్థల నుండి దాని మూలాలను పొందింది. ఇది సామవేదం యొక్క పవిత్ర సంస్కృత లిపి నుండి ఉద్భవించింది.
సాంప్రదాయ గురు శిష్య పరంపరలో ధృపద్ బోధించే వంశాన్ని ప్రోత్సహించడానికి మరియు సజీవంగా ఉంచే ప్రయత్నంలో, పండిట్ ఉదయ్ ‘ధ్రుపద్ స్వర్కుల్’ పేరుతో రెసిడెన్షియల్ గురుకులాన్ని స్థాపించారు, ఈ కళ యొక్క ఎంపిక చేసిన మరియు అర్హులైన సాధకులకు జ్ఞానం మరియు శిక్షణను అందించాలనే లక్ష్యంతో – ధృపద్ రూపాన్ని ఇచ్చారు. ‘గురు-శిష్య పరంపర’ అనేది గురువుల ద్వారా యుగయుగాల ద్వారా అందించబడిన విలువైన జ్ఞానాన్ని మరియు తత్వశాస్త్రాన్ని అందించడానికి ఒక సర్వోత్కృష్టమైన భారతీయ ప్రక్రియ. SFPI ఈ కళారూపాన్ని కొనసాగించడానికి ఆసక్తి ఉన్న పిల్లలకు ఈ పురాతన కళారూపాన్ని ప్రోత్సహించడానికి ధృపద్ స్వర్కుల్తో కలిసి పనిచేసింది – ధ్రుపద్.
సంగమం గురించి:
సంగమం హిందుస్థానీ, కర్నాటిక్ మరియు శక్తివంతమైన జానపద-కళా రూపాలను కలిగి ఉన్న కళా ప్రక్రియల యొక్క కాలిడోస్కోప్ను అందిస్తూ, ఏడాది పొడవునా ఆకర్షణీయమైన సంగీత కచేరీలకు వేదికను ఏర్పాటు చేసింది. ఆరాధకులు కళాకారులు తమ హృదయాలను మరియు ఆత్మలను తమ నైపుణ్యానికి పోయడం, భావోద్వేగాలను రేకెత్తించడం మరియు ఆశ్చర్యాన్ని రేకెత్తించడం చూస్తారు. చివరి నోటు ఫేడ్ అయిన తర్వాత చాలా కాలం పాటు కొనసాగుతుంది. తదుపరి కార్యక్రమం మార్చి 09న బెంగళూరు ఇంటర్నేషనల్ సెంటర్లో గాయకుడు ధరిణి వీరరాఘవన్తో షెడ్యూల్ చేయబడింది. మరిన్ని వివరాల కోసం, దయచేసి సందర్శించండి. ఇక్కడ లింక్ క్లిక్ చేయండి https://sfpi.org/sangamam/
శిబులాల్ ఫ్యామిలీ ఫిలాంత్రోపిక్ ఇనిషియేటివ్స్ (SFPI) గురించి: విద్య, ఆరోగ్య సంరక్షణ, సేంద్రీయ వ్యవసాయం మరియు సాంఘిక సంక్షేమం వంటి కార్యక్రమాల ద్వారా సేవలందించని వారి జీవితాలలో స్థిరమైన అభివృద్ధి ద్వారా జీవితాలను మార్చాలనే దృక్పథంతో 1998లో SFPI ఉనికిలోకి వచ్చింది. సంగమం ద్వారా, దేశంలోని గౌరవప్రదమైన కళాకారులచే సుసంపన్నమైన ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులు వారి సాంస్కృతిక మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి మరియు వారి నిజాయితీగల ప్రదర్శనలో వాటిని అనుభవించడానికి SFPI మార్గం సుగమం చేస్తుంది. మరింత తెలుసుకోవడానికి, మా వెబ్సైట్ను సందర్శించండి: ఇక్కడ లింక్ https://sfpi.org/ క్లిక్ చేయండి
మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు ఇక్కడ వ్రాయండి: communications@sfpi.org

PM Kisan: రైతులకు శుభవార్త.. గ్రామాల్లో అధికారుల క్యాంపులు.. ఎప్పుడంటే..!

రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింది నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 లను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ పథకం కింది 15 విడతలుగా రైతు ఖాతాల్లో రూ.30 వేలు జమ చేశారు. త్వరలో 16 విడత డబ్బులు కూడా రానున్నాయి. అయితే ఈ పథకంలో అనర్హులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ప్రతి రైతు ఈకేవైసీ చేసుకోవాలని కోరింది.

ఎప్పటి నుంచో ఈ కేవైసీ చేసుకోవాలని చెబుతోంది. అయితే ఈ పథకం వర్తించాలంటే తప్పకుండా e KYC ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ చాలా మంది ఈ కేవైసీ చేసుకోలేదు. దీంతో వారికి వచ్చే పీఎం కిసాన్ డబ్బులు ఆగిపోయాయి. ఇప్పటికైనా ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అయినప్పటికీ చాలా మందికి ఈ కేవైసీపై అవగాహన లేకపోవడంతో చేసుకోలేదు.

 

దీంతో అధికారులు గ్రామాల్లోకి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఈ కేవైసీ చేసేందుకు ఫిబ్రవరి 12 నుంచి 21 వరకు గ్రామాల్లో అధికారులు క్యాంపులు నిర్వహించి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇప్పటికీ కూడా ఈ కేవైసీ చేసుకోకుండా ఉన్న రైతులు గ్రామాల్లోకి అధికారులు వచ్చినప్పుడు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు. ఈకేవైసీ చేసుకోకుంటే డబ్బులు జమ కావని స్పష్టం చేస్తున్నారు.

పీఎం కిసాన్ యోజన కు సంబంధించి ఆన్ లైన్ లో ఈకేవైసీ చేసుకోవచ్చు. కానీ మీ ఆధార్ కు ఫోన్ నంబర్ లింక్ ఉంటేనే ఇది సాధ్యం అవుతోంది. ఈ ఆధార్ కు ఫోన్ నంబర్ లింక్ లేకుంటే వెంటనే మీసేవకు వెళ్లి లింక్ చేసుకోవాలి. ఆధార్ తో ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటే.. మీరు pmkisan.gov.in వెబ్ సైట్ వెళ్లాలి. అక్కడ మీకు ఈ కేవైసీ అని కనిపిస్తుంది. అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ ఈకేవైసీ పూర్తవుతోంది.

జగనన్నపై ద్వేషం లేదు.. ఆయనదీ తన రక్తమే; కానీ… వైఎస్ షర్మిల సంచలనం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు నర్సీపట్నంలో పర్యటిస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ప్రజల్లోకి వెళుతున్న వైఎస్ షర్మిల జగన్ సర్కార్ తీరుపై విరుచుకుపడుతున్నారు.
నర్సీపట్నం రచ్చబండలో షర్మిల జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాను అన్నది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతుంది అన్నది వివరించి చెప్పారు.

తనకు జగనన్న అంటే ద్వేషం కాదని, ఆయన తన రక్తమేనని, తాను కేవలం చేసేది సిద్ధాంత పోరాటమేనని షర్మిల పేర్కొన్నారు. వైయస్సార్ ఆశయాలను జగనన్న నిలబెట్టడం లేదని, ఆయన విధానాలు, వైయస్సార్ ఆశయాలు కావని పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి వైఎస్ కుటుంబంపై మమకారం ఉందని, వైయస్సార్ చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు చేర్చడం కాంగ్రెస్ కావాలని చేసిన తప్పు కాదని, పొరబాటున జరిగిందన్న విషయం సోనియాగాంధీ తనతో స్వయంగా చెప్పారన్నారు.

 

వైయస్సార్ అంటే సోనియాకు అభిమానమని తన మనసు నమ్మింది కాబట్టే కాంగ్రెస్ పార్టీలో చేరాను అన్నారు. వైఎస్సార్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని, కాంగ్రెస్ వైఎస్ కుటుంబానికి, రాష్ట్రానికి మోసం చేయలేదని పేర్కొన్నారు. ఆనాడు వైఎస్ఆర్ జలయజ్ఞంతో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి అనుకున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో 54 ప్రాజెక్టులు కట్టారని, వైయస్సార్ చనిపోయే నాటికి 42 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయన్నారు.

పెండింగ్ ప్రాజెక్టులను జగనన్న పూర్తి చేస్తానని చెప్పాడని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కూడా, ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. ఎక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదు అన్నారు. జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగని , వైయస్సార్ రైతు ఆశయాలను జగన్ తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల భూమిని కబ్జా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక కూలీ పనులకు పోతున్నారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాక, పరిశ్రమలు లేక యువత ఇబ్బంది పడుతున్నారన్నారు. 25 మంది ఎంపీలు ఏపీలో ఉండి గాడిదలు కాస్తున్నారని, కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే ఒక రోజు కూడా ఆందోళన చేయలేదని, ఎంపీలు రాజీనామా చేసి ఉంటే హోదా వచ్చి ఉండేదని పేర్కొన్నారు. బిజెపి మీద దండయాత్ర చేయాల్సింది పోయి వంగి వంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు.

జగన్మోహన్ రెడ్డి ఒక కుంభకర్ణుడని, ఎన్నికలకు ముందు ఉద్యోగాలు అంటూ నిద్ర లేచాడని పేర్కొన్నారు. 25 వేల DSC ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడు 6 వేల పోస్టులు వేశారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏవీ అమలు కాలేదని, విభజన హామీలు నెరవేరలేదని, ప్రత్యేక హోదా రాలేదని, రాజధాని నిర్మాణం కాలేదని షర్మిల అసహనం వ్యక్తం చేశారు.

జగన్ వాగ్ధానాలు మద్యం షాపుల్లో బ్రాండ్ పేర్లతో ఉన్నాయని షర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం కారణంగా జనాలు చనిపోతున్నారని, దేశంలోని 25 శాతం మరణాలు ఆంధ్రాలో ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు, పరిశ్రమలను తెస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

ఉదయాన్నే పరగడుపున ఉడికించిన గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..! బరువు పెరుగుతారా..? తగ్గుతారా.?

గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉడికించిన గుడ్లు మంచి పోషకాహారం. ఈ గుడ్డులో దాదాపు 78 కేలరీలు ఉంటాయి. ఇందులో శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రొటీన్లు, కొవ్వు, విటమిన్ డి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
రోజుకు ఒకటి ఉడికించిన గుడ్డు తింటే ఒక వారంలో మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. గుడ్లలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో వచ్చే అనేక వ్యాధులను త్వరగా నయం చేయడంలో గుడ్డు మేలు చేస్తుంది. ఉడికించిన గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి మరియు రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు బలాన్ని ఇస్తాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఉడికించిన గుడ్లలో ఉండే కోలిన్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరాన్ని బలోపేతం చేయడంలో గుడ్లు బాగా సహాయపడుతాయి. శరీరంలోని కండరాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే మీరు ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గుడ్డు తినాలి. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

ఉడికించిన గుడ్డు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం అని ఆరోగ్య నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. ఇవి కంటి సమస్యలను నయం చేయడంలో కూడా మేలు చేస్తాయి. గుడ్లలో కెరోటినాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. పెరుగుతున్న వయస్సు కారణంగా, ప్రజలు అనేక కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. గుడ్డులో జియాక్సంతిన్, లుటిన్ మూలకాలు కనిపిస్తాయి. ఉడికించిన గుడ్డును ఖాళీ కడుపుతో తినటం వల్ల లాభాలు కలుగుతాయి. రోజంతా అలసట కారణంగా స్టామినా చాలా బలహీనంగా మారుతుంది. మీ శరీరం దృఢంగా ఉండాలంటే రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినాలి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుడ్లు తింటే శరీరానికి రెట్టింపు బలం చేకూరడంతో పాటు అనేక వ్యాధుల నుంచి కూడా శరీరం దూరంగా ఉంటుంది. శరీరం శక్తిని పెంచడంలో గుడ్డు సహాయకారిగా పనిచేస్తుంది.

ఉడికించిన గుడ్డు శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. రోజూ ఖాళీ కడుపుతో ఉడికించిన గుడ్డు తినటం వల్ల కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పనిచేస్తుంది. గుడ్డును అల్పాహారంగా తినాలి. దీంతో పొట్ట భారంగా అనిపించదు. ఖాళీ కడుపుతో గుడ్లు తినడం ద్వారా,మీ మెదడు చాలా వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. గుడ్లలో కొన్ని పోషకాలు ఉంటాయి. ఇవి మీ మెదడును త్వరగా పదును పెట్టగలవు. గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్, సెలీనియం, విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడుకు చాలా మేలు చేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

Weight Lose Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా.. నీటిని ఇలా తాగండి చాలు..!

