Telangana: తుక్కుగూడ సభ వేదికగా మాస్టర్ స్కెచ్.. కాంగ్రెస్‌లోకి 12 మంది BRS ఎమ్మెల్యేలు..?

ఆపరేషన్ తుక్కుగూడ.. పదిలక్షల మందితో భారీ జన జాతర. రేవంత్‌రెడ్డి కటౌట్ సైజులు నేషనల్ రేంజ్‌కి చేరుకునే వేదిక.. తెలంగాణ కాంగ్రెస్‌ ఖలేజా చూపెట్టడానికి మరో సువర్ణావకాశం.. ఇలా అనేకానేక స్పెషాలిటీస్‌తో ప్రచారం చేసుకుంటోంది హస్తం క్యాడర్. కానీ.. తుక్కుగూడకు సంబంధించి వీటన్నిటికీ మించి సూపర్‌స్పెషాలిటీ ఒకటుంది. రేవంత్‌ రెడ్డి ప్రిస్టీజియస్‌గా భావిస్తున్న ఆ ప్రత్యేకత ఏంటి? బీఆర్‌ఎస్ పార్టీకి షాకిచ్చే ఆ ఎలిమెంట్ ఏమై ఉంటుంది..?
2023… సెప్టెంబర్ 17.. వేదిక తుక్కుగూడ మైదానం.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమరం కోసం పూరించిన శంఖారావం.. పోటెత్తిన జనం.. చెప్పిమరీ అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ. అందుకే.. తమకు కలిసొచ్చిన తుక్కుగూడ సెంటిమెంట్‌ను లోక్‌సభ ఎన్నికల్లో కూడా రిపీట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈనెల ఆరున శనివారం సాయంత్రం జరిగే తుక్కుగూడ జనజాతర సభతో హిస్టరీ రిపీట్‌ చేయాలన్నది రేవంత్ టీమ్ లక్ష్యం. పదిలక్షలమంది జనాన్ని సమీకరించాలన్నది టార్గెట్. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి జాతీయ నేతలు హాజరయ్యే సభ కనుక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

70 ఎకరాల్లో సభ, 550 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు… వారం రోజులుగా రూపుదిద్దుకుంటున్న సభా వేదిక.. ఆదిలాబాద్ మొద‌లు ఆలంపూర్ వ‌ర‌కు, జహీరాబాద్ నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు జరుగుతున్న జన సమీకరణ… ఇవన్నీ కలిసి తుక్కుగూడ సభ తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్‌వాంటెడ్‌గా మార్చేశాయ్. వీటన్నికంటే ముఖ్యంగా పాంచ్‌న్యాయ్-పచీస్ గ్యారంటీస్ పేరుతో లాంచనంగా విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టో తుక్కుగూడ సభావేదిక మీదే జనానికి పరిచయం కాబోతోంది. అందుకే దేశం చూపు తుక్కుగూడ వైపు అంటూ ప్రచారం చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.

కనీసం 13 ఎంపీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఆ మేరకు పార్టీ లీడర్‌షిప్‌ను బలోపేతం చేసుకుంటోంది. గేట్లెత్తేశామని ఓపెన్‌గా చెప్పిమరీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేస్తోంది. అందుకే… తుక్కుగూడ సభను చేరికల సభగా కూడా అంతర్గతంగా ప్రకటించుకుంటోంది. కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలుంటాయని ఇప్పటికే సంకేతాలు కూడా వచ్చేశాయ్.

Related News

హైకమాండ్ సమక్షంలో పార్టీలో చేర్చుకునేందుకు కొన్నాళ్లుగా ప్రతిపక్ష నేతలకు గాలం వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది టీమ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఏ పార్టీ నుంచి ఎవరెవరు ఎంతెంతమంది కాంగ్రెస్‌లో చేరతారనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఒక్క గులాబీ పార్టీ నుంచే ఏకంగా 12 మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలు వీరే…

కాలె యాదయ్య – చేవెళ్ల
తెల్లం వెంకట్‌రావు- భద్రాచలం
గంగుల కమలాకర్- కరీంనగర్
అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి
కోవా లక్ష్మి – అసిఫాబాద్
సుధీర్ రెడ్డి – ఎల్‌బీనగర్
ప్రకాష్ గౌడ్- రాజేందర్ నగర్
కె. మాణిక్‌ రావ్- జహీరాబాద్
ముఠా గోపాల్ -ముషీరాబాద్
కాలేరు వెంకటేష్- అంబర్ పేట్
మాగుంటి గోపినాథ్ -జూబ్లీహిల్స్
బండారి లక్ష్మారెడ్డి – ఉప్పల్
కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్న ఈ 12 మందిలో కరడుగట్టిన బీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఉన్నారు. వీరిలో ఎంతమంది కాంగ్రెస్‌లో చేరతారు.. ఎంతమంది వెనక్కు తగ్గుతారు అనేది ఆసక్తికరం. కానీ. బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా వర్కవుట్ చేస్తోంది. అటు.. చేరికల విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా తర్జన భర్జన మాత్రం ఆగలేదు.

బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ లేవకుండా దెబ్బకొట్టాలని చూస్తున్న రేవంత్‌రెడ్డి మాత్రం.. ఆపరేషన్ ఆకర్ష్‌ని గట్టిగానే ప్రయోగిస్తున్నారు. ఒకవైపు జనసమీకరణ.. మరోవైపు చేరికల సునామీ.. ఇలా రెండు విధాలుగా తుక్కుగూడ సభను విజయవంతం చేసి.. జాతీయస్థాయిలో ఢిల్లీ పెద్దల సమక్షంలో తన స్టామినాను మరోసారి చాటుకోవాలన్నది రేవంత్‌రెడ్డి సంకల్పంగా తెలుస్తోంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *