Sunday, November 17, 2024

Tallest Sai Baba Statue -ప్రపంచంలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Everything About The World’s Tallest Sai Baba Statue In East Godavari
Tallest Sai Baba Statue -ప్రపంచంలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

షిరిడి సాయిబాబాను హిందువులు, ముస్లింలు రెండు మతాల వారు పూజిస్తారు. ఎందుకంటే రెండు మతాల పద్ధతిలో అయన బోధనలు చేసాడు. సాయిబాబా యొక్క ముఖ్యమైన వాక్కు అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్. సాధువు, యోగి అయినా ఈయనను హిందువులు శివుని అవతారంగా కొలుస్తుంటారు. మరి ప్రపంచంలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా లో సాయిబాబా ఆలయం ఉంది. ఇక్కడ 116 అడుగుల షిరిడి సాయిబాబా విగ్రహం భక్తులకి దర్శనం ఇస్తుంది. ఇక్కడి సాయిబాబా విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద సాయిబాబా విగ్రహంగా చెబుతారు. ఈ విగ్రహ నిర్మాణం 2000 సంవత్సరంలో మొదలవ్వగా విగ్రహ నిర్మాణం పూర్తవ్వడానికి 12 సంవత్సరాల సమయం పట్టింది. ఈ విగ్రహ బరువు సుమారుగా వెయ్యి టన్నులకు పైగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ విగ్రహాన్ని నాలుగు అంతస్థుల భజన మందిరం నిర్మించి దానిపైన సాయిబాబు కుర్చునట్లుగా నిర్మించారు. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారుగా 4 కోట్ల రూపాయలు వ్యయం అయిందట. ఇక ఈ ఆలయంలో ప్రతి గురువారం ఉదయం జరిగే సాయి పల్లకి సేవకి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
ఇది ఇలా ఉంటె, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం షిరిడి. ఇక్కడ కొలువై ఉన్న సాయిబాబా ని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి కుల, మతం లేకుండా భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాజిల్లా విజయవాడ కృష్ణలంకలోని భ్రమరాంబాపురంలో సాయిబాబా మందిరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసిన మొట్టమొదటి సాయిబాబా మందిరం ఇదేనని చెబుతారు. ఇక్కడ సాయిబాబా విగ్రహం ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ బాబా విగ్రహం సిమెంట్ తో చేయబడింది. ఈ ఆలయంలో ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం సాయిబాబా కు పల్లకి సేవ జరుగుతుంది. ఇంకా గురుపూర్ణిమ రోజు బాబాకు అన్నాభిషేకం జరుగుతుంది. ఈ రోజున పేదలకి అన్నదానం కూడా జరుగుతుంది.

Usha teacher-16 ఏళ్లుగా అడవిలో నడిచి వెళ్లి ,నదిలో పడవ పై స్కూల్ కి వెళ్లి పాఠాలు చెప్తున్న ఉషా టీచర్…వివరాలు…..

కేరళలోని నెయ్యార్‌ అటవీప్రాంతంలో అగస్త్యర్కూడం గ్రామం ఎత్తైన కొండపైన ఉంది. గిరిజన బాలల కోసమే ఇరవై ఏళ్ల క్రితం అక్కడో పాఠశాల ఏర్పాటైంది. స్కూల్‌లో తక్కువ మంది చిన్నారులున్నా… టీచర్లకు మాత్రం అక్కడ పనిచేయాలంటే హడల్‌.
ఎందుకంటే పడవ ప్రయాణం చేసి… ఏనుగులూ, చిరుతలూ సంచరించే అడవిలో నడుచుకుంటూ.. కొండలూ గుట్టలూ ఎక్కితేనే ఆ స్కూల్‌ని చేరుకోగలం. గత పదహారేళ్లుగా ఉషాకుమారి అలానే బడికెళుతోంది. ఉదయం ఏడున్నరకి ఇంట్లో బయల్దేరి నది వరకూ స్కూటీపై వచ్చే ఉష అక్కడి నుంచి పడవ ఎక్కి అడవి వద్దకు చేరుకుంటుంది. కర్రసాయంతో అడవి కమ్మేసిన కొండని ఎక్కుతూ మార్గమధ్యంలోని తండాల్లో ఉండే పిల్లల్ని కూడా బడికి తీసుకెళుతుంది. మధ్యాహ్న భోజనం పథకం కింద నిధులు సక్రమంగా రాకపోయినా ఆమె జీతం వెచ్చించి మరీ చిన్నారులకు కడుపునింపుతుంది. ఉష ఒక్కరే ఆ స్కూల్లో టీచర్‌. గిరిజనుల జీవితంలో మార్పు తేవాలన్న ధ్యేయంతోనే ఎంత కష్టమైనా ఆ బడిలో పనిచేస్తున్న ఉష సెలవులు కూడా పెట్టడానికి ఇష్టపడదంటే నమ్ముతారా!

Passport colours – పాస్‌పోర్టులు ఆ రంగుల్లోనే ఎందుకు? నాలుగు వర్ణాల్లోనే ప్రపంచ దేశాల పాస్‌పోర్టులు

పాస్‌పోర్టులు ఆ రంగుల్లోనే ఎందుకు?
నాలుగు వర్ణాల్లోనే ప్రపంచ దేశాల పాస్‌పోర్టులు

వివిధ దేశాలకు చెందిన పాస్‌పోర్టులను ఎప్పుడైనా గమనించారా? అవి కేవలం నాలుగు రంగుల్లోనే ఉంటాయి. పాస్‌పోర్టు ఫలానా రంగుతోనే ఉండాలని ప్రపంచంలో ఎక్కడా చట్టాలు గానీ, మార్గదర్శకాలు కానీ లేవు. అయినా కేవలం ఎరుపు, నీలం, నలుపు, ఆకుపచ్చ రంగుల్లోనే కనిపిస్తుంటాయి. ఏ దేశానికి చెందిన పాస్‌పోర్టును పరిశీలించినా ఈ నాలుగు రంగుల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. అయితే, దీనికి గల కారణాలను ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.
ముదురు వర్ణంతో నలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లోనే పాస్‌పోర్టులు తయారు చేయడం వల్ల అవి అధికారికంగా కనిపిస్తాయి (అఫీషియల్‌ లుక్‌). తర్వాతి ప్రాధాన్యం చాలా అరుదుగా నియాన్‌ పింక్‌ రంగుకు ఇస్తారు. అంతేకాక దేశాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆయా దేశాలు ఈ నాలుగు రంగుల్లోనే ఏదో ఒకదాన్ని ఎంచుకుంటాయి. మతపరంగా ఇస్లాంను ఆకుపచ్చ రంగు ప్రతిబింబిస్తుంది కాబట్టి సంబంధిత దేశాల పాస్‌పోర్టులు ఎక్కువగా ఈ రంగులో ఉంటాయి. ఎరుపు రంగుతో ఎక్కువగా ఐరోపా దేశాల పాస్‌పోర్టులు కనిపిస్తాయి. నీలం రంగుతో భారత పాస్‌పోర్టులు ఉంటాయి.
అంతేకాక, పాస్‌పోర్టు తయారీలో కొన్ని అంతర్జాతీయ నిబంధనలు ఉన్నాయి. వీటిని అన్ని దేశాలు కచ్చితంగా పాటించాల్సిందే. పాస్‌పోర్టు తయారు చేసే పేజీలు వంగే గుణం కలిగి ఉండాలి. ఇదే సమయంలో అవి మడత పడకుండా, రసాయనాలకు దెబ్బతినకుండా ఉండాలి. ఉష్ణోగ్రత, తేమ, కాంతి తగిలినా పాడవకుండా తట్టుకోగలగాలి. అందులో వాడే అక్షరాల పరిమాణం, రకం (ఫాంట్‌ టైప్‌) అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) ప్రమాణాలకు లోబడి ఉండాలి. అయితే, పాస్‌పోర్టు రంగు విషయంలో మాత్రం నిబంధనలేవీ లేవని ఐసీఏఓ చీఫ్‌ అంటోనీ ఫిలిబిన్‌ ధ్రువీకరించారు.

సినిమా షూటింగ్ లో క్లాప్ ఎందుకు కొడతారు..దాని ప్రాముఖ్యత ఏంటి..?

Why is there a clap in film shooting..what is its significance ..?

సినిమా షూటింగ్ లో క్లాప్ ఎందుకు కొడతారు..దాని ప్రాముఖ్యత ఏంటి..?

Why is there a clap in film shooting..what is its significance ..? సినిమా షూటింగ్ లో క్లాప్ ఎందుకు కొడతారు..దాని ప్రాముఖ్యత ఏంటి..?
సినిమా షూటింగ్ జరిగే టైంలో మనకు కొన్ని కామన్ మాటలు వినిపిస్తాయి. అవే యాక్షన్‌, కట్. యాక్షన్ అని చెప్పగానే సీన్ షూటింగ్ మొదలవుతుంది. కట్ అని చెప్పగానే ఆగిపోతుంది. వీటితో పాటు ఇంకో ప్రధానమైన విషయం క్లాప్ సౌండ్. ఒక సీన్ ప్రారంభం అయ్యే సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి క్లాప్ కొడతాడు. అసలు ఈ క్లాప్ ఎందుకు కొడతారు? దీని వలన మూవీ యూనిట్ కు జరిగే మేలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ క్లాప్ బోర్డు అనేది చాలా కాలంగా ఉంది. సినిమాలు తీసేటప్పుడు కెమెరా సౌండ్ రికార్డు చేయదు. సీన్స్ షూట్ చేయడానికి కెమెరా.. సౌండ్ రికార్డు చేయడానికి ఇంకో పరికరం వాడుతారు. చాలా చోట్ల ఇదే విధానం కొనసాగుతుంది.

అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో సీన్ కు తగ్గట్లు సౌండ్ సింక్ చేయడానికి వీడియో ఎడిటర్స్ క్లాప్ టైమింగ్ చూసుకుంటారు.

క్లాప్ కొట్టిన వెంటనే వచ్చే డైలాగ్ చూసుకుని.. దానికి రికార్డు చేసిన వాయిస్ మిక్స్ చేస్తారు. అంతేకాదు.. సెట్స్ చాలా మంది ఉంటారు. క్లాప్ కొట్టిన వెంటనే సీన్ మొదలవుతుందని భావించి సైలెంట్ అవుతరు. నిజానికి సినిమాల్లో చూపించిన ఆర్డర్ లో సీన్స్ రికార్డు చేయరు. యాక్టర్ల డేట్స్, షూటింగ్ లొకేషన్ బట్టి షూటింగ్ కొనసాగుతుంది. ఫైనల్ గా సీన్స్ అన్నీ లైన్ గా పెడతారు. సీన్స్ ఆర్డర్ లో ఉండవు కాబట్టి, ఏ సీన్ ఎక్కడ రావాలో తెలియక వీడియో ఎడిటర్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే క్లాప్ బోర్డు మీద ప్రొడక్షన్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ తో పాటు స్క్రిప్ట్ తో సీన్ నెంబర్, టేక్ నెంబర్ కూడా రాస్తారు. ఈ పద్దతి మూలంగా మూవీ ఎడిటింగ్ ఈజీ అవుతుంది. షూటింగ్ సమయంలో క్లాప్ బోర్డుతో పాటు ఎండ్ బోర్డు కూడా వాడుతారు. ఆరోజు షూటింగ్ అయ్యాక షెడ్యూల్ లో సీన్స్ షూట్ అయిపోయిందనే దానికి గుర్తుగా క్లాప్ బోర్డును తిప్పి పట్టుకుంటారు. దాన్నే ఎండ్ బోర్డు అంటారు.

Small Pocket For Jeans : జీన్స్ ప్యాంట్‌కి ఆ చిన్న పాకెట్ ఎందుకుంటుందో తెలుసా..? దానికో ప్రత్యేక కారణం ఉంది.. అదేంటంటే..!

Small Pocket For Jeans : కొన్నేళ్ల క్రితం జీన్స్ రిచ్‌గా ఉండటానికి సంకేతం. కానీ ఇప్పుడు సాధారణమై పోయింది. ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుపెడితే పండు ముదుసలి వరకు వేసుకుంటున్నారు. జీన్స్ ప్యాంట్లు అందరికి సౌకర్యవంతంగా ఉంటాయి. అంతేకాకుండా స్టైలిష్‌గా ఉంటాయి. దీంతో అందరు జీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. యువత జీన్స్‌ వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. డ్రెస్‌ కొనాలంటే ముందుగా జీన్స్‌కే ప్రాధాన్యమిస్తారు. అందుకే కొన్నేళ్లుగా జీన్స్‌కి ఆదరణ భారీగా పెరిగిపోయింది.