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో చిన్న వయసులో కూడా అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు.
దానికి ఆహారపు అలవాట్లు అధిక కారణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆరోగ్య సమస్యల కారణంగా లేదంటే లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఇలా అధికంగా బరువు పెరిగిపోతున్నారు. బరువును తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసినా సరే పెద్దగా సక్సెస్ కాలేక ఇబ్బందులు పడుతుంటారు. అసలు బరువు తగ్గాలంటే ఏం చేయాలో కూడా చాలా మందికి తెలియదు.

కొందరు గంటల కొద్దీ జిమ్ లో కష్టపడ్డా సరే సన్నగా మారలేక ఇబ్బందులు పడుతుంటారు. అంతే కాకుండా అధిక బరువు తగ్గించుకోవడానికి తిండి తగ్గిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కువ గంటలు వ్యాయామాలు చేయడం బోరింగ్ పని. అంతే కాకుండా ప్రత్యేకమైన ఆహారాలు రెడీ చేసుకునేంత సమయం కూడా లేదు. కాబట్టి చాలా సింపుల్ గా బరువు తగ్గాలని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి వారికోసం ఇప్పుడు మేం ఓ మంచి చిట్కా చెబుతున్నాం. అదే నీరు తాగడం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నీళ్లు తాగడం వల్ల కూడా సులభం బరువు తగ్గొచ్చు. ప్రతిరోజూ తగినంత నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కొవ్వును కరిగిస్తుంది…

తగినంత నీరు తాగడం వల్ల బాడీలో కొవ్వును కరించేస్తుంది మన బాడీ. అసలు నీళ్లు సరిగ్గా తాగకపోతే బాడీలో నిల్వ ఉన్న కార్పొహైడ్రేట్లు, కొవ్వు పదార్తాలను జీర్ణం చేయదు మన బాడీ. కానీ నీళ్లను తాగడం వల్ల కొవ్వు పదార్థాలను మన బాడీ కరిగించేసుకుంటుంది.

కేలరీలను తగ్గిస్తుంది…

చల్లటి నీళ్లు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ వేగంగా మారుతుంది. దాంతో ఈజీగా తిన్న ఆహారం కరిగిపోతుంది. దాని వల్ల బాడీలో కొవ్వు పదార్థాలు పెరగకుండా ఉంటుంది. అంతే కాకుండా చల్లటి నీళ్లు తాగడం వల్ల వాటర్ ను వేడి చేయడానికి మన బాడీ లోపల ఉన్న కేలరీలను బర్న్ చేస్తుంది. దాని వల్ల కూడా బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి.

ఆకలిని తగ్గిస్తుంది..

అధికంగా నీరు తాగడం వల్ల కూడా ఆకలిని తగ్గించుకోవచ్చు. భోజనం చేయడానికి ముందు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. దాంతో మన పొట్ట నిండుగా అనిపించి మన బాడీ తక్కువ ఆహారాన్ని తీసుకుంటుంది. దాని వల్ల అనవసర వ్యర్థ పదార్థాలు మన బాడీలో పేరుకు పోకుండా ఉండి బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది.

ఎంత నీరు తాగాలి..?

అయితే చాలా మందికి అసలు మనం రోజులో ఎంత నీరు తాగాలి అనేది కూడా తెలియదు. మన శరీర బరువును బట్టి నీళ్లు తీసుకోవాలి. అలా కాకుండా బరువుతో సంబంధం లేకుండా తక్కువ నీరు తాగితే అది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ప్రతి మనిషి ప్రతి రోజూ వ్యాయామం చేయడం ఇంకా ముఖ్యం. 30 నిమిషాల వ్యాయామం చేసి సుమారు 350 ml నీరు తాగితే ఎలాంటి బరువు అయినా తగ్గించుకోవచ్చు.

Success Story: ఒక్క వార్త చూసి కోటీశ్వరుడైన కుర్రోడు.. ఏటా కోట్లు సంపాదన.. సూపర్ సక్సెస్

Mahesh Asabe Story: ఒకప్పుడు దేశంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. అయితే ఇప్పుడు కొందరు యువ రైతులు చేస్తున్న ప్రయోగాలు వారిని కోటీశ్వరులుగా మార్చేస్తున్నాయి.
వ్యవసాయం ఒక పండుగ అన్నట్లుగా మారిపోయింది.

అలా వ్యవసాయంలో కరువుకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రకు చెందిన యువ రైతు అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన మహేశ్‌ అసాబేకు తక్కువగా నీరు లభించే డ్రై ల్యాండ్‌లో ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ పండిస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. వ్యవసాయంపై చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆసక్తి ఉన్న అసాబే షోలాపూర్‌లోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదివాడు. తర్వాత అదే విభాగంలో ఎంటెక్‌ పూర్తి చేశాడు.

అయితే వివిధ రకాల డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తూ తన విజయగాథతో కోట్లాది మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తక్కువ నీటి వినియోగంతో పండే డ్రాగన్ ఫ్రూట్ తమ ప్రాంతంలో అనుకూలమైన పండగా గుర్తించి మెుదట తమ కుటుంబానికి ఉన్న 3 ఎకరాల్లో మహేష్ అసబే 9,000 మెుక్కలను నాటాడు. అలా ఎకరాకు ఐదు టన్నుల పండ్లతో రూ.5 లక్షలు ఆదాయం పొందాడు. అయితే రెండో ఏడాది ఎకరాకు 10 టన్నుల దిగుబడి రావటంతో రూ.10 లక్షలు ఆదాయంగాపొందాడు. మంచి లాభాలు రావటంతో తర్వాత 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సాగును విస్తరించాడు.

అలా డ్రాగన్ ఫ్రూట్స్ పక్క రాష్ట్రాల్లోని పండ్ల వ్యాపారులకు ఎగుమతి చేస్తూ లాభాలను అందుకున్నాడు. ప్రస్తుతం మహేష్ అసబే 20 ఎకరాల్లో పలు రకాల డ్రాగన్ ఫ్రూట్‌లను సాగు చేస్తున్నాడు. దీంతో యువ రైతు ఏడాదికి రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ పోషకాలతో నిండినందున ప్రజలలో ఆదరణ పొందిందని, కాబట్టి దీనికి భవిష్యత్తు ఖచ్చితంగా ఉజ్వలంగా ఉంటుందని చెబుతున్నాడు. నీటి లభ్యత తక్కువగా ఉండే కరవు ప్రాంతాల్లోని రైతులు మహేష్‌ను అనుసరించవచ్చు.

Astro Tips: ఏ వారంలో ఏది దానం చేస్తే మేలు జరుగుతుందో తెలుసా? తప్పక తెలుసుకోండి..

