Saturday, November 16, 2024

Lunula : మీ చేతి గోర్లపై ఉండే ఈ ఆకారాన్ని బట్టి.. మీకున్న వ్యాధులు ఏమిటో ఇలా సులభంగా తెలుసుకోవచ్చు..!

Lunula : మన చేతి గోళ్లను చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొందరి గోళ్ల మీద తెల్ల గీతలు ఉంటాయి. కొందరి గోళ్లు వేరే రంగులో ఉంటాయి.
అయితే సాధారణంగా అందరి చేతి గోళ్ల మీద అర్ధచంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది. దీనిని లునులా అంటారు. ఈ లునులా భాగం మన శరీరంలోని అతి సున్నితమైన భాగాలలో ఒకటి. ఒక వేళ ఈ భాగం కనుక దెబ్బతింటే మన గోరు పూర్తిగా నాశనం అయిపోతుందట. కొందరిలో ఈ లునులా పెద్దగా ఉంటుంది. కొందరిలో చిన్నగా ఉంటుంది. కొందరిలో అసలు ఉండదు. కొందరిలో గోళ్లపై గీతలు, మచ్చలు కూడా ఉంటాయి. మన గోళ్లను చూసి మన ఆరోగ్య స్థితిని, మనకు రాబోయే వ్యాధులను కూడా చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎవరి చేతి గోళ్ల మీద లునులా లేకపోతే వారు పౌష్టికాహార లోపం, థైరాయిడ్ గ్రంథి లోపాలతో, రక్త హీనతతో బాధపడుతున్నారని అర్థం. అంతే కాకుండా దీని వల్ల తరచూ ఆందోళనకు గురి అవ్వడం, బరువు పెరగడం, జుట్టు రాలడంవంటి సమస్యలతో కూడా బాధపడతారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎవరికైతే లునులా పెద్దగా ఉంటుందో వారు ఆరోగ్యంగా ఉంటారు. వారి జీర్ణశక్తి, థైరాయిడ్ గ్రంథులు బాగా పని చేస్తున్నాయని అర్థం. ఒకవేళ ఈ లునులా నీలి రంగులో లేదా పూర్తిగా పాలిపోయినట్టు ఉంటే వారు త్వరలోనే డయాబెటిస్ తో బాధపడబోతున్నారని అర్థం. ఈ లునులా బాగా చిన్నగా ఉంటే వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని, వారు అజీర్తితో బాధపడుతున్నారని, వారి శరీరంలో వ్యర్థాలు బాగా పేరుకుపోయాయని, రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని అర్థం.

Lunula
అలాగే కొందరిలో గోళ్ల మీద తెల్లని గీతలు కనబడి తరువాత మాయమై పోతాయి. ఇలా గీతలు కనబడితే వారు తగినంత ఆహారం తీసుకోవడం లేదని, శరీరంలో కాల్షియం, జింక్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని అర్థం. అదే విధంగా మన చేతికి ఉన్న పదివేళ్లల్లో కనీసం ఎనిమిది వేళ్లకు లునులా ఉండాలి. ఎనిమిది కంటే తక్కువగా ఉంటే వారిలో విటమిన్ల లోపం, ప్రోటీన్ల లోపం ఉందని, వారికి సరిపడా ఆక్సిజన్ అందడం లేదని అర్థం. ఇలాంటి వారు రోజూ వ్యాయామం చేస్తూ పౌష్టికాహారం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో గోళ్లు పాలిపోయినట్టుగా ఉంటాయి. అలాంటి వారిలో ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నాయని అర్థం.

కొందరిలో గోర్లు పసుపు రంగులో ఉంటాయి. ఇలా గోర్లు పసుపు రంగులో ఉంటే వారిలో ఫంగల్ ఇన్ ఫెక్షన్ లు, కాలేయ సంబంధిత సమస్యలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం. ఎక్కువగా నెయిల్ పాలిష్ లను ఉపయోగించే వారిలో కూడా గోర్లు పసుపు రంగులో ఉంటాయి. ఇలా గోర్లు ఎక్కువ రోజులు కనుక పసుపు రంగులో ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే కొందరి గోర్ల మీద నల్లని పొడవైన గీతలు ఉంటాయి. ఇలా గీతలు ఉంటే కనుక అవి మెలనోమా అనే చర్మ క్యాన్సర్ కు సంకేతం. కొందరిలో గోర్లు పగిలిపోతాయి. అలాంటి వారిలో చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నాయని అర్థం. ఈ విధంగా మన గోర్లను బట్టి మన ఆరోగ్య స్థితిని అంచనా వేయవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

AP SSC Results 2024 @bse.ap.gov.in; Check AP 10th Class Results 2024

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (AP SSC Results 2024) విడుదలయ్యాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తంగా 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

AP SSC Results 2024 @bse.ap.gov.in; Check AP 10th Class Results 20

SSC Board Official  Website https://bse.ap.gov.in/

Eenadu ఈనాడు Website link 1 

Eenadu ఈనాడు Website link 2   

Sakshi (సాక్షి ) Website  link  1

Sakshi (సాక్షి ) Website  link  2

Manabadi (మన బడి ) Web link 

 

AP SSC Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఈ నెల 22న విడుదల


 

AP SSC Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్. ఈ నెల 22వ తేదీన టెన్త్ రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది.

AP SSC Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాల(AP SSC Results 2024) తేదీ, సమయాన్ని విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 22 ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎల్లుండి(సోమవారం) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషన్ ఎస్.సురేష్ కుమార్ టెన్త్ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను https://bse.ap.gov.in/  వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP SSC Results 2024) విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ నెల 22 ఫలితాలు ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు (AP 10th Exams)జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 6.30 లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల అనంతరం మూల్యాంకనం చేపట్టిన విద్యాశాఖ అధికారులు.. ఏప్రిల్ 8 నాటికి ప్రక్రియ పూర్తి చేశారు. విద్యార్థులు నేరుగా ఎస్.ఎస్.సి బోర్డులో ఫలితాలు చెక్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది మే 6న పదో తరగతి ఫలితాలు విడుదల చేయగా… ఈసారి ఎన్నికల కారణంగా చాలా తొందరగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు.

జవాబు పత్రాలను మరోసారి పరిశీలించి, మార్కులు కంప్యూటీకరణ చేసే ప్రక్రియ అధికారులు పూర్తిచేశారు. పదో తరగతి ఫలితాల విడుదలకు ఈసీ అనుమతిని ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 22న ఫలితాలు(AP 10th Results Date) విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవందర్ రెడ్డి ప్రకటించారు.

How To Download AP 10th Results 2024 : ఏపీ పదో ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు?
విద్యార్థులు ఎస్.ఎస్.సి బోర్డు అధికారిక వెబ్Website https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లాలి.

హోమ్ పేజీలో కనిపించే “AP SSC Results 2024” లింక్‌పై క్లిక్ చేయాలి.
విద్యార్థి హాల్ టికెట్ నంబర్ ను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
విద్యార్థి ఫలితాలు, మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ ను పొందవచ్చు.

AP SSC Hall Tickets 2024, BSEAP SSC Board March Public Exam Schedule Released

Time table  SSC Public EXams March 2024.

 

The Andhra Pradesh Board of Secondary Education (BSEAP) has announced the schedule for the AP SSC Exams 2024, which are set to be conducted in March 2024.

The AP SSC hall tickets are typically made available a few weeks before the exams start. Students can access and download their hall tickets from the official BSEAP website. To download the hall ticket, students must enter their name, district name, school name, and date of birth.

For the students’ convenience, we have added a direct link to the official website where they can download the hall ticket and take a printout

AP SSC Hall Ticket 2024 Details
The AP SSC Hall Ticket 2024 will be released in the second week of March 2024. It is an important document that students must carry to the examination centre. If students fail to bring their hall ticket, they cannot appear for the examination.

It is important for students to verify all the details mentioned in the hall ticket after downloading it. In case of any discrepancies, they should contact the school or board officials immediately to rectify the issue.

It includes the following details:

Name of the student
Date of birth
Roll number
Name of the subjects and timings
Name and location of the exam centre
It also has instructions regarding the do’s and don’ts for the exam day, items allowed inside the exam centre, and dress code if any.

How to download the AP SSC Hall Ticket 2024?
You can visit the official website bse.ap.gov.in to download the AP SSC hall ticket 2024 for the Andhra Pradesh SSC exams. Follow the steps below :

Visit the official website of BSEAP, bse.ap.gov.in.
On the main page, click the AP SSC Hall Tickets 2024 download” link in the lower left corner.
Enter your credentials and press the submit button.
On the next page, the AP Class 10 hall ticket 2024 will be displayed.
Download it and take a printout of the hall ticket.

DOWNLOAD  —- SSC Hall tickets

Dry Fruits In Summer: ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అద్భుత ప్రయోజనాలు.. అనారోగ్య సమస్యలు మటుమాయం..

ఎండాకాలం ప్రారంభమైంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ కాలంలో తీసుకునే ఆహారం.. డ్రింక్స్ పై ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ముఖ్యంగా వేసవిలో డ్రైఫ్రూట్స్ (Dry Fruits) తీసుకోవడం వలన అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.
ఇవి మెదడు నుంచి గుండె వరకు ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అయితే చాలా మంది ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినకుండా ఉంటారు.

వాతావరణం ఎలా ఉన్నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్‌ను తినాలని వైద్యులు అంటున్నారు. అలాగే వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినే విధానం కాస్త భిన్నంగా ఉంటుందని.. డ్రై ఫ్రూట్స్ ప్రభావం చాలా వేడిగా ఉంటుందని అంటున్నారు.

కాబట్టి ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎండాకాలంలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఇలా తీసుకోవడం వలన వేడి పెరగదు. వేసవిలో ఏ డ్రై ఫ్రూట్‌ని ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో బాదం ఎలా తినాలి..

బాదం పప్పు ప్రభావం చాలా వేడిగా ఉంటుంది. ఈ కారణంతోనే చలికాలంలో బాదంపప్పు ఎక్కువగా తీసుకోవగా తీసుకుంటారు. కానీ వేసవిలో బాదంపప్పును తినాలనుకుంటే ముందుగా వాటిని నానబెట్టి తినాలి.

బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయాన్నే తొక్క తీసి తినాలి. ఇలా తినడం వలన శరీరానికి హాని కలిగిదు. పెద్దలు వేసవిలో రోజుకు 3 నుండి 4 బాదంపప్పులను తినాలి. పిల్లలకు రోజుకు 2 బాదంపప్పుల కంటే ఎక్కువ తినిపించవద్దు.

ఎండాకాలంలో ఎండు ద్రాక్ష ఎలా తినాలి..

ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్‌లో అనేక రకాల ఎండుద్రాక్షలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బ్లాక్ రైసిన్‌లు, రెడ్ రైసిన్‌లు, గోల్డెన్ రైసిన్‌లు. అన్ని రకాల ఎండుద్రాక్షల రుచి వేడిగా ఉంటుంది.

అందుకే ఎండాకాలంలో నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎండుద్రాక్ష ప్రభావం సాధారణమవుతుంది.

ఎండుద్రాక్షలో ఐరన్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. కానీ వేసవిలో ఎండు ద్రాక్షను నానబెట్టిన తర్వాతే తినాలి.

ఆయుర్వేదం ప్రకారం అన్ని స్వభావాలు ఉన్న వ్యక్తులు ఎండు ద్రాక్షను నానబెట్టి తినాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండుద్రాక్ష పురుషుల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

వేసవిలో చిన్న పిల్లలకు 2 నానబెట్టిన ఎండు ద్రాక్షలను మాత్రమే తినిపించాలి. పెద్దలు ఒక రోజులో 5 నానబెట్టిన ఎండుద్రాక్షలను తినవచ్చు.

వేసవిలో వాల్ నట్స్ ఎలా తినాలి..

వాల్ నట్స్‏లో ఐరన్, క్యాల్షియం, కాపర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి వేడిని కలుగచేస్తాయి.