జీన్స్‌లో చాలా రకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే అన్నింట్లోనూ కుడి వైపు జేబులో చిన్న పాకెట్‌ మాత్రం కామన్‌గా ఉంటుంది.
దాన్ని ఎందుకు పెట్టారో..? దాని ఉపయోగమేమిటో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కానీ దానికో కారణం ఉంది. అదేమిటంటే 18, 19 శతాబ్దాల్లో ప్రజలు ఎక్కువగా గుర్రాలపై ప్రయాణించేవారు. అందులోనూ పశువుల కాపరులు ఎక్కువగా గుర్రాలపైనే తిరిగేవారు. వారు వాచీలు చేతికి బదులుగా జేబులో పెట్టుకుని తిరిగేవారు. అయితే వాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు జేబుపై చేతులు తగిలో.. ఏదైన వస్తువు తగిలో వాచీలు విరిగిపోయేవట. టైం చూసుకోవడానికి జేబులోంచి వాచీ తీస్తున్నప్పుడు కింద పడిపోయేవట. అలా వారి వాచీ భద్రంగా ఉండేలా కుడి జేబులోనే మరో చిన్న జేబును ఏర్పాటు చేశారు.

తర్వాత చైన్‌తో కూడిన వాచీని చిన్న జేబులో పెట్టుకొని బెల్టులకు కట్టుకునేవారట. దీంతో వాచీ కిందపడటం.. విరగడం వంటివి జరిగేది కాదు. అప్పుడు మొదలైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడు మాత్రం అందరూ వాటిని కీ చైన్స్‌.. ఐపాడ్‌.. విలువైన చిన్న వస్తువులు పెట్టుకోవడానికి సీక్రెట్‌ పాకెట్‌గా వినియోగిస్తున్నారు. నేటి యుగంలో ఇది ఒక ఫ్యాషన్‌గా మారింది. తరచుగా ఒకరి అవసరం మరొకరికి ఫ్యాషన్ అవుతుంది.

మన భూమి లోతు ఎంత ? అలా తవ్వుకుంటూ పోతే ఎంత లోతు వరకు వెళ్లగలం?

How deep is our earth? How deep can you go if you don’t dig like that?

మన భూమి లోతు ఎంత ? అలా తవ్వుకుంటూ పోతే ఎంత లోతు వరకు వెళ్లగలం? 1989 అప్పటి సోవియట్ కు చెందిన సైంటిస్టులు భూమిని ఎంతవరకు తవ్వగలమోనని ప్రయోగం చేశారు. అప్పుడున్న టెక్నాలజీతో వాళ్లు 12 కిలోమీటర్ల 262 మీటర్ల వరకే మాత్రమే తవ్వగలిగారు. ఆ తర్వాత భూమి నుంచి రిలీజైన టెంపరేచర్ కారణంగా ఆ పనులను అక్కడే వదిలేశారు. దాదాపు 19 ఏళ్ల పాటు డ్రిల్లింగ్ ద్వారా తవ్వారు. ఇక మరింత లోతు తవ్వటం సాధ్యం కాదని అర్థం కావటంతో 2008 లో దాన్ని మూసేశారు.

కానీ భూమి లోతుతో పోల్చుకుంటే మనం తవ్వింది చాలా తక్కువ. ఎర్త్ మీద ఉండే క్రస్ట్ ఒక్కటే 70 కిలోమీటర్ల లోతు ఉంటుంది. సరిగ్గా భూమి మధ్య భాగంలోకి వెళ్లాలంటే 6, 371 కిలోమీటర్లు తవ్వాలి.

భూమికి మరో పక్కకు వెళ్లాలంటే 12, 742 కిలోమీటర్లు ఉంటుంది. అటు నుంచి ఇటు పూర్తిగా తవ్వగలిగితే గంట 40 నిమిషాల్లో ఆ వైపుకు చేరవచ్చు. కానీ అది అంతా ఈజీ కాదు. ఎందుకంటే భూమి లోపలికి వెళ్లే కొద్దీ టెంపరేచర్, ప్రెజర్ భారీగా పెరుగుతుంది.

అది ఏ స్థాయి లో ఉంటుందంటే భూమి సెంటర్ పాయింట్ లో 6000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ ఎలాంటి వస్తువైనా సరే కరిగిపోవాల్సిందే. ఇక ప్రెజర్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రతి 30 ఫీట్లకు 14 పీఎస్ఐ యూనిట్ల ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. సెంటర్ పాయింట్ లో ఉండే ప్రెజర్ ఎంతో తెలుసుకుంటే అమ్మో అంటారు. అవును ఇక్కడ భూమిపై కన్నా 3 వేల మిలియన్ల రెట్ల ఎక్కువ ప్రెజర్ ఉంటుంది.

????ఆయన చదువు మాత్రమే చెప్పే టీచరు కాదు.. పేద విద్యార్థులను సొంత ఖర్చుతో చదివించే ఉదార హృదయుడు కూడా! సేవా స్ఫూర్తి కొనసాగిస్తున్న ఆయన గురించి..

ఆయన చదువు మాత్రమే చెప్పే టీచరు కాదు.. పేద విద్యార్థులను సొంత ఖర్చుతో చదివించే ఉదార హృదయుడు కూడా! పాఠాలు చెప్పే బడిపంతులు మాత్రమే కాదు… బడికి అవసరమైన వసతులు, వస్తువులు సమకూర్చే గురు దేవుడు కూడా! విశాఖ జిల్లాలో ఓ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు టీచర్‌గా పనిచేస్తూ సేవా స్ఫూర్తి కొనసాగిస్తున్న ఆ ఆదర్శ ఉపాధ్యాయుడు కాసా వెంకట శ్రీనివాసరావు. తన సేవాప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే..

‘‘మా స్వస్థలం విశాఖపట్నం. నా చిన్నతనం నుంచి మా నాన్న పేదవాళ్లను చులకనగా చూసేవాడు. అది నాకు నచ్చకపోయేది. నేను మాత్రం నాన్నలా ఉండకూడదని నలుగురికి సాయపడాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. కష్టపడి ఎంఫిల్‌ వరకూ చదివాను. 1998లో విశాఖ ఏజెన్సీలో సెకండరీగ్రేడ్‌ టీచర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించా. 2017 నుంచి కోటవురట్ల మండలం జల్లూరు ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నా.

జీతంలో ఐదు వేలు సేవకు..
పాఠశాలల ఆవరణలో దేశ నాయకుల విగ్రహాల స్థాపన, ప్రహారీ గోడల నిర్మాణం, కుర్చీలు, బల్లలు సరఫరా, మధ్యాహ్నా భోజన పథకం ప్లేట్లు, గ్లాసులు, పాఠశాలలకు అవసరమైన సీలింగ్‌ ఫ్యాన్లు, మైక్‌సెట్లు అందజేశాం. విద్యార్ధులకు నోట్‌ పుస్తకాలు, బెల్టులు, చెప్పులు, టీషర్ట్‌లు, స్కూల్‌ యూనిఫామ్‌లు, దుస్తులు, స్టడీ మెటిరీయల్‌ ప్రతీ ఏటా దాతల సహకారంతో విద్యార్థులకు అందజేస్తున్నాం. ప్రతీ నెలా నా జీతం నుంచి రూ.5వేలను సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తాను. దీనికి తోడు రిటైర్డ్‌ హెచ్‌ఎం అన్నమ్మతో పాటు, లండన్‌లో స్థిరపడిన ఒక డాక్టర్‌కు చెందిన అమ్మ ఫౌండేషన్‌, హెచ్‌పీసీఎల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌, సత్యసాయి సేవా ట్రస్ట్‌, సిరీస్‌ ఫౌండేషన్‌ వంటి పలు స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుంటున్నాం.

దాతల ద్వారా లక్షల్లో ఆర్థిక సాయం…
ఇప్పటి వరకు రూ.37 లక్షల విలువైన సామాగ్రి, సదుపాయాలను పదికి పైగా పాఠశాలలకు అందజేయగలిగాం. కొన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం. మరికొన్ని గామ్రాల్లో ఉన్నత
పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నాను. దాతల సాయంతో 12 మంది నిరుపేద విద్యార్ధులను ఉన్నత విద్య పూర్తయ్యేంత వరకు చదివించాం. నేను వ్యక్తిగతంగా నలుగురు
విద్యార్ధిని విద్యార్ధులకు బీటెక్‌ చదవడానికి ఆర్ధిక సాయం చేశాను. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరడాన శంకరనారాయణ గుండెపోటుతో మృతిచెందితే ఆయన ఇద్దరి కుమార్తెల బాధ్యత నేను తీసుకున్నాను. పెద్దమ్మాయి మానస బీటెక్‌ పూర్తిచేసి ఇటీవలే ఉద్యోగంలో చేరింది. రెండో అమ్మాయి గాయత్రి బీటెక్‌ పూర్తిచేసి గేట్‌ పరీక్షకు కోచింగ్‌ తీసుకుంటోంది. నేను పనిచేస్తున్న పాఠశాలలో ఎవరైనా నిరుపేద విద్యార్ధులుంటే వారికి వ్యక్తిగతంగా సహాయపడడం, ఉన్నత చదువులు దిశగా వారిని ప్రోత్సహించడం నాకు సంతృప్తినిస్తుంది.

పోటీ పెంచాలనే…
నేను పని చేస్తున్న కోటవురట్ల మండలం జల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 2017-18 విద్యా సంవత్సరంలో ఇద్దరు విద్యార్ధులు పదికి 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. 2018-19 సంవత్సరంలో కూడా అవే ఫలితాలు సాధించాలన్న ఆశయంతో 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించే విద్యార్థులను హైదరాబాద్‌కు విమానంలో తీసుకెళతామని ప్రకటించాం. అలా ఈ ఏడాది శీరం అంజలి, చిటికెల నీరజ అనే విద్యార్థినులను హైదరాబాద్‌కు విమానంలో తీసుకొనివెళ్లి మూడు రోజుల పాటు అన్ని ప్రాంతాలు చూపించాం. విద్యార్ధుల్లో పోటీతత్వం పెంచి వారి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇలాంటి పోటీవాతావరణం కల్పిస్తున్నాం. నా సతీమణి వెంకటలక్ష్మి సంపూర్ణ మద్ధతు ఉండబట్టే నేను విద్యార్ధులకు అండగా ఉండగలుగుతున్నా. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం నా జీవితంలో మరపురాని అనుభూతి’’.
సంతృప్తినిస్తోంది…
‘‘నేను ఎప్పుడూ టీచర్‌ అవ్వాలని అనుకోలేదు. కానీ గడిచిన రెండు దశాబ్ధాలుగా టీచర్‌ వృత్తి ఎంతో తృప్తిని, గుర్తింపును ఇచ్చింది. సుమారు 10 పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, వందలాది మంది విద్యార్ధిని విద్యార్ధులకు అవసరమైన పుస్తకాలు, ఇతర వస్తువులు అందించడం నాకూ, అందుకు సహాకరించిన దాతలకు మరపురాని సంతృప్తిని ఇస్తోంది.’’

ఆ ప్రభుత్వ‌ ఉపాధ్యాయుడు నిత్యం 8 కిలోమీట‌ర్ల పాటు కొండ పైకెక్కి మ‌రీ విద్యార్థుల‌కు పాఠాలు చెబుతున్నాడు… హ్యాట్సాఫ్ టు హిమ్‌…