Astro Tips: జ్యోతిషశాస్త్రంలో, వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక గ్రహం, దేవుళ్లకు అంకితం చేయడం జరిగింది. ప్రతి రోజు దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
ఆయా రోజుల్లో దానం చేయడం, ఉపవాసం ఉండటం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. హిందూ మతంలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇలా చేయడం పుణ్యం కలుగుతుందని నమ్మకం. ఒక వ్యక్తి దానం చేయడం చేయడం.. అతను మరణించిన తరువాత అతను చేసిన పనులు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. ఆ మంచి పనుల ప్రభావం ఆ వ్యక్తిపై ఉంటుంది. అందుకే.. ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని తప్పనిసరిగా దానం చేయాలని మత గ్రంధాల్లో పేర్కొనడం జరిగింది.

అయితే, దానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ రోజునైనా తెలిసి లేదా తెలియకుండా ఏదైనా చేస్తే.. దాని వలన మంచి ఫలితాలకు బదులుగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉప్పు, పంచదార, బట్టలు మొదలుకొని నగలు వరకు వివిధ వస్తువులను దానం చేయడానికి మత గ్రంధాలలో వారంలోని ఏడు రోజులు కేటాయించడం జరిగింది. దాని ప్రకారం దానం చేస్తే మేలు జరుగుతుంది. మరి ఏ వారంలో ఏ వస్తువులు దానం చేస్తే మేలు జరుగుతుందో ఓసారి చూద్దాం..

ఆదివారం..

ఆదివారం సూర్య భగవానుడికి సంబంధించిన రోజు. సూర్యభగవానున్ని గ్రహాలకు రాజు అంటారు. ఈ రోజున గోధుమలు, ఎర్రటి పువ్వులు, బెల్లం, రూబీ రత్నం మొదలైన వాటిని దానం చేయాలి. ఆదివారం రోజున ఈ వస్తువులను దానం చేయడం వలన కీర్తి, గౌరవాన్ని పొందుతారు.

సోమవారం..
హిందూ మతం ప్రకారం.. సోమవారం శివుడు, చంద్రుడికి నిర్దేశించడం జరిగింది. ఈ రోజున బియ్యం, తెల్లని దుస్తులు, తెల్లటి పువ్వులు, పంచదార, కొబ్బరి మొదలైన తెల్లని రంగు వస్తువులను దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. జాతకంలో చంద్రుడి బలం కూడా పెరుగుతుంది.

మంగళవారం..

హనుమంతుని ఆరాధనకు మంగళవారాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున చేసే దానం అంగారక గ్రహాన్ని బలపరుస్తుంది. మంగళవారం నాడు ఎర్రటి పూలు, ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, బాదం, రాగి పాత్రలు దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి.

బుధవారం..
గణేశుడిని బుధవారం పూజిస్తారు. ఈ రోజు బుధ గ్రహానికి సంబంధించినది. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయాలి. పేదలకు ఆకుపచ్చ పప్పు(పెసలు), పచ్చి కూరగాయలు, ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ దుస్తులు మొదలైనవి దానం చేయాలి.

గురువారం..

గురువారం శ్రీ మహా విష్ణువు, బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. సంపద, శ్రేయస్సు, కీర్తిని తెస్తుంది. పసుపు రంగులో ఉండే పప్పులు, పసుపు దుస్తులు, పసుపురంగు పువ్వులు, పసుపురంగులో ఉండే పండ్లు, బెల్లం, బంగారు వస్తువులను గురువారం దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల జాతకంలో గురు గ్రహం బలపడుతుంది.

శుక్రవారం..

శుక్రవారం లక్ష్మీ దేవత, శుక్రుడికి అంకితం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున దానం చేస్తే మేలు జరుగుతుంది. ఈ రోజున ఉప్పు, ఖీర్, వస్త్రాలు, కుంకుమపువ్వు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సంపద సిద్ధిస్తుంది.

శనివారం..

హిందూ మతంలో శనివారం శనిదేవునికి అంకితం చేయబడింది. శనిదేవుడికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ రోజున నలుపు రంగు వస్తువులను దానం చేయాలి. నల్లని వస్త్రాలు, ఇనుము, ఆవనూనె, నల్ల నువ్వులు, తోలు వస్తువులు దానం చేస్తే మేలు జరుగుతుంది.

AP News: వాలంటీర్లకు తాయిలాలు రెట్టింపు

నగదు పురస్కారాలు రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంపుఎన్నికల ముందు జగన్‌ ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ
ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు

ఈనాడు, అమరావతి: వాలంటీర్లకు ఎన్నికల ముందు మరింతగా తాయిలాలు ఎరవేసి వారితో పార్టీ పని చేయించుకునేందుకు జగన్‌ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ వేసింది.
ఏటా పురస్కారాల పేరుతో వారికి ఇస్తున్న తాయిలాల మొత్తాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేయబోతోంది. వాలంటీర్లంతా వైకాపా వారేనని ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పురస్కారాల కింద ఏటా ఇస్తున్న మొత్తాన్ని రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే ఆమోదం తెలియజేయనుంది. అవార్డుల ప్రదానోత్సవ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చినట్లు తెలుస్తోంది. సేవా వజ్ర అవార్డు కింద ఇచ్చే రూ.30 వేల నగదు పురస్కారాన్ని రూ.60 వేలకు పెంచనున్నారు. సేవారత్న పేరిట ఇచ్చే రూ.20 వేలు రూ.40వేలకు, సేవామిత్ర అవార్డు కింద ఇస్తున్న రూ.10 వేలు రూ.20 వేలకు పెరగనుంది. వాలంటీర్ల పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా నగదు పురస్కారాలు రెట్టింపు చేయాలనుకోవడం బరి తెగింపే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల్లో వీరి సేవలను మరింతగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తున్నాయి.

అధికారపార్టీని అభిమానించే వారికి ప్రజాధనమా?