కానీ చలికాలంలో వాల్‌నట్‌లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో వాల్ నట్స్ తినాలనుకుంటే వాటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలి. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవద్దు.

వేసవిలో అత్తి పండ్లను ఎలా తినాలి..

ఎండిన అత్తి పండ్లను చలికాలంలో మాత్రమే తినాలని చాలా మంది నమ్ముతారు. కానీ వేసవిలో కూడా అత్తి పండ్లను తినవచ్చు.

ఇందుకోసం అంజీర పండ్లను తినే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. 1-2 అత్తి పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ..ఉదయం నిద్ర లేవగానే వీటిని తినాలి.

అసలైన అత్తి పండ్ల ప్రభావం చాలా వేడిగా ఉంటుంది. అయితే నానబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది

చాణక్య నీతి: మీ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలంటే వీటిని వదలండి!

మనుషులు తమ జీవితాలను సంతోషమయం చేసుకోవాలంటే ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలని ఆచార్య చాణక్య తెలిపారు. మంచి పనులు చేయని వారు జీవితంలో విజయం సాధించలేరు, సంతోషంగా ఉండలేరు.
వారు ఎప్పుడూ ఏదో ఒక రకమైన భయం, ఇబ్బందులతో బాధపడుతుంటారు. జీవితంలో శాంతి, సంతోషాలు వెల్లివిరియాలంటే ఈ 4 పనులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు.

1. బాహ్యాడంబరం

బాహ్యాడంబరాల్లో నిత్యం బిజీగా ఉన్న వారి జీవితంలో ఎప్పుడూ శాంతి ఉండదు. చాణక్య నీతి ప్రకారం అటువంటి వారు జీవితంలో ప్రాధాన్యతలేని పనులతో బిజీగా ఉంటారు.

అబద్ధాలు, తప్పుడు పనులలో మునిగితేలుతుంటారు. ఈ విధమైన ప్రవర్తన వారికి పలు ఇబ్బందులకు తెచ్చిపెడుతుంది.

2. కోపం

కోపం మనిషికి గల అతి పెద్ద శత్రువు. అది మనిషిని నిలువుగా తినేస్తుంది. కోపం కలిగిన వ్యక్తికి గౌరవం లభించదని చాణక్య నీతి చెబుతుంది.

కోపంగా ఉన్న వ్యక్తికి తోటివారు దూరంగా ఉంటారు. కష్టకాలం వచ్చినప్పుడు కోపిష్టులు ఒంటరిగా మిగిలిపోతారు. బాధపడతారు.

3. అహంకారం

మనిషి అహంకారానికి దూరంగా ఉండాలి. అహంకారం అన్నింటినీ నాశనం చేస్తుంది. చాణక్య నీతి ప్రకారం అహంకారం.. మనిషిని సత్యానికి దూరం చేస్తుంది.

అలాంటివారు తమను తాము ఉన్నతంగా భావిస్తూ తప్పులు చేస్తుంటారు.

అహంకారులకు అందరూ దూరంగా ఉంటారు. అహంకారులు తమ జీవితంలో పలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

4. బద్ధకం

ఆచార్య చాణక్యుడు.. మనిషి బద్ధకానికి దూరంగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చాడు. బద్ధకం అనేది మనిషి ప్రతిభను నాశనం చేస్తుంది.

బద్ధకం కారణంగా మనిషి సదవకాశాలను కోల్పోవలసి వస్తుంది. బద్ధకంలో మునిగేవారు లక్ష్యానికి దూరంగా ఉంటారు.

మనిషి బద్ధకానికి దూరంగా ఉండడం వలన చుట్టుపక్కలవారినీ మేలు కలుగుతుంది.

Belly Fat: ఈ తప్పులు చేస్తే కొబ్బరిబొండాంలా మారిపోవడం ఖాయం.. బెల్లీ ఫ్యాట్ రహస్యాం ఇదే..

ప్రస్తుతం చాలా మంది స్థూలకాయం సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. బరువు పెరగడం.. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి.

బరువు తగ్గేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. వ్యాయమాలు చేయడం.. డైట్ ఫాలో అవ్వడం చేస్తుంటారు. కానీ మనం రోజూ చేసే చిన్న చిన్న పొరపాట్లే మీ పొట్ట చుట్టూ కొవ్వు రావడానికి కారణమవుతుంది. ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుందామా..

రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య డిన్నర్‌ చేయకపోగా, సరైన సమయానికి అంటే 7 నుంచి 9 గంటల మధ్య ఆహారం తీసుకోకపోతే, రాత్రిపూట ఆలస్యమైనా అది కూడా స్థూలకాయానికి కారణం అవుతుంది . తినడానికి ..నిద్రించడానికి మధ్య కనీసం మూడు గంటల గ్యాప్ ఉండాలి. ఒబేసిటీ సొసైటీ జర్నల్ ప్రకారం, రాత్రిపూట కేలరీలు బర్న్ చేయడానికి అదనపు సమయం పడుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ ఫోన్ స్క్రీన్ మీద స్క్రోలింగ్ చేస్తూ అరగంట నుంచి గంట గడిచేటప్పటికి మీకు తెలియకపోవచ్చు కానీ దాని ప్రభావం పొట్టపై పేరుకుపోయిన కొవ్వు రూపంలో ఉంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు బెడ్‌పై పడుకుని ఫోన్‌ని వాడినప్పుడు, ఫోన్‌లోని బ్లూ లైట్ నిద్రకు ఆటంకం కలిగిస్తుందని చాలా అధ్యయనాలు రుజువు చేశాయి. నిద్ర లేకపోవడం వల్ల, జీవక్రియ మందగిస్తుంది ..అనారోగ్యకరమైన వాటిని తినాలనే కోరిక ఉంది. ఇది భవిష్యత్తులో ఊబకాయం ..పొట్ట కొవ్వును పెంచుతుంది.

మీరు టీవీ లేదా మొబైల్ ఫోన్ చూస్తున్నప్పుడు స్నాక్స్, చిప్స్ తినాలనుకుంటే, టీవీ, ల్యాప్‌టాప్ లేదా ఫోన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు, స్క్రీన్‌పై ఎక్కువ శ్రద్ధ ఉంటుంది ..మీకు ఆకలిగా లేనప్పుడు కూడా ఇవన్నీ తినండి, ఇది కడుపులో కొవ్వును నిల్వ చేస్తుంది. మీకు ఆర్డర్ చేయాలని అనిపించినప్పుడు, మీరు మీ స్నేహితులతో ఇంట్లో కూర్చుంటారు, బయటికి వెళ్లిన తర్వాత వారు ఏ రెస్టారెంట్‌లోనూ తినరు. కానీ మీరు మీ ఫోన్‌లోని ఫుడ్ యాప్ నుంచి పిజ్జా, బర్గర్, బిర్యానీలను ఆర్డర్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా, మీరు ఎక్కువ తినడం ముగించవచ్చు. నచ్చిన కూరగాయను ఇంట్లో తయారు చేయకపోతే, మీకు నచ్చిన ఆహారాన్ని ఇంట్లోనే ఆర్డర్ చేయడం, అలా చేయడం కూడా హానికరం. సమూహం తినేవారి కంటే ఒకే వ్యక్తి తక్కువ కేలరీలను వినియోగిస్తాడని ఒక అధ్యయనం చూపించింది.

పెద్ద ప్లేట్ ఆహారం

తరచుగా ప్రజలు పెద్ద ప్లేట్‌లో ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు, అయితే పెద్ద ప్లేట్‌లో ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, మీరు అతిగా తింటారు, ఇది స్థూలకాయాన్ని పెంచుతుంది ..ఊబకాయం పెరగడం వల్ల పొట్ట కొవ్వు పెరుగుతుంది. ఇది కార్న్‌వెల్ యూనివర్సిటీ అధ్యయనం ద్వారా కూడా రుజువైంది. అందుచేత ఆహారాన్ని అదుపులో ఉంచుకోవాలంటే చిన్న చిన్న ప్లేట్లలో ఆహారం తీసుకోవాలి.

పొదుపు జీన్స్ థియరీ

బొడ్డు కొవ్వుకు ప్రధాన కారణం భారతీయుల పొట్టపై పేరుకుపోయిన కొవ్వుకు పొదుపు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ జన్యువులకు శరీరంలో అదనపు ఆహారాన్ని నిల్వ చేసే శక్తి ఉంది. ఆసియన్లు అదనపు ఆహారాన్ని తీసుకున్నప్పుడు, అది కొవ్వు రూపంలో కడుపు చుట్టూ నిల్వ చేయబడుతుంది. కాబట్టి మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.

వేగవంతమైన జీవితం

పనిని సమయానికి పూర్తి చేయడానికి, మేము హడావిడిగా ఆహారం తింటాము, అల్పాహారం దాటవేస్తాము. అర్థరాత్రి నిద్ర లేచింది. అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ ప్రకారం, నెమ్మదిగా తినే వ్యక్తులు వేగంగా తినే వారి కంటే 66 కేలరీలు తక్కువగా వినియోగిస్తారు. అటువంటి పరిస్థితిలో, మేము రోజుకు మూడు ప్రధాన భోజనాలను చాలా త్వరగా తీసుకుంటే, మనం రోజుకు 200 కేలరీలు ఎక్కువగా తీసుకుంటాము.

Mangu Machalu : ముఖంపై వచ్చే మంగు మచ్చలను తగ్గించే మొక్క ఇది.. అద్భుతంగా పనిచేస్తుంది..!

Mangu Machalu : మనకు వచ్చే చర్మ సంబంధమైన సమస్యలలో మంగు మచ్చలు కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తోంది.
శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు, శరరీంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, అందం కోసం రసాయనాలు కలిగిన ప్రొడక్ట్స్ ను వాడినప్పుడు, ప్రమాదకరమైన సూర్య కిరణాలు మన ముఖంపై ఎక్కువగా పడినప్పుడు ఈ మంగు మచ్చలు ముఖంపై వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అంతే కాకుండా స్త్రీలు గర్భం దాల్చినప్పుడు మంగు మచ్చలు ముఖంపై వచ్చి ప్రసావానంతరం వాటంతట అవే పోతాయి.

దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారిలో, అధికంగా మందులను వాడే వారిలోనూ ఈ మంగు మచ్చలు వస్తాయి. ఈ విధంగా మంగుమచ్చలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి.

ఈ మంగు మచ్చలు మన ముఖంపైనే కాకుండా ఇతర శరీర భాగాలపై కూడా వస్తాయి. మంగు మచ్చల కారణంగా ముఖం అందవిహీనంగా కనబడుతుంది. అయితే ఎటువంటి మందులను, క్రీములను వాడే పని లేకుండానే ఆయుర్వేదం ద్వారా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

ఆయుర్వేదంలో ఎంతగానో ఉపయోగించే పునర్నవ మొక్కను వాడి మన చర్మంపై వచ్చే మంగు మచ్చలను తగ్గించుకోవచ్చు. ఇవి ఎక్కడపడితే అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. దీనిని తెల్ల గలిజేరు అని కూడా పిలుస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది.

Mangu Machalu

పునర్నవ మొక్క ఆకులను సేకరించి మెత్తగా దంచి దాని నుండి రసాన్ని తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా పాలను, తేనెను కలిపి మంగు మచ్చలపై ప్రతిరోజూ రాయాలి. ఇలా చేయడం వల్ల క్రమేపీ మంగు మచ్చలు తగ్గుతాయి.

ఈ రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మంగు మచ్చలే కాకుండా మొటిమలు, నల్ల మచ్చలు, జిడ్డు చర్మం వంటి సమస్యలు కూడా తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఈ విధంగా పునర్నవ మొక్క మనకు వచ్చే మంగు మచ్చలతోపాటు ఇతర చర్మ సంబంధమైన సమస్యలైన మొటిమలు, నల్లమచ్చలను నయం చేసి ముఖం కాంతివంతంగా అయ్యేలా చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Runing: అతిగా చేస్తే పురుషులకు ప్రమాదం.. మహిళలకు మాత్రం మాంచి ఎక్సర్‌సైజ్ అంటున్న పరిశోధనలు

బాడీ ఫిట్‌నెస్ కోసం ఎక్కువ మంది నడకకు ప్రాధాన్యత ఇస్తారు. మరికొందరు పరుగెత్తుతుంటారు. అయితే అతిగా పరుగెత్తడం వల్ల మొదటికే మోసం వస్తుంది.
సుదూర పరుగు కారణంగా పురుషులకు గుండెపోటు, స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది.

బార్ట్స్ హార్ట్ సెంటర్ చేసిన పరిశోధనలో.. రన్నింగ్ పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని తేలింది.

ఎక్కువ దూరం పరుగెత్తే మగ అథ్లెట్లలో వారి ప్రధాన ధమనులు ఊహించిన దాని కంటే చాలా దృఢంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తద్వారా వారికి గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని స్టడీలో తేలింది.

అధ్యయన వివరాలు

అధ్యయనం ప్రకారం మారథాన్స్, ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్స్, సైక్లింగ్ ఈవెంట్‌లలో క్రమం తప్పకుండా పాల్గొనే పురుషుల వయస్సు కంటే వారి ధమనుల వయస్సు 10 సంవత్సరాలు పెద్దగా ఉంటుంది.

మారథాన్‌ల వంటి ఈవెంట్లు మహిళల ఆరోగ్యాన్ని పెంచుతాయని అధ్యయనంలో తేలింది. రన్నింగ్ మహిళల్లో రక్తనాళాల వయస్సును సగటున ఆరు సంవత్సరాలు తగ్గించింది. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న రన్నర్ల పరిశీలన ఆధారంగా ఈ అధ్యయన నివేదిక రూపొందించారు.

300 కంటే ఎక్కువ మంది రన్నర్లు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరు 10 కంటే ఎక్కువ మారథాన్ ఈవెంట్లలో పాల్గొన్నారు. అంతేకాకుండా కనీసం 10 సంవత్సరాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేశారు.

రన్నింగ్‌పై అపోహలు

మహిళలు పరుగెత్తవద్దని తరచుగా సలహా ఇస్తుంటారు. కుంగిపోయిన దవడ, ముడతలు, మచ్చలు ఏర్పడతాయని మహిళలు పరుగెత్తడానికి భయపడతారు. అయితే ఈ అధ్యయనం ద్వారా ఇప్పటి వరకు ఉన్న అపోహలన్నింటికీ చెక్ పెట్టినట్లయింది.

పరుగెత్తడం ఆరోగ్యానికి మంచిదే. అయితే అలా చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు. సరైన దుస్తులను ధరించాలి. మంచి రన్నింగ్ షూస్ కూడా తప్పనిసరి. మహిళలు స్పోర్ట్స్ బ్రాలు ధరించాలి.

పరుగులో వేగాన్ని ఎప్పుడు పెంచాలో, ఎప్పుడు నెమ్మదించాలో తెలుసుకోండి. పరుగును వెంటనే ఆపకూడదు. మీరు ఆగిపోయే వరకు వేగాన్ని నిదానంగా తగ్గించుకుంటురావాలి.

ఈ జాగ్రత్తలు ముఖ్యం

కాళ్లు, కీళ్లలో నిరంతర నొప్పి ఉన్నప్పుడు రన్నింగ్ ఆపండి. ఇందుకు ప్రత్యామ్నాయంగా సైక్లింగ్ లేదా ఈత వంటి ఇతర వ్యాయామాలను ప్రయత్నించడం మంచిది.

అతిగా పరుగెత్తడం వల్ల శరీరానికి ఎక్కువ హాని కలుగుతుంది. ఇలా చేయడం వల్ల అరికాలు ఫాసిటిస్ గా మారవచ్చు. అంటే మడమ దగ్గర పదునైన నొప్పితో ఉండే ఒక రకమైన వాపు.

అంతేకాకుండా అధిక వ్యాయామం కూడా రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. ఆకలిని కూడా ప్రభావితం చేస్తుంది.

Ajwain Water: శరీరంలో అన్ని రుగ్మతలకు కారణం జీవక్రియలో సమస్యే..ఆ నీళ్లే దీనికి పరిష్కారం

Ajwain Water:శరీరంలో జరిగే అన్ని రుగ్మతలకు సమాధానం జీవక్రియ లేదా మెటబోలిజం సరిగ్గా లేకపోవడమే. మరి మెటబోలిజంను మెరుగుపర్చే అద్భుతమైన ఔషధం గురించి తెలుసుకుందాం.
నిత్య జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవన శైలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే ప్రతి సమస్యకు ఆసుపత్రుల చుట్టూ పరుగెట్టాల్సిన అవసరం లేదు. వంటింట్లో లభించే అద్భుతమైన ఔషధాలతోనే చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా వాముతో చాలా అద్భుత ప్రయోజనాలున్నాయి. వాముతో ఏయే రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయనేది పరిశీలిద్దాం.

మనకు ఎదురయ్యే సకల రోగాలకు కారణం జీవక్రియ లేదా మెటబాలిజం మందగించడమే. జీవక్రియ మెరుగ్గా ఉంటే ఏ రోగాలు అంత సులభంగా దరిచేరవు. మరి ఆ మెటబాలిజంను మెరుగుపర్చేది వాము లేదా అజ్వైన్ వాటర్. వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. రోజూ వాము నీరు తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫలితంగా కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి చాలా రకాల సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు బరువు తగ్గించుకునేందుకు వాము నీరు అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని జీవక్రియను వాము నీరు మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఊబకాయం నియంత్రించవచ్చంటారు వైద్య నిపుణులు.

అయితే క్రమం తప్పకుండా ప్రతిరోజూ వాము నీరు తీసుకోవల్సి ఉంటుంది. ఒక చెంచా వాము గింజల్ని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాల్సి ఉంటుంది. ఉదయం ఆ నీటీని మరిగించి..వడపోసి తాగాలి. ఇలా చేయడం ద్వారా..వివిధ రకాల ఆరోగ్య సమస్యల్నించి దూరం చేసుకోవచ్చు.

ఇక మహిళలకు సంబంధించి తరచూ పీరియడ్స్ సమయంలో భరించలేని కడుపు నొప్పి అనేది సర్వ సాధారణంగా కన్పిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లు నీటిలో వామును బాగా మరగబెట్టి చల్లార్చి తీసుకోవాలి. ఫలితంగా కడుపు నొప్పి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

వాము లేదా అజ్వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలెక్కువ. ఇందులో పుష్కలంగా ఉండే ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, నికోటిన్ యాసిడ్, కార్పొహైడ్రేట్లు, డైటరీ ఫైబర్‌లు ఆరోగ్యానికి చాలా మంచిది. వామునీరు క్రమం తప్పకుండా తీసుకుంటే.. గొంతు నొప్పితో బాధపడేవాళ్ళు, నోటి నుంచి దుర్వాసన వెలువడేవారికి ఉపశమనం కలుగుతుంది.

Benefits of Clove: లవంగం ఇలా తీసుకుంటే షుగర్ శాశ్వతంగా దూరమవుతుందట..

మధుమేహం సమస్య ఎలాంటిందంటే దీనికి ఆహారం ,పానీయాలపై చాలా శ్రద్ధ వహించాలి.
ఏదైనా అటూఇటూగా తిన్నా అది షుగర్ స్థాయిని పెంచుతుంది. అలాగే మధుమేహం సమస్య గణనీయంగా పెరుగుతుంది.

అటువంటి పరిస్థితిలో ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి జీవనశైలి ,ఆహారాన్ని మెరుగుపరచడం అవసరం. ఈరోజు మనం షుగర్ లెవల్స్‌ని అదుపులో ఉంచే అలాంటి హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం.

ఈ చిట్కాలలో ఒకటి లవంగాల వంటకం. నిజానికి, లవంగంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఇది చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు లవంగాలను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.(If you take cloves like this the sugar will go away permanently )

మధుమేహ వ్యాధిగ్రస్తులు లవంగాన్ని ఈ విధంగా ఉపయోగించాలి?

లవంగాల కషాయాలను తయారు చేయండి..

లవంగం డికాషన్ చక్కెర స్థాయిని నియంత్రించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం ఒక గ్లాసు నీటిలో 8-10 లవంగాలను మరిగించాలి. ఈ నీటిని సుమారు 4-5 నిమిషాలు ఉడకబెట్టండి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా తాగాలి. ప్రయోజనం పొందుతారు.

లవంగం నీరు..

మధుమేహం సమస్యలో లవంగం నీటిని కూడా తాగవచ్చు. దీని కోసం, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు 4-5 లవంగాలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. తర్వాత ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి.

అదే సమయంలో, లవంగాన్ని పీల్చడం ద్వారా తినండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది.

ఆహారంలో మసాలాగా కూడా ఉపయోగించవచ్చు..

లవంగాన్ని ఏ విధంగానైనా తినండి. అందులో ఉండే లక్షణాలు ఏమాత్రం తగ్గవు. అందువల్ల, మీరు దీన్ని ఆహారంలో మసాలాగా కూడా ఉపయోగించవచ్చు.

ఇది దాని అనేక లక్షణాలను తగ్గించదు. మీ చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇది కాకుండా, అనేక ఇతర సమస్యలను తొలగించడంలో కూడా లవంగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పంటి నొప్పిని నయం చేయడంలో ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంది.

Potato : బంగాళదుంపలు ఆకుపచ్చ రంగులోకి మారుతోంటే అర్థమేంటి..? వాటిని తింటే…

మనలో చాలా మంది బంగాళ దుంపలతో చేసిన పదార్థాలంటే ఇష్టంగా తింటాం. కూరలైనా, ఫ్రై లైనా కూడా పిల్లలు పెద్దలూ అందరూ తింటుంటారు. మామూలుగా బంగాళ దుంపలు పాడుకాకుండా ఎక్కవకాలం నిల్వ ఉంటాయి.
అందుకే వీటిని కొని ఓపక్కన వేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండేస్తూ ఉంటాం. కాకపోతే మనం గమనించని విషయం ఏమిటంటే కాస్త నిల్వ ఉన్న బంగాళ దుంపలు చిన్న చిన్న మొలకలు వచ్చి కనిపిస్తాయి.

వాటిని కూడా కూరల్లోకి వాడేస్తాం. అలాగే కొన్ని దుంపలు కాస్త పచ్చరంగులో పచ్చిగా కనిపించినా సరే వాటిని కూడా వంటకు వాడేస్తాం. అసలు ఇలా పచ్చగా ఉంటే బంగాళ దుంపల్ని ఆహారంలో తినచ్చా? అసలు ఈ విషయాన్ని ఇప్పటిదాకా ఆలోచించి ఉండరు కదా. ఈ దుంపలు రంగు మారడానికి కారణాలు ఏంటి.

బంగాళదుంపలు ఎందుకు ఆకుపచ్చగా మారుతాయి?

బంగాళ దుంపలపై సూర్యకాంతి పడినప్పుడు అవి సహజంగానే ఆకుపచ్చగా మారతాయి. బంగాళా దుంపలకు ఆ పచ్చరంగు క్లోరోఫిల్ నుంచి వస్తుంది. ఈ క్లోరోఫిల్ అనేది మొక్కలకు పచ్చదనాన్ని ఇచ్చే పదార్థం. దీనిని తీసుకోవడం వల్ల ప్రమాదం ఏం ఉండదు.

పచ్చి బంగాళదుంపలు తినడం సురక్షితమేనా?

కాకపోతే నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ నివేదిక ప్రకారం, మరీ పచ్చిగా మారిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి అంత సురక్షితం కాదంటున్నారు. బంగాళాదుంపలో క్లోరోఫిల్ పెరిగి, దానిని ఆకుపచ్చగా మార్చినప్పుడు, సోలనిన్ సమ్మేళనం కూడా పెరిగే అవకాశం ఉంది.

సోలనిన్ అధిక స్థాయి బంగాళాదుంపలను చేదుగా చేస్తుంది అలాగే ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీయవచ్చు. కిరణజన్య సంయోగక్రియకు క్లోరోఫిల్ అవసరం, మొక్కలు తమను తాము పోషించుకోవడానికి ఉపయోగించే ప్రక్రియ ఇది.

