ఎవరైనా వివాహ వార్షికోత్సవాన్ని అందంగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అందరి సమక్షంలో వేడుకను జరుపుకుంటారు. కానీ ఈ జంట వినూత్న రీతిలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలోని నాగ్లా కాలీ ప్రాంతంలో రోడ్డుపై మురికి కాలువ, చెత్తాచెదారం మధ్య ఓ జంట వధూవరుల వేషధారణలో తమ 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అపరిశుభ్రత, చెత్త కుప్పల వైపు జిల్లా యంత్రాంగం దృష్టిని ఆకర్షించేందుకు దంపతులు ఇలా చేశామని తెలిపారు. దంపతులు ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నట్లు కనిపిస్తుండగా, కొంతమంది తమ చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. ప్లకార్డులపై ‘రోడ్లు, డ్రైన్లు సక్రమంగా నిర్మించకుంటే ఓటు వేయరు’ అని రాశారు.
15 ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతోందని వారు చెబుతున్నారు. గత ఎనిమిది నెలలుగా రోడ్డు మురికి కాలువగా, అధ్వానంగా తయారైందని అంటున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు బయటకు వెళ్లడం కష్టంగా మారింది. దాదాపు 30కి పైగా కాలనీల ప్రజలు ఈ రహదారి గుండా వెళుతుంటారు. అపరిశుభ్రత కారణంగా స్థానిక ప్రజలు ప్రస్తుతం రెండు కిలోమీటర్ల మేర వేరే దారిలో రావాల్సి వస్తోందని అంటున్నారు. ఆ ప్రాంతంలోని కాలనీల్లో ‘అభివృద్ధి లేదు, ఓటు లేదు’ అనే పోస్టర్లు కూడా అతికించినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోతున్నారు.
ఈ సమస్యలపై ప్రజాప్రతినిధులకు స్థానికులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్ల.. భగవాన్ శర్మ తన భార్య ఉమా శర్మతో కలిసి ఈ నిరసనను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా.. భగవాన్ శర్మ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులందరి వద్దకు వెళ్లాం. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ విధంగా నిరసనకు దిగాల్సి వచ్చింది. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేసేందుకే నిరసన తెలియజేస్తున్నట్లు ఉమా శర్మ తెలిపారు.
#Agar एक शादीशुदा जोड़े ने अजीबो गरीब तरीके से विरोध जताया है. दोनों ने शादी की 17वीं सालगिरह गंदे बदबूदार नाल के पानी से लवालव सड़क के बीच में मनाया है. दोनों पति-पत्नी दुल्हन और दूल्हा बनकर पहुंचे और वरमाल भी डाली गई . यहां से विधायक बेबी रानी मौर्य है @babyranimaurya#Agrapic.twitter.com/7rP7Cf9ysp
— Journalist Harikant sharma (@harikantsharmaG) February 4, 2024
డాన్స్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. వచ్చినా రాకపోయినా.. మూమెంట్‌కి తగ్గట్టుగా ఏదో ఒక స్టెప్ వేస్తారు. కానీ చాలా మందికి నలుగురిలో చేయడానికి చాలా సిగ్గు.
కేవలం ఇంట్లో లేదంటే బాత్రూమ్‌లో చేస్తూ ఉంటారు. కొంత మందికి మాత్రం డ్యాన్సే వృత్తి. ఇంకొంత మంది మాత్రం ఎంజాయ్ చేసేందుకు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కానీ డ్యాన్స్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ విషయం మాత్రం ఎవరికీ తెలీదు. డ్యాన్స్ చేయడం వల్ల బరువు తగ్గుతారని చాలా మంది అంటున్నారు. మరి ఇది నిజంగానే నిజమేనా.. డ్యాన్స్ చేయడం వల్ల బరువు తగ్గుతారా.
డ్యాన్స్ అనేది శారీరక శ్రమ అనే చెప్పాలి. డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలూ కదులుతాయి. ఇది కూడా ఫిట్ నెస్ వ్యాయామాల్లో భాగంగా చెప్తారు. డ్యాన్స్ చేయడం వల్ల ఒత్తిడి కూడా దూరం అవుతుంది. డ్యాన్స్ చేస్తున్నంత సేపూ మానసికంగా ఆనందంగా ఉంటుంది. రెగ్యులర్‌గా డ్యాన్స్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఒత్తిడి దూరం అవుతుంది:
డ్యాన్స్ చేయడం వల్ల ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన వంటి వాటి నుంచి రిలీఫ్ నెస్ పొందుతారు. భయం అనేది కూడా తగ్గుతుంది. ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఉదయం మీ మూడ్ ఫ్రెష్‌గా ఉండాలంటే డ్యాన్స్‌తో మీ రోజును ఆరంభించండి.
వెయిట్ లాస్:
ప్రతి రోజూ క్రమం తప్పకుండా డ్యాన్స్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే ఇది కూడా ఒక లాంటి వ్యాయామమే. డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలూ కదులుతాయి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం క్రమం తప్పకుండా డ్యాన్స్ చేయండి. డ్యాన్స్ చేయడం వల్ల క్యాలరీలు అన్నీ బర్న్ అవుతాయి. బెల్లీ ఫ్యాట్స్ కూడా కరుగుతుంది. అదే విధంగా డ్యాన్స్ చేయడం వల్ల కండరాలు అనేవి బలంగా తయారవుతాయి.
గుండె ఆరోగ్యం:
డాన్స్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. డ్యాన్స్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లేకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ప్రచురించబడింది. ప్రత్యేకంగా, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు నేరుగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో అంటే పోస్ట్ ఆఫీస్‌లో పనిచేసే అవకాశం ఉంది.
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం మీరు దేశంలోని ఏ మూలన ఉండి కూడా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాల్సి ఉంటుంది.
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను దాదాపు 30040 పోస్టులకు పోస్ట్ ఆఫీస్ అమలు చేయబోతోంది. ఆశావహులు ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం ఎలాంటి సమయాన్ని వృథా చేయకుండా సిద్ధం చేయడం ప్రారంభించాలి. ఇండియా పోస్ట్ జూలై 2024 పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం గ్రామీణ డాక్ సేవక్ GDS కోసం ప్రకటన విడుదల చేసింది. ఔత్సాహికులకు ఇదో గొప్ప అవకాశం.
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ గురించి మరింత సమాచారం వెబ్‌సైట్‌లో సులభంగా కనుగొనవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు వయస్సు షరతు కూడా వర్తిస్తుంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఘనమైన జీతం కూడా లభిస్తుంది. ప్రచురించిన ప్రకటనలో కూడా మీరు మొత్తం సమాచారాన్ని సులభంగా పొందుతారు.
గత కొన్ని రోజులుగా వివిధ పోస్టుల భర్తీకి పోస్టాఫీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. నేరుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం ఉంది. కొన్ని రిక్రూట్‌మెంట్ ప్రక్రియలలో, అభ్యర్థులు నేరుగా ఎంపిక చేయబడతారు. అభ్యర్థులు ఎలాంటి పరీక్ష లేదా ఇంటర్వ్యూల టెన్షన్‌ను కలిగి ఉండరు.
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నప్పుడు అక్కడ అడిగిన మొత్తం సమాచారాన్ని సరిగ్గా పూరించాలని గుర్తుంచుకోండి. మీరు నింపిన సమాచారం అసంపూర్ణంగా ఉంటే మీ దరఖాస్తు అంగీకరించబడదు. అందువల్ల, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు ముందుగా, మొత్తం పత్రాన్ని సరిగ్గా చదవండి.
How To Book Bharat Rice Online: దేశంలో సన్నబియ్యానికే డిమాండ్ ఎక్కువ. అందుకే ఆ బియ్యం ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. కిలో బియ్యం 50 రూపాయలు దాటేసింది.
దాంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో సరికొత్త పధకాన్ని ప్రారంభించింది.
కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రైస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పధకం కింద నాణ్యమైన సన్న బియ్యాన్ని కిలో 29 రూపాయలకే అందించనున్నారు. దేశీయ మార్కెట్‌లో సన్న బియ్యం సహా నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారత్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టొమాటో విక్రయించిన కేంద్ర ప్రభుత్వ భారత్ ఆటాను గత ఏడాది నవంబర్ 6 నుంచి మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. బయటి మార్కెట్‌లో కిలో ఆటా 35 రూపాయలుంటే..కేంద్ర ప్రభుత్వం 27.50 రూపాయలకే ఇస్తోంది. ఇప్పుడు తాజాగా భారత్ రైస్ పేరుతో సన్న బియ్యం విక్రయాలు ప్రారంభించింది.
భారత్ రైస్ ఎక్కడ దొరుకుతుంది (How To Book Bharat Rice Online)
భారత్ రైస్ ఇవాళ్టి నుంచి ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్ సహా అన్ని చైన్ రిటైల్స్‌లో లభించనుంది. కిలో 29 రూపాయలకు లభించే ఈ బియ్యం 5,10 కిలోల ప్యాక్‌తో లభిస్తుంది. మొదటి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య అంటే నాఫెడ్, రెండవది జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య అంటే ఎన్‌సీసీఎఫ్‌లలో లభించనుంది. బహిరంగ మార్కెట్‌లో అప్పుడే లభించకపోవచ్చు. లేదా నాఫెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nafedbazar.com/product-tag/online-shopping ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో పప్పులు, చక్కెర, గోధుమ పిండి, ఉల్లిపాయలు, టొమాటో కూడా అందుబాటులో ఉంటాయి.
నాఫెడ్‌లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత మీ చిరునామా ఇతర వివరాలు నమోదు చేసి అప్పుడు ఆర్డర్ చేసుకోవాలి.
Live bridge,Jenbatan Akar bridge,జీవమున్న వంతెన, జెంబతాన్ అకర్ వంతెన
ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?…
జీవమున్న వంతెన తెలుసా?వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం…దీన్ని చూడాలంటే ఇండోనేషియాకు వెళ్లాలి!
అదో వంతెన. ఏటికేడు పెరుగుతుంది. మరింత గట్టిపడుతుంది. ఎందుకంటే అది జీవమున్న వంతెన. అదే ఇండోనేసియాలో సమత్రా దీవిలో ఉన్న ఊడల వంతెన. ఈ ప్రకృతి వంతెన ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలంటే 123 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.
*ఈ వంతెన పేరు ‘జెంబతాన్ అకర్’. నదికి ఇరువైపులా రెండు మర్రి చెట్ల ఊడలు ఇలా వంతెనలా అల్లుకుపోయాయి. అయితే వాటంతట అవే అల్లుకుపోలేదు. ఒక మంచి ఉపాధ్యాయుడి వల్లే ఈ ఊడల వంతెన ఏర్పడింది.
* 1890లో ఈ ప్రాంతంలో పకిహ్ సోహన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు చెబుతుండేవారు.కొందరు విద్యార్థులు బాయాంగ్ నది దాటి అవతలి ఊరు నుంచి పాఠశాలకు వస్తుండేవారు. నది ప్రవాహం ఎక్కువున్నపుడు పిల్లలు పాఠశాలకు రాలేకపోయేవారు. దీంతో సోహన్‌కు ఒక ఉపాయం తట్టింది. నదికి ఇరువైపులా ఉన్న రెండు మర్రి చెట్ల ఊడలను కలిపేసి అల్లేశాడు. అలా ఆ ఊడలు ఏటికేడు పెరుగుతూ ఒకదానితో ఒకటి కలిసిపోయి గట్టిగా అల్లుకుపోయాయి. అలా 26 ఏళ్ల తర్వాత అందరూ నడవగలిగేలా ఈ ఊడల వంతెన తయారయ్యింది.
* ఈ ప్రకృతి వంతెన దాదాపు 82 అడుగుల పొడవుంది. ఇది 20 మంది బరువును కూడా తట్టుకోగలదు.
* వర్షాకాలంలో జారిపోకుండా ఈ ఊడల వంతెనకు గ్రామస్థులు స్టీలు తీగల వంటివి కట్టి మరింత గట్టిగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుని సులువుగా రాకపోకలు సాగించేస్తున్నారు.
* నదిపై ఈ వంతెన సుమారు 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ నదిని స్థానికులు పూజిస్తారు. అందుకే వంతెన చుట్టూ ఉన్న ప్రాంతాన్నంతా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ చేపలు పట్టడాన్ని కూడా నిషేధించారు.
* ఇన్నేళ్లు గడిచినా ఈ సహజమైన వంతెన ఊడలు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి. అందుకే దీన్నంతా ‘జీవించే వంతెన’ అని పిలుస్తారు.
* ఈ అద్భుతాన్ని చూడ్డానికి రోజూ వందలాది పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల సందడి పెరగడంతో దీనికి కొద్ది దూరంలో మరో వేలాడే వంతెనను నిర్మించారు.