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసే పేరుతో జగన్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షలకుపైగా గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది. ఒక్కో వాలంటీర్‌కు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. ‘వాలంటీర్లు ఎవరో కాదు…మన పార్టీని అభిమానించే…మనలో నుంచి వచ్చిన మనవారే’ అని సీఎం జగన్‌ ఇటీవల బాహాటంగానే ప్రకటించారు. వాలంటీర్లు వైకాపా కోసం పని చేస్తున్న కార్యకర్తలని మంత్రి అంబటి రాంబాబు స్వయంగా చెప్పారు. వీరికి ఇస్తున్న గౌరవ వేతనానికి అదనంగా ప్రభుత్వం ఏటా అవార్డులిస్తోంది. నియోజకవర్గానికి అయిదుగురు చొప్పున 875 మందిని సేవా వజ్ర అవార్డుకు ఎంపిక చేస్తోంది. ప్రతి మండలం, మున్సిపాల్టీ నుంచి అయిదుగురు చొప్పున, నగరపాలక సంస్థ నుంచి 10 మంది చొప్పున మొత్తంగా 4,220 మందికి సేవా రత్న అవార్డు, మిగిలిన వారికి సేవా మిత్ర అవార్డులిస్తోంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట వాలంటీర్లను మెప్పించి, పార్టీకి అనుకూలంగా పనిచేయించుకోవడానికి నగదు పురస్కారం రెట్టింపుచేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.

Whatsapp: వాట్సాప్‌లో మీరు మెసేజ్‌ చూసినట్లు తెలియకూడదా.? ఇందుకోసం ఓ ట్రిక్‌ ఉంది.

ప్రతీఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ కచ్చితంగా ఉండాల్సిందే. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండడం, ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న కారణంగానే వాట్సాప్‌కు కోట్లాది మందిలో యూజర్లు ఉన్నారు.
ఎన్నో కొంగొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్‌లో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన ట్రిక్స్‌ ఉన్నాయని మీకు తెలుసా.? ఇలాంటి ఆసక్తికరమైన ట్రిక్స్‌లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను చూస్తే వెంటనే అవతలి వ్యక్తికి మనం మెసేజ్‌ చూసినట్లు తెలుపుతూ బ్లూ టిక్స్‌ వస్తాయి. అయితే అలా బ్లూ టిక్స్‌ రాకుండా ఉండాలంటే ‘రీడ్‌ రిసిపింట్స్‌’ను ఆఫ్‌ చేసుకుంటే సరిపోతుందని తెలిసిందే.

ఇలా చేస్తే మీ స్టేటస్‌ ఎవరు చూశారో తెలియదు, అలాగే మీరు మెసేజ్‌ చేసినట్లు ఎదుటి వ్యక్తులు చూశారో కూడా తెలియదు. అందుకే ఒక ట్రిక్‌ అందుబాటులో ఉంది.

ఇందుకోసం ముందుగా మీకు వాట్సాప్‌లో మెసేజ్‌ రాగానే ఓపెన్‌ చేసేకంటే ముందే, ఫ్లైట్‌ మోడ్‌ ఆన్‌ చేయాలి. అనంతరం మెసేజ్‌ను ఓపెన్ చేసి చదివి, సదరు మెసేజ్‌ విండో నుంచి బయటకు రావాలి. అనంతరం ఫ్లైట్ మోడ్‌ తీసేస్తే సరిపోతుంది. మీరు మెసేజ్‌ చదివినట్లు ఎదుటి వ్యక్తికి తెలియదు.

Free Sewing Machine Scheme 2024: Online Apply india.gov.in – ఉచితంగా కుట్టుమిషన్, పెట్టుబడికి రూ.20వేలు .. ఇలా అప్లై చేసుకోండి

Free Sewing Machine Scheme 2024: Online Apply india.gov.in
– ఉచితంగా కుట్టుమిషన్, పెట్టుబడికి రూ.20వేలు .. ఇలా అప్లై చేసుకోండి

Free Sewing Machine : మీకు ‘ఉచిత కుట్టు మిషన్ పథకం’ గురించి తెలుసా ? ఈ పథకాన్ని ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది.
ఈ పథకం ద్వారా కుట్టుమిషన్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీమ్ ద్వారా కుట్టు మిషన్‌ కొనేందుకు కేంద్రం రూ.15,000 ఇస్తుంది. ఈ డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తుంది. ఆ డబ్బుతో మీరు కుట్టు మిషన్ కొనాలి. దీనికితోడు కేంద్రం అదనంగా రూ.20 వేల వరకు రుణం కూడా ఇస్తుంది. ఈ డబ్బుతో కుట్టు మిషన్ షాపును పెట్టుకోవచ్చు. మహిళలే కాదు పురుషులు కూడా ఈ పథకం(Free Sewing Machine) కోసం అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి. ఉచిత కుట్టు యంత్రం పథకం దరఖాస్తుదారు అన్ని ముఖ్యమైన పత్రాలనూ కలిగి ఉండటం అవసరం. ఈ పథకం కోసం అప్లై చేసుకునేవారు ఆధార్ కార్డు, చిరునామా రుజువు, గుర్తింపు కార్డు, కుల ధృవీకరణ పత్రం, పాస్ పోర్టు సైజు ఫొటో, మొబైల్ నంబర్, బ్యాంకు పాస్ బుక్ కలిగి ఉండాలి. దీన్ని అప్లై చేయడానికి తొలుత అధికారిక వెబ్‌సైట్ https://pmvishwakarma.gov.in లోకి లాగిన్ కావాలి. వివరాలన్నీ నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో కుదరదు అనుకుంటే దగ్గర్లోని CSC కేంద్రానికి వెళ్లి అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి అవసరమైన పత్రాలన్నీ మీ దగ్గర ఉంచుకోవాలి. దరఖాస్తు చేశాక.. మీకు ఒక రసీదు వస్తుంది. ఆ రసీదును మీ దగ్గర ఉంచుకోవాలి. ఏప్రిల్‌లో మీరు కుట్టు మిషన్ పొందేందుకు డబ్బు వస్తుంది. తద్వారా మీరు కుట్టు మిషన్ కొనుక్కోవచ్చు.

AP SET 2024: ఏపీ సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఫిబ్రవరి 14 నుంచి ఆన్‌లైన్‌ అప్లికేషన్లు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌)-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఏడాది కూడా ఆంధ్రా యూనివర్సిటీ సెట్‌ పరీక్షను నిర్వహిస్తోంది.
రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు ప్రతీయేట రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఆంధ్రా యూనివర్సిటీ చూస్తోంది. జనరల్‌ స్టడీస్‌తోపాటు 30 సబ్జెక్టుల్లో ఏపీ సెట్‌ పరీక్ష నిర్వహిస్తారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి అంటూ ఏమీ ఉండదు.

పరీక్ష విధానం..