నేటి స‌మాజంలో కార్పొరేట్ పాఠ‌శాల‌లు త‌ల్లిదండ్రుల ద‌గ్గర ఎంతటి భారీ మొత్తంలో ఫీజుల‌ను వ‌సూలు చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. అంత‌టి ఫీజుల‌ను చెల్లించినా స్కూల్‌లో స‌రిగ్గా పాఠాలు చెబుతార‌న్న న‌మ్మకం లేదు. ఇదిలా ఉంటే మ‌న దేశంలోని ప్రభుత్వ పాఠ‌శాల‌ల సంగ‌తి ఇక అస‌లు చెప్పక‌ర‌లేదు. అంత‌టి ద‌య‌నీయ స్థితిలో అవి ఉంటాయి. వాటిలో సౌక‌ర్యాలు అస‌లే ఉండ‌వు. ఇక ఉపాధ్యాయుల సంగ‌తి చెప్పక‌ర‌లేదు. ఉన్నవారు స‌రిగా పాఠాలు చెప్పరు. కొన్నింటిలో అస‌లు ఉపాధ్యాయులే ఉండ‌రు. ఇదంతా ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో మామూలే. కానీ క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ఆ పాఠ‌శాల‌లో మాత్రం అలా కాదు. ఉన్నది తానొక్క ఉపాధ్యాయుడే అయినా, దూరంగా విసిరేసిన‌ట్టు ఎక్కడో ప‌ర్వత ప్రాంతంలో ఉన్నా ఆ స్కూల్‌కు వ‌చ్చే స్థానిక పిల్లల కోసం ఆ టీచ‌ర్ ఎంత‌గానో శ్ర‌మిస్తున్నాడు. ఎంత‌గా అంటే నిత్యం కొన్ని కిలోమీట‌ర్ల పైకి ప‌ర్వతం ఎక్కుతూ. అదీ కాలి న‌డ‌క‌న‌… అవును, మీరు విన్న‌ది నిజ‌మే.క‌ర్ణాట‌క రాష్ట్రంలోని గజేంద్రగ‌డ తాలూకా బైరపుర గ్రామంలో సురేష్ బి చ‌ల‌గెరి అనే ఓ 50 ఏళ్ల ఉపాధ్యాయుడికి స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ పాఠ‌శాల‌లో గ‌త కొన్నేళ్ల కింద పోస్టింగ్ ల‌భించింది. అయితే అత‌ను మొట్ట మొద‌టి సారి ఆ ప్రాంతానికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డి స్కూల్‌ను చూసి ఒకింత ఆశ్చర్యపోయాడు. అంతేకాదు, ఆ స్కూల్‌కు ఎలా వెళ్లాలా అని ఆలోచించాడు. ఎందుకంటే ఆ పాఠ‌శాల బైర‌పుర గ్రామంలో ఉన్న ఓ ప‌ర్వ‌త ప్రాంతంలో ఉంటుంది. అక్క‌డ కొంత మంది గిరిజ‌న వాసులు నివ‌సిస్తున్నారు. వారి పిల్లలే ఆ పాఠ‌శాల‌లో చ‌దువుకుంటారు. ఈ క్రమంలో ప‌ర్వ‌త ప్రాంతంలో ఉన్న ఆ పాఠ‌శాల‌కు వెళ్లాలంటే సురేష్‌కు మొద‌ట్లో ఇబ్బందిగా అనిపించేది. ఎందుకంటే అక్క‌డికి వెళ్లాలంటే కాలి న‌డ‌క‌నే 8 కిలోమీట‌ర్ల పాటు పైకి ఎక్కాల్సి ఉంటుంది. వేరే ఇత‌ర ర‌వాణా సౌక‌ర్యాలు అక్క‌డ లేవు. దీంతో కష్ట‌మైనా ఆ పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పేందుకు ఆ బాట‌నే 8 కిలోమీట‌ర్ల పాటు న‌డిచి వెళ్లి వ‌స్తుంటాడు. కాగా ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌క స‌రుకుల‌ను కూడా అత‌నే స్వ‌యంగా పాఠ‌శాల‌కు రోజూ తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఆ స్కూల్లో అత‌ను త‌ప్ప వేరే ఎవ‌రూ ఉండ‌రు. అంటే ఆ స్కూల్‌కు హెడ్ మాస్ట‌ర్‌, ఉపాధ్యాయుడు, డ్రిల్ మాస్టర్‌, వంట మ‌నిషి, క్లర్క్ అన్నీ అత‌నే.
అలా సురేష్ రోజూ స‌రుకుల‌న్నింటినీ 8 కిలోమీట‌ర్ల పాటు మోసుకెళ్లి ఆ స్కూల్‌లో పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతూ వారికి వంట వండి భోజ‌నం పెడుతూ మ‌ళ్లీ సాయంత్రం వేళ కింద ఉన్న త‌న ఇంటికి చేరుకుంటాడు. ఇదీ అత‌ని దిన‌చ‌ర్య. అయినా సురేష్ త‌న బాధ్య‌త‌ను ఎన్న‌డూ మ‌రువ‌లేదు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌నిచేసే సోమ‌రిపోతు ఉపాధ్యాయులంద‌రికీ సురేష్ ఇప్పుడు ఓ స‌మాధానంలా నిలుస్తున్నాడు. అంతేగా మ‌రి! చివ‌రిగా ఇంకో విష‌యం… సురేష్ శ్ర‌మ‌ను గుర్తించిన అక్క‌డి ప్ర‌భుత్వం ఆ పాఠ‌శాల‌కు ఇటీవ‌లే మ‌రో ఇద్ద‌రు టీచ‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. అంతేకాదు స్కూల్ కోసం ఓ టూ వీల‌ర్‌ను కూడా అంద‌జేసింది. ఈ విష‌యంలో నిజంగా సురేష్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే… క‌దా!

Voluntary retirement: వాలంటరీ రిటైర్మెంట్:(స్వచ్ఛంద పదవీ విరమణ) complete details

Voluntary retirement: (voluntary retirement)
20 years for voluntary retirement Those who have completed the service must have a notice of appointment to the post office for 3 months.
➡ Voluntary Retirement Appointment As employee is healthy, a certificate of Civil Surgeons should be presented as eligible for Duty.
➡ sickness, except for any leave leave for higher education, is not considered as any other vacation leave.
➡ The officer should retire after the optional retirement is granted.
➡ gratuity is only 20 yrs Family pension and commutation facilities are available.
(A.P.R.P Rule 1980 Rule 43 (5)
(G.O.Ms.No.413 F & P Dt: 29-11-1977)
➡ Voluntary retirement (for other reasons) does not apply compassion recruitment.
➡ Voluntary retirement does not require medical tests.
➡ 20 years The volunteer retirement employee is still 5 yrs. If the service is beyond 5 yrs. The weightage is combined .5 m. If the service within the service is only a period of service weightage is added. Pension is calculated on the basis of this.

వాలంటరీ రిటైర్మెంట్:(స్వచ్ఛంద పదవీ విరమణ)
➡ వాలంటరీ రిటైర్మెంట్ కొరకు 20 సం॥ అర్హత గల సర్వీసు పూర్తి చేసినవారు 3 నెలల ముందుగా తానున్న పోస్టుకు నియామకము చేయు అధికారికి నోటీసు ఇవ్వాలి.
➡ వాలంటరీ రిటైర్మెంట్ అనుమతికై ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నట్టు, డ్యూటీ చేయుటకు అర్హత కలిగినట్లు ఇద్దరు వైద్యులచే (Civil Surgeons) సర్టిఫికెట్ సమర్పించాలి.
➡ అనారోగ్యం,ఉన్నత విద్యాభ్యాసమునకు పెట్టిన జీతనష్టపు సెలవు తప్ప,మరే ఇతర జీతనష్టపు సెలవు అర్హత గల సెలవుగా పరిగణించబడదు.
➡ అధికారి ఐచ్చిక రిటైర్మెంట్ కు అనుమతి ఇచ్చిన తర్వాత పదవీ విరమణ చేయాలి.
➡ గ్రాట్యూటీ మాత్రము 20 సం॥ వచ్చేదే ఇస్తారు.కుటుంబ పెన్షన్,కమ్యూటేషన్ సౌకర్యాలు ఉంటాయి.
(A.P.R.P Rule 1980 Rule 43(5)
(G.O.Ms.No.413 F&P Dt:29-11-1977)
➡ వాలంటరీ రిటైర్మెంట్ పొందువారికి (ఇతర కారణాలపై) కారుణ్య నియామక సౌకర్యం వర్తించదు.
➡ వాలంటరీ రిటైర్మెంట్ కు వైద్య పరీక్షలు అవసరం లేదు.

➡ 20 సం॥ సర్వీసు కలిగి యుండి వాలంటరీ రిటైర్మెంట్ చేయు ఉద్యోగి ఇంకను 5 సం॥ మించి సర్వీసు ఉంటే 5 సం॥ వెయిటేజి కలుపుతారు.5 సం॥ లోపు సర్వీసు ఉంటే అంతకాలం మాత్రమే సర్వీసు వెయిటేజి కలుపుతారు.దాని ఆధారంగానే పెన్షన్ లెక్కిస్తారు.

Oneplus: రూ. 15 వేలకే వన్‌ప్లస్‌ స్మార్ట్ ఫోన్… ఫీచర్స్ ఇవే…!

Oneplus: మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..?
అయితే ఈ స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ ని చూడండి. భారత మార్కెట్లో వన్‌ప్లస్‌ బ్రాండ్‌కు కి క్రేజ్‌ మాములుగా ఉండదు. మొదట్లో ప్రీమియం బడ్జెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన ఫోను ఇది. ఇక పూర్తి వివరాల లోకి వెళ్ళితే.. వన్‌ప్లస్‌ ఇటీవల బడ్జెట్‌ ధర లో ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వుంది. ముఖ్యంగా రూ. 20 వేలలోపు స్మార్ట్‌ ఫోన్స్‌ను ఇప్పుడు ఈ కంపెనీయే లాంచ్‌ చేస్తోంది. వన్‌ప్లస్‌ బ్రాండ్‌ నుంచి తక్కువ ధరకు ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తన్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా వన్‌ప్లస్‌ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయడం జరిగింది.
వన్‌ప్లస్ నార్డ్‌ ఎన్‌30ఎస్‌ఈ పేరుతో ఈ ఫోన్‌ ని తీసుకు రావడం జరిగింది. ఇప్పటికే ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ యూఏఈలో లాంచ్‌ చేసారు. వన్‌ప్లస్ నార్డ్‌ ఎస్‌ఈ 5జీ ఫోన్‌ యూఏఈ లో విడుదల చేయడం జరిగింది. ఈ ఫోన్‌ భారత మార్కెట్లో కి ఎప్పుడు వస్తుందన్న దాని గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ అలానే ధర వివరాలను కూడా చూసేద్దాం. వన్‌ప్లస్‌ నార్డ్‌3ఎస్‌ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 13 బేస్డ్‌ ఆక్సిజన్‌ ఓఎస్‌ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది వర్క్ అవుతుంది. 2,400 x 1,080 పిక్సెల్స్ తో దీన్ని ఇచ్చారు. డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ విత్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూతో పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో లాంచ్‌ చేశారు. అలానే దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో పాటు 300 శాతం అల్ట్రా వాల్యూమ్‌ మోడ్‌ను కూడా ఇచ్చారు.
కెమెరా వివరాల లోకి వెళితే.. ఈ ఫోన్‌లో డ్యూయర్ రియర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డెప్త్‌ సెన్సార్‌ను ఈ ఫోన్ కి ఇచ్చారు. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే 33 వాట్‌ సూపర్‌ ఊక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌తో ఇచ్చారు. స్మార్ట్‌ ఫోన్‌ బరువు 193 గ్రాములుగా ఉంటుంది. సాటిన్ బ్లాక్, సియాన్ స్పార్కిల్ రంగుల్లో లాంచ్‌ చేశారు. ధర 599 ఏఈడీలుగా నిర్ణయించారు. మన కరెన్సీలో రూ. 13,600గా ఉండనుంది. భారత్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర కాస్త పెరిగే అవకాశాలు వున్నాయి

Life Style : ఈ కాయలతో అతి త్వరగా బరువు తగ్గవచ్చు..!!

జామ పండును తినడానికి వారంటూ ఎవరూ ఉండరు రుచి తో పాటుగా జామకాయలో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక పండును తినడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఎందుచేతనంటే జీర్ణక్రియ అనేక ఇతర సమస్యల ను తొలగించడంలో చాలా సహాయపడుతుంది జామకాయ. ఇక జామ ఆకుల వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

అయితే వీటిని ఎవరైనా తినకపోతే తినడం చాలా మంచిది.కొంతమంది నిపుణులు తెలిపిన ప్రకారం జామ ఆకుల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి.. ముఖ్యంగా శరీరానికి మేలు చేసే ఔషధ గుణాలు జామ ఆకుల లో పుష్కలంగా లభిస్తాయి. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

1). బరువు తగ్గాలనుకునేవారు జామపండును ప్రతిరోజు ఒకటి తినడం చాలా మంచిది ఎందుచేత అంటే.. ఇందులో కార్బోహైడ్రేట్లు తగ్గించే శక్తి ఉంటుంది అందుచేతనే వీటిని తినడం వల్ల ఊబకాయం వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.

2). ముఖ్యంగా జామ ఆకుల అతిసార సమస్యను అరికట్టడంలో చాలా సహాయపడుతుంది.. ఇందుకోసం ఒక అర కప్పు బియ్యప్పిండి తీసుకొని జామ ఆకులను బాగా మరిగించి.. అందులోకి కాస్త పిండిని కలుపుకొని ప్రతిరోజు రెండు మూడు సార్లు తాగితే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

3). ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినేవారు చెడు కొలెస్ట్రాల్ కు గురవుతారు. దీనికోసం మనం జామ ఆకుల టీ తాగితే చాలా మంచిదట. కొన్ని నెలల పాటు ఇలా చేస్తే బరువు సమస్య తగ్గించుకోవచ్చు.

4). జామాకులు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.. జామ ఆకులను మెత్తగా నూరి తలకు పట్టిస్తే జుట్టు కూడా చాలా రుచిగా ఉండటమే కాకుండా మెరుస్తూ ఉంటుంది.

5). జామ ఆకుల నుంచి తయారు చేయబడిన టి వల్ల డయాబెటిస్ రోగులకు రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

Shobhi Machalu : శరీరంపై వచ్చే ఈ మచ్చలను తొలగించే అద్భుతమైన మొక్క ఇది..

Shobhi Machalu : మనకు వచ్చే చర్మ సంబంధమైన సమస్యలలో శోభి మచ్చలు కూడా ఒకటి. ఇవి ఒక చోట ప్రారంభమై శరీరమంతటా వ్యాపిస్తాయి. ఇవి శరీరం పై ఏదో ఒక చోట చిన్నగా తెల్లని మచ్చలా ఏర్పడి క్రమేపీ పెద్దగా అయ్యి శరీరమంతా విస్తరించి శరీరాన్ని శోభితో కప్పేస్తాయి.
ఈ మచ్చలు ఎటువంటి ఇబ్బందినీ కలిగించవు. కానీ అవి వ్యాపిస్తూ ఉంటాయి. వీటిని తెల్ల మచ్చలు అని కూడా అంటుంటారు. ఈ మచ్చలు కలిగిన వారిని చాలా మంది వ్యాధి గ్రస్తులుగా భావిస్తూ ఉంటారు. ఈ శోభి మచ్చలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి.