ఇంతకీ దెయ్యాలు ఆ గుడిని ఎలా కట్టాయి.. ఎందుకు కట్టాయి.. ఎక్కడ కట్టాయి అనే విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే పదండి..
Intresting Facts about Lord Shiva temple in Bommavara Village karnakata built by Ghosts – దెయ్యాలు కట్టిన శివాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?
ఆ గుడి కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని బొమ్మవర అనే గ్రామంలో ఉంది. ఆ గుడి పేరు సుందరేశ్వరాలయం. అంటే శివుడి గుడి. ఆ గుడిలో ఉంటే శివలింగం ఎంతో అందంగా ఉంటుంది. అందుకే ఆ గుడికి సుందరేశ్వరాలయం అని పేరు.
బొమ్మవర గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు జనాలను భయపెట్టేవట. జనాలను ప్రశాంతంగా ఉండనివ్వకపోయేదట. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థం కాకపోయేదట. అదే ఊరికి చెందిన దెయ్యాల మాంత్రికుడు దెయ్యాలను తరిమికొట్టడానికి మంత్ర విద్యలను నేర్చుకున్నాడట. ఆ విద్యలతో దెయ్యాలను తరిమికొట్టాలని చూసినా ఆయనకు కుదరలేదట. దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకొని ఊరి ప్రజలందరి సహకారంతో గుడిని నిర్మించాడట ఆ మాంత్రికుడు.
ఆ ఊళ్లో శివాలయం నిర్మించడంతో తట్టుకోని ఆ దెయ్యాలు ఆ గుడిని ఓ రాత్రి నాశనం చేసేశాయి. దీంతో కోపోద్రికుడైన ఆ మాంత్రికుడు మరిన్ని మంత్రవిద్యలు నేర్చుకొని ఆ దెయ్యాలను మంత్రశక్తితో తన వశం చేసుకున్నాడు. వాటి జుట్టు కత్తిరించి తన దగ్గర బంధించాడు. దీంతో అవి బంధీ అయిపోయాయి. తమను విడిపించాలంటూ ఆ దెయ్యాలు ఆ మాంత్రికుడిని వేడుకున్నాయి. దీంతో పడగొట్టిన గుడిని మళ్లీ నిర్మించి.. ఊరి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ మాంత్రికుడు వాటికి చెప్పాడు. తప్పని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక.. రాత్రికి రాత్రే ఆ గుడిని అవి పునర్నిర్మించాయట.
అంతే కాదు.. ఆ గుడి మీద ఉండే బొమ్మలను చూసినా ఆ గుడిని దెయ్యాలే నిర్మించాయని తెలుస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఆ గుడి మీద అన్నీ దెయ్యం బొమ్మలే ఉంటాయట. గుడిని మళ్లీ నిర్మించిన ఆ దెయ్యాలు గుడిలో శివలింగాన్ని ప్రతిష్టించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాయట. దీంతో అప్పటి నుంచి ఆ గుడిలో శివలింగం లేకుండా.. అలాగే ఉండేదట.
తర్వాత 50 ఏళ్ల కింద ఆ ప్రాంతంలో మంచినీళ్ల కోసం ఓ బావిని తవ్వుతంటే పెద్ద శివలింగం బయట పడిందట. ఆ శివలింగాన్ని తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్టించారట. అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు. ఆ శివలింగం 8 అడుగుల ఎత్తు ఉందట. ఇక.. ఈ గుడిని దెయ్యాలు కట్టినప్పటికీ.. ఎలాగూ శివుడు భూతనాథుడు కాబట్టి.. ఆయనకు ఈ గుడిలో పూజలు చేస్తున్నారట అక్కడి స్థానికులు. ఆ శివలింగాన్ని అక్కడ ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఆ ప్రాంత వాసులకు అంతా మంచే జరిగిందట. అలా అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు చేయడం మొదలు పెట్టారు.
ముంబై, పూనెలకు మధ్య ఉన్న రైలు మార్గంలో కనిపించే ఒక చిన్న గ్రామం భివ్‌పురి. 1916లో ఇక్కడ నిర్మించిన సాయిబాబా ఆలయమే ప్రపంచంలోని మొట్టమొదటి బాబా గుడి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్తూ బాబాగారే అందించడం ఒక విశేషం అయితే, ఈ ఆలయాన్ని నిర్మించిన కేశవ్ రామచంద్ర ప్రధాన్ ఒక నాస్తికుడు కావడం మరో విశేషం. రామచంద్ర ప్రధాన్
భివ్‌పురి గ్రామానికి చెందిన రామచంద్ర ప్రధాన్ ఒక సాధారణ గుమాస్తా. ముంబైలో నివసించే ఒక పార్శీ వర్తకుని వద్ద అతను పనిచేసేవాడు. తన యజమాని ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడమే రామచంద్ర పని. అలా పని మీద రామచంద్ర మన్మాడ్, నాసిక్ వంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడు. రామచంద్రకి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితునికి బాబా మీద మహా గురి. రామచంద్ర షిరిడీకి దగ్గరగా వెళ్లినప్పుడల్లా, తనతో కలిసి షిరిడీకీ రమ్మని ప్రాధేయపడేవాడు స్నేహితుడు. కానీ చిన్నప్పటి నుంచి దేవుళ్లన్నా, మహత్యాలన్నా నమ్మకం లేని ప్రధాన్, స్నేహితుడి మాటలను లెక్కచేసేవాడు కాదు. అయితే చివరికి ఒకసారి షిరిడీకి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు ప్రధాన్. కాకపోతే తాను సత్రంలోనే ఉండిపోతాననీ, బాబా ఉన్న మసీదులోకి అడుగుపెట్టననీ షరతు పెట్టాడు.
రామచంద్రని సత్రంలోనే ఉంచి తాను మాత్రం హారతి వేళ బాబాను దర్శించుకునేందుకు వెళ్లిపోయాడు స్నేహితుడు. హారతి మొదలైంది. మధురమైన హారతి పాట, లయబద్ధమైన సంగీతమూ మసీదు నుంచి వినిపిస్తోంది. ఆ శబ్దాలకు ప్రధాన్ కాలు నిలువలేదు. తనకు తెలియకుండానే నడుచుకుంటూ మసీదులోకి అడుగుపెట్టాడు ప్రధాన్. అడుగుపెట్టడమే కాదు! అక్కడ ఉన్న బాబాని చూసి మైమరచిపోయాడు. ఆ మరపులోనే ఆయన వద్దకు వెళ్లి నిల్చొన్నాడు. ప్రధాన్‌ని చూసిన బాబా తన అలవాటు ప్రకారం దక్షిణను అడిగారు. అప్పటికీ ప్రధాన్ మైకంలోనే ఉన్నాడు. తన యజమాని కోసం వసూలు చేసిన 2,500 రూపాయలను తీసి మారు మాట్లాడకుండా బాబా చేతిలో ఉంచాడు. మహిమ తెలిసింది
ప్రధాన్ తిరిగి తన సత్రానికి వచ్చిన తరువాత కానీ, జరిగినదేమిటో మనసుకి తోచలేదు. కానీ ఇప్పుడేం చేసేంది? తన యజమానికి ఏమని చెప్పేది? అసలు యజమాని దగ్గరకు తిరుగు ప్రయాణం చేయడానికి కూడా అతని వద్ద తగినంత ధనం లేదయ్యే! ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ప్రధాన్ తన ఊరు భివ్‌పురికి చేరుకున్నాడు. తనకి ఒంట్లో బాగోలేదనీ, ఆరోగ్యం కుదుటపడగానే వచ్చి కలుస్తాననీ యజమానికి కబురు పంపాడు. కానీ యజమాని నుంచి ఒక చిత్రమైన జవాబు తిరిగి వచ్చింది. ‘కావల్సినంత విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తరువాతే రమ్మనీ…. ఎందుకంటే ఏ రుణాన్ని వసూలు చేసేందుకు ప్రధాన్ తిరుగుతున్నాడో, దానికి రెట్టింపు వసూలు అయ్యిందనీ’ ఆ సందేశంలోని సారాంశం. ఆ జవాబు విన్న ప్రధాన్‌కి మతి పోయినంత పనయ్యింది. ఇదంతా కూడా బాబా మహిమేనని తెలిసొచ్చింది. బాబా హెచ్చరిక
ఈ సంఘటన జరిగిన దగ్గర్నుంచీ ప్రధాన్ తరచూ షిరిడీ వెళ్లేవాడు. అంతేకాదు! తనతో ఓసారి తన ఊరు భివ్‌పురికి రమ్మని బాబాను తెగ పోరేవాడు. అలా పోరగా పోరగా చివరికి ఓసారి బాబాగారు విసిగిపోయి, తన విగ్రహాన్ని ప్రధాన్ చేతిలో ఉంచి- ‘భివ్‌పురికి వెళ్లి ఒక ఆలయాన్ని నిర్మించు. అందులో ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేయి. ఇక నువ్వు షిరిడీకి రానవసరం లేదు,’ అని తేల్చిచెప్పారు. తొలి ఆలయం
బాబా అనుజ్ఞను అనుగుణంగా ప్రధాన్, 1916లో ఒక ఆలయాన్ని నిర్మించి బాబా స్వహస్తాలతో అందించిన విగ్రహాన్ని ప్రతిష్టించాడు. బాబా వాగ్దానం చేసినట్లుగానే ఆయన ఉనికి తరచూ అక్కడ భక్తులకు అనుభవమయ్యేది. ఆలయానికి ఎదురుగా ఉన్న చెట్టు నీడన బాబా విశ్రమించడం కనిపించేది. తెల్లవారుజామున మూడుగంటలకు ఆలయం తలుపులు తెరుచుకున్న చప్పుడు వినిపించేది. భివ్‌పురి చాలా చిన్న గ్రామమే అయినప్పటికీ, అక్కడి బాబా ఆలయానికి ఉన్న విశిష్టత గురించి తెలుసుకున్న భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. పచ్చటి పొలాల మధ్య, ప్రశాంతమైన వాతావరణం మధ్య ఉన్న భివ్‌పురి గుడి ఇప్పటికీ బాబా ఉనికిని చాటుతూనే ఉంది.
అధిక బరువుతో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదని కంప్లైంట్స్ చేస్తుంటారు. అయితే మనం ఉదయంపూట తీసుకునే ఆహారాలు కూడా మనం బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
చాలా మంది అల్పాహారం మానేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల బరువు తగ్గడం కాదు.. పెరుగుతారు.
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనంగా చెబుతారు. ఉదయం తీసుకునే ఆహారంతోనే రోజంతా తాజాగా, ఉత్సాహంగా ఉంటారు. అల్పాహారం మానేయడానికి బదులుగా ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన భోజనం తినాలి. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ రోజుకు శక్తిని అందిస్తుంది. అల్పాహారం మానేస్తే, ఆకలి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది బరువు పెరగడానికి దారితీయవచ్చు. బరువు తగ్గాలనుకుంటే మీ అల్పాహారంలో తప్పనిసరిగా చేర్చవలసిన ఆహారాలు ఏంటో తెలుసుకోండి.
బరువు తగ్గేందుకు ఓట్స్
ఓట్స్ బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా అతిగా తినరు. ఇది మంచి జీర్ణక్రియను కూడా అందిస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. రుచికరమైన వోట్మీల్ తయారు చేసుకోవచ్చు. ఓట్స్ బరువు తగ్గడానికి, అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి.
ఇడ్లీ సాంబార్
ఇడ్లీ సాంబార్ చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది తినడానికి రుచిగా ఉండటమే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ పుష్కలంగా దొరుకుతాయి. ఇడ్లీ సులభంగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలిగా ఉండదు. సాంబార్ మరింత ఆరోగ్యంగా ఉండటానికి కూరగాయలను చేర్చుకోవచ్చు.
పప్పులు ఉండేలా చూసుకోండి
పప్పు తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో అంతే రుచికరంగా ఉంటుంది. ఇందులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అల్పాహారంలో పప్పు ఉండేలా చూసుకోండి. అతిగా తినకుండా నిరోధిస్తుంది. దోసెలులాంటివి చేసుకోండి.
గుడ్లతో బరువు తగ్గొచ్చు
గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ అల్పాహారంగా ఉడికించిన గుడ్లు తినండి. ఉడకబెట్టిన గుడ్లు కాకుండా మీరు ఆమ్లెట్ లేదా ఎగ్ బుర్జీని కూడా తినవచ్చు. ఆమ్లెట్ లేదా బుర్జి చేసేటప్పుడు ఎక్కువ నూనెను వాడకూడదు. దీంతో మీరు బరువు పెరగవచ్చు. అల్పాహారం కోసం ఎగ్ శాండ్‌విచ్ ట్రై చేయండి.