పేపర్‌ 1 పరీక్ష జనరల్ పేపర్‌కి ఉంటుంది. టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ అంశాల నుంచి ఈ పేపర్‌లో ప్రశ్నలు అడుగుతారు.
పేపర్‌ 2 పరీక్ష సంబంధిత స్పెషలైజేషన్‌లో ఉంటుంది. ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్- అట్మాస్పియరిక్‌- ఓషన్ అండ్‌ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.. ఇలా మొత్తం 30 సబ్జెక్టులకు పరీక్ష ఉంటుంది.
పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. ఒకటే రోజున రెండు పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. మూడు గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి చెందిన అభ్యర్ధులు రూ.1200, బీసీ కేటగిరీకి చెందిన వారు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ట్రాన్స్‌జెండర్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.700ల చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీల వివరాలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 14, 2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 06, 2024.
ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌)-2024 పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 28, 2024.

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

వివరాల కోసం క్లిక్‌ చేయండి.

NDA Recruitment: పది,ఇంటర్ అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉద్యోగాలు..రూ.63వేల జీతం

NDA Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA). భారత సాయుధ దళాల జాయింట్ డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అయిన ఈ సంస్థ..
తాజాగా పదో తరగతి, ఇంటర్ అర్హతతో గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు NDA అధికారిక పోర్టల్ nda.nic.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, ఈ గడువు ఫిబ్రవరి 16తో ముగుస్తుంది.

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్‌కు ట్రైనింగ్ ఇస్తారు. మహారాష్ట్ర పూణేలోని ఖడక్ వాస్లాలో ఇది ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై-సర్వీస్ అకాడమీగా ఇది గుర్తింపు పొందింది. ఈ సంస్థ తాజా రిక్రూట్‌మెంట్‌లో భాగంగా లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మన్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి పోస్టులు కలిపి మొత్తంగా 198 ఖాళీలను భర్తీ చేయనుంది.
* ఖాళీల వివరాలు

లోయర్ డివిజన్ క్లర్క్- 16 పోస్టులు, స్టెనోగ్రాఫర్ GDE-II-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-2, సినిమా ప్రొజెక్షనిస్ట్ II-1, కుక్-14 పోస్టులు భర్తీ కానున్నాయి. కంపోజిటర్-కమ్-ఫ్రింటర్- 1, సివిల్ మోటార్ డ్రైవర్(OG)- 3, కార్పెంటర్- 2, ఫైర్‌మెన్- 2, టీఏ బేకర్ అండ్ కన్ఫెక్షనర్-1, టీఏ సైకిల్ రిపేరర్-2, టీఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్-1, టీఏ బూట్ రిపేరర్-1, ఎంటీఎస్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్-151 పోస్టులు భర్తీ అవుతాయి.

* వయోపరిమితి

NDA గ్రూప్-C రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి పాసై ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్ అర్హతగా ఉంటుంది.

* ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదట ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. రెండో దశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. రెండిటీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు పోస్టింగ్ లభిస్తుంది.

* అప్లికేషన్ ఫీజు

దరఖాస్తుదారులు NDA గ్రూప్-C రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

* అప్లికేషన్ ప్రాసెస్
– ముందుగా NDA అధికారిక పోర్టల్ nda.nic.in ఓపెన్ చేయాలి.

– హోమ్‌పేజీలోకి వెళ్లి, కిందికి స్క్రోల్ చేస్తూ ‘న్యూస్ అండ్ ఈవెంట్స్’ అనే సెక్షన్‌లో NDA గ్రూప్-C రిక్రూట్‌మెంట్-2024 అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

– ఆ తరువాత ‘అప్లైనౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి. ముందుగా పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

– రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ యాక్సెస్ చేయాలి. దీంట్లో అన్ని వివరాలను ఎంటర్ చేయాలి.

– అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి.
* జీతభత్యాలు

NDA గ్రూప్-C రిక్రూట్‌మెంట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.18,000 నుంచి రూ. 63,200 మధ్య లభిస్తుంది.

ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఈపీఎఫ్‌ వడ్డీ రేటు పెంపు..

పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరానిగాను పీఎఫ్‌పై (EPFO) వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. ఈమేరకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ కేంద్ర ట్రస్టీల బోర్డు (CBT) నిర్ణయం తీసుకున్నది.
వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించవచ్చనే వార్తలు వచ్చాయి. అయితే 8.25 శాతంగా ఖరారు చేసినట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇది 8.15 శాతంగా ఉంటే, అంతకుముందు ఆర్థిక ఏడాది (2021-22) 8.10 శాతంగానే ఉన్నది. దీంతో గత మూడేండ్లలో ఇదే అత్యధిక వడ్డీ రేటుగా నిలిచింది.

కాగా, స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులను పెంచేందుకు బోర్డు నుంచి ఈపీఎఫ్‌వో అనుమతుల్ని కోరే వీలున్నది. ప్రస్తుతం 10 శాతంగా ఉన్న పెట్టుబడుల పరిమితిని 15 శాతానికి పెంచాలన్నది ఈపీఎఫ్‌వో యోచన. దీనివల్ల పీఎఫ్‌ సొమ్ముపై మరింత రాబడులు అందుకోవచ్చంటున్నది. దీనిపై ట్రస్టీలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. ఈపీఎఫ్‌వోలో 6 కోట్లకుపైగా సభ్యులున్నారు.

ఏపీలో దారుణం..అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపిన భార్య, ప్రియుడు!

ఏపీలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపారు భార్య, ప్రియుడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపింది ఓ భార్య. దీనికి అమె ప్రియుడు, సొంత తండ్రి సహాయం చేశారు.

a wife attachs her husband with lover

తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని శ్రీనివాసులను హత్య చేసిన భార్య గీతమ్మ, ఆమె ప్రియుడు ప్రసాద్, తండ్రి రామస్వామిని ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. అటు శ్రీనివాసులు మృతదేహం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని తండ్రి రామస్వామి సహాయంతో పూడ్చి పెట్టారు నిందితులు.

బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు….విచారణలో గీతమ్మ, ఆమె ప్రియుడు ప్రసాద్, తండ్రి రామస్వామిని అరెస్ట్ చేశారు. నిందితుల ముగ్గురిని అరెస్టు చేసి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహణ చేశారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Free Aadhaar Update Deadline: ఆధార్‌ కార్డ్‌ దారులకు ముఖ్యగమనిక.. త్వరలో ముగియనున్న డెడ్‌లైన్‌!

ఆధార్‌ కార్డ్‌ దారులకు ముఖ్య గమనిక. ఆధార్‌లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఉచితంగా చేసుకునేందుకు కేంద్రం గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు ఈ ఏడాది మార్చి 14తో ముగియనుంది.
ఈ తేదీలోపే ఏమైనా మార్పులు చేసుకోవాలని ఆధార్‌ ప్రతినిధులు కోరుతున్నారు.