హార్మోన్ లలో మార్పులు, రోజూ మందులు మిగడం వంటి వాటి వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయి. అలాగే వేడి శరీరం ఉన్న వారిలో ఈ మచ్చలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మచ్చలు వచ్చిన వెంటనే చికిత్స తీసుకోవడం చాలా మంచిది. లేదంటే ఇవి శరీరం అంతటా వ్యాపించి అందవిహీనంగా తయారు చేస్తాయి. దీని వల్ల మనం మానసిక ఆందోళనకు కూడా గురవుతూ ఉంటాం. ఇవి వచ్చిన తరువాత మందులను వాడడం చాలా మంచిది. ఈ మచ్చలకు ఆయుర్వేదంలో ఎటువంటి మందులు ఉన్నాయి. ఎటువంటి మొక్కలను ఉపయోగించడం వల్ల ఈ మచ్చలను తగ్గించుకోవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Shobhi Machalu
శోభి మచ్చలను తగ్గించడంలో ఉత్తరేణి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉత్తరేణి మొక్క వర్షాకాలంలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఉత్తరేణి మొక్కను ఉపయోగించి శోభి మచ్చలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరేణి మొక్క మొత్తాన్ని సేకరించి శుభ్రపరిచి ఎండబెట్టుకోవాలి. దీనిని నిప్పులపై వేసి కాల్చగా వచ్చిన బూడిదను జాగ్రత్తగా సేకరించాలి. ఈ బూడిదను కావల్సిన పరిమాణంలో తీసుకుని దానికి ఆవనూనెను కలిపి పై పూతగా రాయడం వల్ల శోభి మచ్చలు తగ్గుతాయి. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా నెలరోజుల పాటు చేయడం వల్ల ఈ మచ్చలు తగ్గుతాయి. ఈ విధంగా ఉత్తరేణి మొక్కను ఉపయోగించి శోభి మచ్చలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Figs : అంజీరా పండ్లను రాత్రి పాలలో నానబెట్టి.. ఉదయం తింటే ఏమవుతుందో తెలుసా..?

Figs : మన శరీరానికి డ్రై ఫ్రూట్స్ ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. మనం రకరకాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లలో అంజీర్‌ కూడా ఒకటి.
దీనినే అత్తిపండు అని కూడా అంటారు. దీని అడుగు భాగం వెడల్పుగా, పై భాగం సన్నగా గంట ఆకారంలో ఉంటాయి. అంజీరా పండ్లు ఊదా, పసుపు, గోధుమ, ఆకు పచ్చ రంగుల్లో ఉంటాయి.

ఇవి పరిమాణంలో కూడా వేరువేరుగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి నిల్వ చేస్తూ ఉంటారు. అంజీరా పండ్లల్లో శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ఉంటాయి.

వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏవ్యాధి బారిన పడిన వారైనా వీటిని తినవచ్చు.

శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. 3 గ్రాముల అంజీరా పండులో 5 గ్రా. ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ప్రేగులలో కదలికలను పెంచడంలో సహాయపడుతుంది.

తద్వారా మలబద్దకం సమస్య తగ్గుతుంది. గుండె జబ్బులను నయం చేయడంలో, బరువు తగ్గడంలో కూడా అంజీరా పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.

దీనిని తరచూ తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్ ను, బీపీని నియంత్రించడంలో కూడా ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఈ పండ్లను రాత్రి పాలలో నానబెట్టుకుని ఉదయాన్నే తినడం వల్ల స్త్రీ , పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

Figs

మూలశంక వ్యాధిని నయం చేయడంలో కూడా అంజీరా పండ్లు ఉపయోగపడతాయి. ఈ పండ్లను తినడం వల్ల రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది.

శరీరంలో ఉండే నొప్పులను, వాపులను తగ్గించే గుణం కూడా అంజీరా పండ్లకు ఉంటుంది. వీటిని తినడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి.

చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలోనూ అంజీరా పండ్లు ఉపయోగపడతాయి. శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించడంలోనూ అంజీరా పండ్లు దోహదపడతాయి.

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుక అంజీరా పండ్లను తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వీటిని తినడం వల్ల శరీరంలో ఉన్న అనారోగ్య సమ్యలు నయం అవడమే కాకుండా కొత్త అనారోగ్య సమస్యల బారిన కూడా పడకుండా ఉంటామని నిపుణులు తెలియజేస్తున్నారు.

Paytm: పేటీఎం వినియోగదారులకి భారీ షాక్.. ఆ డేట్ నుంచి యాప్ క్లోజ్..!

Paytm: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు పేటియం మరియు ఫోన్ పే లను వాడుతున్నారు. ఈ సదుపాయాలు వచ్చిన తరువాత చేతులో ఒక్క రూపా కూడా ఉంచుకోవడంలేదని చెప్పొచ్చు.
ప్రతి ఒక్కరూ తమ బ్యాంకులలో దాస్తూ తమకి కావాల్సినప్పుడు ఫోన్ పే లను వాడుతున్నారు. ఇక ఫోన్ పే వినియోగదారులకి ఏ చిక్కు లేకపోయినా పేటియం వినియోగదారులకి మాత్రం భారీ షాక్ తగిలింది.
Paytm app will be closed on March 15.
మీరు పేటీఎం యాప్ ని వాడుతున్నారా? మీరు వాడకపోయినా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా వాడుతూ ఉంటే వారికి ఈ సమాచారాన్ని అందించండి. ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం యాప్ క్లోజ్ కానుంది. మీరు ఫిబ్రవరి 29 తరువాత ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేరు. అప్పటివరకు మీ బ్యాంకులో ఉన్న డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేదా విత్డ్రా అయినా చేసుకోండి. ఫిబ్రవరి 29వ తారీకు వరకు మీకు ఎవరైనా డబ్బులు వేసిన వస్తాయి.
కానీ ఫిబ్రవరి 30 నుంచి మాత్రం మీకు ఎవరు డబ్బులు వేసిన రావు మీరు కూడా వేసిన డబ్బులు కూడా ట్రాన్సాక్షన్ అవ్వవు. 29 తరువాత రిఫండ్స్ మరియు బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అట్లాంటివి మాత్రమే ఫిబ్రవరి 29 అనంతరం కూడా వస్తాయి. అంతేకానీ మీకు ఎవరైనా డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే అవి మీకు రావు. మార్చ్ 15 అనంతరం ఈ యాప్ ని టోటల్గా క్లోజ్ చేసైనున్నారు.
ఎందుకు పేటీఎం ని ఆర్బిఐ క్లోజ్ చేస్తుంది అంటే.. పేటీఎం అధికారులు కస్టమర్స్ ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా బెనిఫిట్స్ డాక్యుమెంట్స్ లాంటివి సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు. అందువల్ల పేటీఎం యాప్ ని క్లోజ్ చేసేయనున్నారు ఆర్బిఐ. ఇక ఈ విషయాన్ని ఓ నోట్ ద్వారా అనౌన్స్ చేశారు. అందువల్ల ఫిబ్రవరి 29 లోపు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులను విత్ డ్రా చేసుకోండి.

Blood Sugar : డయాబెటిస్ ఉన్నవారికి సంజీవని ఈ మొక్క..!

Blood Sugar : వర్షాకాలంలో ఎక్కడ చూసినా చిన్న చిన్న తెల్ల పువ్వులతో చూడగానే మనసుకు ఆహ్లాదాన్ని అందించే మొక్క తుమ్మి కూరమొక్క. చాలా మంది దీనిని వినాయక చవితి రోజూ కూరగా వండుకుని తప్పకుండా తింటారు.
వర్షాకాలంలో వచ్చే రోగాల బారిన పడకుండా చేయడంలో తుమ్మికూర మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. తుమ్మి కూర మొక్క వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుమ్మి కూర మొక్కలు చాలా చిన్నగా ఉంటాయి. మనకు పెద్ద తుమ్మి కూర, చిన్న తుమ్మి కూర అని రెండు రకాల తుమ్మి కూర మొక్కలు లభిస్తాయి. ఇవి రెండూ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మొక్కలు కారం, చేదు రుచులను కలిగి వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. వాత, కఫ, మేహ రోగాలను, కామెర్లను హరించే శక్తిని ఈ తుమ్మి కూర మొక్క కలిగి ఉంటుంది.

మెరక భూముల్లో, నువ్వుల చేలల్లో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. వర్షాకాలంలో తుమ్మి కూర మొక్క విస్తారంగా పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు సన్నగా, పొడుగ్గా ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. ఈ మొక్క పూలతో శివున్ని పూజిస్తారు. వర్షాకాలంలో కొత్త నీరు, కొత్త గాలి కారణంగా మనం అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. గాలిలో, నీటిలో ఉండే కాలుష్యాన్ని నివారించే శక్తి ఈ తుమ్మి కూర మొక్కకు ఉంటుంది. కనుక దీనిని వర్షాకాలంలో తప్పకుండా కూరగా వండుకుని తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క పూలను దంచి రసాన్ని తీసి కళ్లల్లో రెండు చుక్కల మోతాదులో వేయడం వల్ల ముదిరిన కామెర్ల రోగం కూడా తగ్గుతుంది. పక్షవాతానికి గురి అయిన వారికి తుమ్మి కూరను వండి పెట్టడం వల్ల త్వరగా ఆ వ్యాధి నుండి బయటపడతారు. దీనిని పక్షవాత రోగికి ఆహారంలో భాగంగా ఇచ్చేటప్పుడు వాత పదార్థాలను పెట్టకూడదు.

Blood Sugar
మధుమేహ వ్యాధితో బాధపడే వారు తుమ్మి కూర ఆకులను, తులసి ఆకులను, మారేడు ఆకులను, వేప ఆకులను విడివిడిగా నీడలో ఎండబెట్టి పొడిగా చేసి అన్నింటినీ కలిపి వస్త్రంలో వేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఆహారం తీసుకోవడానికి అర గంట ముందు రోజుకు రెండు పూటలా మధుమేహ తీవ్రతను బట్టి అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక అర గ్లాసు కాచి చల్లార్చిన నీటిలో కలిపి తాగడం వల్ల మధుమేహం హరించుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు. తేలు, పాము కాటు వంటి విష జంతువులు కాటు వేసినప్పుడు తుమ్మి కూర ఆకులను నుండి రసాన్ని తీసి కాటు గురి అయిన ప్రదేశంలో వేసి ఆ ఆకుల ముద్దను దాని పై ఉంచి కట్టుకట్టాలి. ఈ ఆకుల రసాన్ని కూడా రెండు టీ స్పూన్ల మోతాదులో తాగించాలి. ఈ రసాన్ని 4 చుక్కల మోతాదులో ముక్కులో కూడా వేయాలి. ఇలా చేయడం వల్ల పాము, తేలు విషాలు హరించుకుపోతాయి.

స్త్రీలలో బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించి గర్భాశయం శుద్ది అయ్యేలా చేయడంలో కూడా తుమ్మి కూర మొక్క ఉపయోగపడుతుంది. పావు టీ స్పూన్ తుమ్మి ఆకుల పొడిని, పావు టీ స్పూన్ మిరియాల పొడిని కలిపి రెండు పూటలా అర గ్లాసు గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి బహిష్టు ప్రారంభమైన రోజు నుండి మూడు రోజుల పాటు తీసుకోవడం వల్ల నొప్పి తగ్గడమే కాకుండా గర్భాశయం కూడా శుద్ధి అవుతుంది. ఈ మూడు రోజులు కూడా వారు బియ్యం, పెసరపప్పు, పాలు, నెయ్యి , కండ చక్కెరను కలిపి చేసిన దానినే ఆహారంగా తీసుకోవాలి. ఈ విధంగా తుమ్మి కూరను ఉపయోగించడం వల్ల, దీనిని మితంగా కూరగా వండుకుని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Potatoes: బంగాళదుంపలను వీటితో కలిపి వండితే.. యమా డేంజర్.. జర జాగ్రత్త!