పనీర్ ఎంతో బెటర్
పనీర్‌లో ప్రోటీన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా దొరుకుతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు మీ అల్పాహారంలో పనీర్‌ను చేర్చుకోవచ్చు. అనేక రకాలుగా తినవచ్చు. పనీర్ శాండ్‌విచ్ లేదా పనీర్ బుర్జీని తినవచ్చు. మీరు అల్పాహారంగా పనీర్ తింటే చాలా లాభాలు ఉంటాయి. ఇది బరువు తగ్గడమే కాకుండా శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.
అందమైన ముఖంపై జిడ్డు ఉండడం నిజంగానే కాస్త ఇబ్బందికరమైన అంశం. ఇక కొందరిలో కాలంతో సంబంధం లేకుండా జిడ్డు సమస్య వేధిస్తుంటుంది. అయితే కొన్ని రకాల టిప్స్ పాటించడం ద్వారా జిడ్డు ముఖం సమస్యకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా.?
మనలో చాలా మంది ఆయిల్ స్కిన్‌తో బాధపడుతుంటారు. ముఖ్యంగా ముక్కుపై జిడ్డు సమస్య వేధిస్తుంటుంది. మహిళల్లో ఈ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. అందమైన ముఖంపై జిడ్డు ఉండడం నిజంగానే కాస్త ఇబ్బందికరమైన అంశం. ఇక కొందరిలో కాలంతో సంబంధం లేకుండా జిడ్డు సమస్య వేధిస్తుంటుంది. అయితే కొన్ని రకాల టిప్స్ పాటించడం ద్వారా జిడ్డు ముఖం సమస్యకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా.? జిడ్డు సమస్యను తగ్గించుకోవడానికి పాటించాల్సిన కొన్ని టిప్స్‌పై ఓ లుక్కేయండి..
* జిడ్డు సమస్యకు చెక్ పెట్టడానికి సరైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ ముక్కుపై పేరుకుపోయిన అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. గ్రీన్‌టీ బ్యాగ్‌లతో ముక్కుపై మసాజ్ చేసుకోడం ద్వారా జిడ్డు సమస్య నుంచి బయటపడొచ్చు. దీనికి కారణం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్.
* జిడ్డు సమస్యతో ఇబ్బందిపడే వారు మాయిశ్చరైజర్‌ను కచ్చితంగా ఉపయోగించాలి. మాయిశ్చరైజర్‌ను అప్లై చేయకపోవడం వల్ల పొడిబారుతుంది. జిడ్డుగల ముక్కు కోసం మీరు జెల్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
* కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ కారణంగా కూడా ముఖం జిడ్డుగా మారుతుంది. కాబట్టి రోజూ కనీసం 6 నుంచి 8 లీటర్ల నీటిని తీసుకోవడం వల్ల చర్మం నిత్యం హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
* ఇక కొందరు ముఖాన్ని నిత్యం కడుగుతూనే ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ముఖం డ్రైగా మారుతుంది. ఇది కూడా కొన్ని సందర్భాల్లో ఆయిల్ స్కిన్‌కు కారణమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలపై దృష్టిసారించారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేసేందుకు వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేస్తున్నారు.
మంగళవారం సాయంత్రం నాటికి ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ముగ్గురి పేర్లను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేవారిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్‌రెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు అభ్యర్థుల పేర్లను సాయంత్రం నాటికి వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో 8న ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది.
ప్రస్తుతం వైసీపీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం 3 స్థానాలూ గెలుచుకునే అవకాశం ఉంది. అయితే, తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీ పోటీ చేయాలని భావిస్తోంది. వైసీపీలో టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న MLAలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారనే అంచనాతో TDP తమ అభ్యర్థిని బరిలో నిలుపుతోంది. మొత్తంగా టీడీపీ క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకుంది.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 3 రాజ్యసభ స్థానాల్లో ఒక్కో సీటుకు 44మంది ఎమ్మెల్యేల ఓట్లు తప్పనిసరి. 3 స్థానాలు గెలవాలంటే 132మంది అవసరం. YCPకి ఇంతకు మించే బలం ఉన్నా.. దాదాపు 25 మంది టికెట్ దక్కని వారు ఉన్నారు. కావున వాళ్లలో ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేస్తారా అనే సందేహం ఉంది. అటు, స్పీకర్ ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 9 మందికి నోటీసులు ఇచ్చారు. గంటా రాజీనామా ఆమోదించారు. TDP, జనసేన, YCP ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఒక్కో MPకి కావాల్సిన MLAల సంఖ్యాబలం మారే అవకాశం ఉంది.
కాగా.. ఏప్రిల్ 3వ తేదీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేష్ రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. ఈ స్థానాలకే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి.. ఈనెల 8వ తేదీన రాజ్యసభ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 వరకూ గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27 పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ చేసి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
Tirumala – seven Hills – History Behind the seven hill names – ఏడు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే… ఏడు కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే… తిరుమలలో ఉండే ఏడు కొండలనే సప్తగిరులు అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన ఏడు కొండలని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏడు శిఖరాల్లో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర… శేషాద్రి – సప్తగిరుల్లో శేషాద్రి ప్రధానమైంది. ఆదిశేషుని పేరిట నెలకొన్న కొండ. నీలాద్రి – స్వామివారికి మొదటిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదుగానే ఈ కొండ వెలసింది. గరుడాద్రి – మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు కొండ రూపంలో ఉద్భవించాడు. అంజనాద్రి – హనుమంతుని తల్లి సంతానం కోసం తపస్సు చేసిన కొండే అంజనాద్రిగా వెలసింది. వృషభాద్రి – మహావిష్ణువు చేతిలో హతమైన రాక్షసుడు వృషభాసురుడి పేరిట వృషభాద్రి వచ్చింది. నారాయణాద్రి – విష్ణుమూర్తి దర్శనం కోసం పుష్కరిణి తీరంలో తపస్సు చేసిన నారాయణ మహర్షి పేరుతో నారాయణాద్రి వెలసింది. వేంకటాద్రి – కలియుగ దైవం వెలసిన కొండ ఇది. ‘వేం’ అంటే పాపాలు అనీ, ‘కట’ అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సన్నిధిలో సర్వపాపాలూ నశిస్తాయనీ, అందుకే ఆ పవిత్ర గిరిని వేంకటాద్రి అంటారనీ ప్రతీతి. Tirumala – seven Hills – History Behind the seven hill names – ఏడు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే…
ఏడు కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే…
తిరుమలలో ఉండే ఏడు కొండలనే సప్తగిరులు అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన ఏడు కొండలని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏడు శిఖరాల్లో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర…
శేషాద్రి – సప్తగిరుల్లో శేషాద్రి ప్రధానమైంది. ఆదిశేషుని పేరిట నెలకొన్న కొండ.
నీలాద్రి – స్వామివారికి మొదటిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదుగానే ఈ కొండ వెలసింది.
గరుడాద్రి – మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు కొండ రూపంలో ఉద్భవించాడు.
అంజనాద్రి – హనుమంతుని తల్లి సంతానం కోసం తపస్సు చేసిన కొండే అంజనాద్రిగా వెలసింది.
వృషభాద్రి – మహావిష్ణువు చేతిలో హతమైన రాక్షసుడు వృషభాసురుడి పేరిట వృషభాద్రి వచ్చింది.
నారాయణాద్రి – విష్ణుమూర్తి దర్శనం కోసం పుష్కరిణి తీరంలో తపస్సు చేసిన నారాయణ మహర్షి పేరుతో నారాయణాద్రి వెలసింది.
వేంకటాద్రి – కలియుగ దైవం వెలసిన కొండ ఇది. ‘వేం’ అంటే పాపాలు అనీ, ‘కట’ అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సన్నిధిలో సర్వపాపాలూ నశిస్తాయనీ, అందుకే ఆ పవిత్ర గిరిని వేంకటాద్రి అంటారనీ ప్రతీతి.
భూగోళం మీద అత్యంత విలువైన జీవి అదే…..అది అంతరించిపోతే మానవ మనుగడ లేనట్టే…..
భూగోళం మీద ఉన్న జీవ జాతుల్లో అత్యంత ముఖ్యమైన,విలువైన జీవి ‘తేనెటీగ’ అని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్దారించారు.
ప్రపంచవ్యాప్తంగా వాటి ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడిపోయిందని ప్రకటించారు. ఇటీవలి అధ్యయనాలు దాదాపుగా 90% తేనెటీగలు అంతరించిపోయినట్టు వెల్లడించాయని తెలిపారు. అడవుల నరికివేత,గూళ్లు కట్టడానికి అనువైన స్థితి లేకపోవడం,పురుగు మందుల వాడకం,నేలల్లో వస్తున్న మార్పుల కారణంగా తేనెటీగల ఉనికి ప్రశ్నార్థకంగా మారినట్టు వెల్లడించారు.
వ్యవసాయ ఆవిష్కరణల ఫౌండేషన్(FIA) సహకారంతో అపికల్చర్ ఎంట్రపెన్యూర్‌షిప్ సెంటర్ ఆఫ్ యూనివర్సదద్,అపికల్చర్ కార్పోరేషన్ ఆఫ్ చిలే సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం తేనెటీగల గురించి ఒక ఆసక్తికర విషయాన్ని నిర్దారించింది. ఈ భూగోళంపై ఉన్న జీవ జాతుల్లో కేవలం తేనెటీగలు మాత్రమే..రోగాలను వ్యాప్తి చేయని జీవులని నిర్దారించారు. ఫంగస్,బాక్టీరియా,వైరస్ వంటి వాటిని తేనెటీగలు వ్యాప్తి చెందించవని అధ్యయనంలో వెల్లడైంది.
తేనెటీగల వల్ల కేవలం తేనె మాత్రమే కాదు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70శాతం వ్యవసాయం తేనెటీగల మీదే ఆధారపడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మనం పండిస్తున్న 100 పంటల్లో దాదాపు 70 రకాలు తేనెటీగల వల్లే పరాగసంసర్కం జరిగి ఫలదీకరణం చెందుతాయని చెబుతున్నారు.తేనెటీగలు అంతరించిపోతే.. సమస్త జీవ జాతులకు భవిష్యత్‌లో తిండి దొరకడం కష్టమంటున్నారు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రకారం.. తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే.. ఆ తర్వాత మనుషులు బతికేది కేవలం నాలుగేళ్లు మాత్రమే అని చెప్పారు. దీన్నిబట్టి మానవ మనుగడ తేనెటీగలతో ఎంతలా ముడిపడి ఉందో అర్థం చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సెల్‌ఫోన్ వినియోగం పెరిగిపోవడం కూడా తేనెటీగలు అంతరించడానికి ఒక కారణంగా తెలిపారు.సెల్‌ఫోన్ సిగ్నల్స్ తరంగాల కారణంగా తేనెటీగలు అయోమయానికి గురవుతాయని.. తద్వారా అవి తమ దారిని మరిచిపోయి.. అంతిమంగా వాటి జీవితం ప్రమాదంలో పడిపోతుందని వెల్లడించారు.అడవుల నరికివేతను అరికట్టడం,పురుగు మందులను నిషేధించడం,సహజ వ్యవసాయ ప్రక్రియను ప్రోత్సహించడం,తేనెటీగల ఉనికిపై ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేపట్టడం వంటి చర్యల ద్వారా వాటిని అంతరించిపోకుండా కాపాడవచ్చునన్నారు.
మరికొద్దిరోజులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం పొలిటికల్ సినిమాలు హాట్‍టాపిక్‍గా మారుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ప్రధాన అంశంగా రూపొందిన ‘ యాత్ర 2’ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రానుంది.అలాగే ఏపీ రాజకీయాలపై వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం చిత్రం విడుదలకు కోర్టు అభ్యంతరం తెలిపింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై మరో మూవీ వస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై ‘రాజధాని ఫైల్స్’ చిత్రం రూపొందింది. ఈ మూవీ ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 5) రిలీజ్ అయింది.ఆంధ్రప్రదేశ్ పేరును ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్లో మేకర్స్ నేరుగా ప్రస్తావించలేదు. అలాగే, రాజకీయ పార్టీల పేర్లను కూడా మార్చి చూపించారు. ఏపీకి మూడు రాజధానులను ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించగా.. ఇందులో నాలుగు రాజధానులు అంటూ మార్పు చేశారు. అయితే, ఇవి ఇలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపైనే ‘రాజధాని ఫైల్స్’ రూపొందిందని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది..