సూర్యరశ్మికి గురికావడం వల్ల బంగాళదుంపలలో క్లోరోఫిల్ ఉత్పత్తి వేగవంతం అవుతుంది. ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల, వికారం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలతో పాటు తలనొప్పి, నరాల సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.

అయితే, ఈ ప్రభావాలన్నీ బంగాళ దుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల జరుగుతాయి. రుచి కొద్దిగా మారినా, రంగులో తేడా కనిపించినా వీటిని చేదుగా ఉన్నాకూడా తినకూడదు.

పచ్చ బంగాళాదుంపలను ఎలా వాడుకోవాలి?

రంగుమారిన బంగాళదుంపలను మొత్తానికి తినకూడదని కాదు.. ఆకుపచ్చ భాగాన్ని కత్తిరించి, మిగిలిన బంగాళాదుంపలను వాడుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదిక ప్రకారం, బంగాళాదుంప పై పొరను కూడా తొలగించడం ఉత్తమం, ఎందుకంటే వీటి చర్మంలో ఎక్కువ సోలనిన్ కనిపిస్తుంది.

మీ బంగాళాదుంపలు చాలా త్వరగా ఆకుపచ్చగా మారకుండా ఉండడానికి వాటిని ఎప్పుడూ ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉంచండి. చల్లగా, కాస్త చీకటిగా ఉండే చోట వీటిని నిల్వ ఉంచడం ఉత్తమం.

Salt : ఉప్పు, థైరాయిడ్.. ఈ రెండింటికీ ఉన్న అసలు సంబంధం ఏమిటో తెలుసా..?

Salt : ప్రస్తుత కాలంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. షుగర్, బీపీ వంటి వాటితోపాటు థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కూడా రోజురోజుకూ ఎక్కువవుతున్నారు.
ఈ సమస్య బారిన పడిన వారు ప్రతిరోజూ దీర్ఘకాలం పాటు మందులను వాడాల్సి వస్తోంది. ఈ సమస్య చాలా కాలం నుండి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ సమస్యతో బాధపడే వారు అధికమవుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఈ సమస్య వేధిస్తోంది.

Salt

అయోడిన్ లోపం కారణంగా థైరాయిడ్ సమస్య వస్తుందని మనందరికీ తెలుసు. అయోడిన్ కలిపిన ఉప్పును ఉపయోగించడం వల్ల ఈ సమస్య బారిన పడకుండా ఉంటామని నిపుణులు సూచిస్తున్నారు.

అయోడిన్ కలిపిన ఉప్పును ఉపయోగించినప్పటికీ థైరాయిడ్ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. థైరాయిడ్ లో హైపర్ థైరాయిడ్, హైపో థైరాయిడ్ అనే రెండు రకాలు ఉంటాయి.

అయోడిన్ ను తక్కువగా తీసుకోవడం వల్ల హైపర్ థైరాయిడ్ బారిన పడతామని, అయోడిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపో థైరాయిడ్ బారిన పడతామని నిపుణులు సూచిస్తున్నారు.

మనలో చాలా మంది హైపో థైరాయిడ్ తో బాధపడుతున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కేవలం అయోడిన్ ను కలిపిన ఉప్పును ఎక్కువగా వాడడం వల్లే మనం హైపో థైరాయిడ్ బారిన పడుతన్నామని వైద్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పూర్వకాలంలో సాధారణ ఉప్పును ఉపయోగించడం వల్ల థైరాయిడ్ సమస్య వచ్చినా తక్కువగా వచ్చేదని, అయోడిన్ ను కలిపిన ఉప్పును ఉపయోగించడం మొదలు పెట్టిన దగ్గరి నుండి థైరాయిడ్ బారిన పడే వారు ఎక్కువవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

అయోడిన్ ను కలిపిన ఉప్పును ఉపయోగించడం మానేసి సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండా కేవలం మూడు నెలలలోనే థైరాయిడ్ సమస్య నుండి బయటపడవచ్చని చెబుతున్నారు.

అయోడిన్ ను కలిపిన ఉప్పును ఉపయోగించడం వల్ల థైరాయిడ్ సమస్య లేని వారిలో కూడా అది వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Sapota : సపోటా పండ్లను రోజుకు రెండు తినండి చాలు.. ఎన్నో లాభాలు పొందవచ్చు..!

Sapota : మనకు చూడగానే తినాలనిపించే పండ్లలో సపోటా పండ్లు కూడా ఒకటి. ఇతర పండ్ల లాగా సపోటా పండ్లు కూడా అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి.
వీటిని తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. సపోటా పండ్లను తినడం వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సపోటా పండ్లను తినడం వల్ల నీరసం తగ్గి తక్షణశక్తి లభిస్తుంది.

సపోటా పండ్లలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ తోపాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. సపోటా పండ్లను తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.

కంటిచూపు మెరుగుపడుతుంది. సపోటా పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన శ్లేష్మం బయటకు పోయి దగ్గు, జలుబు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Sapota

సపోటా పండ్లలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలను తగ్గించే శక్తి కూడా సపోటా పండ్లకు ఉంటుంది.

గర్భిణీ స్త్రీలు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆందోళనను, ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగించే గుణాన్ని కూడా సపోటా పండ్లు కలిగి ఉంటాయి.

అంతేకాకుండా సపోటా పండ్లు యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం.

చర్మ ఆరోగ్యాన్ని కూడా సపోటా పండ్లు మెరుగుపరుస్తాయి. సపోటా పండ్లలో ఉండే గింజలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ గింజల నుండి తీసిన నూనెను జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

సపోటా గింజలను మెత్తగా నూరి విష కీటకాలు కుట్టిన చోట ఉంచి కట్టుకట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా సపోటా పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Papaya: మీకు బొప్పాయి తినే అలవాటుందా? పొరపాటున వీటితో కలిపి తిన్నారంటే విషంగా మారి..

Do not eat papaya with these fruits: ఎర్రగా పండిన బొప్పాయిని చూస్తూ తినకుండా ఉండగలమా? బొప్పాయిలో ఆరోగ్యానికి మేలు చేసే విలమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.
బొప్పాయిని పచ్చిగా ఉన్నా, పండినా ఎలాగైనా తినవచ్చు. బొప్పాయిలోని పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణ సమస్యలను పరిష్కరించడం నుంచి బరువు తగ్గడం వరకు బొప్పాయి కీలకంగా పనిచేస్తుంది. ఈ పండు డయాబెటిక్ రోగులకు వరంలాంటిది. బొప్పాయిలో విటమిన్ ఎ, సి, బి, ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 60 కంటే తక్కువగా ఉంటుంది. అందుకే రోజువారీ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తుంటాకె. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ అలర్జీగా పనిచేస్తుంది. పేగు పుండ్లను నయం చేయడానికి బొప్పాయిని మించిన వైద్యుడు లేడు. ఇన్ని ఔషధ గుణాలున్నప్పటికీ బొప్పాయిని కొన్ని పండ్లతో కలిపి తింటే అది శరీరంలో విషంలా మరి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అవేంటంటే..

బొప్పాయి, నిమ్మకాయలను కలిపి తినకూడదు. ఈ రెండు పండ్లను కలిపి తింటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సలాడ్ లేదా బొప్పాయి చట్నీ మరేదైనాకావచ్చు నిమ్మకాయతో దీనిని అస్సలు తినకూడదు.

బొప్పాయి వేడి ఆహారం. పెరుగు చలువ ఆహారం అని అందరికీ తెలుసు. ఐతే ఈ రెండింటినీ కలిపి తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. బొప్పాయి తిన్న కనీసం 2 గంటల తర్వాత పెరుగు తినడం బెటర్‌.

ఫ్రూట్ సలాడ్‌లో నారింజ, బొప్పాయిలను కలిపి తినకూడదు. ఈ రెండు పండ్లను కలిపి తింటే జీర్ణం కాదు. అంతేకాకుండా అది శరీరం విషంగామారుతుంది అవుతుంది. అదేవిధంగా కివి – బొప్పాయిలను కూడా కలిపి సలాడ్‌గా తినకూడదు.

టొమాటో – బొప్పాయి ఈ రెండింటి కలయిక కూబి శరీరానికి అంత మంచిది కాదు. వీటిని కలిపి తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Blood Group:మీ బ్లడ్ గ్రూపు చెబుతుంది.మీ గుండె ఎంత గట్టిదని.!!

మీ బ్లడ్ గ్రూప్ ఏంటి. ఏ పాజిటివ్, ఏ నెగెటివ్, బీ పాజిటివ్, బీ నెగెటివ్, ఓ పాజిటివ్, ఓ నెగెటివ్ , ఏబీ పాజిటివ్, ఏబీ నెగెటివ్ ఇలా గ్రూపులు ఉంటాయి.
అందులో ఏదొక గ్రూపు అయ్యి ఉంటుంది. అత్యవసర చికిత్సలు, ప్రమాదాల సమాయాల్లో, ప్రసవ సమాయాల్లో రక్తం ఎక్కించాల్సినప్పుడు డాక్టర్లు మీ బ్లడ్ గ్రూపు ఏంటని ప్రశ్నిస్తుంటారు. ఇలా బ్లడ్ గ్రూపు అనేది వ్యక్తుల ఆరోగ్యంలోనూ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

A, B, O అనే పదాలో ఓబీవో జీన్ ను ప్రతిఫలిస్తాయి. ఇది మన రక్త కణాలను భిన్నంగా తయారు చేస్తుంది. దీన్ని బట్టిపలు రక్త గ్రూపులు ఏర్పడ్డాయి. ఏబీ గ్రూపు అంటే ఏ, బీ యాంటీజెన్స్ ను వారి ఎర్రరక్తకణాలు తయారు చేసేలా శరీర నిర్మాణం ఉంటుంది.

బ్లడ్ గ్రూపుల్లో ఒక గ్రూపు ఎలాంటి యాంటీజెన్స్ ను ఉత్పత్తి చేయదు. అందుకే ఓ గ్రూపు వారు మిగిలిన రక్త గ్రూపుల వారికి తమ రక్తాన్ని అత్యవసరాల్లో దానంగా ఇస్తారు. ఓ పాజిటివ్ వారు మిగిలిన అన్ని పాజిటివ్ గ్రూపుల వారికి ఇవ్వచ్చు.

ఓ వీరిని యూనివర్సల్ డోనర్ అంటుంటారు. జనాభాలో సుమార్ సగం శాతం Oగ్రూపువారే ఉంటారు. ఇక ఎర్రరక్త కణాల్లో ప్రొటీన్లు ఉంటే వారిని పాజిటివ్ గ్రూపుగా లేనివారిని నెగెటివ్ గ్రూపుగా నిర్దార్ధిస్తారు. ఇలా రక్తంలో ఎందుకు వ్యత్యాసాలుఉంటాయన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు.

Oగ్రూపుతో వారితో పోల్చితే…A,B,ABగ్రూపు వారికి హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ రిస్కు ఎక్కువగా ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. Aలేదా Bగ్రూపు వారికి హార్ట్ ఎటాక్ రిస్క్ 8శాతం ఎక్కువ.

హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 10శాతం ఎక్కువ. రక్తంలో క్లాటింగ్ రేటులోనూ వ్యత్యాసం ఉంటుందని AHAఅంటోంది. ఏ, బీ బ్లడ్ గ్రూప్ వారికి డీప్ వేన్ థ్రోంబోసిస్ వచ్చే అవకాశాలు 51శాతం ఎక్కువని…పల్మనరీ ఎంబాలిజమ్ వచ్చే ఛాన్స్ 47శాతం ఎక్కువగా ఉంటుందని AHAఅధ్యయనం చెబుతోంది. టైప్, A,B,ABబ్లడ్ గ్రూపుల వారి శరీరంలో వచ్చే ఇన్ ఫ్లమ్మేషన్ దీనికి కారణం కావచ్చని హెమటాలజిస్ట్ గుగెన్ హీమ్ నిర్వచించారు.

A,Bగ్రూపుల్లోని వారి రక్తంలో ఉండే ప్రొటన్ లు ధమనులు, సిరలలో అవరోధాలు, గట్టిపడేందుకు కారణం అయ్యే ఛాన్స్ ఉంది. Oగ్రూపు వారికి రక్తం గట్ట కట్టడాలు, గుండె జబ్బుల రిస్క్ తక్కువగా ఉంటుంది.

కానీ వీరికి హెమరేజింగ్ లేదా రక్తస్రావం రిస్క్ కూడా ఎక్కువే. ABగ్రూపు వారికి కాగ్నిటివ్ ఇంపెయిర్ మెంట్ రిస్క్ కూడా ఎక్కువ.

అంటే గుర్తుంచుకోకపోవడం, దేనిపైనా ద్రుష్టి పెట్టలేకపోవడం నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి వాటికి దారితీస్తుంది.

AP DSC vacancy position in all category 

School Education Dept DSC Request to submit vacancy position in all category Posts in Prescribed Proforma of Regarding Memo:20021

School Education Dept DSC Request to submit vacancy position in all category Posts in Prescribed Proforma of Regarding.

Memo No. ESE02-20021/Spl/2024-RECTMT-CSE, Dt: 02.02.2023

The District Educational Officers and in the State arx be requested to depute concerned Assistant Director, Superintendent and Section Assistant with Roster details as per the proposed posts prescribed format duly sign by the District Educational Officer 04.02.2024 (12:00PM) to the O/o CSE, AP, Amaravati.

This should be treated as most urgent

DSC vacancy position in all category

Ratha Saptami: రథ సప్తమి ప్రాముఖ్యత ఏమిటి? నదీ స్నానం ఎందుకు చేయాలో తెలుసా..!

మాఘ మాసం శుద్ధ సప్తమి రోజుని సూర్య నారాయణుడి జన్మ దినోత్సవాన్ని రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యక్ష దైవం సూర్యుడిని పూజించే సంప్రదాయం ఉంది.
రథ సప్తమి రోజున తెల్లవారు జామునే నది స్నానం చేయడం చాలా ముఖ్యమైనది. సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం రథ సప్తమి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.ఆరోగ్యంగా ఉంటారు. ఈ నమ్మకం ఆధారంగా దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు.

రథసప్తమి ప్రాముఖ్యత?

పౌరాణిక కథ ఏమిటంటే మాఘమాసంలోని శుక్ల పక్షంలోని ఏడవ రోజు సప్తమి తిథిలో సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలు పెట్టాడు. కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. అంతేకాదు ఈ రోజున సూర్య భగవానుడి పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు.

రథసప్తమి ఈ ఏడాది ఎప్పుడంటే

పంచాంగం ప్రకారం మాఘ మాస శుక్ల పక్ష సప్తమి ఈ సంవత్సరం 15 ఫిబ్రవరి 2024 గురువారం ఉదయం 10.15 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే శుక్రవారం 16 ఫిబ్రవరి 2024 ఉదయం 8.58 గంటలకు ముగుస్తుంది. తేదీ ఆధారంగా రథసప్తమి స్నానాన్ని, స్నానం శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024న మాత్రమే ఆచరిస్తారు.
రథ సప్తమి పూజా విధానం

రథసప్తమి రోజున సూర్యోదయం తర్వాత భక్తులు స్నానాలు చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఈ సమయంలో భక్తుడు సూర్యభగవానునికి అభిముఖంగా నిలబడి నమస్కరిస్తాడు. అనంతరం నెయ్యి దీపం వెలిగించి, సూర్య భగవానుడికి ఎర్రటి పువ్వులు సమర్పించి సంప్రదాయాన్ని అనుసరిస్తూ పూజ చేస్తాడు. ఇలా అన్ని పద్ధతుల ప్రకారం సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా సూర్యభగవానుడు భక్తులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదిస్తాడని నమ్ముతారు.

రథసప్తమి రోజున ఈ తప్పులు చేయకండి

రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఎవరి పైన కోపం ప్రదర్శించరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో, చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి. మద్యం , మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని MannamWeb ధృవీకరించడం లేదు

Foods for Thyroid: థైరాయిడ్ రాకుండా ఉండాలా.. రోజూ వీటిని తినండి చాలు!

శరీరంలో ఉండే అతి ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి. ఈ థైరాయిడ్ గ్రంథి శరీరంలో ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. ఈ గ్రంథి గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది.
శరీరంలో జీవక్రియలను నియంత్రించడంలో, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ఈ గ్రంథి బాగా సహాయ పడుతుంది. శరీరంలో శక్తి స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంథి పని తీరు చురుగ్గా ఉండాలంటే.. అయోడిన్ ఎక్కువగా అవసరం అవుతుంది. అయోడిన్ సరిగ్గా తీసుకోవడం వల్ల గ్రంథిలో లోపాలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా థైరాయిడ్ గ్రంథి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

– సూప్స్, సలాడ్స్, సుషీ వంటి ఆహారాలను తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ పని తీరు మెరుగు పడుతుంది.

– అలాగే కాడ్, ట్యూనా, సాల్మన్ వంటి చేపలను కూడా తీసుకోవాలి. వీటిలో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో థైరాయిడ్ బాగా పని చేస్తుంది.
– పాలు, పాల ఉత్పత్తుల్లో కూడా అయోడిన్ ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకున్నా.. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేస్తుంది.

– అయోడిన్ ఎక్కువగా ఉండే వాటిల్లో గుడ్లు కూడా ఒకటి. కాబట్టి ప్రతి రోజూ గుడ్డు తింటే తగిన మోతాదులో అయోడిన్ అందుతుంది.

– అదే విధగా అయోడిన్ ఉన్న ఉప్పు తీసుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది. అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకును ఉప్పును మితంగా తీసుకోవడం మంచిది.

– థైరాయిడ్ గ్రంథి పని తీరును మెరుగు పరచడంలో బెర్రీలు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీస్ వంటి వాటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పని తీరు మెరుగు పడుతుంది.
– ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా బెర్రీలు చాలా రుచిగా ఉంటాయి. వీటితో సలాడ్స్, స్మూతీలు చేసుకుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

– బీన్స్, కాయ ధాన్యలు, చిక్కుళ్లు వంటి వాటిలో కూడా అయోడిన్ ఉంటుంది. అంతే కాకుండా శరీరానికి ఇతర పోషకాలు కూడా అందుతాయి.

– బాదం, ప్రొద్దు తిరుగుడు గింజలు, అవిసె గింజల్లో కూడా అయోడిన్ లభిస్తుంది. కాబట్టి వీటిని తీసుకున్నా సరిపోతుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా?

Find Fake Sim Card: మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. పెరిగిన సాంకేతికతో పాటు నేరాల తీరు కూడా మారిపోయింది. ఇంటర్నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం రోజుల్లో ప్రతీ పనికి ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నాం. మరి మన ఆధార్‌ను ఎవరైనా ఉపయోగించుకొని సిమ్ కార్డ్ తీసుకుంటే ఎలా.? ఇలా తీసుకున్న సిమ్ కార్డును ఏదైనా అసాంఘిక కార్యక్రమానికి ఉపయోగిస్తే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో మీ ఐడీపై ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా. మీ పేరుపై ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి కేంద్ర టెలికాం సంస్థ ఒక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొన్ని సింపుల్ స్టెప్స్‌తో మీ పేరుపై ఏవైనా ఫేక్ సిమ్స్ ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి..

* ఇందుకోసం ముందుంగా https://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం ఓపెన్ అయిన పేజీలో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అనే బాక్స్ ఉంటుంది.

* మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన గెట్ ఓటీపీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే మీ పేరు మీద యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నెంబర్లు కనిపిస్తాయి.

* సదరు నెంబర్లలో మీకు అవసరం లేకపోయినా, తెలియని నెంబర్ ఏదైనా ఉన్నా.. దానిపై క్లిక్ చేసి నెంబర్ బ్లాక్ చేయాలి.

* ఇలా చేయగానే మీ మొబైల్ నెంబర్‌కు రిక్వెస్ట్ ఐడీ వెళుతుంది.

* రిక్వెస్ట్‌ను ట్రాక్ చేసుకోవడానికి భవిష్యత్తులో ఈ ఐడీ ఉయోగపడుతుంది.

https://tafcop.dgtelecom.gov.in/

మీ LPG గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇప్పటి వరకూ మొత్తం ఎంత వచ్చిందో ఆన్లైన్ లో ఇలా తెలుసుకోండి

Find out how much your LPG gas cylinder subsidy has been so far online

మీ LPG గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇప్పటి వరకూ మొత్తం ఎంత వచ్చిందో ఆన్లైన్ లో ఇలా తెలుసుకోండి

LPG యొక్క అన్నిసేవలను కూడా ప్రభుత్వం ఆన్లైన్ చేసింది. ఆన్లైన్ లో గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం మొదలుకొని సబ్సిడీ వివరాల వరకూ www.mylpg.in వెబ్సైట్ నుండి చేయవచ్చు. అంటే, Indane , HP మరియు Bharat గ్యాస్ ఏదైనా సరే ఈ వెబ్సైట్ నుండి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు LPG సేవలకు సంబంధించిన అన్ని పనులు ఆన్లైన్లో జరుగుతున్నాయి. మీరు మీ అకౌంట్ లో గవర్నమెంట్ వేస్తున్న గ్యాస్ సబ్సిడీ వివరాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే, దాని గురించి తెలుసుకోవడం కూడా సులభం. మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వివరాలను ఆన్లైన్లో పొందడం చాలా సులభం.

కొన్ని ఇబ్బందికరమైన కేసులను కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము.
ముఖ్యంగా, వినియోగదారుడు యొక్క సబ్సిడీ మొత్తం గ్యాస్ ఏజెంట్ ఖాతాకు మళ్లించడం వంటి కేసులను కొన్ని సార్లు చూస్తుంటాం. అందువల్ల, సబ్సిడీ మొత్తం మీ ఖాతాకు చేరకపోతే, సబ్సిడీ స్టేటస్ ని చెక్ చేయండి. మీరు ఆన్లైన్లో మై ఎల్పిజి సబ్సిడీని సులభంగా చూడవచ్చు, అంటే మీ ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ స్టేటస్ తనిఖీ చేయడానికి మీరు ఎక్కడకి పరుగెత్తాల్సిన అవసరం లేదు, మీరు ఇంటి నుండి ఆన్లైన్లో సబ్సిడీ స్టేటస్ తనిఖీ చేయవచ్చు. అదనంగా, మీరు కాల్ చేయడం ద్వారా మీ ఫిర్యాదును కూడా నమోదు చేసుకోవచ్చు.

దీనితో పాటు, మీరు మీ గ్యాస్ సిలిండర్ (భారత్ గ్యాస్, ఇండేన్ గ్యాస్ మరియు హెచ్పి గ్యాస్) ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని మీకు చెప్పినట్లు, అదనంగా మీరు ఎల్పిజి గ్యాస్ కోసం ఆన్లైన్ చెల్లింపు కూడా చేయవచ్చు. మీరు కొత్త ఎల్పిజి కనెక్షన్ను పొందాలనుకుంటే, మీరు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీరు My LPG గ్యాస్ బుకింగ్ యాప్ ని కూడా ఉపయోగించవచ్చు. అయితే, ఈ రోజు మనం మీ ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ స్టేటస్ ఎలా తనిఖీ చేయవచ్చో తెలుసుకుందాం.

గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్టేటస్ ఎలా తనిఖీ చేయాలి?

మీ ఖాతాలో మీకు సబ్సిడీ మొత్తం రాకపోతే మీరు ఏమి చేయాలో చూడండి. ఆన్లైన్లో సబ్సిడీ రాష్ట్రాలను తనిఖీ చేయడం సులభమయిన మరియు మంచి మార్గం.