మన తెలుగు రాష్ట్రాల్లో బంగాళాదుంపల (Potatoes)తో ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తుంటారు. దహీ ఆలూ కర్రీ, ఆలూ డీప్ ఫ్రై, ఆలూ మసాలా, ఆలూ టమోటో కర్రీ, ఆలూ పరాటా, కట్లెట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆలూతో ఎన్నో రుచికరమైన వంటకాలు చేయొచ్చు.
వీటితో నోరూరించే స్నాక్స్ సైతం ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఆలుగడ్డలను సరిగా వండకపోతే అవి సరిగా జీర్ణం కావు. ఆలూ తినడం వల్ల బరువు తగ్గడం (Weight Loss) కూడా కష్టమైపోతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే సరైన మార్గంలో సరిగ్గా వండుకొని ఆలూ వంటకాలు తింటే.. బరువు అసలు పెరగదు. ఒక సింపుల్ ట్రిక్‌తో బరువు తగ్గాలనుకునే వారు కూడా వీటిని తీసుకోవచ్చు. మరి బంగాళాదుంపలను సరైన మార్గంలో ఉడికించడానికి సులభమైన టెక్నిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళాదుంపలను బాగా ఉడకబెట్టి, చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల బంగాళాదుంపలలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) బాగా తగ్గుతుంది. ఫ్రీజర్‌లో ఉంచిన తరువాత ఈ ఉడకబెట్టిన బంగాళాదుంపలు మరింత ఆరోగ్యకరమైన, పోషకమైనవిగా మారతాయి. వీటిని వేడి నీటిలో 28 గ్రాముల పలచగా ఉన్న వైట్ వెనిగర్‌తో (Blanching) కాసేపు ఉడకనివ్వాలి. ఇలా చేస్తే బంగాళాదుంపలలో 30-40% గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు తగ్గుతాయి. వెనిగర్‌కు బదులుగా నిమ్మరసం కూడా హాట్ వాటర్‌లో కలుపుకోవచ్చు. అయితే జీఐ స్థాయిలను మిగతా వాటి కంటే మరింత సమర్థవంతంగా వెనిగర్ మాత్రమే తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే వెనిగర్‌ను ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్లు కూడా డయాబెటిక్ రోగులకు సూచిస్తుంటారు.
బంగాళాదుంపలలో స్టార్చ్ ఏర్పడే ప్రక్రియను తగ్గించడానికి ఇతర పద్ధతులు
బంగాళాదుంపలను కట్ చేసి, వాటిని వేడి నీటిలో 30 నిముషాల పాటు ఉడకనివ్వాలి. కొద్దిగా చల్లబడిన తర్వాత మళ్లీ ఉడికించాలి. దీనివల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గి, మరింత సులభంగా జీర్ణమవుతుంది. బంగాళదుంపలను ఉడకబెట్టేటప్పుడు లేదా మైక్రోవేవ్‌లో వండేటప్పుడు ఇతర పదార్థాలను కలపకుండా వండాలి. ఈ పద్ధతిలో బంగాళదుంపల్లో ఉప్పు, చక్కెర, కొవ్వు శాతం తగ్గుతుంది. రెండు వండిన బ్రకోలీలు, మెత్తగా చేసిన ఒక బంగాళాదుంప తీసుకోవడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. చాలామంది ఆలుగడ్డలపై పొట్టును వొలుస్తుంటారు. అలా కాకుండా పొట్టుతోనే వంట చేయడం ద్వారా పుష్కలమైన ఫైబర్ కంటెంట్ లభిస్తుంది.
కలిపి వండింతే డేంజర్
బంగాళాదుంపను ఏ ఇతర ఫుడ్స్‌తో కలిపి వండకూడదు. ముఖ్యంగా వీటిని ట్యూనా ఫిష్ లేదా చికెన్ బ్రెస్ట్ తో కలిపి వండకూడదు. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఫుడ్ మీ శరీరం బయటకు పంపాల్సిన ఇన్సులిన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తుంది. పైన పేర్కొన్నట్లుగా బంగాళదుంపలను మీ ఆహారం నుంచి పూర్తిగా తొలగించకుండా సరైన మార్గంలో వండుతూ వాటిని ఆస్వాదించవచ్చు.

Black Pepper : మిరియాలను ఇలా తీసుకోండి.. దెబ్బకు పొట్ట దగ్గరి కొవ్వు మొత్తం కరిగిపోతుంది..!

Black Pepper : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే మిరియాలను వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి మనకు వంట ఇంటి దినుసుగా ఉంది.
వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం మిరియాలతో మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని సరిగ్గా తీసుకోవాలే కానీ అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా పొట్ట దగ్గర ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది. మిరియాలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు.

Black Pepper
మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కఫం మొత్తం బయటకు వస్తుంది. దీంతో దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే అధిక బరువు తగ్గుతారు. మిరియాలలో పైపరైన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది మెటబాలిజంను పెంచుతుంది. కొవ్వును కరిగిస్తుంది. కనుక పొట్ట దగ్గరి కొవ్వు సులభంగా కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.

ఇక మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కొత్తగా ఏర్పడదు. అందువల్ల బరువు తగ్గాక అలాగే ఉంటుంది. బరువు నియంత్రణలో ఉండి.. ఎల్లప్పుడూ సన్నగా కనిపిస్తారు. మిరియాలను తీసుకోవడం వల్ల ఇలా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. వీటి వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

అయితే మిరియాల ద్వారా ప్రయోజాలను పొందాలంటే వాటిని ఎలా తీసుకోవాలి ? అనే చాలా మంది సందేహిస్తుంటారు. దీనికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే.. మిరియాలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయం, సాయంత్రం ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. అందులో రుచి కోసం కాస్త తేనె, నిమ్మరసం కలిపి కూడా తాగవచ్చు.

ఇక మధ్యాహ్నం భోజనం చివర్లో కాస్త పెరుగులో మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు. లేదా పూటకు ఒక టీస్పూన్ తేనె, అరటీస్పూన్ మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు. లేదా రాత్రి పాలలో కాస్త మిరియాల పొడి కలిపి తాగవచ్చు. లేదా రాత్రి ఒక గ్లాస్ మజ్జిగలోనూ టీస్పూన్ మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు. ఇలా ఏ రూపంలో మిరియాలను తీసుకున్నా.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి.

Honey Lemon Water : బరువు తగ్గాలని చెప్పి ఉదయం తేనె, నిమ్మరసం నీళ్లను తాగుతున్నారా ? అయితే ఇది చదవండి..!

Honey Lemon Water : ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. ఈ సమస్యతో బాధపడే వారికి శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకు పోయి ఉంటుంది.
ఈ సమస్య నుండి బయట పడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనలో చాలా మంది బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగడం ఒకటి. బరువు తగ్గాలనుకునే వారు చాలా మంది ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మ రసం కలుపుకుని తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల శరీరంలో ఉండే కొవ్వును తేనె కరిగిస్తుందని తద్వారా బరువు తగ్గుతారని భావిస్తూ ఉంటారు. కానీ ఇది అంతా అపోహ మాత్రమే అని.. తేనెకు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి లేదని నిపుణులు చెబుతున్నారు.

Honey Lemon Water
తేనెకే కాకుండా అసలు ఎటువంటి ఆహార పదార్థానికి కూడా శరీరంలో కొవ్వును నేరుగా కరిగించే శక్తి లేదని వారు చెబుతున్నారు. మనం ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి వాటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తీసుకోవడం వల్ల మనకు 500 నుండి 550 క్యాలరీల శక్తి లభిస్తుంది. మన శరీరానికి మధ్యాహ్నం భోజనం చేసే వరకు ఈ శక్తి వినియోగం అవుతుంది. ఉదయం అల్పాహారంలో ఎటువంటి ఆహార పదార్థాలను తినకుండా కేవలం మూడూ లేదా మూడున్నర టీ స్పూన్ల తేనెను నీటిలో కలిపి తాగడం వల్ల మన శరీరానికి 200 నుండి 225 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. మధ్యాహ్న భోజన సమయం వరకు శరీరానికి ఈ శక్తి సరిపోదు. కనుక పేరుకు పోయిన కొవ్వును కరిగించి శరీరం తన జీవక్రియలకు వాడుకుంటుంది.

శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కరగడం వల్ల మనం బరువు తగ్గుతాము. కానీ తేనె నేరుగా శరీరంలో పేరుకు పోయిన కొవ్వును కరిగించదు. తేనె పరిమాణంలో పంచదార, బెల్లం, చెరుకు రసాన్ని నీటిలో కలిపి తాగిన కూడా మనం బరువు తగ్గుతాము. కానీ వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి హాని కలుగుతుంది. కనుక తేనె నీటిని తాగడం ఉత్తమం. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం అల్పాహారంలో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా తేనె నీటిని మాత్రమే తాగాలి. ఇలా చేయడం వల్ల మాత్రమే బరువు తగ్గుతారు. తేనె నీటితో పాటు అల్పహారాన్ని కూడా తీసుకోవడం వల్ల క్యాలరీలు అధికమై బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలంటే.. ఉదయం కేవలం నిమ్మరసం, తేనె నీళ్లను మాత్రమే తాగాలి. అలా చేస్తేనే బరువు త్వరగా తగ్గుతారు. దీని వల్ల పెద్దగా ఆకలి కూడా వేయదు. బరువు తగ్గడం తేలికవుతుంది.

Crow Signs : ప్రతిరోజు కాకికి అన్నం పెడుతున్నారా.? అయితే మీకు జీవితంలో మిగిలేది ఇదే..!

Crow Signs : కాకికి అన్నం పెట్టడం వల్ల మనకు ఎటువంటి ఫలితం దక్కుతుంది. ఏం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం.. కాకి అనేది ఒక నల్లటి పక్షి.
దీనిని సంస్కృతంలో వాయసం అంటారు. ఇవి కావు కావుమని అరుస్తూ ఉంటాయి. వీటిని మామూలు పక్షుల్లాగా ఇళ్లల్లో పెంచుకోవడానికి వీలు ఉండదు. కాకులు తమ రెక్కల్లో ఉన్న పురుగుల్ని పోగొట్టుకోవటానికి తమ పైకి చీమలు ఎక్కించుకుంటూ ఉంటాయి. కాకులు చీమల పుట్టల దగ్గర ఎక్కువగా చేరుతూ ఉంటాయి. పూర్వకాలం నుండి కూడా కాకులకి అన్నం పెట్టటం మనం చూస్తూ ఉంటాం. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మూడవ రోజు పదవి రోజున కాకులకు పిండం పెట్టడం చేస్తాం. పూర్వకాలం నుంచి కూడా దీన్ని సాంప్రదాయంగా అనుసరిస్తున్నాము. అయితే ఇంట్లో వ్రతాలు చేసుకునే సమయంలో నైవేద్యానికి తయారు చేసిన దాంతో పాటు కొంత కాపులకి వేస్తే వ్రతం నోము పూర్తయినట్లు కొంతమంది భావిస్తూ ఉంటారు.

అందుకనే కాకులకి అన్నం పెట్టాలి. అలాగే కాకి శని భగవానుడు యొక్క వాహనం కావడం వల్ల మన భోజనానికి ముందు అన్నం దేవునికి నివేదన చేసి కాస్త కాకికి కూడా పెట్టమని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మన పితృదేవులకు కూడా కాకి రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు.అలాగే కాకి యముడికి దూతగా ఉంటుంది. మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ విధంగా అన్నం పెట్టడం అంటే వీటన్నింటికి కారణం కూడా మనం పుణ్యాన్ని మూటగట్టుకోకపోవటమే అంటే మనం పుణ్యం దక్కించుకోవాలి. అంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యమైంది ఏంటి అంటే కాకికి అన్నం పెట్టడం ఆహారం పెట్టడం మీరు వండుకున్న దాంట్లో కొంత ఆవరణలో కాకులు తినే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా చేస్తే మీకు అపుణ్య ఫలితం దక్కుతుంది.

కాబట్టి మీరు కచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు. శని భగవానుడు మీకు అనుకూలంగా ఉంటే కనక ఇతర గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉన్నా కానీ మీరు అదృష్టం చూస్తారు. మనం చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి కాకులకి అన్నం పెట్టడం చాలా శ్రేష్ఠరం.. మనుషుల కన్నా కాకులు చాలా గొప్పవి కాబట్టి కాకికి అన్నం పెట్టడం వల్ల మీకు కచ్చితంగా శుభమే కలుగుతుంది. కానీ అశుభం కలగదు. మీ జీవితంలో మీకు ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహంతో అనేక పనులు విజయం లభిస్తుంది…

ఈ నిమ్మకాయ ధర రూ.1.48 లక్షలు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ప్రాచీన కాలం నాటి వస్తువులను వేలం వేయడం మన అందరికీ తెలిసిందే. నాటి వస్తువులకు ప్రత్యేకంగా అభిమానులున్నారు. వాటిని సొంతం చేసుకోవడానికి వేలం పాటలో ఎంతకైనా వెచ్చిస్తారు.
అలాంటివాటిని తమ ఇళ్లల్లో పెట్టుకుని స్టేటస్‌ సింబల్‌ గా భావిస్తుంటారు. ఇలా విగ్రహాలు, రాజులు, రాణులు ధరించిన వస్త్రాలు, వారు వాడిన పాత్రలు, కళాఖండాలు, పెయింటింగ్స్, ప్రముఖులు వాడిన పెన్నులు, పాత కాలం నాటి కరెన్సీ.. ఇలా అనేకమైన వాటిని దక్కించుకోవడానికి లక్షలు, కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతుంటారు.