ఈ చిత్ర దర్శకుడు భాను అమరావతే రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న పోరాటం,ఆవేదన, పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కొన్ని పాత్రలు కూడా ప్రస్తుత రాజకీయ నాయకులను పోలినట్టు అయితే ఉన్నాయి. ఈ మూవీలో అఖిలన్ మరియు వీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే వారు వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూపించే షాట్‍తో ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ మొదలైంది.ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. అరుణప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదన నేపథ్యంలో ‘రాజధాని ఫైల్స్’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. శ్రీమతి బిందు సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో వినోద్‌కుమార్, వాణీ విశ్వనాథ్, పవన్, మధు, అజయ్‌రత్నం, అంకిత ఠాకూర్, అమృత చౌదరి తదితరులు నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఈ ట్రైలర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో హైలైట్‍గా ఉంది. కంఠమనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఫిబ్రవరి 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది .
మాస్క్‌డ్ ఆధార్ కార్డు’ అంటే ఏంటో తెలుసా ? ఆ కార్డుతో ఎన్ని లాభాలో తెలుసా ?
ఆధార్ కార్డు అంటే భారత్ లో ఉండే అందరికి తెలుసు.. ఎందుకంటే ఈ ఆధార్ కార్డు మన ఐడెంటిటీ ప్రూఫ్ కాబట్టి.. ఎక్కడికి వెళ్లిన ఈ ప్రూఫ్ ఖచ్చితంగా చూపించాల్సిందే. అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్న ఆధార్ ఉండాల్సిందే. అలాంటి ఈ ఆధార్ కార్డును యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసింది.
అయితే ఆధార్ కార్డును మరింత సురక్షితంగా మార్చేందుకు యూఐడీఏఐ మాస్క్‌డ్ ఆధార్ కార్డులను కూడా అందిస్తోంది ఈ యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎక్కడైనా ఎవరికైన మీరు మీ ఆధార్ నెంబర్ చెప్పడానికి ఇబ్బంది పడితే అప్పుడు ఈ మాస్క్‌డ్ ఆధార్ నెంబర్ ఇవ్వొచ్చు. ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డును డిజిటల్ సైనాడ్ ఈ ఆధార్ గా తీసుకోవచ్చు.
ఈ మస్కాడ్ ఆధార్ వల్ల మీ ఆధార్ కార్డుకు పూర్తి భద్రత లభిస్తుంది.
అయితే ఆధార్ కార్డులో 12 అంకెలు ఉన్నట్టు మాస్క్‌డ్ ఆధార్ కార్డులో ఉండవు. ఈ మస్కాడ్ ఆధార్ లో కేవలం 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మిగతా 8 అకెంలను మాస్క్ ద్వారా కవర్ చేస్తుంది. ఇక్కడ కేవలం ఆధార్ నెంబర్‌పై మాత్రమే మాస్క్ ఉంటుంది. బయోమెట్రిక్స్, ఫోటోగ్రాఫ్, క్యూఆర్ కోడ్ వంటివి అలానే కనిపిస్తాయి.
ఎయిర్ పోర్ట్, ట్రైన్ టికెట్ బుకింగ్ కి ఈ మాస్క్ డ్ ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఎల్‌పీజీ సబ్సిడీ, పెన్షన్ వంటి వాటికి కూడా ఉపయోగపడదు. కాగా ఈ మస్కాడ్ ఆధార్ కార్డు కావాలనుకునే వారు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి webex ముఖ్య అంశాలు..
????అధికారులందరూ ప్రతిరోజు కనీసం ఒక పాఠశాలను ఖచ్చితంగా సందర్శించాలి.
????ఎఫ్ఏ 3 పేపర్స్ వేల్యూషన్ మూల్యాంకనం మరియు పిల్లలకి అందించే కార్యక్రమాన్ని సీరియస్ గా పూర్తి చేయవలెను. టైమ్ షెడ్యూల్ పాటించవలెను .
????జిల్లా అధికారులు మండల అధికారులు టీచర్స్ నుంచి డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ తీసుకొనవలెను.
టీచర్స్ తోటే గ్రూప్స్ ఫార్మ్ చేసి DEO గారు మెసేజ్ పెట్టి ఆ మెసేజ్ ని వాళ్ళు ఎంతమంది పాటించారనేది కంప్లైన్స్ రిపోర్టు ఎంఈఓ నుంచి తీసుకొనవలెను.
????ఎగ్జామ్ జరిగే పాఠశాలలో ఫర్నిచర్ ఖచ్చితంగా ఉండేటట్లు చూడవలెను .
????మండల జిల్లా ఆఫీసుల్లో టపాల్స్ ( ఇన్వార్డ్స్ ఔట్ వార్డ్స్) రిజిస్టర్స్ ,ఫైల్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయవలెను.
???? తదుపరి విసిట్స్ లో మండల ఆఫీసు, జిల్లా కార్యాలయం కూడా సందర్శించే అవకాశం ఉంది .
????ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి ఎటువంటి ఎలక్షన్ డ్యూటీ ఉండదు.
అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా ప్రతి శనివారం, శుక్రవారం పాఠశాలల సందర్శన ఖచ్చితంగా ఉంటుంది.
????ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా వారి నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొనవలెను. (వాట్సాప్ గ్రూప్ లేదా వేరే మార్గం ద్వారా)
????నాబార్డ్ స్కూల్స్ లో ప్రత్యేక దృష్టితో ఫర్నిచర్ ఏర్పాటు చేయాలి.
???? ట్యాబ్ ని డిజిటల్ టెక్స్ట్ బుక్ గా పరిగణించాలి .
ప్రతిరోజు టెక్స్ట్ బుక్స్ తో పాటు టాబ్ కూడా ఉండాలి.
???? IFP ను ఉపయోగించి ఖచ్చితంగా ఉపాధ్యాయులు బోధించాలి.
???? ఈవారం ఏ మండలానికి ,ఏ జిల్లాకి వస్తారు అనేది గురువారం నిర్ణయించడం జరుగుతుంది.
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంపీ విజయసాయి రెడ్డిపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెల్లలో కూలిపోతుందంటూ..
రాజ్యసభలో ఆన్ రికార్డ్ లో విజయ్ సాయి రెడ్డి మాట్లాడిన విషయాలపై కంప్లైంట్ ఇచ్చారు. బీఅర్ఎస్, వైసీపీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.
ఏపీలో జరిగే ఎన్నికలకు బీఅర్ఎస్ ఫండింగ్ ఇస్తుందని.. ఇద్దరు మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు కాల్వ సుజాత. తెలంగాణలో సుస్థిర పాలన ఉందని.. ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విజయ్ సాయి రెడ్డి లాంటి నాయకుల వాఖ్యలు చెల్లుబాటు కావని మండిపడ్డారు. ఆయన వాఖ్యలపై సీబీఐతో విచారణ జరిపించి… చర్యలు తీసుకోవాలని కోరారు కాల్వ సుజాత.
దేశం విడిచి పారిపోయేందుకు ఆయన ఫ్యామిలీ
ఏర్పాట్లు చేసుకుంటున్నది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అందుకే గతంలో హైర్ చేసుకున్న స్పెషల్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోలె
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ దగ్గర 5 వేల ఎకరాలున్నయ్
అసెంబ్లీ సమావేశాల్లో బండారం బయటపెడతామని ప్రకటన
నల్గొండ, వెలుగు: ”నేనే చీఫ్ ఇంజినీర్ అని చెప్పుకొని కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయింది. దానిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ క్షణమైనా కేసీఆర్ అరెస్ట్ కావచ్చు.. అందుకనే ఇక్కడి నుంచి మూటముల్లె సర్దుకొని కుటుంబంతో సహా దుబాయ్పారిపోయేందుకు కేసీఆర్కుటుంబం ఏర్పాట్లు చేసుకుంటున్నది. అందుకే సీఎంగా ఉన్నప్పుడు లీజ్‌కు తీసుకున్న స్పెషల్ ఫ్లైట్‌ను ఇంకా క్యాన్సిల్ చేసుకోలేదు..’ అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నల్గొండలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద వింత అని కేసీఆర్ చెప్పుకున్నారని.. నిజంగానే అది మూడేళ్లలోనే కూలిపోయి వింత అనిపించుకుందని ఎద్దేవా చేశారు.
భువనగిరిలో బీఆర్ఎస్కు డిపాజిట్ రాదు
రెవెన్యూ శాఖతో పాటు కీలకమైన ఇరిగేషన్, మున్సిపల్, ఆర్థిక శాఖలన్నీ తన వద్ద, తన కొడుకు, అల్లుడి వద్ద పెట్టుకొని అంతగా ప్రాధాన్యం లేని శాఖలను తలసాని శ్రీనివాస్, ఇంద్రకరణ్‌రెడ్డి లాంటి వారికి అప్పగించారని చెప్పారు. ‘హెచ్ఏండీఏ డైరెక్టర్ దగ్గర ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి.. సోమేశ్ కుమార్ పేరు మీద ఐదు వేల ఎకరాలు ఎట్లా ఉంటాయ్.. త్వరలో సోమేశ్ కుమార్ బండారం కూడా బయటవడ్తది’ అని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని, ఒకవేళ డిపాజిట్ వస్తే తన పేరు వెంకట్రెడ్డే కాదన్నారు. కేసీఆర్ ఈసారి నల్గొండకు వచ్చి మీటింగ్ పెడ్తే జనాలు మళ్లీ ఓట్లతోనే కొడ్తారని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. ‘మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పులి నిద్ర లేచింది.. త్వరలోనే నల్గొండ వస్తది అంటున్నడు.. పులి లేదు పిల్లి లేదు.. మొత్తం దుకాణం, మూట ముల్లె సర్దుకొని దేశం విడిచి పారిపోయేందుకు కేసీఆర్ప్లాన్ చేసుకున్నడు..’ అని మంత్రి చెప్పారు.
కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారు..
2015 జూన్‌లో జరిగిన కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశంలో 811 టీఎంసీల కృష్ణా నీటిలో తెలంగాణకు 299 టీఎంసీలు.. ఏపీకి 512 టీఎంసీల చొప్పున పంచుకునే ఒప్పందంపై కేసీఆర్ సంతకం పెట్టిన సంగతి వాస్తవం కాదా? అని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా ప్రాజెక్టు నీళ్ల కోసం వెళ్లిన తెలంగాణ రైతుల్ని ఆంధ్రా పోలీసులు కొడుతుంటే.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి పంపించిన దుర్మార్గుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులన్నీ జగన్ మనుషులకే కట్టబెట్టాడని, ఇద్దరు కలిసి కుమ్మకై.. తెలంగాణను నిండా ముంచారని ఆరోపించారు. ‘తెలంగాణ ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి అప్పగించిండని చెప్పడానికి కేసీఆర్‌కు సిగ్గుండాలి.. నీ కమీషన్ల కోసం ఉత్తర తెలంగాణలో కూలిపోయే ప్రాజెక్టులు కట్టినవ్.. ప్రాజెక్టులే కట్టకుండా దక్షిణ తెలంగాణను ఎడారి చేసినవ్.. మీ లిక్కర్ కేసులు మాఫీ చేయించుకునేందుకు నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల ప్రయోజనాలని ఫణంగా పెట్టినవ్.. ఇన్ని చేసి ఇంకా 2 లక్షల మందితో నల్గొండలో సభ పెట్టి కృష్ణా నది నీళ్ల గురించి మాట్లాడతానని స్టేట్‌మెంట్ ఇవ్వడం దారుణం’ అంటూ మంత్రి ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రి జగదీశ్ జైలుకు పోవుడు ఖాయం..
‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సీఎం రేవంత్ మీద మాట్లాడుతున్నడు.. నేను పదవి చేపట్టిన రెండు నెలల్లోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు రూ.1500 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయించిన.. ఏఎమ్మార్పీ మెయిన్ కెనాల్ పనులకు రూ.525 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయించిన.. డిండి ప్రాజెక్టు కోసం జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను నిరంతరం పని చేస్తున్నం.. కానీ పనికి మాలిన జగదీశ్‌కు కేసీఆర్ మంత్రి పదవి ఇస్తే అవినీతికి పాల్పడ్డాడు తప్ప ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదు..’ అని ఫైర్ అయ్యారు. ‘ఒకప్పుడు తిండికి లేనోడు యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో దోచుకొని నాగారంలో రూ.50 కోట్లతో ఇల్లు కట్టుకున్నడు. హైదరాబాద్ పక్కన 80 ఎకరాల్లో ఫామ్ హౌస్ఏర్పాటు చేసుకున్నడు.. ఈ అవినీతిపై సిట్టింగ్‌జడ్జితో విచారణ చేయిస్తున్నాం. ఆయన జైలుకు పోక తప్పదు’ అని మంత్రి హెచ్చరించారు.