ఆన్లైన్ సబ్సిడీ స్టేట్స్ (రాష్ట్రాలు) రిపోర్ట్ చూడటానికి, మొదట మీరు www.mylpg.in సైట్కు వెళ్ళాలి.

ఇక్కడ మీరు వాడుతున్న కనెక్షన్ గ్యాస్ కంపెనీ పేరుపై క్లిక్ చేయండి.

క్లిక్ చేసినప్పుడు, క్రొత్త పేజీ తెరవబడుతుంది, దీనిలో చాలా అప్షన్ లు కనిపిస్తాయి. మీరు ఆన్లైన్ ఫీడ్బ్యాక్ ఎంపికపై క్లిక్ చేయండి. ఆ తరువాత కస్టమర్ కేర్ సిస్టమ్ యొక్క పేజీ తెరవబడుతుంది.

దీనిలో మీరు మీ వివరాలను పూరించాలి. అంటే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు LPG ID వంటిని ఇవ్వాలి.

మీరు IDని నమోదు చేసిన వెంటనే మీ LPGకి సంబంధించిన మొత్తం సమాచారం వస్తుంది. సబ్సిడీ మొత్తాన్ని ఎప్పుడు చేర్చారు, ఎంత మొత్తాన్ని చేర్చారు వంటి పూర్తి సమాచారం మీకు లభిస్తుంది.

మీ ఖాతాకు బదులుగా మరొకరి ఖాతాకు సబ్సిడీ మొత్తం వెళుతుంటే, మీరు ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ఆన్లైన్లో తనిఖీ చేయడం మరియు ఫిర్యాదు చేయడమే కాకుండా, మీరు ఇదే పనిని ఆఫ్లైన్లో కూడా చెయ్యవచు.

ఆఫ్ లైన్ కోసం

మీ LPG గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ను సందర్శించడం ద్వారా వారు మీ ఖాతాను లింక్ చేశారా లేదా అని మీరు ధృవీకరించవచ్చు. కొన్నిసార్లు బ్యాంకు వైపు కూడా సమస్య ఉంటుంది. కాబట్టి, మీరు ఎల్పిజి సబ్సిడీ ఫారమ్ను నింపిన బ్యాంకుకు వెళ్లి, మీ బ్యాంక్ ఖాతాను సరైన సమాచారంతో లింక్ చేసిందో లేదో తెలుసుకోవచ్చు. బ్యాంకు నుండి సబ్సిడీ బదిలీ చేయబడిందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అయితే, ఇంకా మీ ఖాతాలో డబ్బు రాకపోయినట్లయితే, అటువంటి పరిస్థితిలో, ఆధార్ కార్డుతో బ్యాంకుకు వెళ్లి తెలుసుకోండి.

ఇది కాకుండా, మీ వద్ద ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే మరియు బ్యాంక్ లేదా పంపిణీ కేంద్రానికి వెళ్ళడానికి సమయం లేకపోతే, మీరు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చెయ్యవచ్చు . టోల్ ఫ్రీ నంబర్- 18002333555 కు కాల్ చేసి మీరు ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. మీకు ఇప్పటివరకు మై ఎల్పిజి సబ్సిడీ పథకం గురించి తెలియకపోతే మరియు మీరు ఈ పథకంలో చేరాలని కోరుకుంటే, వెంటనే మీరు petroleum.nic.in వెబ్సైట్లోకి వెళ్లి ఈ పథకానికి కనెక్ట్ అవ్వండి.

ఆధార్ కార్డు ద్వారా ఎల్పిజి సబ్సిడీని పొందండి

దీని కోసం, మొదట మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయండి, దీన్ని చేయడానికి మీరు మీ బ్యాంకును సందర్శించాలి లేదా మీరు దీన్ని ఆన్లైన్లో కూడా చేయవచ్చు. దీని కోసం, మీరు మీ బ్యాంక్ వెబ్సైట్కు వెళ్లాలి.

Spam Calls : స్పామ్ కాల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా ? జస్ట్ ఇలా చేస్తే మళ్లీ రావు వివరాలు.

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత స్పామ్ కాల్స్ విపరీతంగా వేధిస్తున్నాయి. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చే స్పామ్ కాల్స్ ఇప్పుడు వస్తున్నాయి.

ముఖ్యమైన పని ఉన్న సందర్భాల్లో ఈ స్పామ్ కాల్స్ రావడం మూలంగా చిరాకు, కోపం వస్తుంది. వీటిలో కొన్ని ప్రచారం కోసం వచ్చే కాల్స్ కాగా, మరికొన్ని మోసపూరిత కాల్స్ ఉంటాయి. ఈ ఏడాది అమెరికాలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సుమారు 52 బిలియన్లకు పైగా రోబోకాల్స్ అందుకున్నట్లు యూమెయిల్ అనే సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రతి వారం సుమారు 1 బిలియన్ కాల్స్ వస్తున్నట్లు గుర్తించింది.

వాస్తవానికి మనకు వచ్చే కాల్స్ లో ఎక్కువగా రోబో కాల్స్ ఉంటాయి. ఈ కాల్స్ ముందుగా రికార్డు చేయబడి ఉంటాయి. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్ గా రికార్డు అయిన వాయిస్ ను వినిపిస్తుంది. టెలి మార్కెటింగ్ కాల్స్ కూడా చాలా వస్తుంటాయి. ప్రజలకు తమ ప్రొడక్ట్స్ గురించి వివరించి మార్కెట్ చేసుకునేందుకు పలు కంపెనీలు ఈ కాల్స్ చేస్తుంటాయి. అటు మోసపూరిత ఉద్దేశంతో కూడిన స్పామ్ కాల్స్.. యూజర్లకు సంబంధించిన బ్యాంక్ డేటా సహా అత్యంత ముఖ్యమైన వివరాలను దొంగిలించే ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి అవాంఛిత కాల్స్ నుంచి రక్షణ పొందేందుకు గూగుల్ రెండు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్లు కాలర్ ID, స్పామ్ ప్రొటెక్షన్ లతో డిఫాల్ట్‌ గా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఆన్ అవుతాయి. ఒక వేళ ఆన్ చేయకపోతే వినియోగదారులు స్పామ్ కాల్స్ రాకుండా ఉండేలా ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది.

ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది.

1: ముందుగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లో ఫోన్ యాప్‌ని ఓపెన్ చేయాలి.

2: ఇప్పుడు ‘మోర్’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

3: ఆ తర్వాతసెట్టింగ్‌ల బటన్‌ ను ఎంచుకోవాలి.

4: ‘స్పామ్, కాల్ స్క్రీన్’ను సెలెక్ట్ చేసుకోవాలి.

5: కాలర్ & స్పామ్ ID ఆఫ్ చేసి ఉంటే ఆన్ చేసుకోవాలి.

స్పామ్ కాల్స్ ను ఎలా గుర్తించాలి

వాస్తవానికి గూగుల్ ఆయా కాల్స్ ను పరిశీలించి అవాంఛిత కాల్ గా భావిస్తే రాకుండా అడ్డుకుంటుంది. ఒకవేళ గూగుల్ నుంచి తప్పించుకుని వస్తే ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫోన్ కాల్ లో దాన్ని బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలా బ్లాక్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లో ఫోన్ యాప్‌ని ఓపెన్ చేయాలి.

యాప్ కింది భాగంలో రీసెంట్ ట్యాబ్‌ను నొక్కాలి.

ఇప్పుడు మీరు స్పామ్‌ గా రిపోర్టు చేయాలి అనుకుంటున్న కాల్‌ ను సెలెక్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లాక్ చేయాలి. లేదంటే, స్పామ్ రిపోర్టు కొట్టాలి.

కొన్ని వైర్‌లెస్ క్యారియర్‌లు కూడా కాల్ బ్లాకింగ్ ఫీచర్‌ను అందిస్తాయి.

AT&T ActiveArmor Ios, Android కోసం అందుబాటులో ఉంది.

ఇది స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేస్తుంది. T-Mobile స్కామ్ షీల్డ్ కస్టమర్లను రోబోకాల్స్ నుంచి రక్షించడానికి బహుళ ఫీచర్లను కలిగి ఉంటుంది.

రోబోకాల్స్ సంఖ్యను పరిమితం చేయడానికి థర్డ్ పార్టీ యాప్ లను కూడా ఉన్నాయి.

Hiya అనే యాప్ కూడా స్పామ్ కాల్స్ ను నిరోధిస్తుంది.

Nomorobo కూడా వినియోగదారులకు స్పామ్ కాల్స్ ను రాకుండా చేస్తుంది.

ఫైర్‌వాల్ యాప్ ఐఫోన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇది అవాంఛిత కాల్‌లను నిరోధించడంలో బాగా పనిచేస్తుంది.

మీ స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఇలా చేస్తే ఈ సమస్య మళ్లీ రాదు!

నేటి కాలంలో ప్రజల జీవనశైలిలో స్మార్ట్‌ఫోన్లు ఒక భాగమైపోయాయి. మీరు గనుక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, అది కొంత సమయం వరకు బాగా పని చేస్తుంది, తరువాత పాత బడటంతో దాని వేగం తగ్గుతుంది.

అయితే స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ కావడానికి ప్రధాన కారణం దాన్ని వాడుతున్న వ్యక్తి. ఇలా ఎందుకు అంటున్నామో తెలుసుకోవాలనుకుంటే ఈ కథనం చదవండి. ఫోన్ వాడుతున్నప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కాష్ ఫైల్స్ క్లీనింగ్స్మ ర్ట్‌ఫోన్ మెరుగైన పనితీరు కోసం, మనం ఎప్పటికప్పుడు కాష్‌ని క్లీన్ చేస్తూనే ఉండాలి. ఈ ఫైల్స్ మన ఫోన్‌లోని స్టోరేజీని నింపుతాయి. వీటి కారణంగానే చాలా సార్లు స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతుంది. మెరుగైన పనితీరు కోసం, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. స్మార్ట్ ఫోన్ రీసెట్ మీరు ఏ రకమైన స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించినా, కొంత సమయం తర్వాత మెరుగైన పనితీరు కోసం వాటిని రీసెట్ చేయాలి. దీంతో మీ ఫోన్ హ్యాంగ్ అవ్వదు. సగటున ఒక వినియోగదారు 5 నుండి 6 నెలలకు ఒకసారి ఫోన్‌ని రీసెట్ చేయాలి. రీసెట్‌తో మీ ఫోన్ కాష్ కూడా క్లియర్ అవుతుంది.

అప్‌డేట్,మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను విడుదల చేస్తూనే ఉంటాయి. కొన్ని బ్రాండ్‌లు నెలవారీ అప్‌డేట్‌లను విడుదల చేస్తాయి, కొన్ని త్రైమాసికానికి ఉంటాయి. ఫోన్ పనితీరును పెంచడానికి, వినియోగదారులు పరికరాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అయితే ఒక్కోసారి అప్ డేట్ కారణంగా ఫోన్ల స్పీడ్ కూడా తగ్గిపోతుంది. పరికరం చాలా పాతది కావడమే దీనికి కారణమని చెప్పుకోవచ్చు. రీస్టార్ట్మీ ఫోన్ స్లో అయితే మీరు దానిని రీస్టార్ట్ చేయాలి. ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్‌లో ఉన్న తాత్కాలిక ఫైల్స్‌ను తొలగిస్తుంది. దీనితో పాటు ఫోన్ మెమరీ కూడా క్లీన్ అవుతుంది. ఇది ఫోన్ వేగాన్ని మెరుగుపరుస్తుంది, హ్యాంగ్‌ అవడాన్ని నివారిస్తుంది.

Vastu-Tips : ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ నాలుగు వస్తువులను ఉంచితే విజయం మీ సొంతం..!!

ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు. ఇక్కడ నుండి ఇంట్లో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. ఈ స్థలం నుండే ఇంట్లో నివసించే సభ్యుల జీవితం నిర్ణయించబడుతుంది.
మెయిన్ డోర్ సరిగా లేకుంటే ఇంట్లో సంతోషం ఎప్పుడూ ఉండదు. ఇంటి ప్రధాన ద్వారం శుభప్రదంగా, పరిపూర్ణంగా ఉంచడానికి, కొన్ని వస్తువులను ఉపయోగించాలి. ఈ వస్తువులను సరైన పద్ధతిలో వాడితే చాలా ప్రయోజనం ఉంటుంది.