అయితే.. ఇప్పుడు చెప్పుకోబోతున్న వేలం మాత్రం ప్రత్యేకం. ఇది అలాంటి ఇలాంటి వేలం కాదు. ఒక నిమ్మకాయను వేలంలో దక్కించుకోవడానికి ఏకంగా రూ.1.48 లక్షలు ఖర్చుపెట్టారు. అంటే దాదాపు లక్షన్నర రూపాయలు వెచ్చించారు. మరి ఈ నిమ్మకాయకు అంత ధర దేనికి.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలనుందా.. అయితే చదివేయండి…
ఇంగ్లాండ్‌ లోని ఒక కుటుంబానికి ఒక విచిత్రమైన నిమ్మకాయ కనిపించింది. అది 18వ శతాబ్దం కాలం నాటిది. అప్పట్లో మంత్రివర్గంలో ఉన్న వారిది ఆ నిమ్మకాయ అని తెలుస్తోంది. నిమ్మకాయపై ఒక ప్రత్యేక సందేశం కూడా రాయబడి ఉంది. 2 అంగుళాల వెడల్పుతో గోధుమ రంగులో ఆ నిమ్మకాయ ఉంది. ఎండిపోయిన ఆ నిమ్మకాయపై చెక్కిన సందేశం ఒకటి ఉంది.

నిమ్మకాయపై ఉన్న సందేశం ప్రకారం.. అది 1739 సంవత్సరం నాటిదని తెలుస్తోంది. ఎండిపోయిన నిమ్మకాయపై ‘మిస్టర్‌ పి లూ ఫ్రాంచినీ నవంబర్‌ 3, 1739 మిస్‌ ఇ బాక్స్‌ టర్‌ కి అందించారు’ అనే సందేశం ఉంది.
దీంతో తమకు కనిపించిన ఆ నిమ్మకాయను తీసుకుని ఆ కుటుంబం ఇంగ్లాండ్‌ లోని ష్రాప్‌ షైర్‌ లో వేలం పాడుకునేవారిని కలిసింది. దీంతో ఈ నిమ్మకాయ లోపల అసలు ఏముందో తెలుసుకోవాలని చాలామంది దానికి ఆసక్తి చూపారు. దీంతో ఆ నిమ్మకాయను దక్కించుకోవడానికి వేలంలో పోటీ పడ్డారు.

కాగా ఈ నిమ్మకాయ వేలంలో 40 నుంచి 60 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 4,000-రూ. 6,000) పలుకుతుందని అంచనా వేశారు. అయితే ఆ కుటుంబం ఆశ్చర్యపోయేలా ఆ నిమ్మకాయకు వేలంలో భారీ ధర దక్కింది. నిమ్మకాయ ఏకంగా 1416 పౌండ్లు (భారత కరెన్సీలో రూ.1.48 లక్షలు)కు అమ్ముడుపోయింది.
బ్రెట్టెల్స్‌ వేలం పాటల యజమాని డేవిడ్‌ బ్రెట్టెల్‌ నిమ్మకాయను వినోదం కోసం అమ్మాలని అనుకుంటే.. అందరికీ షాకిచ్చే రేటుకు అమ్ముడైంది. బ్రెట్టెల్స్‌ ఆక్షన్‌ హౌస్‌ ఈ విషయాన్ని ఇనస్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేయడంతో ఇది వైరల్‌ అవుతోంది.

PM Suryodaya Yojana: పైసా ఖర్చు లేకుండా మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్! జీవితాంతం ఫ్రీ కరెంటు – ఇలా చేయండి

Pradhan Mantri Suryodaya Yojana Scheme Details: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ‘సూర్యోదయ యోజన’ (Suryodaya Yojana Scheme) అనే కొత్త పథకం గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీని ప్రకారం.. దేశంలోని ఒక కోటి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను (Solar Panels) అమర్చనున్నారు. తాజాగా ఈ పథకం గురించి కొత్త వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ పథకం కింద ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ను అమర్చుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎక్కువ సబ్సిడీని పొందనున్నారు. సోలార్ ప్యానెళ్లను అమర్చుకున్న అనంతరం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రజలు తమ ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతారు.

ప్రస్తుతం 40 శాతం సబ్సిడీ

ప్రధాన మంత్రి సూర్యోదయ యోజనకు (Suryodaya Yojana Scheme Subsidy) సంబంధించిన వివరాలను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. గతంలో ప్రజలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవడానికి 40 శాతం సబ్సిడీ పొందేవారని కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పుడు వారికి ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన కింద 60 శాతం సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన 40 శాతం మొత్తాన్ని ప్రజలు రుణంగా తీసుకోవచ్చు.

వారిపై ప్రభుత్వ దృష్టి

ఆర్థికంగా వెనుకబడిన వారు ఈ పథకం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పథకం కింద కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సబ్సిడీని పెంచడం ద్వారా, ఎక్కువ మంది ఈ పథకం కింద రుణం తీసుకోకుండానే ఎక్కువ మంది తమ ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ను పొందవచ్చని ప్రభుత్వం కోరుతోంది. దీని కింద నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.

విద్యుత్ కొనడం ద్వారా లోన్ పూర్తి

అయితే, ఒక వ్యక్తి రుణం తీసుకోవాలనుకున్నా, అతనిపై ఒత్తిడి ఉండదు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ను (SPV) రూపొందిస్తోంది. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక SPVలను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం నుంచి పొందే 60 శాతం సబ్సిడీ కాకుండా, మిగిలిన 40 శాతం SPV నుంచి రుణంగా తీసుకోవచ్చు. లబ్ధిదారుడి పైకప్పుపై అతని అవసరానికి మించి ఉత్పత్తి చేయబడిన విద్యుత్ను SPV కొనుగోలు చేస్తుంది. తద్వారా ఆ రుణం తిరిగి చెల్లింపు అవుతుంది. ఈ విధంగా రుణం సుమారు 10 సంవత్సరాలలో మొత్తం చెల్లింపు అవుతుంది. రుణం మొత్తం చెల్లింపు అయిన తర్వాత, సోలార్ ప్యానెల్ ఎక్విప్ మెంట్ మొత్తం లబ్ధిదారుడి పేరుకు బదిలీ చేస్తారు.

బడ్జెట్లో ఎన్ని వేల కోట్లు?

గత నెలలో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, ఫిబ్రవరి 1న లోక్సభలో బడ్జెట్ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకం గురించి సమాచారం ఇచ్చారు. బడ్జెట్లో పథకానికి రూ.10 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ప్రజలు ఏటా రూ.15 వేల నుంచి 18 వేల వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

దేశంలో సౌరశక్తితో 100 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సౌరశక్తితో దాదాపు 35 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తి 73 గిగావాట్లకు మించి ఉంటుందని అంచనా. ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇళ్ల పైకప్పులపై రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయడం ద్వారా 100 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వం సహాయపడుతుంది. కోటి పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చడం ద్వారా దాదాపు 20-25 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు.

కడుపు నింపుకోడానికి పానీపూరీలు అమ్మాడు..ఇప్పుడు క్రికెట్లో దంచికొడుతున్నాడు!

భాల్యంలో కూడుగూడు కోసం విలవిలలాడిన గల్లీబాయ్ యశస్వీ జైశ్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో రికారుల మోత మోగిస్తున్నాడు. 22 సంవత్సరాల వయసులోనే టెస్టు ద్విశతకం బాదడం ద్వారా వారేవ్వా! అనిపించుకొన్నాడు.

క్రికెట్ పిచ్చితో ముంబై మహానగరానికి వచ్చి…తినడానికి తిండి, తలదాచుకోడానికి గూడు లేక అల్లాడిన యశస్వీ జైశ్వాల్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. కేవలం 22 సంవత్సరాల వయసుకే సాంప్రదాయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం సెంచరీ, తొలి డబుల్ సెంచరీలతో పాటు…23 వ పుట్టినరోజు రాక ముందే విదేశీ, స్వదేశీ గడ్డపై శతకాలు బాదిన భారత మూడో క్రికెటర్ గా నిలిచాడు.

భారత మూడో బ్యాటర్ 

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్టు లీగ్ సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా జరుగుతున్న రెండోటెస్టు తొలిరోజు ఆటలో భారీశతకం బాదిన యశస్వీ రెండోరోజు ఆటలో డబుల్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్నవయసులో ద్విశతకం బాదిన భారత మూడో బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.

తన కెరియర్ లో కేవలం 6వ టెస్టు మాత్రమే ఆడుతున్న యశస్వీ మొత్తం 290 బంతులు ఎదుర్కొని 209 పరుగులు సాధించాడు. 112 ఓవర్లలో భారత్ సాధించిన మొత్తం 396 పరుగుల స్కోరులో యశస్వీ సాధించినవే 209 పరుగులున్నాయి. 19 ఫోర్లు, 7 సిక్సర్లతో యశస్వీ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ, డబుల్ సెంచరీ మార్క్ ను సిక్సర్ షాట్లతోనే యశస్వీ పూర్తి చేయడం మరో విశేషం.

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 1993 సిరీస్ లో వినోద్ కాంబ్లీ 21 సంవత్సరాల 335 రోజుల వయసులో ద్విశతకం బాదిన భారత టెస్టు బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వే ప్రత్యర్థిగా 21 సంవత్సరాల 355 రోజుల వయసులోనే డబుల్ సెంచరీ సాధించిన కాంబ్లీ పేరుతోనే ఇప్పటికీ భారత రికార్డు ఉంది. కాంబ్లీ తరువాతి స్థానంలో యశస్వీ జైశ్వాల్ కొనసాగుతున్నాడు.


అరంగేట్రం టెస్టులోనే యశస్వీ సెంచరీ రికార్డు…

గతేడాది కరీబియన్ గడ్డపై టెస్టు అరంగేట్రం చేసిన యశస్వీ కేవలం 21 సంవత్సరాల వయసులోనే తన తొలి టెస్టు శతకం సాధించగలిగాడు. డోమనికాలోని విండ్సర్ పార్క్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో యశస్వీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి మొదటి వికెట్ కు 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 143 పరుగుల స్కోరుతో టెస్టు క్రికెట్లో తన తొలి మూడంకెల స్కోరు నమోదు చేయగలిగాడు.

భారత మూడో ఓపెనర్ యశస్వి….

భారత టెస్టు చరిత్రలో.. అరంగేట్రం టెస్టులోనే శతకం బాదిన మూడో భారత ఓపెనర్ గా యశస్వి రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్ కు..ప్రధానంగా స్ట్ర్రోక్ ప్లేయర్లకు ఏమాత్రం అనువుకాని డోమనికా పిచ్ పైన భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- యశస్వి జైశ్వాల్ మొదటి వికెట్ కు 229 పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త రికార్డు నెలకొల్పారు.

1982 ఇంగ్లండ్ పర్యటనలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన నాటి ముంబై జోడీ సునీల్ గవాస్కర్- సురు నాయక్ ల తర్వాత..41 సంవత్సరాలకు మరోసారి రోహిత్- యశస్విల రూపంలో మరో ముంబై ఓపెనింగ్ జోడీ భారత ఇన్నింగ్స్ ప్రారంభించడం విశేషం.

2001 సిరీస్ లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా సంజయ్ బంగర్- వీరేంద్ర సెహ్వాగ్ జోడీ మొదటి వికెట్ కు సాధించిన 201 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని 22 సంవత్సరాల విరామం తర్వాత రోహిత్- యశస్వి జోడీ 229 పరుగుల భాగస్వామ్యంతో అధిగమించగలిగారు.

2013 సిరీస్ లో ఆస్ట్ర్రేలియాపై శిఖర్ ధావన్, 2018 సిరీస్ లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా పృథ్వీ షా తమ అరంగేట్రం టెస్టుల్లోనే శతకాలు సాధించగా..ప్రస్తుత 2023 సిరీస్ తొలిటెస్టులోనే యశస్వి జైశ్వాల్ సైతం అజేయశతకం బాదడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత మూడో ఓపెనర్ గా రికార్డుల్లో చేరాడు.

21 ఏళ్ళ 197 రోజుల వయసులో…

అత్యంత పిన్నవయసులో..టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన నాలుగో అత్యంత పిన్నవయస్కుడైన బ్యాటర్ గా యశస్వి జైశ్వాల్ రికార్డు నెలకొల్పాడు.

2013లో ఆస్ట్ర్రేలియాపైన శిఖర్ ధావన్ 187 పరుగులు, 2018లో వెస్టిండీస్ పై పృథ్వీ షా 134 పరుగులు సాధించారు. అయితే..యశస్వి జైశ్వాల్ మాత్రం 350 బంతులు ఎదుర్కొని 14 బౌండ్రీలతో 143 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు.

భారత 17వ క్రికెటర్ యశస్వి…

టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ బాదిన భారత 17వ క్రికెటర్ గా యశస్వి జైశ్వాల్ రికార్డుల్లో చేరాడు. యశస్వి కంటే ముందుగా అరంగేట్రం శతకాలు నమోదు చేసిన భారత ప్రముఖ బ్యాటర్లలో లాలా అమర్‌నాథ్‌, గుండప్ప విశ్వనాథ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌, సౌరవ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌, సురేశ్‌ రైనా, శిఖర్‌ ధవన్‌, రోహిత్‌ శర్మ, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. 2021 సిరీస్ లో కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ పై శ్రేయస్ అయ్యర్ అరంగేట్రం శతకం సాధించిన తర్వాత..అదే ఘనతను యశస్వి జైశ్వాల్ మాత్రమే దక్కించుకోగలిగాడు.