TS EAPCET-2024 (TS ఎంసెట్) నోటిఫికేషన్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇవాళ వెల్లడించింది. ఈ మేరకు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఆ దరఖాస్తులను కూడా ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని స్పష్టం చేశారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, ఈసారి ఎంసెట్ ప్రవేశ పరీక్ష పేరును మారుస్తూ.. ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.
గతంలో ఇంజినీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలకు ఎంసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేసే వారు. కానీ, ప్రస్తుతం మెడిసిన్, డెంటల్, యునానీ, ఆయుర్వేద, హోమియో కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ను నిర్వహిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మెడిసిన్(ఎం) అనే పదాన్ని ఎంసెట్ నుంచి తొలగించింది. దీంతో ఎంసెట్ కు బదులు ఎప్‌సెట్‌గా మారనుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు మాత్రమే నిర్వహించే పరీక్ష కావడంతో ఎప్‌సెట్(టీఎస్ ఈఏపీసీఈటీ)గా పేరు ఖరారు చేశారు
తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి (KRMB) అప్పగించడాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోకి వెళ్లేలా చేస్తున్నారంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు.
తాజాగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (BRS Chief KCR) సైతం ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం కృష్ణా పరివాహక ప్రాంతం నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చిన 10 ఏళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదని అన్నారు.
ఆనాడే చెప్పిన…
”ప్రాజెక్ట్‌లు మాకు అప్పగించాలని లేదంటే మేమే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ నన్ను బెదిరించారు. కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో… నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా… తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే అస్సలే ఊరుకోను.. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పిన. నన్ను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను …నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు… నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకున్నది.. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నం… దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడూ వెనక్కు పోడు… ఉడుత బెదిరింపులకు భయపడను… ముందు ముందు ఏందో చూద్దాం… తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు” అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kuldhara village Rajasthan story – రాజస్థాన్ లోని అతి భయంకరమైన గ్రామం – కుల్ ధారా …. 200 సంవత్సరాలుగా ఆ ఊరు ఖాళీగానే ఉంది …. ఏం జరిగింది..
రాజస్థాన్ రాష్ట్రంలో, జైసల్మేర్‌కి పది హేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుల్‌ధారా. ఒకప్పుడు నిండా జనంతో, అందమైన గృహాలతో కళక ళలాడేది. పండుగలు పబ్బాలతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఎడారితో సమానంగా ఉంది. మొండి గోడలు తప్ప ఇళ్లు లేవు. అంతుపట్టని నీడలు, వికృతమైన అరుపులు, ఎవరివో తెలియని అడుగుల జాడలు తప్ప మనుషుల ఉనికి లేదు. ఎందుకని? అసలా ఊరికి ఏమయ్యింది?
మూడు వందల యేళ్ల క్రితం కుల్ ధారాలో పలివాల్ బ్రాహ్మణ కులస్థులు మాత్రమే ఉండేవారు. అందరూ ఎంతో సంతోషంగా జీవించేవారు. కానీ రాత్రికి రాత్రే ఊరిలోని జనమంతా మాయమై పోయారు. దానికి కారణం… ఒకరోజు ఆ గ్రామానికి దురదృష్టం నడచుకుంటూ వచ్చింది… ప్రధాని సలీమ్ సింగ్ రూపంలో (అప్పట్లో గ్రామ ప్రధానులని ఉండేవారు. వారిదే ఆధిపత్యం)
కుల్‌ధారా గ్రామ పెద్దల్లో ఒకరి కుమార్తెను సలీమ్ ఇష్టపడ్డాడు. కానీ ఆమె అతణ్ని ఇష్టపడలేదు. అయినా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు సలీమ్. అది తట్టుకోలేక ఊరివాళ్లు తిరగ బడ్డారు. తమ కులం కానివాడికి అమ్మా యిని ఇవ్వలేమని, దూరంగా ఉండమని హెచ్చరించారు. రగిలిపోయాడు సలీమ్. ఊరివాళ్ల మీద పగబట్టాడు. అధిక పన్నులు విధించి హింసించాడు. అయినా ఎవరూ లొంగకపోవడంతో ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని ప్లాన్ వేశాడు
అతనికి ఎదురు తిరిగి పోరాడటం మాటలు కాదు. అందుకే అందరూ కలిసి రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు. వెళ్లేముందు… ఆ ఊరు ఇక నివాసయోగం కాని విధంగా నాశనమైపోతుందని శపించారట. అందుకే కుల్‌ధారా అలా అయిపోయిందని అంటూ ఉంటారు.
అయితే ఈ కథలో కొంతే నిజం ఉందని, గ్రామస్థులు ఊరు విడిచి వెళ్లిపోలేదని, రాత్రికి రాత్రే సలీమ్ సింగ్ అందరినీ చంపి పాతి పెట్టేశాడని, వాళ్లంతా దెయ్యాలై ఊరిని పట్టి పీడిం చడం మొదలు పెట్టారనీ మరో వాదన.
ఏది నిజమో తెలుసుకోవాలని, రాత్రికి రాత్రే జనమంతా ఏమైపోయారో కని పెట్టాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఎవరి జాడా తెలియక మిన్నకుండిపోయారు. తర్వాత కొందరు ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్రామంలో నివసించడానికి వచ్చారు. కానీ వారి వల్ల కాలేదు. అర్ధరాత్రిళ్లు ఎవరో తలుపులు బాధేవారు. తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఎవరో గట్టిగట్టిగా అరిచేవారు. ఏడ్చేవారు, నవ్వేవారు. ఏవేవో నీడలు వెంట తిరుగుతూండేవి.
ఏవేవో రూపాలు కనిపించి భయపెట్టేవి. దాంతో అందరూ ఊరు వదిలి పారి పోయారు. క్రమంగా ఈ గ్రామంలో జరుగుతున్నవన్నీ బయటకు తెలియ డంతో ఎవ్వరూ అక్కడకు వెళ్లే సాహసం చేయలేపోయారు. ఒక్కోసారి ఆ ఊరి పక్క నుంచి వెళ్లేవాళ్ల వాహనాలు హఠాత్తుగా ఆగిపోయేవి. తర్వాత వారికి అక్కడ భయానక అనుభవాలు ఎదురయ్యేవి. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నవారంతా కలిసి కుల్‌ధారా ఒక ఘోస్ట్ విలేజ్ అని తేల్చి చెప్పేశారు. ఆ ముద్ర నేటికీ అలానే ఉంది. దాన్ని చెరిపే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు. ఎందుకంటే… తమ ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం గానీ… అక్కడికి వెళ్లి తమ జీవితాలను రిస్క్‌లో పెట్టుకునే ధైర్యం గానీ ఎవరికీ లేవు కాబట్టి!
కుల్‌ధారా ముఖద్వారం
ఢిల్లీలోని పారాపార్మల్ సొసైటీకి చెందిన పన్నెండు మంది సభ్యులు కుల్‌ధారా గ్రామానికి వెళ్లారు. వాళ్లు అక్కడ ఉన్న ఆ రాత్రి వారికి కాళరాత్రి అయ్యింది. ఏవేవో నీడలు కనిపించాయి. ఏవేవో స్వరాలు వినిపించి భయపెట్టాయి. వారి వాహనాల మీద చిన్నపిల్లల చేతి ముద్రలు ప్రత్యక్షమయ్యాయి. ఉన్నట్టుండి టెంపరేచర్ పడిపోయేది. ఉన్నట్టుండి పెరిగిపోయేది. దాంతో వాళ్లు కూడా కుల్‌ధారా గురించి అంతవరకూ ఉన్నవన్నీ వదంతులు కావని, వాస్తవాలేనని నమ్మే పరిస్థితి వచ్చింది. నాటి నుంచీ కుల్‌ధారా అంటే అందరికీ మరీ భయం పట్టుకుంది. ప్రభుత్వం కుల్‌ధారాని సందర్శనా స్థలంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. సందర్శకులు కూడా బాగానే వస్తున్నారు. కానీ చీకటి పడే సరికల్లా పరారైపోతురు.
రాత్రిళ్లు అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని . బావి లోనుంచి కేకలు వినిపిస్తూ ఉంటాయని ఆ గ్రామం వైపు తిరిగే గొర్రెల కాపరులు చెబుతున్నారు.
(భారతీయ ఆర్కియాలజీ శాఖ వాళ్ళు అక్కడ ప్రమాదకరమైన స్థలం అని బోర్డు కూడా పెట్టారు. ఆ స్థలం ఇప్పుడు పురాతన స్థలంగా పరిగణించి ఉంచారు)
Kuldhra, The haunted village of Rajasthan, India
Haunted Village Kuldhara | Drone View | Free stock footage
Egypt Pyramids- ఈజిప్టు పిరమిడ్లు – నిర్మాణ కారణం – పిరమిడ్ల నిర్మాణం ఎలా…?- ఇప్పుడు వివిధ పతనదశల్లో 30వరకు పిరమిడ్లను గుర్తిస్తున్నా పూర్తిరూపంలోఉన్నవి కేవలం 8మాత్రమే-ప్రపంచపు వింత- గీజా పిరమిడ్
ఏసు క్రీస్తు పుట్టి ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలు అవుతున్నది కదా, అంతకు 2500 సంవత్సరాల ముందు- అంటే ఇప్పటికి దాదాపు నాలుగువేల ఐదువందల సంవత్సరాల క్రితం- ఈజిప్టును “ఫారో”లు పరిపాలించారు.
ఆనాడు “ఫారో” కేవలం రాజు మాత్రమే కాదు- అద్భుత శక్తులకు ఆయన ప్రతీక; భగవంతునితో నేరుగా సంబంధం కలిగి ఉండే మంత్రవేత్త. రాజ్యంలో ఉండే అద్భుత సంపదలన్నిటికీ ఆయనే అధిపతి; ఈ భూమి మీద నడిచేదేవుడు ఫారో. ఆ ఫారోల శరీరం మామూలుది కాదు- దివ్య శరీరమే అది; అందరూ ఎల్లకాలమూ పూజించుకోవలసిన శరీరం అది. అట్లాంటి శరీరం నశించిపోతే, మరి దాన్ని అందరూ పూజించుకునేది ఎలాగ? అందుకని ఆనాటి వైద్యులు ఫారోలు చనిపోయాక, వాళ్ళ శరీరాలను ‘మమ్మిఫై’ చేయటం మొదలుపెట్టారు-
ఫారోల శరీరాల్లోంచి మెదడును, ఇతర పెద్ద అంతర్గత అవయవాలను అన్నింటినీ తీసేసి, ఎంపిక చేసిన రసాయనాలను శరీరంలోపల అంతా కూరేవాళ్ళు. పైన చర్మం పాడవ్వకుండా ఉండేందుకు గాను రకరకాల లేపాలను పూసి, శరీరం మొత్తాన్నీ బట్టతో గట్టిగా చుట్టేసేవాళ్ళు. అట్లా తయారు చేసిన ‘మమ్మీ’ల చర్మం ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా పాడవ్వకపోవటం నిజంగా ఆశ్చర్యం; నాటి వైద్య శాస్త్రపు అద్భుతం! ‘యునానీ’ వైద్యుల గొప్పతనం.
ఈజిప్టు పిరమిడ్లు
ప్రపంచంలో అత్యంత గొప్ప మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ప్రముఖమయినవి. ప్రాచీన మరియు మధ్య యుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా నిలిచిపోయాయి.