2023 డిసెంబర్‌లో మూడు నెలల పాటు పొడిగించబడిన ఉచిత ఆధార్ అప్‌డేట్ మార్చి 14, 2024కి ముగియనుంది. ఈ గడువు గతంలో చాలాసార్లు పొడిగించింది కేంద్రం. మార్చి 14 తర్వాత ఈ గడువు పొడిగిస్తుందా?లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు: మార్చి 14, 2024 (ఇది చివరి పొడిగింపు)

ఎవరు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు: ఇప్పటికే తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయని వారు ఎవరైనా

ఏ వివరాల్ని ఆధార్‌లో ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చు: పేరు, చిరునామా,మొబైల్ నంబర్ వంటి జనాభా వివరాలు (బయోమెట్రిక్ అప్‌డేట్‌లకు ఇప్పటికీ ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం అవసరం)

మార్చి 14 తర్వాత ఏం జరుగుతుంది: ఆధార్ అప్‌డేట్‌ల కోసం కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

మీ ఆధార్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా ఎలా అప్‌డేట్ చేసుకోవాలంటే

♦ ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://myaadhaar.uidai.gov.in/

♦ మీ ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయండి.

♦ ‘సెండ్‌ ఓటీపీ’ ఆప్షన్‌ మీద క్లిక్ చేసి మీ నమోదిత మొబైల్ నంబర్‌కు పంపిన కోడ్‌ను ఎంటర్‌ చేయండి

♦ అనంతరం అప్‌డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆప్షన్‌పై ట్యాప్‌ చేయండి.
♦ ఇక్కడే మీరు ఆధార్‌లో ఏం మార్పులు చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. సంబంధిత కాలమ్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

♦ అవసరమైన మార్పులను చేయండి, ఇందుకోసం అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

♦ సంబంధిత వివరాలను నమోదు చేసి రిక్వెస్ట్‌పై క్లిక్‌ చేయండి.

YSR Cheyutha Scheme : జగన్ గుడ్ న్యూస్..ఈ నెల16న YSR చేయూత పథకం నిధులు

YSR Cheyutha Scheme : సీఎం జగన్ గుడ్ న్యూస్..చెప్పారు. YSR చేయూత పథకం డబ్బులను చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 16న జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు
ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం రూ. 18,750 జమచేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలకు చెందిన…. 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులు. కాపులు, ఓసీలు అర్హులు కాదు.

Pooja Room Tips: పూజ గదిలో ఎక్కువగా అగర్బత్తులు వెలిగిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

Pooja Room Tips: పూజ చేయాలంటే కచ్చితంగా ధూప దీప నైవేద్యం పెట్టాల్సిందే. ఇవి లేకుండా ఏ ఇంట్లో కూడా పూజ పూర్తి అవదు. ఈ పూజా కార్యక్రమంలో అగర్బత్తీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.
దీనికోసం ప్రతి ఇంట్లో వీటి పొగను పీలుస్తుంటారు. అయితే ఇవే కాదు దోమల కోసం కూడా అగర్బత్తీలు వాడుతున్నారు. మరి ఇంతకీ ఈ అగర్బత్తీలు వాడడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసా? వీటి వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో తెలుసుకోండి..

అగరబత్తీలు అందరి జీవితంలో ఒక భాగం. వీటి నుంచి వచ్చే పరిమళమైన సువాసన మనలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. అంతేకాదు మనం ఉంటున్న ప్రదేశంలో మంచి జరిగేలా ప్రేరేపిస్తుంది. ఇదంతా వింటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. కానీ వీటి వల్ల చెడు జరుగుతుంది అనేది కూడా అంతే నిజం అంటున్నారు కొందరు. అగర్బత్తుల వల్ల సమస్య రాదు కానీ వాటి నుంచి వచ్చే పొగ వల్ల సమస్య వస్తుందట. అయితే ప్రపంచం ఇప్పటికే పొగతో నిండిపోయి ఉంది. స్వచ్ఛమైన గాలి కరువైంది, కాలుష్యం ఎక్కువైపోయింది. మన పూర్వీకులు కాలుష్యరహిత పర్యావరణంలో జీవించారు. కానీ మనం మాత్రం కలుషితమైన గాలిని పీలుస్తున్నాం. ఇలాంటి సమయంలో అగర్భత్తులు వెలిగించి మన చుట్టూ ఉన్న పొగను పెంచడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు వైద్యులు..

పరిశోధకులు ఇదే విషయంపై పరిశోధనలు చేసి ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. అదేంటంటే అగరబత్తులు మనకు హానీ చేస్తాయని చెబుతున్నారు. ఇంతకీ వీటి వల్ల ఎలా హానీ జరగుతుంది. ఆరోగ్యాన్ని ఎలా ప్రభావం చేస్తాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అగర్బత్తులు ఎక్కువగా వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోస సంబంధ సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. దగ్గు, ఆస్తమా, ఎలర్జీలు, తలనొప్పి లాంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. రసాయనాలు ఉపయోగించి వీటిని తయారు చేస్తారట. ఫలితంగా కార్బన్ మోనాక్సైడ్ లాంటి ప్రమాదకర వాయువులు వెలువుడుతున్నాయని పేర్కొన్నారు. వాటిని పీల్చడం వల్ల అనారోగ్యపాలవుతారని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు.

నిరుద్యోగులకు శుభవార్త..ONGCలో జూనియర్ కన్సల్టెంట్స్ పోస్టులు,నెలకు రూ.70వేల జీతం

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)లో జూనియర్ కన్సల్టెంట్స్/అసోసియేట్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

నిరుద్యోగులకు శుభవార్త. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)లో జూనియర్ కన్సల్టెంట్స్/అసోసియేట్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకుంటే ONGC అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ప్రకారం..మొత్తం 12 పోస్ట్‌ల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ ఉంటుంది. డ్రిల్లింగ్ ఫీల్డ్ ఆపరేషన్స్‌లో కనీసం 05 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు కింద ఇవ్వబడిన అన్ని ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా చదవండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఎవరైనా అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి.

వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు.