గత 14 ఏళ్లలో భారత తొలి బ్యాటర్…

విదేశీగడ్డపై టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే శతకం బాదిన భారత 7వ బ్యాటర్ గా, గత 14 సంవత్సరాలలో భారత తొలి క్రికెటర్ గా యశస్వి నిలిచాడు. 2010 సిరీస్ లో శ్రీలంక గడ్డపై సురేశ్ రైనా అరంగేట్రం టెస్టు శతకం నమోదు చేసిన తర్వాత..కరీబియన్ గడ్డపై యశస్వి అదే రికార్డును అందుకోగలిగాడు.

ముంబై ఫుట్ పాత్ ల పైన పడుకొని, పానీపూరీలు అమ్మటం ద్వారా కడుపు నింపుకొన్న యశస్వీ జైశ్వాల్..21 సంవత్సరాల వయసుకే అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగటం, టెస్టు క్రికెట్ అరంగేట్రంలోనే భారీశతకం బాదటం..22 ఏళ్ళ వయసుకే టెస్టు తొలి ద్విశతకం బాదడం భారత క్రికెట్ విజయగాధల్లో ఒకటిగా మిగిలిపోతుంది.

Safest car: ఎక్కువ సేఫ్టీ కోరుకునేవాళ్లకి ఈ కారు బెస్ట్..ధర తక్కువ,మైలేజి ఎక్కువ

భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు ప్రజలు అధిక మైలేజీనిచ్చే కార్ల కొనుగోలుపైనే దృష్టి సారించారు. కానీ, ఇటీవల ట్రెండ్ మారింది..ఇప్పుడు రూ.6-7 లక్షల శ్రేణిలో కారును కొనుగోలు చేయడానికి ముందు, వారు భద్రత మరియు నిర్మాణ నాణ్యతపై శ్రద్ధ చూపడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ విభాగంలో మారుతీ కార్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కానీ తక్కువ బడ్జెట్లో లభించే కారు భద్రత పరంగా అగ్రస్థానంలో ఉంది మరియు మంచి మైలేజీని కూడా ఇస్తుంది.
భారతదేశంలో మారుతీ కార్లు రూ.6-7 లక్షల రేంజ్లో అమ్ముడవుతున్నాయి. కానీ, అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల భద్రత రేటింగ్ బాగా లేదు. కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ బడ్జెట్ హ్యాచ్బ్యాక్ కారు మారుతి వ్యాగన్ఆర్. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్లో దీనికి 1-స్టార్ మాత్రమే లభించింది.

అయితే, ఉత్తమ పనితీరు కనబరిచే కార్లకు GNCAP ద్వారా 5-స్టార్ రేటింగ్ ఇవ్వబడుతుంది. అయితే, ఈ సందర్భంలో, మారుతి వ్యాగన్ఆర్ పిల్లల భద్రత మరియు పెద్దల భద్రత రెండింటిలోనూ బాగా పని చేయలేదు.

This car is a choice

భారత మార్కెట్లో మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.54 లక్షల నుండి రూ.7.42 లక్షల వరకు ఉంది. అదే సమయంలో, టాటా టియాగో ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.60 లక్షల నుంచి రూ. 8.20 లక్షల మధ్య ఉంది. అదే విభాగానికి చెందిన ఈ కారు వాగన్ఆర్ కంటే మెరుగైన నిర్మాణాన్ని మరియు నాణ్యతను అందిస్తుంది. టియాగో హ్యాచ్బ్యాక్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్తో వస్తుంది. అదే సమయంలో, అనేక భద్రతా ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
ఇంజిన్, మైలేజ్ టాటా టియాగో 1.2L పెట్రోల్ ఇంజన్తో 86Bhp శక్తిని మరియు 113Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు CNG ఎంపికలో కూడా వస్తుంది. ఈ కారులో 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ప్రకారం మైలేజీ గురించి చెప్పాలంటే.. పెట్రోల్పై దీని మైలేజ్ లీటరుకు 19.01 కి. అదే సమయంలో, ఇది ఒక కిలో సిఎన్జితో 26.49కిమీల వరకు పరుగెత్తుతుంది.

Rest of the features are also amazing

సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో ఎబిఎస్ విత్ ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్లు, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ డిపెండెంట్ ఆటో డోర్ లాక్, రివర్స్ కెమెరా, ఓవర్స్పీడ్ వార్నింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా, ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంది.

Viral News: ”నీ వల్ల మా బావ పెళ్లికి వెళ్లలేకపోయా..”.. చెప్పుల షాపు ఓనర్ కు లీగల్ నోటీసులు.. స్టోరీ మాములుగా లేదుగా..

Man Sends Notice To Shopkeeper in UP: ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ లో వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జ్ఞానేంద్ర భాన్ త్రిపాఠి అనే వ్యక్తి లాయర్ గా పనిచేస్తున్నాడు
గత ఏడాది నవంబర్ 21న ఈ ఘటన చోటు చేసుకుంది. జ్ఞానేంద్ర భాన్ త్రిపాఠి, తన బావ కోసం పదిరోజుల నుంచి అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మంచి షూస్ కోసం.. లోకల్ గా ఉన్న.. హుస్సేన్ షాపుకు వెళ్లాడు.

అక్కడ బ్రాండెడ్ బూట్లను సెలక్ట్ చేసుకున్నాడు. దానికి దుకాణాదారుడు బ్రాడెండ్ వని, వారంటీ కూడా ఇచ్చాడు. దీంతో బిల్ చెల్లించి ఇంటికి తెచ్చుకున్నాడు. అయితే బూట్లు కొన్ని రెండు, మూడు రోజులకే పాడైపోయాయి. రంగు కూడా పూర్తిగా మారిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జ్ఞానేంద్ర భాన్ త్రిపాఠి ఆస్పత్రి పాలయ్యాడు. అతడిని కాన్పూర్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలో అతను తన బావ పెళ్లికి వెళ్లలేకపోయాడు. కొన్నిరోజులకు జ్ఞానేంద్ర భాన్ త్రిపాఠి కోలుకున్నాడు.
ఆతర్వాత.. తనకు పాడై పోయిన బూట్లను అంటగట్టిన షాపు ఓనర్ కు బుద్ది చెప్పాలని భావించాడు. దీనిలో భాగంగా.. ఈ ఏడాది జనవరి 19న, త్రిపాఠి హుస్సేన్‌కి లీగల్ నోటీసు పంపించాడు. దుకాణా దారు అంటగట్టిన పాడైపోయిన బూట్ల కారణంగా మనో వేదనకు గురయ్యాయనని, త్రిపాఠి హుస్సేన్‌ను చికిత్స కోసం ఖర్చు చేసిన రూ.10,000, రిజిస్ట్రీకి రూ.2,100 జరిమానగా చెల్లించాలని డిమాండ్ చేశాడు.

అంతే కాకుండా.. తాను కొనుగోలు చేసిన షూలకు రూ.1,200 కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు నివేదిక పేర్కొంది. దుకాణదారుడు పరిహారం చెల్లించకుంటే హుస్సేన్‌పై కేసు పెడతానని కూడా నోటీసులో హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Retirement Plan: రూ. 20వేల జీతంతోనే కోటీశ్వరులు కావొచ్చు.. ఈ సింపుల్ ఫార్ములా ఫాలో అవ్వండి చాలు..

చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకొని కుటుంబాలను పోషించుకునే వారిని.. కొంత మొత్తం పొదుపు చేయండి.. రిటైర్ మెంట్ ప్లాన్ చేసుకోండి.. అని చెబితే నవ్వి ఊరుకుంటారు.
ఎందుకంటే వారికి వచ్చే ఆదాయం వారి కుటుంబ పోషణకు సరిపోతుంది. అటువంటి సమయంలో ఇతర పెట్టుబడులు, ప్లాన్ల గురించి వారు ఆలోచించలేరు. ఏదైనా స్కీమ్లో అటువంటి వారిని పెట్టుబడి పెట్టించేలా చేయడం కూడా చాలా కష్టం. జీతం పెరిగాక, ఆదాయం ఉన్నతి సాధించాక చూదాంలే అని దాటవేస్తుంటారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు పొదుపు మార్గాలు మా వల్ల కాదులే.. అవన్నీ ధనవంతులకే అనుకుంటూ ఉంటారు. అయితే అది సరికాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పొదుపు అనేది మీ నెలవారీ ఆదాయానికి సంబంధించినదని కాదని చెబుతున్నారు. సరైన ప్రణాళిక ఉంటే రూ. 20,000 ఆదాయం వచ్చే వారు కూడా సరైనా ఫార్ములాను వినియోగిస్తే పొదుపు చేయడంతో పాటు రిటైర్ మెంట్ సమయంలో రూ. కోటి సంపాదించే అవకాశం ఉంటుంది. అదెలాగో తెలియాలంటే ఈ కథనం చివరి వరకూ .

ఇదే ఫార్ములా..
పొదుపును అలవాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆదాయం ఎలా ఉన్నా, ఎంత ఉన్నా మీరు దానిలో ఎంతో కొంత కచ్చితంగా పొదుపు చేయాలంటున్నారు. అలాగే ఆదా చేసిన డబ్బును ఇంట్లో ఉంచకూడదు, ఏదైనా పథకంలో పెట్టుబడి పెడితే వడ్డీల రూపంలో డబ్బు కాలక్రమేణా పెరుగుతుంది. కానీ తక్కువ జీతంతో ఉండే వారు ఎలా ఆదా చేయాలి? ఎంత ఆదా చేయాలనే ప్రశ్న వస్తుంది. ఏ వ్యక్తి తన ఆదాయంలో ఖర్చులన్నీ పోనూ కనీసం 20 శాతాన్ని పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు ఉంటున్నారు.

రూ. 20,000 జీతంలో ఎంత పొదుపు చేయాలి?

మీరు నెలకు రూ. 20,000 సంపాదిస్తే, మీ ఆదాయంలో 20 శాతం రూ. 4,000 అని అనుకుందాం. ఆర్థిక నిబంధనల ప్రకారం, మీరు ప్రతి నెలా రూ. 4,000 ఆదా చేయాలి. రూ. 16,000తో మీ ఇంటి ఖర్చులు, అవసరాలన్నీ తీర్చుకోవాలి. మీరు అన్ని ఖర్చులతో ఈ రూ. 4,000 పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడిని ఎక్కువ కాలం కొనసాగించాలి.

ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

ప్రస్తుతం అనేక పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్ అయితే మీకు మంచి రాబడినిస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ పై చాలా మందికి అపోహలున్నాయి. రిస్క్ ఎక్కువని, గ్యారంటీ ఉండదని చెబుతారు. అది కొంత వరకూ వాస్తవమే అయినా.. దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడిని అందిస్తాయి. ముఖ్యంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ (ఎస్ఐపీ) పద్ధతిలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు దీర్ఘకాలంలో పెద్ద ఫండ్‌ను జోడించవచ్చు. ఎస్ఐపీలో సగటు రాబడి 12 శాతం వరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది అనేక స్థిర ఆదాయ ఎంపికల కంటే ఎక్కువ.

మీరు ఎస్ఐపీలో ప్రతి నెలా రూ. 4,000 ఇన్వెస్ట్ చేసి, ఈ పెట్టుబడిని 28 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, 28 సంవత్సరాలలో, మీ మొత్తం పెట్టుబడి రూ. 13,44,000 అవుతుంది. మీరు దీర్ఘకాలిక మూలధన లాభాలుగా రూ. 96,90,339 పొందుతారు. అటువంటి పరిస్థితిలో మీరు 28 సంవత్సరాలలో రూ. 1,10,34,339 మొత్తం రాబడిని పొందుతారు. మీరు ఈ పెట్టుబడిని మరో రెండేళ్లు అంటే 30 సంవత్సరాలు కొనసాగిస్తే.. మీరు రూ. 1,41,19,655 వరకు జోడించవచ్చు.

INCOMETAX 2023-24 కి ఏ regime best అంటే Old regime ఎవరికి మంచిది.. మరియు New regime ఎవరికి మంచిది తెలుసుకోండి..

INCOMETAX 2023-24
కి ఏ regime best అంటే Old regime ఎవరికి మంచిది.. మరియు New regime ఎవరికి మంచిది తెలుసుకోండి..