నిర్మాణ కారణం
ఈజిప్టు రాజ వంశానికి చెందినవారు మరణించినపుడు వారికోసం పిరమిడ్లను నిర్మించాలన్న ప్రతిపాదన చేసి అమలు చేసింది ఇంహోటెప్ అనే వాస్తు శిల్పి. అప్పటి వరకు ఉన్న ‘మస్టబా’లను అంచెలంచెలుగా ఒకదాని పైన ఒకటి అమర్చి పైకి వెళ్తున్న కొద్దీ పరిణామము తగ్గుతూ ఒక కొన వద్ద నిర్మాణ ఆగిపోయే విధంగా రూపకల్పన చేసాడు. ఈ నిర్మాణానికే ‘పిరమిడ్’ అని పెట్టబడింది. తర్వాతి కాలంలో ఈజిప్షియన్లు ‘ఇంహోటెప్’ ను దైవసమానుడిగా కొలిచేవారు. పిరమిడ్ల నిర్మాణానికి ఫారో వంశస్థులు రాజ్యమేలుతున్న కాలం స్వర్ణయుగం లాంటిది. అత్యంత గొప్ప పిరమిడ్ అయిన గిజా మరియు మరి కొన్ని అత్యద్భుత పిరమిడ్లు ఫారోల కాలంలో నిర్మింపబడ్డాయి. తదనంతర కాలంలో ఫారోల ప్రాభవం తగ్గుముఖం పట్టడం, పెద్ద పెద్ద నిర్మాణాలకు అవసరమయిన వనరులను చేకూర్చుకోలేక పోవడంతో తక్కువ సాంకేతిక విలువలతో కూడిన చిన్న చిన్న పిరమిడ్లు మాత్రమే కట్టబడ్డాయి.పిరమిడ్ల ఆకృతి గురించి పలు నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం: రాత్రి పూట ఆకాశంలో కనపడే దట్టమయిన నల్లని ప్రాంతం భూమికి, స్వర్గానికి మధ్య అడ్డుగోడ వంటిది. పిరమిడ్ చివర సన్నని అంచు సరిగ్గా ఆ దట్టమయిన అడ్డుగోడకు సూచింపబడి ఉంటుంది. పిరమిడ్ మధ్యలో భద్రపరిచి ఉన్న గొప్ప వంశస్థుల మృతదేహం నుండి వారి ఆత్మ పిరమిడ్ ద్వారా ప్రయాణించి సన్నని మొన నుండి బయటకు వచ్చి ఆ అడ్డుగోడను చేదించి స్వర్గంలోకి ప్రవేశించి దేవతలను చేరుకుంటుంది. చనిపోయిన వారికి చిహ్నంగా భావించే సూర్యాస్తమయం జరిగే నైలు నదీ తీరాన అన్ని పిరమిడ్లు నిర్మించబడ్డాయి.
పిరమిడ్ల నిర్మాణం ఎలా…?
ఈజిప్టు పిరమిడ్లు ప్రాచీన ప్రపంచ నాగరికతకు అద్దంపట్టే అత్యంత ప్రాముఖ్యత గల నిర్మాణాలు. సుమారు 850 సంవత్సరాలపాటు 138 పిరమిడ్లను వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు కాలాలలో నిర్మించారు. మరి భారీ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో పిరమిడ్లను ఎలా నిర్మించి ఉంటారు? పిరమిడ్ల నిర్మాణంలో వాడిన మోర్టార్ (సిమెంటు లాంటి జిగురు పదార్థం) ఏ తరహా రసాయన పదార్థం?ఆ అంశాలను మనమిప్పుడు తెలుసుకుందాం.
కైరో నగరానికి దాదాపు 50కి.మీ.దూరంలో ఉన్న సక్కారా ప్రాంతంలో మొదలయి, దాదాపు 200 కి.మీ.దూరం వరకు విస్తరించిన హవారాప్రాంతం వరకూ వివిధకాలాల్లో ఈ పిరమిడ్లను నిర్మించారు. ఈ 138 పిరమిడ్లలో నేడు చాలా కూలిపోయి నేలమట్టమయ్యాయి. కేవలం పునాదుల అవశేషాల ఆధారంగా, మిగిలిన పిరమిడ్ల నమూనాల కనుగుణంగా లెక్కించి 138పిరమిడ్లుగా గుర్తించారు. ఇప్పుడు వివిధ పతనదశల్లో 30వరకు పిరమిడ్లను గుర్తిస్తున్నా పూర్తిరూపంలోఉన్నవి కేవలం 8మాత్రమే. ఇందులో క్రీ.పూ.2550 సంవత్సరంలో గిజా ప్రాంతంలో నిర్మించిన గ్రేట్ పిరమిడ్ సుమారు 150మీ.ఎత్తు ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో ఉన్న కట్టడా లను పక్కనబెడితే 20వ శతాబ్దాంతం వరకు లెక్కిస్తే మానవనిర్మిత నాగరిక కట్టడాలలో గ్రేట్ పిరమిడ్ అత్యంత ఎత్తయిన కట్టడం.
పిరమిడ్లు అనేవి ఆనాటి కాలాల్లో ఛాందస భావాలతో ఉన్న పాలకుల సమాధులు. ఈ పాలకుల్ని ఫారోలు అంటారు. ఉదాహరణకు తొలి పిరమిడ్‌ను జోసర్ అనే ఫారోకు సమాధిగా కట్టారు. దీనిని సక్కారా ప్రాంతంలో నిర్మించారు. గ్రేట్ పిరమిడ్‌ను. క్రీ.పూ.2530 సంవత్సరంలో గిజా ప్రాంతంలో ఖాఫెర్ అనే ఫారోకు సమాధిగా నిర్మించారు. చివరి పిరమిడ్‌ను మూడవ అమ్మెన్ మాట్ సమాధిగా హవారాలో క్రీ.పూ. 1860లో ప్రారంభించి సుమారు 50 సంవత్సరాలకు పూర్తిచేశారు. పిరమిడ్లు అంటేనే గణితం ప్రకారం బహుభుజ ఆధారపీఠం ఉన్న శంఖాకృతులు. అంటే ఆధారపీఠం త్రికోణాకృతితోగానీ, చతురస్రా కారంతో గానీ ఉండడం ఆనవాయితి. పార్శ్వభాగాలు ఆధారపీఠంలోని ప్రతిభుజంనుంచి కూచీగా బయలుదేరి పైభాగాన కూచాగ్రం (అపెక్స్) దగ్గర కలుస్తాయి. అంటే ప్రతి పార్శ్వపుగోడ సమ ద్విబాహు త్రిభుజాకృతిలో ఉంటాయన్నమాట. క్రమంగా పైకెళుతున్నకొద్దీ అడ్డుకోత వైశాల్యం తగ్గుతూ ఉండడం వల్ల పైభాగాన ఉన్న బరువ్ఞను కిందభాగంలో ఉన్న ఆధారం స్థిరంగా ఉంచుతుంది. స్థిరమైన త్రిమితీయ (త్రీడైమెన్షనల్) ఘన ఆకృతులలో పిరమిడ్లు ప్రముఖమైనవి. ఈజిప్టు పిరమిడ్ ఏదీ పూర్తిగా ఘనరూపం కాదు. మధ్యలో నిలువ్ఞగా సన్నని గుహ లాంటిది ఉంటుంది. పిరమిడ్ పార్శ్వ గోడల నుంచి ఒకటి,రెండుచోట్ల ఈ గుహలోకి నాళిక ల్లాంటి దారులు ఉంటాయి. సాధార ణంగా ఇవి కిందివైపు మెట్లతో (దిగుడుబావిలోకి దిగినట్లుగా) ఉంటాయి. అక్కడక్కడా అవి మధ్య గుహలోకి వెళ్లాక అక్కడ విశాలమైన ప్రాంతం లోకి తెరుచుకుంటాయి. ఇదేచోటుకి మెట్లులేని గొట్టాల ద్వారా పిరమిడ్ పక్కగోడ లకు దారులు ఉంటాయి. ఇవి గాలిని లోనికి పంపి, బయట, లోపల సమానవాయుపీడనం ఉండేలా చేస్తాయి. గరిమనాభి నుంచి కింది వైపుకు నిలువ్ఞగా గీచిన ఊహారేఖ ఆధారపీఠం గుండా వెళ్లి నట్లయితే ఆ వస్తువ్ఞ పడిపోదనీ, ఆ గీత ఆధారపీఠం నుంచి పూర్తిగా ఒకవైపుకు విడిగా వెళితేనే వస్తువ్ఞ పడిపోతుందనీ స్కూల్లో నేర్చుకుంటాం. ఆ సూత్రం ఆధారంగా ఒకవస్తువ్ఞ మీద మరో వస్తువ్ఞను ఉంచడానికి ఎలాంటి జిగురు, సిమెంటు అవసరం లేదు. మనం గ్రంథాలయంలో 20 పుస్తకాలను ఒక దానిమీద ఒకటిగా పేర్చామనుకోండి. అవి పడి పోకుండా ఉంచాలంటే విడిగా వాటిని కట్టాలని గాని, పుస్తకానికీ, పుస్తకానికి మధ్య జిగురు పెట్టాలన్న నిబంధనగానీ లేదుకదా. కొన్నివేల మంది కార్మికులు, కొన్ని దశాబ్దాలపాటు శ్రమిస్తూ, ఏనుగులు, గుర్రాలను వాడుకొంటే పిరమిడ్ల నిర్మాణం రాజులకు సులభసాధ్యమే.
ప్రపంచపు వింత- గీజా పిరమిడ్
‘మమ్మిఫై’ చేసిన ఫారోల శరీరాలను అందుకోసమే ప్రత్యేకంగా నిర్మించిన గొప్ప గొప్ప కట్టడాల్లో భద్రపరచేవాళ్ళు- అవే ఈజిప్టు పిరమిడ్లు. వాటిలో అన్నింటికంటే పెద్దది, ‘ఖూఫూ’ అనే ఫారో తన శరీరాన్ని భద్రపరచటంకోసం తానుగా కట్టించుకున్న ‘గీజా’ పిరమిడ్.
దాని ఎత్తు 455 అడుగులు! అంటే కనీసం 45 అంతస్తుల భవంతి అంత!
నేలమీద దాని పొడవు, వెడల్పు 756 అడుగులు!
దానికోసం వాడింది 23,00,000 బండలు. వాటి మొత్తం బరువు కనీసం 59,00,000 టన్నులు! ఇంత బరువును పూర్తిగా మనుషులు- ఎడారి దాటించి తీసుకొచ్చారు- క్రేన్లు, యంత్రాలు ఏవీ వాడకుండా
గీజా పిరమిడ్ నిర్మాణానికి మొత్తం 20 సంవత్సరాలు పట్టిందట. ప్రతిరోజూ సరాసరి 14,000 మంది పనివాళ్ళు పని చేశారట. అవసరం ఉన్నప్పుడు ఒక్కోసారి 40,000 మంది కూడా పని చేశారట! ఇంత పెద్ద పిరమిడ్ నిర్మాణంలో వచ్చిన తేడాల్లా కేవలం 5.8 సెంటీమీటర్లు! పిరమిడ్ ముఖాలు నాలుగూ డిగ్రీలో వందో వంతు తేడా కూడా లేకుండా ఖచ్చితంగా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిశల్ని సూచిస్తున్నాయి!
కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతము. ఆంధ్రదేశము లోని గోల్కొండ రాజ్యములో ఇది లభించింది.
Kohinoor Daimond History-కోహినూరు వజ్రము-కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము.-నాదిర్‌షా దాన్ని చూడగానే కోహ్ – ఇ- నూర్ (కాంతి శిఖరం) అని అభివర్ణించాడు.- ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి దక్కినది..
కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము. ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి దక్కినది. 1877లో విక్టోరియా మహారాణి హిందూదేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలయినపుడు ఆమె కిరీటములో ప్రధానమైన వజ్రముగా పొదగబడింది. అన్ని ప్రఖ్యాత వజ్రాలవలె కోహినూరు వజ్రము చుట్టూ పలు కథలు, కథనాలు అల్లబడ్డాయి. ఇది ధరించిన మగవారికి శాపముగా, ఆడువారికి మేలు చేకూర్చునట్లు చెప్పబడుతుంది.
గోల్కొండ రాజ్యములోని ఓ అసాధారణ వజ్రం కోహినూరు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్ తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ కోహినూర్ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.
ఈ అసాధారణ వజ్రం ఎన్నో రాజ్యాలను కూల్చింది. ఎందరో రాజులను మార్చింది. చివరికి బ్రిటిష్ రాణి తల మీద చోటు సంపాదించింది. ఇంత ఘన చరిత్ర కలిగిన ఆ వజ్రం పేరు ‘కోహినూర్’. బాబర్ నామాలో మొఘల్ చక్రవర్తి బాబర్ కోహినూర్ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ “ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది’ అన్నాడు. మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా చరిత్రకెక్కాడు. తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు. 1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్ వశమై ‘బాబర్ వజ్రం’గా పేరు పొందింది. మొఘల్ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు. మహమ్మద్ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి, తలపాగాలు ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు. అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్‌షాకు ధారాదత్తం చేస్తాడు. నాదిర్‌షా దాన్ని చూడగానే కోహ్ – ఇ- నూర్ (కాంతి శిఖరం) అని అభివర్ణించాడు. దానికి ఆ పేరే స్థిరపడిపోయింది.
క్రీ. శ. 1913వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్ రాజుల నుంచి పంజాబ్‌పాలకుడు మహారాజా రంజిత్ సింగ్‌దీన్ని సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్‌సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది. సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా ఎనబై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది.
తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు. ఈ కారణంగా కోహినూర్ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947 మరియు 1953వ సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. || కోహినూర్ గురించిన ఆశ్చర్యకర చరిత్ర
కుమారదేవంలో గోదావరి గట్టుపై 144 ఏళ్లనాటి మహా వృక్షం
ఈ చెట్టు వద్ద 108 సినిమాల చిత్రీకరణ
వంశీ దర్శకత్వంలో 18 చిత్రాల షూటింగ్
తాళ్ళపూడి: గోదావరి గట్టుపై 144 ఏళ్ల మహావృక్షం సినీ పెద్దలకు మంచి సెంటిమెంట్. ఈ చెట్టు వద్ద దాదా పు 108 సినిమాలు చిత్రీకరించారు. కొవ్వూరు మండలం కుమారదేవంలో శింగలూరి తాతబ్బాయి నాటిన మొక్క మహా వృక్షమై ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు బాసటగా నిలిచింది. ఇక్కడ ఒక షాట్ చిత్రీకరించినా సినిమా విజయం సాధిస్తుందని నిర్మాతల సెంటిమెంట్ అని ప్ర ముఖ హస్యనటుడు లింగాల రామతీర్థ అంటున్నారు. కుమారదేవం చెట్టుకి సినీ పరిశ్రమకు విడదీయరాని బధం ఉందని ఆయన చెబుతారు. సినిమా చెట్టు విశేషాలు ఆయన మాటల్లోనే..
గోదావరి నదీ తీరాన జన్మించడం పూర్వజన్మ సుకృతం. 309 చిత్రాలలో హాస్యసటుడిగా నటించా. ఈ చెట్టు కింద తీసిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇదే చెట్టుకింద దర్శకుడు 18 చిత్రాలు చిత్రీకరించారు. 1974లో పాడిపంటలు చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుడి బండి పాట చిత్రీకరించారు. ఈస్ట్‌మన్ కలర్ చిత్రాలు వచ్చిన కొత్త 1975లో అందాలరాముడు ఈ చెట్టు వద్ద నుంచి చిత్రీకరణ ప్రారంభించారు. గోదావరి పాపికొండల సోయగాలను అంంగా చూపించారు. 1980 మేఘసందేశం చిత్రీకరణ దాసరి నారాయణరావు ఇక్కడనుంచి ప్రారంభించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వంశవృక్షం, బొబ్బిలిబ్రహ్మన్న ఇక్కడే చిత్రీకరించారు. త్రిశూలం చిత్రంలో ఆత్రేయ కలం నుంచి జాలువారిన పన్నెండేళ్లకు పుష్కరాలు పదహారేళ్లకు పరువాలు ఆ నాడు చేసేవి స్నానాలు గీతం ఈ చెట్టు వద్ద చితీక్రరించారు. 1983లో రెండు జెళ్ల సీత, సీతారామకళ్యాణం చిత్రాలలో దర్శకుడు జంద్యాల ఈ చెట్టును చూపించారు.సితార చిత్రంలో వెన్నెల్లో గోదారి అందం సఖి కన్నుల్లో పాటను ఇక్కడే వంశీ చిత్రీకరించారు. ఉండమ్మా బొట్టుపెడతా, శిక్ష, చట్టంతో పోరాటం, తొలికూడి కూసింది చి త్రాలు ఇక్కడే తీయగా సీతారామయ్యగారి మనవరాలు చిత్రానికి అవార్డు దక్కింది. 1991 నుంచి ఇవివి సత్యనారాయణ సీతారత్నంగారి అబ్బాయి, ఏవండి ఆవిడ వ చ్చింది ఇలా తీసిన 23 చిత్రాలకు ఈ చెట్టు కాసులు కురిపించింది. శంకరాభరణం, స్వాతిముత్యం చిత్రాలలో కొన్ని పాటలు చిత్రీకరించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్ళిసందడి, శ్రీరామదాసు చిత్రాలలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్‌బాబు మురారి చిత్రం ఇక్కడ తీసిందే. ఉప్పొంగిందిలే గోదావరి చిత్రంలో వేదమంటి నా గోదారి రామచరితకే పూ దారి పాటను ఇక్కడే చిత్రీకరించారు. అల్లు అర్జున్ నటించిన గంగోత్రి, బన్నీ చిత్రా లు విజయంతమయ్యాయి. గోదావరి ఉప్పొంగింది, పట్టుకుంటే కోటి, గుండెల్లో గోదారి, ఇటీవలి గోదావరి నవ్వింది కూడా ఈ చెట్టు వద్దే త్రీకరించారు. గోదావరి ఒడ్డున తాళ్ళపూడిలో పుట్టిన ప్రముఖ సినీ నిర్మాతలు దాసరి దానయ్య, జడ్డు పుల్లారావు, భగవాన్ ఇక్కడ నుంచే షూటింగ్‌లు ప్రారంభించారు.
1974 లో వచ్చిన పాడిపంటలు
చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
..పాటనుండి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం …సీతా రామయ్య
గారి మనవరాలు లో సమయానికి…,గోదావరి లో ఉప్పొంగేలే
గోదావరి…లాంటి పాటలు …ఇలా ఒకటేమిటి
చెప్పుకుంటూపోతే వందలాది పాటలు… జనాల
గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి…ఇప్పు
డున్న దర్శకులు విదేశాలపై మోజు పెంచుకుని
ఈ చెట్టు పూర్తిగా వదిలేసారు..మళ్లీ మా వంశీ గారు సినిమా
తియ్యకపోతారా .. ఈ చెట్టు కు పూర్వ వైభవం
తీసుకురాకపోతారా…అని వేయి కళ్ల తో
ఎదురుచూస్తూ…
Telugu radio station online Listen and enjoy popular telugu like big fm 92.7 hyderabad ,red fm 93.5 ,radio mirchi 98.3 and many online telugu radios like radio adhurs , 8k radio telugu , mirchi tapaka , nuke radio , hungama telugu , telugu one , radio geethm , nuke radio , manasutho radio , radio city telugu , ap9 fm , telangana radioTune to Telugu FM , AM and internet radio channels online. Listen to telugu latest hits songs from Tollywood. , Telangana fm The best application to listen to all Telugu FM radio stations from Andhra and Telangana మీరు ఆకాశవాణి అభిమానులా? అయితే మరెందుకు ఆలస్యం?పై లింక్ ద్వారా ప్లే స్టోర్ కి వెళ్లి యాప్ ఇన్స్టాల్ చేసుకొండి. ఆకాశవాణి విశాఖపట్నం, విజయవాడ,కడప,హైదరాబాద్ తిరుపతి వంటి స్టేషన్స్ తో బాటుగా ఇతర ఆకాశవాణి స్టేషన్స్ మరెన్నో మ్యూజిక్ ఛానెల్స్ విని ఆనందించండి.నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ????????????????????????????????????????
Telugu radio station online
Listen and enjoy popular telugu like big fm 92.7 hyderabad ,red fm 93.5 ,radio mirchi 98.3 and many online telugu radios like radio adhurs , 8k radio telugu , mirchi tapaka , nuke radio , hungama telugu , telugu one , radio geethm , nuke radio , manasutho radio , radio city telugu , ap9 fm , telangana radioTune to Telugu FM , AM and internet radio channels online. Listen to telugu latest hits songs from Tollywood.
, Telangana fm
The best application to listen to all Telugu FM radio stations from Andhra and Telangana
జపాన్ పౌరుల జీవిత కాలం ఇతరులకంటే ఎక్కువ ఉండడానికి కారణాలు…
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం, జపాన్ మహిళల సరాసరి జీవిర కాలం 87 సంవత్సరాలు, ఇది ప్రపంచంలోనే అత్యధికం. పురుషుల జీవితకాలం అంతర్జాతీయంగా టాప్ 10 లో ఉంది. దానికి గల వివిధ కారణాలు:
1) కూరగాయలు ఎక్కువగా తింటారు. జాపనీస్ వారి సాంప్రదాయక ఆహారంలో బియ్యం, కూరగాయలు మరియు చేపలు ఎక్కువ. కొన్ని రకాల ఆహారాలను పులియబెట్టి తినడం వలన ఎక్కువ విటమిన్లు, మినరల్స్ మరియు ప్రయోజనకరమైన ఫైటోకెమికల్స్ శరీరానికి అందుతాయి.
2) జపాన్ ఒక ద్వీపం కాబట్టి, చేపలు మరియు ఇతర సీఫుడ్ జపనీయుల భోజనంలో అత్యంత ముఖ్యమైన భాగం. చేపల్లో ఇతర మాంసం కన్నా తక్కువ కొలెస్ట్రాల్ మరియు కొవ్వు ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ.
3) ఆహారం వండే విధానం కూడా వేరుగా ఉంటింది. వాటిలో స్టీమింగ్, పాన్ గ్రిల్లింగ్, బ్రాయిలింగ్, స్టిర్-ఫ్రైయింగ్, మరియు పులియబెట్టడం ఎక్కువ.
4) టీ, గ్రీన్ టీ ఎక్కువగా తాగుతారు. మంచి క్వాలిటీ జపనీస్ టీలో యాంటీఆక్సిడెంట్స్ కాఫీ కంటే ఎక్కువ.
5) ఆహారం తాజాగా ఉంటుంది మరియు సీజనల్. జపాన్ చిన్న ద్వీపసమూహం మరియు జనాభాకు సరిపడా సాగునీరు, భూమి ఉన్నందున, ఆహారం నోళ్లలోకి ప్రవేశించే ముందు చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అవి కూరగాయలైనా, చేపలైనా.
6) చిన్న ప్లేట్లలో తినే అలవాటు. ఒకేసారి అధిక మోతాదులో ఆహారం తీసుకోకుండా వీలయినన్ని ఎక్కువ సార్లు చాలా తక్కువ మోతాదులో తింటారు.
7) జపాన్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదా సైకిల్ ప్రయాణం ఎక్కువ. సొంత వాహనం ఉపయోగించడం కన్నా దీనివలన రోజూ కొంత శరీరానికి వ్యాయామం దొరుకుతుంది.
8) 1960 ల నుంచే జపాన్ లో ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా లైఫ్ ఇన్స్యూరెన్సె సౌకర్యం కల్పించారు. అలాగే మెజారిటీ జపనీయులు రెగులర్ గా హెల్త్ చెకప్‌లు చేయించుకుంటారు. సగటున ఒక వ్యక్తి డాక్టర్ను సంవత్సరానికి ఒక డజనుకు పైగా చెక్-అప్స్ కొరకు సంప్రదిస్తాడు.
9.చురుకుగా ఉండి, సరైన ఆహార పదార్ధాలను సరైన విధానంలో తినడం ద్వారా, ఎవరైనా వారి ఆరోగ్యంంగా, ఆనందంగా ఉండడంతో పాటు దీర్ఘాయువు పొందవచ్చు.
ఇటలీలోని ఫ్లోరెన్స్‌కు చెందిన కళాకారుడు చీమాబూయ్ గీసిన అత్యంత పురాతన కళాఖండం.. ఫ్రాన్స్‌లో ఓ వృద్ధురాలి ఇంటిలో గోడకు వేలాడుతూ కనిపించిందని నిపుణులు చెబుతున్నారు
13వ శతాబ్దంలో క్రైస్ట్ మాక్డ్ పేరుతో వరుస పెయింటింగ్‌లను చీమాబూయ్ గీశారు. ఫ్రాన్స్ నగరం కాంపియేన్‌లో తాజాగా బయటపడిన కళాఖండం వీటిలో ఒకటి.
వచ్చే నెలలో నిర్వహించబోతున్న వేలంలో ఇది రూ. 46.39 కోట్లు ( సుమారు ఆరు మిలియన్ల యూరోలు) పలుకుతుందని అంచనా.
దీని మూలాలను ధ్రువీకరించడంలో ఎలాంటి వివాదమూ లేదని నిపుణులు తెలిపారు.
ఈ కళాఖండానికి ఇన్‌ఫ్రారెడ్ కాంతితో పరీక్షలు నిర్వహించారు. చీమాబూయ్ గీసిన ఇతర కళాఖండాలతో దీన్ని పోల్చిచూశారు. చీమాబుయ్‌నే.. చెనీ డీ పెపో అని కూడా పిలుస్తుంటారు.
”వీటన్నింటినీ గీసిన చేయి ఒక్కటే” అని కళాఖండాల నిపుణుడు ఎరిక్ టర్కిన్ చెప్పినట్లు ఫ్రాన్స్ పత్రిక లె ఫిగారో తెలిపింది.
చివరగా క్రీస్తు జెరూసలేంలో అడుగుపెట్టినప్పటి నుంచి శిలువ వేసేవరకు మధ్య జరిగిన పరిణామాలను వివరించే పెయింటింగ్‌ల సిరీస్‌లో ఇదీ కూడా ఒకటని నిపుణులు భావిస్తున్నారు. దీన్ని 1280ల్లో గీసినట్లు వారు అంచనా వేస్తున్నారు.