ఎంపిక ఇలా జరుగుతుంది

అభ్యర్థులు రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

అప్లికేషన్ లింక్,నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి

ONGC Recruitment 2024 అప్లయ్ చేయడానికి లింక్

ONGC Recruitment 2024 నోటిఫికేషన్
ఇతర సమాచారం

అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను నింపి సంబంధిత పత్రాలతో పాటు డ్రిల్లింగ్ సర్వీసెస్, రూమ్ నెం. 40, 2వ అంతస్తు, KDM భవన్, మెహసానా అసెట్‌కి పంపాలి.

NHAIలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు..నెలకు రూ. 39000 కంటే ఎక్కువ జీతం

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు NHAI nhai.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 15,2024. అప్లయ్ చేయడానికి ముందు పోస్టుల వివరాలు,అర్హత,జీతం,ఎంపిక ప్రక్రియ,వయోపరిమితి,తదితర విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 60 డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. మీరు కూడా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకుంటే, అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.

అర్హత

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉండాలి.

వయోపరిమితి

అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి

NHAI Recruitment 2024 నోటిఫికేషన్

NHAI Recruitment 2024 అప్లయ్ చేయడానికి లింక్

IPhone13పై బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే ఐఫోన్ ని సొంతం చేసుకోండిలా?

IPhone13:మామూలుగా స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎక్కువ శాతం ఇష్టపడే బ్రాండ్ ఐఫోన్. ఈ ఐఫోన్ ని ఒక్కసారైనా వినియోగించాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ఐఫోన్ ధరల కారణంగా చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇంకొంతమంది కనీసం సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినా కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇంకొందరు పాత ఐఫోన్ ని అయినా వాడాలని చాలామంది అనుకుంటారు. ఇకపోతే ప్రస్తుతం లేటెస్ట్ ఐఫోన్ 15 సిరీస్ మోడళ్లు గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇవి లాంచ్ అయిన తర్వాత, పాత సిరీస్ ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే.ఇంకా తగ్గుతూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓల్డ్ ఐఫోన్ 13(IPhone13) పై అమెజాన్ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పుడు ఈ డివైజ్‌పై 12 శాతం డిస్కౌంట్‌ ఉంది. మరి ఆ ఆఫర్ల విషయానికి వస్తే.ఐఫోన్ 13, బడ్జెట్ ఫ్రెండ్లీ యాపిల్ డివైజ్‌గా సక్సెస్ అయింది. కాగా ఈ ఫోన్ మనకు బ్లూ, పింక్, మిడ్‌నైట్, స్టార్‌లైట్, గ్రీన్, ప్రొడక్ట్ రెడ్‌ కలర్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ డివైజ్‌ అమెజాన్‌ లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఐఫోన్ 13,128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.59,900 కాగా, ప్రస్తుతం ఇ-కామర్స్ దిగ్గజం దీన్ని 12 శాతం డిస్కౌంట్‌తో రూ. 52,999కి అందిస్తోంది.అంటే ఈ ఫోన్ పై మనకు 6,000 వరకు డిస్కౌంట్ ని పొందవచ్చు.
అలాగే ఈ ఫోన్‌ పై అమెజాన్ మంచి ట్రేడ్ ఇన్ ఆఫర్‌ కూడా అందిస్తోంది. కస్టమర్లు మంచి వర్కింగ్ కండిషన్‌ లో ఉన్న బ్రాండెడ్ ఫోన్‌ ను ఎక్స్‌ఛేంజ్ చేసుకువడం ద్వారా అదనంగా రూ.27,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ట్రేడ్ ఇన్ విలువ పాత స్మార్ట్‌ ఫోన్ మోడల్, కండిషన్‌ పై ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఐఫోన్ 13 ఫీచర్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 13, నెక్స్ట్ జనరేషన్ మోడల్ ఐఫోన్ 14 లాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లతోనే వస్తుంది. దీంట్లో A15 బయోనిక్ చిప్‌సెట్ ఉంటుంది. ఇది మంచి పనితీరుకు భరోసా ఇచ్చే ప్రాసెసర్. అలాగే ఇందులో డిస్‌ ప్లే కెమెరాలు కూడా రెండు సిరీస్‌ల్లో దాదాపు ఒకేలా ఉంటాయి. ఐఫోన్ 13 బ్యాటరీ బ్యాకప్ సైతం బాగుంటుంది.

AP NEWS: మరోసారి ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం.. కారణమిదే..?

తిరుపతిలో ఉన్న హథీరాం బాబా భూములపై శుక్రవారం నాడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది.
తిరుపతి: తిరుపతిలో ఉన్న హథీరాం బాబా భూములపై శుక్రవారం నాడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.కోట్లు విలువ చేసే మఠం భూముల అమ్మకాలపై సుప్రీం స్టేటస్ కో తెచ్చింది. మఠం భూములను కాపాడలేమని ఏపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. మఠం భూములను లీజుకు తీసుకున్న వారే… కొనుగోలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం వీలు కల్పించింది.
భూముల అమ్మకాన్ని సమర్థిస్తూ గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.అయితే హైకోర్టు తీర్పును సుప్రీంలో మఠం నిర్వాహకులు సవాల్‌ చేశారు. జస్టిస్ MM సుందరేశ్, జస్టిస్ SVN భట్టిల ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. కాగా మఠం భూములు అన్యాక్రాంతంపై ధర్మాసనం ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మఠం తరపున న్యాయవాది శ్రావణ్ కుమార్ పిటీషన్ వేశారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది.

చంద్రబాబుకు భారీ ఊరట-గవర్నర్ అనుమతిపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఓ ఎత్తు. కానీ ప్రభుత్వం దూకుడుగా విపక్షాలపై తీసుకునే నిర్ణయాలు మరో ఎత్తుగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ ఓ కీలక కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబుపై నమోదైన కేసుల విషయంలో అరెస్టును సమర్ధిస్తూ రిమాండ్ కు సైతం పంపిన కోర్టు.. ఇవాళ మాత్రం దానికి భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు తర్వాత సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. వీటిలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కూడా ఒకటి. ఈ కేసులో చంద్రబాబుత పాటు మాజీ మంత్రి నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్ వంటి వారిని నిందితులుగా చేర్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం అలైన్ మెంట్ లో అక్రమాల ద్వారా వీరంతా లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఏసీబీ కోర్టులో ఇవాళ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు.. సెక్షన్ 19ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేనిదే సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు వీల్లేదని తేల్చిసింది. ఈ మేరకు సీఐడీ ఛార్జిషీట్ ను తిరస్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబుతో పాటు నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఎన్నికల వేళ ఊరట లభించినట్లయింది.

Health

సినిమా