పూర్ణ కలశం:
కలశం అంటే శ్రేయస్సు. ఇది శుక్రుడు, చంద్రుని చిహ్నం. కలశ స్థాపన ప్రధానంగా రెండు ప్రదేశాలలో చేయవచ్చు. పూజా స్థలంలో, అలాగే ప్రధాన ద్వారం వద్ద ఉంచవచ్చు. ప్రధాన ద్వారం వద్ద ఉంచిన కలశం యొక్క ముఖం వెడల్పుగా కొద్దిగా తెరిచి ఉండాలి. అందులో తగినంత నీరు నింపాలి. వీలైతే, కొన్ని పూల రేకులను అందులో ఉంచాలి. ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు.

మామిడి ఆకుల తోరణం..
ఏదైనా శుభ కార్యం లేదా పండుగ ముందు,మామిడి ఆకుల తోరణం ప్రధాన ద్వారం వద్ద ఉంచుతారు. మామిడి ఆకుల తోరణం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. దీన్ని ఎలాగైనా కట్టవచ్చు, మంగళవారం కడితే చాలా మంచిది. మామిడి ఆకులకు ఆనందాన్ని ఆకర్షించే శక్తి ఉంది. దీని ఆకుల ప్రత్యేక వాసన మనసులోని చింతలను కూడా దూరం చేస్తుంది. అందుకే దీని ఆకులతో చేసిన తోరనం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచితే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి మంచిది.

స్వస్తిక
నాలుగు చేతులతో ఒక ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది. సాధారణంగా ఇది స్థలం యొక్క శక్తిని పెంచడానికి, తగ్గించడానికి లేదా సమతుల్యం చేయడానికి ఉపయోగించబడుతుంది. దాని తప్పుడు వినియోగం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. సరైన ఉపయోగం జీవితంలోని అన్ని సమస్యల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఎరుపు మరియు నీలం రంగుల స్వస్తికలు ముఖ్యంగా ప్రభావవంతమైనవిగా పరిగణించబడతాయి. ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఎరుపు రంగు స్వస్తిక్ పూయడం వల్ల ఇంటి వాస్తు, దిశ దోషాలు తొలగిపోతాయి. ప్రధాన ద్వారం మధ్యలో నీలిరంగు స్వస్తికాన్ని ఉంచడం వల్ల ఇంట్లోని వారి ఆరోగ్యం బాగుంటుంది.

గణేష ప్రతిమ
ఇంట్లో సంతోషం మరియు ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి, ప్రజలు ప్రధాన ద్వారం వద్ద గణేశుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచుతారు. గణపతిని మెయిన్ డోర్ లోపల ఉంచండి. బయట ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడి పేదరికం పెరుగుతుంది. లోపల పెట్టడం వల్ల ఆటంకాలు నశించి ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

Vizag: సమస్యల్లో ఉన్నారా? ఒక్కసారి సంపత్ వినాయకుడ్ని దర్శించుకోండి..? ఎక్కడో తెలుసా?

Vizag: విశాఖపట్నం (Visakhapatnam) లో బీచ్‌ ఎంత ఫేమస్సో..

ఇక్కడ సంపత్‌ వినాయక ఆలయం (Sampat Vinayaka Temple) కూడా అంత ఫేమస్‌. నగర నడిబొడ్డున వెలిసిన సంపత్ వినాయకుడిని దర్శించుకుంటే తాము అనుకున్న పనులు ఇట్టే జరిగిపోతాయని ప్రజలు విశ్వసిస్తారు. సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని భక్తుల ప్రగాఢనమ్మకం. సకల విఘ్నాలను హరించి కోరినకోర్కిలు తీర్చే వేల్పుగా ఈ వినాయకుడు (Lord Vinayaka) ప్రసిద్ధి చెందాడు. ప్రతి రోజూ దాదాపు వేలమంది భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. విశాఖ నగరమంటే భక్తులకు వెంటనే గుర్తుకు వచ్చేది సంపత్‌ వినాయక దేవాలయం.. ఎంతో ప్రాశస్త్యం కలిగి భక్తుల కోర్కెలు తీర్చే మందిరంగా ఈ ఆలయం విలసిల్లుతోంది.

ఆంధ్రా యూనివర్శిటీ (Andhra University) కి.. ఆర్టీసీ కాంప్లెక్స్ (RTC Complex) కు మధ్యలో 1962లో ఆశీలుమెట్ట ప్రాంతంలో టి.ఎస్‌.రాజేశ్వరన్, టిఎస్‌. సెల్వగణేశన్, ఎస్‌.జి. సంబంధన్‌లు కలిసి ఈ సంపత్‌ వినాయకుడు దేవాలయాన్ని నిర్మించారు. పోర్ట్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం చేసే ఆ ముగ్గురూ తమ వాహనాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా తొలుత ఇక్కడి వినాయకుడికి పూజలు నిర్వహించేవారు.

ఆ తర్వాత కాలక్రమంలో ఈ ఆలయానికి భక్తులకసంఖ్య పెరుగుతూ వచ్చింది. 1967లో కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఈ దేవాలయంలో శ్రీ గణపతి యంత్రాన్ని స్థాపించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఆ తర్వాత 1996లో ఈ ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చింది. తర్వాత కాలక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ లేదా గ్రూప్‌-1 అధికారి పర్యవేక్షించే ప్రముఖ దేవస్థానంగా ఆ ఆలయం ఎదిగింది.

విశాఖ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. ప్రతి బుధవారం ఈ ఆలయానికి భక్తులతాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయం వద్ద గణేష్‌ ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు. భక్తుల పాలిటి కొంగుబంగారంగా విరాజిల్లే ఈ స్వామిని దర్శించి సేవించడానికి విశాఖపట్నం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోప తండాలుగా తరలి వస్తుంటారు..

నిత్యం ప్రత్యేక పూజలు..!

ఈ సంపత్‌ వినాయకుడిని ప్రతినిత్యం ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. గరిక పూజ, ఉండ్రాళ్ళ నివేదన, అభిషేకము, గణపతి హోమం, నిత్య పూజలు, వాహన పూజలు, ప్రతీ మాసంలో బహుళ చతుర్థినాడు జరిగే సంకష్టహర చతుర్థి పూజలతో ఆలయం శోభాయమానంగా విలసిల్లుతుంది. వినాయకుడు భోజనప్రియుడు అందుకే ప్రతి రోజు వివిధ రకాల పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు.

అంతేకాదు అభిషేకాలను చాలా వైభవంగా నిర్వహిస్తారు. గంధోదకం, హరిద్రోదకం, పెరుగు, ఆవుపాలు, ఆవు నెయ్యి, కొబ్బరి నీళ్లు, ఫలరసాలు, తేనే, శుద్ధోదకం, పంచధారలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేకం చూడటానికి భక్తులు పెద్దసంఖ్యలో క్యూ కడుతుంటారు. అభిషేకం అనంతరం స్వామివారికి చేసే అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

వాహనపూజకు ప్రత్యేకం..!

ఈ సంపత్‌ వినాయగర్‌ ఆలయంలో వాహన పూజకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. విశాఖ నగరంలో లేదా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా కొత్త వాహనము కొనుగోలు చేస్తే తప్పకుండా సంపత్ వినాయక ఆలయానికి వచ్చి పూజలు చేయించుకుంటారు. అలా పూజ చేయించడం సర్వశుభప్రదమని..తమకు ఎలాంటి హానీ కలగదని భక్తుల నమ్మకం. అందుకే, ఈ ఆలయంలో వాహన పూజలు విశేషంగా జరుగుతాయి.

ఇదీ చదవండి : కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు జగన్ ప్రత్యేక వ్యూహం.. ఏడాది లో పూర్తి చేసే ప్లాన్

దర్శన వేళలు:

ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8.30 వరకు.

హోమం సమయం : ఉ.5 గంటల నుంచి 7గంటల వరకు

అభిషేక సమయం: ఉదయం 7 గంటల నుంచి 8.30 వరకు.

అన్నదానము: మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అన్నప్రసాద వితరణ నిర్వహించబడుతుంది. అన్నదానం, ఉచిత ప్రసాద వితరణ చేయాలనుకున్న భక్తులు .తమ విరాళాలను ఆలయ కార్యాలయంలో చెల్లించి రశీదు పొందాలి.

అడ్రస్‌: సంపత్‌ వినాయకుని ఆలయం, ఆర్టీసీ కాంప్లెక్స్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌-530004.

ఎలా వెళ్లాలి: ఆర్టీసీ కాంప్లెక్స్‌కి అతిసమీపంలో ఈ ఆలయం కొలువై ఉంది. ఆటో, బస్సు సౌకర్యం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.

Mystery Temple: ఇక్కడకి వెళ్లిన ఏ జీవి ప్రాణాలతో ఇప్పటి వరకూ తిరిగి రాలేదు.. గేట్ ఆఫ్ హెల్ గురించి తెలుసుకోండి

ప్రపంచంలో మానవ నిర్మిత రహస్యాలు కొన్ని అయితే.. ప్రకృతి సృష్టించిన కొన్ని రహస్యాలు అనేక ప్రదేశాలున్నాయి. వీటి గురించి తెలుసుకుంటే ఎవరైనా షాక్ తింటారు. అంతేకాదు కొందరు వ్యక్తులు ఆ రహస్యాన్ని ఛేదించడానికి లేదా.. నిజమా కదా అనే ఆలోచనతో అన్వేషణ సాగిస్తాడు. శాస్త్రజ్ఞులు చేసే పరిశోధనలో కొన్ని రహస్యాలు రీజన్ దొరికితే.. మరికొన్ని మిస్టరీస్ హిస్టరీలో సైన్స్ కు అందానివిగా మిగిలిపోతున్నాయి.
ఈ రోజు మనం తెలుసుకోనున్న మిస్టరీ గేట్ ఆఫ్ హెల్ అంటే నరకానికి ద్వారం అని పిలుస్తారు. ఈ గుడిలోపలికి ఎంట్రీ నరమానవులకు లేదు. ఎందుకంటే ఈ గుడిలోపలికి వెళ్లిన వారు మళ్ళీ తిరిగిరాలేదని అంటారు. ఎన్నో మర్మాలను దాచుకున్న ఈ ఆలయం టర్కీలోని పురాతన నగరంలో ఉంది.