చీమాబూయ్‌పై బైజాంటైన్ పెయింటింగ్ శైలి ప్రభావం కనిపిస్తుంది. బైజాంటైన్‌లో పాప్లర్ చెక్కలపై గోల్డ్ పెయింట్ బ్యాగ్రౌండ్‌తో పెయింటింగ్ వేస్తుంటారు.
తాజా పెయింటింగ్ మూలాలను గుర్తుపట్టేందుకు ఉపయోగపడిన కీలక ఆధారాల్లో ఈ ప్యానెల్ కూడా ఒకటని ద ఆర్ట్ పత్రికకు టర్కిన్ తెలిపారు.
”ప్యానెల్‌పై పురుగులు చేసిన చిన్న సొరంగాలు కనిపిస్తున్నాయి” అని పెయింటింగ్ చెక్క ప్యానెల్‌పై పురుగులు చేసిన రంధ్రాల గురించి ప్రస్తావిస్తూ ఆయన అన్నారు. చీమాబూయ్ ఇతర కళాఖండాలపైనా ఇలాంటి ఆనవాళ్లే కనిపించాయని చెప్పారు. ”ఇది అలాంటి పాప్లర్ చెక్కతో తయారుచేసిన ప్యానెలే”అని ఆయన వివరించారు.
వంటగదిలోని పొయ్యికి దగ్గర్లోని గోడపై వృద్ధురాలు దీన్ని వేలాడదీశారు. దీన్ని అక్టోబరు 27న వేలం వేయనున్నారు.
చీమాబూయ్ పెయింటింగ్ సిరీస్‌లో దీనికి సంబంధించిన మరో రెండు పెయింటింగ్‌ను లండన్ నేషనల్ గ్యాలరీ, న్యూయార్క్‌లోని ఫ్రిక్ కలెక్షన్‌లలో చూడొచ్చు.
మన దైనందిన జీవితంలో డబ్బుకు ఎంతో విలువ ఇస్తాం. డబ్బును కరెన్సీ నోట్ల రూపంలో వాడుతాం. ఎందుకంటే నిర్దిష్ట నోటుపై వాగ్దానం చేసిన సంతకం వల్ల దానికి ఆ విలువ వస్తుంది. అయితే మన కరెన్సీ నోట్ల గురించి ఎంత మందికి తెలుసు? అతి చిన్న విలువైన రూపాయి నోటు దగ్గర నుంచి 2 వేల నోటు వరకు మనదేశంలో చాలా నోట్లు చలామణిలో ఉన్నాయి. ఒక్క రూపాయి నోటు మినహా మిగతా అన్ని నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉంటుంది. రూపాయి నోటు మీద మాత్రం భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. ఆర్బీఐని 1935లో స్థాపించారు. 1949లో దీన్ని జాతీయం చేశారు. 1949కి ముందు అన్ని కరెన్సీ నోట్లను ఆర్పీఐ బదులు భారత ఆర్థిక కార్యదర్శి తరఫున జారీ చేసేవారు.
ఆ తర్వాతి కాలంలో ఆ బాధ్యతను అపెక్స్ బ్యాంకుకి అప్పగించారు. అప్పటి నుంచి అన్ని కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంతకం చేస్తుండగా.. రూపాయి నోటుపై మాత్రం ఆర్థిక కార్యదర్శి సంతకాన్ని కొనసాగించారు. 1994 తర్వాత రూపాయి నోటు చెలామణిలో లేకుండా పోయింది. దీన్ని టోకెన్ కరెన్సీ నోటుగా పరిగణించారు.
ఆర్బీఐ ముద్రించిన అత్యధిక విలువ కలిగిన నోటు రూ.10,000. దీన్ని1938లో ప్రవేశపెట్టారు. 1946లో దీన్ని రద్దుచేశారు. అయితే 1954 ఈ నోటును మళ్లీ ప్రవేశపెట్టారు. తిరిగి 1978లో రద్దు చేశారు. భారత కరెన్సీ నోట్ల గురించి ఆసక్తికర విషయమేమంటే ప్రస్తుతం వాడుతున్న నోట్ల తయారీలో 100 శాతం పత్తినే వినియోగిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ సంతకం చేసిన ప్రతి నోటుపై ఒక స్టేట్‌మెంట్ ముద్రించి ఉంటుంది. నోటుపై పేర్కొన్న విలువను బేరర్‌కు చెల్లిస్తామని ఇది హామీ ఇస్తుంది.
ఆర్బీఐ గవర్నర్ చేసే ఈ ప్రకటన, ఒక రకమైన ప్రామీసరి నోటు వంటిది. ఇది ఎవరి దగ్గరయితే ఉంటుందో, వారే లీగల్ టెండర్ అవుతారు. దీన్ని దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ప్రామీసరి నోటు అనేది ఒక రకంగా ఆర్బీఐ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం. దీని ప్రకారం ఆ నోటుపై ఉన్న విలువ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంది. ఏ కరెన్సీ నోటుపై ప్రామీసరి నోటు లేకపోయినట్లయితే ఏ విదేశం లేదా సంస్థ దాన్ని అంగీకరించదు.
Do you know how much it costs to print Indian currency!
ఇండియన్ కరెన్సీని ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా!
డబ్బు.. గల్లీ నుంచి ప్రపంచ దేశాల వరకు ప్రతి ఒక్కరితో దీనితో అమితమైన సంబంధం ఉంటుంది. ఎన్ని చేతులు మారిన విలువ మారనిది డబ్బు ఒకటే. సంపాదిస్తే కానీ డబ్బు విలువ తెలీసిరాదంటారు. చాలామంది డబ్బు ద్వారానే విలువస్తుందని భావిస్తుంటారు. ఏ పని చేసినా దాని కోసమే. మనిషి జీవితాన్ని శాసించేది కూడా డబ్బే. డబ్బు సంపాదించడం కంటే దాన్ని పొదుపు చేయడం చాలా కష్టం.
చూడటానికి కాగితం ముక్కే కావచ్చు కానీ ఓ వ్యక్తి జీవితాన్నే మార్చేయగలదు. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎన్నో విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి.మరి అలాంటి డబ్బులను ప్రింట్ చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా.. ఒక సాధారణ కాగితానికి 10,100.. నుంచి 2000 రూపాయల విలువ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది.
భారతీయ కరన్సీని ముద్రించడానికి అయ్యే ఖర్చు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
► 2018 నాటి డేటా ప్రకారం.. 10 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది.
►20 రూపాయల నోటును ముంద్రించడానికి 1 రూపాయి ఖర్చు అవుతుంది. అంటే దీనికి 10 రూపాయల నోటు కంటే తక్కువ ఖర్చు అవుతుంది.
► 50 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది.
►100 రూపాయల నోటును ముద్రించడానికి 1.51 పైసలు ఖర్చవుతుంది.
►200 రూపాయల నోటును ముద్రించడానికి 2.15 పైసలు ఖర్చవుతుంది.
►500 రూపాయల నోటును ముద్రించడానికి 2.57 పైసలు ఖర్చవుతుంది.
►2000 రపాయల నోటును ముద్రించడానికి 4.18 పైసలు ఖర్చు అవుతుంది.
వీటితో పాటు ప్రభుత్వం రద్దు చేసిన పాత 500, 1000 రూపాయల నోట్ల ఖర్చు కూడా చూసుకుంటే..
►పాత 500 రూపాయల నోటును ముద్రించడానికి 3.09 పైసలు ఖర్చు అవుతుంది. అంటే కొత్త 500 రూపాయల కంటే 52పైసలు అధికం.
►పాత 1000 రూపాయల నోటును ముంద్రించడానికి 3.54 పైసలు ఖర్చు అవుతుంది. అంతే కొత్త 2000 రూపాయల కంటే 64 పైసలు తక్కువ.
More Bank Accounts : బ్యాంకులు ఆఫర్లు ప్రకటించడంతో జనాలు పాత ఖాతాలను మరిచిపోయి కొత్త ఖాతాలను తెరుస్తారు. దీంతో కొంతమంది పాత ఖాతాలను మీకు తెలియకుండా యధేచ్చగా వాడుతున్నారు. ఢిల్లీకి చెందిన సుమిత్ త్యాగి ఐటి కంపెనీలో పనిచేస్తున్నాడు. తన పాత ఖాతా ద్వారా మోసం జరిగిందని బ్యాంకు నుంచి అతడికి ఒక రోజు కాల్ వచ్చింది. వెంటనే అతడు బ్యాంకుకు వెళ్లి ఈ ఖాతాను చాలా సంవత్సరాలుగా వాడటం లేదని చెప్పాడు. అటువంటి సమయంలో అతడికి బ్యాంకు నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.
మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలుంటే అది క్రియారహితంగా మారితే వెంటనే వాటిని క్లోజ్ చేయండి. లేదంటే రాబోయే కాలంలో పెద్ద సమస్యలు ఎదురవుతాయి.
మీ ఖాతాలో మూడు నెలలు జీతం క్రెడిట్ కాకపోతే వెంటనే ఆ ఖాతా పొదుపు ఖాతాగా మారుతుంది. పొదుపు ఖాతాలో మార్పు వచ్చినప్పుడు బ్యాంక్ కొత్త నియమాలు వర్తిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు పొదుపు ఖాతాలో కనీస మొత్తాన్ని నిర్వహించాలి. ఒకవేళ నిర్వహించకపోతే మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. బ్యాంక్ మీ ఖాతాలో జమ చేసిన మొత్తం నుంచి డబ్బును కట్ చేయవచ్చు.
చాలా బ్యాంకులలో ఖాతా ఉన్నందున మీరు అన్ని ఖాతాలలో కనీస బ్యాలెన్స్ కలిగి ఉండాలి. నిర్ణీత మొత్తాన్ని అందులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ డబ్బు మొత్తం ఖాతాల మెయింటనెన్స్‌కే సరిపోతుంది. అంతేకాదు కేవలం మీకు 4 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది. అదే ఆ డబ్బులు వేరేదాంట్లో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తాన్ని సంపాదించవచ్చు. మీరు చాలా బ్యాంకు ఖాతాల విషయంలో సేవా ఛార్జీలు చెల్లించాలి. అటువంటి పరిస్థితిలో మీరు సేవను సద్వినియోగం చేసుకోకుండా పెద్ద మొత్తంలో ఛార్జీలుగా చెల్లిస్తారు.
ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండటం మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేనందున క్రెడిట్ స్కోరు క్షీణిస్తుంది. అటువంటి పరిస్థితిలో రుణం తీసుకోవడంలో మీరు సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే వాడని ఖాతాలను క్లోజ్ చేయండి.. బ్యాంక్ ఖాతాను మూసివేసేటప్పుడు మీరు చాలా విషయాలను తెలుసుకోవాలి. అందులో మొదటిది మీరు D- లింక్ ఫారమ్ నింపాలి. ఖాతా మూసివేత ఫారం బ్యాంక్ శాఖలో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఖాతా మూసివేస్తున్నప్పుడు కారణం చెప్పాలి. మీ ఖాతా ఉమ్మడి ఖాతా అయితే ఇద్దరి సంతకాలు అవసరం.
మీరు రెండో ఫారమ్‌ను కూడా పూరించాలి. ఇందులో మిగిలిన డబ్బును వేరే ఖాతాకు బదిలీ చేసుకోవాలి. ఖాతాను మూసివేయడానికి మీ ఖాతా ఉన్న బ్యాంకు మీరు కచ్చితంగా వెళ్లాలి. అకౌంట్ తెరిచిన 14 రోజుల్లో ఖాతా మూసివేయడానికి బ్యాంకులు ఎలాంటి రుసుము వసూలు చేయవు. 14 రోజుల తరువాత, ఒక సంవత్సరం పూర్తయ్యే ముందు ఖాతాను మూసివేస్తే మీరు ఖాతా మూసివేత ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది.
ఉపయోగించని చెక్‌బుక్, డెబిట్ కార్డుతో పాటు బ్యాంక్ క్లోజర్ ఫారమ్‌ను జమ చేయమని బ్యాంక్ మిమ్మల్ని అడుగుతుంది. ఖాతాలో ఉన్న డబ్బును మీ ఇతర బ్యాంకు ఖాతాకు బదిలీ చేసే అవకాశం కూడా మీకు ఉంటుందని గుర్తుంచుకోండి. మీ ఖాతాలో మీకు ఎక్కువ డబ్బు ఉంటే మూసివేత ప్రక్రియను ప్రారంభించే ముందు దాన్ని మరొక ఖాతాకు బదిలీ చేయండి. ఖాతా మూసివేత గురించి ప్రస్తావిస్తూ చివరిసారిగా జరిపిన లావాదేవీల సాక్ష్యాలను మీ వద్ద ఉంచుకోండి.