TG Politics: ‘నన్ను.. నా పార్టీని టచ్ చేసి చూడు..’ సీఎం రేవంత్‌కు కేసీఆర్ ఛాలెంజ్

తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి (KRMB) అప్పగించడాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోకి వెళ్లేలా చేస్తున్నారంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు.
తాజాగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (BRS Chief KCR) సైతం ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం కృష్ణా పరివాహక ప్రాంతం నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చిన 10 ఏళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదని అన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఆనాడే చెప్పిన…

”ప్రాజెక్ట్‌లు మాకు అప్పగించాలని లేదంటే మేమే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ నన్ను బెదిరించారు. కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో… నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా… తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే అస్సలే ఊరుకోను.. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పిన. నన్ను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను …నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు… నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకున్నది.. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నం… దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడూ వెనక్కు పోడు… ఉడుత బెదిరింపులకు భయపడను… ముందు ముందు ఏందో చూద్దాం… తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు” అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related News

 

Related News