హెరాపోలిస్ అనే నగరంలో అతి పురాతన ఆలయం ఉంది. దీనిని ‘గేట్ ఆఫ్ హెల్’ అని పిలుస్తారు. ఈ ఆలయం లోపలికి కాదు కదా.. చుట్టూ తిరిగే వ్యక్తులు కూడా తిరిగి రారు. అందుకనే ఈ ప్రదేశం ఎన్నో సంవత్సరాలు రహస్య ప్రాంతంగా ఉంది. ఎందుకంటే గ్రీకు దేవుడి విషపూరితమైన శ్వాస ఇక్కడికి వచ్చిన వారిని చంపుతుందని ప్రజలు విశ్వసించారు. ఈ ఆలయాన్ని ‘ప్లూటో ఆలయం’ అని పిలుస్తారు. అంటే మృత్యుదేవుని ఆలయం. ఇక్కడ మృత్యుదేవత శ్వాస కారణంగా.. ఆలయాన్ని లేదా దాని పరిసరాలను సందర్శించే వారు చనిపోతారని నమ్ముతారు. తరచుగా మరణాలు సంభవిస్తున్నందున, ఈ ఆలయాన్ని ప్రజలు ‘నరక ద్వారం’ అని పిలుస్తారు.
మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు
అయితే, చాలా సంవత్సరాల తర్వాత, శాస్త్రవేత్తలు ఇక్కడ దాగిఉన్న రహస్యాన్ని ఛేదించారు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ ఆలయం కింద నుండి విషపూరిత కార్బన్ డయాక్సైడ్ వాయువు నిరంతరం లీక్ అవుతుందని.. ఇది మానవులను, జంతువులు, పక్షులను తాకిన వెంటనే చంపేస్తుంది. కేవలం 10 శాతం కార్బన్ డయాక్సైడ్ వాయువు.. ఏ వ్యక్తినైనా 30 నిమిషాల్లో నిద్రపోయేలా చేయగలదు. ఈ నేపథ్యంలో ఈ ఆలయంలోని గుహలో కార్బన్ డయాక్సైడ్ వంటి విష వాయువు పరిమాణం 91 శాతం ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యధిక పరిమాణంలో ఉన్న ఈ వాయువు విషంగా మారి ఆలయ సమీపంలోకి వెళ్లినవారిని ప్రాణాలను హరిస్తుందని పేర్కొన్నారు. ఈ ఆలయం లోపలి నుండి బయటకు వచ్చే విష వాయువు కారణంగా ఇక్కడకు వచ్చే కీటకాలు, జంతువులు, పక్షులు చనిపోతున్నాయి.
హెరాపోలిస్ నగరం ఒక పీఠభూమిలో ఉన్న పురాతన రోమన్ నగరం. ఈ చిన్న ప్రదేశంలో చాలా వైవిధ్యాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ప్రాంతంలో వేడి నీటి బుగ్గలు, వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ వాయు ప్రభావంతో నీటి బుడగలు నిరంతరం పెరుగుతాయి. ఈ నగరం రెండవ శతాబ్దంలోనే థర్మల్ స్పాగా ప్రసిద్ధి చెందింది. మీడియా కథనాల ప్రకారం.. వారి వ్యాధుల చికిత్స కోసం దూరప్రాంతాల నుండి ప్రజలు నగరానికి వచ్చేవారు. ముఖ్యంగా ఇక్కడి వేడి నీటి బుగ్గలు కీళ్లు, చర్మానికి సంబంధించిన వ్యాధులను నయం చేయడంలో చాలా ప్రసిద్ధి చెందాయి.

AHD Recruitment 2024 : ఏపీ పశుసంవర్ధక శాఖలో 26 వీఏఎస్‌ పోస్టులకు నోటిఫికేష‌న్‌..

AP AHD Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖలో మ‌రో ప్ర‌భుత్వ నోటిఫికేష‌న్‌ను తీసుకొచ్చింది. ఇటీవలే ప‌శుసంవ‌ర్థ‌క శాఖ‌లో 1896 యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇదే శాఖ‌లో మ‌రికొన్ని పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. బ్యాక్‌లాగ్‌ ఖాళీల నియామక ప్రక్రియలో భాగంగా 26 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేష‌న్‌ను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. అర్హ‌త, అస‌క్తి క‌లిగిన ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఈ పోస్టుల‌కు ఆఫ్‌లైన్ విధానంలో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులకు ఫిబ్రవరి 7వ తేదీ వరకు అవ‌కాశం ఉంటుంది.
ఇటీవ‌లే మొత్తం 1,896 పశు సంవర్ధక సహాయకులు పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేశారు. గ‌తేడాది డిసెంబ‌ర్ 31వ తేదీన ఈ పోస్టుల‌కు సంబంధించిన రాత‌ప‌రీక్ష‌ను కూడా నిర్వ‌హించడం జ‌రిగింది. ఈ రాత పరీక్ష తుది కీ ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ విడుదల చేయ‌డం జ‌రిగింది. ఇక‌, వీటి తుది ఫ‌లితాల‌ను జ‌న‌వ‌రి 17 విడుద‌ల చేశారు. ఇప్ప‌డు, తాజాగా బ్యాక్‌లాగ్‌ ఖాళీల నియామక ప్రక్రియలో భాగంగా 26 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టుల‌కు ఎంపిక‌యిన వారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామ స‌చివాల‌యాల్లో రెండు సంవ‌త్స‌రాల పాటు ప్రొబేష‌న‌రీ పీరియ‌డ్ ఉంటుంది.

ఇత‌ర అర్హ‌త వివ‌రాలు : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ : మొత్తం 26 పోస్టులు

విద్యా అర్హతలు: బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వ‌య‌సు : 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
శాల‌రీ : నెలకు రూ.54,060-1,40,540 గా ఉంటుంది.
అభ్య‌ర్థులు దరఖాస్తు విధానం: ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం, లబ్బిపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2024.
పూర్తి వివరాల కోసం అభ్య‌ర్థులు ఈ https://ahd.aptonline.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించ‌గ‌ల‌రు.

CBSE : 9వ తరగతి పుస్తకాల్లో డేటింగ్ , రిలేషన్ షిప్ పాఠాలు

ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకు డేటింగ్ , లవ్ , లస్ట్ ఈ పదాలను కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రపంచం చాలా ముందుకు వెళ్లిపోయింది.
మీరు చిన్నపిల్లలు అనుకునే మీ పిల్లలు ఇక చిన్నవారు కాదు. వారికి తెలియాల్సిన టైం వచ్చింది. చాలా రిలేషన్స్ అవగాహన లేకపోవడం వల్లే విడిపోతున్నాయి. చాలా తప్పులు వయసు ప్రభావం తో చేసే వాటివల్లే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ సరికొత్త విధానాన్ని అవలంభిస్తోంది.

అయితే ఈ పాఠ్యాంశాన్ని 9 వ తరగతి విద్యార్థులకు సంబంధించిన వ్యాల్యూ ఎడ్యుకేషన్( VALUE EDUCATION) పుస్తకాల్లో ఉంచింది. ఈ పాఠాలను మొత్తం డేటింగ్, రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చిన్న చిన్న విషయాలను చర్చించేందుకు తయారు చేశారు. ఇందులో గోస్టింగ్, క్యాట్ ఫిషింగ్, సైబర్ బెదిరింపులు వంటి వాటిని వివరించేలా ఉన్నాయి.
అయితే ఈ పుస్తకాల్లోని పాఠ్యాంశానికి సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్‌లో పంచుకోవడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇది చాలా మంచి విషయం . కాస్తో కూస్తో అవగాహన కల్పించడం చాలా హర్షించే విషయం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు . దీనిపై ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్ అయిన టిండర్ ( TINDER) ఇండియా ట్విటర్‌లో స్పందించింది. ఇక తర్వాతి పాఠం బ్రేకప్‌ల గురించి ఉంటుందేమో అని పేర్కొంది.

టీనేజీ దశలో ప్రేమల కారణంగా సూసైడ్‌లు, డిప్రెషన్‌లోకి వెళ్లడం, మత్తు పదార్థాలకు బానిక కావడం వంటివి జరుగుతున్నాయని.. వాటిని అరికట్టేందుకు ఇలాంటి పాఠ్యాంశాలు చాలా అవసరమని పేర్కొన్నారు. సీబీఎస్సీ ఈ పాఠ్యాంశాన్ని చేర్చడం పిల్లలకు చాలా మంచి చేసే ప్రయత్నమే అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Eye Alert : మొబైల్లో బ్లూ లైట్ వల్ల కళ్లకు వచ్చే జబ్బులు ఇవే

ఈ జనరేషన్ లో డిజిటల్ స్క్రీన్ టైమింగ్ పెరిగింది. రోజులో ఎక్కువసేపు ఫోన్ లేదా కంప్యూటర్, ల్యాప్ టాప్, టీవీ చూస్తూ గడిపేస్తున్నారు చాలామంది. స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల బ్లూ లైట్ నేరుగా కళ్లు, చర్మం మీద పడుతుంది.

దీనివల్ల కళ్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా దెబ్బతింటుంది. బ్లూ లైట్ ఎఫెక్ట్ నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి డెర్మటాలజిస్ట్ స్వప్న ప్రియ చెప్తున్న జాగ్రత్తలివి…

బ్లూలైట్ అనేది సూర్యకిరణాల్లో కూడా ఉంటుంది. ఇది ‘హై ఎనర్జీ విజిబుల్ లైట్’. కంప్యూటర్, ల్యాప్టాప్, టీవీ, మొబైల్ ఫోన్ స్క్రీన్ల నుంచి కూడా బ్లూ లైట్ వస్తుంది. ఎక్కువ టైమ్ బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లూ లైట్ వల్ల నిద్ర వేళలు మారతాయని, చర్మకణాల రిథమ్ దెబ్బతింటుందని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కాస్మొటిక్ సైన్స్ ‘లో వచ్చిన ఒక స్టడీ చెస్తోంది. అయితే, చర్మ సమస్యలకి బ్లూ లైట్ ఒక్కటే కారణం కాదు. ఎలర్జీలు, జెనెటిక్ కారణాల వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఎఫెక్ట్ పడుతుందిలా…

స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల చాలామంది బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. పగలు, రాత్రివేళ కూడా బ్లూ లైట్ ఎఫెక్ట్ ఒకేలా ఉంటుంది. బ్లూ లైట్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. అంటే కణాల్లో, కణజాలాల్లో తయారయ్యే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ (ఆర్డీఎస్) పోగవ్వడంతో బ్యాలెన్స్ తప్పుతుంది. దాంతోకణాల్ని దెబ్బతీసే ఫ్రీ-రాడికల్స్ లెవల్స్ పెరుగుతాయి. వీటి వల్ల చర్మంలోని కొల్లాజెన్, ఎలాస్టిన్ టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. దాంతో చర్మం సాగే గుణం కోల్పోతుంది. చర్మంపై ముడతలు వస్తాయి. బ్లూ లైట్ ఎఫెక్ట్ వల్ల కొందరిలో ‘మంగు మచ్చలు’, ‘మెలిస్మా’ వంటి చర్మ సమస్యలు కనిపిస్తున్నాయి. సస్క్రీన్స్ వాడుతున్నా కూడా వీళ్లలో ఈ సమస్య తగ్గడం లేదు. బ్లూ లైట్ కారణంగా వచ్చే సమస్యల్లో చాలావరకు కాస్మొటిక్ రకానికి చెందినవే. చర్మం డల్గా కనిపించడం, పిగ్మెంటేషన్, చర్మం ఎరుపెక్కడం, ముడతలు వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రెగ్యులర్ వాడే సన్ స్క్రీన్తో ఈ సమస్యలు తగ్గవు. ఎందుకంటే… ఈ సస్క్రీన్స్ సూర్యకిరణాల్లో ఉండే అల్ట్రావయొలెట్-ఎ, అల్ట్రా వయొలెట్ -బి కిరణాల నుంచి మాత్రమే స్కిన్ని కాపాడతాయి.

ఏం చేయాలంటే…

బ్లూ లైట్ కారణంగా చర్మ సమస్యలు రాకూడదంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. స్క్రీన్ గార్డ్ ఉన్న ల్యాప్ టాప్స్ వాడాలి. రాత్రిపూట లైట్స్ ఆఫ్ చేసి టీవీ, ఫోన్లు ఎక్కువ సేపు చూడొద్దు. బ్లూ లైట్ నుంచి రక్షణ కోసం ఫిజికల్ బ్లాకర్స్ వాడాలి. జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ లు ఉన్న సన్స్క్రీన్స్ ఫిజికల్ బ్లాకర్స్ పనిచేస్తాయి. ఇవి వాడితే బ్లూ లైట్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది.

February 2024 Learn A Word for All levels All Classes

February 2024 Learn A Word for All levels All Classes

Primary Words..list .

High school words list…

 

Download…. Words File 

Anganwadi Posts: 10th Class అర్హతతో అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు

కర్నూలు (అర్బన్‌): అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సాధికారిత అధికారిణి పీ వెంకటలక్షుమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో 11 మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఒక మినీ అంగన్‌వాడీ కార్యకర్త, 84 మంది ఆయాలను నియమించనున్నట్లు పేర్కొన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు 10వ తరగతి, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 1-07-2023 నాటికి 35 సంవత్సరాల లోపు ఉండేవారు అర్హులని తెలిపారు.

ఈ నెల 7తేదీ సాయంత్రం 5 గంటల్లోపు కార్యాలయ పనివేళల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రందించాలన్నారు.

Health

సినిమా