Once read to know which is best to you

Dear Teachers ఈ సంవత్సరం ఇన్కమ్ టాక్స్ లో

1). హౌసింగ్ లోన్ లేని వారు 63660/- మరియు ఆపైన Pay ఉన్నవారికి NEW REGIME ద్వారా ఐతే తక్కువ ఇన్ కమ్ టాక్స్ పడుతుంది. ఈ పద్దతిలో ఎటువంటి సేవింగ్ , రెంట్ రిసీప్ట్ అవసరం లేదు.
2). హౌసింగ్ లోన్ ఉంటే (200000/- ఇంట్రెస్ట్ ఉంటే ) మరియు 150000/- సేవింగ్ ఉంటే 94500/- pay వరుకు OLD REGIME ద్వారా ఐతే తక్కువ tax పడుతుంది.
3). 94500/- ఆపైన Pay ఉన్నవారికి హౌసింగ్ లోన్ ఉన్నా , లేకపోయినా NEW REGIME ద్వారా తక్కువ టాక్స్ పడుతుంది.
4). 63660/- to 57100 మధ్యలో pay ఉన్న వారికి (CPS) మొత్తం 200000 సేవింగ్ ఉంటే OLD REGIME ద్వారా తక్కువ టాక్స్ పడుతుంది.
5). 57100/-కన్నా తక్కువ Pay ఉన్నవారికి OLD REGIME బెటర్ గా ఉంటుంది.

Bharat ratna ‘భారత రత్న’ ఎవరికిస్తారు? గ్రహీతలు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం శనివారం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించింది.
బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు(మరణానంతరం) సైతం ఈ అవార్డును అందజేయనున్నట్టు ఇటీవలే వెల్లడించింది. 10 రోజుల వ్యవధిలోనే ఇద్దరు ప్రముఖులు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే అసలు ‘భారత రత్న’ అవార్డును ఎవరికిస్తారు? ఎందుకిస్తారు? ఈ అవార్డు పొందినవారికి ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? అనే ప్రశ్నలు సామాన్యుల్లో ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

‘భారత రత్న’ చరిత్ర
దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ఆమోదించిన కేబినెట్ తీర్మానానికి అనుగుణంగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1954 జనవరి 2 ‘భారత రత్న’ను స్థాపించారు. మొదట్లో ఈ అవార్డు కళలు, సాహిత్యం, సైన్స్, పబ్లిక్ సర్వీసెస్ రంగాలకే పరిమితమై ఉండేది. కానీ, 2011లో ఈ అవార్డు అందజేసే రంగాల పరిధిని విస్తరించారు. మానవాభివృద్ధికి తోడ్పడే ఏ రంగంలోని అర్హులకైనా ‘భారత రత్న’ను అందజేయాలని నిర్ణయించారు.

డిజైన్ చేసింది ఎవరు?

భారత రత్న పురస్కారాన్ని ప్రముఖ కళాకారుడు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత నందాలాల్ బోస్ డిజైన్ చేశారు. కాంస్యంతో తయారుచేసే ఈ అవార్డు.. రావి ఆకు ఆకారంలో ఉంటుంది. దీనికి ఒకవైపు సూర్యడి చిత్రం, దానికింద దేవనగరి లిపిలో ‘భారత రత్న’ అని రాసి ఉంటుంది. మరోవైపు, ‘జాతీయ చిహ్నం’ ఉండి, దానికింద ‘సత్యమేవ జయతే’ అనే నినాదం చెక్కి ఉంటుంది. అవార్డును మెడలో ధరించడానికి వీలుగా తెల్లటి రిబ్బన్‌ను ఉపయోగిస్తారు.

ఎవరు అర్హులు? అనర్హులెవరు?

భారత రత్న అవార్డు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం. ఏదేని రంగంలో సమాజానికి ఉపయోగపడేలా అసాధారణమైన సేవ లేదా పనితీరు కనబర్చినవారికి ఈ పురస్కారం అందజేస్తారు. వ్యక్తిగత విజయాలు, కృషితో దేశం గర్వించేలా చేసినవారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో గౌరవిస్తారు. ఇంకా చెప్పాలంటే, జాతి, వృత్తి, స్థానం లింగంతో సంబంధం లేకుండా ‘అసాధారణమైన సేవ’ లేదా ‘అత్యున్నత స్థాయిలో పనితీరు’ కనబర్చినవారిని ‘భారతరత్న’ వరిస్తుంది. జాతీయతతో సంబంధం లేకుండా, కళ, సాహిత్యం, సైన్స్, ప్రజాసేవ, శాంతి, మానవ సంక్షేమానికి ”విశిష్టమైన కృషి” చేసినవారు ‘భారత రత్న’కు అర్హులు. అవార్డుకు సిఫార్సు చేసిన ఐదేళ్లలోపు సదరు వ్యక్తి మరణిస్తే మరణానంతరం కూడా అవార్డు ఇవ్వొచ్చు. అయితే, నేరారోపణ, లేదా నైతిక విఘాతానికి పాల్పడినవారు ఈ అవార్డు అందుకోవడానికి అనర్హులు.

అవార్డు గ్రహీతలకు అందే ప్రయోజనాలు

నిజానికి, ‘భారత రత్న’ అవార్డు రావడమే తమ జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తారు. అయితే, ఆ గౌరవంతోపాటు అవార్డు గ్రహీతలకు అదనంగా పలు ప్రయోజనాలు సైతం దక్కుతాయి. భారత రత్న అవార్డు గ్రహీతలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) వేతనానికి సమానంగా తమ జీవితకాలం పెన్షన్ పొందుతారు. ఎయిర్ ఇండియా దేశీయ విమాన టిక్కెట్లపై రాయితీ లభిస్తుంది. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌లలో బోర్డింగ్ సమయంలో ప్రాధాన్యత ఇస్తారు. సీఆర్పీఎఫ్ నుంచి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. భారత రత్న గ్రహీత దేశంలోనే మరణిస్తే, వారి అంత్యక్రియలు సైనిక గౌరవాలతో ప్రభుత్వమే నిర్వహిస్తుంది.

Watermelon Side Effects: ఈ వ్యక్తులు పుచ్చకాయ తినకూడదు.. తింటే కలిగే దుష్ప్రభావాలు ఇవే..!

Watermelon Side Effects: వేసవి కాలం వచ్చిందంటే చాలు పుచ్చకాయను ఎక్కువగా తింటారు. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహకరిస్తుంది.
గర్భిణీ స్త్రీలు, బరువు తగ్గాలనుకునే వారు కూడా క్రమం తప్పకుండా పుచ్చకాయ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ ఆరోగ్యకరమైన, రుచికరమైన పండు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, పుచ్చకాయను అతిగా తినడం కూడా ఆరోగ్యానికి పెద్ద హాని కలిగిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రాత్రిపూట పుచ్చకాయ తినకూడదని సలహా ఇస్తున్నారు.

హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, డయేరియా, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. దీని ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా పుచ్చకాయను అధికంగా తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ పుచ్చకాయ తింటే మరింత సమస్య పెరుగుతుందని చెబుతున్నారు. పుచ్చకాయను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

షుగర్ లెవల్స్ పెంచుతుంది..
పుచ్చకాయ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ఆహారం. దీని క్రమరహిత వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇందులో ఉండే సహజ చక్కెర కంటెంట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు తీసుకువస్తుంది.

చర్మం మార్పులు..
ఒక అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయను అధికంగా తీసుకోవడం వలన చర్మం రంగు మారుతుందట. లైకోపెనీమియా సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. లైకోపీన్ అనేది యాంటీఆక్సిడెంట్, వర్ణద్రవ్యం. ఇది పుచ్చకాయతో సహా అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు రంగును ఇస్తుంది. లైకోపీన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం పిగ్మెంటేషన్‌లో మార్పులు వస్తాయి.

బరువు పెరుగుతారు..
పుచ్చకాయ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇందులో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. షుగర్ కంటెంట్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రిపూట తినడం వలన ఈ సమస్య వస్తుందని, పగటి పూట తినడం వల్ల సమస్య లేదని నిపుణులు చెబుతున్నారు.
(గమనిక: ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారాన్ని మాత్రమే ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ద్రువీకరించలేదు. ఆరోగ్యపరమైన సమస్యలుంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం)

Curd: పాలు తోడు వెయ్యాలంటే పెరుగు అక్కర్లేదు.. ఇలా చేస్తే సూపర్..!

Curd: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పెరుగు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి పనిచేస్తుంది. పాలు ఇష్టపడని వ్యక్తులు పెరుగు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

దీని వల్ల వారి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. పెరుగును అన్ని ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. కానీ ఇంట్లో పెరుగు చేయడానికి తోడు అవసరమవుతుంది. కానీ ఒక్కోసారి ఇదిలేకపోయినా గడ్డకట్టే పుల్లని పెరుగు తయారచేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

పచ్చి మిరపకాయలు

పాలను వేలితో తట్టుకోగలిగేంత వేడి చేయండి. తరువాత ఎర్రటి రెండు పచ్చి మిరపకాయలను తీసుకొని వాటిని ఈ పాలలో వేయండి. తరువాత పాలను 2 నుండి 4 గంటలు వెచ్చని ప్రదేశంలో ఉంచండి. పెరుగు రెడీ అవుతుంది. తర్వాత దానిని ఒక గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తద్వారా అది బాగా సెట్ అవుతుంది. తర్వాత మిరపకాయను తీసి పెరుగు ఉపయోగించండి.

నిమ్మకాయ సహాయంతో

మీరు నిమ్మకాయ సహాయంతో పెరుగును తయారచేయవచ్చు. కానీ దీనికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. దీని కోసం గోరువెచ్చని పాలలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి పాలను వెచ్చని ప్రదేశంలో ఉంచండి. దాదాపు 10 నుంచి 12 గంటల వరకు దానిని తాకవద్దు. ఆ తర్వాత పెరుగు రెడీ అవుతుంది. ఆ తర్వాత దీనిని ఫ్రిజ్‌లో పెడితే సరిపోతుంది. తర్వాత తీసి వినియోగించుకోవచ్చు.

పెరుగు తయారుచేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

పెరుగును తయారుచేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. దీని కోసం మీరు ఎల్లప్పుడూ పూర్తి క్రీమ్ పాలను ఉపయోగించాలి. అలాగే పాలను తక్కువ మంట మీద బాగా మరిగించాలి. తరువాత పెరుగు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రిజ్‌లో పెట్టాలి. తోడు వేసిన గిన్నెని కదిలించకూడదు. పెరుగు తోడుకున్న తర్వాత రెండు గంటలు ఫ్రిజ్లో ఉంచండి. పుల్లగా ఉండకుండా ఉంటుంది. అంతేకాదు తినడానికి రుచిగా ఉంటుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Banana Ghee : పరగడుపునే అరటిపండు, నెయ్యిని కలిపి తింటే.. ఎన్నో లాభాలు.. ముఖ్యంగా పురుషులకు..!

Banana Ghee : అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే అరటిపండు, నెయ్యిని కలిపి తినడం వల్ల ఇంకా ఎంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

అరటి పండు, నెయ్యిల ద్వారా మన శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. దీంతో అనేక వ్యాధులు తగ్గిపోతాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే ఈ రెండింటినీ కలిపి తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అరటి పండ్ల ద్వారా మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, ఫైబర్‌, విటమిన్లు లభిస్తాయి. దీంతో జీర్ణశక్తి మెరుగు పడుతుంది. నీరసం తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. అలాగే అధిక బరువు పెరగాలని చూస్తున్న వారికి ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. దీంతోపాటు జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

2. అరటి పండు, నెయ్యి.. రెండింటినీ కలిపి తినడం వల్ల అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా గ్యాస్‌, మలబద్దకం, అసిడిటీ తగ్గుతాయి.

3. బక్క పలుచగా ఉన్నవారు.. అధిక బరువు త్వరగా పెరగాలంటే.. రోజూ అరటిపండ్లు, నెయ్యి మిశ్రమాన్ని తీసుకోవాలి. దీంతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరుగుతారు. కండరాలు దృఢంగా మారుతాయి. ఇక రోజూ శారీరక శ్రమ అధికంగా చేసేవారితోపాటు వ్యాయామం ఎక్కువగా చేసేవారికి కూడా ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. కండరాలు నిర్మాణమై చక్కని శరీరాకృతిని పొందుతారు.

4. అరటి పండు, నెయ్యి మిశ్రమం చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల చర్మంలో ఉండే సహజ కాంతి బయటకు వస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. మెరుస్తుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.

5. అరటి పండు, నెయ్యి మిశ్రమం పురుషులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది వారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. శృంగార సమస్యలు తగ్గుతాయి. వీర్యం అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.

ఇక అరటి పండు, నెయ్యి మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకోవాలి. ముందుగా ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో 2 టీస్పూన్ల నెయ్యి వేయాలి. తరువాత బాగా పండిన 2 అరటి పండ్లను తీసుకుని గుజ్జు తీసి ఆ పాత్రలో వేసి బాగా కలపాలి. మిశ్రమం బాగా కలిసేంత వరకు తిప్పాలి. దీంతో మెత్తని గుజ్జులా అవుతుంది. దీన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే తినాలి. అయితే అంత సమయం ఉదయం లేదని భావించేవారు దీన్ని సాయంత్రం 7 గంటల లోపు కూడా తీసుకోవచ్చు. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితాలు వస్తాయి.

Health

సినిమా